
రాప్తాడు రూరల్: మార్కుల ఒత్తిళ్లు ఓ ఇంటర్ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని జీఎం కాలనీకి చెందిన లక్ష్మన్న కళ్యాణదుర్గంలో సెరికల్చర్ శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హర్షవర్దిని (17) నగర శివారులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసింది.
అయితే పరీక్షలు తాను సక్రమంగా రాయలేదని, ఆశించిన స్థాయిలో మార్కులు రావేమోననే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఇంటికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.