పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసినట్లు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ఇందుకు సంబం«ధించిన వివరాలను డీఆర్‌ఓ ఆదివారం వెల్లడించారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని వైఎస్‌ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పట్టభద్ర ఓటర్లుగా 2,44,354 మంది నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఓటర్లుగా 21,856 మంది నమోదు చేసుకున్నారు.