కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ యదేచ్ఛగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు ఎప్పుటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉన్నారు. తాజాగా కడప జిల్లాలో మైదకూరు మండలం జీవిసత్రం వద్ద అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 10 లక్షల విలువచేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు