sports academy
-
వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన సీఎం జగన్
Live Updates ►పులివెందులలో నూతనంగా రూ. 26.12కోట్లతో నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్ ►రాష్ట్రంలో రెండవ హాకీ టర్ఫ్ కోర్టును ప్రారంభించిన సీఎం జగన్ ►హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు,ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టు ప్రారంభించిన సీఎం జగన్ ►ఇడుపులపాయకు తిరుగు ప్రయాణమైన సీఎం జగన్ ►పులివెందులలో ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ►కార్యక్రమానికి హాజరైన మంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ►పులివెందులలో వైఎస్సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ► గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం పులివెందులలో పలు ప్రారంభోత్సోవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ►ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట: సీఎం జగన్ ►ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం ►స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తాం ►గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది ►ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు ►గండికోటకు మరో స్టార్ గ్రూప్‌ను కూడా తీసుకొస్తాం ►కొప్పర్తి డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు ►కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు(సోమవారం) ఎంవోయూలు చేసుకుంటాం ► గండికోట చారిత్రాత్మక ప్రదేశం: సీఎస్ జవహర్‌రెడ్డి ► పర్యాటక రంగంలో కొత్త అధ్యాయానికి సీఎం శ్రీకారం చుట్టారు ► పోలవరం ప్రాంతాల్లో కూడా పర్యాటక అభివృద్ధి ► గండికోట దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది ► రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారు: మంత్రి రోజా ► అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తున్నారు ►ఏపీలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ►రికార్డు సృష్లించాలన్నా.. బద్ధలుగొట్టాలన్నా సీఎం జగన్‌కే సాధ్యం ► ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ జిల్లా గండికోటలో సీఎం భూమి పూజ చేశారు. విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపనం చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్‌సింగ్ ఒబెరాయ్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ► మూడు చోట్ల ఒబెరాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించనుంది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ట్స్ హోటల్స్ నిర్మాణం జరగనున్నాయి. ► గండికోట చేరుకున్న సీఎం జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శుంకుస్థాపన చేశారు. అనంతరం వ్యూపాయింట్‌ను పరిశీలించారు. ►ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ గండికోట బయల్దేరారు. సాక్షి, కడప: వైఎస్సార్ కడప జిల్లాలో నేడు(ఆదివారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 9.20 నిమిషాలకు గండికోటకు చేరుకోనున్నారు. అక్కడ ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం పులివెందుల రాణితోపు చేరుకొని నగరవనాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి గరండాల రివర్ ఫ్రంట్ చేరుకొని.. గరండాల కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్-1 పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన(వైఎస్ఆర్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు అనంతరం పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకుపులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. చదవండి: ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు -
‘నా అకాడమీని ఆక్రమిస్తున్నారు’
తిరువనంతపురం: అథ్లెటిక్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కన్నీళ్ల పర్యంతమైంది. కోజికోడ్‌లోని తన అకాడమీలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి భద్రతపై కూడా ఉష తన బాధను వెల్లడించింది. ‘నా అకాడమీ మధ్యలోనే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మేం బౌండరీ నిర్మించుకునేందుకు కూడా అడ్డు పడుతున్నారు. అదేమని అడిగితే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశా ను. ఆయన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా అకాడమీలోని 25 మంది మహిళా అథ్లెట్లలో 11 మంది ఉత్తరాదికి చెందినవారు. వారి భద్రత మాకు ముఖ్యం’ అని ఉష పేర్కొంది. సుమారు 30 ఎకరాల ఈ అకాడమీ స్థలాన్ని కేరళలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషకు 30 సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చింది. గత జూలైలో రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత తనపై ఇలాంటి వేధింపులు పెరిగాయని ఉష చెబుతోంది. దురదృష్టవశాత్తూ ప్రతీ రాజకీయ పార్టీ తనను మరో పార్టీ సానుభూతిపరురాలిగా చూస్తోందని, అయితే తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవని ఉష తన బాధను ప్రకటించింది. -
స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన టీమిండియా కెప్టెన్
టీమిండియా పార్ట్ టైమ్ వన్డే కెప్టెన్ శిఖర్ ధవన్ నిన్న (ఆగస్ట్ 5) ఢిల్లీలో స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు. క్షేత్ర స్థాయి క్రీడాకారుల్లో నైపుణ్యాలను కనుగొని, వారిని ఆయా విభాగాల్లో మరింత రాటుదేల్చాలనే ధ్యేయంతో ఈ అకాడమీని నెలకొల్పుతున్నట్లు ధవన్ తెలిపాడు. ఈ అకాడమీకి 'డా వన్' అనే పేరును ఖరారు చేశాడు. క్రికెట్‌తో పాటు మరో 8 క్రీడాంశాల్లో క్రీడాకారులకు ఈ అకాడమీ శిక్షణ ఇవ్వనుందని తెలిపాడు. ఈ అకాడమీలో క్రీడాకారులతో పాటు కోచ్‌లకు కూడా శిక్షణ ఉంటుందని పేర్కొన్నాడు. కోచ్‌లు క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇచ్చేలా సానబెడతామని అన్నాడు. దేశవ్యాప్తంగా ఉత్తమ కోచ్‌లను ఎంపిక చేసి డా వన్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తామని వివరించాడు. క్రికెట్ నాకెంతో ఇచ్చింది.. అందుకు తనవంతుగా క్రీడలకు వీలైనంత సాయం చేయాలని భావిస్తున్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో వన్డేల్లో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న శిఖర్ ధవన్.. త్వరలో జింబాబ్వేలో వన్డే సిరీస్ కూడా కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో శ్రీలంక, వెస్టిండీస్ పర్యటనల్లో భారత్‌కు అద్భుతమైన విజయాలు అందించిన ధవన్.. జింబాబ్వేతో సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి రెగ్యులర్ వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని భావిస్తున్నాడు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్న నేపథ్యంలో ధవన్ కెప్టెన్సీ అంశం ఆసక్తికరంగా మారింది. ధవన్ సైతం తనను టీ20లకు పరిగణలోకి తీసుకోకపోవడంపై పెద్దగా స్పందించకపోవడం చూస్తుంటే అతను మున్ముందు వన్డే ఫార్మాట్‌కు (కెప్టెన్‌గా) మాత్రమే పరిమితమవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జింబాబ్వే పర్యటన వివరాలు.. తొలి వన్డే ఆగస్టు 18 రెండో వన్డే ఆగస్ట్ 20 మూడో వన్డే ఆగస్ట్ 22 జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ చదవండి: ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్! -
ధర్మాన కృష్ణదాస్ అంటే జిల్లాల్లో క్రీడాకారుడిగానే తెలుసు
సాక్షి, శ్రీకాకుళం: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జిల్లాలోని ఎన్టీఆర్ఎంహెచ్ స్కూల్ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజయరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ షూటింగ్ అకాడమీ , విక్రాంత్ బాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రిగా క్రీడలంటే నాకు చాలా ఇష్టం. ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసు.క్రీడలతోనే నాకు గుర్తింపు వచ్చింది. స్కూల్లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడిని ఆటల కోసమే విశాఖ వెళ్లి డిగ్రీలో చేరాను.గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవి.. ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఆన్ స్పోర్ట్స్ క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం . ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే ... వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది నా భావన క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి. సమాజం పట్ల గౌరవం , క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయి.' అని మంత్రి చెప్పుకొచ్చారు. -
జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం
మొయినాబాద్ (చేవెళ్ల): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 110 స్టేడియాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ రెవెన్యూలో ఉన్న సుజాత స్కూల్ ఆవరణలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన సోమవారం సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు, దేశానికి ఆదర్శంగా ఉండే నూతన స్పోర్ట్స్ పాలసీని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. స్టార్ షట్లర్ జ్వాల అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో జ్వాల అకాడమీతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కలిసి పనిచేస్తుందన్నారు.లీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్రం జయవంత్, జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్ పాల్గొన్నారు. సిద్ధమైన కోర్టులు -
జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అకాడమీ స్థాపించిన జ్వాల గుత్తాకి, ఆమె కుటుంబ సభ్యులకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. చైనాలో లాగా భారత్‌లోనూ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకోస్తామని వివరించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనన్నారు. జ్వాల అకాడమీ నడిపేందుకు స్పోర్ట్స్ అకాడమీ ఆఫ్ తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. జ్వాల గుత్తా మాట్లాడుతూ.. అకాడమీ కల నెరవేరింది. హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన జ్వాల.. తనలాంటి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అకాడమీ స్థాపించడం గర్వకారణమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత ప్రతిభని వెలికితీసేందుకు ప్రతి ఏడాది సీఎం కప్ నిర్వహిస్తామని జ్వాల చెప్పడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి పైగా స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు. Ministers @KTRTRS, @VSrinivasGoud and Badminton star @Guttajwala toured the Jwala Gutta Academy of Excellence and interacted with the sports persons training at the Academy. pic.twitter.com/h8Tl7NwXSh — KTR News (@KTR_News) November 2, 2020 -
అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ ఆగినట్టేనా..
సాక్షి, కడప: గండికోటలో అడ్వెంచర్స్ స్టోర్ట్సు అకాడమీ విషయంలో ముందడుగు పడలేదు. భవనం దాదాపు పూర్తయి మౌలిక సదుపాయాలు కలి్పంచే సమయానికి నిలిచిపోయింది. జాతీయ స్థాయిలో అద్బుతమైన, ఆదర్శవంతమైన అకాడమిగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం తర్వాత విస్మరించింది. అకాడమి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జిల్లాకు దేశం చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఎక్కడో హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశీ్మర్ లాంటి ప్రాంతాలలో మాత్రమే ఒకటి, రెండు ఇలాంటి అకాడమిలు పర్వతారోహకులకు ట్రెక్కింగ్ శిక్షణ ఇస్తున్నాయి. కోటలో నేషనల్ అడ్వెంచరస్ అకాడమి పూర్తయితే ఈ ప్రాంతంలో నిత్యం పర్యాటకులు పర్వతారోహకుల సందడి ఉంటుందని జిల్లా వాసులు ఆనందించారు. వారి ఆశలు అంతలోనే ఆవిరైపోయాయి. వాస్తవానికి ఈ అకాడమి పనిచేయడం మొదలైతే ఇక్కడ పర్వతారోహణతోపాటు పెన్నానది, మైలవరం జలాశయం నీటిలో జల సాహస కృత్యాలను కూడా నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. కోటలో విశాలమైన మైదానాలు ఉన్నాయి గనుక అక్కడ పారా గ్లైడింగ్ లాంటి ఆకాశయాన సాహస కృత్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుత కలెక్టర్ హరి కిరణ్ ఇటీవల గండికోటలో రెండు, మూడు రోజులపాటు పారా గ్లైడింగ్ను ఏర్పాటు చేశారు. మిగతా చోట ఉన్న ఒకటి, రెండు అకాడమిలలో పర్వతారోహణకు మాత్రమే అవకాశం ఉందని, గండికోటలో అకాడమి ఏర్పాటైతే మూడు రకాల సాహస కృత్యాలకు ప్రధాన వేదికగా మారే అవకాశం ఉందని ఈ రంగ నిపుణులు భావిస్తున్నారు. అకాడమిలో ఈ క్రీడలకు సంబంధించి పలు ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆయా సాహస కృత్యాలలో శిక్షణ పొందేందుకు ఇక్కడికి వస్తారు గనుక మన ప్రాంతంలో సాహస క్రీడాకారుల సందడి పెరుగుతుంది. జిల్లాకు ఆర్థికంగా కూడా మేలు జరిగే అవకాశం ఉంది. అకాడమి భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు కూడా సాగినట్లు సమాచారం. జిల్లాపై అభిమానం గల కొందరు అధికారులు గట్టిగా ప్రయతి్నంచి దీన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ అడ్వెంచర్స్ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలని పర్యాటకులు కోరుతున్నారు. దేశ వ్యాప్త గుర్తింపు గండికోటలో నిర్మాణం ప్రారంభమైన నేషనల్ అడ్వెంచర్స్ అకాడమి ద్వారా జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. పర్వత, జల, వాయువు మూడు రకాల అడ్వెంచర్లకు అవకాశం గండికోటలో మాత్రమే ఉంటుంది. కనుక ఈ అకాడమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే చేపడితే బాగుంటుంది. – కేవీ రమణారెడ్డి, రాయలసీమ పర్యాటక సంస్థ సీనియర్ సభ్యులు జిల్లాకు ప్రతిష్ఠ సాహస కృత్యాల అకాడమిలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. మన ప్రాంతాలలో బొత్తిగా లేవు. గండికోటలో ఈ అకాడమి నిర్మాణం పూర్తి చేయగలిగితే జిల్లా ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక రంగానికి పట్టం కట్టే దిశగా సాగతోంది గనుక ఈ అకాడమి నిర్వహణ ప్రభుత్వమే చేపడుతుందని భావిస్తున్నా! – పి.సంతోష్‌కుమార్, ఫ్యాకలీ్ట, వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం -
ఆ ఫోటోల గురించి తర్వాత మాట్లాడదాం: గుత్తా జ్వాల
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీటర్లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. బుధవారం తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్లో షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే వార్తలు హల్‌చేస్తున్నాయి. అయితే వీటిపై మాట్లాడటానికి గుత్తా జ్వాల నిరాకరించారు. గురువారం బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించిన జ్వాల మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా ఆ ఫోటోలకు గురించి జ్వాలను ప్రశ్నించగా తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశారు.(ఇక్కడ చదవండి: హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) కాగా, ప్రస్తుతం తాను ప్రారంభించిన అకాడమీని సుమారు రూ. 14 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. ఇది కూడా అతి పెద్ద అకాడమీనేనని చెప్పిన జ్వాల.. కేవలం బ్యాడ్మింటన్‌కే కాకుండా మిగతా స్పోర్ట్స్‌కు కూడా ఈ అకాడమీ సేవలందిస్తుందన్నారు. తనకు ఇతర రాష్ట్రాల్లో కూడా అకాడమీలను నిర్మిస్తారా అన్న ప్రశ్నకు.. అవకాశం వస్తే అక్కడ కూడా నిర్మిస్తానని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైస్కూల్ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తోపాటు క్రికెట్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. -
దాని గురించి తర్వాత మాట్లాడదాం
-
జ్వాల కొత్త క్రీడా అకాడమీ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆధ్వర్యంలో కొత్త క్రీడా అకాడమీ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైసూ్కల్ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తోపాటు క్రికెట్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. అకాడమీకి సంబంధించిన లోగోను మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత స్టార్ రెజ్లర్, బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన సుశీల్ కుమార్... భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూడీ పాల్గొన్నారు. ‘భారత్ ఎంతో పెద్ద దేశం. కానీ మనకు బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య పెరగాలి. జ్వాల అకాడమీ ద్వారా చాంపియన్లను తయారు చేయాలని అనుకుంటున్నాను. నా అకాడమీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును కలిశాను. ఆయన నుంచి సానుకూల స్పందన వచి్చంది. అకాడమీ నిర్మాణం కోసం ఎవరి సహాయం తీసుకోలేదు. సొంతంగా ఏర్పాటు చేశాను. నా అకాడమీలో కనీసం 10 మంది కోచ్‌లు ఉంటారు. అందులో ఇద్దరు విదేశీ కోచ్‌లు’ అని జ్వాల వివరించింది. వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ అకాడమీలో చేరాలనుకునే వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 8826984583, 9811325251 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. -
మట్టిలో మాణిక్యానికి కావాలి చేయూత
సాక్షి, కమాన్‌చౌరస్తా: తనొక సాధారణ కుటుంబానికి చెందిన యువతి కాని కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. కాని ఆర్థిక ఇబ్బందులు ఆమెను కలవరపెడుతున్నాయి. తనలోని టాలెంట్‌ను గుర్తించిన సన్నిధి ఫౌండేషన్ తమ వంతు చేయూతనిచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన కరాటే, కిక్‌బాక్సింగ్ క్రీడాకారిణి కందుల మౌనికకు సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు అండగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఆమెకు ఏషియన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం రాగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు మంగళవారం రూ.5 వేలు అందజేశారు. క్రీడల్లో రాణించి, తనకు సహకరిస్తోన్న వారి నమ్మకాన్ని నిలబెడతానని మౌనిక తెలిపింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రాధారపు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షుడు అంబాల ప్రదీప్‌రెడ్డి, పృధ్యున్నత్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా విద్యకు ఎన్ఎండీసీ సహకారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్ఎండీసీ.. క్రీడా విద్య ప్రోత్సాహానికి తన వంతు సహకారాన్ని అందించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, టెన్విక్ స్పోర్స్లు సంయుక్తంగా పలు పాఠశాలల్లో అందిస్తున్న క్రీడా విద్య కార్యక్రమాలకు ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ రూ.2 కోట్లను అందించనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ గౌరవ్ ద్వివేది, సంస్థ డైరెక్టర్ సందీప్ తులా, టెన్విక్ చైర్మన్ అనీల్ కుంబ్లే ఈమేరకు కుదిరిన ఎంఓఏలపై సంతకాలు పూర్తిచేశారు. -
ఆటాడుకుందాం రా..!
భద్రాచలం : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థుల అభివృద్ధి కోసం మరో సరికొత్త కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుడుతున్నారు. గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఇది రూపుదిద్దుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గురుకులాల్లో 22 చోట్ల మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తగిన తర్ఫీదు ఇచ్చే క్రమంలో క్రీడా మినీ అకాడమీలను ఏర్పాటు చేస్తుండటం గిరిజన సంక్షేమ విద్యాశాఖ చరిత్రలో ఇదే ప్రథమం. దీనిలో భాగంగా ఖమ్మం రీజియన్‌కు 3 చోట్ల మినీ క్రీడా అకాడమీలు మంజూరు కాగా, ఇవి భద్రాద్రి జిల్లాకే కేటాయించటం శుభ పరిణామం. భద్రాచలం, సుదిమళ్ల, కిన్నెరసాని గురుకులాలకు వీటిని మంజూరు చేశారు. భద్రాచలంలోని మినీ అకాడమీని సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గురుకుల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆ సంస్థ ఖమ్మం రీజియన్ కో ఆర్డినేటర్ ఎస్కే బురాన్ తెలిపారు. అకాడమీ ప్రారంభోత్సవాన్ని వేడుకగా జరిపేందుకు ఒక్కో చోట ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. భద్రాచలంలో ఆర్చరీ, సుదిమళ్లలో బాల్ బ్యాడ్మింటన్, కిన్నెరసాని గురుకులంలో వాలీబాల్ క్రీడలో తర్ఫీదు ఇచ్చేందుకు ఈ అకాడమీలు ఏర్పాటు కాబోతున్నాయి. చదువులతో పాటే క్రీడలు... గురుకులాల్లో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా మినీ అకాడమీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు. విద్యార్థులకు చదువుతో పాటు, వారికి ఆసక్తి ఉన్న ఆటలో శిక్షణ ఇచ్చి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ అకాడమీల్లో తర్ఫీదు ఇస్తారు. ఇందకోసం ఆయా అకాడమీకి ఎంపిక చేసిన క్రీడాంశంలో నైపుణ్యం గల ఫిజికల్ డైరెక్టర్‌ను కేటాయిస్తారు. ఒక్కో అకాడమీలో 20 నుంచి 25 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 147 గురుకులాల నుంచి ఆయా క్రీడల్లో ఆసక్తి, రాణించే విద్యార్థులను ఎంపిక చేసి అకాడమీలకు పంపించేలా ఏర్పాట్లు చేశారు. అడ్మిషన్ పొందిన గురుకులంలోనే విద్యార్థి పేరు నమోదవుతుంది. అయితే ఆయా క్రీడకు సంబంధించిన అకాడమీ ఎక్కడ ఉంటే అక్కడికెళ్లి చదవాల్సి ఉంటుంది. గిరిజన విద్యార్థులకు ఎంతో మేలు... ఖమ్మం రీజియన్ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు కలిపి 26 విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే భద్రాద్రి జిల్లాలోనే 21 విద్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం రీజియన్‌కు మంజూరైన 3 అకాడమీలను జిల్లాకు కేటాయించారు. జిల్లాలో ఇప్పటికే పాల్వంచ మండలం కిన్నెరసానిలో ఆర్చరీకి సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. ఇక్కడ తర్ఫీదు పొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ప్రస్తుతం భద్రాచలం గురుకులంలో శాశ్వతంగా అకాడమీని ఏర్పాటు చేస్తుండటంతో తురుఫు ముక్కల్లాంటి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉంది. గిరిజన విద్యార్థులకు దీంతో ఎంతో మేలు చేకూరనుంది. విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్... గురుకులాల్లో మినీ అకాడమీలను ఏర్పాటు చేసు ్తన్న నేపథ్యంలో ఆయా చోట్ల ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డ్రెస్‌లను ఆయా గురుకులాలకు సరఫరా చేశారు. షూస్, ట్రాక్ షూ కూడా అందజేస్తారు. ఇందుకోసం ప్రతీ గురుకులానికి రూ. 