విత్తన కేటాయింపులు పూర్తి
అనంతపురం అగ్రికల్చర్ : ఈ నెల 20వ తర్వాత బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన వేరుశనగ పంపిణీ మొదలు పెట్టడానికి వ్యవసాయశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలాల వారీగా విత్తన కేటాయింపులు చేశారు. మొత్తం రూ.3.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకి అనుమతులు మంజూరయ్యాయి. అందులో ఏపీ సీడ్స్ ద్వారా 1,51,600 క్వింటాళ్లు, ఆయిల్‌ఫెడ్ ద్వారా 54 వేల క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా 44,400 క్వింటాళ్లు, వాసన్ ఎన్‌జీవో ద్వారా ఒక లక్ష క్వింటాళ్లు సేకరించే బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏపీ సీడ్స్‌కు 34 మండలాలు, ఆయిల్‌ఫెడ్‌కు 15 మండలాలు, మార్క్‌ఫెడ్‌కు 13 మండలాలు, వాసన్ ఎన్‌జీవోకు తనకల్లు మండలం కేటాయించారు.
అలాగే వాసన్‌కు మరో 43 మండలాల్లో ఎంవీకేల ద్వారా కొంత మొత్తంలో పంపిణీ చేసే బాధ్యతను అప్పగించారు. కేటాయింపుల్లో పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ముదిగుబ్బ, గుంతకల్లు, కూడేరు మండలాలకు అత్యధికంగా 9,500 క్వింటాళ్ల చొప్పున, విస్తీర్ణం తక్కువగా ఉన్న తాడిపత్రి, హిందూపురం, పుట్లూరు, పెద్దపప్పూరు మండలాలకు 1,500 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఈ సారి ఒక్కో రైతుకు మూడు కాకుండా నాలుగు బస్తాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో అదనంగా మరో లక్ష క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా 85 వేల క్వింటాళ్లకు అనుమతి వచ్చినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వాటిలో అన్ని మండలాలకు అదనంగా 500 నుంచి 1,500 క్వింటాళ్ల వరకు కేటాయించనున్నారు. ఇంకా ధరలు, రాయితీలు ఖరారు కావాల్సి ఉండటంతో విత్తన పంపిణీ తేదీలపై స్పష్టత కొరవడినట్లు చెబుతున్నారు.
మండలాల వారీగా కేటాయింపులు ఇలా...
–––––––––––––––––––––––––––––––––––––––––
మండలం క్వింటాళ్లు మండలం క్వింటాళ్లు
–––––––––––––––––––––––––––––––––––––––––
అనంతపురం 5,900 ఆత్మకూరు 7,000
బీకేసముద్రం 5,500 కూడేరు 9,500
రాప్తాడు 6,500 బత్తలపల్లి 5,800
ధర్మవరం 7,750 తాడిమర్రి 5,300
గుత్తి 7,500 గాండ్లపెంట 4,300
పెద్దపప్పూరు 1,500 యాడికి 5,150
పెనుకొండ 6,000 బెళుగుప్ప 5,900
రొద్దం 7,800 సోమందేపల్లి 3,500
తాడిపత్రి 1,500 యల్లనూరు 2,600
గుంతకల్లు 9,500 విడపనకల్ 4,500
శింగనమల 6,500 అమడగూరు 4,700
కదిరి 5,900 ఎన్‌పీ కుంట 2,800
నల్లచెరువు 3,900 కంబదూరు 5,000
పుట్టపర్తి 5,500 పెద్దవడుగూరు 4,700
చెన్నేకొత్తపల్లి 7,500 గార్లదిన్నె 7,000
కనగానపల్లి 9,200 రామగిరి 6,500
చిలమత్తూరు 5,000 పామిడి 5,700
గోరంట్ల 7,500 హిందూపురం 1,500
ముదిగుబ్బ 9,500 పరిగి 2,000
నల్లమాడ 6,200 ఓడీచెరువు 5,800
బ్రహ్మసముద్రం 5,500 తలుపుల 5,500
కళ్యాణదుర్గం 7,700 శెట్టూరు 6,600
అమరాపురం 4,800 అగళి 3,600
గుడిబండ 5,500 మడకశిర 7,800
బుక్కపట్టణం 5,200 రొళ్ల 4,300
కొత్తచెరువు 6,400 బొమ్మనహాల్ 2,500
లేపాక్షి 3,000 కుందుర్పి 7,200
వజ్రకరూరు 8,500 ఉరవకొండ 8,200
డి.హిరేహాల్ 4,000 గుమ్మఘట్ట 3,000
కనేకల్లు 4,500 రాయదుర్గం 4,500
నార్పల 6,500 పుట్లూరు 1,500
తనకల్లు 8,300