Kadapa district
-
కడప : యోగి వేమన విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
పాలు కారుస్తున్న వేప చెట్టు ఎగవడ్డ అమ్మలక్కలు
-
ఊటీని తలపిస్తున్నా కడప నగరం (ఫొటోలు)
-
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం (ఫొటోలు)
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)
-
కడప జిల్లాలో దారుణం..
-
జననేతకు జనం ఘన స్వాగతం.. వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైద్యుల నిర్లక్ష్యంతోనే మెడికో మృతి
బనశంకరి: మంగళూరులో మెడిసిన్ పీజీ చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వైద్య విద్యార్థిని వైద్యుల నిర్లక్ష్యంతోనే డెంగీ జ్వరంతో మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపింయచారు. ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పి.మాధురి, వెంకటరమణారెడ్డి కుమార్తె పడిగపాటి సృజని (27) మంగళూరు వద్ద కేవీజీ మెడికల్ కాలేజీలో గైనకాలజీలో పీజీ విద్యార్థిని. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో అదే మెడికల్ కాలేజీలోనే వైద్యం చేయించుకుంది. డెంగీ అని నిర్ధారణ కాగా ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. సరైన వైద్యం అందించకపోవడంతో ఆరోగ్యం విషమించింది. కాలేజీ సిబ్బంది ఆలస్యంగా తల్లిదండ్రులకు చెప్పడంతో హైదరాబాద్ నుంచి మంగళూరుకు బయలుదేరారు. డాక్టర్లు చేతులెత్తేసి మెరుగైన వైద్యం కోసం మంగళూరుకు వెళ్లాలని సూచించారు. వైద్య సిబ్బంది ఆమెను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో కోమాలోకి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న కుమార్తె ను చూసి తల్లడిల్లిపోయారు. చివరి మాటలకు కూడా నోచుకోలేదని విలపించారు. 21 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కన్నుమూసిందని తల్లిదండ్రులు తెలిపారు.స్పందన లేని వైద్యులుతమ బిడ్డకు సరిగా వైద్యం చేయలేదని తల్లిదండ్రులు మంగళూరు నార్త్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కాలేజీకి వెళ్లి విచారణ జరిపారు. సృజని ట్రీట్మెంట్ గురించి వైద్యులు సరైన సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. అదివారం తెల్లవారు జామున స్వగ్రామం పోట్లదుర్తికి మృతదేహాన్ని తీసుకువచ్చి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.త్వరలో కోర్సు పూర్తి..సృజని చదువులో మంచి ప్రతిభాశాలి. ఇంటర్ పూర్తయిన తరువాత మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. తరువాత సుళ్యలో పీజీ కోర్సు చివరి ఏడాది చేస్తోంది. ఆమె మరణంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. త్వరలో ఎంఎస్ పూర్తి చేసుకుని వస్తుందని కోటి ఆశలతో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వైద్య విద్యార్థినికే కనీస వైద్యం అందించకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. -
Nidhi Agarwal: కడపలో సినీ నటి నిధి అగర్వాల్ సందడి (ఫొటోలు)
-
కడపలో పోలింగ్ కి ఏర్పాట్లు
-
ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప
-
సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Bus Yatra: ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. బుధవారం ఉదయం 10.56 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహా్ననికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అరి్పస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజాక్షేత్రంలోనే జననేత.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నాటి అరాచకాలను ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. అదే సమయంలో టీడీపీ–జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జతకలిశాక మూడు పారీ్టలు చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టటాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు. -
బద్వేల్.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు. ఇప్పటివరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావమయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. అమృత్‌కుమార్ నుంచి డాక్టర్ రాజశేఖర్ వరకూ.. అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్‌కుమార్ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరుగయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎన్డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల నాటికి డాక్టర్ రాజశేఖర్ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. బాబుది సైతం అదే ధోరణి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్ రాజశేఖర్ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రొద్దుటూరులో దారుణం.. ఒకరు మృతి
-
కడప జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన
-
ఈ బూతులేంటి లోకేష్ ..
-
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-తుఫాన్ వాహనం ఢీకొని ఏడుగురు మృతిచెందారు. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.మృతులంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు. చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి.. -
కడప జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
-
కడప నగరంలో రోడ్డు ప్రమాదం
-
ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు
-
ఎంత పనిచేశావు తల్లీ..
వైఎస్సార్ జిల్లా : తాను ఈ లోకాన్ని వీడిపోతే నా బిడ్డలకు ఎవరు దిక్కు.? కట్టుకున్నోడికి పెళ్లాం, బిడ్డలు కనిపించడం లేదు. రోజూ పూటుగా తాగడం మత్తులో తూలడమే ఆయన ప్రపంచం. పర స్త్రీ వ్యామోహంలో వేధింపులకు గురి చేసేవాడు. వీటిని భరించలేకపోయింది. చివరికి తనువు చాలించాలని నిర్ణయించుకుంది.తనతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లాలనుకుంది ఆ తల్లి. ముక్కుపచ్చలారని కుమారై, కుమారుడితో సహా నాపరాయి గనిలోని నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన ఎర్రగుంట్లలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లక్ష్మీదేవి(36) అక్షయ(9), రేవంత్(7) మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు..దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటకు చెందిన పిట్టల శ్రీనివాసులుకు , సి రాజుపాలెంకు చెందిన లక్ష్మీదేవికి పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి అక్షయ, రేవంత్ అనే పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం ఎర్రగుంట్లకు వచ్చిన వీరు మహేశ్వర్‌నగర్ కాలనీలో స్థిరపడ్డారు. పిట్టల శ్రీనివాసులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మీదేవి రజక వృతిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుండేది. పిట్టల శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు.తరచూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఇలా చేస్తే కుటుంబం గడిచేది ఎలా.. పిల్లలను ఎలా పోషించుకుంటామని లక్ష్మీదేవి భర్తను అడుగుతుండేది. ఇటీవల కాలంలో శ్రీనివాసులు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై భార్య ప్రశ్నించడంతో ఆమెను వేధింపులకు గురి చేస్తుండేవాడు. అదివారం రాత్రి కూడా ఇద్దరు ఈ విషయంపై గొడవ పడ్డారు. శ్రీనివాసులు సోమవారం ఉదయం ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. లక్ష్మీదేవి తన పిల్లలు అక్షయ, రేవంత్‌లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. వేంపల్లె రోడ్డులో ఉన్న నాపరాయి గని వద్దకు వెళ్లింది. ముందుగా అక్షయ, రేవంత్‌లను గనిలోని నీటిలో వేసి తర్వాత ఆమె దూకి ఆత్మహత్య చేసుకుంది. నీటిలో మునుగుతున్న సమయంలో పిల్లలు కేకలు వేశారు. రోడ్డుపై వెళుతున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ మంజునాథ్‌రెడ్డి, తహసీల్దార్ ఎ నాగేశ్వరరావులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. మొదట నీటి అడుగున పడి ఉన్న అక్షయ, రేవంత్‌ల మృతదేహాలను, కొంత సేపటికి లక్ష్మీదేవి మృతదేహాన్ని బయటకు తీశారు.తల్లీబిడ్దల మృతదేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గని వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతురాలి అన్నయ్య ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు. -
వైఎస్సార్ జిల్లా వాసులకు శుభవార్త
-
వివాహేతర సంబంధం.. అడవిలో ఉరేసుకుని..
సాక్షి, వైఎస్సార్ కడప: ఓ యువకుడు, మహళ కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని రాజంపేట మండలంలోని లక్కిరెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. నాగేంద్ర(21) అనే యువకుడు రుక్మిణి(35) అనే మహిళ కలిసి లక్కిరెడ్డిపల్లె మండలంలోని కొండ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి మధ్య గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. కాగా యువకుడు, మహిళ ద్విచక్ర వాహనంపై లక్కిరెడ్డిపల్లి నుంచి నందివాళ్ల పల్లె రోడ్డు మార్గాన అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినోద్ తెలిపారు. ఈ మేరకు ఇరువురు బంధువులను పిలిపించి వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు.. -
ఎక్కడ కనిపించని టీడీపీ బంద్ ప్రభావం
-
వైఎస్ఆర్ జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు
-
ఇంట్లో నుంచి పరార్, టీసీకి దొరికిన పిల్లలు
ప్రొద్దుటూరు క్రైం : ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన పిల్లలు సురక్షితంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని అమృతానగర్‌కు చెందిన మహబూబ్‌బాషా, షేక్ జావిద్, విశ్వాసరాజు, వంశీకృష్ణ అనే 13–14 ఏళ్ల పిల్లలు స్నేహితులు. వారు చెప్పకుండా మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. వీళ్లంతా ఒకే వీధికి చెందిన వారు. ఎర్రగుంట్లకు వెళ్లిన నలుగురు ముంబై రైలు ఎక్కారు. మార్గంమధ్యలోని తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం సమీపంలో రైల్లోని టీసీ వారి వద్దకు వచ్చి టికెట్ అడిగాడు. లేదని చెప్పడంతో వారి వాలకాన్ని బట్టి పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు టీసీ గ్రహించాడు. దీంతో టీసీ అరక్కోణం రైల్వేపోలీసులకు వారిని అప్పగించాడు. అక్కడి పోలీసులు అమృతానగర్‌లోని పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సినీహబ్ అధినేత బసిరెడ్డి వీరకుమార్‌రెడ్డి సొంత ఖర్చులతో శుక్రవారం నలుగురు పిల్లలను ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చారు. -
ప్రేమ విఫలం, ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య
కడప అర్బన్: కడప నగరంలోని ఏఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న శ్రీలేఖ అలియాస్ ప్రసాద్ (18) అనే ట్రాన్స్‌జెండర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. సహచరుల, స్థానికుల సమాచారం మేరకు.. ట్రాన్స్‌జెండర్, ఓ యువకుడిని ప్రేమించింది. తనకు యువకుడి ప్రేమ దక్కలేదని, మానసిక వేదనకు గురై ఈనెల 4వ తేదీ రాత్రి పురుగుల మందు సేవించింది. స్థానికులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు. -
ఎవరీ బాషా భాయ్..?
కడప అర్బన్: కొందరు పోలీసు, అటవీ అధికారుల వైఫల్యం..లాలూచీ.. వెరసి జిల్లాలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతూనే ఉంది. తరచూ పోలీసు, అటవీ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నామని.. కొందరు కూలీలను, స్మగ్లర్లను అరెస్టు చేశామని దుంగలు, దొంగలతో ఫొటోలకు ఫోజులివ్వడం రివాజుగా మారింది. ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు లేదా అటవీ అధికారులకు దొరికిన వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారా.. లేక ఆ దిశగా దర్యాప్తు చేసేందుకు వేరే కారణాలేమైనా అడ్డుగా ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. సాధారణంగా ఒక కేసులో నిందితుడిని అరెస్టు చేసినప్పుడు అతన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది ఎవరు.. అతనితో వీరికి పరిచయం ఎలా కలిగింది.. ఇక్కడి అడవుల్లో మకాం వేసిన తర్వాత వారికి అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేస్తున్నది ఎవరు.. స్థానికంగా వారికి సహకరిస్తున్నది ఎవరు.. ఇక్కడి సంపదను ఎక్కడికి తరలిస్తారు.. వారి డంప్ ఎక్కడ ఉంది.. స్మగ్లింగ్‌లో భాగస్వాములైన కీలక వ్యక్తులు ఎవరు.. ఇలాంటి పలు అంశాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపడితే ఎర్రచందనం స్మగ్లర్ల మూలాలను తెలుసుకునేందుకు వీలుంటుంది. కానీ నిత్యం ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశామని ప్రకటించడం తప్ప వారి వెనుక ఉన్న బడా వ్యక్తుల గుట్టు రట్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 5లక్షల హెక్టార్లలో ఉండగా కేవలం జిల్లాలోని అటవీప్రాంతంలోనే 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్ల పరిధిల్లో అన్నిచోట్ల 13 అటవీశాఖ చెక్‌పోస్ట్‌లు ఉన్నప్పటికీ, ఆయా ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో విధులను నిర్వహించాల్సిన సిబ్బంది స్మగ్లర్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి, వారి మార్గాన్ని సులువు చేస్తున్నారు జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, బద్వేల్, సిద్దవటం, అట్లూరు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, వనిపెంట, గువ్వలచెరువు, రామాపురం, పెండ్లిమర్రి, కడప నగర శివార్లలోని పాలకొండలు, మామిళ్లపల్లె ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లోకి చొరబడుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలను చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి గతంలో జిల్లాకు యథేచ్ఛగా ఆర్టీసి బస్సుల్లోనే తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు రూటు మార్చి చైన్నె నుంచి వాహనాల్లోనే జిల్లాలో తమకు అనుకూలంగా ఉన్న అటవీప్రాంతంలోకి చొరబడుతున్నారు. రైల్వేకోడూరు, రాయచోటి, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, పెండ్లిమర్రి ప్రాంతాలకు చెందిన వ్యక్తులే ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరొందుతున్నారు. స్థానికంగా ఉన్న స్మగ్లర్ల సహకారంతో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి స్మగ్లర్లు దశలవారీగా కొందరు పోలీసు, అటవీ అధికారులకు, సిబ్బందికి లక్షల్లో ముడుపులు ఇవ్వడంతోనే వారిని చెక్‌పోస్టులను సైతం సులభంగా దాటించేస్తున్నారు. ఒకచోట అటవీప్రాంతంలోకి ప్రవేశించి, ఎర్రచందనం చెట్లను నరికేసి, మరో మార్గంలో రోడ్లపైకి తీసుకుని వచ్చేస్తూ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అక్రమరవాణా చేసుకుని తీసుకుని వచ్చిన ఎర్రచందనం దుంగలను కడప–రాయచోటి మీదుగా చిన్నమండెం బెంగళూరులోని కటిగెనహళ్లికి, రైల్వేకోడూరు వైపుగా తిరుపతి మీదుగా చైన్నెకి తీసుకుని వెళుతున్నారు. స్మగ్లర్లు బరితెగించి పోతుండగా మధ్యలో వారి మాటలు నమ్మి వచ్చిన కూలీలు పలు సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినా తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలు ఎర్రచందనం దుంగలు నరికి తరలించేందుకు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. స్మగ్లర్లకు సహకరించారనే కారణంగా గతంలో పలువురు అధికారులపై వేటు పడింది. కానీ మిగిలిన వారి వైఖరిలో మార్పు రాకపోవడం విచారకరం. ఇప్పటికైనా పోలీసు, అటవీ అధికారులు నిజాయితీగా వ్యవహరించి స్మగ్లర్ల ఆటకట్టించాల్సిన అవసరం ఉంది. సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం– ఎస్పీ వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనం, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. మరో రెండు రోజుల్లో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన సూత్రధారి, పాత్రధారి బాషాభాయ్.. గోటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ కూలీలు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారి, పాత్రధారి బాషాభాయ్‌గా పోలీసులు గుర్తించారు. జిల్లాకు చెందిన బాషాభాయ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి చెన్నైకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఇతనిపై జిల్లాలో మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు సమాచారం. ఇతన్ని పట్టుకునేందుకు ఎర్రచందనం టాస్‌్కఫోర్స్ ప్రత్యేక బృందం చెన్నై వెళ్లినట్లు తెలిసింది. కాగా, ఇతను కారులో ప్రయాణిస్తున్న లోకల్ గ్యాంగ్‌కు రూ.10 లక్షలు ఎర చూపి తమిళ కూలీల స్కార్పియోను అటకాయించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇటియోస్ కారులోని ముగ్గురు నిందితులు స్కారి్పయోను వెంబడించి ప్రమాదానికి కారణమయ్యారు. కారులోని ముగ్గురు నిందితులలో పెండ్లిమర్రి మండలానికి చెందిన విశ్వనాథరెడ్డి, రాయచోటికి చెందిన జయరాం నాయక్, కడపకు చెందిన మహేష్‌లు ఉన్నారు. వీరిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వీరిలో విశ్వనాథరెడ్డిపై ఎనిమిది కేసులు, మహేష్‌పై 14 కేసులు, జయరాం నాయక్‌పై 6 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. -
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
టీడీపీ నేతల దౌర్జన్యం
కాశినాయన: మండల కేంద్రమైన నరసాపురంలో జరిగిన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికిపాల్పడ్డారు. నరసాపురం పంచాయతీలో నరసాపురం, మిద్దెల, మూలపల్లె, నరసన్నపల్లె గ్రామాలు ఉన్నాయి. అందరికీ అనువుగా ఉండటంతో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో సచివాలయ భవనం నిర్మించాలని, శుక్రవారం శంకుస్థాపన చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సచివాలయం తమ గ్రామంలోనే నిర్మించాలని టీడీపీ నాయకులు అనిల్ ఉరఫ్ వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, నాగలక్షుమ్మ తదితరులు తమ అనుచరులతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని గ్రామంలో అడ్డుకుని హాల్చల్ సృష్టించారు. తాము చెప్పిన చోటే సచివాలయం నిర్మించాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ విశ్వనాథరెడ్డి, ఎంపీడీఓ ముజఫర్ రహీం, తహశీల్దార్ శ్రీనివాసులు టెంకాయకొట్టి శంకుస్థాపన చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి వచ్చి అధికారులు, వైఎస్సార్సీపీ నేతలను దుర్భాషలాడారు. సామగ్రిని చిందరవందర చేసి హంగామా సృష్టించారు. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పినా టీడీపీ నాయకులు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. చివరకు వారిపై కూడా రుబాబు చేశారు. రెండు గంటల అనంతరం వారు వెనుదిరిగారు. అందరికీ అనువైన ప్రాంతంలో సచివాలయం నిర్మిస్తుంటే అడ్డుకోవడంపై మిద్దెల, నరసాపురం, మూలపల్లె, నరసన్నపల్లె గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓబులాపురంలో.... మండలంలోని రంపాడు పంచాయతీ సచివాలయ భవ భవనానికి ఓబులాపురం వద్ద శుక్రవారం స్థానిక నాయకులు రాజనారాయణరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాజారెడ్డిల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన నాయకులు హాజరయ్యారు. రంపాడులోనే సచివాలయం నిర్మించాలని కొంతకాలంగా ప్రజలు కోరుతున్నారు. రంపాడుతో పాటు పిట్టికుంట, ఓబులాపురం, ఉప్పలూరు పంచాయతీలోని ప్రజలకు అనువుగా ఉన్న ఓబులాపురం వద్ద నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం శంకుస్థాపన తలపెట్టారు. తొలుత కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో స్థానిక నేతలే భూమిపూజ చేసుకోవాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
కరోనా నివారణ చర్యల్లో ఏపీ నంబర్–1
ప్రొద్దుటూరు : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో ఏపీ నంబర్ 1గా ఉందని ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రొద్దుటూరు పరిధిలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు నిత్యావసర వస్తువుల కిట్ల సరఫరాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏపీలో నంబర్ 1గా ఉన్నాయని జాతీయ మీడియా కితాబిచ్చిందన్నారు. దక్షిణ కొరియా నుంచి 10 లక్షల ర్యాపిడ్ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఇప్పటికే లక్ష కిట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. మండల స్థాయిలో కూడా పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాపిడ్ కిట్లకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నిత్యం ప్రొద్దుటూరులోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి ట్రూనాట్ సెంటర్ రావడానికి ఎమ్మెల్యే కృషి ఉందన్నారు. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వరరెడ్డి ద్వారా ఇప్పటికే జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు పరిధిలోని రెడ్ జోన్ ప్రాంతాలకు సంబంధించి 12వేల వరకు కిట్లు కావాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు. ఆ మేరకు ప్రస్తుతం 10వేల కిట్లు వచ్చాయని, వీటి విలువ రూ.30 నుంచి 40 లక్షల వరకు అవుతుందన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో పనిచేస్తున్న పలు రకాల కారి్మకులకు బియ్యం ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, మాస్‌్కలు, శానిటైజర్లను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం 53 మంది ఆశాకార్యకర్తలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ నివారణకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఎంపీ ద్వారా వచ్చిన కిట్లతోపాటు రూ.10లక్షలు తాను వెచ్చించి పది రోజులకు సరిపడ కూరగాయలను కూడా అన్ని ఇళ్లకు సరఫరా చేస్తానన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎన్.రాధ, డీఎస్పీ లోసారి సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు పాతకోట బంగారుమునిరెడ్డి, మురళీధర్‌రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, కేశవరెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
ఓతండ్రి కిరాతకం
-
వైఎస్సార్ జిల్లాలో విషాదం..
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపవరం మండలం శ్రీనివాసపురంలో జరిగింది. గ్రామానికి చెందిన బాలకొండయ్య, కుమార్తెలు భావన, శోభనలు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. చిన్న కొండయ్య భార్య గతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో.. ఇద్దరు కుమార్తెలతో కలిసి బాలకొండయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదం నెలకొంది. బావి నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
పచ్చ బినామీ
-
‘రాయలసీమలో జేసీ పుట్టడం దురదృష్టకరం’
సాక్షి, వైఎస్సార్ కడప: అనేక సంవత్సరాలుగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజధానులు ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల విషయంలో ప్రముఖ సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెప్పించుకున్నారని గుర్తు చేశారు. నివేదికలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. అప్పట్లోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని కమిటీల నివేదిక స్పష్టం చేశాయని అన్నారు. కానీ, గత టీడీపీ ప్రభుత్వంలో కమిటీల నివేదికను బుట్ట దాఖలు చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధి టీడీపీకి ఇష్టం లేదని అంజాద్ బాషా మండిపడ్డారు. ముందుగా టీడీపీ నేతలు వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గల్లీ నాయకుడి కన్నా హీనంగా తయారయ్యారని ఆయన దుయ్యబట్టారు. అమరావతి విషయంలో చంద్రబాబు తీరు దుర్మార్గమని అన్నారు. కమిటీల నివేదికను గౌరవిస్తూ సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అమరావతిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు సంతోషంగా మద్దతిస్తున్నారని తెలిపారు. పెద్దల సభ అంటే ప్రభుత్వ నిర్ణయాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. కానీ, మండలిలో బలం ఉందని.. ప్రభుత్వ బిల్లును అడ్డుకోవడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ నేతలు మండలిని వాడుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు అవసరం అయ్యే బిల్లులను అడ్డుకోవడమే పరమావధిగా టీడీపీ నేతలు తయారయ్యారని అంజాద్ బాషా మండిపడ్డారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లులపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని అంజాద్ బాషా అన్నారు. ఎన్పీఆర్ అనేది పదేళ్లకు ఒకసారి చేస్తారని చెప్పారు. గతంలో 2010లో చేశారని, మళ్లీ ఇప్పుడు చేస్తున్నారని గుర్తు చేశారు. 2019 ఆగస్టు 16న ఎన్పీఆర్పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్ఆర్సీపై ప్రధానంగా ముస్లిం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వెంటనే సీఎం వైఎస్ జగన్ ఈ బిల్లులకు పూర్తి వ్యతిరేకమని ఆయన బహిరంగంగా ప్రకటించారని అంజాద్ బాషా తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణపై రాయలసీమ వాసిగా స్వాగతిస్తున్నానని రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అమరావతి ప్రాంతాల రైతులే కావాలి, మిగతా జిల్లాల రైతులు అవసరం లేదనే ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీక్షల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీరు నిల్వ చేయలేకపోతున్నామంటే టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని అన్నారు. గతంలో హైకోర్టు బెంచ్ కావాలని రాయలసీమ లాయర్లు చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణను రాయలసీమ నేతలు అడ్డుకోవడం సిగ్గు చేటని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాంత ప్రజలు టీడీపీ నేతలను కచ్చితంగా అడ్డుకుంటారని హెచ్చరించారు. ఫ్యాక్షనిస్టులు, కడప రౌడీలు అని చంద్రబాబు అంటే.. ఎందుకు టీడీపీ నేతలు నోరు మెదపటంలేదని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 70 ఏళ్ల క్రితం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వందల ఏళ్లుగా రాయలసీమ ప్రాంత రైతులు, ప్రజలు అనేక విషయాల్లో త్యాగం చేశారని తెలిపారు. అమరావతి ప్రాంత రైతులకు ప్రజలు మెచ్చిన ప్యాకేజి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంత ప్రజలను రౌడీలు, గుండాలు అంటే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కుటుంబ కార్యక్రమం లాగా చేశావని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన ప్రశంసించారు. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని 13 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కల్లు తాగే, పొగరు వ్యక్తి జేసీ దివాకర్‌రెడ్డి రాయలసీమలో పుట్టి ఇక్కడి ప్రజలను అవమానరీతిలో మాట్లాడటం దారుణమని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమలో ఇలాంటి వారు పుట్టడం దురదృష్టకరమన్నారు. గత ఐదు ఏళ్ల టీడీపీ హయాంలో రాయలసీమకు ఏం చేసారో చంద్రబాబు స్పష్టం చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆగినట్టేనా..
సాక్షి, కడప: గండికోటలో అడ్వెంచర్స్ స్టోర్ట్సు అకాడమీ విషయంలో ముందడుగు పడలేదు. భవనం దాదాపు పూర్తయి మౌలిక సదుపాయాలు కలి్పంచే సమయానికి నిలిచిపోయింది. జాతీయ స్థాయిలో అద్బుతమైన, ఆదర్శవంతమైన అకాడమిగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం తర్వాత విస్మరించింది. అకాడమి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లాకు దేశం చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎక్కడో హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశీ్మర్ లాంటి ప్రాంతాలలో మాత్రమే ఒకటి, రెండు ఇలాంటి అకాడమిలు పర్వతారోహకులకు ట్రెక్కింగ్ శిక్షణ ఇస్తున్నాయి. కోటలో నేషనల్ అడ్వెంచరస్ అకాడమి పూర్తయితే ఈ ప్రాంతంలో నిత్యం పర్యాటకులు పర్వతారోహకుల సందడి ఉంటుందని జిల్లా వాసులు ఆనందించారు. వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. వాస్తవానికి ఈ అకాడమి పనిచేయడం మొదలైతే ఇక్కడ పర్వతారోహణతోపాటు పెన్నానది, మైలవరం జలాశయం నీటిలో జల సాహస కృత్యాలను కూడా నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. కోటలో విశాలమైన మైదానాలు ఉన్నాయి గనుక అక్కడ పారా గ్లైడింగ్ లాంటి ఆకాశయాన సాహస కృత్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుత కలెక్టర్ హరి కిరణ్ ఇటీవల గండికోటలో రెండు, మూడు రోజులపాటు పారా గ్లైడింగ్ను ఏర్పాటు చేశారు. మిగతా చోట ఉన్న ఒకటి, రెండు అకాడమిలలో పర్వతారోహణకు మాత్రమే అవకాశం ఉందని, గండికోటలో అకాడమి ఏర్పాటైతే మూడు రకాల సాహస కృత్యాలకు ప్రధాన వేదికగా మారే అవకాశం ఉందని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. అకాడమిలో ఈ క్రీడలకు సంబంధించి పలు ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆయా సాహస కృత్యాలలో శిక్షణ పొందేందుకు ఇక్కడికి వస్తారు గనుక మన ప్రాంతంలో సాహస క్రీడాకారుల సందడి పెరుగుతుంది. జిల్లాకు ఆర్థికంగా కూడా మేలు జరిగే అవకాశం ఉంది. అకాడమి భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు కూడా సాగినట్లు సమాచారం. జిల్లాపై అభిమానం గల కొందరు అధికారులు గట్టిగా ప్రయతి్నంచి దీన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ అడ్వెంచర్స్ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలని పర్యాటకులు కోరుతున్నారు. దేశ వ్యాప్త గుర్తింపు గండికోటలో నిర్మాణం ప్రారంభమైన నేషనల్ అడ్వెంచర్స్ అకాడమి ద్వారా జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. పర్వత, జల, వాయువు మూడు రకాల అడ్వెంచర్లకు అవకాశం గండికోటలో మాత్రమే ఉంటుంది. కనుక ఈ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే చేపడితే బాగుంటుంది. – కేవీ రమణారెడ్డి, రాయలసీమ పర్యాటక సంస్థ సీనియర్ సభ్యులు జిల్లాకు ప్రతిష్ఠ సాహస కృత్యాల అకాడమిలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. మన ప్రాంతాలలో బొత్తిగా లేవు. గండికోటలో ఈ అకాడమి నిర్మాణం పూర్తి చేయగలిగితే జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక రంగానికి పట్టం కట్టే దిశగా సాగతోంది గనుక ఈ అకాడమి నిర్వహణ ప్రభుత్వమే చేపడుతుందని భావిస్తున్నా! – పి.సంతోష్‌కుమార్, ఫ్యాకలీ్ట, వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం -
రాయచోటిపై సీఎం జగన్ వరాల జల్లు
-
కరువు సీమలో జలసిరులు!
‘రాయచోటి గురించి క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్పాలంటే.. తాగునీరు, సాగునీటి కోసం అల్లాడుతున్న నియోజకవర్గాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. రాయలసీమే వెనకకబడిన ప్రాంతమైతే అందులోనూ అత్యంత వెనకబాటుకు గురైన ప్రాంతం రాయచోటి. దివంగత వైఎస్సార్‌ను అత్యధికంగా ప్రేమించే ప్రాంతం కూడా ఇదే. వైఎస్సార్ ఈ ప్రాంత దుస్థితిని చూసి వెలిగల్లు రిజర్వాయర్ నిరి్మంచారు. రాయచోటిలో ఔటర్ రింగ్‌రోడ్డు కూడా తెచ్చారు. నాన్న చనిపోయిన తరువాత రాయచోటి గురించి పట్టించుకోవాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఒక్కరంటే ఒక్కరు కూడా లేని పరిస్థితిని పదేళ్లుగా చూస్తున్నాం. గత సర్కారు హయాంలో రాయచోటి అభివృద్ధి కోసం మున్సిపల్ చైర్ పర్సన్ నిధులు అడిగితే పార్టీ మారి తమ కండువా కప్పుకుంటే రూ.3 కోట్లు ఇస్తామని నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇవాళ అడక్కపోయినా ఆర్నెళ్లు తిరగక ముందే రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,000 కోట్లకు పైచిలుకు ఖర్చు పెడుతున్నామని సగర్వంగా చెబుతున్నా. మీ అందరి ఆశీర్వాదం, దేవుడి దయతో మన ప్రభుత్వం నేడు అధికారంలోకి వచి్చంది. మీ కష్టాలు తీర్చేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం’ ‘మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఇక్కడే.. ఇదే రాయచోటిలో ఎన్నికల వేళ నేను ఓ మాటిచ్చా. రాయచోటిలో ఎప్పటి నుంచో వక్ఫ్ బోర్డు, విద్యాశాఖ మధ్య వివాదం నెలకొన్న నాలుగు ఎకరాల స్థలాన్ని ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్ బోర్డుకు ఇస్తామని చెప్పాం. రేపటికల్లా ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని ఇదే వేదిక నుంచి చెబుతున్నా (ప్రజల హర్షధ్వానాలు). రాయచోటిలో జూనియర్ కాలేజీ, హైస్కూలు వినియోగించుకునే గ్రౌండ్‌ను అత్యాధునిక క్రీడా మైదానంగా రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తాం’ గత ప్రభుత్వం కాలువలను పట్టించుకోకపోవడం, సామర్థ్యాన్ని పెంచకపోవడం, సహాయ పునరావాసం డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు నీళ్లు ఉన్నా డ్యాముల్లో నింపలేని దుస్థితి రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఇక మార్చేస్తాం.– ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి కడప: సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు ప్రధాన కాలువలను విస్తరించి కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రూ.60,000 కోట్లు వెంచించి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు గోదావరి, కృష్ణా వరద జలాలను తరలించనున్నట్లు సీఎం ప్రకటించారు. మరో రూ.23 వేల కోట్లు ఖర్చు చేసి పోతిరెడ్డిపాడుతోపాటు కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, హంద్రీ–నీవా, అవుకు, గండికోట తదితర ప్రాజెక్టుల ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు. దీనివల్ల రాయచోటితోపాటు తంబళ్లపల్లి, పీలేరు, చిత్తూరు, మదనపల్లి, పలమనేరు, కుప్పం ప్రాంతాలకు మేలు జరుగుతుందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రూ.2 వేల కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. రిజర్వాయర్లున్నా నింపలేని దుస్థితి ‘‘రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో మనమంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ఏడాది శ్రీశైలంలో వరదలు వచ్చాయి. ఎనిమిది సార్లు గేట్లు ఎత్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 800 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇన్ని రోజులు కృష్ణా నది నిండుగా ప్రవహించినా రాయలసీమలోని ప్రాజెక్టులు మాత్రం నిండని పరిస్థితి కనిపిస్తోంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే గండికోట పూర్తి సామర్థ్యం 26 టీఎంసీలు కాగా ఇంత భారీ వర్షాలు, పైనుంచి నీళ్లు వచి్చనా కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం.చిత్రావతి కెపాసిటీ 10 టీఎంసీలు అయితే నింపగలిగింది కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే. 17.3 టీఎంసీల కెపాసిటీ కలిగిన బ్రహ్మంసాగర్‌లో కేవలం ఎనిమిది టీఎంసీలు మాత్రమే నింపగలిగే అధ్వానమైన పరిస్థితి. రిజర్వాయర్లు ఉన్నా నీటిని నింపుకోలేని దుస్థితిలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులున్నాయి. కాలువలు సరిగా లేకపోవడం, నీళ్లు పూర్తి స్థాయిలో తరలించే సామర్థ్యం లేకపోవడం, సహాయ, పునరావాసానికి డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈరోజు నీళ్లున్నా డ్యాముల్లో నింపుకోలేని పరిస్థితిలో రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కనిపిస్తున్నాయి. బహిరంగ సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం గతంలో చేపడితే దశ, దిశ మారేది మన ప్రభుత్వం వచ్చి కేవలం ఆర్నెళ్లే అయింది. ఆర్అండ్ఆర్ కింద బాధితులను తరలించాలంటే సర్వేలు జరగాలి, ఎస్టిమేట్లు తయారు కావాలి, ఇళ్ల స్థలాల కేటాయింపు జరగాలి, స్ట్రక్చరల్ ఇవాల్యూయేషన్ జరగాలి, పేమెంట్ ఫర్ రీ లొకేషన్ చేయాలి. ఇవన్నీ నిబంధనల ప్రకారం చేయాలంటే కనీసం ఎనిమిది నుంచి పది నెలలు పడుతుంది. ఈ పనులన్నీ కూడా గతంలో కనుక చేసి ఉంటే, కాస్తో కూస్తో డబ్బులు కనుక ఇచ్చి పనులు చేసి ఉంటే ఈపాటికి రాయలసీమలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపించేవి. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి కాలువల సామర్థ్యం పెంచి ఉంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో ప్రాజెక్టుల దశ, దిశ మారిపోయి ఉండేవి. సామర్థ్యం పెంచి వరదను సది్వనియోగం చేసుకుంటాం కృష్ణా నదికి వరదలు 40–50 రోజులకు మించని పరిస్థితి కనిపిస్తోంది. ఆ వరద వచి్చనప్పుడే రాయలసీమలోని ప్రతి డ్యామ్ నిండాలి, నెల్లూరు, ప్రకాశంలోనూ ప్రాజెక్టులు నిండాలి. దీనికోసం ఏం చేయాలనే ఆలోచన జరిగింది ఈ ఆర్నెళ్లలో. ఈ దిశగా ముందడుగు వేస్తూ వరద జలాలను సద్వినియోగం చేసుకుంటాం. ►పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ►తెలుగుగంగ సామర్థ్యం 11,500 క్యూసెక్కుల నుంచి 18,000 క్యూసెక్కులకు పెంచుతాం. ►కేసీ కెనాల్, నిప్పులవాగు కెపాసిటీని 12,500 క్యూసెక్కుల నుంచి 35,000 క్యూసెక్కులకు పెంచుతాం. ►ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి)ని 21,700 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతాం. ►హంద్రీ–నీవా కెపాసిటీని 6,000 క్యూసెక్కులు చేస్తాం. ►అవుకు నుంచి గండికోటకు 20,000 క్యూసెక్కుల నుంచి 30,000 క్యూసెక్కులకు పెంచుతున్నాం. ►గండికోట కాలువల సామర్థ్యాన్ని 4,000 నుంచి 6,000 క్యూసెక్కులకు పెంచుతాం. ► గండికోట నుంచి చిత్రావతికి తరలించే నీటిని 2,000 నుంచి 4,000 క్యూసెక్కులకు పెంచబోతున్నాం. ►గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు తరలించే జలాలను వెయ్యి క్యూసెక్కుల నుంచి 1,500 క్యూసెక్కుల దాకా పెంచబోతున్నాం. ►గండికోటకు దిగువన మరో 20 టీఎంసీలతో రిజర్వాయర్‌కు ప్రతిపాదనల తయారీ రైతుల కోసం ఎంత చేసినా తక్కువే.. కాలువల సామర్థ్యం పెంచే పనులకు రూ.23 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పినప్పుడు నేను అన్న మాట ఒక్కటే... ‘ప్రాజెక్టులు నిండాలి, రైతుల కోసం ఎంత చేసినా కూడా తక్కువే, యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయాలి’ అని ఆదేశించాం. ఎక్కడైతే మంచి మనసుంటుందో అక్కడ దేవుడి దయ ఉంటుంది, ప్రజల చల్లని దీవెనలు ఉంటాయి. మీ చల్లని దీవెనలతో, దేవుడి దయతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని వినయంగా తెలియజేస్తున్నా. జీఎన్ఎస్ఎస్ అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కడలిలో కలిసే నీటిని సీమకు తరలిస్తాం.. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో నీళ్లు రాని పరిస్థితి చూస్తున్నాం. కృష్ణా నది పరిస్థితి ఎలా ఉందో రోజూ చూస్తున్నాం. కృష్ణా నది నుంచి శ్రీశైలానికి వచ్చే నీటి ప్రవాహంపై 47 ఏళ్లుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రికార్డులు చూస్తే కేవలం 1,200 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఇక పదేళ్ల లెక్కలు చూస్తే 1,200 టీఎంసీల నుంచి 600 టీఎంసీలకు పడిపోయిన దుస్థితి. ఐదేళ్లకు సంబంధించిన రికార్డులు తిరగేస్తే 600 టీఎంసీల నుంచి 400 టీఎంసీలకే పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గోదావరి జలాలు 3,000 టీఎంసీలు సముద్రం పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కడలిలో కలిసి పోతున్న ఈ నీటిని రాయలసీమకు తరలించే కార్యక్రమం చేపట్టాం. బొల్లాపల్లి మీదుగా తరలించి గుంటూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేస్తాం. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాతోపాటు రాయలసీమలో ఇక కరువనేది ఎప్పుడూ రాకుండా చేసేందుకు గోదావరి జలాలను బొల్లాపల్లి నుంచి బనకచర్ల క్రాస్‌కు తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీనికోసం రూ. 60 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పారు. పోలీస్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమేరకు ప్రణాళిక రూపొందించి అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడుతున్నాడు మీ బిడ్డ. మీ అందరినీ నేను కోరేది ఒక్కటే. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి మీ బిడ్డ నడుం బిగించాడు. మీ బిడ్డకు మీ దీవెనలు కావాలి. మీ బిడ్డకు దేవుడి దగ్గర మీ ప్రార్థనలు కావాలి. మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో ఇవన్నీ గొప్పగా చేసి మళ్లీ మీ దగ్గరికి వచ్చి చెప్పే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నా’’ ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు అంజద్‌బాష, నారాయణస్వామి, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, అనిల్‌కుమార్ యాదవ్, చీప్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ద్వారకనాథరెడ్డి, మాజీ మేయర్ సురేబాబు, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. రాయచోటిపై సీఎం జగన్ వరాల జల్లు ►రూ.1,272 కోట్లతో జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల అనుసంధానానికి సీఎం జగన్ శంకుస్థాపన ►రూ.40 కోట్లతో ఝరికోన లిఫ్ట్ ►రూ. 86.50 కోట్లతో వెలిగల్లు లిఫ్ట్ ►రూ.15 కోట్లతో వెలిగల్లు కుడికాలువ లైనింగ్ ►రూ. 340.60 కోట్లతో రాయచోటి పట్టణ సుందరీకరణ, తాగునీటి సరఫరా ►రూ. 23 కోట్లతో రాయచోటి ఆస్పత్రి 50 నుంచి 100 పడకలకు విస్తరణ ►రూ. 10 కోట్లతో రాయచోటి స్కూలు భవన నిర్మాణం. ►రూ.11.55 కోట్లతో గ్రామ, వార్డు సచివాలయాల భవనాల నిర్మాణం ►రూ.15.52 కోట్లతో నియోజకవర్గంలో సీసీ రోడ్లు ►రూ.31.07 కోట్లతో సీసీ ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ ►రూ.4 కోట్లతో తాగునీటి పథకం ►రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు కాంప్లెక్స్ (బాలురకు) ►రూ.18 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు కాంప్లెక్స్ భవనం ►రాయచోటికి డీఎస్పీ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు కడపలో పోలీస్ కార్యాలయం ►రూ.20.95 కోట్లతో కడపలో జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణం ►రూ.1,272 కోట్లతో జీఎన్ఎస్ఎస్– హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల అనుసంధానానికి సీఎం జగన్ శంకుస్థాపన -
అడుగడుగునా అప్రమత్తం
సాక్షి, ప్రతినిధి కడప/సాక్షి కడప : జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడురోజుల పర్యటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన భద్రతకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ బహిరంగసభలతోపాట సీఎం పాల్గొనే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బహిరంగసభల వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి బహిరంగసభల వద్ద భారీగా పోలీసులను వినియోగిస్తున్నామన్నారు. బందోబస్తుకు 4000 మందిని వినియోగిస్తున్నామన్నారు.ఐదుగురు అడిషనల్ ఎస్పీలతోపాటు 30మంది డీఎస్పీలు విధుల్లో ఉంటారని తెలిపారు. కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. తొలిరోజు సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ వివరాలిలా... ►కడప–రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిర్మితమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. రిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ వైఎస్సార్ కేన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్సిట్యూట్ రూ.175 కోట్లతో ఏర్పాటు చేయనున్న డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌కు, రూ.25.85 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయానికి, ఎలీ్వప్రసాద్ ఐ ఇన్సిట్యూట్, దేవునికడప చెరువు అభివృద్ది పనులకు, రాజీవ్‌మార్గ్ రోడ్డు అభివృద్దికి, గూడూరు వద్ద ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్, పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టళ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ►కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత ఖర్చులతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ►జమ్మలమడుగుకు వెళ్లి సున్నపురాళ్లపల్లె వద్ద నిర్మిస్తున్న స్టీల్ కర్మాగారానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ►మధ్యాహ్నం మైదుకూరు నియోజకవర్గం నేలటూరు వద్ద కుందూ–తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి, రూ. 1357.10 కోట్లతో నిర్మించనున్న రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, రూ. 312 .30 కోట్లతో నిర్మించనున్న జోలదరాశి రిజర్వాయర్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారు. రూ. 7.50 కోట్లతో మైదుకూరు నియోజకవర్గంలో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనాలకు, రూ. 7.77 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, రూ.30.20 కోట్లతో నిర్మించనున్న సిమెంటురోడ్లు, డ్రైనేజీలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. దువ్వూరు మండలంలో గ్రామ సచివాలయ భవనాలకు, నేలటూరులో సీసీ రోడ్లకు, ఢ్రైనేజీలకు, బుక్కాయిపల్లె–నేలటూరు రోడ్డు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఆయన ఇడుపులపాయకు వెళతారు. -
దేవునికడప చెరువులో మహిళ ఆత్మహత్య
కడప అర్బన్ : కడపకు చెందిన ఓ మహిళ శనివారం అర్ధరాత్రి– ఆదివారం తెల్లవారుజామున మధ్య సమయంలో దేవుని కడప చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక కో ఆపరేటివ్ కాలనీలో ఆటోడ్రైవర్ రమేష్, నాగరత్న (34) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. శనివారం రాత్రి భార్య, భర్త గొడవపడి.. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులు పలు రకాలుగా తెలియజేస్తున్నారు. అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక భర్త, కుటుంబ సభ్యులతో గొడవపడి, వారి వేధింపులు తాళలేక ఈ చర్యలకు పాల్పడి ఉంటారా? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ సీఐ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. -
కడప జిల్లాలో సరైన వైద్యం అందక మహిళ మృతి
-
గండికోటలో నవజంట ఆత్మహత్యాయత్నం
-
కడపలో విజయలక్ష్మిగారిల్లు...
శరన్నవరాత్రులకు చాలామంది ఇళ్లలో అమ్మవార్లతో పాటు బొమ్మలు కూడా కొలువు తీరడం మామూలే. ఆ ‘బొమ్మల సభ’లోకి చుట్టుపక్కలవాళ్లకు, చుట్టాలకూ సాదర ఆహ్వానం ఉంటుంది. దేవుళ్లు, రాక్షసులు, వాగ్గేయకారులు, మహానాయకులు.. ఎందరెందరో సభలో కొలువై కనిపిస్తారు. జ్ఞానకాంతులను విరజిమ్ముతూ, జీవన వేదాలను సందేశపరిచే ఇలాంటి బొమ్మల కొలువులలో కడపలోని విజయలక్ష్మిగారింటి కొలువు గురించి మరీ మరీ చెప్పుకోవాలి. వీలు చేసుకుని చూసి రావాలి. కడప జిల్లా కడప పట్టణంలోని ప్రకాష్‌నగర్ క్లాసిక్ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు విజయలక్ష్మి. ఈ ఏడాది శరన్నవరాత్రులకు ఆమె తన ఇంట్లో తొమ్మిది మెట్ల మీద దేవతల బొమ్మల్ని కొలువుదీర్చారు. వాగ్గేయకారులనూ గళం విప్పించి కూర్చోబెట్టారు. ఒక మూల ‘వివాహ భోజనంబు’ అంటూ ఘటోత్కచుడు లడ్లు తింటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఏడుకొండలవాడు, గోశాల.. ఒకటేమిటి, ఒకరేమిటి! అనేక ఘట్టాలను, ఘటికులను సృష్టికి ప్రతి సృష్టి చేశారు విజయలక్ష్మి కృష్ణయ్యర్, ఆమె భర్త చంద్రశేఖరరావు. దసరా పండుగ అంటే వీరికి బొమ్మల ప్రతిష్ఠే. విజయలక్ష్మి ఎం.కామ్ చదివారు. ఇద్దరూ చరిత్రకారులు. పదకొండేళ్లుగా ఇంట్లో అందమైన బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. ‘‘చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ బొమ్మల కొలువు పెట్టేవారు. వివాహమైన కొన్ని సంవత్సరాల తరవాత కడపలో మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలనే ఆలోచన కలిగింది. వెంటనే బొమ్మలు సేకరించడం ప్రారంభించాను. కంచి, చెన్నై, మధురై ప్రాంతాల నుంచి చాలా బొమ్మలు తెప్పించాను’’ అంటూ తాను సేకరించిన బొమ్మల గురించి చెప్పారు విజయలక్ష్మి. యాత్రాస్థలాలకు వెళ్లినప్పుడు అక్కడ తన మనసుకి నచ్చిన బొమ్మలు తెచ్చుకోవటంతో పాటు.. బంధువులు, స్నేహితులు ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారితో కూడా బొమ్మలు తెప్పించుకునేవారు. అలా చాలా బొమ్మలు సమకూర్చుకోగలిగారు విజయలక్ష్మి దంపతులు. ‘‘బొమ్మల కొలువుకి అన్నీ మట్టితో చేసిన బొమ్మలే కొంటాను. ప్లాస్టిక్‌వి, ఫైబర్‌వి నాకు ఇష్టం లేదు’’ అని చెప్పారు విజయలక్ష్మి.విజయలక్ష్మి ఐదు వరుసలతో ప్రారంభించిన ఈ బొమ్మల కొలువు ఇప్పుడు తొమ్మిది వరుసలకు చేరింది. అరుణాచల గిరి ప్రదక్షిణ, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యభగవానుడు, రావణ దర్బారు, ఆంజనేయస్వామి తోక మీద కూర్చోవడం, స్తంభం పగల గొట్టుకుని వచ్చిన నరసింహావతారం, కామాక్షి వ్రతం చేసే మహిళలు, సత్యనారాయణ వ్రతం, పెళ్లి తంతుతో కూడిన బొమ్మలు, కృష్ణుడు గోపికలు, బృందావనం, గుహుడు... ఇలా రకరకాల బొమ్మలను కొని అమర్చారు విజయలక్ష్మి. ‘‘బొమ్మల కొలువు కేవలం కాలక్షేపం కోసం కాదు, ఇతరులకు విజ్ఞానాన్ని పంచడం కోసం కూడా. మా ఇంటికి వచ్చిన పిల్లలందరికీ ఈ బొమ్మలకు సంబంధించిన కథలు చెబుతాం. పిల్లలు ఆసక్తి చూపుతుండటంతో మాకు మరింత ఉత్సాహంగా ఉంటోంది. భావితరాలకు నాకు తోచినది చెప్పాలనేది కూడా నా ఆకాంక్ష’’ అన్నారు విజయలక్ష్మి. ‘‘ఈ పది రోజులు మా అపార్ట్మెంట్ అంతా సందడిసందడిగా ఉంటుంది. పిల్లలే కాకుండా పెద్ద వాళ్లు కూడా వస్తారు. ఉదయాన్నే ప్రసాదం చేసి ఇంటికి వచ్చినవారికి పెడతాను. సాయంత్రం వాయనాలు ఇస్తాను’’ అని ఆమె తెలిపారు. బొమ్మలను అందంగా అమర్చడం చాలా కష్టంతో కూడిన పని. అయితే అందరూ వచ్చి ప్రశంసిస్తూంటే కష్టం మరచిపోతామంటారు విజయలక్ష్మి. ‘‘పది రోజులు పూర్తయ్యాక బొమ్మలను తీసేటప్పుడు మనసుకి కష్టంగా ఉంటుంది. కాని తప్పదు కదా, బొమ్మలను తీసి ముందుగా పేపర్లో చుట్టి, ఆ పైన గడ్డితో చుట్టి, వాటిని అట్టపెట్టెలలో భద్రపరుస్తాం’’ అని ఆమె చెప్పారు. ‘మరపొచ్చి’ తప్పనిసరి తమిళనాడు సంప్రదాయం ప్రకారం అతిథులు ఒక కొత్త బొమ్మ తెచ్చి, బొమ్మల కొలువు పెట్టిన వారికి ఇస్తారు. అలా ఇంట్లో బొమ్మల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇక్కడ అటువంటి సంప్రదాయం లేదు. అన్నీ నేను కొన్న బొమ్మలే. అరేంజ్మెంట్ ప్రతి సంవత్సరం మారుస్తాను. ‘మరపాచ్చి’ అని చెక్క బొమ్మలు ఉంటాయి. అవి బొమ్మల కొలువులో తప్పనిసరి. ఈ బొమ్మలను పది రోజులు ఉంచి పదకొండో నాడు తీసేస్తాం. నవమి రోజున బొమ్మలను పడుకోబెడతాం. విజయదశమి రోజున నిలబెట్టి, ఆ మరుసటి రోజున తీసేస్తాం. బొమ్మల కొలువు తత్త్వగుణానికి ప్రతీక.– విజయలక్ష్మి – వైజయంతి పురాణపండ -
సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, కడప : సార్వత్రిక ఎన్నికల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను నిర్వహించనున్నామని కలెక్టర్ హరి కిరణ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 8వ తేది వరకు జరిగే ఈ పరీక్షల కోసం 419 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1,44,337 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. మొదటిరోజు 1,03,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. అధికారుల నియామకం పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏడు వేల మంది సిబ్బందిని నియమించామని కలెక్టరు తెలిపారు. పరీక్షా హాలులో వీడియోగ్రాఫర్లు ఉంటారన్నారు. 1141 మంది వీడియో గ్రాఫర్లను నియమించాలన్నారు. మహిళా అభ్యర్థుల తనిఖీకి అంగన్వాడీ వర్కర్లను నియమించామన్నారు. అంధులు, రెండు చేతులు లేని వాళ్ల కోసం 86 మంది స్క్రైబ్స్‌ను నియమించామన్నారు. పదవ తరగతి పాసైన వారిని ఇందుకోసం వినియోగిస్తున్నామన్నారు. ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలను జిల్లా ట్రెజరీలో భద్రపరిచామన్నారు. శనివారం వీటిని సంబంధిత పోలీసుస్టేషన్లకు పంపుతున్నామన్నారు. పోలీసుస్టేషన్లో డబల్ లాక్ గదిలో వీటిని భద్రపరుస్తామన్నారు. ఒక తాళం చెవి తహసీల్దార్ వద్ద, మరొకటి ఎస్ఐ వద్ద ఉంటుందన్నారు. పోలీసుస్టేషన్లో సీసీ కెమెరాలను అమర్చారని తెలిపారు. వీటిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం 08562–244070 లేదా 244437 నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. విధి నిర్వహణలో అధికారులకు ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూముకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఉదయానికి ఓఎంఆర్ షీట్లు చేరవేత సెప్టెంబరు 1వ తేది ఉదయం 6.00 గంటలకు ఓపెన్‌చేసి ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాలను గట్టి బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు పంపుతామని హరికిరణ్ చెప్పారు. ఓఎంఆర్ షీట్లో బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నతోనే రాయాల్సి ఉంటుందన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత అధికారులు ఓఎంఆర్ షీట్ తీసుకుని అభ్యర్థికి కార్బన్ షీట్ ఇస్తారన్నారు. కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఆ తర్వాత ఫైనల్ కీ, ఫలితాలు విడుదల అవుతాయని తెలిపారు. ఈ పరీక్షలో ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చే మధ్యవర్తుల మాటలను నమ్మవద్దన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కలెక్టరేట్లోని హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేసి తెలుపాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్వా్కడ్స్‌ను ఏర్పాటు చేశామని, అభ్యర్థులెవరూ మాల్ ప్రాక్టిసెస్‌కు పాల్పడరాదన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్లను జిల్లా పరిషత్‌లోని రిస్పెన్షన్ సెంటర్‌కు తీసుకు వస్తామన్నారు. ఏరోజుకు ఆరోజు వాటిని డీజీటీ వాహనాల్లో విజయవాడకు తరలిస్తామన్నారు. అభ్యర్థులకు సూచన పరీక్ష ప్రారంభానికి గంట ముందే అభ్యర్థులు తమతమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ 340 ప్రత్యేక బస్సులను నడుపుతోందన్నారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెస్ తీసుకు రాకూడదన్నారు. బాల్ పెన్ను, హాల్ టిక్కెట్, ఏదో ఒక ఐడీ ప్రూఫ్, ఒక రైటింగ్ ప్యాడ్ మాత్రమే తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ గౌతమి, రెండవ జేసీ శివారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, డీఆర్వో రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షల్లో జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి సచివాలయ పరీక్షల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హరి కిరణ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సభా భవనం, మీ కోసం హాలులో పరీక్షలకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్లు, సెంటర్ స్పెషల్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఇతరుల సహాయంతో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం పదవ తరగతి ఉత్తీర్ణులైన వారినే సహాయకులుగా నియమించాలన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే అభ్యర్థులు పేర్కొని ఉండాలన్నారు. అలాంటి వారికే స్క్రైబ్స్ ఇవ్వాలన్నారు. ఎక్కడైనా వీడియోగ్రాఫర్ల సమస్య ఎదురైతే పరీక్షల ప్రారంభానికి ముందే జాయింట్ కలెక్టర్ గౌతమితో సంప్రదించాలన్నారు. ఓఎంఆర్ షీట్లతోపాటు నామినల్ రోల్స్ పంపుతామన్నారు. ప్రతి కేంద్రానికి ఇన్విజిలేటర్లు, హాలు సూపరింటెండెంట్లు 20 శాతం అదనంగా కేటాయించామన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసి రిసెప్షన్ సెంటర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల(సెప్టెంబర్) ఒకటో తేదీన నిర్వహించే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 రాత పరీక్ష కీలకం కానుంది. నాలుగు పోస్టులకు గాను ఒకటే పరీక్ష కావడంతో.. ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ డిగ్రీ అర్హత కావడం కూడా ఎక్కువ దరఖాస్తులు రావడానికి మరో కారణమని చెప్పవచ్చు. కేటగిరీ–1లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీస్, సంక్షేమ కార్యదర్శి, వార్డు పరిపాలన కార్యదర్శి పోస్టులకు 70 వేలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చిన్న పాటి మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో వారి సౌలభ్యం కోసం వెబ్సైట్లో నో యువర్ వెన్యూ పేరిట ఒక ఆప్షన్ ఏర్పాటు చేశారు. నో యువర్ వెన్యూను క్లిక్ చేయగానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో జిల్లాను సెలక్షన్లో కడపను ఎంచుకోవాలి. అప్పుడు జిల్లాలోని పరీక్షా కేంద్రాల కోడ్లు వస్తాయి. హాల్‌టికెట్‌లో ఉన్న వెన్యూ కోడ్‌ను ఎంపిక చేయగానే క్లిక్ చేయాలి అక్షాంశాలు, రేఖాంశాలతోపాటు పరీక్షా కేంద్రం ఫొటో వస్తుంది. దీంతోపాటు ఊరు, పరీక్షా కేంద్రం చిరునామా(అడ్రస్) కూడా చూడవచ్చు. అదే విండోలో చివరన క్లిక్ హియర్ అనే అప్షన్, పక్కనే వెన్యూ లొకోషన్ ఇన్ గూగూల్ మ్యాప్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే కొత్త విండోలో మ్యాప్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ ఉన్న అభ్యర్థులు లొకేషన్‌ను చూసుకుని డైరెక్షన్స్‌ను సెట్ చేసుకుని కేంద్రాలకు వెళ్లవచ్చు. మ్యాప్‌ను సైతం ఇతర ఫోన్ నంబరు, మెయిల్‌కు కూడా పంపుకునే అవకాశం కల్పించారు. గూగుల్ మ్యాప్స్‌తో సులువుగా కేంద్రాన్ని చేరుకునేలా ఈ ఏర్పాటు చేశారు. సూచనలు పరీక్షా రాసే అభ్యర్థులు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. పరీక్షలు రోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2.30కు ప్రారంభం అవుతాయి. అభ్యర్థి కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరితే మంచిది. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9.30, మధ్యాహ్నం 2 గంటల తరువాత మాత్రమే అభ్యర్థులు ప్రవేశించేందుకు అధికారులు అవకాశం కల్పిస్తారు. ఉదయం 10, మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించరు. హాల్‌టికెట్‌తోపాటు కనీసం ఒక ఫొటో ఐడెంటిటీ కార్డును వెంట తెచ్చుకోవాలి. పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగైతే గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లను గుర్తింపు కార్డుగా తెచ్చుకోవచ్చు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోతే అటువంటి అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి తెచ్చుకుని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తెచ్చుకోకూడదు. మొబైల్/సెల్‌ఫోన్, కాలిక్యులేటర్స్, ట్యాట్స్, బ్లూటూత్, పేజర్స్ వంటి పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. ప్రశ్నాపత్రాన్ని తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు. పరీక్షా పత్రాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. తదుపరి సరైన సమాధానాన్ని ఎంచుకుని ఓఎమ్మార్ షీట్లో బబుల్ చేయాలి. ఇందుకోసం బాల్ పాయింట్ పెన్ బ్లూ/బ్లాక్ మాత్రమే వినియోగించాలి. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్ పెన్ వినియోగిస్తే జవాబుపత్రాన్ని ఇన్వ్యాలిగ్గా పరిగణిస్తారు. ఓఎమ్మార్ షీట్లో వైటనర్, ఇతర మార్కర్లను వినియోగిస్తే డిస్‌క్యాలిఫై చేస్తారు. ఓఎమ్మార్ షీట్లు రెండు ఉంటాయి. పై షీట్లో జవాబులను నమోదు చేయాలి. రెండో షీట్‌ను పరీక్ష అనంతరం అభ్యర్థి తెచ్చుకోవచ్చు. తమ సమాధానాలను చూసుకునే అవకాశం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. మరిన్ని వివరాల కోసం గ్రామసచివాలయం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. నెగిటివ్ మార్కులున్నాయ్.. జాగ్రత్త ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగిటివ్ మార్కుల పద్ధతి పెట్టారు. సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు. అదే తప్పుగా సమాధానం రాస్తే 0.25 (1/4) మార్కును ఫెనాల్టీగా వేస్తారు. హాల్‌టికెట్ల వివరాలు ఇలా... ఈ నెల 24 నుంచే కేటగిరి–1 పరీక్షకు సంబంధించిన హాల్‌టకెట్లను వెబ్సైట్లో ఉంచారు. అభ్యర్థులు పుట్టిన రోజుతోపాటు దరఖాస్తు సమయంలో వచ్చిన ఒన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నంబరు (ఓటీపీఆర్), దరఖాస్తు ఐడీ, ఆధార్ నంబర్లలో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి పొందవచ్చు. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 134 బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ఇందులో కడప డిపో నుంచి 16, బద్వేలు 13, రాయచోటి 25, రాజంపేట 18, జమ్మలమడుగు 15, మైదుకూరు 14, ప్రొద్దుటూరు 17, పులివెందుల డిపో నుంచి 13 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. దీంతో పాటు అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ హెల్ప్లైన్లను సైతం నిర్వహిస్తోంది. సెప్టెంబరు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభమవుతాయి. -
సచివాలయ అభ్యర్థులకు మరో హెల్ప్‌డెస్క్
సాక్షి, కడప : గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలు రాసే అభ్యర్థులకు సహాయకారిగా సోమవారం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ, హెల్ప్‌డెస్క్ నెంబర్లకు అదనంగా మరో ఫోన్ నెంబరును ఏర్పాటు చేశామని కలెక్టర్ హరి కిరణ్ తెలిపారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల నియామక పరీక్ష రాసే అభ్యరులు హాల్ టిక్కెట్, పరీక్షా కేంద్రాలు, ఇతరత్రా సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబరు 1077 ఏర్పాటు చేశామన్నారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ లేదా బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ నుంచి మాత్రమే టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇది కాకుండా ల్యాండ్ ఫోన్ నెంబర్లు 08562–255572, 08562–246344లను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 27వ తేదినుంచి సెప్టెంబరు 8వ తేది వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌డెస్క్ నెంబర్లు పనిచేస్తాయన్నారు. -
కొండను తొలిచి.. దారిగా మలిచి
సాక్షి, రాజంపేట: కొండ కోనల్లో, గుహల్లో రైలు ప్రయాణం మరుపురాని అనుభూతి. ఈ మధ్యే అతిపెద్ద రైల్వే టన్నెల్‌ను కశ్మీర్లో ప్రారంభించారు. అలాంటి సాంకేతిక అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లోనూ సాకారమైంది. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్ మార్గంలోని వెలుగొండ అడవుల్లో 7.560 కిలోమీటర్ల పొడవు తో దీనిని నిర్మించారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్‌తో సాంకేతిక పనులు శరవేగంతో పూర్తి చేశారు. టన్నెల్లో నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లా నుంచి రాజధానికి రెండో రైలుమార్గంగా ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్ ఆవిష్కృతమైంది. వెలుగొండ అడవుల్లో నెల్లూరు–వైఎస్సార్ జిల్లా సరిహద్దులో ఉన్న కొండల్లో నిర్మితమై అందుబాటులోకి వచ్చిన టన్నెల్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం పరిశీలించనున్నారు. టన్నెల్ నిర్మాణం ఇలా... వెంకటాచలం–ఓబులవారిపల్లె మార్గంలో 7,560 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్) ఉంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కొండలను తొలిచి దారిగా మలిచారు. మొదటిది 6.600 కిలోమీటర్లు. ఆపై కొంత మైదానప్రాంతం వస్తుంది. వెంటనే 0.960 కి.మీ పొడవున మరో టన్నెల్ ఉంటుంది. ఎత్తు 8 , వెడల్పు 7 మీటర్ల చొప్పున ఆధునిక యంత్రాలతో పనులు సాగుతున్నాయి. రూ.4 కోట్లు విలువచేసే యంత్రం ద్వారా కొండను తొలగించారు. 2006లో అప్పటి రైల్వేమంత్రి నితీశ్‌కుమార్ ద్వారా ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్‌కు పచ్చజెండా ఊపారు. నూతన రైలుమార్గంలో చెర్లొపల్లె సమీపంలోని పెనుశిల అభయారణ్యంలో రూ.470 కోట్ల వ్యయంతో టన్నెల్ అందుబాటులోకి వచ్చింది. కృష్ణపట్నం రైల్వేలైనులో అంతర్భాగమైన టన్నల్‌లో కిలోమీటర్‌కు రూ.47కోట్లు వ్యయం చేశారు. మొదటి,రెండో టన్నెళ్లు పూర్తయ్యాయి.కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌కు ఇప్పటి వరకు రూ.1186కోట్లు ఖర్చు చేశారు. ఉపరాష్ట్రపతి మానసపుత్రిక ఈలైను.. ఉపరాష్ట్రపతి మానసపుత్రికైన ఈ రైల్వేలైన్‌ను శనివారం పరిశీలించనున్నారు. ఎన్డీఏ హయాంలో దీని మంజూరుకు తన హోదాలో కృషిచేశారు. దీనివల్ల గుంతకల్ డివిజన్ నుంచి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఓబులవారిపల్లె– రేణిగుంట–గుడూరు సెక్షన్లో రద్దీకూడా తగ్గనుంది. 2005–2006లో ఈ ప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఏపీలోని నెల్లూరు, కడప జిల్లాల మధ్య సాగుతోంది. నేడు చెర్లోపల్లికి ఉపరాష్ట్రపతి రాక చిట్వేలి: ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయడు శనివారం జిల్లాకు రానున్నారు. చిట్వేలి మండలం చెర్లోపల్లె గ్రామం వద్ద రైల్వే సొరంగ మార్గాన్ని ఆయన అధికారికంగా పరిశీలించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం నుం చి ఉపరాష్ప్రపతి రెండు భోగీల రైలులో సాయంత్రం 4 గంటల సమయంలో చెర్లోపల్లెకు చేరుకుంటారు. 15 నిమిషాల పాటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత వేంకటాచలానికి పయనమవుతారని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైల్వేపరంగా ప్రారంభానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయని రైల్వే ప్రాజెక్టు డైరెక్టర్ వాసుదేవ్ వివరించారు. -
పోటెత్తిన కుందూనది
సాక్షి, చాపాడు: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుందూనదిలో వరద నీరు పోటెత్తతోంది. మన జిల్లాతో పాటు కర్నూలులోనూ జోరుగా వర్షాలు పడుతుంటంతో వరదనీరు ఎక్కువగా చేరుతోంది. గురువారం 24 వేల క్యూసెక్కులతో ప్రవహించిన కుందూనదిలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 33,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో చాపాడు మండలంలోని అన్నవరం, సీతారామాపురం గ్రామాల వద్ద వంతెనలు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. ఫలితంగా అన్నవరం–మడూరు, సీతారామాపురం–అల్లాడుపల్లె దేవళాలు ప్రాంతాలకు రాకపోకలు నిలి చిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడేకొద్దీ వరద పెరిగే అవకాశం ఉందని కేసీ కెనాల్ డీఈఈ బ్రహ్మారెడ్డి తెలిపారు. అన్నవరం, సీతారామాపురం గ్రామాల వంతెన వద్ద ఎలాం టి ప్రమాదం జరగకుండా వీఆర్ఏలను కాపలాపెట్టినట్లు తహసీల్దారు శ్రీహరి తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా సిద్దవటం: భారీ వర్షాలకు నదీ పరివాహకప్రాంతాల నుంచి నీటికి కుందూ వరద ఉధృతి తోడవడంతో శుక్రవారం సిద్దవటం వద్ద పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. గురువారం సాయంత్రం వరకు పాత బ్రిడ్జిపై అంతంత మాత్రంగా నీరు ప్రవహించింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గురువారం రాత్రి నుంచి పాత బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ముందస్తుగా పెన్నా నది హైవే వంతెనపై పోలీసు బందో బస్తును ఏర్పాటుచేశారు. బుగ్గవంక జోరు చింతకొమ్మదిన్నె : కడప నగరానికి సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టు ప్రమాదపుటంచున ఉంది. ప్రాజెక్టు చుట్టూ ఉన్న కట్టలు దెబ్బతిన్నాయి. కట్ట చుట్టూ సిమెంట్ లేక మట్టితేలి ప్రమాదకరంగా మారింది. ప్రస్తుత వర్షాలకు కొండ ప్రాంత వరదనీరు జతకలిసింది. దీంతో ఉధృతంగా నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లలో మూడు చోట్ల రంధ్రాల నుంచి నీరు బయటకు వస్తోంది. ప్రాజెక్టుపైనున్న తాపలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలాకాలంగా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టలేదు. 4 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు నిండటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ మంత్రులు నీటిని విడుదల చేశారు. అప్పటికే ప్రాజెక్టు అధ్వాన్న స్థ్దితికి చేరింది. ఈ విషయాన్ని అప్పటి మంత్రులు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం బుగ్గవంక ప్రాజెక్టు సుందరీకణకు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. కొద్ది రోజల క్రితం నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు. వర్షాల దెబ్బకు పనులలో జాప్యం జరుగుతుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3500 ఎకరాలకు సాగు నీరు, జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీరు అందుతుంది. 2001లో ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యంతో కడప నగరం జలమయమైన వైనాన్ని ప్రజలు ఇప్పటికీ మరువలేదు. బుగ్గవంక ప్రాజెక్టు గేట్ల వద్ద నుండి లీకవుతున్న నీరు ప్రాజెక్టు కట్ట కుంగింది.. బుగ్గవంక ప్రాజెక్టుపైన ఉన్న కట్టపై భూమి కొంత మేర కుంగింది. ఈ ప్రాంతంలో అధికారులు మరమ్మతులు చేయించకుండా రాళ్లను అడ్డుగా వేశారు. ఇప్పటికే మండలంలోని పలుప్రాంతాలలో భూమి కుంగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. – గూడా రాజ శేఖర్ రెడ్డి, రైతు,నాగిరెడ్డిపల్లి, చింతకొమ్మదిన్నె. రాళ్లు తేలి ఉన్నాయి.. ప్రాజెక్టుకు చుట్టూ ఉన్న రాళ్లు పైకి తేలి ఉన్నాయి. కట్టపై ఎలాంటి ఒత్తిడి జరిగినా ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయమేస్తున్నది. వర్షాలు మరింత పెరిగితే ప్రాజెక్టులో నీరు అధికం అవుతుంది. ప్రమాదాలు సంభవించక ముందే అధికారులు చర్యలు తీసుకుంటే మంచిది. – ఇనుకోలు బాలశివయ్య, రైతు, బయనపల్లి, చింతకొమ్మదిన్నె. -
కుందూ నది పరవళ్లు
సాక్షి, జమ్మలమడుగు : పెద్దముడియం మండలంలో కుందూ నది పరవళ్లు తొక్కుతోంది. నాలుగు రోజుల నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పరివాహక గ్రామాలలో పంటలను ముంచెత్తుతోంది. ప్రస్తుతం కుందూలో 16వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నాగరాజుపల్లి, పాలూరు, పెద్దముడియం, చిన్నముడియం, గరిశలూరు, నెమళ్లదిన్నె, బలపనగూడురు ప్రాంతాల ప్రజలు నది ఉధృతిపై ఆందోళన చెందుతున్నారు. పైన విపరీతమైన వర్షాలు కురవడంతో కృష్ణ, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా కుందూ ప్రవాహం కూడా పెరిగిపోయింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నెమళ్లదిన్నె బ్రిడ్జిపై రెండు అడుగుల ఎత్తు మేర నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దముడియం బ్రిడ్జి దిగువ వరకు నీరు ప్రవహిస్తుంది. కుందూ నీటి ఉధృతి గురించి ఎమ్మెల్యే డాక్టర్‌మూలే సుధీర్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సోమవారం ఆయన నెమళ్లదిన్నె ప్రాంతాలలో పర్యటించారు. నీట మునిగిన పత్తి, వరి పంటలను పరిశీలించారు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సహాయ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు సూచనలిచ్చారు. సీతారామాపురం వద్ద చాపాడు: కుందూనది ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా మంగళ, బుధవారాల్లో కురిసే వర్షాలతో ఉధృతి మరింత పెరగనుంది. ఇప్పటికే మండలంలోని సీతారామాపురం వద్ద గల కుందూనది వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. కుందూ పరివాహక రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుందూనదికి రోజు రోజుకు వరద నీరు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మైదుకూరు నియోజకవర్గంలోని రైతాంగం వ్యవసాయ పనుల్లో నిగ్నమైంది. -
తండ్రిని మించిన తనయుడు జగన్
సాక్షి, ప్రొద్దుటూరు : పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన తనయుడు అవుతాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. పెన్నానది తీరాన ఉన్న రెడ్ల కల్యాణ మండపంలో పట్టణ రెడ్డి సేవా సంఘం, రెడ్ల వనభోజన సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మూలె సుధీర్‌రెడ్డిలను సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 11వేల క్యూసెక్కులు మాత్రమే వస్తుండటంతో జిల్లాలోని గండికోట, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులకు నీరు నింపాలంటే కష్టంగా ఉండేదన్నారు. వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 11వేల నుంచి 44వేల క్యూసెక్కులకు విస్తరించారని.. ఈ కారణంగా ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో వర్షాలు పడుతుండటంతో ఇదే సమయంలోనే రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరు విడుదల చేస్తున్నారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబు లెన్స్ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కేవలం ఇచ్చిన మాటపై నిలబడినందుకుగాను వైఎస్ జగన్ ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. వైఎస్ఆర్ మరణించిన సందర్భంలో ఓదార్పు యాత్ర చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించినందుకు సోనియ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం చేసిన జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఆదరించి అధికారంలోకి తెచ్చారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి, ప్రొద్దుటూరు రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి, కార్యదర్శి కుడుముల ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ వైవీ రామమునిరెడ్డి, రెడ్ల వనభోజన సమితి అధ్యక్షుడు ఆవుల లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు. బాబు హయంలో సీమకు అన్యాయం.. చంద్రబాబు హయాంలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. అందువల్లే ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పారన్నారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాల్లో 49 సీట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయని తెలిపారు. వైఎస్సార్ జిల్లా, కర్నూలు జిల్లాలో పార్టీ అన్ని సీట్లు గెలుచుకోగా చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఆయన స్థానం మినహా 13 స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకోగా అనంతపురంలో రెండు స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కాయన్నారు. రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులను నిర్మించాలని డిమాండ్ చేసినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. నమ్మకాన్ని కాపాడుకుంటా.. మాటకు కట్టుబడి తనకు చెప్పిన ప్రకారం టికెట్ ఇచ్చారని జమ్మలమడుగు ఎమ్మె ల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి తెలిపారు. ఇద్దరు టీడీపీ కీలక నేతలు ఏకమైనా ఓడించి 51వేల మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారన్నారు. ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటానని చెప్పారు. రెడ్ల కల్యాణ మండపం నిర్వహణకు సంబంధించి సీఎం రమేశ్ ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ప్రజల ఓట్లతో లీడర్‌ను అయ్యానని, వారికి సేవ చేస్తానని పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధం.. రెడ్ల చరిత్ర ఎంతో గొప్పదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తాను రైతు బిడ్డగా, రెడ్డి బిడ్డగా ఈ సభకు హాజరయ్యానన్నారు. రెడ్డి సామాజి క వర్గానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వేమారెడ్డి.. ఇలా ఎంతో మంది ఆదర్శనీయులున్నారన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకునేందుకు రెడ్డి సేవా సంఘం తరపున విరాళాలు సేకరించి వడ్డీలేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు తాను ముందు వరుసలో ఉంటానని చెప్పారు. రెడ్ల కల్యాణ మండపానికి నాయుడులు కొన్ని ఇబ్బందులు కలుగజేయగా పరిష్కరిస్తామని అప్ప టి మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారన్నారు. తర్వాత ఆ హామీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కల్యాణ మండపం నిర్వహణకు ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి అనుమతులు తెస్తామన్నారు. -
కొడుకు వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు..
సాక్షి, వైఎస్సార్ కడప : జిల్లాలోని బద్వేలులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడికి వైద్యం చేయించేందుకు వచ్చిన ఓ తల్లి అనూహ్యరీతిలో ప్రాణాలు విడిచారు. కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటడంతో వెంకటదేవి అనే మహిళ అతన్ని తీసుకుని బద్వేలులోని సుమిత్రానగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడిక్కడే ఆమె కుప్పకూలిపోయారు. వెంకటదేవి మరణించినట్టు వైద్యులు తెలిపారు. -
గుహలోకి వెళ్లి తల్లి, కొడుకు మృతి
సాక్షి, పెండ్లిమర్రి: మండలంలోని యాదవాపురం గ్రామానికి చెందిన మల్లమ్మ(50), లక్షుమయ్య(22) పిట్టల ఎరువు కొసం గుహలోకి వెళ్లి ఊపిరాడక మంగళవారం మృతి చెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. యాదవాపురం గ్రామంలో ఉన్న యానాదులు మల్లమ్మ, లక్షుమయ్య పెద్దదాసరిపల్లె గ్రామ పొలాల్లోని బోడబండ గుట్టలల్లో ఉన్న గుహలోకి వెళ్లారు.ఎంతసేపటికి వీరు రాకపోడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. రాత్రి కావడంతో మృతదేహాలను వెలికి తీయలేదు. -
సమస్య ఏదైనా కాల్ చేయండి..!
సాక్షి, కడప: 99480 20786 ఈ మోబైల్ నెంబర్ సాధాసీదా నెంబర్ కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీసంక్షేమశాఖ మంత్రి ఎస్.బి. అంజద్బాషాది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల నెంబర్లు తెలుసుకోవడమంటే కాస్త కష్టమే. ఒకవేళ తెలిసినా.. వారు పనిచేయని, లిఫ్ట్ చేయని నెంబర్ ఇవ్వడం చాలా మందికి అనుభవమే. అయితే వీరిందరికీ భిన్నంగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, ఇందుకోసం తామంతా అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉంటామంటూ.. సిసలైన ప్రజాప్రతినిధి అనిపించారు.. ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్‌బాషా. గురువారం కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఆకస్మిక తనిఖీకి వచ్చిన ఆయన విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు సమస్యలను తెలిపారు. దీంతో పాటు మరికొన్ని సమస్యలున్నాయంటూ చెప్పేందుకు విద్యార్థినులు సంశయించగా, వెంటనే ఆయన స్పందించి నా మొబైల్ నెంబర్ 99480 20786.. ఏ సమస్య ఉన్నా నేరుగా నాతోనే చెప్పండి అంటూ రెండుసార్లు నెంబర్ చెప్పి అందరూ నోట్ చేసుకున్న తర్వాత కార్యక్రమం కొనసాగించారు. దీంతో విద్యార్థినులందరూ జగనన్న ప్రభుత్వంలో మంత్రులు ఇంత పారదర్శకంగా ప్రజలకోసం పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందంటూ జయజయధ్వానాలతో సంతోషం వ్యక్తం చేశారు. -
విషయాన్ని గోప్యంగా ఉంచి ఏకంగా మృతదేహంతో..
సాక్షి, కడప: కూలీ పనుల కోసం కొంతకాలం క్రిందట మహారాష్ట్రకు వెళ్ళిన యువకుడు అక్కడే మృతి చెందాడు. మృతి చెందిన విషయం గోప్యంగా ఉంచిన కాంట్రాక్టర్ – మేస్రీలు, మృతుడి కుటుంబీకులకు ఎటువంటి సమాచారం లేకుండా అంబులెన్సులో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గోపవరం మండలం బేతాయపల్లెకు చెందిన తిరుపాల్ అనే వ్యక్తి మహరాష్ట్రలోని బదనాపూర్లో కూలీ పనికని వెళ్లి మృతి చెందాడు. తిరుపాల్ మృతి చెందిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలపకుండా ఒక్కసారిగా మృతదేహాన్ని తీసుకురావడంతో బంధువులు ఉలిక్కిపడ్డారు. తిరుపాల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతుడి బందువులు, తమకు న్యాయం చేయాలంటూ బద్వేల్ నాలుగు రోడ్లు సర్కిల్లో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరువర్గాలు మృతదేహంతో పోలీసులను ఆశ్రయించారు. -
యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!
సాక్షి, కడప: సాహసోపేతంగా యువకుడిని కాపాడిన రిమ్స్ ఎస్సైను జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అభినందించారు. రెండు రోజుల క్రితం పాలకొండలో తేనెటీగల దాడిలో గాయపడిన యువకుడ్ని తన భుజంపై మోసుకుని కొండ కిందకు రిమ్స్ ఎస్సై తెచ్చిన విషయం విధితమే. ఎస్సై సమయస్పూర్తితో వ్యవహరించిన కారణంగా తేనేటీగల బారిన పడిన యువకుడు ప్రాణాలతో బయట పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా రిమ్స్ ఎస్సై, సిబ్బందికి రివార్డు అందజేశారు. -
మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్ మహంతి
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ చెబుతున్నారు. ఉన్నతాధికారులకూ ఇదే ఆయన తలపోస్తున్నారు. జిల్లాలో తన నేతృత్వంలోని పోలీసు శాఖను ఈ దిశగా తొలుత ప్రక్షాళన చేయాలని జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందుకోసం ఆయన ముందు శాఖలోని ఇంటి దొంగల పని పట్టాలని యోచిస్తున్నారు. అలాంటి వారి జాబితా ఇప్పటికే ఎస్పీ వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసు శాఖపై నమ్మకం సడలేలా వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టాలని ఎస్పీ చర్యలకు దిగడంతో చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిషేధిత గుట్కా రవాణాలోనూ కొందరు పోలీసుల పాత్ర ఉందని ఎస్పీ భావిస్తున్నారు. బెంగళూరు నుంచి జిల్లాకు గుట్కా అక్రమరవాణా అవుతోంది. ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా తరలించి విక్రయిస్తున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమరవాణాను అరికట్టాల్సిన పోలీసులే సహకరించడంపై సర్వత్రా విమర్శలున్నాయి. సాక్షి ప్రతినిధి,కడప: పోలీసు శాఖలో అక్రమార్కుల.. అసాంఘిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పలువురు అధికారులు,పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి గట్టి సంకల్పంతో ఉన్నారు. పై నుంచి కింది స్థాయి వరకూ అక్రమ కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై ఆయన నిఘా పెట్టినట్లు తెలిసింది. వారి వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నిఘా విభాగం నుంచి కూడా ఎస్పీ ఈ వివరాలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా స్టేషన్ల పరిధిలో అక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ.. దందాలు సాగిస్తున్న అధికారులు, పోలీసులజాబితాను జిల్లా పోలీసు బాసుకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి వివరాలను చేరవేశారు. మరికొందరు ఈ కీలక సమాచార సేకరణనిలో ఉన్నట్టు భోగట్టా. జాబితా చేరిన వెంటనే నిశితంగా పరిశీలించి అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకొనే అవకాశమున్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులు పదుల సంఖ్యలో ఉండగా ఇక పోలీసులు,హోంగార్డులు వందల సంఖ్యలోనే ఉన్నట్లు ప్రాధమిక సమాచారం. సీఎం జిల్లా కావడంతో అన్ని రకాల అక్రమాలకు తెరదించి అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని ఎస్పీ అభిషేక్ మహంతి భావిస్తున్నారు. ముందు ఇంటి దొంగల పనిపట్టి అక్రమాలకు అడ్డు కట్ట వేయాలని సిద్ధమయ్యారు. సీఎం జిల్లా కావడంతో ఎస్పీ అభిషేక్ మహంతి ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి దొంగలను కట్టడిచేశాక అసలు దొంగల పనిపట్టాలని ఎస్పీ వ్యూహం. అక్రమ పోలీసులపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారు తప్పు చేయడానికి వెనుకడగు వేస్తారని ఎస్పీ ప్రణాలిక.. ఇందుకోసమే అక్రమార్కుల చిట్టాను ఎస్పీ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. వివరాల సేకరణ తరువాత చర్యలు మొదలవుతాయని తెలిసింది.ఎస్పీ ఆరా వ్యవహారం తెలిసి శాఖలో కొందరు బెంబేతెత్తుతున్నట్లు సమాచారం. జిల్లాలో బెట్టింగుల జోరు: ప్రొద్దుటూరు ప్రాంతం క్రికెట్ బెట్టింగులకు అడ్డాగా మారింది. ఇక్కడి నుండి కడపతో పాటు జిల్లావ్యాప్తంగా బుకీలు బెట్టింగులు నడిపిస్తున్నారు. కోట్లలోనే ఈ వ్యాపారం నడుస్తోంది. యువత తోపాటు అన్నివర్గాల వారు బెట్టింగులకు అలవాటు పడ్డారు. ఆర్ధికంగా నష్టపోతున్నారు. అప్పులు తాళలేక కొందరు ఊళ్లు వదలి ఇతర ప్రాంతాలకు వలసపోయిన ఘటనలు కోకొల్లలు. క్రికెట్ బెట్టింగులలో కొందరు పోలీసు అధికారులతో పాటు పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరి వ్యవహారం నడుస్తున్నట్లు ప్రచారం. ఎర్రచందనం అక్రమరవాణాలోనూ కొందరు పోలీసుల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యం.బద్వేలు,మైదుకూరు,రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని నల్లమల,లంకమల,శేషాచలం తదితర అటవీ ప్రాంతంలోఎర్రచందనం ఉంది. అత్యంత విలువైన ఈసంపద అక్రమరవాణా యధేచ్ఛగా సాగుతోంది. చిత్తూరు, కడప జిల్లాకు చెందిన పలువురు స్మగ్లర్లు ఇప్పటికే వందల కోట్ల విలువైన చందనాన్నిఅక్రమంగా తరలించారు. ఇంకా తరలిస్తూనే ఉన్నారు. గతంలో ఎర్రచందనం కేసుకు సంబంధించి జిల్లాకు చెందిన ఆల్ఫ్రెడ్ అనే అధికారిపై అప్పటి ఎస్పీ కేసు నమోదుచేసి సస్పెండ్ చేశారు. ఆ అధికారితోపాటు జిల్లావ్యాప్తంగా మరి కొందరు స్మగ్లర్లకు సహకారంఅందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోలీసు స్టేషన్లలో పంచాయితీలు జిల్లావ్యాప్తంగా కొన్ని పోలీసు స్టేషన్లలో కొందరు పోలీసు అధికారులు ,పోలీసులు సెటిల్మెంట్లు నిర్వహిస్తున్నారు. బాధితులపక్షాన కాకుండా అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలిచి వసూళ్లకు పాల్పడుతున్నారు. పంచాయతీలలో పై నుంచి దిగువ స్థాయి హోంగార్డు వరకూ ఈ వసూళ్లలో పాల్గొంటున్నారని తెలిసింది. ఈ తరహా పోలీసులను..అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటే నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని ఎస్పీ మొహంతి విశ్వసిస్తున్నారు. మట్కాలోనూ సహకారం జమ్మలమడుగు,తాళ్లప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాలతోపాటు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో మట్కా వ్యవహారం నడిపిస్తున్నారు. ఇది చాలామందికి వ్యసనంగా మారింది. చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కట్టడి చేయాల్సిన కొందరు పోలీసులు ఈ జూదానికి అండగా ఉంటున్నారు. జిల్లాలో దొంగతనాలకూ కొదవలేదు. ఇందులోనూ కొందరు పోలీసు అధికారులు, పోలీసులపాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వారితో కుమ్మక్కైన కొందరు దొంగతనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన ఓ కానిస్టేబుల్ దొంగలకు సహకరించినట్లు రేణిగుంట పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ మరిన్ని జరిగినట్లు సమాచారం. -
దాతల విస్మరణ.. మాజీల భజన..!
సాక్షి, కడప: కన్న వారిని.. ఉన్న ఊరిని మరిచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయం చేసిన వారిని గుర్తుంచుకుంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కడప నగరంలో ఎకరా రూ.1 వెయ్యి చొప్పున 11 ఎకరాలు కేటాయించడంతో పాటు, సొంత నిధులను రూ.50 లక్షలు వెచ్చించి వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని నిర్వహించడానికి జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోగా.. ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్ చేసి వేడుకలు నిర్వహించడం క్రికెట్ సంఘంలో కొనసాగుతున్న విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానేత, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కడప నగరంలో ఉన్నత ప్రమాణాలతో స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. దీంతో ఆంధ్రా క్రికెట్ సంఘం పెద్దలతో సంప్రదించడంతో పాటు ఎంతో విలువైన భూములను ఎకరా కేవలం రూ. వెయ్యి చొప్పున 11.62 ఎకరాలను ఏసీఏ వారికి అప్పజెప్పారు. దీంతో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల సొంత నిధులను ఏసీఏకి అందించారు. వైఎస్ఆర్ మరణానంతరం 2011లో కడప నగరంలో క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. ఈ మైదానానికి వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం అని నామకరణం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. మహానేత గుర్తులు మాయం.. అయితే ఇంతసాయం చేసిన మహానేత చిత్రపటం కానీ, విగ్రహం ఏర్పాటు చేసేందుకు క్రికెట్ సంఘం పెద్దలకు మనసురాలేదు. దీనికి తోడు ఎక్కడా కూడా వైఎస్ రాజారెడ్డి స్టేడియం అన్న విషయం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై జూన్ నెల 21న ‘దాతలను విస్మరించడం తగునా’ అంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు మొక్కుబడిగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. త్వరలోనే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్పితే ఆచరణలోకి మాత్రం ఇంకా రాలేదు. కనీసం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేయడానికి క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోవడం విచారకం. అయితే మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజుకు సంబంధించి చిత్రపటాలు మాత్రం ఏసీఏ కార్యాలయాల్లో నేటికీ దర్శనమిస్తుండటం గమనార్హం. ఈయన చిత్రపటం ఉండటం ఆక్షేపణీయం కానప్పటికీ దాతల చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఘనంగా గోకరాజు జన్మదిన వేడుకలు. .స్టేడియం అభివృద్ధికి పాటుపడిన వారిని విస్మరించి తమకిష్టమైన వారి భజనలో మునిగితేలుతున్నారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ స్టేడియంలోని స్కూల్ ఆఫ్ అకాడమీలో గోకరాజు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఏసీఏ సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు 76వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెటర్ల చేతుల మీదుగా కేక్ కట్ చేసి, మైదానం ఆవరణలో మొక్కలు నాటడం గమనార్హం. గోకరాజు గంగరాజు అందించిన సేవలపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు అభిమానం ఉంటే ఆయన వేడుకలను నిర్వహించుకోవడం అభ్యంతరం లేనప్పటికీ, ఇటీవల వైఎస్సార్ జయంతి సందర్భంగా కనీసం ఆయనను స్మరించుకున్న దాఖలాలు లేకపోవడం మహానేత అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. జిల్లాకు చెందిన వ్యక్తి, మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మహానేతను స్మరించుకునేందుకు మనసు రాలేదా అని క్రికెట్ సంఘంలోని మరోవర్గం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా క్రికెట్ సంఘం పెద్దలు వివక్షతను విడనాడి దాతల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
కడపజిల్లాలో గుప్తనిధుల కలకలం
-
రేపు వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
-
జమ్మలమడుగులో గాలివాన బీభత్సం
-
కడప జిల్లాలో మూడు లారీలు ఢీ
-
కడప జిల్లా టీడీపీకి భారి షాక్
-
కడప టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి..
-
కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత
-
కడప జిల్లాలో రావాలి జగన్ కావలి జగన్ కార్యక్రమం
-
వైఎస్సార్ జిల్లాలో టీడీపీలో వర్గ విభేదాలు
-
కడప జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
బద్వేలులో టీడీపీ నాయకుడు తీరుపై విమర్శలు
-
కడప జిల్లాలో నూర్‌బాషా దూదేకుల ఆత్మీయ సమ్మేళనం
-
అక్క పెళ్లి కాకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావ్!
ప్రొద్దుటూరు క్రైం : స్ధానిక దస్తగిరిపేటలో మోతుకూరు ప్రమీద (19) అనే యువతి మంగళారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దస్తగిరిపేటలో నివాసం ఉంటున్న ప్రమీద కొంత కాలం నుంచి ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేయమని కోరింది. ప్రమీద కంటే పెద్ద కూతురికి పెళ్లి కాలేదు. ‘అక్క పెళ్లి కాకుండా ఎలా చేసుకుంటావని’ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. పెద్దలు తమ పెళ్లి చేయరేమోనని కలత చెందిన ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చీర కట్టుకొని ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆమె మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. -
కడప జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కడపలో వామపక్షాల బంద్
-
అన్నికోణాల్లో పరిశీలించి తీర్పు ఇవ్వాలి
లీగల్(కడప అర్బన్): కేసులకు సంబంధించి తీర్పులిచ్చేటప్పుడు అన్నికోణాల్లో పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, పోర్ట్‌ఫోలియో జడ్జి జి. శ్యాం ప్రసాద్ అన్నారు. హైకోర్టు, న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు కేసుల్లో తీర్పు ఇచ్చే విధానం, నూతనంగా ఆలోచించేవిధానం గురించి వర్క్‌షాపు నిర్వహించారు. వర్క్‌షాపును ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించేది న్యాయమూర్తులేనన్నారు. కొత్తగా విధుల్లోకి వచ్చిన మేజిస్ట్రేట్లు ఆవేశపడకూడదన్నారు. కేసుల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయవాదుల వాదనలను ఓపికగా వినాలన్నారు. ప్రొసీజర్లాను ప్రతి న్యాయమూర్తి అనుసరించాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులవారు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తొలుత ఆయన గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కోర్టు ఆవరణలో మొక్కనాటి నీళ్లు పోశారు. అనంతరం న్యాయమూర్తులందరూ ఆయనతో కలిసి గ్రూప్‌ఫొటో దిగారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కేజి శంకర్, గుంటూరు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సుల్తానా సిరాజుద్దీన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. ప్రవీణ్‌కుమార్, శాశ్వతలోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్ రెడ్డి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సుధాకర్, నాల్గవ అదనపు న్యాయమూర్తి చక్రపాణి, ఆరో అదనపు న్యాయమూర్తి బి. మంజరి, మేజిస్ట్రేట్లు ప్రత్యూషకుమారి, పద్మశ్రీ, పవన్‌కుమార్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
కడప జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
-
భూ మాంత్రికుడు!
సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ పాలనలో భూ బకాసురులు పెరిగిపోయారు. కడప నగరంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ భూములు, పట్టా స్థలాలు అనే తేడా లేకుండా ఆక్రమిస్తున్నారు. అధికారులతో లాలూచీ పడి ఆయా వ్యక్తుల పేరిట భూములు, స్థలాలను ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నారు. అసైన్డ్, దేవాదాయ, వంక, కొండ, పొరంబోకు, నీటమునక, రిజర్వుడు స్థలాలపై కన్నేశారు. సర్వే నంబర్లు మెలికలతో నకిలీ పత్రాలు సృష్టించి స్వాహా చేస్తున్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ భూములను స్వాహా చేసేందుకు ఓ టీమ్ వెలిసింది. స్థానిక టీడీపీ నాయకుడి నేతృత్వంలోని ఆ టీమ్ విలువైన భూములను స్వాహా చేయడం వాటికి డాక్యుమెంట్లు పుట్టిస్తోంది. ఒరిజనల్ పట్టాకు చెందిన సర్వేనంబర్‌తో కబ్జా చేసిన స్థలం హద్దులు వేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. స్థలం హద్దులు సరిగ్గా ఉంటాయి. ఆ హద్దుల పరిధిలో ఉన్న స్థలం ప్రభుత్వ బంజరు లేదా పీఓబీ (ప్రొబుటరీ ఆర్డర్ బుక్) ల్యాండ్ ఉంటోంది. స్థానికులెవ్వరైనా అడిగితే తమకు రిజిస్ట్రేషన్ ద్వారా సంక్రమించిన భూమిగా ఫోజులు కొడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. సర్వే నంబర్ 335లో 4.28 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో గతంలో కొందరికీ పట్టాలు అందించారు. దాదాపు 3 ఎకరాల భూమిని రిజర్వు చేసి పెట్టారు. అందులో పార్కు నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు. ఆ స్థలం కబ్జాకు గురైంది. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ప్రభుత్వ భూమి హద్దులతో నకిలీ సర్వే నంబర్‌తో డాక్యుమెంటు పుట్టించాడు. సర్వే నంబర్ 340లో 6.28 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో బీడీ కార్మికులకు డీకేటీ పట్టాలు అప్పగించి కాలనీ ఏర్పాటు చేశారు. మరో ఎకరా రిజర్వు చేసి పెట్టారు. ఆ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఆ స్థలాన్ని తీసి పెట్టారు. మాజీ కార్పొరేటర్ ఒకరు ఆ స్థలాన్ని ఆక్రమించారు. బీడీ కాలనీలో రిజర్వు చేసిన స్థలం తనదే అని బాహాటంగా వెల్లడిస్తున్నాడు. అలాగే సర్వే నంబర్ 341లో 3.32 ఎకరాలు, సర్వే నంబర్ 342లో 3.24 ఎకరాలు ఉన్న భూమి పీఓబీ ల్యాండ్. దీనిని ఎవ్వరికీ పట్టాలు ఇచ్చేందుకు కూడా రెవెన్యూ నిబంధనలు అంగీకరించవు. అలాంటి భూమిని సైతం మాజీ కార్పొరేటర్ గుప్పిట్లో పెట్టుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 340, 341, 342 సర్వే నంబర్లు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ఈ సర్వే నంబర్లలో ఉన్న భూమికి అమాంతం రేట్లు పెరిగాయి. ఆ భూమి ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో సదరు మాజీ కార్పొరేటర్ రాజకీయ విన్యాసాలు చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నకిలీ పట్టాలు, డాక్యుమెంట్లు పుట్టిస్తున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కబ్జా చేసిన స్థలాల్లో ప్రహరీ ఏర్పాటు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుండిపోవడం మినహా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అండగా నిలుస్తున్న రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఆన్లైన్లో అక్రమార్కుల పేర్లును చేరుస్తూ రెవెన్యూ అధికారులు వారి సేవలో తరిస్తున్నారు. కడప కలెక్టరేట్‌కు పక్కనే ఉన్న సర్వేనంబర్ 955లో 23 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఆర్ట్స్ కళాశాలకు కేటాయించగా 0.03 సెంట్ల స్థలం మిగిలింది. అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌కు ఎదురుగా ఉన్న ఈ స్థలం రెవెన్యూ రికార్డుల్లో నీటిమునకగా ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.45లక్షలుగా ఉంది. ఆ భూమికి సంబంధించి ఆన్లైన్లో రెవెన్యూ అధికారులు అక్రమార్కుల పేరు చేర్చారు. అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఏఆర్ఐ రవిని సస్పెండ్ చేశారు. కడప నగర శివార్లలోని స్థలాలను ధ్రువీకరించడంలో రెవెన్యూ యంత్రాంగం కీలకంగా మారింది. ఆర్కేనగర్, బీడీ కాలనీ, చలమారెడ్డిపల్లె, ఇందిరానగర్లలో కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పునాదులు వెలుస్తున్నాయి. సర్వే చేసేందుకు ఆసక్తి చూపని వైనం.. కడప శివార్లలోని బీడీ కాలనీ, ఆర్కేనగర్ పరిధిలో సర్వే నంబర్లు 335, 340లో సర్వే చేపట్టి ప్రభుత్వ స్థలం గుర్తించాలని అందులో పార్కు నిర్మాణం చేపట్టనున్నట్లు కార్పొరేషన్ విభాగం అధికారికంగా కోరింది. అటు వైపు కన్నెత్తి చూసేందుకు ఇష్టపడని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసేందుకు కుంటి సాకులు చూపుతూ వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొరంబోకు, పీఓబీ భూమిని సైతం స్వాహా చేసి హద్దులు ఏర్పాటు చేసుకుంటుంటే నిలువరించే ప్రయత్నం చేయడం లేదని పలువురు వివరిస్తున్నారు. ఈ విషయమై కడప తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా కార్పొరేషన్ యంత్రాంగం వస్తే సర్వే చేసి పార్కు స్థలాన్ని గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిసే చర్యలు తప్పవన్నారు. -
కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం మహ గర్జన
-
వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత
-
మైదుకూరులో టీడీపీ నేతల దౌర్జన్యం
-
పంచాయతిరాజ్ శాఖలో ఉద్యోగుల గొడవ
-
జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్ప దీక్ష
సాక్షి, కడప: కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు వైఎస్సార్పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ కడపలో ఇప్పటికీ ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని పార్టీ నేతలు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ సాధించేంత వరకు తమ పోరాటాన్నిఆపబోమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 23న కడప నగరంలో మహా ధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి లతో పాటు జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉక్కు సంకల్ప దీక్ష కొనసాగనుంది. సీఎం రమేష్‌ది డబ్బు దీక్ష సీఎం రమేష్ చేసేది డబ్బు దీక్ష అని కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చేసేది జనదీక్ష, జనం కోసం చేసే దీక్ష అని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంది చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పుడు కపట నాటకాలతో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. -
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ
సాక్షి, కడప : కడప జిల్లాలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య తెలిపారు. జిల్లాలో మంగళవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయని.. నేరాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. రెండు మూడు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు త్వరలో షీటీమ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయేది ఎన్నికల సమయం కనుక ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ ఓటీపీల కారణంగా సైబర్ నేరాలు అధికం అవుతున్నాయని. బ్యాంక్‌ల ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచితులకు తెలపొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పార్థిగ్యాంగ్ ఆనవాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చారని, కానీ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమాయకులపై పార్థిగ్యాంగ్ అంటూ ప్రజలు దాడులు చేయడం సరికాదన్నారు. ఎర్రచందనం డాన్ సాహుల్ భాయ్‌ను త్వరలోనే రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు. -
కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
-
కడపలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ శిక్షణా శిబిరం
-
సిరిపురి ‘దేశం’లో.. సీఎం రచ్చ
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చ కెక్కాయి. ఇంతకాలం పరోక్షంగా సాగుతూ వచ్చిన కలహాలు ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు రెడీ అన్నట్లు తయారయ్యాయి. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు.. తాను పార్టీలో ఉంటానో... లేదో తెలియదని అయితే జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ సహించబోనని వరదరాజులరెడ్డి చెప్పడాన్ని బట్టిచూస్తే ఆయన పార్టీలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరదరాజులరెడ్డిని పార్టీ ఇన్చార్జి పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలుస్తానని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రకటించారు. అసలు విషయం ఏమిటంటే .. మంగళవారం మున్సిపల్ చైర్మన్ చాంబర్లో వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం రమేష్‌ను దూషించినదానికంటే కొద్ది నిమిషాల ముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. దీనిని బట్టి సీఎం రమేష్‌పై వరద చేసిన దూషణలు జిల్లా అధ్యక్షునికి తెలుసుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు టికెట్ రాదని తెలిసే వరద ఈ విమర్శలు చేశాడని లింగారెడ్డి అనడం గమనార్హం. తాజా పరిస్థితిని బట్టి చూస్తే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలాగే ప్రొద్దుటూరులో కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య రాజకీయ విభేదాలు రచ్చకెక్కాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చుతున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోట్లదుర్తిలో ఎలా కాపురం చేస్తాడో చూస్తానని వరద చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత పదేళ్లుగా సీఎం రమేష్ ప్రొద్దుటూరు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను అడ్డుపెట్టుకుని ఇక్కడ తన వ్యూహాన్ని రచిస్తున్నారు. గతంలో రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టు టెండర్ విషయంలో వరద తనయుడు కొండారెడ్డి, సీఎం రమేష్ సోదరులు స్వయంగా పోటీ పడ్డారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. వరద కాలువకు పోటీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి కోసం 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుందూ–పెన్నా వరద కాలువను మంజూరు చేశారు. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న వరదరాజులరెడ్డి అలైన్మెంట్ మార్చడంతో పనులు ఆగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మళ్లీ టెండర్లు పిలవగా పనుల కోసం వరద తనయుడితోపాటు పోట్లదుర్తి సోదరులు పోటీ పడ్డారు. చివరికి వరద తనయుడు ఈ పనులు దక్కించుకుని ఇటీవల ప్రారంభించారు. మరో మారు అలైన్మెంట్ మార్చేందుకు యత్నిస్తున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్నా పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణానికి సీఎం రమేష్ అడ్డుతగులుతున్నాడని కాంట్రాక్టర్‌గా ఉన్న వరదరాజులరెడ్డి విమర్శలు చేశారు. పైగా తన ప్రత్యర్థులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాడని విమర్శించడం గమనార్హం. ఇటీవల మున్సిపల్ మాజీ చైర్మన్ వీఎస్ ముక్తియార్ ఏర్పాటు చేసిన మైనారిటీల సభ వెనుక సీఎం రమేష్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పరోక్షంగా వరద విమర్శలు చేశారు. వర్గాలుగా నేతలు తొలి నుంచి టీడీపీలో ఉన్న లింగారెడ్డిని కాదని గత ఎన్నికల సందర్భంగా వరదరాజులరెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. నాటి నుంచి నేటి వరకు నిత్యం ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఎవరి ఇళ్లలో వారు పార్టీ సమావేశాలు పెట్టుకోవడం, తమకు అనుకూలంగా చెప్పుకోవడం జరిగింది. లింగారెడ్డితోపాటు ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డిలను సీఎం రమేష్ బలపరుస్తుండగా వరదరాజులరెడ్డికి మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అండగా ఉన్నారు. పార్టీ కార్యకర్తల నుంచి ఇన్చార్జిల వరకు ఇరువురి నేతల మధ్య సఖ్యత లేదు. గత ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్ దక్కించుకున్న వరదరాజులరెడ్డి ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ఏడాదికి పార్టీ ఇన్చార్జి పదవిని కూడా దక్కించుకున్నారు. దీంతో లింగారెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురికాగా పార్టీ అధిష్టానం ఆయనకు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఇటీవలే ఆ పదవీకాలం పూర్తి కాగా తనకు పార్టీ ఇన్చార్జి పదవి ఇవ్వాలని లింగారెడ్డి కోరుతున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తామని పార్టీ ముఖ్య నేతలు చెప్పినట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో రాజుకున్న పోరు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. -
కదిలిస్తే కన్నీరు..!!
కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద పడుకుని..లేవలేక ఇబ్బంది పడుతున్న ఈమె పేరు చెప్పలి సుబ్బమ్మ. దాదాపు 80 ఏళ్ల వయస్సు. చెన్నూరు గ్రామం. ఏళ్ల తరబడి అక్కడి రెవెన్యూ కార్యాలయంలో స్వీపర్‌గా నెలకు రూ. 500 జీతంతో కాలం వెల్లదీస్తోంది.దాదాపు నాలుగైదు నెలలకు సంబంధించి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడంతో అధికారులను కలవాలని వచ్చింది. భర్త పెద్ద యల్లయ్య, కుమారులు రామసుబ్బయ్య, చిన్న యల్లయ్యలు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. ఎన్నిమార్లు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారు లేక పెద్ద సార్‌ను కలవాలని వచ్చింది. కలెక్టర్ సారూ లేరని తెలిసి..పాదరక్షలు కూడా లేని వృద్ధురాలు. బయటికి నడవలేక అక్కడే మెట్లపైనే కూర్చుంది. కడపకు ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమానికి ఎందరో ఇలాంటి సమస్యలతోనే వస్తున్నారు. కనీసం ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి, కడప 50 సార్లు తిరిగా.. నా పేరు అంకాలమ్మ. మాది రాజంపేట సమీపంలోని బోయనపల్లె. నా బిడ్డ అంజిని ఎత్తుకుని ప్రతిసారి ఇక్కడికి వస్తున్నా. రానుపోను ఛార్జీలు రూ. 80 అవుతున్నాయి. గుడిసెల్లో ఉంటున్నాం. ఇల్లు కావాలని ఎన్నిమార్లు మొరపెట్టుకుంటున్నా మా బాధ వినే వారు లేరు. పప్పులు, ఎర్రగడ్డలు, ఇనుప, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుని ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికి కడపలోని కలెక్టర్ దగ్గరకు మూడుసార్లు వచ్చినా ఇంతవరకు ఇంటికి సంబంధించి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు కలిసినా ఇస్తామంటున్నారు. కానీ ఇవ్వలేదు. రాజంపేట తహసీల్దార్ ఆఫీసుకు 50 సార్లకు పైగా పోయి బాధ చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పింఛన్ ఇప్పించండి మహాప్రభో... నా పేరు ఇమాంబీ. మాది రాయచోటి మాసాపేట. నాకు 70 ఏళ్లు. నేనొక్కదాన్ని రాలేక మా బంధువుల పాప హసీనాను వెంట బెట్టుకుని వచ్చాను. ఇటీవలె కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఫించన్ కోసం తిరుగుతూనే ఉన్నా. ఎప్పుడిస్తారో తెలియదుగానీ అవస్థలు మాత్రం పడుతూనే ఉన్నాం. పలుమార్లు ఎమ్మార్వో ఆఫీసులో ఇచ్చాం. ఇక్కడ కూడా ఇద్దామని కలెక్టరేట్‌కు ఇచ్చా. మామిడి చెట్లు ఎండిపోతున్నాయి... నాపేరు రామచంద్రయ్య. మాది చిట్వేల్ మండలం కేసీ ఆగ్రహారం. నాకు 4.99 ఎకరాల పొలం ఉంది. నాకు ఎస్సీ కార్పోరేషన్ తరుపును ప్రభుత్వం బోరు మోటారు మంజూరు చేసింది. కానీ అధికారులు వచ్చి సర్వే చేసి పక్క పొలంలో ఉన్న బోరుకు మీ బోరుకు తక్కువ దూరం ఉందని వెళ్లిపోయారు. దీంతో నా పంట పొలంలోని మామిడిచెట్లు ఎండిపోతున్నాయి. సంబంధిత విషయం గురించి అధికారుల దృష్టికి తెచ్చేందుకు వచ్చాను. సబ్సిడీ మంజూరు కాలేదని రుణానికి కొర్రీ.. నా పేరు ఎం. నరసింహులు. నాది రామాపురం మండలం. నేను జీవనాధారం కోసం అంగడి ఏర్పాటు చేసుకోవడానికి స్టేట్ బ్యాంకులో లక్ష రూపాయల రుణాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాను. బీసీ కార్పొరేషన్ నుంచి సగం సబ్సిడీ వస్తుంది. మార్చి 29వ తేది బీసీ కార్పొరేషన్ అధికారులు సబ్సిడీ మొత్తాన్ని స్టేట్ బ్యాంకుకు పంపించారు. ఈ మేరకు నాకు సమాచారం వచ్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం సబ్సిడీ మొత్తం తమకు అందలేదని రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడికి వచ్చాను. పెన్షన్ మంజూరు చేయాలి.. నాపేరు విజయలక్ష్మి. నాది సీకే దిన్నె మండలం. నా భర్త సంవత్సరం క్రితం మరణించాడు. నాకు ఇద్దరు ఆడపిల్ల లు ఉన్నారు. నేను కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. కుటుంబ యజమాని మరణించినప్పటికీ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం రాలేదు. మాకు ఇంటి స్థలం కూడా లేదు. ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేస్తే మా కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుంది. నా స్థలం అమ్ముకున్నారు.. నాపేరు రామక్రిష్ణయ్య. మాది మాధవరం మండలం ఉప్పరపల్లె గ్రామం. నాకు ప్రభుత్వం 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చింది. దానిని వేరే వాళ్లు అమ్ముకున్నారు. దానిని గురించి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరు. దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాను. అడంగల్‌లో పేరున్నా అడ్డుకుంటున్నారు.. నాపేరు సి. ఈశ్వరయ్య. బి.మఠం మండలంలోని నరసన్నపల్లెలో 189 సర్వే నెంబర్లలో నాకు 17 సెంట్ల స్థలముంది. అందుకు సంబం ధించి నా పేరు మీద అడంగల్ కూడా అయితే, అక్కడ సర్వే జరగకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. 10 నుంచి 15 సార్లు ఇక్కడికి వచ్చాను. అయితే అధికారులు విచారణ చేయడం లేదు. ఎన్నిసార్లు తిరగాలి.. నా పేరు సిట్టేలుగాళ్ల గంగమ్మ. మాది మైదుకూరు మండల పరిధిలోని నంద్యాలంపేట పంచాయతీలోని కొత్త విపురాపురం. ప్రభుత్వం నాకు, నా చెల్లెలుకు మూడు ఎకరాల భూమిలో బోరు వేశారు. కానీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత ట్రాన్స్‌కో, ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వలేదు. ఇప్పటికి కలెక్టర్‌కు చెప్పడానికి పదిసార్లు వచ్చాను. భూమి కొనుగోలు చేసి అందించాలి... నా పేరు ఓబయ్య. నాది దువ్వూరు. మా మండలంలోని గొల్లపల్లెలో భూమి ఎస్సీలకు కేటాయించారు. అధికారికంగా కేటాయించాల్సి ఉంది. అందుకు అధికారులు ఈరోజు, రేపు వచ్చి పరిశీలిస్తామంటున్నారు. ఇంతవరకు రాలేదు. హద్దుల వద్ద జెండాలు కూడా నాటారు. కానీ ఇంతవరకు అధికారులు వచ్చి పరిశీలించకపోవడంతో ఎప్పుడు భూమి ఇస్తారో తెలియడం లేదు. సీఎం సహాయ నిధి ఇచ్చి ఆదుకోండి... నాపేరు ప్రకాశం. మాది కమలాపురం మండలం పైడికాల్వ గ్రామం. నేను ఇటీవలే తిరుపతిలోని స్విమ్స్‌లో ఊపిరితిత్తుల ఆపరేషన్ చేయించుకున్నారు. దానికి అయిన ఖర్చుల గురించి సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. సంబంధిత విషయం గురించి అ«ధికారులను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రజావాణికి వచ్చి అర్జీ ఇచ్చాను. సిమెంట్ ఇవ్వకపోవడం ఏమిటి... నాపేరు పెంచలయ్య. మాది రాజంపేట మండలం పోలీ పంచాయతీ చిండ్రిగాయపల్లె గ్రామం. నాకు ప్రభుత్వ ఎన్టీఆర్ గృహ పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. ప్రస్తుతం ఇంటికి స్లాబ్‌ను వేసుకునేందుకు 35 బస్తాల సిమెంట్‌ను మంజూరు అయ్యింది. సంబంధిత సిమెంట్‌ను గోడౌన్ ఇన్చార్జు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. స్లాబ్ నిలిచిపోయింది. ఇలా చాలామందికి సిమెంట్ ఇవ్వడం లేదు. పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు.. నాపేరు వెంకటరమణారెడ్డి, వేంపల్లి మండలం ఆలిరెడ్డిపల్లె ఎంపీటీసీని. మాగ్రామ పొలాల్లో నుంచి కడప నుంచి బెంగుళూరుకి వెళ్లే రైల్వేట్రాక్ మంజూరైంది. కానీ మా పొలాలకు రైల్వేశాఖ ఎంతనష్టçపరిహారం ఇస్తుందో అర్థం కావడం లేదు. సర్వే కోసం వచ్చిన అధికారులు కూడా చెప్పడం లేదు. మా పంట పొలాలు మూడు కార్లు పండుతాయి. దీంతోపాటు మార్కెట్ విలువ కూడా ఎక్కువగా ఉంది. మరి రైల్వేశాఖ వారు నష్టపరిహారం కింద ఎంత డబ్బులిస్తారో అర్థం కావడం లేదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చా. భూమి అభివృద్ధికి చేయూత ఇవ్వండి.. నాపేరు పెద్ద సుంకన్న. నాది మైలవరం మండలం. తొర్రివేముల గ్రామ పొలం సర్వే నెంబరు 679–2బిలో నాకు ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి పట్టాగా మంజూరు చేసింది. ఆ భూమిని వ్యవసాయానికి యోగ్యంగా చదువును చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా తలమంచిపట్నం చెరువు నుంచి 500 ట్రిప్పుల మట్టి అవసరమవుతుంది. అధికారులు చెరువుమట్టిని ఉచితంగా నా భూమికి తోలించాలి. కంపచెట్లు తొలగించేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలి. 500 ఎకరాల భూమి అంతా ఆక్రమణలే! నా పేరు బి.వెంకట సుబ్బారెడ్డి. బద్వేలు పరిధిలోని భాకరాపేట మా ఊరు. 1914లో సుమారు 547 ఎకరాల భూమి మా అబ్బబ్బ గారి పేరుమీద రిజిష్టర్లు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1956లో చాలా భూమిని డీకేటీగా మార్చారు. తర్వాత అంతో ఇంతో మిగిలిందంతా కూడా ఆక్రమణలు అయిపోయింది. నా భూమి సర్వే చేయించాలని సీఎం చంద్రబాబుతోసహా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. 2000 నుంచి ఇప్పటివరకు నా పోరాటం ఆగలేదు. కనీసం ఒక ఎకరా అయినా చూపించాలని మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో కనిపించడం లేదు.. మా పేర్లు వై.లక్ష్మి దేవి, సి.సునీత. మాది చెన్నూరు. మా అమ్మ పద్మావతి రుద్రభారతి పేటలో 1.14 సెంట్ల భూమిలో కూతుర్లు అయిన మా ఇద్దరికీ ఎకరా...మరో 14 సెంట్లు కుమారుడికి ఇచ్చింది. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి. పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో చేర్చాలని ఎన్నిమార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. -
అదిగో పార్ధీ ఇదిగో చెడ్డీ గ్యాంగ్
సాక్షి, కడప : జిల్లాలోని పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పార్థి గ్యాంగ్ పేరుతో దోపిడీ దొంగలు జిల్లాలోకి ప్రవేశించారనే ప్రచారం ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురి చేస్తోంది. పగలు చిరు వ్యాపారులు చేసుకునే వారిలా వీధుల్లో తిరిగి రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దోపిడీలకు తెగబడతారనే ప్రచారం ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వివిధ జిల్లాల పోలీసుల పేరుతో పార్థి గ్యాంగ్ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిళ్లు ఆరుబయట కాదుకదా.. ఇళ్లలో పడుకునేందుకు కూడా భయపడుతున్నారు. ఏ క్షణంలో దొంగలు దాడి చేస్తారో అని పహారా కాస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చింతకొమ్మదిన్నె, వల్లూరు, నందలూరు, చెన్నూరు తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించారనే అనుమానంతో వారి కోసం కర్రలు, కత్తులు చేతబట్టుకుని ఆయా గ్రామాల వారు గాలింపు చర్యలు చేపట్టారు. అదిగో పార్థీ గ్యాంగ్..ఇదిగో చడ్డీ గ్యాంగ్...మరోచోట ఇరానీ గ్యాంగ్ అంటూ ఎక్కడ చూసినా పుకార్లతో పల్లెల్లో భయోత్పాతం నెలకొంది. పోలీసులపైనే ఆధారపడకుండా ఒకింత ప్రజల్లో చైతన్యం రావడం మంచిదే అయినా రాత్రిపూట ఎవరు కనిపించినా దాడులకు ఉపక్రమిస్తుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. కొందరు మతిస్థిమితం లేనివారు కూడా ప్రజల చేతిలో దెబ్బలు తినక తప్పడం లేదు. పోలీసులు స్పందించాలి పార్థీ గ్యాంగ్.. చెడ్డీ గ్యాంగ్‌ల పేరుతో ప్రజలు భయపడుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రి సమయంలో గస్తీ నిర్వహించడమే కాకుండా పగటి పూట కూడా వీధుల్లో సంచరించే చిరు వ్యాపారుల కదలికలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయా స్టేషన్ల ఎస్ఐలు, సీఐలు ఎలాంటి ముఠాలు జిల్లాలోకి రాలేదని, భయపడాల్సిన పని లేదని ప్రకటిస్తున్నా ప్రజలను మాత్రం భయాందోళన వెంటాడుతోంది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు పేర్కొంటున్నారు. -
‘ఓరి భగవంతుడా .. ఎంత పని చేశావు..
‘ఓరి భగవంతుడా .. ఎంత పని చేశావు.. రాత్రి ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే తమ కుమారుడు ప్రాణాలు విడిచాడని అధికారుల నుంచి ఫోన్ రావడం ఏంటి...! తాము వచ్చి చూడగానే రక్తపు మరకలతో పడి వుండటం ఏంటి’ అంటూ ఏఆర్ కానిస్టేబుల్ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ రిమ్స్ మార్చురీ వద్ద శనివారం ఉదయం కనిపించారు. కానిస్టేబుల్ భార్య అరుణ రోదిస్తూ, కుమారులు ఇద్దరూ తన తండ్రి మరణించాడనే విషయం అర్థం గాక అమాయకంగా అవ్వ, తాత వంక చూస్తున్నారు. ఈ సంఘటన అక్కడున్న వారి హృదయాలను కలచి వేసింది. కడప అర్బన్ : జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద సెంట్రీ విధుల్లో వున్న ఏఆర్ కానిస్టే బుల్ పెద్దశెట్టి వెంకటకిరణ్ (28) (ఏఆర్ పీసీ నంబర్ 2402).. తాను ధరించిన తుపాకీ 303 ప్రమాదవశాత్తు పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటకిరణ్‌ది 2009 బ్యాచ్. ఆయన తల్లిదండ్రులు పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు, పద్మావతమ్మ. ముగ్గురు అక్కలు శ్రీదేవి, సుభాషిణి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వెంకటకిరణ్‌కు భార్య అరుణ, కుమారులు వెంకట కైలాస్ (6), వెంకట భువనేష్ (4) ఉన్నారు. పోలీస్ క్వార్టర్స్‌లోనే కుటుంబ సభ్యులతో కలిసి నివాసం వుండే వాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 వరకు వుండే ప్రధాన ద్వారం సెంట్రీ షిప్ట్ డ్యూటీకి వచ్చాడు. వచ్చిన తర్వాత 12:45 గంటల ప్రాంతంలో తుపాకీ పేలడంతో.. అక్కడే విశ్రాంతి గదిలో వున్న సహచర సిబ్బంది వచ్చి చూసేలోపు కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి వున్నాడు. వెంటనే అధికారులు, సిబ్బం ది కలిసి రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు. అప్పటికే మృతి చెందాడని రిమ్స్ వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆ సమయంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ, కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, రిమ్స్ సీఐ పురుషోత్తంరాజు తమ సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసు లాంఛనాలతో నివాళి: వెంకటకిరణ్ మృతదేహాన్ని రిమ్స్‌లో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడతోపాటు అధికారులు పరిశీలించారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పోస్టుమార్టం అనంతరం పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ నివసించిన ఇంటి వద్ద పోలీసు లాంఛనాలతో తుపాకులను గాల్లోకి పేల్చి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రుషికేశవ్‌రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ మురళీధర్, ఆర్ఐలు విజయకుమార్, చంద్రశేఖర్, నాగభూషణం, సిబ్బంది, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీస్ లైన్‌లోని వారు పాల్గొన్నారు. పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేతల సంతాపం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాస శర్మ, కడప తాలూకా ఎస్ఐ, కార్యదర్శి ఎన్.రాజరాజేశ్వరరెడ్డి, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్కె.రోషన్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రిమ్స్ మార్చురీలో కానిస్టేబుల్ మృతదేహాన్ని వారు పరిశీలించారు. సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి కానిస్టేబుల్ కుటుంబానికి రావాల్సిన తక్షణ సహాయాలను వారికి అందేలా చూస్తామన్నారు. పోలీసులు ఏమన్నారంటే.. ఈ సంఘటనపై కడప వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద సెంట్రీ విధుల్లో వున్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటకిరణ్ శనివారం తెల్లవారుజామున 12:45 తుపాకీ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తమకు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే రిమ్స్‌కు తరలించామని, అప్పడికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపడతామన్నారు. -
కడప జిల్లాలో గాలివాన బీభత్సం పంట నష్టం
-
పనిచేసే బ్యాంకుకే కన్నం వేసిన ఉద్యోగి
-
మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కడప: ఓ కానిస్టేబుల్ కడపలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని ప్రకాష్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలివి.. బాల రంగయ్య(42) కానిస్టేబుల్‌గా మన్నూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
ఉక్కు ఫ్యాక్టరీ కోసం బంద్: వైఎస్ఆర్సీపీ నేతలు అరెస్ట్
-
వైఎస్సార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ రచ్చబండ-పల్లెనిద్ర
-
వైఎస్సార్ సీపీలో 100 కుటుంబాలు చేరిక
-
‘నన్ను క్షమించండి.. చనిపోతున్నా’
కడప అర్బన్ : కడప పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వేర్వేరు చోట్ల ఇద్దరు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనల వివరాలను రైల్వే ఎస్ఐ రారాజు సోమవారం వెల్లడించారు. కడప నగరంలోని అక్కాయపల్లె తిలక్ నగర్‌కు చెందిన యువకుడు ఎస్.భాస్కర్ (26) సెల్‌ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కడప– కృష్ణాపురం రైల్వే ట్రాక్‌లో దిగువ లైన్లో జరిగింది. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్ఐ రారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. మృతుడి చేతిలో ‘నన్ను క్షమించం డి.. నేను చనిపోతున్నాను’ అని రాసి ఉన్న చీటీ లభించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కడప రైల్వే పోలీస్ పరిధిలోని మంటపంపల్లె– నందలూరు రైల్వే మార్గంలో దిగువలైన్‌లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి (55) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లకలర్ చొక్కా పంచె, ఆరెంజ్ కలర్ టువల్ ధరించి ఉన్నాడు. ఈ సంఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
టూరిజం స్పాట్.. హార్టికల్చర్ హబ్‌గా జిల్లా
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాను టూరిజం స్పాట్‌గా, హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి అన్నారు. టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 గ్రహీత పంతుల పవన్‌కుమార్ అభినందన సభ సందర్భంగా ఆదివారం సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో కొండూరు పిచ్చమ్మ, వెంకట్రాజు స్మారక సంస్థ అధ్యక్షుడు కొండూరు జనార్దన్‌రాజు ఆధ్వర్యంలో జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గండికోటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని, యునెస్కో నిధులు వస్తే మరింత అభివృద్ధి అవుతుందన్నారు. గండికోటలో సాహస క్రీడల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వంతెన నిర్మాణానికి ఇప్పటికే రూ. 3 కోట్లు విడుదల చేశామన్నారు. బ్రౌన్ నివసించిన స్థలంలో ఏర్పాటైన పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక ప్రదేశాల జాబితాలో చోటు కల్పిస్తామని, అలాగే అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఒంటిమిట్ట చెరువును నీటితో నింపి బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. టూరిస్టులు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి సాయంత్రానికి తిరిగి తిరుపతి వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన విద్వాన్ కట్టా నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న మోపూరు, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయాల శాసనాల్లోని చరిత్రను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమలో నందలూరులో ఏకైక బౌద్ధారామం ఉందని, దాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తిరుపతి నుంచి గండికోట వరకు పర్యాటక హబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ధ్వంసం చేయకుండా పర్యాటక ప్రదేశాల అభివృద్ధి జరగాలన్నారు. పర్యాటకశాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడా బాలసుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ గండికోట అభివృద్దికి మాస్టర్‌ప్లాన్ రూపొందించి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రీజినల్ డైరెక్టర్ జి.గోపాల్ మాట్లాడుతూ గండికోటకు సంబంధించి 20 మంది టూర్ గైడ్స్‌కు శిక్షణ ఇచ్చామన్నారు. యునెస్కో గుర్తింపునకు చర్యలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం గండికోట అభివృద్ధికి రూ. 500 కోట్లతో పలు చర్యలు చేపట్టిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జానమద్ది విజయభాస్కర్ నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమంలో అలపర్తి పిచ్చయ్యచౌదరి, మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడారు. యలమర్తి మధుసూదన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తొలుత పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ జిల్లా పర్యాటక ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ‘పంతుల’కు ఘన సన్మానం టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డు–2017 అందుకున్న పాత్రికేయుడు పంతుల పవన్‌కుమార్‌ను రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరపురెడ్డి జయరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు పలు పర్యాటక సంఘాల ప్రతినిధులు, పర్యాటకాభిమానులు పాల్గొన్నారు. -
రైతు అనుమానస్పద మృతి
-
కీచక హెడ్ మాస్టర్
-
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి
గోపవరం: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని గోపవరం మండల కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. లక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మస్తాన్(27) మరో ఇద్దరి మహిళలతో కలిసి ద్విచక్రవాహనంపై నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట దర్గాకు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అటు నుంచి వస్తున్న ట్రాక్టర్ వారి పై నుంచి వెళ్లడంతో.. మస్తాన్‌తో పాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన మరో మహిళను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పొలతలలో భూతవైద్యం పేరుతో మోసాలు
-
కడపలో వీది కుక్కలు స్వైరవిహారం
-
వృద్ధుల కడుపు కొడుతున్న తెలుగు తమ్ముళ్లు
-
కడప జిల్లాలో పదిళ్లు దగ్ధం
-
డబ్బులు రెట్టింపు చేస్తామంటూ...
-
కడపలో ఉక్కు..ప్రజల హక్కు:గేయానంద్
-
ఆకలిరాజ్యం
సాక్షి, కడప : జిల్లాలో చిన్న ఉద్యోగానికి పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం పోటీ పడుతున్నారంటే ఉద్యోగ తీవ్రత ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. అధికారపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటింటికి ఉద్యోగం....లేని, రాని వారికి నిరుద్యోగ భృతి అంటూ డంకా బజాయించి, నేడు విస్మరించింది. నిరుద్యోగుల గురించి, వారు పడుతున్న వేదన గురించి చంద్రబాబు సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు. పెద్దపెద్ద చదువులు చదివిన వారికి సైతం ఉద్యోగాలు కల్పించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీలో జిల్లాకు కేవలం 200 పోస్టుల మాత్రమే కేటాయించగా, పోలీసుశాఖలో కూడా అన్నో ఇన్నో ఉద్యోగాలు రానున్నాయి. ఈ రెండు తప్ప మరే ఉద్యోగాలకు పెద్దగా నోటిఫికేషన్లు వెలువడలేదు. నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏదో అడపాదడపా ప్రైవేటు కంపెనీల్లో చిన్నచిన్న ఉద్యోగాలు మినహా పెద్దస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం భర్తీకి నోచుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంతవరకు వేలాదిమంది నిరుద్యోగులు ఉపాధి కల్పనకు నోచుకోలేదు. నిన్న ఎక్సైజ్, నేడు పోస్టల్శాఖలకు భారీగా దరఖాస్తులు శాఖ ఏదైనా....పోస్టు ఏదైనా నిరుద్యోగుల మధ్య పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఇటీవలే ఎక్సైజ్‌శాఖకు సంబంధించి వైన్‌షాపుల్లో 165 సూపర్వైజర్లు, అసిస్టెంట్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే దాదాపు 2 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం పోస్టల్ శాఖలో 24 బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు సంబంధించి 15 వేలమందికి పైబడి దరఖాస్తు చేసుకోవడం చూస్తే నిరుద్యోగ తీవ్రత ఇట్టే తెలిసిపోతుంది. ఒక్కొక్క పోస్టుకు దాదాపు 700 మంది పోటీపడుతున్నారు. చిన్న ఉద్యోగానికి ఉన్నత విద్యావంతులు ఉద్యోగ స్థాయి ఏదైనా దొరికితే అదే చాలని అనుకుంటున్నారు. చిన్న ఉద్యోగమైనా పెద్ద పెద్ద చదువులు చదివిన ఉన్నత విద్యావంతులు పోటీపడుతున్నారు. వైన్‌షాపుల్లో సూపర్వైజర్ పోస్టులు మొదలుకొని ప్రతి చిన్న ఉద్యోగానికి పెద్ద చదువులు చదివిన యువకులు పోటీ పడుతున్నారు. పదవ తరగతి, ఇంటర్ అర్హత కలిగిన ఉద్యోగాలకు కూడా డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ చదివిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పోటీపడటానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసినా ఉద్యోగాలు దొరకడం లేదు. ఉన్నత విద్య బీటెక్ పూర్తిచేసినా కూడా మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకడం లేదు. కారణం ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్టరీలు, కంపెనీలు లేకపోవడమే. దీనికి తోడు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసినా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. -
యువకుడ్ని చితక్కొట్టిన పోలీసులు
-
ప్రత్యేక హోదాపై కడప జిల్లాలో బంద్
-
భార్య పట్టించుకోలేదని...
-
వ్యకిపై వేటకొడవళ్లతో దాడి
వివాహేతర సంబంధమే కారణం? సుండుపల్లి(కడప) వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తిపై కొందరు దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లిలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన హిదాయత్ బస్సులో సుండుపల్లికి వెళ్తుండగా దుండగులు బైకుల్లో వెంబడించారు. బస్సు దిగిన వెంటనే అతనిపై కొడవళ్లతో దాడి చేశారు. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ఇద్దరు దుండగులు బాలక్రిష్ణ, సుధాకర్ లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన భాస్కర్ భార్యతో క్షతగాత్రుడికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. -
బాణాసంచా గోడౌన్లో మంటలు
-
సీమ ప్రాజెక్టుల పై సర్కారు ప్రత్యేక దృష్టి
-
గ్రంధాలయాన్ని సందర్శించిన రాజ్‌మోహన్‌గాంధీ
-
వరద నీటిలో చిక్కుకున్న జాలర్లు
-
భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం
-
భార్యను నరికి చంపిన భర్త.
-
కడప జిల్లాలో తెలుగుతమ్ముళ్ల భూకబ్జాలు
-
జగన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆత్మహత్యాయత్నం
-
రాయలసీమకు నీళ్లు రావని తేలిపోయింది
-
గుప్తనిధుల కోసం తవ్వకాలు
సుండుపల్లి మండలం మడితాడు పంచాయతీపరిధిలోని పరిబండ శివాలయం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జరిపారు. తవ్వకాలకు ముందు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ విషయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. -
యువతికి ప్రియుడి వేధింపులు
-
గురుకుల పాఠశాలలో విద్యార్ధినులు మిస్సింగ్
-
న్యాయం జరిగేనా ?
-
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
తప్పతాగి చిందులేసిన కానిస్టేబుల్
-
విద్యార్ధిని కర్రతో చితకబాదిన టీచర్
-
అంకాలమ్మ ఆలయంలో వైఎస్ జగన్ పూజలు
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మగూడూరు అంకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్ అంకాలమ్మ ఆలయ దర్శనానికి వచ్చారు. బలపనూరులో ఇటీవల మరణించిన సర్పంచ్ సరస్వతి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ కడపకు వెళ్లారు. నారాయణ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులను కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద పరామర్శించారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఎర్రచందనం దుంగల పట్టివేత
-
ఖాళీస్ధలం కన్పిస్తే చాలు కబ్జాకవాల్సిందే !
-
ప్రభుత్వ స్థలం కబ్జా
-
ఎడ్లబళ్ల పోటీలను ప్రారంభించిన వైస్ జగన్
-
టీడీపీ నేత అరెస్టుకు జంకుతున్న పోలీసులు
-
కడపలో మద్యం డిపో సీజ్
కడప : కడప జిల్లా శివారులో ఉన్న ఏపీడీసీఎల్కు చెందిన మద్యం గోడౌన్ లో ఇన్‌కంటాక్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను కట్టకుండా నడుపుతున్న మద్యం డిపోలను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. 2004 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆదాయపు పన్ను చెల్లించక పోవడంతో చెల్లించవలసిన బకాయి మొత్తం 116 కోట్లకు చేరింది. దీంతో ఇన్‌కంటాక్స్ అధికారులు గోడౌన్‌ను సీజ్ చేశారు. -
వివక్షకు సాక్ష్యమిదే !
‘కడపలో ఉర్దూ భాషాభిమానులు అధికంగా ఉన్నారు. పైగా జిల్లాలోని రాయచోటి, కడపతోపాటు పలు ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉంది. వారి పిల్లల చదువు కోసం, ఉపాధి రీత్యా ఉర్దూ భాషను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉంది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి ప్రజలు టీడీపీకి పెద్దగా ఓట్లు వేయకపోయినా కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’ - 2014 నవంబరు 8న రైల్వేకోడూరులో సీఎం హామి కడప జిల్లా ప్రజలు టీడీపీపై వివక్ష చూపినా మేము మాత్రం ప్రత్యేకంగా అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నాం. ముస్లిం మైనార్టీల ఉన్నత చదువుల కోసం ఉర్దూ యూనివర్సిటీని కడపలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. మేమెక్కడా కూడా కడపపై వివక్ష చూపలేదు. - అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వ్యాఖ్య. సాక్షి, కడప : కడప ప్రజలపై తాము ఏమాత్రం వివక్ష చూపక పోయినా ప్రతిపక్షం గోల చేస్తోందని పదేపదే చెబుతున్న చంద్రబాబు.. కడపలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు మార్చారు. ఇందులో ఆంతర్యమేమిటని ముస్లిం మైనార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కడపకు ఉర్దూ వర్సిటీని కేటాయించిన సందర్భంలో ఉర్దూ భాషాభిమానులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు ఉర్దూ యూనివర్శిటీని మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో యోగి వేమన, ట్రిపుల్ ఐటీ, జేఎన్టీయూ లాంటి ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యను అందించే యూనివర్సిటీ జాబితాలో ఒకటిగా నిలువాల్సిన ఉర్దూ యూనివర్సిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం పెద్దపీట వేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని ఆశలు కల్పించి అంతలోనే నీళ్లు చల్లడంపై అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాయలసీమ జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా వైఎస్సార్ జిల్లా గుర్తింపు పొందింది. జిల్లాలో కడపతోపాటు రాయచోటి, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం తదితర ప్రాంతాలలో లక్షలాది సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. వారి పిల్లల భవిష్యత్ అవసరాలను పరిశీలిస్తే కచ్చితంగా కడపలో ఉర్దూ యూనివర్సిటీ అవసరమేనని ముస్లింలు ఖరాఖండిగా పేర్కొంటున్నారు. ఇంటర్ వరకే ఉర్దూ మీడియం కళాశాలలు జిల్లాలో అక్కడక్కడ ఉర్దూ భాషకు సంబంధించి ప్రత్యేక పాఠశాలలున్నా కళాశాలలు ఇంటర్ స్థాయిలోనే ఆగిపోయాయి. కనీసం ఉర్దూ భాషకు సంబంధించిన విద్యార్థులు డిగ్రీ చదువుకోవాలన్నా కూడా ఇక్కడ సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. డిగ్రీ స్థాయిలో ఉర్దూభాష చదువుకోవాలంటే తిరుపతి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కడపలో యూనివర్సిటీ స్థాయి విద్య సౌలభ్యం ఉంటే ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులు చదువుకొనే అవకాశం ఉంటుంది. రైల్వేకోడూరు బహిరంగసభలో చంద్రబాబు కడపలో ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పలుచోట్ల టీడీపీ నేతలు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇపుడు ఏం సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో వారు సందిగ్ధంలో పడ్డారు. కొనసాగుతున్న ఆందోళనలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పకుండా వేరే జిల్లాకు తన్నుకుపోవడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా కడప కలెక్టరేట్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరింత ఉధృతం చేసే దిశగా ముస్లిం మైనార్టీ వర్గాలు వ్యూహం రూపొందించుకున్నాయి. కడప ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కడపలో ఉర్దూ యూనివర్శిటీ నెలకొల్పాలి రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ప్రధాన కేంద్రం కడప. కాబట్టి ఇక్కడే ఉర్దూ యూనివర్సిటీని నెలకొల్పాలి. శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేల సాక్షిగా...13 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ అందులో భాగంగా ఉక్కు కర్మాగారం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఉర్దూ యూనివర్శిటీ, టెక్స్టైల్స్ పార్కు, స్మార్ట్ సిటీలు కడపలో నిర్మిస్తామని చంద్రబాబు హామి ఇచ్చారు. కడపలో ఉర్దూ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేస్తామనడం సరికాదు. మాటమార్చే వారిని దేశం నుంచి బహిష్కరించాలి. మొదట కడప అన్నారు.. తర్వాత కర్నూలు అన్నారు.. రానున్న రోజుల్లో రెండు ప్రాంతాల మధ్య చిచ్చు రగిలిందని సాకు చూపి.. తన పార్టీ ఫైనాన్షియర్ల ప్రాంతమైన గుంటూరు జిల్లాకు తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కడపలో యూనివర్సిటీ స్థాపించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. - ఎస్బీ అంజాద్బాష, వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు, కడప. జిల్లా పట్ల వివక్ష చూపడం తగదు అభివృద్దిని విస్మరిస్తున్న బాబు జిల్లాకు వచ్చిన పరిశ్రమలను, విద్యా సంస్థలను తరలించడం తగదు. వివక్ష చూపలేదంటూనే వచ్చిన వాటిని తన్నుకుపోతున్నారు. ఇక ఇంతకంటే వివక్ష ఏముంటుంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మనసు మార్చుకుని కడపలోనే ఉర్దూ యూనివ ర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. - టీకే అఫ్జల్ఖాన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఉర్దూతో భవిష్యత్ తరాలకు మంచి రోజులు తెలుగు భాషలో ఎంతటి తియ్యదనం ఉందో ఉర్దూ భాషలో కూడా అంతటి తియ్యనైన కమ్మదనం ఉంది. ఉర్దూ యూనివర్సిటీ జిల్లాలో నెలకొల్పడం ద్వారా ఒక మంచి వాతావరణం, సంసృ్కతి ఏర్పడుతుంది. కడప పట్ల మిగతా ప్రాంతాల్లో ఒక చెడు ప్రభావం ఉంది. యూనివర్సిటీ వస్తే ఒక మంచి భావన ఏర్పడే అవకాశం ఉంది. ఉర్దూ యూనివర్సిటీ కోసం ముస్లిం మైనార్టీ వర్గాలే కాకుండా మిగతా సామాజిక వర్గాల ప్రజలు కలిసి రావాలి. - హఫీజుల్లా (కాల్టెక్స్), వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ముఖ్యమంత్రి మాట తప్పడం తగదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడపలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇతర మంత్రులు కూడా అదే హామీ ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మైనార్టీలతోపాటు అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మైనార్టీ వర్గాల్లోనైతే ఎంతో సంతోషం నెలకొంది. ఇంతలోనే కర్నూలులో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించడం దారుణం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట తప్పడం తగదు. - సయ్యద్ సలావుద్దీన్, ఉర్దూ యూనివర్శిటీ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇతర జిల్లాలకు తరలిస్తే సహించేది లేదు ఉర్దూ యూనివర్సిటీని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని గొప్పగా హామి ఇచ్చి ఇప్పుడేమో కర్నూలు, గుంటూరులో ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు గుప్పించడం ఏమాత్రం తగదు. ముందు ఒకమాట, మళ్లీ ఒకమాట ఇలా పూటకోమాట మాట్లాడటం సీఎం చంద్రబాబుకు తగదు. ఉర్దూ యూనివర్సిటీ వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిందే. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు -
వైఎస్ఆర్సీపీ వర్గీయులపై టీడీపీ దాడి
కడప: వైఎస్ఆర్ సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. కడప జిల్లాలోని నందలూరు మండలం చింతకాలయపల్లిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
-
గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
కడప: జిల్లాలోని సిద్ధపటం మండలం కనుమలోపల్లిలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుడు బెటాలియన్ కానిస్టేబుల్ బాలాజీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
రూ.10 లక్షల విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం
కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా కడప జిల్లాలో మైదకూరు మండలం జీవిసత్రం వద్ద అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 10 లక్షల విలువచేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు; ఒకరి మృతి
కడప: ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లాలోని పుల్లంపేట మండలం అప్పరాజుపేట సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 10మందికి గాయాలు
కడప: జిల్లాలోని కాజీపేట మండలం సిద్ధాంతపురం సమీపంలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో 10మందికి గాయాలయ్యాయి. ఆగిఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
వివాహిత అనుమానస్పద మృతి
-
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
-
ఈ వారం వ్యవసాయ సూచనలు
మాఘీ జొన్న సాగుకు ఇదే అదను * సెప్టెంబర్ మాసం రబీ (మాఘీ) తెల్లజొన్న, పచ్చజొన్న, జొన్న విత్తనోత్పత్తికి అనుకూలం. వరంగల్, మెదక్, రంగారెడ్డి, కర్నూలు, కడప జిల్లాల్లో జొన్న సాగుకు ఈ సమయం అనుకూలం. * మాఘీకి అనువైన తెల్లజొన్న రకాలు: ఎన్.టి.జె-1, ఎన్.టి.జె-2, ఎన్.టి.జె-3, ఎన్.టి.జె-4, కిన్నెర, సి.ఎస్.హెచ్-16. అనువైన పచ్చజొన్న రకాలు: ఎన్-13, ఎన్-14. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని విత్తుకోవాలి. * శిలీంధ్ర నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్టాన్, మొవ్వు ఈగ నివారణకు 3 గ్రాముల థమోమిధాక్సాం కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. * కలుపు నివారణకు అట్రజన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపల నేలపై తడి ఆరకముందే పిచికారీ చేయాలి. * మాఘీ జొన్నలో సమస్యగా ఉన్న ఈ జొన్నమల్లె కలుపు నివారణకు 50 గ్రా. అమ్మోనియం సల్ఫేటు లేదా 200 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించవచ్చు. * విత్తిన 35-40 రోజులప్పుడు జొన్న పంటలో మల్లె కలుపు మొక్క మొలకెత్తుతుంది. ఇది జొన్న మొక్క వేళ్ల మీద నుంచి సారాన్ని పీల్చుకోవడం ద్వారా జొన్న పంట ఎదుగుదలను తగ్గిస్తుంది. * భూసారాన్ని అనుసరించి వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంతో విత్తుకొని ఎకరాకు 58 వేల నుంచి 70 వేల మొక్కల సాంద్రత ఉండేట్లుగా చూసుకోవాలి. * వర్షాధారపు మాఘీ జొన్నకు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేయాలి. * 24-32 కిలోల నత్రజని ఎరువును విత్తేటప్పుడు ఒకసారి, 30-45 రోజుల మధ్యలో రెండు దఫాలుగా వేసుకోవాలి. * విత్తిన తొలి 30 రోజుల్లో జొన్నకు మొవ్వు తొలిచే ఈగ ఆశించి నష్టపరుస్తుంది. సరైన సమయంలో విత్తుకోవడంతోపాటు కార్బోఫ్యురాన్ 3జి గుళికలను మీటరు సాలుకు 2 గ్రాముల వంతున ఇసుకలో కలిపి విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపల సాగులో ఎఫ్.సి.ఆర్.ను బట్టే లాభనష్టాలు * ఆక్వా సాగులో రైతులు 50 శాతం పైగా పెట్టుబడి మేత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ‘మేత వినిమయ నిష్పత్తి’(ఎఫ్.సి.ఆర్.)మీదే లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. * ఎన్ని కేజీల మేతకు, ఎన్ని కేజీల చేపలు ఉత్పత్తి అయ్యాయనే విష యాన్ని అంచనావేసే పద్ధతినే ‘మేత వినిమయ నిష్పత్తి’ అంటారు. * సాధారణంగా నూనె తీసిన తవుడు, వేరుశనగ చెక్కను మేతగా వాడి న చెరువుల్లో ఎఫ్.సి.ఆర్. 2.5-3.0 :1.0 గాను, కణికల (పెల్లెట్స్) మేత వాడిన మేతలో 1.5:1.0 గాను ఉండే అవకాశముంది. * ఎఫ్.సి.ఆర్. ఎంత తక్కువగా ఉన్నట్లయితే, మేత అంత నాణ్యమైనదని అర్థం. అంతేగాక తక్కువ ఎఫ్.సి.ఆర్. ఉన్నప్పుడు, రైతులకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశముంది. - డాక్టర్ పి. రామ్మోహన్ రావ్(98851 44557), అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఫిషరీస్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, కాకినాడ గొర్రెలకు వైరస్ వ్యాధులతో ముప్పు * గొర్రెల పెంపకానికి గొడ్డలిపెట్టులా మారిన వ్యాధుల్లో బ్యాక్టీరియా వ్యాధులతోపాటు వైరస్ వ్యాధులు కూడా ఉన్నాయి. కొన్ని వివరాలు తెలుసుకుందాం. * గాలికుంటు వ్యాధి(గాళ్లు): ఈ వ్యాధి సోకితే నోరు, నాలుక, గిట్టల మధ్య పుండ్లు వస్తాయి. 104-105 డిగ్రీల జ్వరం వస్తుంది. చొంగ కారుతుంటుంది. పుండ్ల వల్ల మేత తినలేక పశువులు నీరసించి చనిపోతాయి. జొన్నజావ, గ్లూకోజ్ కలిపి తాగించాలి. దీని నివారణకు టీకా వేయించాలి. *నీటి నాలుక వ్యాధి: దీన్ని మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వర్షాకాలపు వ్యాధి ప్రస్తుతం చాలా పశువులకు సోకింది. దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. 1% పొటాషియం పర్మాంగనేట్‌తో కడగడం ఉపశమనాన్నిస్తుంది. టీకాలు లేవు. *అమ్మతల్లి/బొబ్బ రోగం: ఈ వ్యాధి సోకిన గొర్రెల చెవులు, పొదుగు, తొడలు, కంటి రెప్పలపై దద్దుర్లు వస్తాయి. అవి చీము పట్టి, పగిలి రసికారతాయి. దీని నివారణకు టీకా వేయించాలి. - డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ (99485 90506), అధిపతి, పశు పరిశోధన కేంద్రం, గరివిడి, విజయనగరం జిల్లా తెల్లమచ్చల వైరస్ వ్యాధికి నీటి శుద్ధే మందు! * వెనామీ రైతులు తెల్ల మచ్చల వైరస్‌ను గమనించినప్పుడు చేయగలిగింది నీటిని శుద్ధి చేయడం మాత్రమే. నీటిలో సంచరించే విర్యాన్ కణాలు / వైరస్ కణాల రోగ కారకతను తగ్గించేందుకు బ్లీచింగ్ పౌడర్(ఎకరాకు 25 కిలోల మోతాదు) లేదా ఫార్మలిన్ ద్రావణం(చెరువు లోతును బట్టి ఎకరానికి 5-10 లీటర్లు) వాడటం ఒక్కటే పరిష్కారం. * అయితే, రొయ్య శరీరంలోని వైరస్ నిర్మూలనకు మందులు లేవు. పైన చెప్పుకున్న మందులు శరీరంలోని వైరస్‌ను ఏమీ చేయలేవు. * వైరస్ తీవ్రత వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. తెల్లమచ్చల వైరస్ కణం రొయ్య శరీరంలోకి ప్రవేశించిన 6 గంటల నుంచి కణజాలంలో వ్యాధికి సంబంధించిన మార్పులు మొదలవుతాయి. * తెల్లమచ్చల వైరస్ వ్యాధి స్కాంపీ, టైగర్ రొయ్యల్లో కంటే తెల్ల రొయ్యలు, వెనామీ రొయ్యలకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. - ఆచార్య పి. హరిబాబు, ప్రభుత్వ మత్స్యకళాశాల, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా -
జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్ర విభజనానంతరం కడప జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని జేవీవీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా ఓబుల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు రమణయ్య శుక్రవారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌బాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. శివరామకృష్ణన్ కమిటీ జిల్లాను ఇంకా సందర్శించలేదన్నారు. ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థ ను ప్రకటించలేదని, రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు. జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం, మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ లాంటి సంస్థలను, అంతర్జాతీయ భాషా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపార ప్రయోజనాలే కాకుండా చారిత్రక నేపథ్యం, భవిష్యత్తు తరాల ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకుని రాజధానిపై శాస్త్రీయమైన, పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కడప-రేణిగుంట, కడప-చిత్తూరు, కడప-బెంగుళూరు రోడ్లను 4 లైన్లుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో జేవీవీ పట్టణ కార్యదర్శి రమణ, గోపినాథరెడ్డి, రాజేష్‌రెడ్డి, రచయిత జింకా సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
కడపకు చంద్ర గ్రహణం
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ కక్షతో కడప జిల్లా దశాబ్దాల త రబడి నిర్లక్ష్యానికి గురైంది. రాయలసీమ ప్రాంతవాసులే ముఖ్యమంత్రులుగా ఉన్నా అన్ని విధా లా వెనుకబడింది. మూడు దశాబ్దాలుగా వివక్షకు గురైన జిల్లాకు మరోమారు ‘చంద్ర’గ్రహణం పట్టింది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌ లిక సదుపాయాలు అం దుబాటులో ఉన్నా విస్మరిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అభివృద్ధి ఫలాలు దక్కుతాయనే కనీస స్పృహ లేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జిల్లాను అప్రాధాన్యత జాబితాలో చేర్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెనుకబడిన కడప జిల్లా ‘దశ-దిశ’ 2004-2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మారింది. జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా పయనించింది. కేజీ నుంచి పీజీ వరకూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చింది. కేంద్రీయ విద్యాలయం, హైదరాబాదు పబ్లిక్ స్కూలు, యోగివేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ట్రిపుల్ ఐటీ, రాజీవ్‌గాంధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాల, దంత వైద్య కళాశాల, పశువైద్య విద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దాల్మియా, భారతి సిమెంటు కర్మాగారాలు, పాలిమర్స్ పరిశ్రమలు వచ్చి చేరాయి. అదే విధంగా రహదారుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటివి ప్రత్యేక ప్రాధాన్యతతో చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, అభివృద్ధి ఫలాలు దక్కుతాయనుకున్న తరుణంలో అర్ధంతరంగా ప్రాజెక్టులు ఆగిపోయాయి. స్వల్ప మొత్తం ఖర్చు పెడితే అభివృద్ధి కళ్లెదుట కన్పించనుంది. అలాంటి పథకాలు సైతం దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కలెక్టరేట్ కాంప్లెక్స్, అంతర్జాతీయ పశుపరిశోనా కేంద్రం నిలుస్తున్నాయి. మెగా పరిశ్రమల కోసమే.. ఉపాధి మార్గాలు చూపడం ద్వారా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్‌ను కూకటి వేళ్లతో పెకలించవచ్చని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ భావించారు. అందులో భాగంగా కడప సమీపంలో చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు మండలాల పరిధిలోని ప్రభుత్వ, డీకేటీ భూములను ఏపీఐసీసీ ద్వారా సేకరించి పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ మేరకు కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ పరిధిలో 6464.5 ఎకరాలు భూ సేకరణ చేశారు. అందుకోసం సోమశిల వెనుక జలాల నుంచి నీటి వసతి కల్పనకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా రూ.450 కోట్లతో నీటి వసతి ఏర్పాటుకు పనులు చేపట్టారు. అందులో రూ.150 కోట్ల మేర పనులు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చేసిన పనులకు బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆ పనులు నిలిపేశారు. కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినా భరోసా కల్పించేవారు లేక వెనుతిరిగారు. భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ (బీడీఎల్) ఏర్పాటుకు ప్రతినిధుల బృందం కడప మెగా ఇండస్ట్రియల్ పార్కును సందర్శించి అనువైన ప్రదేశంగా గుర్తించారు. ఆ మేరకు 600 ఎకరాలు కేటాయించాలంటూ అభ్యర్థించా రు. విమానాల స్పేర్‌పార్ట్స్, రక్షణ విభాగాలు ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ ప్రతి నిధులు ఏపీఐఐసీ ఎండీతో సైతం చర్చించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రె డ్డి నుంచి సానుకూలత లేకపోవడంతో వెనుదిరిగారు. కడప లో నెలకొల్పాల్సిన ఆ పరి శ్రమ చిత్తూరు జిల్లా పలమనేరులో ఏర్పాటు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గారని సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం అన్ని జిల్లాల్లో అటు పారిశ్రామికంగానో, ఇటు వైద్యం, అత్యున్నత విద్య పరంగానో అభివృద్ధికి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి జాబితాలో వైఎస్సార్ జిల్లాకు మాత్రం చోటు దక్కడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల సమీక్షలోనైనా గుర్తింపు దక్కేనా... గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులతోపాటు, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లుతో సమీక్ష నిర్వహించనున్నారు. అందులోనైనా జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందా అని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైఎస్సా ర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు, విద్యుత్ జనరేషన్ ప్లాం ట్ల నిర్మాణానికి ఆశావహులు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ప్రతిపాదనలు తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే తక్కువ ఖర్చుతో పూర్తి కాగల సాగునీటి ప్రాజెక్టుల వివరాలు రూపొందించినట్లు తెలుస్తోంది. తుది దశకు చేరిన విమానాశ్రయం, కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయని వివరించనున్నట్లు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పట్ల ఏమేరకు దయచూపుతారో వేచి చూడాల్సిందే.