50 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. భద్రాచలం వంటి పాఠశాలలకు బ్యాండ్ సెట్ అదనంగా సరఫరా చేశారు. విద్యార్థుల టూకే రన్.. గురుకులాల్లో మినీ అకాడమీలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో ఆదివారం విద్యార్థులు టూకే రన్ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం నుంచి చర్ల రహదారి వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. -
11, 12 తేదీల్లో 'వీవీఎస్ అకాడమీ' సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్రికెట్ సెలక్షన్స్ జరుగనున్నాయి. ఈనెల 11, 12 తేదీల్లో నిజామాబాద్‌లోని ఎంఎస్ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో తొలి విడత సెలక్షన్స్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీలో రెండో విడత సెలక్షన్స్ జరుపుతారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఏప్రిల్, మే నెలల్లో ఉచిత శిక్షణనిస్తారు. శిక్షణాకాలంలో రాణించిన క్రీడాకారులకు జూన్ నుంచి హెచ్‌సీఏ నిర్వహిం చే లీగ్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం దక్కుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 9 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ (98489 45522)ను సంప్రదించవచ్చు. -
వీవీఎస్ అకాడమీ సిద్ధం
వచ్చే నెలలో ప్రారంభించనున్న లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: చాలా మంది మాజీ క్రికెటర్ల బాటలోనే హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇప్పుడు కోచింగ్‌లోకి ప్రవేశిస్తున్నాడు. 134 టెస్టుల్లో 8,781 పరుగులు చేసిన ఈ దిగ్గజ ఆటగాడు త్వరలోనే నగరంలో సొంత క్రికెట్ కేంద్రాన్ని ప్రారంభించనున్నాడు. ‘వీవీఎస్ స్పోర్ట్స్ అకాడమీ’ పేరుతో సిద్ధమవుతున్న ఈ అకాడమీ ఏప్రిల్ 4న ప్రారంభం కానుంది. బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ ఈ వివరాలు వెల్లడించారు. నగర శివార్లలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో ఇది ఏర్పాటవుతోంది. ప్రాథమికంగా రెండు నెలల పాటు ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరం నిర్వహించి, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కోచింగ్‌ను కొనసాగిస్తారు. భిన్న రకాల వికెట్లతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని, తనకు ఇంతటి స్థాయి కల్పించిన ఆటకు ఇది సేవ చేయడమేనని అన్నాడు. ‘2012లో నేను రిటైర్ అయిననాటినుంచి చాలా మంది అకాడమీ ఎప్పుడు పెడుతున్నారని అడిగేవారు. నాకున్న గుర్తింపు ప్రకారం, వారి అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా అత్యుత్తమ శిక్షణ అందించడం నా బాధ్యత. ఇది నా కలల ప్రాజెక్ట్. సీనియర్ కోచ్‌లు ఇక్కడ శిక్షణ ఇవ్వనుండగా...నాకున్న స్నేహాలతో పలు విదేశీ క్రికెటర్ల ద్వారా కూడా ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాను. సాధ్యమైనంత ఎక్కువ సమయం నేను కూడా శిక్షణ అందించేందుకు వెచ్చిస్తాను. వచ్చే కొన్నేళ్లలో గొప్ప ఆటగాళ్లు నా అకాడమీలో తయారు కావాలని, ఆటగాడిగానే కాకుండా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన వ్యక్తిగా కూడా నన్ను గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. -
శోభమ్మ జ్ఞాపకాలతో...
అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు * త్వరలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు : భూమా నాగిరెడ్డి సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత శోభా నాగిరెడ్డి (46) జయంతిని ఈనెల 16వ తేదీన నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. శోభా నాగిరెడ్డి మరణించిన తర్వాత వచ్చిన మొదటి జయంతి కావడంతో ఆమె జ్ఞాపకార్థం ఆళ్లగడ్డ, నంద్యాలలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఆళ్లగడ్డలో 200 మందితో రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా అన్ని హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నామని, హరిజనవాడ, మురికివాడలల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇక నంద్యాలలోని బధిరుల పాఠశాలతో పాటు హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఆయన ‘సాక్షి’కి వివరించారు. గోశాలల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు! శోభా నాగిరెడ్డి పేరుతో ప్రత్యేకంగా స్పోర్ట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు భూమా నాగిరెడ్డి తెలిపారు. ఈ అకాడమీ ద్వారా యువతకు.. ప్రత్యేకించి గ్రామీణ యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆమె మరణించిన తర్వాత జయంతి నాటికే అనేక కార్యక్రమాలు నిర్వహించాలని భావించామని.. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామని భూమా ప్రకటించారు. నిరాడంబరంగా.. నంద్యాల టౌన్: నిరాడంబరంగా ఉండటమే శోభకు ఇష్టమని.. హంగూ ఆర్భాటాలకు ఆమె ఎప్పుడూ దూరమని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. మంగళవారం దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆయన తమ 28 ఏళ్ల అన్యోన్య దాంపత్య స్మృతులను సోమవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. పెళ్లయిన కొత్తలో ఆమె పుట్టిన రోజున కానుకలు ఇచ్చేవాడినని.. అందుకామె ఎన్నిచ్చినా నీ ప్రేమ, స్నేహం ముందు తక్కువనేవారన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆమె పుట్టిన రోజు తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. రెండు మూడు సార్లు పుట్టిన రోజున కలువలేకపోయానన్నారు. అప్పట్లో ఎంపీగా తాను ఢిల్లీలో, ఎమ్మెల్యేగా ఆమె హైదరాబాద్‌లో.. పిల్లలు హాస్టల్లో.. ఇలాంటి కారణాలతో ఆ వేడుకలు చేసుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నప్పుడు ఎడబాటు తప్పదని సర్దుకుపోయేవాళ్లమన్నారు. హైదరాబాద్‌లో అందరం కలిసినప్పుడు ఎంతో హాయిగా గడిపేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. శోభ ఎప్పుడూ ఆళ్లగడ్డ ప్రజల మధ్య ఉండటానికే అమితాసక్తి చూపేవారన్నారు. ఆమె పుట్టిన రోజు నాడు పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రజలతో ఇల్లు సందడిగా మారిపోయేదన్నారు. తుది శ్వాస వరకు కూడా ఆమె ప్రజల కోసమే పరితపించారన్నారు. శోభ భౌతికంగా దూరమైనా.. ప్రజల ఆదరాభిమానాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు. ఆమె లేకుండా పుట్టిన రోజు వేడుక జరుపుకోవాలంటే గుండె బరువెక్కుతోందన్నారు. ఆమె కలను సాకారం చేస్తూ.. నంద్యాల, ఆళ్లగడ్డను అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. పార్టీ శ్రేణులు కూడా ఆమె ఆశయ సాధన దిశగా పని చేసినప్పుడే శోభ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. -
పంజాబ్‌లో మిల్కా విగ్రహం
చండీగఢ్: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ విగ్రహం లూథియానాలో రూపుదిద్దుకుంటోంది. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందని ఫ్లయింగ్ సిఖ్ మిల్కా చెప్పారు. లూథియానాకు సమీప గ్రామమైన జార్ఖర్లో 28 అడుగుల ఎత్తై విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఒక స్పోర్ట్స్ అకాడమీ రూ. 7.5లక్షల వ్యయంతో ఈ ప్రతిమను నెలకొల్పుతోంది. డిసెంబర్ నెలాఖరుకల్లా దీని నిర్మాణం పూర్తవుతుందని ఆ అకాడమీ తెలిపింది. ‘గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడలకు ప్రాచుర్యం కల్పించేందుకు, బాలలు, యువత క్రీడల్లో రాణించేందుకు ఇది ప్రేరణగా నిలువనుంది’ అని మిల్కాసింగ్ అన్నారు.