
ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసినట్లు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి తెలిపారు.
– 2.44 లక్షలు మంది పట్టభద్రులు దరఖాస్తు
– 21,856 మంది ఉపాధ్యాయులు ఓటరు నమోదు
– 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
– 23 నుంచి డిసెంబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరణ
– తుది జాబితా డిసెంబరు 30న ప్రచురణ
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసినట్లు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ఇందుకు సంబం«ధించిన వివరాలను డీఆర్‌ఓ ఆదివారం వెల్లడించారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని వైఎస్‌ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పట్టభద్ర ఓటర్లుగా 2,44,354 మంది నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఓటర్లుగా 21,856 మంది నమోదు చేసుకున్నారు.
23 నుంచి అభ్యంతరాలు స్వీకరణ
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 23న ప్రకటిస్తారు. క్లెయిములు, అభ్యంతరాలను ఆరోజు నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు స్వీకరిస్తారు. వాటిని 26వ తేదీలోపు పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితా డిసెంబరు 30న ప్రచురిస్తారు.
పట్టభద్ర ఓటరు నమోదు ఇలా
జిల్లా ఆన్‌లైన్ ద్వారా కార్యాలయాల్లో మొత్తం
వైఎస్‌ఆర్ కడప 38,270 38,083 76,353
అనంతపురం 42,828 41,369 84,197
కర్నూలు 36,363 47,441 83,804
మొత్తం 1,17,461 1,26,893 2,44,354
ఉపాధ్యాయ ఓటరు నమోదు ఇలా
జిల్లా ఆన్‌లైన్ ద్వారా కార్యాలయాల్లో మొత్తం
వైఎస్‌ఆర్ కడప 1,629 5,094 6,723
అనంతపురం 2,702 5,241 7,943
కర్నూలు 1,768 5,422 7,190
మొత్తం 6,099 15,757 21,856