ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌లో గురువారం సాధారణ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 336 సభ్యుల జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 169 సీట్లు అవసరం. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది.
ఓటింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 150 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. అవి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్.
పాకిస్తాన్‌లో ఎన్నికల జరిగిన రోజు అర్థరాత్రికల్లా ఫలితాలు వెలువడతాయి. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పాక్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. వాటి మొత్తం బరువు 2100 టన్నులు.
పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పోలింగ్ అధికారి రిటర్నింగ్ అధికారికి ఆ సమాచారం అందిస్తారు. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment