
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ కడప: ఓ యువకుడు, మహళ కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని రాజంపేట మండలంలోని లక్కిరెడ్డిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. నాగేంద్ర(21) అనే యువకుడు రుక్మిణి(35) అనే మహిళ కలిసి లక్కిరెడ్డిపల్లె మండలంలోని కొండ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి మధ్య గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు.
కాగా యువకుడు, మహిళ ద్విచక్ర వాహనంపై లక్కిరెడ్డిపల్లి నుంచి నందివాళ్ల పల్లె రోడ్డు మార్గాన అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినోద్ తెలిపారు. ఈ మేరకు ఇరువురు బంధువులను పిలిపించి వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
చదవండి: తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు..
Comments
Please login to add a commentAdd a comment