Intermediate student
-
5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు ఆ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ప్రతీ పరీక్ష కేంద్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తెచ్చామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను గరిష్టంగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని చెప్పారు. ఈసారి ప్రతీ ప్రశ్నపత్రానికి యూనిక్ సీరియల్ నంబర్ ఇచ్చామని, పేపర్ ఎవరిదో తేలికగా కనిపెట్టొచ్చన్నారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు(TSBIE) నుంచి పర్యవేక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,532 పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానించామని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాలను తెరిచి, పరీక్ష అయ్యాక సీల్ చేస్తామని చెప్పారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి కలిపి మొత్తం 9,96,971 మంది ఇంటర్ పరీక్షలు(Intermediate exams) రాయబోతున్నట్టు పేర్కొన్నారు.ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్, ఇతర అధికారులతో కలిసి కృష్ణఆదిత్య సోమవారం బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.విద్యార్థులకు సూచనలు⇒ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 వరకూ చేరుకోవాలి. అంతకు ముందు వచ్చినా అనుమతిస్తారు. 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. అయితే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మంచిది. ⇒ tgbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందొచ్చు. దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని ఓపెన్ చేస్తే పరీక్ష కేంద్రం జీపీఎస్ చూసుకోవచ్చు. దీనిద్వారా ముందే పరీక్ష కేంద్రాన్ని గుర్తించొచ్చు. ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు.⇒ రిస్ట్‌వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రింటెడ్ మెటీరియల్, సెల్ఫోన్లు పరీక్ష కేంద్రానికి అనుమతించరు. స్మార్ట్‌వాచీలు వస్తున్న నేపథ్యంలో రిస్ట్‌వాచీలను తొలిసారి నిషేధించారు.⇒ హాల్‌టికెట్‌పై సమాచారం, మాధ్యమం తప్పుగా ఉంటే అధికారుల దృష్టికి తేవాలి. ప్రైవేట్ కాలేజీలు ఏ కారణంగానూ హాల్‌టికెట్లు నిరాకరించొద్దు. ఒకవేళ నిరాకరిస్తే కఠిన చర్యలు ఉంటాయి. -
బాపూ.. నాకీ చదువులొద్దంటే విన్నావా!
జైపూర్: ఇంటర్ పరీక్షలు ఇంకా మొదలవ్వలేదు. కానీ, అప్పుడే ఫెయిల్ అవుతానన్న భయంతో ఓ ఇంటర్ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని షెట్పల్లి గ్రామానికి చెందిన తుంగపిండి రాజేశంకు కుమారుడు, కూతురు హాసిని (18) ఉన్నారు. భార్య గతంలోనే మృతిచెందింది. కుమారుడికి పెళ్లి కాగా సీసీసీలో నివాసం ఉంటున్నాడు.రాజేశం కూలీ పనులు చేస్తూ కూతురిని చదివిస్తున్నాడు. చెన్నూర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో హాసినిని ఇంటర్లో చేర్పించాడు. అయితే.. చదవడం ఇష్టం లేక బాలిక మధ్యలోనే మానేసి ఇంట్లోనే ఉంది. ఆ విద్యాసంవత్సరం వృథా కావడంతో కూతురుని ఒప్పించి మళ్లీ ఈ విద్యాసంవత్సరం మంచిర్యాలలోని ప్రైవేటు కళాశాలలో చేర్పించాడు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఫెయిలవుతాననే భయంతో హాసిని సోమవారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై బాలయ్య తెలిపారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
స్కూల్ ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాల్ మందలింపు..
కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల మానసిక స్థితి గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నాయి. కొంచెం కూడా మానవత్వాన్ని చూపడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురై చావు నోట్లో తలపెడుతున్నారు. స్కూల్ ఫీజు చెల్లించలేదని పాఠశాల ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందే మందలించడంతో మనస్తాపానికి గురైన టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. కాగా.. ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ రూరల్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో కమల, వెంకటేశ్వర్లు దంపతుల కవల పిల్లలు అఖిల, విక్రమ్‌లు 10వ తరగతి చదువుతున్నారు. వీరిరువురి ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంది. అందులో రూ.10 వేలు చెల్లించారు. మిగతా మొత్తం చెల్లించడంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 8న అఖిల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సి పాల్ రమాదేవి తోటి విద్యార్థినుల ముందే అవమానకరంగా మాట్లాడింది. తెలిసిన వారితో ఫీజు కోసం తనను ప్రిన్సిపాల్ టార్చర్ చేస్తున్నారని చెప్పుకొని ఏడ్చింది. సోమవారం పాఠశాలకు వెళ్లలేదు. మంగళవారం తల్లి ఇంట్లో ఉండగానే అఖిల వేరే గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆందోళన పాఠశాల యాజమాన్యం తీరుతో విద్యార్థిని అఖిల ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన దిగారు. పాఠశాల ముందు బైఠాయించి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపులు నిజం కాదు.. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి, నిర్వాహకులు వివరణ ఇస్తూ తాము అఖిలను వేధించలేదని తెలిపారు. అందరితో పాటు తనకు ఫీజు చెల్లించాలని గుర్తు చేశామన్నారు. కాగా ఘటనకు కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్‌పై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్మ నిజాంపేట్ : ఇంటర్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేట జిల్లా కృష్ణాపురంనకు చెందిన బైసు శ్రీనివాస్, దేవి దంపతులు నగరంలోని బోరబండ ఫేజ్– 3లో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు పూజిత (17) బాచుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బుధవారం ఉదయం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కాలేజీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పూజిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా.. మొదట కాలేజీ సిబ్బంది పూజిత బాత్రూంలో జారిపడిందని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. వారిని హాస్పిటల్‌కు రావాలని సూచించారు. కొద్ది సేపటి తర్వాత చనిపోయింది గాంధీ ఆసుపత్రికి రావాలని చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తమ కూతురు మృతి అనుమానాస్పదంగా ఉందని పూజిత తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే విద్యార్థిని మృతి చెందిందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మియాపూర్: మియాపూర్ పరిధి మాతృశ్రీనగర్ కాలనీలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాధితులు, పోలీసులు తెల్పన మేరకు..షాద్‌నగర్‌కు చెందిన గౌరిశెట్టి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమారుడు కౌశిక్ రాఘవ (17) ఈ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే కౌశిక్ శుక్రవారం రాత్రి 10 గంటలకు స్టడీ అవర్ పూర్తిచేసుకుని స్నేహితులతో కలిసి గదికి వెళ్లాడు. అక్కడ 11 గంటల వరకు స్నేహితులతో కలిసి గేమ్స్ ఆడుకున్నారు. ఆ తర్వాత నిద్రించేందుకు ఎవరి గదికి వారు వెళ్లిపోయారు. 10వ తరగతి స్నేహితులను మిస్ అవుతున్నానని, వారు ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని స్నేహితుడు ఫరూఖ్‌తో చెబుతూ బాధపడ్డాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5:15 గంటల ప్రాంతంలో ప్రతిరోజు మాదిరిగానే కళాశాల వార్డెన్ విద్యార్థులను నిద్రలేపుతుండగా 238 నంబర్ గదిలో రాఘవ బెడ్‌పై మెడకు తాడుతో పడి ఉన్నాడు. వెంటనే కళాశాల సిబ్బంది దగ్గర్లో ఉన్న ల్యాండ్ మార్క్ ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి విద్యార్థి మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే కౌశిక్ మృతి చెందాడని, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లి మాధవి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ ఆత్మహత్య చేసుకోలేదన్నారు. మృతిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. కాగా కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆరోపించారు. -
కాలేజీ భవనం నుంచి దూకిన విద్యార్థిని
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న భవ్యశ్రీ సోమవారం మధ్యాహ్నం కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. వన్‌టౌన్ సీఐ రవిశంకరరెడ్డి కథనం ప్రకారం.. కదిరి పట్టణానికి చెందిన జ్యోతి, సాంబశివుడు దంపతుల కుమార్తె భవ్యశ్రీ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉండటంతో భవ్యశ్రీ స్థానిక అంబార్ వీధిలో అమ్మమ్మ వద్ద ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తోంది. ఒంటరినైపోయానన్న ఆవేదన కొద్దిరోజులుగా భవ్యశ్రీలో నాటుకుపోయింది. మరోవైపు ఫీజుల విషయమై కళాశాల యాజ మాన్యం భవ్యశ్రీని మందలించినట్లు తెలిసింది. ఫీజు డబ్బు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించింది. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఆ విద్యార్థిని కళాశాల భవనంపైకి చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఆమెను ఎవరూ గుర్తించలేదు. మధ్యాహ్నం 12.30 గంటలకు భవనంపై నుంచి కిందకు దూకింది. అది చూసిన విద్యార్థులు హుటాహుటిన 108 వాహనంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాలకు చేరుకుని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థి సంఘం నేత ఆకుల రాఘవేంద్రతో పాటు పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఈ అమ్మాయి ఇంగ్లీష్ స్పీచ్‌కి సీఎం జగన్ ఫిదా
-
నల్లగొండ సబితకు కేటీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ కుటుంబ పోషణ కోసం ఆటో నడిపిస్తున్న నల్లగొండ విద్యార్థిని సబితకు అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నల్లగొండలో సబిత కుటుంబం ఆర్థిక పరిస్థితిని, ధైర్యంగా ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి.. జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెప్పించుకున్నారు. ఆమెను స్వయంగా కలసి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సబితను బుధవారం హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. చిన్నవయసులోనే కుటుంబ పోషణ కోసం ఆటోను నడిపిస్తూ మగవారికి తీసిపోని విధంగా ధైర్యంగా ముందుకు సాగుతున్న సబిత తీరును చూసి ఆయన అభినందించారు. ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తండ్రిని కోల్పోవడంతో తన తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపింది. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహాయం చేయాలని, కొత్త ఆటోరిక్షా ఇప్పించాలని సబిత కోరింది. కాగా, సబిత పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని డబుల్ బెడ్రూం ఇంటి ప్రొసీడింగ్స్‌తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ప్రొసీడింగ్స్‌ని కేటీఆర్ స్వయంగా అందించారు. సబిత చదువుకుంటానంటే తగిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సబిత తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఇతర యువతులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కేటీఆర్ తనకు అండగా నిలవడంపై సబిత సంతోషం వ్యక్తం చేసింది. -
అమ్మకు పాలు తెచ్చేందుకు వెళ్లి.. అనంతలోకాలకు
వరంగల్: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి పాలు తీసుకొచ్చేందుకు బైక్‌పై తన మేనల్లుడితో కలిసి పక్క తండాకు వెళ్లాడు. పాలు తీసుకుని మళ్లీ ఇంటికి పయనమయ్యాడు. ఇంతలోనే మృత్యువులా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఇతడి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడి మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని బిచ్చానాయక్తండాజీపీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్చానాయక్తండాజీపీ శివారు రాజీవ్‌నగర్‌తండాకు చెందిన జాటోతు బిల్యా, బక్కి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు బాలాజీ(25) ఉన్నారు. కుమార్తెల వివాహం చేశారు. కుమారుడు ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. కాగా, కొద్దిరోజులుగా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లి ఆరోగ్యం కోసమని పాలు తెచ్చేందుకు ఎప్పటిలాగే, బాలాజీ బిచ్చానాయక్తండాలోని బంధువుల ఇంటికి, తన మేనల్లుడు ఆంగోతు సంతోష్‌తో కలిసి ఉదయాన్నే వెళ్లాడు. పాలు తీసుకుని తిరిగి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. రాజీవ్‌నగర్‌తండా సమీపంలో ప్రధానరహదారిపై ట్రాక్టర్, బైక్ పక్కపక్కనుంచే వెళ్తుండగా గుంతరావడంతో ట్రాక్టర్‌ను పక్కకు తిప్పడంతో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ రోడ్డుపక్కనున్న గుంతలో పడగా, తీవ్రంగా గాయపడిన బాలాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న సంతోష్‌కు తీవ్రగాయాలు కాగా, 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇంతలో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్ ఉంటే బతికేవాడు.. బైక్‌పై వెళ్లే బాలాజీ హెల్మెట్ ధరించి ఉంటే ప్రా ణాలతో బయటపడేవాడని ఎస్సై రమేష్‌బాబు అన్నారు. రోడ్డుప్రమాదంలో తలకు గాయం కావడం వల్లే మృతిచెందాడని, ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదని, దగ్గర దూరంలో ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. -
ఎవరికి చెప్పాలి.. ఏమని చెప్పాలి..
