గండికోటలో పూర్తయినా పనిచేయని అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమి భవనం
సాక్షి, కడప: గండికోటలో అడ్వెంచర్స్ స్టోర్ట్సు అకాడమీ విషయంలో ముందడుగు పడలేదు. భవనం దాదాపు పూర్తయి మౌలిక సదుపాయాలు కలి్పంచే సమయానికి నిలిచిపోయింది. జాతీయ స్థాయిలో అద్బుతమైన, ఆదర్శవంతమైన అకాడమిగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం తర్వాత విస్మరించింది. అకాడమి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లాకు దేశం చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎక్కడో హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశీ్మర్ లాంటి ప్రాంతాలలో మాత్రమే ఒకటి, రెండు ఇలాంటి అకాడమిలు పర్వతారోహకులకు ట్రెక్కింగ్ శిక్షణ ఇస్తున్నాయి. కోటలో నేషనల్ అడ్వెంచరస్ అకాడమి పూర్తయితే ఈ ప్రాంతంలో నిత్యం పర్యాటకులు పర్వతారోహకుల సందడి ఉంటుందని జిల్లా వాసులు ఆనందించారు.
వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. వాస్తవానికి ఈ అకాడమి పనిచేయడం మొదలైతే ఇక్కడ పర్వతారోహణతోపాటు పెన్నానది, మైలవరం జలాశయం నీటిలో జల సాహస కృత్యాలను కూడా నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. కోటలో విశాలమైన మైదానాలు ఉన్నాయి గనుక అక్కడ పారా గ్‌లైడింగ్ లాంటి ఆకాశయాన సాహస కృత్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుత కలెక్టర్ హరి కిరణ్ ఇటీవల గండికోటలో రెండు, మూడు రోజులపాటు పారా గ్‌లైడింగ్‌ను ఏర్పాటు చేశారు. మిగతా చోట ఉన్న ఒకటి, రెండు అకాడమిలలో పర్వతారోహణకు మాత్రమే అవకాశం ఉందని, గండికోటలో అకాడమి ఏర్పాటైతే మూడు రకాల సాహస కృత్యాలకు ప్రధాన వేదికగా మారే అవకాశం ఉందని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు.
అకాడమిలో ఈ క్రీడలకు సంబంధించి పలు ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆయా సాహస కృత్యాలలో శిక్షణ పొందేందుకు ఇక్కడికి వస్తారు గనుక మన ప్రాంతంలో సాహస క్రీడాకారుల సందడి పెరుగుతుంది. జిల్లాకు ఆర్థికంగా కూడా మేలు జరిగే అవకాశం ఉంది. అకాడమి భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు కూడా సాగినట్లు సమాచారం. జిల్లాపై అభిమానం గల కొందరు అధికారులు గట్టిగా ప్రయతి్నంచి దీన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ అడ్వెంచర్స్ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలని పర్యాటకులు కోరుతున్నారు.
దేశ వ్యాప్త గుర్తింపు
గండికోటలో నిర్మాణం ప్రారంభమైన నేషనల్ అడ్వెంచర్స్ అకాడమి ద్వారా జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. పర్వత, జల, వాయువు మూడు రకాల అడ్వెంచర్లకు అవకాశం గండికోటలో మాత్రమే ఉంటుంది. కనుక ఈ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే చేపడితే బాగుంటుంది.
– కేవీ రమణారెడ్డి, రాయలసీమ పర్యాటక సంస్థ సీనియర్ సభ్యులు
జిల్లాకు ప్రతిష్ఠ
సాహస కృత్యాల అకాడమిలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. మన ప్రాంతాలలో బొత్తిగా లేవు. గండికోటలో ఈ అకాడమి నిర్మాణం పూర్తి చేయగలిగితే జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక రంగానికి పట్టం కట్టే దిశగా సాగతోంది గనుక ఈ అకాడమి నిర్వహణ ప్రభుత్వమే చేపడుతుందని భావిస్తున్నా! – పి.సంతోష్‌కుమార్, ఫ్యాకలీ్ట, వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment