completes
-
సంబురాలు.. నిరసనలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఓవైపు అధికార కాంగ్రెస్ అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిరసనలు, బీజేపీ చార్జిషీట్లతో వారం రోజులుగా హడావుడి పెరిగిపోయింది. కాంగ్రెస్ సర్కారు రైతు పండుగ పేరుతో గత నెల 30న ప్రారంభించిన ప్రజాపాలన విజయోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ, బీఆర్ఎస్ల చార్జిషిట్లు, నిరసనలు, బీఆర్ఎస్ నేతల నిర్బంధం వంటివి రాజకీయంగా సెగ పెంచుతున్నాయి. రైతు పండుగ నుంచి..గత నెల 30న రైతు పండుగ పేరుతో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ సభతో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలను ప్రారంభించింది. రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగో విడతగా రూ.2,700 కోట్లను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేశారు. తర్వాతి రోజున మీడియాతో మాట్లాడిన సీఎం... రైతుల సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందజేస్తామని ప్రకటించారు. తర్వాతి రోజున ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొనడంతోపాటు సిద్దిపేట జిల్లాలో కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలతో ‘హైదరాబాద్ రైజింగ్’పేరిట కార్యక్రమం నిర్వహించారు.తర్వాతి రోజున పెద్దపల్లిలో యువ వికాసం సభలో డిప్యూటీ సీఎం భట్టి, ఇతర మంత్రులతో కలసి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మరుసటి రోజున ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించారు. శుక్రవారం హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవాలకు హాజరైన సీఎం రేవంత్.. హోంగార్డులపై వరాల జల్లు కురిపించారు. ఇక 7, 8, 9 తేదీల్లో ఘనంగా విజయోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 9న సచివాలయంలో ‘తెలంగాణ తల్లి’విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు గత ఏడాది కాలంలో సాధించిన పురోగతిపై ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా విడుదల చేయడం గమనార్హం. చార్జిషిట్లతో ప్రజల్లోకి బీజేపీ.. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ కొంత దూకుడుగా వెళుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 1 నుంచి 5వ తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిలలో చార్జిషిట్లు, ఐదు రోజుల పాటు బైక్‌ర్యాలీల నిర్వహణ, కరపత్రాల పంపిణీ ద్వారా... ప్రభుత్వ వైఫల్యాలను 6 అబద్ధాలు– 66 మోసాల పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.ఇక 7న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఎలాంటి విమర్శలు గుప్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కేంద్రంలోని గత పదేళ్ల బీజేపీ పాలన, ఇక్కడి ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలంటూ టీపీసీసీ నేతలు సవాల్ విసరడంతో బీజేపీ చార్జిషిట్ల ఎపిసోడ్ రక్తి కట్టింది. నిర్బంధాల నడుమ కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ కూడా గట్టిగానే పోరాడుతోంది. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్‌గాం«దీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో గత కొన్నిరోజుల్లోనే కేటీఆర్, హరీశ్‌రావులపై 10కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇక మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ కేసు నమోదడంతో ప్రధాన ప్రతిపక్షం కొంత అప్రమత్తమైంది.ఇందుకు ప్రతిగా ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఫోన్ ట్యాప్ అవుతోందని.. కేసు నమోదు చేయాలంటూ చేసిన హడావుడి రాజకీయ రచ్చకు దారితీసింది. పోలీసులు ఎమ్మెల్యేపైనే కేసుపెట్టి, అదుపులోకి తీసుకోవడం, పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావును కూడా అదుపులోకి తీసుకుని 10 గంటల తర్వాత విడుదల చేయడం చర్చజరిగింది. మరోవైపు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచి్చంది. దీంతో శుక్రవారం ఉదయం నుంచే హరీశ్‌రావు, కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. ఇక ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీనితో ఈ రాజకీయ వేడి మరికొంతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. -
ఓట్ల లెక్కింపు ఎప్పుడు? ఫలితాలు ఎన్నడు?
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులతో సతమతమవుతున్న పాకిస్తాన్లో గురువారం సాధారణ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 336 సభ్యుల జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 169 సీట్లు అవసరం. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఓటింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 150 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. అవి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్. పాకిస్తాన్లో ఎన్నికల జరిగిన రోజు అర్థరాత్రికల్లా ఫలితాలు వెలువడతాయి. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పాక్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. వాటి మొత్తం బరువు 2100 టన్నులు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పోలింగ్ అధికారి రిటర్నింగ్ అధికారికి ఆ సమాచారం అందిస్తారు. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. -
రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేసూ్తనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. కాగా, 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ‘టెట్’ నిబంధనల సడలింపు.. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశముంటుంది. అలాగే.. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. -
విప్లవాత్మక మార్పులకు అది రాచబాట
నెహ్రూనగర్/కర్నూలు(టౌన్)/మక్కువ: ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించాయి. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి, చరిత్ర సృష్టించారని కొనియాడాయి. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్ర విప్లవాత్మక మార్పులకు రాచబాట అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం లభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికారత సాధించారని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అన్నారు. ప్రతి ఊళ్లోనూ మార్పు కనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన నేత జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు 99 శాతానికిపైగా హామీలు అమలు చేసిన నాయకుడు జగనన్న అని తెలిపారు. కర్నూలులో ఘనంగా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్పర్సన్ విజయమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సంజామలలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత కేక్ కట్ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్సీఎంగా ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ.. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్.. రావాలి జగన్.. అంటూ నినదించారు. -
యాక్షన్ ఎంటర్టైనర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బీఎస్ఎస్ 10’(వర్కింగ్ టైటిల్). ‘భీమ్లా నాయక్’ మూవీ తర్వాత సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ పూర్తయింది. ‘‘యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘బీఎస్ఎస్ 10’. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ని గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు సాగర్ కె.చంద్ర. ఈ సినిమాలోని కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 3న శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్. -
జీబ్రాకి బైబై
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులు బై బై చెప్పుకున్నారు. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. -
పోలవరం తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ శుక్రవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి నివేదిక పంపినట్లు సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా వెల్లడించారు. ఇప్పటికే పోలవరం తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఇందులో భాగంగా జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మెమో కూడా జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి అదనంగా 36 గ్రామాలు వస్తాయని తేలింది. ఆ గ్రామాల ప్రజలకు తొలిదశ కిందే పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమంటూ సవరించిన వ్యయ ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా సీడబ్ల్యూసీకి పంపింది. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల.. సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరవాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ ఆ మేరకు పోలవరానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేయనుంది. దీని ఆధారంగా కేంద్ర కేబినెట్‌కు జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధులు విడుదలకు మార్గం సుగమం అవుతుంది. దశల వారీగా పోలవరంలో నీటినిల్వ.. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిరి్మంచే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్తినిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, తర్వాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో, తర్వాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కేంద్రాన్ని ఒప్పించిన సీఎం జగన్.. నిజానికి.. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016, సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతా అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.14,969.37 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇక రూ.698.54 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ క్రమంలోనే తొలిదశ పూర్తికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు ఇచ్చి.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించేందుకు సహకరించాలని సీఎం జగన్ చేసిన వినతిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక శాఖలను ఆదేశించారు. -
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్‌ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్‌కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్‌కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
ఆకాశ ఎయిర్.. ఏడాది పూర్తి
ముంబై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 43 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20 విమానాలతో వారంలో 900లకుపైగా సరీ్వసుల మైలురాయిని దాటినట్టు వెల్లడించింది. 2023 డిసెంబర్ నుంచి విదేశాలకూ సరీ్వసులను నడపనున్నట్టు ఇప్పటికే ఆకాశ ఎయిర్ తెలిపింది. దేశీయ విమానయాన రంగంలో సంస్థకు 4.9 శాతం వాటా ఉంది. ‘2022 ఆగస్ట్ 7న తొలి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. 16 నగరాలను అనుసంధానిస్తూ 35 రూట్లలో విమానాలు నడుస్తున్నాయి. సంస్థకు చెందిన విమానాల ద్వారా 25,000 టన్నులకు పైచిలుకు కార్గో రవాణా జరిగింది’ అని వివరించింది. ఇప్పటికే ఆకాశ ఎయిర్ 152 విమానాలకు ఆర్డర్లు ఇచి్చంది. వీటికి అదనంగా 2023 చివరినాటికి మూడంకెల స్థాయిలో విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు ధీమా వ్యక్తం చేసింది. శిక్షణ కోసం పెట్టుబడి చేస్తామని, దేశంలోని ప్రధాన నగరాల్లో లెరి్నంగ్ కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపింది. ఆకాశ ఎయిర్‌ను ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రమోట్ చేస్తోంది. జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే, ఇతరులు ఈ కంపెనీలో పెట్టుబడి చేశారు. -
సంపద.. సమృద్ధి
సన్యసించిన వ్యక్తులు, పరమహంసలు, మఠాధిపతులు, పీఠాధిపతులు... వీరు సర్వసాధారణంగా ఆత్మోద్ధరణకు సంబంధించిన విషయాలమీద అనుగ్రహభాషణలు చేస్తుంటారనీ, వారు తాము తరించి, ఇతరులు తరించడానికి సంబంధించిన మార్గాలను బోధచేయడం వరకే పరిమితం అవుతారని లోకంలో భావన చేస్తుంటారు. కానీ ఈ భావనలకు భిన్నంగా వెళ్ళిన గురువు ఒకరున్నారు. ఆయన సమర్ధ రామదాసు. ఈ దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. దేశంలో సమకాలీన పరిస్థితులను బాగా అధ్యయనం చేసారు. ఆ కాలంలో ఉన్న పాలనా వ్యవస్థ, అప్పుడున్న సామాజిక అలజడులు, ప్రజలలో అప్పుడున్న అభద్రతా భావాన్ని దష్టిలో పెట్టుకుని ప్రజలకు మౌలికంగా ఏవి అవసరమో వాటిని బోధించి, ఆచరణలో కూడా మార్గదర్శనం చేసిన గురువు ఆయన. ప్రజలు తమ శారీరక ఆరోగ్యంతోపాటూ, ఆత్మరక్షణకు అవసరమయిన దృఢత్వాన్ని పొందడానికి ఆయన పర్యటించిన ప్రదేశాల్లో వ్యాయామశాలలు నెలకొల్పారు. ఆరోగ్యంతోపాటూ మానసిక పరిణతికి చదువు అవసరమని పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు, ధర్మంపట్ల అనురక్తి కలగడానికి భక్తి అవసరమని హనుమాన్ మందిర్ లు నిర్మించారు. ప్రజలందరిలో దేశభక్తి నూరిపోసారు. ఆయన ప్రజలకు తరచుగా ఆరు సూత్రాలు బోధిస్తుండేవారు...అవి ఎప్పటికీ ఆచరణ యోగ్యాలే. వాటిలో మొదటిది సంపద, సమృద్ధి. అంటే అందరివద్దా సంపద ఉండాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలి. లేకపోతే తను వ్యక్తిగతంగా అనుకున్నది కూడా సాధించలేరు, జీవితంలో అభ్యున్నతిని పొందలేరు. ఒక వయసు వచ్చిన తరువాత, మనిషి కష్టపడి స్వయంగా సంపాదించుకోవడం అవసరం. దీని ప్రాధాన్యతను మన సుభాషితాలు కూడా చక్కగా వివరించాయి. మాతానిందతి/ న అభినందతి పితా / భ్రాతా న సంభాషతే! భృత్యః కృప్యతి/ న అనుగచ్ఛతి సుతః/ కాంతాచ న ఆలింగతే/ అర్థప్రార్థన్ శంకయా న కురుతే స్వాలాపమాత్రం సుహృత్ / తస్మాత్ అర్థముపాశ్రయ శ్రుణు సర్వేహి అర్థేన సర్వే వశాః... అంటాయి. అంటే – నీకంటూ సంపాదన లేకపోతే ఎప్పుడూ నిందించని అమ్మ కూడా నిందిస్తుంది. తండ్రి సంతోషంతో భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా అభినందించడు. తోడపుట్టినవారు కూడా చులకన చేస్తారు. పలకరించరు.సేవకుడికి ఏదయినా పని చెబితే... పైసా విదల్చడు కానీ పనులు మాత్రం చెబుతుంటాడని ఆగ్రహిస్తాడు. పిల్లల అభ్యున్నతికి ఖర్చుపెట్టనప్పుడు కన్న కుమారుడు సేవలందించడు. ఇల్లు గడవడానికి అవసరమయిన సొమ్ము తీసుకురానప్పుడు కట్టుకున్న భార్య ప్రేమగా కౌగిలించుకోదు. ఎంత మంచి స్నేహితుడయినా ఎదురుపడితే అప్పు అడుగుతాడేమోనని ముఖం చాటేస్తాడు. అందువల్ల ఓ స్నేహితుడా! నీతి తప్పకుండా సంపాదించు. దానితో సమస్తమూ నీకు వశపడుతుంది... అంటారు. ఒక తోటలో అరవిరిసిన పువ్వుల వాసనలకన్నా.... కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ద్రవ్యం ఎంత తక్కువయినా దాని సువాసన ఎక్కువగానే ఉంటుందని కూడా అంటారు. అలా సక్రమ మార్గంలో కష్టపడి మనిషి సంపాదించి బతకగలగాలి. అది ఆత్మగౌరవం. అది మనిషికి సంపూర్ణతను ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బిహార్‌లో మేఘా ప్రాజెక్టు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి నీటి సరఫరా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. హర్ ఘర్ గంగాజల్ మొదటి దశ పనులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన బోధ్ గయా, గయా, రాజ్‌గిర్ నగరాల తాగునీటి కష్టాలు తీరిపోనున్నాయి. శుద్ధి చేసిన గంగాజలాలు ఇకపై ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా గంగా నదీ జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు వరద నీటిని తాగునీరుగా మార్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరద నీటిని ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లలో నింపి, శుద్ధిచేసి 365 రోజులు ప్రజలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో భాగంగా 151 కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్, నాలుగు వంతెనలతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. -
యాక్షన్ థ్రిల్లర్
అశ్విన్, నందితా శ్వేత జంటగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హిడింబ’. శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై శ్రీధర్ గంగపట్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ఒక షాకింగ్ పాయింట్‌తో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హిడింబ’. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఈ సినిమా కోసం అశ్విన్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన మా చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. మకరంద్ దేశ్‌పాండే, సిజ్జు, రాజీవ్ కనకాల, శ్రీనివాస రెడ్డి, ‘శుభలేఖ’ సుధాకర్, రఘు కుంచె ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: వికాస్ బడిసా. -
ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా అనేక మలుపులు తిరిగిన ట్విటర్ డీల్ ఎట్టకేలకు పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సొంతమైంది. దీంతో ట్విటర్ బర్డ్ మస్క్ గూటికి చేరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి స్పందిస్తూ ‘ద బర్డ్ ఈజ్ ఫ్రీడ్’ అంటూ మస్క్ ట్వీ ట్ చేశారు. అంటే నకిలీ ఖాతాలకు తావులేకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా యూజర్లకు అనుమతిస్తాననే సంకేతాలిచ్చారు. దీంతో ఈ ట్వీట్ లైక్‌లు, కమెంట్స్, రీట్వీట్లతో మోస్ట్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే దీనిపై నెటిజన్ల రియాక్షన్లు విభిన్నంగా ఉండటం గమనార్హం. మరోవైపు ట్విటర్ బాస్‌గా మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్వీటర్ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్,లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెపై వేటు వేశారని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. This makes me so happy. It’s a great day for freedom. — Matthew Marsden (@matthewdmarsden) October 28, 2022 చదవండి:Twitter: మస్క్ ఎంట్రీ.. సీఈఓ ఔట్! the bird is freed — Elon Musk (@elonmusk) October 28, 2022 -
'తగ్గేదే లే' అని తెగేసి చెబుతున్న చైనా! ఎనీ టైం రెడీ!
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన విషయమై చైనా అగ్గి మీద గుగ్గిలంలా మారిన సంగతి తెలిసిందే. దీంతో తైవాన్ చుట్టూత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గస్తీ కాసింది. తైవాన్ జలాల్లో చైనా దళాలు మోహరించడమే కాకుండా సైనిక విన్యాసలు చైసి తైవాన్‌ని భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ విన్యాసాలు కొద్ది రోజుల్లో ఆగిపోతాయని అంతా అనుకున్న సమయంలో తాజగా చైనా మరో బాంబు పేల్చింది. లైవ్ ఆర్మీ ఫైర్ డ్రిల్ పేరిట భూ వాయు గగన మార్గాల్లో సైనిక విన్యాసాలు నిర్వహించి ఇప్పుడేమో అన్ని పనులు పూర్తి చేశామని ఇక ఏ సమయంలోనైనా యుద్ధం చేయడానికి రెడీ అని తెగేసి చెప్పేస్తోంది. దాదాపు వారం రోజుల సైనిక కసరత్తుల తదనంతరం తైవాన్ చుట్టుతా అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేశామని తన అధికారిక సోషల్ మీడియా వీబో అకౌంట్లో పేర్కొంది. ఈ మేరకు తమ దళాలు తైవాన్ జలసంధిలో ఎప్పటికప్పడూ పరిస్థితులను నిశితంగా గమనించడమే కాకుండా క్రమ తప్పకుండా పెట్రోలింగ్‌ని నిర్వహిస్తామని చెప్పింది. అలాగే ఏ సయమంలోనేనా పోరాడేందుకు సైనిక శిక్షణను కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఒక పక్క యూఎస్ ఎంతలా హెచ్చరించినా.. తన దూకుడు తగ్గించుకోనని తెగేసి చెప్పడమే కాకుండా తైవాన్ చైనాలో భాగమని పదే పదే నొక్కి చెబుతుండటం గమనార్హం. (చదవండి: అమెరికాని ఆపడం అసాధ్యం...చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్) -
ఒక రోజు.. ‘ముందుగా’ ముగిసింది
న్యూయార్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజును పూర్తిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే గత నెల 29వ తేదీన 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. అంటే కాస్త వేగంగా తిరిగి పుడమి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. దీంతో అతి తక్కువ రోజు( వన్ డే)గా జూన్ 29వ తేదీ నిలిచిపోనుంది. ఇలాంటి ఘటన మళ్లీ కొద్దిరోజుల వ్యవధిలోనే పునరావృతమవడం గమనార్హ ఈ నెల 26వ తేదీ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజున భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. సెకన్లో వెయ్యో వంతు కాలాన్ని మిల్లీ సెకన్‌గా లెక్కిస్తారు. భూమి తన భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్పంగా పెంచిందని పరిశోధకులు వాదిస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే ఘటన 2021 ఏడాదిలో జరిగింది. ఆ ఏడాది ఒక నెల తక్కువ సమయంలో ముగిసిందని తేలింది. ఇలా జరగడం 1960ల దశకం తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రస్తావనార్హం. అత్యంత తక్కువ సమయంలో రోజు ముగిసిన తేదీ కూడా అదే ఏడాదిలో నమోదవడం విశేషం. అదే ఏడాది జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకన్ల ముందుగానే భూమి ఒక చుట్టు చుట్టేసింది. -
ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్...అదే మా ఏకైక లక్ష్యం! : రష్యా
Main goal to ‘liberate’ Donbas: ఉక్రెయిన్‌లో సైనిక చర్యకు సంబంధించిన మొదటి దశ పూర్తయిందని రష్యా డిప్యూటీ చీఫ్ కల్నల్ జనరల్ సెర్గీ రుడ్స్కోయ్ అన్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించిన ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. అంతేగాక ఉక్రెయిన్‌లో సాయుధ దళాల పోరాట సామర్థ్యం గణనీయంగా తగ్గిందని కూడా చెప్పారు. ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే రష్యా ప్రధాన లక్ష్యం అని నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ యుద్ధం ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని అన్నారు. అయితే ఈ యుద్ధంలో సుమారు వెయ్యి మంది రష్యా సైనికులు మృతి చెందగా, మూడు వేల మందికి పైగా గాయపడ్డారని రుడ్స్కోయ్ వెల్లడించారు. అయితే నాటో మాత్రం ఈ యుద్ధంలో దాదాపు 15 వేల మంది రష్యాన్ సైనికులు మరణించారని చెప్పడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను దిగ్బంధం చేసి ఉక్రెయిన్ బలగాలకు నష్టం కలిగించేలా చేయడమే కాకా అక్కడ ఉక్కెయిన్ సైనిక దళాలు బలపడకుండా చేస్తాం అని తెలిపారు. డోనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ భూభాగాలను స్వాధీనం చేసుకునేంత వరకు ఈ దాడి ఆపేది లేదని తెగేసి చెప్పింది. పైగా తమ ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్ నుంచి డాన్బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే అని రష్యా స్పష్టం చేసింది. అయితే పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించలేదని రష్యా పదే పదే సమర్థించుకునే యత్నం చేయడం విశేషం. (చదవండి: కీవ్‌లో కల్లోలం.. ఏ క్షణంలోనైనా) -
పల్స్ పోలియో విజయవంతం
-
వాళ్ళిద్దరి ప్రేమ
విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ హీరో హీరోయిన్లుగా వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వేదా¯Œ ‡్ష క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్య¯Œ నిర్మించిన చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాలోని ‘లత్కోరు లవ్వింతే’ పాట లిరికల్ వీడియోను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్ధంగా ఉంచాం. నిర్మాత అర్జున్ గారు ఎంతో అభిరుచితో ఈ సినిమాను నిర్మించారు. దాదాపుగా అందరూ కొత్త ఆర్టిస్టులే అయినా 5 కోట్ల నిర్మాణ వ్యయంతో ఆయన ఈ సినిమాను నిర్మించారు. ప్రసాద్‌ల్యాబ్‌వారు ఇన్ ఫ్రా పార్ట్‌నర్స్‌గా వ్యవహరించడం విశేషం’’ అని వీఎన్ ఆదిత్య అన్నారు. ‘‘రామ్‌గోపాల్‌వర్మగారి చేతుల మీదుగా మా సినిమాలోని పాట విడుదల కావడం సంతోషంగా ఉంది. నిర్మాతగా నాకు ఇదే తొలి చిత్రం. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ చిత్రం ఇది’’ అన్నారు అర్జున్ దాస్యన్ . ఈ సినిమాకు మధు స్రవంతి సంగీతం అందించారు. -
తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం
-
ముగిసిన సూర్యగ్రహణం
-
ముగిసిన కార్పొరేషన్ పోలింగ్
-
విత్తన కేటాయింపులు పూర్తి
అనంతపురం అగ్రికల్చర్ : ఈ నెల 20వ తర్వాత బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన వేరుశనగ పంపిణీ మొదలు పెట్టడానికి వ్యవసాయశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలాల వారీగా విత్తన కేటాయింపులు చేశారు. మొత్తం రూ.3.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకి అనుమతులు మంజూరయ్యాయి. అందులో ఏపీ సీడ్స్ ద్వారా 1,51,600 క్వింటాళ్లు, ఆయిల్‌ఫెడ్ ద్వారా 54 వేల క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా 44,400 క్వింటాళ్లు, వాసన్ ఎన్జీవో ద్వారా ఒక లక్ష క్వింటాళ్లు సేకరించే బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏపీ సీడ్స్‌కు 34 మండలాలు, ఆయిల్‌ఫెడ్‌కు 15 మండలాలు, మార్క్‌ఫెడ్‌కు 13 మండలాలు, వాసన్ ఎన్జీవోకు తనకల్లు మండలం కేటాయించారు. అలాగే వాసన్‌కు మరో 43 మండలాల్లో ఎంవీకేల ద్వారా కొంత మొత్తంలో పంపిణీ చేసే బాధ్యతను అప్పగించారు. కేటాయింపుల్లో పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ముదిగుబ్బ, గుంతకల్లు, కూడేరు మండలాలకు అత్యధికంగా 9,500 క్వింటాళ్ల చొప్పున, విస్తీర్ణం తక్కువగా ఉన్న తాడిపత్రి, హిందూపురం, పుట్లూరు, పెద్దపప్పూరు మండలాలకు 1,500 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఈ సారి ఒక్కో రైతుకు మూడు కాకుండా నాలుగు బస్తాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో అదనంగా మరో లక్ష క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా 85 వేల క్వింటాళ్లకు అనుమతి వచ్చినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వాటిలో అన్ని మండలాలకు అదనంగా 500 నుంచి 1,500 క్వింటాళ్ల వరకు కేటాయించనున్నారు. ఇంకా ధరలు, రాయితీలు ఖరారు కావాల్సి ఉండటంతో విత్తన పంపిణీ తేదీలపై స్పష్టత కొరవడినట్లు చెబుతున్నారు. మండలాల వారీగా కేటాయింపులు ఇలా... ––––––––––––––––––––––––––––––––––––––––– మండలం క్వింటాళ్లు మండలం క్వింటాళ్లు ––––––––––––––––––––––––––––––––––––––––– అనంతపురం 5,900 ఆత్మకూరు 7,000 బీకేసముద్రం 5,500 కూడేరు 9,500 రాప్తాడు 6,500 బత్తలపల్లి 5,800 ధర్మవరం 7,750 తాడిమర్రి 5,300 గుత్తి 7,500 గాండ్లపెంట 4,300 పెద్దపప్పూరు 1,500 యాడికి 5,150 పెనుకొండ 6,000 బెళుగుప్ప 5,900 రొద్దం 7,800 సోమందేపల్లి 3,500 తాడిపత్రి 1,500 యల్లనూరు 2,600 గుంతకల్లు 9,500 విడపనకల్ 4,500 శింగనమల 6,500 అమడగూరు 4,700 కదిరి 5,900 ఎన్పీ కుంట 2,800 నల్లచెరువు 3,900 కంబదూరు 5,000 పుట్టపర్తి 5,500 పెద్దవడుగూరు 4,700 చెన్నేకొత్తపల్లి 7,500 గార్లదిన్నె 7,000 కనగానపల్లి 9,200 రామగిరి 6,500 చిలమత్తూరు 5,000 పామిడి 5,700 గోరంట్ల 7,500 హిందూపురం 1,500 ముదిగుబ్బ 9,500 పరిగి 2,000 నల్లమాడ 6,200 ఓడీచెరువు 5,800 బ్రహ్మసముద్రం 5,500 తలుపుల 5,500 కళ్యాణదుర్గం 7,700 శెట్టూరు 6,600 అమరాపురం 4,800 అగళి 3,600 గుడిబండ 5,500 మడకశిర 7,800 బుక్కపట్టణం 5,200 రొళ్ల 4,300 కొత్తచెరువు 6,400 బొమ్మనహాల్ 2,500 లేపాక్షి 3,000 కుందుర్పి 7,200 వజ్రకరూరు 8,500 ఉరవకొండ 8,200 డి.హిరేహాల్ 4,000 గుమ్మఘట్ట 3,000 కనేకల్లు 4,500 రాయదుర్గం 4,500 నార్పల 6,500 పుట్లూరు 1,500 తనకల్లు 8,300 -
ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ
-
ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ
– 2.44 లక్షలు మంది పట్టభద్రులు దరఖాస్తు – 21,856 మంది ఉపాధ్యాయులు ఓటరు నమోదు – 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ – 23 నుంచి డిసెంబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరణ – తుది జాబితా డిసెంబరు 30న ప్రచురణ అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసినట్లు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ఇందుకు సంబం«ధించిన వివరాలను డీఆర్ఓ ఆదివారం వెల్లడించారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పట్టభద్ర ఓటర్లుగా 2,44,354 మంది నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఓటర్లుగా 21,856 మంది నమోదు చేసుకున్నారు. 23 నుంచి అభ్యంతరాలు స్వీకరణ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 23న ప్రకటిస్తారు. క్లెయిములు, అభ్యంతరాలను ఆరోజు నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు స్వీకరిస్తారు. వాటిని 26వ తేదీలోపు పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితా డిసెంబరు 30న ప్రచురిస్తారు. పట్టభద్ర ఓటరు నమోదు ఇలా జిల్లా ఆన్లైన్ ద్వారా కార్యాలయాల్లో మొత్తం వైఎస్ఆర్ కడప 38,270 38,083 76,353 అనంతపురం 42,828 41,369 84,197 కర్నూలు 36,363 47,441 83,804 మొత్తం 1,17,461 1,26,893 2,44,354 ఉపాధ్యాయ ఓటరు నమోదు ఇలా జిల్లా ఆన్లైన్ ద్వారా కార్యాలయాల్లో మొత్తం వైఎస్ఆర్ కడప 1,629 5,094 6,723 అనంతపురం 2,702 5,241 7,943 కర్నూలు 1,768 5,422 7,190 మొత్తం 6,099 15,757 21,856