జీడిమెట్ల: ‘నాకు అమ్మ, నాన్న లేరు..ప్రేమించిన వాడు ఆప్యాయంగా మాట్లాడటంలేదు.. కనీసం నా కోసం కొంత సమయాన్ని కేటాయించడంలేదు. కాలేజీకి వస్తుంటే బస్తీలో పోకిరీలు వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి.. నేను ఎంత ప్రేమించినా నన్ను నన్నుగా ప్రేమించే వారు ఎవరూ లేరు.. ఇక నేను ఎందుకు బతకాలి ఎవరికోసం బతకాలి అంటూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సూరారం డివిజన్ నెహ్రూ నగర్‌కు చెందిన తులసి(17)కి చిన్నతనంలోనే ఆమె తండ్రి లక్ష్మణ్, తల్లి సుశీల మృతి చెందారు. దీంతో అప్పటినుంచి ఆమె అమ్మమ్మ కోమలిబాయి వద్ద ఉంటూ చింతల్‌లోని బాగ్యరథి కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా ఆమె నెహ్రూ నగర్‌కు చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. ఇటీవల ఆమెకు ఇంటర్ పరీక్షలు సమీపించడంతో సదరు యువకుడు మంచిగా చదువుకోవాలని చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి అతను తులసితో మాట్లాడటం లేదు. దీంతో తాను ఒంటరినయ్యానని భావించిన తులసి గురువారం మద్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా స్నేహితురాళ్లు చాలా మంచివాళ్లు.. నన్ను స్నేహితుల చాలా మంచిగా చూసుకుంటారు. వారికి నా ఇబ్బందులు చెప్పి వారిని బాధ పెట్టలేను. ఈ జన్మకు వారితో నా స్నేహం ఇక ఇంతే అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. పోకిరీలకు అడ్డుకట్ట వేయాలి.. గత కొంత కాలంగా కాలనీలో పోకిరీల బెడద ఎక్కువైందని స్థానికులు తెలిపారు. పోలీసులు బస్తీల్లో గస్తీ నిర్వహించి పోకిరీల బెడద నుండి మహిళలు, యువతులను కాపాడాలని కోరారు. -
పరీక్ష సరిగా రాయలేదని బ్లేడ్‌తో..
-
ట్విస్ట్ : పరీక్ష సరిగా రాయలేదని బ్లేడ్‌తో...
సాక్షి, నల్గొండ : ‘ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!’ ఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది. పరీక్ష సరిగా రాయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తరుణ్ తనకు తానే బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడే స్వయంగా వెల్లడించాడు. నల్గొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. పరీక్ష సరిగా రాయకపోవడంతో ఇంటికి వెళ్తే తిడతారనే భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గొంతు, చేయి, మర్మాంగాలను కోసుకుని స్పృహ తప్పి రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!
సాక్షి, నల్గొండ : పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల వద్ద ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిపై దుండగులు బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని గొంతు కోసి పరారయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని మాచర్ల తరుణ్ కుమార్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడడంతో తరుణ్ రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వచ్చినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు తెలిపారు. -
విద్యార్థిపై అధ్యాపకుల దాష్టీకం
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి వ్యవహార శైలి బాగోలేదని సాకు చూపుతూ సంబంధిత తరగతి అధ్యాపకుడు దాష్టీకం ప్రదర్శించాడు. తనను దుర్భాషలాడాడని విచక్షణ కోల్పోయి చితకబాదడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన శనివారం జిల్లాకేంద్రంలోని గీతాంజలి ప్రైవేటు కళాశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి చెందిన హన్మాండ్ల శివయ్య, కృష్ణవేణి దంపతుల ఆదిత్య(18) స్థానిక గీతాంజలి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రోజులాగే శనివారం తరగతులు నిర్వహించిన అధ్యాపకుడు తన క్లాస్ అయిపోయిన తర్వాత అధ్యాపకుడిని సదరు విద్యార్థి దుర్భాషలాడటంతో అది విన్న అధ్యాపకుడు తనను ఈడ్చుకెళ్లి చితకబాదాడు. వెంటనే కళాశాల యాజమాన్యానికి తెలపడంతో మరో ముగ్గురు కలిసి చావబాదాడని ఆరోపించారు. ఆస్పత్రికి తరలించిన అనంతరం సమాచారం అందించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆస్పత్రికి చేరుకున్న ఎస్ఐ భగవంత్‌రెడ్డి వారి వివరాలు సేకరించారు. విద్యార్థి పరిస్థితిపై వైద్యుడిని వివరణ కోరగా కుడి కాలి తొడ ఎముక క్రాక్ వచ్చిందన్నారు. ఇదిలా ఉండలా కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా విద్యార్థిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. సెలవు రోజు అయినప్పటికీ కళాశాల నడపడంపై జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థిని కొట్టడానికి గల కారణాలను అడిగారు. దీనిపై సంబంధిత తరగతి గది అధ్యాపకుడు నీళ్లు నమలడంతో కళాశాలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నలుగురిపై కేసు నమోదు నాగర్‌కర్నూల్ క్రైం: ఆదిత్యను కొట్టిన ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కళాశాల డైరెక్టర్ సునేంద్ర, అధ్యాపకులు లక్ష్మణాచారి, రమేష్, నవీన్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థి ఆదిత్యను జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
డ్రగ్ పెడ్లర్‌గా ఇంటర్ విద్యార్థి
► అతడే సూత్రధారిగా క్రయవిక్రయాలు ► నలుగురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ డ్రగ్ పెడ్లర్‌గా మారాడు. మాదకద్రవ్యమైన ఎక్స్టసీని తాను వినియోగించడంతో పాటు మరికొందరికి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం మైనర్‌తో సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. తార్నాక నాగార్జుననగర్‌కు చెందిన ఓ మైనర్ పదో తరగతిలో ఉండగానే హుక్కాకు అలవాటుపడ్డాడు. శివంరోడ్‌లోని ఓ హుక్కా పార్లర్‌కు రెగ్యులర్ కస్టమర్‌గా మారాడు. కొన్నాళ్ళకు హుక్కాతో పాటు గంజాయికీ బానిసగా మారాడు. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి నుంచి గంజాయి ఖరీదు చేసేవాడు. తన ఇంటిపై ఉన్న ఓ గదిలోనే స్నేహితులతో కలిసి హుక్కా, గంజాయి పీల్చేవాడు. ఇతడికి 2016లో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన హన్నన్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇతడి నుంచి ఎక్స్టసీ, ఎల్ఎస్డీ వంటి మాదకద్రవ్యాలు ఖరీదు చేయడం ప్రారంభించిన మైనర్ తొలినాళ్ళల్లో తానే వినియోగించేవాడు. కొన్నాళ్ళకు విక్రేతగా మారి లాలాగూడకు చెందిన అల్తాఫ్ హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, బొగ్గులకుంటకు చెందిన ప్రశాంత్ పౌల్‌కు అమ్మడం ప్రారంభించాడు. మంగళవారం 26 గ్రాముల ఎక్స్టసీని తీసుకుని వచ్చిన మైనర్ దాన్ని తార్నాక ప్రాంతంలో విక్రయించే ప్రయత్నం చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.మోహన్‌కుమార్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, ఎస్.సైదాబాబు, కె.శ్రీనివాస్ వలపన్ని నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి మాదకద్రవ్యం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు ఉస్మానియా వర్శిటీ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న హన్నన్, కిషోర్ కోసం గాలిస్తున్నారు. -
శ్రీ చైతన్య కాలేజిలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
హైటెక్ కాపీయింగ్, విద్యార్థి అరెస్ట్
హైదరాబాద్: టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంటర్ విద్యార్థులు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా బుధవారం ఎస్సార్ నగర్‌లోని ఓ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి హైటెక్ స్టయిల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయాడు. అతనికి సహకరించిన సమీయుల్లా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన ఓ విద్యార్థి ఎన్నారై కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన ఇతడు ఈసారి ఎలాగైనా పాస్ కావాలని పట్టుదలతో పథకం వేశాడు. ఇందుకోసం అతడు ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిని ఆశ్రయించాడు. షాప్‌క్లూస్ సైట్ నుంచి బ్లూటూత్ పరికరం, మైక్రోఫోన్ ఉన్న బనియన్‌ను రూ.13,200 వెచ్చించి కొనుగోలు చేశాడు. దానిని తొడుక్కుని సివిక్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను దిగ్విజయంగా రాసేశాడు. అతడికి బయటి నుంచి సమాధానాలు ఇస్తూ సమీయుల్లా అనే వ్యక్తి సాయం చేస్తున్నాడు. అదే ఉత్సాహంతో బుధవారం ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వచ్చాడు. పరీక్షల సూపరింటెండెంట్ తనిఖీల్లో భాగంగా కళాశాలలో విద్యార్థులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు ఓ విద్యార్థిపై అనుమానం వచ్చింది. పోలీసులను పిలిపించి సోదా జరిపించగా హైటెక్ నాటకం బట్టబయలైంది. పోలీసులు విద్యార్థితోపాటు అతనికి సాయం చేసిన వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించి, అరెస్టు చేశారు. -
విద్యార్థిని అదృశ్యం
యాకుత్‌పురా (హైదరాబాద్) : స్నేహితురాలి ఇంటికని వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయిన సంఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఎస్సై ప్రసాద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మోయిన్‌బాగ్ ఫతేషానగర్ ప్రాంతానికి చెందిన ఫయీం అహ్మద్ కూతురు ఆయేషా సిద్ధిఖా (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7వ తేదీన ఉదయం 11.30 గంటలకు రజానగర్‌లో ఉండే స్నేహితురాలు సనా బేగం వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కుటుంబ సభ్యులు భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు పింక్ కలర్ చుడీదార్, బుర్ఖా ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు 040-27854798, 7382296634 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
వేంపల్లె: తండ్రి చనిపోయి పుట్టెదు దుఃఖంలో ఉన్నప్పటికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ల్యాబ్ పరీక్షలకు హాజరయ్యాడు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ముద్ది సుబ్బరాయుడు(50) బుధవారం అనారోగ్యంతో మృతిచెందాడు. మృతునికి భార్య భవాని, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండవ కుమారుడు ముద్ది నారాయణస్వామి వేంపల్లె వాసవీ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) ప్రాక్టికల్ పరీక్షకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా తండ్రి చనిపోయాడు. బాగా చదువుకోవాలని, తనలాగా కూలీగా మారవద్దని తండ్రి పదే పదే చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో ఓ వైపు దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు జరిగిన ప్రయోగ పరీక్షలకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
మరుగుదొడ్డి నిర్మించలేదని విద్యార్థిని ఆత్మహత్య
గుండాల (నల్లగొండ) : ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించమని గత కొన్ని రోజులుగా మొరపెట్టుకుంటున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆహుతైంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గుండాల మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కొడపర్తి సత్తయ్య, నాగమ్మల కూతురు కొడపర్తి రేఖ(17) స్థానిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో ఆరు బయట మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోందని గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటోంది. అయినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురై వారు కూలి పనులకు వెళ్లిన అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసే లోపే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గోదావరిఖని (కరీంనగర్) : హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని పట్టణంలోని కాకతీయ నగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రామ నూతన్(16) హన్మకొండలోని విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడానికి సిద్దమవుతున్నాడు. అయితే తనకు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేదని, ఇంట్లోనే ఉండి చదువుకుంటానని తల్లిదండ్రులతో అన్నాడు. ఈ ఒక్క సంవత్సరం పూర్తి చేసి తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేయమని తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన నూతన్ గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఖానాపూర్లోని సాయిబాబా ఆలయం పక్కనున్న అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యార్థి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జనార్దన్(16) నిర్మల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీకి రమ్మని ప్రిన్సిపాల్ ఫోన్‌చేయడంతో కాలేజీకి వెళ్లిన జనార్దన్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం అడవికి వెళ్లిన స్థానికులకు శవం కనిపించడంతో ఖానాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతుని జేబులో నుంచి ఒక ప్రేమ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా చంపి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ కొడుకు మృతిచెందాడని జనార్దన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మందలించారని విద్యార్థి అదృశ్యం
ఉక్కునగరం (విశాఖపట్నం) : తోటి విద్యార్థినితో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఎస్.శివసూర్య(15)ను మూడు రోజుల క్రితం తోటి విద్యార్థిని తిట్టింది. అయితే ఆ సమయంలో సూర్య తల్లిదండ్రులు పక్కనే ఉండటంతో ఆమెను ప్రశ్నించారు. అనంతరం బాలిక కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. సోమవారం తల్లిదండ్రులతోపాటు శివసూర్యను కాలేజీ ప్రిన్సిపాల్ పిలిపించి మాట్లాడారు. కాగా సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివసూర్య తిరిగి రాలేదు. తెలిసినవారి వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు మంగళవారం ఉక్కునగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పూజా.. నువ్వెక్కడ!
- కళాశాలకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన విద్యార్థిని హైదరాబాద్: మహానగరంలో మరో బాలిక అదృశ్యమైంది. కాచిగూడాలోని నింబోలి అడ్డాకు చెందిన సి. పూజ (16) అనే ఇంటర్ విద్యార్థిని రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయింది. కాలేజీకి వెళ్లొస్తానంటూ 14వ తేది ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పూజ.. రోజులు గుడుస్తున్నప్పటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలిసినవారి ఇళ్లు, వివిధ ప్రాంతాల్లో ఎంతగా గాలించినప్పటికీ పూజ జాడ తెలియరాలేదు. దీంతో పూజ తండ్రి మధుకర్.. సోమవారం కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ స్పెక్టర్ డి. రాజ్ కుమార్ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని బాలిక కోసం దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
విద్యార్థినిని వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి
మాచర్ల (గుంటూరు) : కళాశాలకు వెళ్తున్న విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని గుర్తించిన బాలిక స్నేహితులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(17) రోజూ కళాశాలకు నడుచుకుంటూ వెళ్లి వస్తోంది. గత కొంత కాలంగా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన తాడి రమణయ్య(20) ఆ విద్యార్థిని వెంటపడుతూ.. వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని దారి కాచి అడ్డుకొని తన బైక్ ఎక్కమని బెదిరించాడు. ఈ విషయాన్ని బాలిక తన స్నేహితులతో పాటు స్థానికులకు చెప్పడంతో.. బాలిక స్నేహితులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారం రోజుల క్రితమే మాచర్లలో ఆకతాయిల వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
అనంతపురం : అనంతపురంలోని నలంద ఇంటర్ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నలంద హాస్టల్లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న(17) శనివారం అర్ధరాత్రి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని అప్రమత్తం చేయడంతో వారు వెంటనే జ్యోత్స్నను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
నాయుడుపేట (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నాయుడుపేట మండలం శ్రీనివాసపురంలో మంగళవారం చోటుచేసుకుంది. మర్లపల్లి గ్రామానికి చెందిన గీత(17) అనే విద్యార్థిని శ్రీనివాసపురం రైల్వేట్రాక్‌పై పడుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ఆమెను ఎందుకు మందలించారనే విషయం తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు రాకముందే తల్లిదండ్రులు యువతి మృతదేహాన్ని సంఘటనాస్థలం నుంచి తీసుకువెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
స్నేహితుడి పరిస్థితి చూసి దూకేశాడు..
ఒంగోలు (ప్రకాశం) : ఒంగోలు నగరంలోని సంఘమిత్ర ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఉన్న స్నేహితుడిని చూడటానికి వెళ్లిన ఓ విద్యార్థి.. అతడి పరిస్థితిని చూసి ఆవేదనతోనే చనిపోయాడని తెలుస్తోంది. నగరంలోని గోపాల్‌నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరూక్, అన్నంగి సాయి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ స్థానికంగా ఇంటర్ చదువుతున్నారు. కాగా రెండు రోజుల క్రితం ఫరూక్ అనారోగ్యానికి గురి కాగా కుటుంబసభ్యులు అతడిని సంఘమిత్ర ఆస్పత్రిలో చేర్పించారు. అతడిని చూడటానికి సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న సాయి...ఆస్పత్రి భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నిమజ్జనంలో అపశ్రుతి.. విద్యార్థి మృతి
ధర్మవరం(అనంతపురం): వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గణనాథుడిని నీట ముంచుతున్న క్రమంలో ఇంటర్ విద్యార్థి వంకలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని మోటుమర్ల వంకలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ధర్మవరం సాయినగర్ కాలనీకి చెందిన నవీన్(17) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు కాలనీలోని గణానాధుడి నిమజ్జన కార్యక్రమం జరగుతుండటంతో.. అందులో పాల్గొనడానికి వెళ్లాడు ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. -
రైలుపట్టాలపై విద్యార్థిని మృతదేహం
మల్కాజ్గిరి (హైదరాబాద్) : నగరంలోని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శుక్రవారం ఓ ఇంటర్ విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి దగ్గర లభించిన ఐడీ కార్డు ఆధారంగా... రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బీజేఆర్ నగర్‌కు చెందిన నవ్యగా మృతురాలిని గుర్తించారు. ఈసీఐఎల్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న నవ్య పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తూ మృతి చెందిందా? లేక ఆత్మహత్య చేసుకుందా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
శ్రీకాకుళం: ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బండల వీధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బండల వీధిలో నివాసముండే రమ్య ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. అయితే ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. దీంతో తీవ్ర గాయాలు పాలైన రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
బొబ్బిలి (విజయనగరం) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని తిరుగుడి వీధికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. కాగా తాను చదివే కాలేజీలోని ఓ లెక్చరర్ పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగాడు. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె ఇంట్లోని టాయిలెట్ క్లీనర్ హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థిని దారుణహత్య
-
ఇంటర్యువతిపై లైంగిక దాడి
-
ప్రిన్సిపాల్‌కు బడితపూజ
