అనంతపురం : అనంతపురంలోని నలంద ఇంటర్ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
నలంద హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న(17) శనివారం అర్ధరాత్రి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని అప్రమత్తం చేయడంతో వారు వెంటనే జ్యోత్స్నను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.
గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
Published Sun, Nov 8 2015 8:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM