శ్రీకాకుళం: ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బండల వీధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బండల వీధిలో నివాసముండే రమ్య ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. అయితే ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. దీంతో తీవ్ర గాయాలు పాలైన రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.