నల్గొండ: ఇంటర్ విద్యార్థినికి అసభ్యకరంగా మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ ప్రిన్సిపాల్‌కు శనివారం దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి అదే కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధిని సెల్‌ఫోన్‌కి గత కొంతకాలంగా అసభ్యకర ఫోటోలు, మెసేజ్‌లు పంపుతున్నాడు. అయితే విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలుపడంతో విద్యార్థిని బంధువులు ప్రిన్సిపాల్‌ను కొట్టి పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పరీక్షకెళ్లి విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్ : పరీక్ష రాసేందుకు వెళుతున్నానని చెప్పివెళ్లిన ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ ద్వారకనగర్‌కు చెందిన బెండ రాజు, రాధల కుమారుడు సాయి కిరణ్(17) ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గురువారం అతడు తానుపరీక్షకు వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినప్పటికీ విద్యార్థి ఇంటికి తిరిగిరాలేదు. సాయి కిరణ్ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పరీక్ష రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
కడప: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పరీక్ష రాస్తూ అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన కడప జిల్లా రాజంపేటలో గురువారం చోటు చేసుకుంది. పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన కె. వెంకటేశ్వర్లు స్థానిక కాకతీయ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు ద్వితీయ సంవత్సరం పరీక్ష రాయడానికి పరీక్షా కేంద్రమైన గీతాంజలి పాఠశాలకు చేరుకున్నాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి వెంకటేశ్వర్లును స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. గతంలోనే వెంకటేశ్వర్లుకు గుండె సంబంధమైన సమస్యలు ఉన్నాయని వాటివల్లే మృతి చెంది ఉండవచ్చని తోటి విద్యార్థులు ఈ సందర్బంగా వెల్లడించారు. -
కుట్టింది పురుగు అనుకున్నాడు కానీ పాము
కరీంనగర్: నిద్ర పోతున్న ఇంటర్ విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగిర్తి గ్రామంలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. మత్స్య కుమార్ (16) సుల్తానాబాద్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల సమయంలో బుధవారం అర్థరాత్రి వరకు చదువుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో కాలుకు ఏదో కుట్టినట్లు అనిపించింది. పురుగు కుట్టి ఉంటుందని భావించిన కుమార్ అలాగే నిద్రపోయాడు. అయితే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మత్స్యకుమార్ నోటి నుంచి నురుగులు వస్తుండటంతో కుటుంబ సభ్యులు పాము కట్టిందని భావించి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మత్స్యకుమార్ మృతి చెందాడు. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
కాపుకాసి కాటేశాడు ..!
బాపట్ల/ బాపట్లటౌన్:ఇంటర్మీడియెట్ విద్యార్థిని మండ్రు ప్రత్యూష(17)హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. ఆమె పినతండ్రే హతమార్చి ఉంటాడని పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పినతండ్రిని అనుమానించిన పోలీసులు సోమవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఇందులో ఇతను ఒక్కడే ఉన్నాడా, మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గుంటూరులో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరమే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బాపట్లలో ఇంటర్మీడియెట్ విద్యార్థిని ప్రత్యూషను హత్య చేసి, మృతదేహాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక దొరువు(ఎండిపోయిన నీటిగుంత)లో పడేసి చెత్తతో కప్పేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డీఎస్పీ కె.సుధాకర్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని బయటుకు తీసి కేసు దర్యాప్తు చేపట్టారు. పైజమా మృతురాలి మెడకు చుట్టి ఉండడం, నాలుక బయటకు వచ్చి ఉండడం వంటి అంశాల ఆధారంగా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్యచేసి ఉంటారని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ఇదిలావుండగా, ప్రత్యూష తల్లి మండ్రు సుబ్బమ్మ భర్త చనిపోయినప్పటి నుంచి మండలం లోని ఈతేరు గ్రామానికి చెందిన ఎం.మురళి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మురళికి భార్య, కుమార్తె కూడా ఉన్నారు. పినతండ్రి తీసుకెళ్లాడు... కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఈ నెల ఆరవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమ యంలో కళాశాల నుంచి ఇంటికి వచ్చిన ప్రత్యూషను ‘మీ అమ్మ నిన్ను నన్ను పుల్లలకు వెళ్లి రమ్మంది’ అంటూ పినతండ్రి మురళి ఆంధ్రకేసరినగర్ సమీపంలోని మార్కెట్‌యార్డులో ఉన్న చెట్లలోకి తీసుకె ళ్లినట్టు చెపుతున్నారు. అక్కడ అతి కిరాతకంగా ప్రవర్తించి, ఆపై హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలంలో మురళి పర్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బాపట్ల ఇన్చార్జి డీఎస్పీ కె. సుధాకర్ తన సిబ్బందితో రంగంలోకి దిగి ప్రత్యూష హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. సోమవారం రాత్రి మురళిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తానే ఈ హత్యకు పాల్పడినట్టు చెప్పాడని సమాచారం. సీఐ మల్లిఖార్జునరావు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు కూడా కేసు దర్యాప్తులో పాల్గొంటున్నారు. నిందితుడిని శిక్షించాలని డిమాండ్.... ప్రత్యూష హత్యకేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడికిపాల్పడి, హత్యచేశారని తెలియడంతో పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు స్థానిక మార్కెట్‌యార్డుకు తరలివచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇంటర్ విద్యార్థిని హత్య
బాపట్లటౌన్: ఇంటర్మీడియట్ విద్యార్థినిని హత్య చేసి, మృతదేహాన్ని దొరువు(ఎండిపోయిన నీటి గుంత)లో పడేసి చెత్తతో కప్పేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక దొరువు నుంచి రెండురోజులుగా దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్ళి చూడగా అక్కడ ఓ మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది. చెట్టు కొమ్మలు, ఆకులతో కప్పేసి ఉండటంతో మృతదేహం అస్పష్టంగా కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు వచ్చి పరిశీలించి క్లూస్‌టీంను రప్పించారు. క్లూస్‌టీం వచ్చి చెత్తను తొలగించి మృతదేహన్ని బయటికి తీసింది. మృతురాలి పైజమా ఆమె మెడకు చుట్టి ఉంది. నాలుక బయటకు వచ్చింది. మొహంపై చున్నీ కప్పి ఉంది. దీని ఆధారంగా తొలుత లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తమ కుమార్తె మండ్రు ప్రత్యూష ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విజయలక్ష్మీపురం వాసి మండ్రు సుబ్బమ్మను పోలీసులు సంఘటన స్థలానికి పిలిచి చూపించగా తన కుమార్తేనని గుర్తించారు. ప్రత్యూష పట్టణంలోని భారతీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని. ఆమెకు మండలంలోని మరుప్రోలువారిపాలెం గ్రామానికి చెందిన మరుప్రోలు గోపిరెడ్డితో ఇటీవల ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో తెలిసి కుటుంబసభ్యులు మందలించడంతో గత ఏడాది అక్టోబర్ 15న ప్రత్యూష, గోపిరెడ్డి మరుప్రోలువారిపాలెం సమీపంలోని పంటపొల్లాల్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఏరియావైద్యశాలలో చికిత్స చేయించిన కుటుంబసభ్యులు ఆమెను వారం రోజుల తర్వాత తిరిగి కళాశాలకు పంపించారు. అప్పటి నుంచి కళాశాలకు వెళ్తున్న ప్రత్యూష ఈనెల 6న కళాశాలకు అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళి తిరిగిరాలేదు. దీంతో ఆమె కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ప్రియుడే హత్యచేశాడా? లేక కుటుంబ సభ్యులే హత్యచేసి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఇన్‌ఛార్జి సీఐ మల్లికార్జునరావు తెలిపారు. -
ప్రేమ విఫలం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు సమీపంలోని మత్స్యగడ్డలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రేమ విఫలం అవ్వడంతోనే ఆమె చనిపోయిందంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముంచంగిపుట్టు నాలుగురోడ్ల జంక్షన్లో విద్యార్థులు ధర్నా చేశారు. -
ఆకతాయిల వేధింపులకు విద్యార్థిని బలి
దోమకొండ: ఆకతాయిల వేధింపులకు ఇంటర్మీడియెట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేటకి చెందిన మంగళపల్లి భవ్యశ్రీ(18) కామారెడ్డిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్లేది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూడా ఇంటర్ చదువుతూ కామారెడ్డి వెళుతున్నారు. వీరు ప్రతిరోజు భవ్యశ్రీని వేధించేవారు. గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు మృతురాలి ఇంటి సమీపంలోకి వచ్చారు. దీంతో భవ్యశ్రీ సోదరుడు భరత్‌కు వారికి మధ్య గొడవ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం పరువు పోతోందని భవ్యశ్రీ మనస్థానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. తమ కూతురు మృతికి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే కారణమని మృతురాలి తల్లితండ్రులు గోవర్ధన్, మాధవిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రినిటీ కాలేజీలో40 మందికి అస్వస్థత కరీంనగర్: కరీంనగర్‌లోని ట్రినిటీ జూనియర్ కళాశాల (ఏసీ క్యాంపస్)లో శుక్రవారం బాలల దినోత్సవరం సందర్భంగా 40 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వేడుకల్లో కేక్‌కట్ చేసినప్పుడు కొంతమంది పెప్పర్ స్ప్రే వాడినట్లు పేర్కొంటున్నారు. కళాశాల ల్యాబ్‌లో గురువారం సాయంత్రం వరకు విద్యార్థులు ప్రయోగాలు చేశారని... అక్కడ వాడిన పరికరాలు, రసాయనాలు తొలగించకుండా ఉన్నాయని, రసాయన పదార్థాలు వినియోగించిన ప్లాస్కు కిందపడి పగలడంతో ఒక్కసారిగా పొగవచ్చి విషవాయువు ప్రబలిందని మరికొందరు అంటున్నారు. యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యం గా ఉంచింది. అస్వస్థతకు గురైన వారిని నగరంలోని అపోలోరీచ్, సన్‌రైజ్ ఆస్పత్రుల్లో చేర్పిం చింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘా ల నాయకులు కళాశాల క్యాంపస్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని అపోలోరీచ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ బాబురావు తెలిపారు. -
చదువుపై ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య
చదువుపై అయిష్టత ఓ యువతి ప్రాణాలు తీసింది. తనకు చదువంటే ఇష్టం లేదంటూ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలోని శాంతాభవన్ క్యాంపస్‌లో శ్రీవిద్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం కడప జిల్లా. చదువుకోవడం తనకు ఇష్టం లేదన్న విషయాన్ని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. శ్రీవిద్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. -
ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్
ప్లస్‌టూ విద్యార్థినికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కోవై వాల్పారై అయ్యర్ పాడికి చెందిన విఘ్నేశ్వరన్ (21). వాల్పారై పోలీస్‌స్టేషన్ యువజన దళంలో పనిచేస్తున్నారు. ఇతను కవర్కల్ ఎస్టేట్‌కు చెందిన ప్లస్-2 విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్టు విద్యార్థిని తల్లిదండ్రులు వాల్పారై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొల్లాచ్చి బస్సు నిలయంలో నిలబడివున్న విఘ్నేశ్వరన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతనితో ఉన్న విద్యార్థినిని విడిపించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. ఆ విద్యార్థిని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 11వ తేదీ వాల్పారై గాంధీ విగ్రహం సమీపంలో నిలబడి ఉన్న తనను విఘ్నేశ్వరన్ వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. తరువాత లాడ్జిలో తనపై లైంగికదాడి చేశాడని తెలిపింది. విఘ్నేశ్వరన్పై పోలీసులు అరెస్టు చేసి కోవై జైలుకు తరలించారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
-
హాస్టల్ గదిలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నల్లకుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ప్రవీణ్‌కుమార్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. బాగ్ అంబర్‌పేటలోని ఆ కళాశాలకు చెందిన హాస్టల్ గదిలో ప్రణీత్ కమార్ రెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా ప్రణీత్ కమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి ప్రణీత్ కమార్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అని పోలీసులు వెల్లడించారు. ప్రణీత్ మృతిపై అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు. -
బాపట్ల బీచ్‌లో జిల్లా విద్యార్థి మృతి
మరొకరి గల్లంతు వారి స్వగ్రామం కేసరపల్లి శివారు దుర్గాపురం శోకసంద్రంలో కుటుంబసభ్యులు గన్నవరం/బాపట్ల, న్యూస్‌లైన్ : మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు గుంటూరు జిల్లా బాపట్లకు సముద్ర స్నానం కోసం వెళ్లి గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభించగా, మరొకరి ఆచూకీ తెలియలేదు. దీంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. వివరాలిలా ఉన్నాయి. దుర్గాపురం కాలనీకి చెందిన అసిలేటి రత్నాకర్ కుమారుడైన దినేష్ (14) స్థానిక వీఎస్ సెయింట్‌జాన్స్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గుంటూరు జిల్లా బాపట్లలో జరగనున్న ఓ శుభకార్యానికి తన బాబాయి రమేష్ కుటుంబసభ్యులతో కలసి బుధవారం వెళ్లాడు. తనతో పాటు తన స్నేహితుడైన అదే ప్రాంతానికి ఇంటర్మీడియెట్ విద్యార్థి వీర్ల నాగరాజును కూడా తీసుకెళ్లాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దినేష్, నాగరాజు సముద్ర స్నానానికి వెళ్లారు. కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్న సమయంలో పెద్ద అల తాకిడికి నాగరాజు, దినేష్ సముద్రంలో గల్లంతయ్యారు. దీంతో వారు పెద్దగా కేకలు వేయడంతో పక్కనే స్నానం చేస్తున్న దినేష్ బాబాయి రమేష్ గమనించి వారిని రక్షించేందుకు యత్నించాడు. రెండు చేతులతో వారిని పట్టుకున్నప్పటికీ ఆలల ఉధృ తికి రమేష్ యత్నం విఫలమైంది. వెంటనే తీర ప్రాంతంలోని మత్స్యకారులకు సమాచారం చెప్పడంతో వారితో పాటు, పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న దినేష్, నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన బాపట్ల బయలుదేరి వెళ్లారు. ఒక్కగానొక్క కుమారుడు... సముద్రంలో గల్లంతైన దినేష్‌కు ఒక సోదరి ఉంది. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు రత్నాకర్, రామాబాయ్లు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. తొమ్మిదో తరగతి పూర్తవడంతో పదో తరగతిలో చేరాల్సి ఉంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తునప్పటికీ కుమారుడిని బాగా చదివిస్తే తమ ఆశలు నెరవేరతాయనుకున్నానని తండ్రి రత్నాకర్ ఆవేదన వ్యక్తంచేశాడు. వేసవి కారణంగా సముద్ర స్నానానికి వెళ్లి వస్తామని చెబితే పంపించామని.. ఇప్పుడు మీ అమ్మకు నీ గురించి ఏమి చెప్పాలంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. చెట్టంత కొడుకును సముద్రం పాలు చేశా... కూలీనాలీ చేసుకుని కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులమిద్దరం కష్టపడుతున్నాం... చెట్టంత కొడుకును సముద్రంపాలు చేశానంటూ నాగరాజు తండ్రి తిరుపతయ్య విలపించాడు. తిరుపతయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. నాగరాజు రెండో కుమారుడు. స్నేహితుడితో సముద్రస్నానానికి వెళుతున్నానంటే పంపానంటూ తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మరంగా గాలింపు చర్యలు.. సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతుకావడంతో పోలీసులు, మత్స్యకారులు సముద్రంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అడవిపల్లిపాలెం వద్ద సముద్రంలో మునిగిపోయిన నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా చీరాల వైపు ఒక బృందం, సూర్యలంక వైపు మరో బృందం వెళ్లి గాలింపు చర్యలను చేపట్టింది. గాలింపునకు మేకనైజ్డ్ బోట్లు, వలలు ఉపయోగించారు. గురువారం రాత్రి సమయానికి దినేష్ మృతదేహం లభించినట్లు బాపట్ల పోలీసులు తెలిపారు. నాగరాజు ఆచూకీ కోసం మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. తీరని విషాదం... తన కుమారుడు గల్లంతైన విషయం తెలుసుకున్న నాగరాజు తల్లి నాగేశ్వరమ్మ స్వగ్రామంలో సొమ్మసిల్లిపోయింది. తన ముగ్గురు కుమారులలో అల్లారుముద్దుగా పెంచుకున్న నాగరాజు కనిపించడం లేదంటూ భోరున విలపించింది. -
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
-
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ అనే విద్యార్థి అదృశ్యం అయ్యాడు. ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న మహేష్ వాస్తవానికి గత నెల 31వ తేదీ నుంచే కనిపించడం లేదు. అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ విషయమై అతడి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అతడి స్నేహితుల ద్వారా సమాచారం అందడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన కాలేజి యాజమాన్యంపై ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
మత్తుమందు వాసన చూపి బాలికపై లైంగిక దాడి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓ మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం.. మలక్‌పేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను హయత్‌నగర్ మండలం మన్నెగూడ చౌరస్తా వద్ద బస్సు దిగాలని లేకుంటే యాసిడ్ పోసి హతమారుస్తామని బొంగులూరు గ్రామానికి చెందిన సాయి (17) గత డిసెంబర్ 21న ఆమె మొబైల్‌కు మెసేజ్ పంపాడు. దీంతో భయపడిన ఆ బాలిక మన్నెగూడ చౌర స్తా వద్ద బస్సు దిగింది. అక్కడే ఉన్న సాయి, అతడి మిత్రుడు మణికిరణ్ (18)లు ఆమెను బైక్‌పై ఎక్కించుకుని నిర్జనప్రదేశానికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలోనే మత్తుమందులో ముంచిన రుమాలుతో ఆమెకు వాసన చూపించడంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం జరిపారు. కొద్దిసేపటి తరువాత స్పృహలోకి వచ్చిన బాలిక గొడవ చేయడంతో బైక్‌పై తిరిగి తీసుకువస్తుండగా దారిలో గస్తీ పోలీసులు కనిపించారు. వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. బొంగులూరుకు చెందిన మొబైల్‌షాప్ యజమాని శ్రీనివాస్ వచ్చి తనకు పరిచయస్తులని చెప్పడంతో పోలీసులు వారిని వదిలేశారు. కాగా, బాలిక తల్లి అప్పటికే నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. అయితే, ఆదివారం నిమ్స్ నుంచి తల్లి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె తండ్రి భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై నిర్భయ చట్టంతో పాటు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్సువల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.