ఒంగోలు నగరంలోని సంఘమిత్ర ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒంగోలు (ప్రకాశం) : ఒంగోలు నగరంలోని సంఘమిత్ర ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో ఉన్న స్నేహితుడిని చూడటానికి వెళ్లిన ఓ విద్యార్థి.. అతడి పరిస్థితిని చూసి ఆవేదనతోనే చనిపోయాడని తెలుస్తోంది. నగరంలోని గోపాల్‌నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరూక్, అన్నంగి సాయి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ స్థానికంగా ఇంటర్ చదువుతున్నారు.
కాగా రెండు రోజుల క్రితం ఫరూక్ అనారోగ్యానికి గురి కాగా కుటుంబసభ్యులు అతడిని సంఘమిత్ర ఆస్పత్రిలో చేర్పించారు. అతడిని చూడటానికి సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న సాయి...ఆస్పత్రి భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.