
ప్రతీకాత్మక చిత్రం
కడప అర్బన్: కడప నగరంలోని ఏఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీలేఖ అలియాస్ ప్రసాద్ (18) అనే ట్రాన్స్‌జెండర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. సహచరుల, స్థానికుల సమాచారం మేరకు.. ట్రాన్స్‌జెండర్, ఓ యువకుడిని ప్రేమించింది. తనకు యువకుడి ప్రేమ దక్కలేదని, మానసిక వేదనకు గురై ఈనెల 4వ తేదీ రాత్రి పురుగుల మందు సేవించింది. స్థానికులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment