![తెలంగాణలో 231కరువు మండలాలు](/styles/webp/s3/article_images/2017/09/3/61440627619_625x300_0.jpg.webp?itok=e96R5pS9)
తెలంగాణలో 231కరువు మండలాలు
హైదరాబాద్: కరువు మండలాల నివేదికను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి మంగళవారం పంపింది. తెలంగాణలో మొత్తం 231 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్ మండలాల్లో వర్షాపాతం ఆశాజనకంగానే ఉన్నందున ఆ జిల్లాల్లో పెద్దగా కరువు ఏర్పడలేదని, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా కరువు పరిస్థితులుండగా కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పాక్షింగా కరువు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాను పూర్తి కరువు జిల్లాలుగా నివేదికలో పేర్కొన్నారు.
కరువు మండలాల సంఖ్య జిల్లాలవారీగా:
మహబూబ్‌నగర్ 66, మెదక్ 46, నిజామాబాద్ 36, రంగారెడ్డి 33, కరీంనగర్19, నల్లగొండ 22, వరంగల్ 11