మౌనికకు నగదు అందిస్తున్న సన్నిధి సభ్యులు
సాక్షి, కమాన్‌చౌరస్తా: తనొక సాధారణ కుటుంబానికి చెందిన యువతి కాని కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. కాని ఆర్థిక ఇబ్బందులు ఆమెను కలవరపెడుతున్నాయి. తనలోని టాలెంట్‌ను గుర్తించిన సన్నిధి ఫౌండేషన్ తమ వంతు చేయూతనిచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన కరాటే, కిక్‌బాక్సింగ్ క్రీడాకారిణి కందుల మౌనికకు సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు అండగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఆమెకు ఏషియన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం రాగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు మంగళవారం రూ.5 వేలు అందజేశారు. క్రీడల్లో రాణించి, తనకు సహకరిస్తోన్న వారి నమ్మకాన్ని నిలబెడతానని మౌనిక తెలిపింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రాధారపు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షుడు అంబాల ప్రదీప్‌రెడ్డి, పృధ్యున్నత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment