అనంతపురం అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటరు నమోదు లెక్క పెరిగింది. తాజాగా అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఓటరుగా నమోదు చేసుకున్న పట్టభద్రులు సంఖ్య 12,934, ఉపాధ్యాయుల సంఖ్య 715 పెరిగింది. ఈ నెల 6న అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల పరిధిలో పట్టభద్రులు 2,44,354 మంది, ఉపాధ్యాయులు 21,856 మంది నమోదు చేసుకున్నారు. ఈ లెక్క నవంబరు 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తీసుకుని ప్రకటించిందిగా చెబుతున్నారు. అయితే ఆ రోజు రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారని, దీంతో నమోదు సంఖ్య పెరిగిందని పేర్కొంటున్నారు. అధికారులు ప్రస్తుతం ప్రకటించిన ఓటరు నమోదు లెక్కలిలా ఉన్నాయి.
పట్టభద్ర ఓటర్లు నమోదిలా..
జిల్లా ఆన్‌లైన్ కార్యాలయాల్లో మొత్తం
వైఎస్‌ఆర్ 41,698 39,980 81,678
అనంతపురం 47,184 41,369 88,553
కర్నూలు 39,648 47,409 87,057
మొత్తం 1,28,530 1,28,758 2,57,288
ఉపాధ్యాయ ఓటర్లు నమోదిలా...
జిల్లా ఆన్‌లైన్ కార్యాలయాల్లో మొత్తం
వైఎస్‌ఆర్ 1,798 4,974 6,772
అనంతపురం 3,014 5,266 8,280
కర్నూలు 1,997 5,422 7,419
మొత్తం 6,809 15,662 22,471
ఓటరు నమోదులో.. లెక్క పెరిగింది
Published Wed, Nov 9 2016 11:06 PM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement