ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, ఒంగోలు: స్థానిక నేతాజీ కాలనీలో నక్కా మణికంఠ(30) ఇంటి సీలింగ్‌కు ఉన్న కొక్కేనికి తాడుసాయంతో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. తాను నివాసం ఉండే ఇంట్లోనే ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం మణికంఠ స్వగ్రామం టంగుటూరు మండలం మర్లపాడు. రెండు సంవత్సరాలుగా తుపాకుల విజయ్‌కుమార్ అలియాస్ లవ్లీ అనే ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ఇద్దరు వివాహం కూడా చేసుకున్నారు. గత నెల 19న మణికంఠకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చూపించగా వైద్యులు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.
చదవండి: (దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..)
అయితే వత్తిరీత్యా డ్రైవర్ అయిన మణికంఠ మద్యం, సిగిరెట్లు మానకపోవడంతో సోమవారం మణికంఠ , లవ్లీ మధ్య వివాదం జరిగింది. దీంతో లవ్లీ చిలకలూరిపేట వెళ్ళింది. దీంతో నువ్వురాకపోతే చచ్చిపోతానని ఫోన్‌లో హెచ్చరించాడు. మానేస్తానంటేనే వస్తానంటూ అటునుంచి సమాధానం వచ్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి ఫోన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతుండడంతో లవ్లీ సమీపంలోని వారికి ఫోన్‌చేసింది. వారు వెళ్లి చూడగా ఇంటిపైన ఉన్న కొక్కేనికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఉరేసుకున్నట్లు గుర్తించి వారు లవ్లీకి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలూకా ఎస్సై దేవకుమార్ ఘటనాస్థలానికి చేరుకుని మతదేహాన్ని కిందకు దించి చుట్టుపక్కల వారిని విచారించారు. లవ్లీ కూడా ఒంగోలుకు చేరుకోవడంతో ఆమెను విచారించారు.
గతంలోను ఇదే విధంగా..
మణికంఠ తరచూ ఆత్మహత్యచేసుకుంటానని బెదిరించేవాడని, అదే విధంగా బెదిరిస్తున్నాడని అనుకున్నానని లవ్లీ చెబుతోంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment