
చదువుపై ఇష్టం లేదంటూ విద్యార్థిని ఆత్మహత్య
చదువుపై అయిష్టత ఓ యువతి ప్రాణాలు తీసింది. తనకు చదువంటే ఇష్టం లేదంటూ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలోని శాంతాభవన్ క్యాంపస్లో శ్రీవిద్య అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం కడప జిల్లా.
చదువుకోవడం తనకు ఇష్టం లేదన్న విషయాన్ని ఆమె తన ఆత్మహత్య లేఖలో పేర్కొంది. శ్రీవిద్య మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.