voter entry
-
ఓటరు నమోదులో.. లెక్క పెరిగింది
అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటరు నమోదు లెక్క పెరిగింది. తాజాగా అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఓటరుగా నమోదు చేసుకున్న పట్టభద్రులు సంఖ్య 12,934, ఉపాధ్యాయుల సంఖ్య 715 పెరిగింది. ఈ నెల 6న అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్రులు 2,44,354 మంది, ఉపాధ్యాయులు 21,856 మంది నమోదు చేసుకున్నారు. ఈ లెక్క నవంబరు 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తీసుకుని ప్రకటించిందిగా చెబుతున్నారు. అయితే ఆ రోజు రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకున్నారని, దీంతో నమోదు సంఖ్య పెరిగిందని పేర్కొంటున్నారు. అధికారులు ప్రస్తుతం ప్రకటించిన ఓటరు నమోదు లెక్కలిలా ఉన్నాయి. పట్టభద్ర ఓటర్లు నమోదిలా.. జిల్లా ఆన్లైన్ కార్యాలయాల్లో మొత్తం వైఎస్ఆర్ 41,698 39,980 81,678 అనంతపురం 47,184 41,369 88,553 కర్నూలు 39,648 47,409 87,057 మొత్తం 1,28,530 1,28,758 2,57,288 ఉపాధ్యాయ ఓటర్లు నమోదిలా... జిల్లా ఆన్లైన్ కార్యాలయాల్లో మొత్తం వైఎస్ఆర్ 1,798 4,974 6,772 అనంతపురం 3,014 5,266 8,280 కర్నూలు 1,997 5,422 7,419 మొత్తం 6,809 15,662 22,471 -
ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ
-
ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ
– 2.44 లక్షలు మంది పట్టభద్రులు దరఖాస్తు – 21,856 మంది ఉపాధ్యాయులు ఓటరు నమోదు – 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ – 23 నుంచి డిసెంబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరణ – తుది జాబితా డిసెంబరు 30న ప్రచురణ అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసినట్లు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ఇందుకు సంబం«ధించిన వివరాలను డీఆర్ఓ ఆదివారం వెల్లడించారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పట్టభద్ర ఓటర్లుగా 2,44,354 మంది నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఓటర్లుగా 21,856 మంది నమోదు చేసుకున్నారు. 23 నుంచి అభ్యంతరాలు స్వీకరణ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 23న ప్రకటిస్తారు. క్లెయిములు, అభ్యంతరాలను ఆరోజు నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు స్వీకరిస్తారు. వాటిని 26వ తేదీలోపు పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితా డిసెంబరు 30న ప్రచురిస్తారు. పట్టభద్ర ఓటరు నమోదు ఇలా జిల్లా ఆన్లైన్ ద్వారా కార్యాలయాల్లో మొత్తం వైఎస్ఆర్ కడప 38,270 38,083 76,353 అనంతపురం 42,828 41,369 84,197 కర్నూలు 36,363 47,441 83,804 మొత్తం 1,17,461 1,26,893 2,44,354 ఉపాధ్యాయ ఓటరు నమోదు ఇలా జిల్లా ఆన్లైన్ ద్వారా కార్యాలయాల్లో మొత్తం వైఎస్ఆర్ కడప 1,629 5,094 6,723 అనంతపురం 2,702 5,241 7,943 కర్నూలు 1,768 5,422 7,190 మొత్తం 6,099 15,757 21,856 -
ఓటర్ల నమోదులో కీలకపాత్ర
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ కీలకపాత్ర పోషించాలని ఆ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదులో వైఎస్సార్ టీఎఫ్ ముందుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించిన ఆయన ఏకీకత సర్వీస్ రూల్స్‌ను తెచ్చి ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన రెండు డీఏలను వెంటనే అందించాలన్నారు. పదవ పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయాలన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయానికి కషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడు వెంకటేశులు, జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, సురేశ్, రమేశ్, అల్తాఫ్, కోశాధికారి ఫల్గుణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.