Boxing
-
2028 ఒలింపిక్స్‌లో బాక్సింగ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐఓసీ
కోస్టా నవరినో (గ్రీస్): లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీలు నిర్వహించే అంశంపై సందిగ్ధత వీడింది. ఆటలో సమగ్రత, నిర్ణయాల్లో స్పష్టత లేదనే కారణంగా 2022లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఒలింపిక్స్ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్‌ను చేర్చలేదు. కాగా... మంగళవారం నుంచి ఐఓసీ 144వ సెషన్ ప్రారంభం కానుండగా... దీనికి ముందు సోమవారం కార్యనిర్వాహక బోర్డు ఒలింపిక్స్‌లో బాక్సింగ్ క్రీడను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)ను పక్కన పెట్టి... ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు నిచ్చిన తర్వాత ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది.నేటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్న ఐఓసీ సెషన్లో థామస్ బాచ్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఇదే సెషన్లో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ను చేర్చే అంశానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలపనుంది. ‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్ సంఘానికి తాత్కాలిక గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదానికి పంపుతాం. ప్రపంచ బాక్సింగ్ సంఘం గుర్తించిన జాతీయ సమాఖ్యలకు చెందిన బాక్సర్లు నిరభ్యంతరంగా ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు.పాలనా సమస్యలపై సుదీర్ఘ వివాదంతో పాటు బౌట్ల సమగ్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా ఐబీఏ గుర్తింపును రద్దు చేశాం. అనంతరం గత రెండు ఒలింపిక్స్ (2020 టోక్యో, 2024 పారిస్) క్రీడల్లో బాక్సింగ్ పోటీలను తిరిగి పర్యవేక్షించాం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బాక్సింగ్‌కు ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించాం’ అని థామస్ బాచ్ వెల్లడించారు. ప్రపంచ బాక్సింగ్ సంఘం అధ్యక్షడు బోరిస్ ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో క్రీడకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. -
IPBL: అదరగొట్టిన భారత బాక్సర్లు
ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(IPBL)లో భాగంగా వరల్డ్ చాంపియన్స్‌తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్ బే- ఆంటొని పెట్టిస్ ఏపీఎఫ్సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో అక్షయ్ చహల్- సబరి జయశంకర్ సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.అక్షయ్-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్ లీగ్‌లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.అగ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ అసమాన హోస్ట్ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. -
‘బంగారం’లాంటి ఆటను వదిలి...
లండన్: జేడ్ జోన్స్... బ్రిటన్ ప్రొఫెషనల్ తైక్వాండో ప్లేయర్. అంతేకాదు! స్వదేశంలో జరిగిన 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో... 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో... మహిళల తైక్వాండో ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. తదనంతరం 2020 టోక్యో, 2024 పారిస్ విశ్వక్రీడల్లోనూ జేడ్ పాల్గొంది. 2010లో యూత్ ఒలింపిక్స్ స్వర్ణం మొదలు, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, యూరోపియన్ గేమ్స్, యూరోపియన్ చాంపియన్‌షిప్, గ్రాండ్‌ప్రి ఈవెంట్లలో 36 (19 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలు గెలుచుకుంది. జేడ్ జోన్స్ పతకాల సంఖ్య ఆమె వయసు (31 ఏళ్లు)ను ఎప్పుడో మించిపోయింది. బహుశా ‘కిక్’ కొడితే పతకాలు రాలుతున్న తైక్వాండో క్రీడాంశం బోర్ కొట్టించిదేమో తెలియదు కానీ ఈ బ్రిటన్ క్రీడాకారిణి ఇప్పుడు కొత్త ‘పంచ్’కు సిద్ధమైంది. బాక్సింగ్‌ను తెగ ఇష్టపడటం వల్లే 20 ఏళ్ల తర్వాత కొత్త కెరీర్లోకి అడుగుపెడుతున్నట్లు జోన్స్ చెప్పింది. రింగ్‌లో ఆమె అపుడే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. ‘ఇప్పటికే తైక్వాండోలో ప్రపంచ చాంపియన్ అయ్యాను. త్వరలో బాక్సింగ్‌లోనూ ప్రపంచ చాంపియన్ కావాలని ఆశిస్తున్నాను. రెండు వేర్వేరు క్రీడల్లో ఈ ఘనత సాధిస్తే గొప్పగా ఉంటుంది కదూ’ అని చెప్పింది. బ్రిటిష్, కామన్వెల్త్ ఫెదర్వెయిట్ మాజీ చాంపియన్ స్టీఫెన్ స్మిత్ కోచింగ్‌లో తీవ్రస్థాయిలో కసరత్తులు కూడా చేస్తోంది.అయితే మూడు పదుల వయసు దాటిన తర్వాత పూర్తిగా కొత్త క్రీడలో పతకాలు సాధించడం పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. 19 ఏళ్ల టీనేజ్లోనే జోన్స్ లండన్ విశ్వక్రీడల్లో బంగారు పతకం గెలిచింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ‘రియో’లో నిలబెట్టుకుంది. -
భారత బాక్సింగ్‌ను ముందుకు తీసుకెళ్తా!
న్యూఢిల్లీ: దేశంలో బాక్సింగ్‌కు మరింత వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పేర్కొన్నాడు. అందుకోసం అవసరమైతే భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడనని వెల్లడించాడు. భారత్ నుంచి ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన ఏకైక పురుష బాక్సర్ అయిన విజేందర్ సింగ్... బీఎఫ్ఐ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆకాంక్షించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ సింగ్... 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారమెత్తాడు.గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ యాక్టివ్‌గా లేని 39 ఏళ్ల విజేందర్ తాజాగా బీఎఫ్ఐ ఎన్నికలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయాలనుకుంటున్నా. నా జీవితం మొత్తం పోరాటాలే. ఇది కొత్త తరహాది అనుకుంటా. అయితే ఎన్నికల్లో మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను పట్టించుకోవడం లేదు. ఆటకు నా వల్ల ప్రయోజనం చేకూరుతుందనుకుంటే తప్పకుండా పోటీలో ఉంటా. మార్పు తెచ్చే అవకాశం ఉంటే దాని కోసం నా వంతు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బాక్సర్‌గా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కాదు. నేనెప్పటికీ అలా చేయను’ అని అన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సౌత్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన విజేందర్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. విదేశీ శిక్షణ ముఖ్యం భారత యువ బాక్సర్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని విజేందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘బాక్సింగ్ సమాఖ్యను మరింత బలోపేతం చేసేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం క్రీడల్లో వేగంగా వృద్ధి చెందుతోంది. మరో మూడేళ్లలో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో విశ్వక్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలంటే భారత బాక్సర్లు విదేశీ బాక్సర్లతో తరచూ తలపడాలి’ అని విజేందర్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. ప్రపంచ బాక్సంగ్ చాంపియన్‌షిప్ (2009)లో పతకం నెగ్గిన తొలి భారత పురుష బాక్సర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన విజేందర్... గతంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్గానూ కొనసాగాడు. బాక్సింగ్ సమాఖ్య పరిపాలన సంబంధించిన విధులను ఇటీవల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హాక్ కమిటీకి అప్పగించిన నేపథ్యంలో... విజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 3తోనే బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగియగా... ఎన్నికల నిర్వహణలో సమాఖ్య జాప్యం చేస్తుండటంతోనే ఐఓఏ ఈ చర్యకు పూనుకుంది. దీనిపై బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓఏ ఆదేశాలు చట్టవిరుద్ధమని... దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.కాగా... బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలోనే ఐఓఏ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మాజీ కోశాధికారి మధుకాంత్ పాఠక్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సమాఖ్యలో గందరగోళం కారణంగా బాక్సర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో రిక్తహస్తాలతో వెనుదిరిగిన మన బాక్సర్లు... ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే గగనమైంది. ఇక మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలోనూ మన బాక్సర్లు పాల్గొనలేదు. -
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌కు వరకట్న వేధింపులు.. భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సవీటి బూరా (Saweety Boora) వరకట్న వేధింపులు ఎదుర్కొంది. ఆమె భర్త, భారత మాజీ కబడ్డీ ప్లేయర్, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన దీపక్ హూడా (Deepak Hooda), అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవీటి కేసు పెట్టింది. సవీటి ఫిర్యాదు మేరకు హిస్సార్‌లోని (హర్యానా) ఓ పోలీస్ స్టేషన్లో దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీపక్ హుడా అదనపు కట్నంతో పాటు ఓ ఫార్చూనర్ కార్ డిమాండ్ చేస్తున్నాడని సవీటి తన ఫిర్యాదులో పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీపక్ హుడాకు రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన పోలీసులు వెల్లడించారు. దీపక్ హుడాపై అదనపు కట్నం వేధింపులు, హింసించడం మరియు దాడి చేయడం వంటి అభియోగాలు మోపబడ్డాయని పోలీసులు వివరించారు. పోలీసుల వాదనపై హుడాను జాతీయ మీడియా ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈ కారణంగానే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయానని అన్నాడు. తన అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు పోలీసులకు సమర్పించినట్లు తెలిపాడు. త్వరలో పోలీస్ స్టేషన్‌కు వెళ్తానని అన్నాడు. ఈ సందర్భంగా హుడా తన భార్య సవీటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆమెను కలవడానికి నాకు అనుమతి లేదని అన్నాడు.కాగా, సవీటి బూరా-దీపక్ హుడాల వివాహం 2022లో జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రోహ్తక్ జిల్లాలోని మెహమ్ నియోజకవర్గం నుంచి హుడా పోటీ చేశారు. హుడా.. 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ప్రో కబడ్డీ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు. 32 ఏళ్ల సవీటి 2023లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో ఆమె భర్తతో కలిసి భాజపాలో చేరింది. గత నెలలోనే సవీటి రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది. -
భారత్‌లో పర్యటించనున్న మాజీ బాక్సింగ్ లైట్ వెయిట్ ఛాంపియన్
భారత్‌లో పోరాట క్రీడలను ప్రోత్సహించడానికి.. అలాగే అంతర్జాతీయ, దేశీయ ప్రతిభ మధ్య అంతరాన్ని తగ్గించడానికి మాజీ యుఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంథోనీ పెట్టిస్ మొదటిసారి (మార్చిలో) భారత్‌లో పర్యటించనున్నాడు. ఆరు భారతీయ నగరాల్లో (ఢిల్లీ, జైపూర్, ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరు) ఆంథోనీ పెట్టిస్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (APFC), ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) మధ్య బాక్సింగ్ పోటీలు జరుగనున్నాయి. ఏపీఎఫ్సీ భారత పర్యటన ఖరారైన విషయాన్ని ఐపీబీఎల్ నిర్ధారించింది. 'ROAD TO IPBL' పేరుతో సాగే ఈ పర్యటనలో WBC ఇండియా ఛాంపియన్ శబరి జైశంకర్.. మాజీ బెల్లాటర్ బాంటమ్‌వెయిట్ ఛాంపియన్ సెర్గియో పెట్టిస్ (ఆంథోనీ పెట్టిస్ సోదరుడు) మధ్య ప్రధాన పోటీ జరుగనుంది.అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన సెర్గియో పెట్టిస్.. ప్రస్తుతం బెల్లాటర్ MMAతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బెల్లాటర్లో చేరడానికి ముందు సెర్గియో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో పోటీ పడ్డాడు. అక్కడ బాంటమ్‌వెయిట్ విభాగంలో అగ్రశ్రేణి యోధులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.సెర్గియో ప్రత్యర్థి శబరి జైశంకర్ భారతదేశపు అగ్రశ్రేణి ప్రొఫెషనల్ బాక్సర్. శబరి జైశంకర్.. WBC ఇండియా, WBC ఆస్ట్రలేసియా, WBC మిడిల్ ఈస్ట్ టైటిళ్లతో సహా బహుళ ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) టైటిళ్లను గెలుచుకున్నారు.'రోడ్ టు IPBL' ఇండియా టూర్ అనేది కేవలం బాక్సింగ్ మ్యాచ్‌ల శ్రేణి మాత్రమే కాదు. ఇది ప్రపంచ పోరాట క్రీడల వేడుక. ఇది భారతీయ అభిమానులు మరియు పోరాట క్రీడాకారుల అభిరుచిని రేకెత్తించడానికి ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని ఒకచోటికి చేర్చింది. మేము సందర్శించే ప్రతి నగరంలో IPBL ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం మరియు మరపురాని క్షణాలను సృష్టించాలని భావిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. మేము చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాము అని IPBL వ్యూహాత్మక భాగస్వామి రానా దగ్గుబాటి అన్నారు.IPBL బాక్సింగ్ గురించి:IPBL బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (www.indianproboxingleague.com) భారతదేశంలోని ఒక ప్రముఖ బాక్సింగ్ ప్రమోషన్ కంపెనీ. ఇది బాక్సింగ్ క్రీడను ఉన్నతీకరించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బాక్సర్ల ప్రతిభను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది. బాక్సింగ్ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని విస్తృత ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పడింది. -
బాక్సింగ్‌కు మనోజ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత... ‘డబుల్ ఒలింపియన్’ భారత స్టార్ మనోజ్ కుమార్ బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో కోచ్ రూపంలో ముందుకు వస్తానని హరియాణాకు చెందిన 39 ఏళ్ల మనోజ్ గురువారం ప్రకటించాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం (64 కేజీలు) గెలిచిన మనోజ్... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం (69 కేజీలు) సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో, 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మనోజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 2007, 2013 ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు నెగ్గిన మనోజ్ 2016 దక్షిణాసియా క్రీడల్లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. -
టీజీఎస్పీలో బాక్సింగ్, క్రికెట్ కోచింగ్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం (టీజీఎస్పీ)లో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే బాక్సింగ్, క్రికెట్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్లలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌లను టీజీఎస్పీ డీఎస్పీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. వారి ఆధ్వర్యంలో పోలీసులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు టీజీఎస్పీ విభాగంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ నిరోధంలోనూ టీజీఎస్పీ సేవలు టీజీఎస్పీ సిబ్బందికి శాంతి భద్రతల పరిరక్షణలోనూ, ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేవలు అందించటంలోనూ మంచి పేరుందని డీజీపీ ప్రశంసించారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న టీజీఎస్పీ సిబ్బందిని మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నియంత్రణకు వాడుకొంటామని తెలిపారు. జిఆర్పీ, సీఐడీ విభాగాలలోను వీరి సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,077 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చామని, యూసఫ్‌గూడ బెటాలియన్‌లో 548 మందికి శిక్షణ పూర్తయిందని వెల్లడించారు. పోలీస్ విభాగంలో చేరుతున్న యువ సిబ్బంది తల్లిదండ్రులు గర్వపడేలా, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చేలా పని చేయాలని సూచించారు. టీజీఎస్పీ అదనరు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తిచేసుకున్న 4,077 కానిస్టేబుళ్లలో 2,746 గ్రాడ్యుయేట్లు, 596 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 62 మంది ఎక్స్ సరీ్వస్‌మెన్లు ఉన్నారని తెలిపారు. కమాండెంట్ మురళీకృష్ణ, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మైక్ టైసన్‌కు షాకిచ్చిన యువ బాక్సర్ జేక్ పాల్
ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లో జరిగిన బిగ్ బౌట్లో మైక్ టైసన్‌ను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జేక్ పాల్ ఖంగు తినిపించాడు. ఈ మ్యాచ్‌లో జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో ఐరన్ మైక్ మైక్ ఓటమిపాలయ్యాడు.టైసన్ గేమ్‌లో వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపించింది. 58 ఏళ్ల టైసన్ తనకంటే 37 ఏళ్ల చిన్నోడైన జేక్ సూపర్ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు. తొలి రెండు రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం కనబరిచినప్పటకి.. తర్వాతి 8 రౌండ్లలో జేక్ పాల్ తన అద్బుతమైన బాక్సింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఆ తర్వాత మైక్ తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. కొన్ని పంచ్‌లు ఇచ్చినప్పటికి పెద్దగా పవర్ కన్పించలేదు. దీంతో మహాబలుడు మైక్ టైసన్ యువ బాక్సర్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే గెలిచిన వెంటనే జేక్ పాల్ మైక్ టైసన్‌కు తల వంచి నమస్కరించాడు. టైసన్ కూడా పాల్‌ను మంచి ఫైటర్‌గా కొనియాడాడు. ఇక విజేతగా నిలిచిన బాక్సర్ జేక్ పాల్ కు 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీగా లభించింది. కాగా మ్యాచ్ ఈ మొదలు కాగాగే పోటెత్తిన వ్యూయర్షిప్తో నెట్‌ఫ్లిక్స్ క్రాష్ అయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టైసన్... అదే దూకుడు
టెక్సాస్: ఆరు పదుల వయసు సమీపిస్తున్నా... తనలో దుందుడుకుతనం తగ్గలేదని బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ చాటుకున్నాడు. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్... సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జాక్ పాల్‌తో బౌట్లో తలపడనున్నాడు. ప్రధాన పోటీకి ముందు జరిగిన ఆటగాళ్ల ప్రత్యేక కార్యక్రమంలోనే రెచ్చిపోయిన టైసన్... జాక్ పాల్ చెంప చెళ్లుమనిపించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు.అసలు పోరుకు ముందు నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్’ కార్యక్రమం సమయంలో నిర్వాహకులు అడుగుతున్న ప్రశ్నలకు విసుగెత్తిన టైసన్... ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ని చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పటికే ఈ బౌట్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోగా... టైసన్ ప్రవర్తనతో అది మరింత ఎక్కువైంది. శనివారం జరగనున్న ఈ బౌట్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ప్రసారం చేయనున్నారు. ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా 60 వేల మంది అభిమానులు... ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది వీక్షించనున్నారు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టైసన్... ఆ తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. షెడ్యూల్ ప్రకారం టైసన్, జాక్ పాల్ మధ్య బౌట్ ఈ ఏడాది జూలైలోనే జరగాల్సి ఉన్నా... ఆ సమయంలో టైసన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో దాన్ని వాయిదా వేశారు. దూకుడు మీదున్న టైసన్‌కు... ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పది బౌట్లు నెగ్గిన 27 ఏళ్ల జాక్ పాల్ ఏమాత్రం పోటీనిస్తాడో చూడాలి. ‘చివరి బౌట్లో కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిన తర్వాత జీవితంలో చాలా చూశాను. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాను. అన్నిటికి మించి బాక్సింగ్‌నే ఇష్టపడతా. ఒకప్పటి టైసన్ ఇప్పుడు లేడు. నా జీవితంలో ఎక్కువ ఏమీ మిగిలి లేదు. అందుకే మంచి అనుభూతులు సొంతం చేసుకోవాలనుకుంటున్నా’ అని ఫైట్‌కు ముందు టైసన్ అన్నాడు. -
అలాంటి వీడియోలు షేర్ చెయ్యొద్దని చెప్పారు : హీరోయిన్ రితికా సింగ్
తనను తాను రక్షించుకోవాడానికే బాక్సింగ్, కరాటే నేర్చుకున్నానని చెబుతోంది హీరోయిన్ రితికా సింగ్. ‘గురు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాక్సింగ్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు,తమిళ, మలయాళ సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘వేట్టయాన్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రితికా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఎందుకు కరాటే, బాక్సాంగ్ నేర్చుకోవాల్సి వచ్చిందో చెప్పింది. ‘మన జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వాటిని తట్టుకొని నిలబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అమ్మాయిలు బయటకు వెళ్తే దురదృష్టవశాత్తు ఏమైనా జరగొచ్చు. నన్ను నేను రక్షించుకోవడానికే కరాటే, బాక్సింగ్ నేర్చుకున్నాను. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే..కొంతమంది వద్దని చెప్పారు. ‘నీ కరాటే వీడియోలు చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. వాటిని షేర్ చేయకండి’ అని కొంతమంది నాకు సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం షేర్ చేయడం ఆపలేదు. కరాటే వీడియోలే కాదు.. శారీ ఫోటో షూట్, డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తుంటాను. ఒక నటిగా నేను ఏం చేయగలనో అన్ని చేశాను. అయినా కూడా కొంతమంది విమర్శిస్తుంటారు. వాటని పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారనని నా ట్రైనింగ్ మానుకోలేదు. ఇప్పటికే కరాటే, బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అది నాకు ఇష్టమైన పని. నేను ఇంత స్ట్రాంగ్ ఉండడం మంచిది కాదని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకు ఉండకూడదు? నేను బయటకు వెళ్లినప్పుడు ఏమైనా జరిగితే ఎవరు రక్షిస్తారు? నన్ను నేను రక్షించుకోవడానికే మార్షల్ ఆర్ట్స్‌లో బేసిక్స్ నేర్చుకున్నాను. అలా అని ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగితే ధైర్యంగా మన గళాన్ని వినిపించాలి. మన వాయిసే ఒక ఆయుధం కావాలి’ అని రితికా చెప్పుకొచ్చింది. -
ఇండియన్ బాక్సింగ్ లీగ్‌కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఆమోదం
ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ (IPBL) మరియు 12R ఫాంటసీ బాక్సింగ్ యాప్‌కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) యొక్క అధికారిక అమోదం లభించింది. ఐపీబీఎల్ భారత్‌లో డబ్ల్యూబీసీ గుర్తింపు పొందిన ఏకైక ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఐపీబీఎల్ ద్వారా ఔత్సాహిక భారతీయ బాక్సర్లకు విశ్వవ్యాప్త గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఈ డీల్ ఐపీబీఎల్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని లీగ్ అడ్వైజర్ రానా దగ్గుబాటి అన్నాడు. భారత్‌లో బాక్సింగ్‌ను ప్రముఖ క్రీడగా మార్చేందుకు ఐపీబీఎల్ బృందంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి చాలా కాలంగా భారత్‌లో బాక్సింగ్ ఎదుగుదలకు పని చేస్తుందని ఐపీబీఎల్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ సింగ్ అన్నాడు. ఐబీసీ రెండు వేల మంది క్రియాశీల బాక్సర్లకు మద్దతు ఇస్తుందని ఆయన తెలిపాడు. -
భారత బాక్సింగ్ చరిత్రలో ఇదొక మైలు రాయి: రానా
భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచే దిశగా బాక్సింగ్‌బే, స్పిరిట్ మీడియా ఫౌండర్ రానా దగ్గుబాటి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బాక్సింగ్ ఈవెంట్లను నిర్వహించేందుకు 'ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్' వ్యవస్థాపకుడు ఆంథోనీ పెట్టిస్‌తో రాణా ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఈ ఏడాది డిసెంబర్ తర్వాత ఈ రెండు ఈవెంట్లు జరగనున్నాయి. ఒకటి భారత్‌లో, మరొకటి యునైటెడ్ స్టేట్స్లో నిర్వహించాలని రానా, ఆంథోని పెట్టిస్ నిర్ణయించుకున్నారు. కాగా ఈ రెండు ఈవెంట్లు 5 వర్సెస్ 5గా జరగనున్నాయి. ఇక ఈ ఒప్పందం మెక్సికోలో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) ప్రతినిథులు ఆస్కార్ వల్లే, ఎరికా కాంట్రేరాస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. కాగా ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ క్లబ్‌లను ప్రమోట్ చేసేందుకు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌ను 1963లో స్ధాపించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. "ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్‌తో ఒప్పందం భారత బాక్సింగ్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. భారత టర్ఫ్‌లో స్టార్ యూఎస్ అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా.. మన బాక్సర్లకు అంతర్జాతీయ స్ధాయిలో అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. నిజంగా గ్రేట్ బాక్సింగ్ క్లబ్‌తో భాగస్వామిగా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం భారత్, యూఎస్ బాక్సర్లకు మంచి అవకాశాలు కల్పిస్తోందన్న నమ్మకం మాకు ఉంది. అదేవిధంగా భారత్‌లో బాక్సింగ్‌కు ఆదరణ పెంచేందుకు బాక్సింగ్ బే క్లబ్ అన్ని విధాల కృషి చేస్తుంది.భారత బాక్సింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఏపీఎఫ్సీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని" పేర్కొన్నాడు. అయితే అగ్రశ్రేణి అమెరికన్ బాక్సర్లు భారత్‌లో జరిగే ఈవెంట్లో పాల్గోనుండడం ఇదే తొలిసారి. కాగా ఆంథోనీ పెట్టిస్.. ఒక మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్. -
Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పదో రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..రెజ్లింగ్మహిళల 68 కేజీల ఫ్రీస్టయిల్ ప్రిక్వార్టర్స్: నిషా దహియా వర్సెస్ సోవా రిజ్కో (ఉక్రెయిన్) (సాయంత్రం గం. 6:30 నుంచి)టెబుల్ టెన్నిస్ మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ వర్సెస్ రొమేనియా (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)సెయిలింగ్ మహిళల డింగీ రేసులు: (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). పురుషుల డింగీ రేసులు: (సాయంత్రం గం. 6:10 నుంచి) అథ్లెటిక్స్మహిళల 400 మీటర్ల పరుగు తొలి రౌండ్: కిరణ్ పహల్ (హీట్ 5) (మధ్యాహ్నం గం. 3:57 నుంచి). పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ తొలి రౌండ్: అవినాశ్ సాబ్లే (హీట్ 2) (రాత్రి గం. 10:50 నుంచి)బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరు: లక్ష్యసేన్ వర్సెస్ లీ జీ జియా (మలేసియా) (సాయంత్రం గం. 6:00 షూటింగ్స్కీట్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్: మహేశ్వరి చౌహాన్ఠ్అనంత్ జీత్ సింగ్ నరుకా (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ఫైనల్ (అర్హత సాధిస్తే): సాయంత్రం గం. 6:30 నుంచి. లవ్లీనా పంచ్ సరిపోలేదు విశ్వక్రీడల్లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. ఆరుగురు బాక్సర్లతో పారిస్‌లో అడుగు పెట్టిన భారత బృందం.. రిక్త హస్తాలతో తిరిగి రానుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహైన్ ఈసారి ఆకట్టుకోలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ లవ్లీనా 1–4తో లీ కియాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. బౌట్ ప్రారంభం నుంచే చైనా బాక్సర్ లెఫ్ట్ హుక్స్‌తో విరుచుకుపడగా.. వాటిని తప్పించుకుంటూ లవ్లీనా కొన్ని మంచి పంచ్‌లు విసిరింది. అయినా తొలి రౌండ్ కియాన్‌కు అనుకూలంగా ఫలితం వచి్చంది. ఆ తర్వాత లవ్లీనా పుంజుకునేందుకు ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. పంచ్‌ల ధాటి నుంచి నేర్పుగా తప్పించుకున్న కియాన్... కీలక సమయాల్లో జాబ్స్, హుక్స్‌తో పైచేయి సాధించింది. భారత్ నుంచి పారిస్ క్రీడలకు ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించగా.. అందరూ క్వార్టర్ ఫైనల్లోపే పరాజయం పాలయ్యారు. -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా ఓటమి.. ముగిసిన భారత్ పోరాటం
పారిస్ ఒలింపిక్స్ మహిళల 75 కేజీల విభాగం బాక్సింగ్ పోటీల్లో భారత స్టార్ బాక్సర్, ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్ ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన లి క్యియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమిపాలైంది. లవ్లీనా ఓటమితో బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. ఒక్క పతకం కూడా లేకుండానే భారత బాక్సర్ల బృందం నిరాశపర్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. -
నిశాంత్ దేవ్ 'పంచ్' మిస్.. క్వార్టర్స్‌లో ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024 బాక్సింగ్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం ఆర్ధరాత్రి జరిగిన పురుషుల 71 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ ఘోర పరాజయాన్ని చవిచూశాడు.మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే అల్వారెజ్ చేతిలో 1-4 తేడాతో నిశాంత్ దేవ్ ఓటమి పాలయ్యాడు. మొదటి రౌండ్లో నిశాంత్ దూకుడుకనబరచినప్పటకి.. తర్వాతి మూడు రౌండ్లలో ప్రత్యర్ధి పుంజుకుని అద్భుత విజయం సాధించాడు. అంతకముందు మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ సైతం ఇంటిముఖం పట్టింది.మహిళల 50 కేజీల ప్రి క్వార్టర్స్‌లో వు హు (చైనా) చేతిలో 0-5 తేడాతో జరీన్ ఓటమిపాలైంది. ఇప్పుడు వీరిద్దరి ఓటమితో బాక్సింగ్‌లో పతకంపై భారత్ ఆశలు స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. ఆదివారం మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో లి కియాన్ (చైనా)తో లవ్లీనా తలపడనుంది. -
మగాడంటూ ఆరోపణలు.. నన్ను క్షమించండి
‘‘ఈ వివాదం పట్ల నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా ప్రత్యర్థి బాక్సర్‌కు క్షమాపణలు. పాపం తనేం తప్పు చేయలేదు. నాలాగే తను కూడా పతకం కోసం పోరాడేందుకు ఇక్కడికి వచ్చింది. ఆమె పట్ల నేను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు. షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం తప్పే.ఇందుకు ఆమెతో పాటు అందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. ఆ క్షణంలో నాకు ఎంతగానో కోపం వచ్చింది. నా ఒలింపిక్స్ ప్రయాణం ఇలా ముగిసిపోయిందే అనే చిరాకులో ఉన్నాను. అంతేతప్ప ఇమానే ఖలీఫ్ పట్ల నాకెలాంటి ద్వేషభావం లేదు. మరోసారి తను గనుక నాకు ఎదురుపడితే.. తప్పకుండా హగ్ చేసుకుంటా’’ అని ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరీనీ విచారం వ్యక్తం చేసింది. అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీఫ్ పట్ల తాను వ్యవహరించిన తీరు సరికాదంటూ క్షమాపణ కోరింది.46 సెకన్లలోనేఇటలీకి చెందిన ఏంజెలా కెరీనీ ఎన్నో ఆశలతో ఒలింపిక్స్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో విఫలమైన ఆమె ఈసారి తండ్రికి ఇచ్చిన మాట కోసం మళ్లీ పతకం కోసం పోరాడేందుకు తీవ్ర సాధన చేసింది. 66 కేజీల విభాగంలో ఆమె బరిలోకి దిగగా... ప్రత్యర్థిగా అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ నిలబడింది.అయితే 46 సెకన్లలోనే ఏంజెలా ఆట నుంచి తప్పుకొంది. ప్రత్యర్థి కొట్టిన తీవ్రమైన పంచ్‌లను ఆమె తట్టుకోలేకపోయింది. ఇలాంటి బాక్సింగ్ తన జీవితంలో చూడలేదంటూ భోరున ఏడ్చేసింది. ఖలీఫ్ పంచ్లలో ఒక మగాడి తరహాలో తీవ్రత ఉండటమే అందుకు కారణం!ఆడ బాక్సర్‌పై మగాడిని పోటీలో నిలుపుతారా?ఖలీఫ్ పురుష లక్షణాలు ఉన్న ‘బయోలాజికల్ మ్యాన్’ అన్న సందేహాలే సమస్య. తాను మహిళగా చెప్పుకుంటున్నా... మగాళ్లలో ఉండే XY క్రోమోజోమ్‌లు ఆమెలో కనిపించాయని గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. గత ఏడాది ఢిల్లీలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పరీక్షల తర్వాత ఆమెపై నిషేధం కూడా విధించారు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఖలీఫ్నకు మళ్లీ మహిళల విభాగంలో ఒలింపిక్స్‌లో పోటీ పడే అవకాశాన్ని కల్పించారు నిర్వాహకులు. ఒలింపిక్ పాస్‌పోర్టులో ఫిమేల్ అని ఉందని.. దాని ప్రామాణికంగానే ఆమె అవకాశం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.అయితే, తొలి పోరుకు ముందే ఇది అన్యాయమని, ఆడ బాక్సర్‌పై మగాడిని పోటీలో నిలపడం ప్రమాదకరం అంటూ అన్ని వైపుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. చివరకు అదే నిజమైందని కెరీనీ వాపోయింది. ఖలీఫ్ పంచ్‌ల దెబ్బకు ఆమె కన్నీళ్లపర్యంతమైన తీరు అందరినీ కదిలించింది. తను అమ్మాయిగానే పెరిగిందిదీంతో ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా.. ఇమానే ఖలీఫ్నకు కూడా చాలా మంది మద్దతుగా నిలిచారు. అల్జేరియాలో లింగమార్పిడిపై నిషేధం ఉందని.. అలాంటిది ఇమానే ఖలీఫ్‌ను మగాడిగా ఎలా పేర్కొంటారో.. ఆమె చిన్ననాటి ఫొటోలు షేర్ చేశారు మద్దతుదారులు.అదే విధంగా ట్యునిషియన్ బాక్సింగ్ కోచ్ ఒకరు మాట్లాడుతూ.. ‘‘చాలా ఏళ్లుగా నాకు ఇమాన్ తెలుసు. ఆమెను చిన్ననాటి నుంచి చూస్తున్నాను. తను అమ్మాయిగానే పెరిగింది. నిజానికి గతంలో ఆమెపై నిషేధం విధించడానికి కారణం రాజకీయాలే అని నేను భావిస్తున్నా. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇప్పుడు ఆమెకు న్యాయం చేసింది. అయినా.. ఇంకా మగాడు అంటూ వేలెత్తి చూపడం అన్యాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఇమానే ఖలీఫ్ తరహాలో లక్షణాలే ఉన్న లిన్ యు టింగ్ (తైపీ) 57 కేజీల కేటగిరీలో బరిలోకి దిగుతోంది. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. -
Paris Olympics 2024: లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ప్రత్యర్ధి చేతిలో మహిళా బాక్సర్ ఓటమి
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. మహిళల బాక్సింగ్ పోటీల్లో ఓ బాక్సర్ లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ప్రత్యర్ధి చేతిలో ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళితే.. అల్జీరియాకు చెందిన ఇమేన్ ఖెలిఫ్, ఇటలీకి చెందిన ఏంజెలా కారిని 66 కేజీల ప్రిలిమినరీ రౌండ్లో తలపడ్డారు. ఈ గేమ్‌లో ఖెలిఫ్ కేవలం 46 సెకెన్లలో విజయం సాధించింది. ఖెలిఫ్ పిడిగుద్దుల ధాటికి ఏంజెలా కారిని ముక్కు విరిగినంత పనై, బౌట్ నుంచి నిష్క్రమించింది. కారిని బౌట్ నుంచి వైదొలగడానికి ముందు రెండుసార్లు ఆమె హెడ్ సేఫ్టీ తొలగిపోయింది. Today, Angela Carini had her Olympics dreams shattered by Imane Khelif, a male boxer. It is suspected that he BROKE HER NOSE. Don’t let this pass quietly. MEN SHOULD NOT BE ALLOWED TO BEAT WOMEN FOR SPORT. SAVE WOMEN’S SPORTS. pic.twitter.com/i5GMdgWrwb— Hazel Appleyard (@HazelAppleyard_) August 1, 2024ఖెలిఫ్ రెండు పర్యాయాలు బలంగా కారిని తల భాగంపై అటాక్ చేసింది. ముక్కులో తీవ్రమైన నొప్పి రావడంతో బౌట్ నుంచి వైదొలిగినట్లు కారిని గేమ్ అనంతరం వివరించింది. కారిని నొప్పితో విలవిలలాడుతూ కన్నీటిపర్యంతమైంది. గేమ్ అనంతరం ఆమె ఖెలిఫ్‌కు కరచాలనం కూడా చేయలేదు. The moment the Olympics died. pic.twitter.com/S0qK8Jc8iw— Bill Moon (@BigBillMoon) August 1, 2024కాగా, కారినిని తీవ్రంగా గాయపరిచి క్షణాల్లో గేమ్‌ను గెలిచిన ఖెలిఫ్.. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమై 2023 వరల్డ్ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించలేకపోయింది. ఖెలిఫ్ వివాదాల నడుమ పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్ధిని తీవ్రంగా గాయపరిచి మ్యాచ్‌ను గెలిచింది. మగ లక్షణాలున్న బాక్సర్ చేతిలో ఓటమి తర్వాత కారినిపై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. కారినికి అన్యాయం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. -
Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో నిఖత్ ఓటమిపాలైంది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో గురువారం నాటి బౌట్లో వు యు 5-0తో నిఖత్‌ను ఓడించింది. కాగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్. కన్నీటి పర్యంతంమహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. తొలి రౌండ్ బౌట్లో 5–0తో మ్యాక్సీ కరీనా క్లోట్జెర్ (జర్మనీ)ని ఓడించి రౌండ్ ఆఫ్ 16(ప్రి క్వార్టర్స్)కు అర్హత సాధించింది. ప్రత్యర్థిపై ఆది నుంచే పంచ్‌లు విసరుతూ పైచేయి సాధించింది. అయితే, కీలక పోరులో వు యు రూపంలో సవాల్ ఎదురుకాగా.. నిఖత్ అధిగమించలేకపోయింది. ప్యారిస్‌లో పతకం సాధించాలన్న కల చెదిరిపోవడంతో కన్నీటి పర్యంతం అయింది.క్షమించండి.. నిఖత్ భావోద్వేగం‘‘సారీ.. ఈ అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది. నేను ఇంతకుముందు వు యుతో తలపడలేదు. తను చాలా వేగంగా కదిలింది. పొరపాటు ఎక్కడ జరిగిందో సరిచూసుకోవాలి. ఎంతో కష్టపడి ఇక్కడిదాకా చేరుకున్నాను. శారీరకంగా.. మానసికంగా ఒలింపిక్స్‌కి సన్నద్దమయ్యాను. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాను’’ అని 28 ఏళ్ల నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ భావోద్వేగానికి గురైంది. లవ్లీనాపైనే ఆశలన్నీభారత ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ముగ్గురికే సాధ్యమైన ఘనతను సాధించేందుకు మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఒక్క విజయం దూరంలో ఉంది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఈ అస్సాం బాక్సర్ ఆడిన తొలి బౌట్‌లోనే ఏకపక్ష విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో (29–28, 30–27, 29–28, 30–27, 29–28) సునీవా హాఫ్స్టడ్ (నార్వే)ను చిత్తుగా ఓడించింది.కాంస్య పతకానికి అడుగుదూరంలోఇక ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ కియాన్ (చైనా)తో లవ్లీనా తలపడుతుంది. ఈ బౌట్లో గెలిస్తే లవ్లీనాకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. తద్వారా వ్యక్తిగత క్రీడాంశంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా లవ్లీనా గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు భారత్ తరఫున రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), పిస్టల్ షూటర్ మనూ భాకర్ (2024 పారిస్–2 కాంస్యాలు) రెండు ఒలింపిక్ పతకాల చొప్పున సాధించారు.క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా ఈసారి ‘పారిస్’లోనూ మెడల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగింది. సునీవాతో జరిగిన బౌట్లో లవ్లీనా పక్కా వ్యూహంతో ఆడి ప్రత్యరి్థకి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. తన ఎత్తును ఉపయోగించుకొని నార్వే బాక్సర్ ముఖంపై నిలకడగా పంచ్‌లు కురిపించింది. నిర్ణీత మూడు రౌండ్లలోనూ లవ్లీనా పూర్తి ఆధిపత్యం చలాయించింది.దాంతో బౌట్‌ను పర్యవేక్షించిన ఐదుగురు జడ్జిలు లవ్లీనాయే పైచేయి సాధించినట్లు నిర్ణయించారు. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. చైనా బాక్సర్ లీ కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో లీ కియాన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫలితంగా లవ్లీనా తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తేనే చైనా బాక్సర్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. పోరాడి ఓడిన ప్రీతి మరోవైపు మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పవార్ 2–3తో (29–28, 29–28, 30–27, 30–27, 28–29) రెండో సీడ్ మార్సెలా అరియస్ కాస్టనెడా (కొలంబియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. చదవండి: Olympics 2024: భారత్ ఖాతాలో మూడో పతకం Olympics 2024: భారత్ జైత్రయాత్రకు బ్రేక్.. బెల్జియం చేతిలో ఓటమి -
Olympics 2024: పతకానికి అడుగుదూరంలో లవ్లీనా
భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అదరగొడుతోంది. మహిళల 75 కేజీల విభాగంలో ఈ అస్సామీ అమ్మాయి.. క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. రెండో ఒలింపిక్ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో లవ్లీనా నార్వే బాక్సర్ సునివ హొఫ్సాటడ్‌తో తలపడింది. ఆది నుంచే ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన లవ్లీనా.. ఐదు రౌండ్లలోనూ పదికి తొమ్మిది పాయింట్ల చొప్పున సంపాదించింది. ఈ క్రమంలో 5-0తో సునివను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తదుపరి బౌట్లో లవ్లీనా చైనాకు చెందిన లీ కియాన్‌తో ఆగష్టు 4న పోటీపడనుంది.సెమీస్ చేరుకుంటే చాలుఇక ఈ బౌట్లో గెలిస్తే లవ్లీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, నిబంధనల ప్రకారం సెమీస్ చేరుకుంటే చాలు లవ్లీనా కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. విశ్వ క్రీడల్లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోటీ జరుగుతుంది. సెమీ ఫైనల్లో ఓడిన ఇద్దరు ప్లేయర్లు బ్రాంజ్ మెడల్ కోసం పోటీపడాల్సి ఉంటుంది.కానీ.. బాక్సింగ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.సెమీస్ చేరిన ఇద్దరు బాక్సర్లకు మరో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా పతకం ఖాయమవుతుంది. సహజంగానే సెమీస్‌లో పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి.. ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా.. ‘నాకౌట్’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత బాక్సర్లు స్పృహ కోల్పోయే (కన్కషన్) అవకాశం కూడా ఉండవచ్చు.అందుకే ఇద్దరికీ పతకాలుఅలాంటపుడు వారు సాధారణ స్థితికి వచ్చి.. మళ్లీ వెంటనే బౌట్‌కు సిద్ధం కావడం కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే మూడో స్థానం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు కూడా రావచ్చు. అందుకే బాక్సింగ్‌లో మూడో స్థానం కోసం పోటీ రద్దు చేసి.. సెమీస్‌చేరిన ఇద్దరికీ కాంస్యాలు ఇస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్-2020లో లవ్లీనా బొర్గొహెయిన్ ఇలాగే కంచు పతకం(69 కేజీల విభాగం) గెలుచుకుంది. సెమీస్‌లో ఓడినప్పటికీ మెడల్‌తో తిరిగి వచ్చింది. ఇక ఒలింపిక్స్‌లో ఇప్పటికే షట్లర్ పీవీ సింధు, షూటర్ మనూ భాకర్ రెండేసి పతకాలు గెలుచున్నారు. లవ్లీనా క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే వీరితో పాటు ఈ జాబితాలో చేరిన భారత మహిళా క్రీడాకారిణిగా నిలుస్తుంది. A 𝑳𝒐𝒗𝒍𝒊 PERFORMANCE FROM THE CHAMP!! 🥊She punches her way into the Quarter-Finals 😤 💪Stream the action on #JioCinema for FREE. Also, watch it LIVE on #Sports18!#Cheer4Bharat #OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Paris2024 #Boxing pic.twitter.com/j5ogV5iWmQ— JioCinema (@JioCinema) July 31, 2024 -
Olympics 2024: నిఖత్ జరీన్‌కు కఠినమైన డ్రా.. తెలుగు బిడ్డకు బిగ్ ఛాలెంజ్
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ప్యారిస్‌లో అడుగుపెట్టిన వరల్డ్ ఛాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు కఠినమైన డ్రా లభించింది. ఒలింపిక్స్ 2024 బాక్సింగ్ డ్రాను నిర్వహకులు శుక్రవారం విడుదల చేశారు. 50 కేజీల బాక్సింగ్ ఈవెంట్ తొలి రౌండ్లో నిఖత్ జరీన్ జర్మనీ సంచలనం కరీనా క్లొయెట్జర్‌తో తలపడనుంది. క్లొయెట్జర్పై విజయం సాధిస్తే రెండో రౌండ్లో జరీన్‌కు ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత, టాప్ ర్యాంకర్ వూ యూ(చైనా) నుంచి గట్టి సవాల్ ఎదురుకానుంది. నిఖత్ జరీన్‌తో పాటు మరో భారత మహిళా బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్కు కూడా కష్టమైన డ్రా లభించింది. 75 కేజీల విభాగంలో తొలి రౌండ్లో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌తో లోవ్లినా తలపడనుంది. ఒకవేళ ఆమె ఫస్ట్ రౌండ్లో విజయం సాధిస్తే.. రెండు సార్లు ఒలింపిక్స్ మెడలిస్ట్, చైనా స్టార్ బాక్సర్ లి కియాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. అదేవిధంగా మహిళల 54 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ జైస్మిన్ లంబోరియా తొలి రౌండ్లో టోక్యోలో సిల్వర్ గెలిచిన ఫిలిప్పీన్స్ బాక్సర్ నెస్తీ పెటెసిను ఢీకొట్టనుంది. మరోవైపు పురుషుల విభాగంలో పోటీ పడుతున్న బాక్సర్లు నిషాంత్ దేవ్(71 కిలోలు), అమిత్ పంగల్ (52 కిలోలు)కు మాత్రం బై దక్కింది. ఇక శనివారం నుంచి(జూలై 27) బాక్సింగ్ పోటీలు షురూ కానున్నాయి. -
Paris Olympics 2024: భారత బాక్సర్లకు చివరి అవకాశం
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీ శుక్రవారం నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు బాక్సర్లు (అమిత్ పంఘాల్–51 కేజీలు, సచిన్–57 కేజీలు, అభినాశ్ జమ్వాల్–63.5 కేజీలు, నిశాంత్ దేవ్–71 కేజీలు, అభిమన్యు–80 కేజీలు, సంజీత్–92 కేజీలు, నరేందర్ –ప్లస్ 92 కేజీలు)... మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు (జాస్మిన్–57 కేజీలు, అంకుశిత–60 కేజీలు, అరుంధతి–66 కేజీలు) బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌కు విశ్వ క్రీడల బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్(75 కేజీలు) ఒలింపిక్స్-2024 పోటీలకు అర్హత సాధించారు. -
నిఖత్ శుభారంభం..
అస్తానా (కజకిస్తాన్): ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 5–0తో రఖీమ్బెర్దీ జన్సాయా (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు) కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు.మీనాక్షి 4–1తో గసిమోవా రొక్సానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... అనామిక పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుమ్బయేవా అరైలిమ్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. ఇస్మిత్ (75 కేజీలు), సోనియా (54 కేజీలు) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఇష్మిత్ 0–5 తో అర్మాత్ (కజకిస్తాన్) చేతిలో, సోనియా 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు.ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ..రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలిరౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–2తో అర్నాల్డి–పసారో (ఇటలీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బొలెలీ–వావాసోరి (ఇటలీ)లతో బోపన్న–ఎబ్డెన్ తలపడతారు. -
అమిత్‌కు పిలుపు హుసాముద్దీన్‌పై వేటు
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ చివరి టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. గత నెలలో జరిగిన తొలి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది కేటగిరీల్లో బరిలోకి దిగినా ఒక్కరు కూడా ఒలింపిక్స్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయారు. తొలి టోర్నీలో పాల్గొన్న ఐదుగురు బాక్సర్లపై (దీపక్ భోరియా, హుసాముద్దీన్, శివ థాపా, లక్ష్య చహర్, జాస్మిన్) వేటు పడింది. దీపక్ స్థానంలో 2022 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంఘాల్కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ స్థానంలో సచిన్ సివాచ్‌ను ఎంపిక చేశారు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీ మే 25 నుంచి జూన్ 2 వరకు బ్యాంకాక్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్ నుంచి మహిళల విభాగంలో నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి, పరీ్వన్, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. భారత బాక్సింగ్ జట్టు: పురుషుల విభాగం: అమిత్ పంఘాల్ (51 కేజీలు), సచిన్ సివాచ్ (57 కేజీలు), అభినాష్ జమ్వాల్ (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), అభిమన్యు (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల విభాగం: అంకుశిత (60 కేజీలు), అరుంధతి (66 కేజీలు). -
నిశాంత్‌కు నిరాశ
బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ తొలి టోర్నమెంట్ నుంచి తొమ్మిది మంది భారత బాక్సర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో మిగిలిన చివరి బాక్సర్ నిశాంత్ దేవ్ (71 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. అమెరికా బాక్సర్ ఒమారి జోన్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ 1–4తో ఓటమి చవిచూశాడు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఇప్పటి వరకు నలుగురు బాక్సర్లు (నిఖత్ జరీన్, ప్రీతి పవార్, పర్విన్ హుడా, లవ్లీనా) పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన భారత బాక్సర్లకు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందు రెండో అవ కాశం ఉంది. మే 23 నుంచి జూన్ 3 వరకు థాయ్‌లాండ్‌లో జరిగే చివరిదైన రెండో క్వాలిఫయింగ్ టోర్నిలో సెమీఫైనల్ చేరితే భారత బాక్సర్లకు ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
నిశాంత్ ముందుకు... శివ, అంకుశిత ఓటమి
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల విభాగంలో నిశాంత్ దేవ్ (71 కేజీలు) రెండో రౌండ్‌కు చేరగా... శివ థాపా (63.5 కేజీలు), మహిళల విభాగంలో అంకుశిత (66 కేజీలు) తొలి రౌండ్లోనే ఓడారు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో నిశాంత్ 3–1తో లూయిస్ రిచర్డ్సన్ (బ్రిటన్)పై గెలిచాడు. ప్రపంచ చాంపియన్ రుస్లాన్ (ఉజ్బెకిస్తాన్) పంచ్‌ల ధాటికి శివ బౌట్ ఆరంభంలోనే చేతులెత్తేశాడు. అంకుశిత 2–3తో సొన్వికో ఎమిలీ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. -
నాలుగో బాక్సర్ కూడా తొలి రౌండ్లోనే...
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే దీపక్, నరేందర్, జాస్మిన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... తాజాగా వీరి సరసన మరో భారత బాక్సర్ లక్ష్య చహర్ కూడా చేరాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 80 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో ఇరాన్ బాక్సర్ గెష్లగి మేసమ్ భారత జాతీయ చాంపియన్ లక్ష్య చహర్‌ను నాకౌట్ చేశాడు. -
BoxingBay Fight Nights: హైదరాబాద్‌లో మెగా బాక్సింగ్ ఈవెంట్
దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి సారథ్యంలో సౌత్‌బే కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి ‘బాక్సింగ్ బే’ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు ‘ఫైట్ నైట్స్’ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాప్- 20 ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 28 తేదీల్లో బాక్సింగ్‌బే ఫైట్ నైట్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
నేనింకా రిటైర్ కాలేదు.. రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇవాల్టి ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోమ్ ఈ ప్రచారంపై స్పందిస్తూ.. తన రిటైర్మెంట్పై వచ్చిన వార్తాల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని ఆమె తెలిపింది. ఈ మేరకు కోమ్ ప్రముఖ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, 41 ఏళ్ల మేరీ కోమ్ మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన బాక్సింగ్ దిగ్గజం
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై బాక్సింగ్ రింగ్‌లోకి దిగేది లేదని ప్రకటించింది. వయో పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో బాక్సింగ్‌తో అనుసంధానమై ఉంటానని తెలిపింది. కాగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిబంధనల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతి లేదు. గతేడాదే ఏజ్ లిమిట్‌ను దాటిన 41 ఏళ్ల మేరీ కోమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి హుసాముద్దీన్
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ తొలి క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఈ టోర్నీ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు ఇటలీలో జరుగుతుంది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 29 ఏళ్ల హుసాముద్దీన్ గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2022 ఆసియా చాంపియన్‌షిప్ లోనూ కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. భారత పురుషుల జట్టు: దీపక్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), శివ థాపా (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల జట్టు: జాస్మిన్ (60 కేజీలు), అంకుశిత బోరో (66 కేజీలు). -
NSG: బాక్సింగ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులకు పతకాలు
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ” అండర్ -17, 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందం పతకాలు గెలుచుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్‌కు నాలుగు కాంస్యాలు దక్కాయి. ఈ సందర్భంగా.. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఈ బాక్సింగ్ పోటీలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఢిల్లీలో జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. పతకాలు గెలుచుకుంది వీళ్లే ►అండర్ 19- బాలికల (45-48 కేజీలు) విభాగంలో మొహ్మద్ హీనా కౌసర్ (నారాయణ జూనియర్ కాలేజీ ,విశాఖపట్నం)- కాంస్య పతకం. ►అండర్ 19- బాలికల (48-51 కేజీలు ) విభాగంలో కోలుసు నిహారిక (విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజి,విశాఖపట్నం )- కాంస్య పతకం. ►అండర్ 19- బాలికల (51-54 కేజీలు) విభాగంలో గంగవరపు అక్షిత (గవర్నమెంట్ జూనియర్ కాలేజి ,రాజమహేంద్రవరం,తూర్పు గోదావరి జిల్లా)- కాంస్య పతకం. ►అండర్ 17- బాలికల (46-48 కేజీలు) విభాగంలో మైలపిల్లి మేఘన (సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్ ,విశాఖపట్నం జిల్లా ) - కాంస్య పతకం. చదవండి: National School Games: ఆంధ్రప్రదేశ్ తైక్వాండో బృందానికి పతకాలు Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్ -
భారత బాక్సర్లకు మూడు రజతాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత బాక్సర్లు హార్దిక్ (80 కేజీలు), అమిశా (54 కేజీలు), ప్రాచీ (80 ప్లస్ కేజీలు) రజత పతకాలు నెగ్గారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఫైనల్స్‌లో హార్దిక్ 2–3తో అశురోవ్ (రష్యా) చేతిలో, అమిశా 0–5తో అయాజాన్ (కజకిస్తాన్) చేతిలో, ప్రాచి 0–5తో షఖోబిద్దినొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. మరో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్లో పోటీపడనున్నారు. -
పసిడి ‘పంచ్’కు లవ్లీనా
ఆసియా క్రీడల బాక్సింగ్ ఈవెంట్లో మంగళవారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్... పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్ బౌట్లలో ఓడిపోయి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రీతి 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో... నరేందర్ 0–5తో కున్‌కబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ, రజత పతకం రేసులో నిలిచింది. అంతే కాకుండా పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. సెమీఫైనలో లవ్లీనా 5–0తో బైసన్ మనికోన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సచిన్ సివాచ్ 1–4తో లియు పింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. చదవండి: ODI WC 2023: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్-కివీస్ జట్లు -
Asian Games 2023: పదిహేను పతకాలతో పండుగ
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.... ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా తొమ్మిది పతకాలు రాగా... షూటింగ్లో మూడు పతకాలు... బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం... తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. ఎనిమిదో రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలను అందుకున్నారు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లు కూడా సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఆదివారం ఒక్క అథ్లెటిక్స్‌లోనే 9 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రేసు విషయంలో కాస్త వివాదం రేగినా... చివరకు రజతంతో కథ సుఖాంతమైంది. తెలంగాణకు చెందిన అగసార నందిని కూడా ఏషియాడ్ పతకాల జాబితాలో తన పేరును లిఖించుకుంది. సత్తా చాటిన సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో గతంలో ఏ భారత అథ్లెట్‌కూ సాధ్యంకాని రీతిలో స్వర్ణ పతకంతో మెరిసాడు. 8 నిమిషాల 19.50 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసిన సాబ్లే మొదటి స్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల సాబ్లే ఈ క్రమంలో కొత్త ఆసియా క్రీడల రికార్డును నమోదు చేశాడు. 2018 జకార్తా క్రీడల్లో హొస్సీన్ కేహని (ఇరాన్: 8 నిమిషాల 22.79 సెకన్లు) పేరిట ఉన్న ఘనతను అతను సవరించాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ మహిళల విభాగంలో మాత్రం భారత్ నుంచి 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. తజీందర్ తడాఖా పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్ సింగ్ తూర్ సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 2018 జకార్తా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న అతను ఈసారి తన మెడల్‌ను నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తజీందర్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అతను ఫౌల్ చేసినా మూడో ప్రయత్నంలో 19.51 మీటర్ల దూరం గుండు వెళ్లింది. తర్వాతి ప్రయత్నంలో దానిని 20.06 మీటర్లతో అతను మెరుగుపర్చుకున్నాడు. ఐదో ప్రయత్నం కూడా ఫౌల్ అయినా... ఆఖరి ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని ఖాయం చేసుకున్నాడు. పర్దుమన్ సింగ్, జోగీందర్ సింగ్, బహదూర్ సింగ్ చౌహాన్ తర్వాత వరుసగా రెండు ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ ఈవెంట్లో స్వర్ణం సా ధించిన నాలుగో భారత అథ్లెట్‌గా తజీందర్ నిలిచాడు. సిల్వర్ జంప్ పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన మురళీ ఇక్కడ ఆసియా క్రీడల్లోనూ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 8.19 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచాడు. జియాన్ వాంగ్ (చైనా–8.22 మీ.), యుహావో షి (చైనా–8.10 మీ.) స్వర్ణ, కాంస్యాలు సాధించారు. వహ్వా హర్మిలన్ 1998 జనవరి... పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి అయిన మాధురి సింగ్ మూడు నెలల గర్భిణి. అయితే క్రీడాకారుల కోటాలో ఉద్యోగం పొందిన ఆమె సంస్థ నిబంధనలు, ఆదేశాల ప్రకారం తన ప్రధాన ఈవెంట్ 800 మీటర్ల నుంచి 1500 మీటర్లకు మారి పరుగెత్తాల్సి వచ్చింది. 1500 మీటర్ల ట్రయల్‌లో పాల్గొని ఉద్యోగం కాపాడుకున్న మాధురికి ఆరు నెలల తర్వాత పాప పుట్టింది. ఆ అమ్మాయే హర్మిలన్ బైన్స్. నాలుగేళ్ల తర్వాత 2002 ఆసియా క్రీడల్లో మాధురి 800 మీటర్ల పరుగులోనే పాల్గొని రజత పతకం సాధించింది. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది... అదీ 1500 మీటర్ల ఈవెంట్లో కావడం యాదృచ్చికం! ఆదివారం జరిగిన 1500 మీటర్ల పరుగును హర్మిలన్ 4 నిమిషాల 12.74 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. అజయ్‌కు రజతం, జాన్సన్‌కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో కూడా భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ సరోజ్, కేరళ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 3 నిమిషాల 38.94 సెకన్లలో అజయ్ రేసు పూర్తి చేయగా, 3 నిమిషాల 39.74 సెకన్లలో లక్ష్యం చేరాడు. ఈ ఈవెంట్లో ఖతర్‌కు చెందిన మొహమ్మద్ అల్‌గర్ని (3 నిమిషాల 38.38 సెకన్లు)కు స్వర్ణం దక్కింది. సీనియర్ సీమ జోరు మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచిన సీమ ఈసారి కూడా కాంస్య పతకాన్ని తన మెడలో వేసుకుంది. 40 ఏళ్ల సీమ డిస్కస్‌ను 58.62 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో కామన్వెల్త్ క్రీడల్లోనూ 3 రజతాలు, 1 కాంస్యం నెగ్గిన సీమ ఇవి తనకు ఆఖరి ఆసియా క్రీడలని ప్రకటించింది. ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది. -
ఆసియా గేమ్స్‌కు ‘ఇందూరు’ బిడ్డలు!
నిజామాబాద్‌నాగారం : ఆసియా క్రీడల్లో ఇందూరు కీర్తి పతాకం రెపరెపలాడనుంది. జిల్లా క్రీడాకారులు నిఖత్ జరీన్, గుగులోత్ సౌమ్య ఈ మెగా టోర్నీలో ఆడనున్నారు. పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. తనదైన శైలీలో పతకాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నిఖత్.. చిరుతలా పరుగెడుతూ గోల్స్ కొట్టే ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య ఈ టోర్నీకి ఎంపికయ్యారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌన్ నగరంలో ఈ క్రీడలు జరగనున్నాయి. మొదటిసారి పాల్గొంటున్నా నేను మొదటి సారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్నా. ఈ టోర్నీలో ఆడటం నా కల. ఇందుకోసం చాలా కష్టపడ్డాను. గతంలో అంతర్జాతీయ టోర్నీల్లో ఆడే అవకాశం వచ్చినా, గాయాలతో ఇబ్బంది పడ్డాను. రెండు, మూడు టోర్నీలు మాత్రమే ఆడాను. ఈ టోర్నీలో సత్తా చాటుతా. – గుగులోత్ సౌమ్య, ఫుట్‌బాల్ క్రీడాకారిణి పతకం సాధిస్తా.. మొదటిసారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్నా. 50 కేజీల విభాగంలో బరిలో దిగుతున్నా. ఈ క్రీడల్లో పతకం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా. దీనికోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా. – నిఖత్ జరీన్, -
బాక్సింగ్‌లో రాణిస్తున్న పేదింటి క్రీడాసుమం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆ అమ్మాయి బరిలోకి దిగితే పతకం సొంతం కావల్సిందే.. పంచ్ కొడితే ప్రత్యర్థి బెంబేలెత్తాల్సిందే.. ప్రతిభకు పేదరికం అడ్డం రాదని నిరూపించింది షేక్ నస్రీనా. బాక్సింగ్ బరిలో ప్రత్యర్థులను తన కిక్‌తో గడగడలాడించి 15 బంగారు, 2 రజత పతకాల్ని తన ఖాతాలో వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తోంది. ప్రతిభకు తగిన ప్రోత్సాహం లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపులు చూస్తోంది. ప్రభుత్వ తోడ్పాటు ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమాగా చెబుతోంది. ఆమె పేరు షేక్ నస్రీనా. ఊరు రాజమహేంద్రవరం. ఆ నగరంలోని ఐఎల్టీడీ ప్రాంతానికి చెందిన నస్రీనా తండ్రి షేక్ మస్తాన్ చిరు వ్యాపారం చేస్తూంటారు. తల్లి షేక్ మీరా టైలరింగ్ చేస్తూ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. బాక్సింగ్‌లో ఓనమాలు ఇలా.. నస్రీనా చిన్నాన్న హైదరాబాద్‌లో ఉంటారు. ఆయన ఇంటికి 2014లో వెళ్లిన ఆమె.. అక్కడ తన ఈడు పిల్లలు వివిధ క్రీడల్లో రాణించడం చూసి స్ఫూర్తి పొందింది. బాక్సింగ్‌లో విశ్వవిజేత టైసన్ పోరాడటాన్ని టీవీల్లో చూసి ఈ క్రీడపై ఆసక్తి పెంచుకుంది. ఆడపిల్లలకు క్రీడలు ఎందుకని ఇరుగుపొరుగు వారు నిరుత్సాహపరిచారు. కానీ కుమార్తె కోరికను తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో నస్రీనా హైదరాబాద్‌లో చిన్నాన్న ఇంటి వద్దనే ఉండి తొమ్మిదో తరగతి చదువుతూ, ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) బాక్సింగ్ కోచ్ ఓంకార్ యాదవ్ వద్ద ఈ క్రీడలో ఓనమాలు నేర్చుకుంది. తరువాత తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలో ఉండటంతో హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చేసింది. జిల్లాకు చెందిన అంతర్జాతీయ బాక్సింగ్ కోచ్ చిట్టూరి చంద్రశేఖర్ వద్ద శిక్షణకు చేరింది. నస్రీనా పట్టుదల, ఆట పట్ల ఆసక్తి, చలాకీతనాన్ని గుర్తించిన చంద్రశేఖర్ ఆమెకు బాక్సింగ్‌లో మెళకువలు నేర్పించారు. కౌంటర్ ఎటాక్, మిక్సింగ్, ఫుట్‌వర్క్, స్పీడ్, స్టామినా, ఫిట్‌నెస్‌లో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున శిక్షణ ఇచ్చి, మేటి క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. దీంతో తొమ్మిదో తరగతి నుంచే నస్రీనా పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం మొదలు పెట్టింది. శాప్ ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొని మరిన్ని మెళకువలు నేర్చుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో రాజమహేంద్రవరానికే చెందిన సినీ నటుడు ఆలీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లు నస్రీనా శిక్షణకు కొంత ఆర్థిక సహాయం అందించి, ప్రోత్సహించారు.స ప్రస్తుతం నస్రీనా రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అలాగే త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి కామన్వెల్త్, ప్రపంచ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యేందుకు ఢిల్లీలో అంతర్జాతీయ కోచ్, ఒలింపియన్ హయతుల్లా నైబీ వద్ద శిక్షణ పొందుతోంది. సాధించిన విజయాలు ► మధురైలో జరిగిన ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ పోటీల్లో బంగారు పతకంతో పాటు బెస్ట్ బాక్సర్ పతకం. ►ఏడు రాష్ట్రాల మహిళల సౌత్ జోన్ పోటీల్లో 64, 66 కేజీల విభాగాల్లో బంగారు పతకం. ►అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన బాక్సింగ్ పోటీల్లో పసిడి పతకం. ►2021లో మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం. ►2022లో జరిగిన ఏపీ స్టేట్ సీనియర్ బాక్సింగ్ పోటీలో రెండు పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపిక. ►ఇటీవల తిరుపతిలో జరిగిన ఏపీ సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తా.. బాక్సింగ్ నేర్చుకుంటున్న తొలి రోజుల్లో కంటిపై గాయం కావడంతో వద్దన్న అమ్మానాన్న ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అంతర్జాతీయ పోటీల ఎంపికకు తీసుకునే శిక్షణకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందిస్తే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తాను. – షేక్ నస్రీనా ప్రోత్సాహం అందిస్తే పతకం ఖాయం నేను తొలి నుంచీ కుస్తీ పోటీల్లో పాల్గొనేవాడిని. ఆడపిల్లలకు కుస్తీ పోటీలు ఎందుకులే అనుకున్న తరువాత నస్రీనాలో ఉన్న ఉత్సాహం చూసి ప్రోత్సహించాం. ఇప్పుడు ఎన్నో బంగారు పతకాలు సాధిస్తోంది. సామాన్య కుటుంబం కావడంతో నస్రీనాకు సరైన ఆహారం, ఇతర సౌకర్యాలు అందించలేకపోతున్నాం. నస్రీనాకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే దేశానికి బంగారు పతకం తీసుకురావడం ఖాయం. – షేక్ మస్తాన్, షేక్ నస్రీనా తండ్రి -
ఏషియన్ గేమ్స్ ట్రైనింగ్ క్యాంప్.. భారత బాక్సింగ్ జట్టుతో పాటు రైల్వే కోచ్ దుర్గా ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: చైనాలోని వుయిషాన్ నగరంలో సెప్టెంబర్ 3 నుండి 20వ తేదీ వరకు (17 రోజులు) జరిగే ఏషియన్ గేమ్స్ ట్రైనింగ్ క్యాంప్‌కు తెలంగాణ బాక్సింగ్ కోచ్ దుర్గా ప్రసాద్ నామినేట్ అయ్యాడు. హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన దుర్గా ప్రసాద్ భారత బాక్సింగ్ జట్టుతో పాటు చైనాకు వెళ్లనున్నాడు. ఈ శిక్షణా శిబిరంలో మొత్తం 46 మంది పాల్గొననున్నారు. ఇందులో 26 మంది బాక్సర్లు (పురుషులు, మహిళలు) కాగా.. 9 మంది కోచ్‌లు, 11 మంది సహాయ సిబ్బంది ఉన్నారు. కాగా, 2023 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్ఝౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. -
World Boxing Championships: ప్రిక్వార్టర్స్‌లో సచిన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సచిన్ సివాచ్ (54 కేజీలు) శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... నవీన్ కుమార్ (92 కేజీలు), గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. తొలి రౌండ్ బౌట్లో ప్రపంచ మాజీ యూత్ చాంపియన్ సచిన్ 5–0తో సెర్గీ నొవాక్ (మాల్డొవా)పై గెలుపొందగా... నవీన్ 0–5తో రేయస్ (స్పెయిన్) చేతిలో... గోవింద్ 0–5తో అల్ఖావెర్దోవి సాఖిల్ (జార్జియా) చేతిలో ఓడిపోయారు. -
Boxing World Championships: దీపక్ సంచలనం.. క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో సావిన్ ఎడువార్డ్ (రష్యా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన దీపక్ (51 కేజీలు) సంచలన విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో దీపక్ 5–2తో 2021 ప్రపంచ చాంపియన్ బిబోసినోవ్ (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించాడు. 75 కేజీల విభాగం రెండో రౌండ్లో సుమిత్ కుందు 1–3తో సోసులిన్ పావెల్ (రష్యా) చేతిలో... ప్లస్ 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో నరేందర్ 0–5తో అర్జోలా అలెజాంద్రో (క్యూబా) చేతిలో ఓడిపోయారు. -
World Boxing Championships 2023: క్వార్టర్స్‌లో ఆకాశ్, నిశాంత్
తాష్కెంట్: పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆకాశ్ సాంగ్వాన్, నిశాంత్ దేవ్ ముందంజ వేశారు. 67 కేజీల విభాగంలో ఆకాశ్ 5–0తో ఫు మింగ్కే (చైనా)పై... 71 కేజీల విభాగంలో నిశాంత్ 5–0తో లీ సంగ్మిన్ (కొరియా)పై ఘన విజయాలు సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తర్వాతి మ్యాచ్‌లలో దులాత్ బెక్బావ్ (కజకిస్తాన్)తో ఆకాశ్... ఫొఖాహా నిదాల్ (పాలస్తీనా)తో తలపడతారు. -
బాక్సింగ్‌కి హైదరాబాద్‌లో సౌకర్యాలు లేవని అన్నారు
-
నీతూ, స్వీటీ ‘పసిడి’ పంచ్ పోరు
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ఇద్దరు భారత బాక్సర్లు నీతూ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) పసిడి పతకాల కోసం పోటీపడనున్నారు. నేటి ఫైనల్స్‌లో లుత్సయ్ఖాన్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. 2017, 2018 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. సీనియర్ ప్రపంచ చాంపియన్‌లో నీతూ తొలిసారి ఫైనల్‌కు చేరింది. హరియాణాకే చెందిన 30 ఏళ్ల స్వీటీ రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014లో రజత పతకం నెగ్గిన స్వీటీ ఈసారైనా తన పసిడి కలను సాకారం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) పోటీపడతారు. -
భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన నీతూ ఘంగాస్
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు) భారత్‌కు పతకం ఖరారు చేసింది. ఇవాళ (మార్చి 22) జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో జపాన్‌కు చెందిన మడోకా వాడాకు మట్టికరిపించిన నీతూ.. సెమీఫైనల్‌కు అర్హత సాధించి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. తొలి రౌండ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్ధిపై పంచ్‌ల వర్షం కురిపించడంతో రెండవ రౌండ్లో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి RSC (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్) ద్వారా నీతూను విజేతగా ప్రకటించాడు. ఈ పోటీల్లో నీతూ RSC ద్వారానే మూడు బౌట్లలో విజయం సాధించడం విశేషం. మరోవైపు, ఇవాళ జరుగబోయే బౌట్లలో మరో ఏడుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జైస్మిన్ లంబోరియా (60 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) (+81 కేజీలు) (+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. -
కేవలం 12 సెకెన్లలో ప్రత్యర్ధిని మట్టికరిపించిన భారత బాక్సర్
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు జాస్మిన్ లంబోరియా, శశి చోప్రా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన తొలి పోరులో జాస్మిన్ (60 కేజీల విభాగం) రిఫరీ స్టాపింగ్ ద కాంటెస్ట్ (ఆర్ఎస్సీ) ద్వారా ఎన్యాంబెగా ఆంబ్రోస్ (టాంజానియా)ను చిత్తు చేసింది. బౌట్ మొదలైన 12 సెకన్లలోనే జాస్మిన్ విసిరిన పంచ్‌లకు ఆంబ్రోస్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ ఆటను ఆపివేసి జాస్మిన్ను విజేతగా ప్రకటించారు. 63 కేజీల కేటగిరీలో శశి చోప్రా 5–0 స్కోరుతో ఎంవాంగీ టెరిసియా (కెన్యా)పై ఘన విజయం సాధించింది. తర్వాతి రౌండ్లో సమడోవా (తజికిస్తాన్)తో జాస్మిన్... కిటో మై (జపాన్)తో శశి తలపడతారు. అయితే 70 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత బాక్సర్ శ్రుతి యాదవ్ 0–5తో జో పాన్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. నేడు భారత బాక్సర్లు నీతూ ఘంఘాస్, మంజు బంబోరియా తొలి రౌండ్లో ఆడతారు. -
మేరీకోమ్ రిటైర్మెంట్ అప్పుడే..
ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. గతేడాది కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా ఆమె ఎడమ మోకాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకుంది. అప్పటినుంచి మేరీకోమ్ బరిలోకి దిగలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 23న మొదలుకానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనాలని మేరీకోమ్ భావిస్తోంది. అయితే నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడిన బాక్సర్లు పోటీల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేదు. ఇప్పటికే మేరీకోమ్ వయస్సు 40 ఏళ్లు. ఈ ఏడాది నవంబర్‌లో మేరీకోమ్‌కు 41 ఏళ్లు నిండనున్నాయి. అందుకే బహుశా ఆమెకు ఆసియా క్రీడల్లో చివరిసారి బరిలోకి దిగే చాన్స్ ఉంది. కాగా ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మేరీకోమ్ పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ''కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్ సందర్భంగా దురదృష్టవశాత్తూ గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. తిరిగి రింగ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.నాకు ఏడాది మాత్రమే మిగిలి ఉంది. వచ్చే ఏడాది రిటైర్ కావాల్సిందే. కాబట్టి వీడ్కోలుకు ముందు టోర్నీలో ఆడాలనుకుంటున్నా. మరో ఐదేళ్ల పాటు బాక్సింగ్ రింగ్‌లో కొనసాగాలని ఉన్నా నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడితే ఆటకు దూరమవక తప్పదు. ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడలు. అప్పటివరకు పూర్తిగా కోలుకుంటాననే నమ్మకం ఉంది. ఒకవేళ ఆసియా క్రీడలకు అర్హత సాధించకపోతే చివరగా ఏదైనా అంతర్జాతీయ టోర్నీలో పోటీపడాలనుంది'' అని పేర్కొంది. -
ప్రపంచ మహిళల బాక్సింగ్ పోటీలకు భారత జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెల 15 నుంచి 26 వరకు స్వదేశంలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో 12 వెయిట్ కేటగిరీల్లో భారత బాక్సర్లు పోటీపడతారు. గత ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని న్యూఢిల్లీలోనూ నిలబెట్టుకునేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బరిలోకి దిగనుంది. భారత జట్టు: నీతూ ఘంఘాస్ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జాస్మిన్ లంబోరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), సవీటి బూరా (81 కేజీలు), నుపర్ షెరాన్ (ప్లస్ 81 కేజీలు). -
సెమీ ఫైనల్లో నిఖత్ జరీన్
మహిళల జాతీయ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ విభాగంలో నిఖత్ ‘ఆర్ఎస్సీ’ ద్వారా తనిష్క చావర్ (గోవా)ను చిత్తు చేసింది. నిఖత్ పంచ్‌ల ధాటికి తనిష్క తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆమెను విజేతగా ప్రకటించారు. సెమీస్‌లో శ్విందర్ కౌర్‌ను నిఖత్ ఎదుర్కొంటుంది. -
బాక్సింగ్ రింగులో పంచులు కురిపించిన రోజా (ఫొటోలు)
-
బాక్సింగ్ చేస్తూ మంత్రి రోజా సందడి
-
మేరీ కోమ్.. బాక్సింగ్ రింగ్‌ను శాశించిన ఉక్కు మహిళ
చుంగ్ (ఎత్తుగా), నియ్ (సంపద ఉన్న), జాంగ్ (దృఢమైన).. ఈ మూడు కలిపితే ‘చుంగ్నీజాంగ్’.. తన కూతురికి తండ్రి పెట్టిన పేరది! ఆ సమయంలో ఆ చిన్నారి గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆయన ఏమీ ఆలోచించలేదు. నామకరణంలోనే ఘనకీర్తి రాసిపెట్టి ఉందని ఆయనకు తెలియదు. అప్పటి వరకు మగపిల్లాడు పుడితే బాగుండనుకున్న తల్లి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిని చూసి సంబరంగా గుండెకు హత్తుకుంది. కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి ‘మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా’.. అంటూ నినాదం నింపుకున్న విశ్వక్రీడల్లో మెరిసింది.. తన దృఢ సంకల్పంతో విజయాలతో పాటు సంపదనూ మోసుకొచ్చింది. ఆ అమ్మాయే మంగ్తె చుంగ్నీజాంగ్ మేరీ కోమ్.. దేశంలో బాక్సింగ్ ఆటకు, మహిళలకు భూమ్యాకాశాలకు ఉన్నంత అంతరం ఉన్న సమయంలో ఆటకు పర్యాయపదంగా నిలిచింది. దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్... క్రీడాకారులంతా కలలుగనే ఒలింపిక్ క్రీడల్లో కాంస్యపతకంతో భారత జెండా రెపరెపలాడించిన క్షణం.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో కలిపి మరో 12 పతకాలు.. 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై మొదలైన ఈ విజయ ప్రస్థానం 39 ఏళ్ల వయసు వరకూ సాగింది. ఈ మధ్యలో అమ్మతనం కూడా ఆమె ఆటకు అడ్డుగా మారలేదు. అసాధారణ ప్రదర్శనతో మేరీ కోమ్ బాక్సింగ్ రింగ్‌ను శాసించింది. ఆమె సాధించిన ఘనతల విలువ రికార్డు పుస్తకాలకే పరిమితం కాదు. వాటి వెనక ఉన్న అపార పట్టుదల, పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. క్రీడల్లో రాణించలేకపోవటానికి సౌకర్యాలు లేకపోవడమే కారణమని సాకులు చెప్పే ఎందరికో మేరీ కోమ్ జీవితం ఒక పాఠం, గుణపాఠం నేర్పిస్తుంది. ఆమె నేపథ్యం, ప్రతికూల పరిస్థితులను దాటి వచ్చిన తీరు అనితరసాధ్యం. బాక్సింగ్‌నే ఇష్టపడి.. డింకో సింగ్.. 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన మణిపూర్ బాక్సర్. అతను ఆ విజయంతో తిరిగి వచ్చిన సమయంలో స్వరాష్ట్రంలో సంబరాలు జరిగాయి. అప్పుడు 16 ఏళ్లు ఉన్న మేరీ వాటన్నింటినీ చూసి ఒక అభిమానిలా గంతులు వేసింది. అంతే తప్ప అప్పటి వరకు కూడా ఆమె బాక్సింగ్‌లో కెరీర్ గురించి ఆలోచించనే లేదు. తండ్రి ఒక వ్యవసాయ కూలీ. సహజంగానే ఆర్థిక ఇబ్బందులు. అయితే ఆయన ఎప్పుడూ దానిని సమస్యగా భావించలేదు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకోగలిగితే చాలనుకునే వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో స్కూల్లో పోటీలు తప్ప మేరీకి క్రీడల గురించి మరేమీ తెలీదు. చిన్నప్పటి నుంచి బలంగా ఉన్న ఆమెకు అథ్లెటిక్స్‌లో పోటీపడి గెలవడం చిటికెలో పనిగా మారింది. అయితే ఒక రోజు డింకో సింగ్‌ను చూసిన తర్వాత తనకు సరైన ఆట బాక్సింగ్ అనే భావించింది. ఆ పంచ్‌లు, బలంగా ప్రత్యర్థిపై విరుచుకుపడే తత్వం మేరీని ఆకర్షించాయి. అయితే నాన్నకు తెలిస్తే కోప్పడతాడేమోనని తన ఆసక్తిని రహస్యంగానే ఉంచింది. మేరీ దూకుడు, పోరాటతత్వం బాక్సింగ్‌కు సరిపోతాయని గుర్తించి ఆమెను కోచ్‌లు.. కొసానా మీటీ, నర్జిత్ సింగ్ ప్రోత్సహించారు. అదే చివరకు మేరీని ప్రపంచ చాంపియన్ దిశగా నడిపించింది. సాధనలోనే ఒక రోజు తన కూతురి బాక్సింగ్ గురించి తెలుసుకున్న తండ్రి కొంత ఆందోళన చెందినా.. చివరకు సరైన మార్గం ఎంచుకుందని స్థిమితపడ్డాడు. పతకాల ప్రవాహం.. 2001 అక్టోబర్.. పెన్సిల్వేనియాలో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్.. 48 కేజీల విభాగంలో సత్తా చాటిన మేరీ కోమ్ ఫైనల్ చేరింది. తుది పోరులో ఓడినా రజతం సాధించి గర్వంగా నిలబడింది. అయితే అది ఆరంభం మాత్రమే. పతకధారణ అంతటితో ఆగిపోలేదు. తొలిసారి సాధించిన రజతం ఆ తర్వాత బంగారమైంది. ఆ వేదికపై మరో ఐదుసార్లు మేరీ మెడలో స్వర్ణం మెరిసింది. 2002, 2005, 2006, 2008, 2010, 2018లలో ఏకంగా ఆరుసార్లు ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఇదే తరహాలో ఐదు స్వర్ణాలతో మేరీ తానేంటో చూపించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు, వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ ఒక ఎత్తు కాగా.. 2012 లండన్ ఒలింపిక్స్ సాధించిన కాంస్య పతకం మేరీ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. వరుస విజయాలతో సెమీస్ చేరిన తర్వాత నికోలా ఆడమ్స్ (యూకే) చేతిలో ఓడటంతో మేరీ ఫైనల్ ఆశలు నెరవరలేదు. అయితేనేమి ఎక్కడో మణిపురి కోమ్ తెగలో పుట్టి లండన్ వేదికపై ఒలింపిక్ కాంస్య పతకం అందుకుంటున్న క్షణాన ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపు ఆ కంచు పతకం విలువేమిటో చెబుతుంది. బాక్సింగ్ పంచ్ ద్వారా మెగా ఈవెంట్లో భారత జెండా ఎగరేసిన క్షణం అపురూపం. అడ్డు రాని అమ్మతనం.. బాక్సర్‌గా ఎదుగుతున్న దశలో పరిచయమైన ఫుట్‌బాల్ ప్లేయర్ కరుంగ్ ఓన్లర్‌ను మేరీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2005లో పెళ్లి జరిగేనాటికే ఆమె ప్రపంచ చాంపియన్ కూడా. పెళ్లి తర్వాత ఆటకు మేరీ విరామమిచ్చింది. చాలామంది ఆమె బాక్సింగ్ ముగిసిపోయిందనే భావించారు. ఇతర క్రీడల సంగతేమో కానీ బాక్సింగ్‌లాంటి ఆటలో తల్లిగా మారిన తర్వాత అదే తరహా బలాన్ని ప్రదర్శించడం, శరీరంలో వచ్చే మార్పులతో కలిగే ఇబ్బందులను అధిగమించాల్సి రావడం చాలా కష్టం. కానీ మేరీ పోరాటతత్వం ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సాధన మొదలు పెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఆమె నాలుగు ప్రపంచ చాంపియన్ షిప్‌లు, ఒలింపిక్ పతకం గెలుచుకోవడం మరో పెద్ద విశేషం. ఈ దంపతులకు ఆ తర్వాత మరో కొడుకు పుట్టగా, ఒక అమ్మాయిని వీరు దత్తత తీసుకున్నారు. అవార్డుల పంట.. క్రీడాకారులకు ఇచ్చే అర్జున, ఖేల్రత్నలు సహజంగానే మేరీని వెతుక్కుంటూ వచ్చాయి. భారత ప్రభుత్వం ఇచ్చే నాలుగు అత్యుత్తమ పౌర పురస్కారాల్లో భారతరత్న మినహా మిగతా మూడు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు మేరీని వరించాయి. క్రీడల్లో ఆమె చేసిన సేవలకుగాను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయగా 2016–2022 మధ్య ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించింది. వెండితెర కథగా.. మేరీకోమ్ జీవితం ఆధారంగా 2014లో సినిమా వచ్చింది ఉమంగ్ కుమార్ దర్శకత్వంలో! ప్రియాంక చోప్రా అందులో మేరీ పాత్రను పోషించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి సహ నిర్మాతగా కూడా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఆమె ఆత్మకథ ‘అన్ బ్రేకబుల్’ పేరుతో పుస్తకంగా కూడా ప్రచురితమైంది. చిన్నారులకు స్ఫూర్తిని అందించే కథల సంకలనం ‘గుడ్‌నైట్ స్టోరీస్ ఫర్ రెబల్ గర్ల్స్’లో కూడా మేరీకి చోటు దక్కింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 12వ పతకం ఖాయం చేసిన నరేందర్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 12వ పతకం ఖాయమైంది. పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో నరేందర్ 5–0తో ఇమాన్ (ఇరాన్)పై గెలిచాడు. బుధవారం మొత్తం 12 వెయిట్ కేటగిరీల్లో భారత బాక్సర్లు సెమీఫైనల్ బౌట్లు ఆడనున్నారు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్లు అదృశ్యమైన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. క్రీడలు ముగిసాక స్వదేశానికి తిరుగు పయనం అయ్యేందుకు బర్మింగ్‌హామ్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆ ఇద్దరు, అక్కడి నుంచి కనిపించకుండా పోయారంటూ పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (పీబీఎఫ్) వెల్లడించింది. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్‌హామ్ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శ్రీలంకకు చెందిన 10 మంది అథ్లెట్లు కూడా ఇదే తరహాలో అదృశ్యమైన నేపథ్యంలో ఈ మిస్సింగ్ కేస్ చర్చనీయాంశంగా మారింది. కనిపించకుండా పోయిన బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్‌లుగా పీబీఎఫ్ పేర్కొంది. వీరిలో నజీర్ 86-92 కేజీల హెవీవెయిట్ విభాగం రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరగగా.. 60-63.5 కేజీల విభాగంలో సులేమాన్ రౌండ్ ఆఫ్ 32లో ఓటమిపాలైనట్లు పీబీఎఫ్ పేర్కొంది. బాక్సర్ల అదృశ్యంపై విచారణ నిమిత్తం పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పీబీఎఫ్ ప్రకటించింది. కాగా, ఇదే ఏడాది బుడాపెస్ట్ వేదికగా జరిగిన 19వ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ సందర్భంగా ఫైజాన్ అక్బర్ అనే ఓ పాకిస్థానీ స్విమ్మర్ కూడా ఇలానే అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. చదవండి: కామన్వెల్త్లో భారత ఫెన్సర్‌కు స్వర్ణం -
బాక్సింగ్‌లో మరో పతకం.. సాగర్ అహ్లావత్‌కు రజతం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లావత్ రజతం సాధించడంతో బాక్సింగ్‌లో భారత ప్రస్థానం సమాప్తమైంది. పదో రోజు సాగర్ అహ్లావత్.. ఇంగ్లండ్‌కు చెందిన డెలిసియస్ ఓరీ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. సాగర్ పతకంతో బాక్సింగ్‌లో భారత పతకాల సంఖ్య ఏడుకు (3 గోల్డ్, సిల్వర్, 3 బ్రాంజ్) చేరింది. ఓవరాల్‌గా 10వ రోజు ముగిసే సమాయానికి భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) చేరాయి. చదవండి: IND VS WI 5th T20: ఆఖరి పోరులోనూ భారత్‌దే గెలుపు -
బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన తెలంగాణ బిడ్డ
-
Commonwealth Games 2022: కనకాభిషేకం
బ్రిటిష్ గడ్డపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ గీతం మారుమోగింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు పసిడి పతకాలు సాధించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మనోళ్లు బంగారంలాంటి ప్రదర్శన చేయగా... బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లి మూడు స్వర్ణ పతకాల రేసులో నిలిచారు. మహిళల హాకీలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పతకం సొంతం చేసుకోగా... టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట పురుషుల డబుల్స్‌లో రజతం పతకంతో మెరిసింది. బర్మింగ్‌హామ్: పంచ్ పంచ్కూ పతకం తెచ్చి కామనెŠవ్ల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత బాక్సర్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్ జరీన్ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్నాల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్ రెస్టాన్ (ఇంగ్లండ్)పై... అమిత్ 5–0తో డిఫెండింగ్ చాంపియన్ కియరాన్ మెక్‌డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. తాజా విజయంతో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో కియరాన్ చేతిలో ఎదురైన ఓటమికి అమిత్ బదులు తీర్చుకున్నాడు. కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్ హుక్, రైట్ హుక్ పంచ్‌లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్ ప్రత్యర్థి తనపై పంచ్‌లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచింది. ఈ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్ నాలుగు బౌట్లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో నిఖత్ పంచ్‌ల ధాటికి రిఫరీ బౌట్‌ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్ 5–0తో గెలుపొందింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ రోహిత్ టొకాస్ 2–3తో స్టీఫెన్ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్ (భారత్) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్ ఒరీ (ఇంగ్లండ్)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు. -
పసిడి పంచ్ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ ఒక్క రోజే భారత బాక్సర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్ స్వర్ణంతో బోణీ కొట్టగా, ఆతర్వాత నిమిషాల వ్యవధిలోనే పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసిరాడు. తాజాగా మహిళల 48-50 కేజీల లైట్ ఫ్లై విభాగంలో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరో స్వర్ణం సాధించింది. HAR PUNCH MEIN JEET! 🔥🔥🔥 Reigning World Champion @nikhat_zareen 🥊 dominates a tricky opponent Carly MC Naul (NIR) via UNANIMOUS DECISION and wins the coveted GOLD MEDAL 🥇 in the Women's 50kg event at #CWG2022 Extraordinary from our Champ 💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/4RBfXi2LQy — SAI Media (@Media_SAI) August 7, 2022 ఫైనల్లో జరీన్.. నార్త్రన్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నౌల్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి, భారత్‌కు మూడో బాక్సింగ్ స్వర్ణాన్ని అందించింది. జరీన్ పసిడి పంచ్‌తో బాక్సింగ్‌లో భారత్ పతకాల సంఖ్య 5కు (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) చేరగా, ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 48కి (17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. పురుషుల ఫెదర్వెయిట్ 57 కేజీల విభాగంలో మహ్మద్ హుస్సాముద్దీన్, పురుషుల 67 కేజీల వెల్టర్‌వెయిట్ విభాగంలో రోహిత్ టోకాస్‌లు ఇదివరకే కాంస్య పతకాలు గెలిచారు. కాగా, జరీన్.. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని.. నిఖత్ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైంది, నిఖత్.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. చదవండి: జావెలిన్ త్రోలో తొలి పతకం.. చరిత్ర సృష్టించిన అన్నూ మాలిక్ -
మరో పసిడి పంచ్.. బాక్సింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు రెచ్చిపోతున్నారు. పురుషుల ఫెదర్వెయిట్ 57 కేజీల విభాగంలో మహ్మద్ హుస్సాముద్దీన్, పురుషుల 67 కేజీల వెల్టర్‌వెయిట్ విభాగంలో రోహిత్ టోకాస్‌లు ఇదివరకే కాంస్య పతకాలు గెలువగా.. పదో రోజు క్రీడల ఆరంభంలోనే మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్ స్వర్ణంతో మెరిసింది. నీతూ పసిడి గెలిచిన నిమిషాల వ్యవధిలోనే భారత్ బాక్సింగ్‌లో మరో స్వర్ణం సాధించింది. పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసిరాడు. అమిత్ ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్ కియరన్ మెక్‌డొనాల్డ్‌ను 5-0 తేడా మట్టికరిపించి భారత్ స్వర్ణాల సంఖ్యను 15కు, ఓవరాల్ పతకాల సంఖ్యను 43కు (15 స్వర్ణాలు, 11 రజతాలు, 17 కాంస్యాలు) పెంచాడు. ఇదే రోజే భారత్ మరో పతకం కూడా సాధించింది. మహిళల హాకీలో భారత్.. న్యూజిలాండ్‌పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం పతకం సొంతం చేసుకుంది. చదవండి: పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్‌లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం -
భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు పతకాలు మోత మోగిస్తున్నారు. తాజాగా 10వ రోజు భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చి చేరాయి. మహిళల 48 కేజీల విభాగంలో భారత బాక్సర్ నీతు ఘంగాస్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ల్లో ఇంగ్లండ్‌కు చెందిన డెమీ-జేడ్‌పై 5-0తేడాతో నీతు విజయం సాధించింది. తన పాల్గొంటున్న తొలి కామన్వెల్త్ గేమ్స్‌లోనే నీతు పతకం సాధించడం గమనార్హం. కాగా కామన్వెల్త్ గేమ్స్-2022లో బాక్సింగ్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. మరోవైపు పురుషుల 51 కేజీల విభాగంలో బాక్సర్ అమిత్ పంఘల్ కూడా గోల్డ్‌మెడల్ సాధించాడు. ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్ కియారన్ మక్‌డొనాల్డ్‌ను 0-5 ఓడించి పంఘల్ పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఓవరాల్‌గా ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 42 పతకాలు చేరాయి. చదవండి: CWG 2022- PV Sindhu: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు -
దుమ్మురేపుతున్న భారత్ బాక్సర్లు
-
వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది?
భారత మహిళా బాక్సర్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో కనీస కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మహిళల బాక్సింగ్ 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ బౌట్లో 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌కు ప్రవేశించింది. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం నిఖత్ జరీన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బుధవారం నిఖత్ జరీన్ తల్లి పర్వీన్ సుల్తానా పుట్టినరోజు. తల్లి పుట్టినరోజు నాడే క్వార్టర్స్ మ్యాచ్ గెలిచి కనీసం కాంస్య పతకం ఖరారు చేయడంతో నిఖత్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్ నుంచి కిందకు దిగగానే.. ''హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి'' అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్ జరీన్ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించింది. ఇక నిఖత్ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్(57 కేజీలు) కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించింది. అయితే కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన లవ్లీనా బొర్హంగైన్ మాత్రం నిరాశపరిచింది. మిడిల్ వెయిట్ క్వార్టర్ఫైనల్లో వేల్స్‌కు చెందిన రోసీ ఎక్లెస్ చేతిలో 3-2తో ఓడిపోయింది. మరో బాక్సర్ ఆశిష్ కుమార్(80 కేజీలు) ఇంగ్లండ్‌కు చెందిన ఆరోన్ బోవెన్ చేతిలో 4-1తో ఓడి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. The beautiful thing by @nikhat_zareen after winning QF.. "Happy Birthday ammi, Allah aapko khush rakhe" ❤️😍 #B2022 #boxing #NikhatZareen #CommonwealthGames2022 #CWG2022 #TeamIndia @WeAreTeamIndia @Media_SAI pic.twitter.com/lqp4fVkhoX — Sagar 🕊️ (@imperfect_ocean) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే -
CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే (ఆరో రోజు) భారత్ ఖాతాలో 14 పతకాలు చేరగా, మరో 3 పతకాలు జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్‌పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల ఆరో రోజు లవ్‌ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఒక్క వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. మిరాబాయ్ చాను (గోల్డ్), జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్), అచింట షెవులి (గోల్డ్), సంకేత్ సర్గార్ (సిల్వర్), బింద్యా రాణి (సిల్వర్), వికాస్ ఠాకుర్ (సిల్వర్), గురురాజ పుజారి (బ్రాంజ్), హర్జిందర్ కౌర్ (బ్రాంజ్), లవ్‌ప్రీత్ సింగ్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మిగతా ఐదు పతకాల్లో జూడోలో 2 (సుశీలా దేవీ సిల్వర్, విజయ్ కుమార్ యాదవ్ బ్రాంజ్), లాన్స్ బౌల్స్‌లో ఒకటి (గోల్డ్), టేబుల్ టెన్నిస్‌లో ఒకటి (గోల్డ్), బ్యాడ్మింటన్‌లో ఒకటి (సిల్వర్) గెలిచారు. ఇక పతకాల పట్టిక విషయానికొస్తే.. 5 స్వర్ణాలు , 5 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించిన భారత్ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 106 పతకాలతో (42 గోల్డ్, 32 సిల్వర్, 32 బ్రాంజ్) ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 86 (31 గోల్డ్, 34 సిల్వర్, 21 బ్రాంజ్), న్యూజిలాండ్ 26 (13 గోల్డ్, 7 సిల్వర్, 6 బ్రాంజ్), కెనడా 46 (11 గోల్డ్, 16 సిల్వర్, 19 బ్రాంజ్), సౌతాఫ్రికా 16 (6 గోల్డ్, 5 సిల్వర్, 5 బ్రాంజ్) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో నిలిచాయి. చదవండి: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం -
యువ బాక్సర్ అనుమానాస్పద మృతి
ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఓ యువ బాక్సర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన పంజాబ్‌లోని బటిండ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో రెండు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 5 పతకాలను సాధించిన తల్వండి సాబో గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ అలియాస్ దీప్ దలీవాల్ అనే 22 ఏళ్ల బాక్సర్ అధిక మోతాదులో హెరాయిన్‌ను ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుల్దీప్.. గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో విగతజీవిగా పడి ఉన్నాడు. A five-time medal winner and national-level boxer died, allegedly due to drug overdose, at Talwandi Sabo in this district on Thursday. Kuldeep Singh, aka Deep Dhaliwal, 22, had won five medals including two gold. #DRUGS #Punjab #Udta #Punjab pic.twitter.com/F6DCpq10dT — Ankush Saini अंकुश सैनी ਅੰਕੁਸ਼ ਸੈਣੀ انکوش سائیں (@ank1saini) July 28, 2022 అతని మృతదేహం పక్కన హెరాయిన్‌తో పాటు మరికొన్ని డ్రగ్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కుల్దీప్ అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడం వల్లే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. అయితే కుల్దీప్ కుటుంబసభ్యులు మాత్రం ఈ విషయంతో విభేదిస్తున్నారు. కుల్దీప్కు అసలు డ్రగ్స్ అలవాటే లేదని వాపోతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. చదవండి: Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్..? -
పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్వెల్త్ గ్రామంలోకి కోచ్‌కు అనుమతి
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులు వేధిస్తున్నారంటూ నిన్న ట్విటర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకుంది. తన కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని లవ్లీనా చేసిన ఆరోపణలు నేపథ్యంలో బీఎఫ్ఐ స్పందించింది. కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసి ఆమెకు హోటెల్లో వసతి కల్పించినట్లు బీఎఫ్ఐ వెల్లడించింది. అలాగే లవ్లీనాతో పాటు ట్రైనింగ్ క్యాంపుకు కోచ్ కూడా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులతో పాటు 33 శాతం సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందన్న నిబంధన కారణంగా లవ్లీనా కోచ్‌కు కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతి లభించలేదని బీఎఫ్ఐ వివరించింది. కాగా, బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని లవ్లీనా నిన్న ట్విటర్ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. చదవండి: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్ మహిళా బాక్సర్ సంచలన ఆరోపణలు -
తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టనున్న స్టార్ బాక్సర్
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ స్వల్ప విరామం తర్వాత స్వదేశంలో మరో ప్రొ బాక్సింగ్ బౌట్లో తలపడనున్నాడు. ఆగస్టులో రాయ్‌పూర్ వేదికగా తొలిసారి జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన విజేందర్ 2015లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. వరుసగా 12 బౌట్లలో గెలిచాడు ప్రస్తుతం మాంచెస్టర్‌లో శిక్షణ పొందుతున్నానని రాయ్‌పూర్ బౌట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విజేందర్ చెప్పాడు. -
కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్
భారత మహిళా దిగ్గజ బాక్సర్.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగింది. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. విషయంలోకి వెళితే.. కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌లో భాగంగా శుక్రవారం 48 కేజీల విభాగంలో నీతూతో తలపడింది. మ్యాచ్ ఆరంభంలోనే మేరీకోమ్ మోకాలికి గాయమైంది.మెడికల్ చికిత్స పొందిన తర్వాత బౌట్‌ను తిరిగి ప్రారంభించారు. అయితే నొప్పి ఉండడంతో మేరీకోమ్ చాలా ఇబ్బందిగా కనిపించింది. ఇది గమనించిన రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆర్ఎస్సీఐ తీర్పు మేరకు నీతూను విజేతగా ప్రకటించారు. ఈ ఓటమితో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ గేమ్స్‌పై ఆమె దృష్టి పెట్టారు. -
ప్రత్యర్థి పంచ్‌కు ఊహించని అనుభవం; ఆపై కోమాలోకి
బాక్సింగ్ రింగ్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి పంచ్‌లకు బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో మరొక బాక్సర్ కోమాలోకి వెళ్లిపోయాడు. కోమాలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు.. అతను ప్రవర్తించిన తీరు ఉద్వేగానికి గురి చేసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే.. లైట్ వెయిట్ బాక్సర్లు సిమిసో బుటెలేజీ, సిప్సిలే నుంటుగ్వాల మధ్య జూన్ 5న(ఆదివారం) వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆల్ ఆఫ్రికా లైట్ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరు జరిగింది. ఇద్దరు మంచి టఫ్ ఫైట్ కనబరచడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. 10వ రౌండ్ బౌట్ మొదలయ్యే వరకు సిమిసో, నుంగుట్వాలు ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. పదో బౌట్ మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు నుంటుగ్వా ఇచ్చిన పంచ్ సిమిసో బుటెలేజీ తలలో బలంగా తగిలింది. దీంతో కళ్లు బైర్లు కమ్మిన సిమిసోకు ఏం చేస్తున్నాడో ఒక్క క్షణం ఎవరికి అర్థం కాలేదు. రిఫరీ ఉన్న వైపు దూసుకొచ్చిన సిమిసో బుటెలేజీ అతనికి పంచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థి వెనకాల ఉంటే.. అది గమనించకుండా తన ముందువైపు ఎవరు లేనప్పటికి గాలిలో పంచ్‌లు కొట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన రిఫరీ సిమిసో పరిస్థితిని అర్థం చేసుకొని బౌట్‌ను నిలిపేసి మెడికోను పిలిచాడు. దీంతో సిప్సిలే నుంటుగ్వా లైట్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరించాడు. వైద్య సిబ్బంది సిమిసోను పరిశీలించి వెంటనే డర్బన్‌లో కింగ్ ఎడ్వర్డ్-8 ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన సిమిసో బెటెలేజీ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో కోమాలో ఉన్నాడని.. రెండురోజులు గడిస్తే కానీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుందని వైద్యులు తెలిపారు. అయితే కొద్దిరోజుల్లోనే అతను మాములు పరిస్థితికి వచ్చేస్తాడని.. ప్రాణాలకు ఏం భయం లేదని తెలిపారు.. కాగా సిమిసో బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేసిన ఆఖరి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్ బాక్స్ విసిరేసిన క్రికెట్ అభిమాని Rabat Diamond League 2022: అవినాశ్ అద్భుతం.. ఎనిమిదోసారి జాతీయ రికార్డు Very scary in South Africa please 🙏🏼 for Simiso Buthelezi (4-1). At 2:43 of the 10th & final round, Siphesihle Mntungwa (7-1-2) falls through the ropes but then Buthelezi appears to lose his understanding of the present situation. Mntungwa takes the WBF African lightweight title pic.twitter.com/YhfCI623LB — Tim Boxeo (@TimBoxeo) June 5, 2022 I was at the #boxing in KZN yesterday and this is one of the strangest and saddest things I've seen in the sport. Thoughts and prayers with Simiso Buthelezi who is now in an induced coma in hospital 🙏🏿🙏🏿 @SABC_Sport #SizenzaZonke pic.twitter.com/1097yFtKmY — Tracksuit (@ThabisoMosia) June 6, 2022 -
బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో విజేతలకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లకు రూ. 2కోట్ల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. నగదు బహుమతితో పాటు ఇంటిస్థలం కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో స్వర్ణం గెలిచి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇక దేశం తరపున నిఖత్ జరీన్ ఐదో మహిళా బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్ షూటింగ్ పోటీల్లో ఈషా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది. సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
రింగ్‌లోనే కుప్పకూలిన బాక్సర్.. వీడియో వైరల్
జర్మనీ స్టార్ బాక్సర్ ముసా యమక్ మరణం క్రీడాలోకాన్ని దిగ్రాంతికి గురి చేసింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ముసా యమక్ రింగ్‌లోనే కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. 38 సంవత్సరాల జర్మన్ ఛాంపియన్ మూసా యమక్ గత శనివారం ఉగాండకి చెందిన హమ్జా వాండెరతో బాక్సింగ్‌కి దిగాడు. వీరిద్దరి మధ్య మూడు సెట్ల మ్యాచ్ జరుగుతుండగా.. సెకండ్ రౌండ్లో వాండెర బలంగా మూసాని బలంగా గుద్దాడు. దాంతో మూడో రౌండ్ ముందు రింగ్‌లోకి రాగానే మూసా కుప్పకూలినట్లు పలు పత్రికలుధ్రువీకరించాయి. రింగ్‌లోనే మూసా కుప్పకూలడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే బాక్సర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా టర్కిష్ సంతతికి చెందిన యమక్ 2017లో బాక్సింగ్‌లోకి వచ్చినా.. 2021లో డబ్ల్యూబీఫెడ్ ఇంటర్నేషనల్ టైటిల్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. యూరోపియన్, ఆసియన్ ఛాంపియన్ షిప్ గెలిచిన మూసా యమక్ మరణంపై తోటి బాక్సర్లు తమ సంతాపం ప్రకటించారు. చదవండి: Womens World Boxing Championships: పసిడికి పంచ్ దూరంలో... -
Nikhat Zareen: ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనాతో పాటు మన అమ్మాయి కూడా
Asian Games- Telangana Boxer Nikhat Zareen- న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ కోసం నిర్వహించిన ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ (51 కేజీల విభాగం) 7–0 తేడాతో మంజురాణిపై ఘన విజయం సాధించింది. ఇటీవలే స్ట్రాండ్జా మెమోరియన్ టోర్నీలో విజేతగా నిలిచిన నిఖత్... ఏషియాడ్‌లోనూ సత్తా చాటుతానని నమ్మకంతో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10–25 వరకు చైనాలోనూ హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతాయి. నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), జాస్మీన్ (60 కేజీ), మనీశా (57 కేజీ), సవీటీ బూరా (75 కేజీ) కూడా ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యారు. స్వర్ణపతకంతో తిరిగి రావాలి ఏషియాడ్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి... ఆమె స్వర్ణపతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ -
ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!
ముహమ్మద్ ఆలీ.. బాక్సింగ్ దిగ్గజం. 20వ శతాబ్దంలో ‘ది గ్రేటెస్ట్’ గుర్తింపు ఉన్న ఆటగాడు. ఇవన్నీ కాదు.. ఛాంపియన్‌కి పర్యాయ పదం ఈ లెజెండ్. రింగ్‌లో ప్రత్యర్థిని పిడిగుద్దులతో అగ్రెస్సివ్‌గా మట్టికరిపించే ఆలీ.. ప్చ్.. తన వీక్నెస్కు లొంగిపోయి అతని చేతిలో ఓటమి పాలయ్యాడు. పిల్లలు దేవుళ్లు.. ఒక్కటే అంటారు. అందుకే బోసి నవ్వుల దేవుళ్లంటూ పిల్లల్ని అభివర్ణిస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్లు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి కూడా. అందుకే పిల్లలంటే ఆలీకి బాగా ఇష్టం. వాళ్ల అల్లరిని భరించడంలో ఆయన దిట్ట. అలా ఓ చిన్నారి చేష్టలకు మురిసిపోయే.. ఆలీ పిడిగుద్దులు తిన్నాడు. బాక్సింగ్ గ్లౌజ్‌లు వేసుకున్న ఆ బుడ్డోడు.. ఆలీ యాక్టింగ్‌ను ఎంజాయ్ చేశాడు. ఆలీ నాలిక బయటపెట్టి రెచ్చగొడుతుంటే.. ఎగబడి మరీ గుద్దేశాడు. చివరికి ఆలీ ఓడిపోయినట్లు రెఫరీ ఆ బుడ్డోడి చేతిని పైకి ఎత్తి అభినందించడంతో.. చేతుల్ని ప్రొఫెషనల్ బాక్సర్‌లాగా కొట్టుకుంటూ బిల్డప్ ప్రదర్శించాడు. అది చూసి.. ఓ ముద్దు పెట్టమంటూ ఆలీ కోరగా.. ‘ఎలాగూ ఓడిపోయాడు కదా! ఓ ముద్దిస్తే ఏమవుతుంది పోనీలే.. అనుకుంటూ ఆలీ ముచ్చటను తీర్చేశాడు ఆ బుడ్డోడు. The best boxing match I have witnessed #MuhammadAli pic.twitter.com/etQXR7qVJ1 — Harsh Goenka (@hvgoenka) February 24, 2022 పారిశ్రామికవేత్త హార్ష్ గోయెంకా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నేను చూసిన బెస్ట్ బాక్సింగ్ మ్యాచ్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఉంచారు. గోయెంకా పోస్ట్‌కి విపరీతంగా లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అయితే తరచూ ఇది సోషల్ మీడియాలో కనిపించే వీడియోనే అనుకోండి. -
'పేరులోనే వ్లాదిమిర్.. ఉక్రెయిన్ తరపునే పోరాటమన్న బాక్సింగ్ లెజెండ్స్'
Ukraine against Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచంలో అశాంతిని రేపింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, అంటే దాదాపుగా 40 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు చెరి సగంగా విడిపోవడం ఇదే తొలిసారి. కోవిడ్–19 వల్ల కలిగిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు రష్యా యుద్ధం మొదలు పెట్టడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలతో మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు ఒకేసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. బాంబుల మోతతో లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు అండర్గ్రౌండ్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. అత్యంత పవర్‌పుల్ ఆయుదాలు, మిస్సైల్స్ కలిగిన రష్యా బలగాలకు ఎదురెళ్లి ఉక్రెయిన్ బలగాలు తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నాయి. ఇక విషయంలోకి వెళితే.. ఇద్దరు బాక్సింగ్ లెజెండ్స్ ప్రస్తుతం ఉక్రెయిన్ తరపున రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వాళ్లే విటాలి క్లిట్ష్కో, వ్లాదిమిర్ క్లిట్ష్కో.. బాక్సింగ్ విభాగంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎన్నో ఘనతలు అందుకున్నారు. పలుమార్లు హెవివెయిట్ బాక్సింగ్‌లో చాంపియన్‌గా నిలచిన ఈ ఇద్దరు కొంతకాలం కిందట ఉక్రెయిన్ ఆర్మీలో తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం విటాలి క్లిట్ష్కో 2014 నుంచి కీవ్ మేయర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లడం.. పుతిన్ చేస్తున్న రాక్షస క్రీడ ఇద్దరిని తీవ్రంగా కలిచివేసింది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు కలిసి ఒక వీడియోను విడుదల చేశారు. ''దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధంలోకి దిగుతున్నాం. పేరులో వ్లాదిమిర్ ఉన్నప్పటికి ఉక్రెయిన్ తరపునే మా పోరాటం. ఉక్రెయిన్ను కాపాడుకుంటాం.. మా దేశాన్ని నమ్ముతున్నాం.. ఇక్కడి ప్రజలంతా మా వాళ్లు.. వాళ్లను రక్షించడం మా బాధ్యత.. ఉక్రెయిన్ తరపున యుద్ధం చేస్తాం'' అంటూ విటాలి క్లిట్ష్కో పేర్కొన్నాడు. చదవండి: Ukraine-Russia War: 'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే' Ishan Kishan: ఊచకోత అంటే ఇదే.. పూనకం వచ్చినట్లు ఆడాడు Wladimir Klitschko and Vitali Klitschko launch a joint video appeal after Vladimir Putin launched an invasion of Ukraine by Russia… [📽️ @Vitaliy_Klychko & @Klitschko] pic.twitter.com/uVG4NqtCff — Michael Benson (@MichaelBensonn) February 24, 2022 -
ఆర్ఆర్ఆర్ సినీ ప్రియులకు.. అయితే, కెకెకె క్రీడాభిమానులకు.. కాస్కో... చూస్కో...
సాక్షి క్రీడా విభాగం: ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్. తెగ ఆకర్షిస్తోంది. ఇది పూర్తిగా సినీ ప్రియులకు సంబంధించిన వ్యవహారం. అలాగే ఈ ఏడాది కె.కె.కె (క్రికెట్... క్రీడలు... ఖేల్) కూడా కనీవినీ ఎరుగని రీతిలో అలరించేందుకు, అదరగొట్టేందుకు, బ్రహ్మాండాన్ని బద్దలు చేసేందుకు ముస్తాబైంది. ఈ కె.కె.కె ప్రత్యేకతలు తెలుసుకుందాం. క్రికెట్ విషయానికొస్తే ఐపీఎల్ మెగా వేలం నుంచి లీగ్ దాకా, అలాగే పురుషుల టి20 ప్రపంచకప్, కుర్రాళ్లు (అండర్–19), అమ్మాయిల ప్రపంచకప్ (వన్డే)లు, ఇతరత్రా టోర్నీలున్నాయి. క్రీడలు... అంటే ఈ ఏడాది జరగబోయే మెగా ఈవెంట్స్ అన్నీ లోకాన్నే మైదానంలో కూర్చోబెట్టేంత రద్దీతో ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఫుట్‌బాల్ ప్రపంచకప్, వింటర్ ఒలింపిక్స్ ఇలా దేనికదే తీసిపోనంత ప్రతిష్టాత్మక ఈవెంట్లు. అన్నీ సై అంటే సై అనే క్రీడలే! ఖేల్... అంటే క్రికెట్, మెగా ఈవెంట్లు కాకుండా జరిగే టోర్నీలు. ప్రపంచ అథ్లెటిక్స్, ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు, ప్రపంచ ఆర్చరీకప్, ప్రపంచకప్ షూటింగ్ పోటీలతో పాటు రెగ్యులర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు, బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, ఫార్ములావన్ రేసింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ పంచ్‌లతో ఈ పన్నెండు నెలలు పండంటి వినోదమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ► అండర్–19 క్రికెట్ వరల్డ్‌కప్ వేదిక: వెస్టిండీస్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ► మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ వేదిక: న్యూజిలాండ్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు ► భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ దక్షిణాఫ్రికాలో పర్యటన జనవరి 3 నుంచి 23 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు ► ఐపీఎల్–2022 మెగా వేలం వేదిక: బెంగళూరు ఫిబ్రవరి 12, 13 ► భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ► భారత్‌లో శ్రీలంక పర్యటన ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 2 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు ► భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన జూన్ 9 నుంచి 19 వరకు 5 టి20 మ్యాచ్‌లు ► ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన జూలై 1 నుంచి 17 వరకు 1 టెస్టు, 3 టి20లు, 3 వన్డేలు ► న్యూజిలాండ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఫిబ్రవరి 5 నుంచి 24 వరకు 1 టి20 మ్యాచ్, 5 వన్డేలు ► ఫార్ములావన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1)లో మొత్తం 23 రేసులు జరుగుతాయి. మార్చి 20న బహ్రెయిన్ గ్రాండ్‌ప్రితో ఎఫ్1 సీజన్ మొదలవుతుంది. అనంతరం సౌదీ అరేబియా (మార్చి 27), ఆస్ట్రేలియా (ఏప్రిల్ 10), ఇటలీ (ఏప్రిల్ 24), మయామి–యూఎస్ఏ (మే 8), స్పెయిన్ (మే 22), మొనాకో (మే 29), అజర్బైజాన్ (జూన్ 12), కెనడా (జూన్ 19), బ్రిటన్ (జూలై 3), ఆస్ట్రియా (జూలై 10), ఫ్రాన్స్ (జూలై 24), హంగేరి (జూలై 31), బెల్జియం (ఆగస్టు 28), నెదర్లాండ్స్ (సెప్టెంబర్ 4), ఇటలీ (సెప్టెంబర్ 11), రష్యా (సెప్టెంబర్ 25), సింగపూర్ (అక్టోబర్ 2), జపాన్ (అక్టోబర్ 9), ఆస్టిన్–యూఎస్ఏ (అక్టోబర్ 23), మెక్సికో (అక్టోబర్ 30), బ్రెజిల్ (నవంబర్ 13) గ్రాండ్‌ప్రి రేసులు ఉన్నాయి. చివరగా నవంబర్ 20న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో సీజన్ ముగుస్తుంది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదిక: ఇస్తాంబుల్ (టర్కీ) మే 6 నుంచి 21 వరకు ► వింటర్ ఒలింపిక్స్ వేదిక: బీజింగ్ (చైనా) ఫిబ్రవరి 4–20 పాల్గొనే దేశాలు: 84 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► కామన్వెల్త్ గేమ్స్ వేదిక: బర్మింగ్హమ్ (ఇంగ్లండ్) జూలై 28–ఆగస్టు 8 ► ఆసియా క్రీడలు వేదిక: హాంగ్జౌ (చైనా) సెప్టెంబర్ 10–25 ► ఫుట్‌బాల్ ప్రపంచకప్ వేదిక: ఖతర్ నవంబర్ 21–డిసెంబర్ 18 పాల్గొనే జట్లు: 32 ► ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వేదిక: ఒరెగాన్ (అమెరికా) జూలై 15–24 ► ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు వేదిక: చెంగ్డూ (చైనా) జూన్ 26–జూలై 7 ► ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వేదిక: బెల్గ్రేడ్ (సెర్బియా); సెప్టెంబర్ 10–18 ► పురుషుల టి20 క్రికెట్ వరల్డ్‌కప్ వేదిక: ఆస్ట్రేలియా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 షూటింగ్ ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: రబాట్ (మొరాకో); ఫిబ్రవరి 7–18 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: కైరో (ఈజిప్ట్); ఫిబ్రవరి 26–మార్చి 8 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: నికోసియా (సైప్రస్); మార్చి 8–19 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: లిమా (పెరూ); మార్చి 27–ఏప్రిల్ 7 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ టోర్నీ వేదిక: రియో డి జనీరో (బ్రెజిల్); ఏప్రిల్ 9–19 ► ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ వేదిక: లొనాటో (ఇటలీ); ఏప్రిల్ 19–30 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ వేదిక: బాకు (అజర్బైజాన్); మే 27–జూన్ 9 ► ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ టోర్నీ వేదిక: చాంగ్వాన్ (కొరియా); జూలై 9–22 ► ప్రపంచ షాట్‌గన్ చాంపియన్‌షిప్ వేదిక: క్రొయేషియా; సెప్టెంబర్ 27– అక్టోబర్ 10 ► ప్రపంచ రైఫిల్, పిస్టల్ చాంపియన్‌షిప్ వేదిక: కైరో (ఈజిప్ట్); అక్టోబర్ 12–25 ఆర్చరీ ► ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ వేదిక: అంటాల్యా; ఏప్రిల్ 18–24 ► ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ వేదిక: గ్వాంగ్జు; మే 16–22 ► ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ వేదిక: పారిస్ (ఫ్రాన్స్); జూన్ 20–26 ► ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీ వేదిక: మెడెలిన్ (కొలంబియా); జూలై 18–24 బ్యాడ్మింటన్ ► ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నీ వేదిక: న్యూఢిల్లీ జనవరి 11–16 ► సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్–300 టోర్నీ వేదిక: లక్నో జనవరి 18 –23 ► ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: బర్మింగ్హమ్; మార్చి 16 –20 ► థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీ వేదిక: బ్యాంకాక్; మే 8 –15 ► ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ వేదిక: జకార్తా;జూన్ 14 –19 ► ప్రపంచ చాంపియన్‌షిప్ వేదిక: టోక్యో; ఆగస్టు 21 –28 ► వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ వేదిక: గ్వాంగ్జౌ;డిసెంబర్ 14 –18 ► టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదిక: మెల్బోర్న్ జనవరి 17–30 ► ఫ్రెంచ్ ఓపెన్ వేదిక: పారిస్ మే 22– జూన్ 5 ► వింబుల్డన్ ఓపెన్ వేదిక: లండన్; జూన్ 27–జూలై 10 ► యూఎస్ ఓపెన్ వేదిక: న్యూయార్క్; ఆగస్టు 29–సెప్టెంబర్ 11 -
ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్!
లాసానే (స్విట్జర్లాండ్): ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు అందించిన బాక్సింగ్, రెండు పతకాలు అందించిన వెయిట్లిఫ్టింగ్లకు విశ్వ క్రీడల్లో భవిష్యత్తు సందేహాత్మకంగా మారింది. 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడలను తప్పించే అవకాశం ఉంది. దీంతో పాటు ఐదు క్రీడాంశాల సమాహారమైన మోడ్రన్ పెంటాథ్లాన్‌ను (రన్నింగ్, ఈక్వెస్ట్రియన్, స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్) కూడా తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా... మూడు కొత్త క్రీడాంశాల ప్రకటనను బట్టి చూస్తే పై మూడింటిని తప్పించాలని ఐఓసీ అంతర్గత సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటి స్థానాల్లో కొత్తగా స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్‌లను చేర్చనున్నారు. యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో రెగ్యులర్ క్రీడాంశంగా మార్చేందుకు ఐఓసీ సిద్ధమైంది. 1912 ఒలింపిక్స్ నుంచి ఉన్న మోడ్రన్ పెంటాథ్లాన్‌కు చారిత్రక ప్రాధాన్యమే తప్ప వాణిజ్యపరంగా కానీ అభిమానులపరంగా పెద్దగా ఆసక్తి గానీ ఉండటం లేదని ఐఓసీ చెబుతోంది. ఇక బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలను సుదీర్ఘ కాలంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు, నైతికత లోపించడం, డోపింగ్, పరిపాలన సరిగా లేకపోవడంతో ఈ క్రీడల ప్రక్షాళన అవసరమని భావిస్తూ వీటిని తప్పించాలని ఐఓసీ ప్రతిపాదించింది. మరోవైపు 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లోకి రావచ్చంటూ వినిపించగా, తాజా పరిణామాలతో ఆ అవకాశం లేదని తేలిపో యింది. లాస్ ఏంజెలిస్ ఈవెంట్ కోసం నిర్వాహకులు ప్రతిపాదించిన 28 క్రీడాంశాల్లో క్రికెట్ పేరు లేకపోవడంతో దీనిపై స్పష్టత వచ్చేసింది. -
Kidambi Srikanth: సెమీఫైనల్లో శ్రీకాంత్
Kidambi Srikanth: హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–11, 12–21, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడతాడు. ఆకాశ్‌కు కాంస్యం బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్ 0–5తో మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన ఆకాశ్‌కు 25 వేల డాలర్ల (రూ. 18 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టిన సుమిత్
బెల్గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శనివారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సుమిత్ (75 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... సచిన్ (80 కేజీలు) రెండో రౌండ్లో, గోవింద్ సహని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సుమిత్ 5–0తో అబ్దుమలిక్ బొల్తయెవ్ (తజికిస్తాన్)పై, నిశాంత్ దేవ్ 4–1తో మెర్వన్ క్లెయిర్ (మారిషస్)పై గెలుపొందారు. సచిన్ 1–4తో రాబీ గొంజాలెస్ (అమెరికా) చేతిలో, గోవింద్ 0–4తో సాఖిల్ అలఖెవర్‌దోవి (జార్జియా) చేతిలో పరాజయం పాలయ్యారు. చదవండి: నేడు న్యూజిలాండ్‌తో భారత్ కీలక పోరు.... ఓడితే ఇక అంతే! -
పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!
న్యూయార్క్: అమెరికాలోని అరిజోనాలో నివశిస్తున్న జెస్సీకా కాక్స్‌కు పుట్టుకతోనే చేతులు లేవు అయితేనేం ఆమె దాన్ని పెద్ద లోపంగా భావించ లేదు. ఆమె తన జీవితాన్ని పూర్తిగా ఆశ్వాదిస్తూ ఆనందంగా బతకాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె అన్నింటిని చాలా సునాయాసంగా పట్టుదలతో నేర్చుకుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవారితో పోల్చుకుంటే ఈమె చాలానే సాధించింది. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. (చదవండి: పువ్వులతోనే వేడినీళ్లు) కేవలం కారు నడపటం, పియానో వాయించటమే కాదు ఏకంగా విమానాన్నే తన పాదాలతో నడేపేస్తోంది. అంతేకాదు బాక్సింగ్‌లో ఆమె రెండు బ్లాక్ బెల్ట్ల్ని కూడా గెలుచుకుంది. ఈ మేరకు ఆమెకు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్న తైక్వాండ్కి చెందిన పాట్రిక్‌ని వివాహం చేసుకుంది. పైగా ఆమె మోటివేషనల్ స్సీకర్‌గా ప్రపంచమంతటా పర్యటిస్తోంది. ప్రస్తుతం ఆమె వికలాంగుల హక్కుల కోసం పోరాడుతోంది.య జెస్సీకాని చూస్తే సాధించలేనిదంటూ ఏమి ఉండదని బలంగా కోరుకుంటే దేన్నైనా సాధించగలమని అనిపిస్తోంది కదూ. (చదవండి: ఓల్డ్ కార్ సీట్ బెల్ట్‌తో బ్యాగ్‌లు) -
ఆ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయట..!
Boxing Bouts In 2016 Olympics Were Fixed: 2016 రియో ఒలింపిక్స్‌కు సంబంధించిన ఓ సంచలన విషయం తాజాగా వెలుగు చూసింది. ఆ విశ్వక్రీడల్లో రెండు పతకాల పోరులు(ఫైనల్స్) సహా మొత్తం 14 బాక్సింగ్ బౌట్లు ఫిక్స్ అయ్యాయని మెక్లారెన్ గ్లోబల్ స్పోర్ట్స్ సొల్యూషన్స్ (ఎమ్‌జీఎస్‌ఎస్) అనే సంస్థ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనే ఈ ఫిక్సింగ్ స్కాంకు బీజం పడినట్లు సదరు సంస్థ తమ నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ)చే నియమించబడిన రిఫరీలు, న్యాయనిర్ణేతలే ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది. ఇందుకు నాటి ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొంది. కాగా, రియో ఒలింపిక్స్ క్వార్టర్స్ పోరులో రష్యా బాక్సర్ వ్లాదిమిర్ నికితిన్పై ప్రపంచ ఛాంపియన్ ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ కోన్లాన్ పిడిగుద్దులతో విరుచుకుపడినప్పటికీ రిఫరీ, న్యాయనిర్ణేతలు అతను ఓడిపోయినట్లు ప్రకటించారు. దీంతో మైఖేల్ సహనం కోల్పోయి న్యాయ నిర్ణేతలపై దూషణకు దిగాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సైతం ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. న్యాయనిర్ణేతలు ప్రత్యర్ధులకు అనుకూలంగా వ్యవహరించారంటూ భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ సంచలన ఆరోపణలు చేసింది. చదవండి: సీఎస్కేలో 10 మందే బ్యాటర్లు.. ధోని కీపర్, కెప్టెన్ మాత్రమే..! -
బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్యక్ష పదవిపై టార్గెట్
మనీలా: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ లెజెండ్ మ్యానీ పకియావో తన బాక్సింగ్ కెరీర్‌కు వీడ్కొలు పలికాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ట్విట్టర్లో వీడియో సందేశం ద్వారా తెలిపాడు. తనను పేదరికం నుంచి ఈ స్ధాయికు తీసుకువచ్చిన బాక్సింగ్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా ఉంది అని పకియావో తెలిపాడు. తన రాజకీయ భవిష్యత్తు పై దృష్టి సారించేందుకుఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. 2022లో ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు గతంలో మ్యానీ పకియావో ప్రకటించాడు. కాగా అతడు ఫిలిప్పీన్‌లో సెనేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడు చివరిగా క్యూబాకు చెందిన యోర్డెనిస్ ఉగాస్ ప్రొఫెషనల్ ఫైట్‌లో తలపడ్డాడు. ఈ ఫైట్‌లో పకియావో ఓటమి చెందాడు. కాగా తన 26 ఏళ్ల బాక్సింగ్ కెరియర్లో 8 డివిజన్ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా పకియావో నిలిచాడు. చదవండి: Team India Head Coach: కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్! -
మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా
ఢిల్లీ: 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020 ఫ్లాగ్ బేరర్‌గా(పతాకధారి) వ్యవహరించిన మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారును అందించింది. అంతకముందు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత.. భారత మహిళ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చానుకు కూడా రినాల్డ్ కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారునే గిఫ్ట్‌గా అందించింది. కాగా షినీ విల్సన్, అంజూ బాబీ జార్జీ తర్వాత మేరీకోమ్ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించిన మూడో భారత మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం తెస్తుందనుకున్న మేరీకోమ్ క్వార్టర్స్ చేరకుండానే రెండో రౌండ్లోనే తిరుగుముఖం పట్టింది. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి పాలైంది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. కాగా లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో మేరీకోమ్ క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వయసు రిత్యా చూస్తే మాత్రం మేరీకోమ్‌కు ఇవే ఆఖరి ఒలింపిక్స్ అని అంతా భావించారు. కానీ తాను 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పాల్గొంటానని మేరీకోమ్ ధీమా వ్యక్తం చేసింది. చదవండి: Mary Kom: నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా -
వారెవ్వా: ‘పంచ్’ అదిరిందిగా.. బాక్సింగ్‌లో టాప్ ఎవరంటే!
టోక్యో: ఒలింపిక్స్‌లో క్యూబా బాక్సర్ల పంచ్‌లకు ప్రత్యర్థుల వద్ద సమాధానాలు కరువయ్యాయి. ఆదివారం పురుషుల లైట్‌వెయిట్ (63 కేజీలు) విభాగంలో జరిగిన ఫైనల్ బౌట్లో క్యూబా బాక్సర్ ఆండీ క్రూజ్ 4–1తో కీషాన్ డేవిస్ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిస్‌పై క్రూజ్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. పురుషుల +91 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రిచర్డ్ టొర్రెస్ జూనియర్ (అమెరికా) 0–5తో బకోదిర్ జలొలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దాంతో 17 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాలని చూసిన అమెరికాకు నిరాశే మిగిలింది. ఓవరాల్‌గా బాక్సింగ్‌లో ఐదు పతకాలు (నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం) సాధించిన క్యూబా టాప్ పొజిషన్లో నిలిచింది. వాటర్‌పోలో విజేత సెర్బియా పురుషుల విభాగంలో ఆదివారం జరిగిన వాటర్‌పోలో ఫైనల్లో సెర్బియా 13–10 గోల్స్ తేడాతో గ్రీస్‌పై గెలుపొందింది. నికోలా జాక్సిచ్ మూడు గోల్స్ చేసి సెర్బియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో హంగేరి తర్వాత వాటర్పోలోలో వరుసగా రెండు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన జట్టుగా సెర్బియా నిలిచింది. గతంలో హంగేరి 2000–08 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలను గెల్చుకుంది. చదవండి: మనసులు గెలిచిన అదితి.. పార్, బర్డీ, ఈగల్ అంటే ఏంటో తెలుసా? -
లవ్లీనాకు వెల్కం : శరవేగంగా పనులు
టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో సెమీస్‌లోకి దూసుకొచ్చిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం వేటలో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పోటీలో టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనెలీ ఓటమి పాలైంది. అయినా కాంస్య పతకాన్ని గెల్చుకున్నలవ్లీనాపై ‘లవ్లీ’ అంటూ అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు లవ్లీనా స్వగ్రామం అస్సాం రాష్ట్రంలోని బారోముఖియా ఆమెకు వెల్కం చెప్పేందుకు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో గోలాఘాట్ జిల్లాలోని ఆమె నివాసానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఊపందు కున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు ఇక్కడ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 3.5 కిలోమీటర్ల నిర్మితమవుతున్న ఈ రోడ్డు ఒలింపిక్స్ పతకంతో మురిపించిన లవ్లీనాకు వెల్కం చెప్పేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. మరోవైపు సెమీ ఫైనల్ నేపథ్యంలో అసాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయించింది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరుకుంటూ తమ అభిమాన బాక్సర్‌ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసేంతవరకు సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించారు. కాగా అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం. కాగా టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా బొర్గోహైన్‌కు నిరాశ ఎదురైంది. టర్కీకి చెందిన బుసేనాజ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
బాక్సింగ్ రింగ్ వద్దే కూర్చొని నిరసన
టోక్యో: ఒలింపిక్స్‌లో ఆదివారం జరిగిన ఓ బాక్సింగ్ పోరు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫ్రెంచ్ బాక్స్ మౌరాద్ అలీవ్ సుమారు గంట పాటు బాక్సింగ్ రింగ్ వద్దే కూర్చొని నిరసన తెలిపాడు. తనపై అనర్హత వేటు వేయడంతో అసహన వ్యక్తం చేశాడు మౌరాద్. హెవీవెయిట్ బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో భాగంగా బ్రిటన్‌కు చెందిన ఫ్రెజర్ క్లార్క్‌తో జరిగిన బౌట్ సందర్భంగా మౌరాద్ అలీవ్ అనర్హతకు గురయ్యాడు. అదే సమయంలో ఫ్రెజర్‌ను విజేతగా ప్రకటించారు. ప్రత్యర్థి ఫ్రెజర్‌ను పదే పదే తలతో కొట్టి గాయ పర్చడంతో మౌరాద్ అలీవ్‌పై వేటు పడింది. బాక్సింగ్ తొలి రౌండ్లో అలీవ్ పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ఐదుగురు జడ్జిలు అతనికే ఎక్కువ పాయింట్లు ఇచ్చారు. కానీ రెండో రౌండ్లో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరువురు బాక్సర్లు హోరాహోరీగా తలపడ్డారు. ఆ క్రమంలోనే అలీవ్ తలతో దాడికి దిగాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా కావడంతో అలీవ్‌పై అనర్హత వేటు వేస్తు నిర్ణయం తీసుకోగా ఫ్రెజర్ సెమీస్‌కు చేరినట్లు ప్రకటించారు. దీన్ని జీర్ణించుకోలేని అలీవ్ బాక్సింగ్ రింగ్ వద్దే కూర్చొండి పోయాడు. కాగా, అక్కడి అధికారులు అతనితో మాట్లాడిన తర్వాత వెళ్లిపోయిన అలీవ్.. మళ్లీ 15 నిమిషాల తర్వాత వచ్చి మళ్లీ అక్కడే కూర్చొండిపోయాడు. ఇలా గంటకు పైగా కూర్చొని నిరసన తెలిపాడు. తనకు ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా పోరును అర్థాంతరంగా ఆపేసి తాను మ్యాచ్‌ను కోల్పోతున్నట్లు ప్రకటించారని అలీవ్ ఆరోపిస్తున్నాడు. తాను గెలిచే మ్యాచ్‌ను జడ్జిలే లాగేసుకున్నారని విమర్శలు గుప్పించాడు. ఈ మెగా టోర్నీ కోసమే తన లైఫ్‌ను పణంగా పెట్టానని, అటువంటి ఇలా ఎందుకు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా’
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందని.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్ రింగ్ బరిలో ఉంటానని భారతబాక్సర్ మేరీకోమ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మేరీకోమ్ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి అనంతరం శనివారం స్వదేశానికి చేరుకున్న మేరీకోమ్‌కు విమానాశ్రయంలో దిగిన వెంటనే మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు.. ఇక బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతారా అని ప్రశ్నించారు. మేరీకోమ్ స్పందింస్తూ.. 'టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాకపోవడం బాధను కలిగింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా. నా వరకు నేను మంచి ప్రదర్శననే చేశా. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతలు తీరు సరిగా లేదు. తొలి రెండు రౌండ్లు గెలిచిన నేను ఎందుకు ఓడిపోతాను. బౌట్‌కు ముందు అధికారులు నా దగ్గరకు వచ్చి మీ సొంత జెర్సీని వాడకూడదు.. అని చెప్పారు. అయితే నేను ఆడిన తొలి మ్యాచ్‌లోనూ అదే జెర్సీ వేసుకున్నా.. అప్పుడు చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. కేవలం నా మానసిక ఆందోళన దెబ్బతీయడానికే జడ్జిలు అలా చేశారని అనిపిస్తుంది. ఇతర దేశాలకు లేని నిబంధనలు మనకే ఎందుకు'' అంటూ ప్రశ్నించింది. ఇక రిటైర్మెంట్పై మేరీ కోమ్ మాట్లాడుతూ.. ''నా వయసు ఇంకా అయిపోలేదు.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌లో కొనసాగుతా.. అవసరమైతే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది. -
ఓడిపోతున్నాననే బాధలో ప్రత్యర్థి చెవి కొరికాడు; వీడియో వైరల్
టోక్యో: ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కోపం రావడం సహజం. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మ్యాచ్ ఓడినా పర్లేదు అనేలా క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలి. కానీ కొంతమంది మాత్రం తమ ఓటమిని భరించలేక ప్రత్యర్థిపై దాడికి దిగడం చూస్తుంటాం. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్ బాల్లా.. న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా చెవి కొరికాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం బాక్సింగ్‌లో హెవీ వెయిట్ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్ యూనెస్, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ నికా మధ్య పోరు జరిగింది. బౌట్లో డేవిడ్ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్.. మూడో రౌండ్లో డేవిడ్ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్ దంతాలు తగలగానే డేవిడ్ అతడిని దూరంగా నెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. కాగా, యూనెస్ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. Morocco’s Youness Baalla tried to bite the ear of New Zealand’s David Nyika!!! #Boxing #Tokyo2020 pic.twitter.com/N6LJIqjb6S — Ben Damon (@ben_damon) July 27, 2021 -
‘పంచ్’మే దమ్ హై... బాక్సింగ్ బరిలోకి ‘నవ రత్నాలు’
ఒలింపిక్స్ క్రీడల్లో ఒకప్పుడు భారత బాక్సర్లది ప్రాతినిధ్యమే కనిపించేది. బరిలోకి దిగడం... ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం జరిగేది. కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ ఈ ట్రెండ్‌ను మార్చాడు. తన పంచ్ పవర్‌తో సత్తా చాటి కాంస్య పతకాన్ని అందించాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ తొలిసారి ప్రవేశపెట్టగా... ‘మణిపూర్ మెరిక’ మేరీకోమ్ కాంస్య పతకంతో తిరిగొచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం మన బాక్సర్లకు నిరాశఎదురైంది. ఈసారి ఆ గాయం మానేందుకు భారత బాక్సర్లు భారీ కసరత్తే చేశారు. కరోనా రూపంలో కష్టకాలం ఎదురైనా, ఆంక్షలు అడుగులకు అడ్డుపడినా అలుపెరగని పట్టుదలతో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ఇక చివరి పరీక్షకు సిద్ధమయ్యారు. పురుషుల విభాగంలో ఐదుగురు... మహిళల విభాగంలో నలుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ తొమ్మిది మందిలో అమిత్ పంఘాల్, మేరీకోమ్‌లు కచ్చితంగా పతకాలతో తిరిగొస్తారని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ‘టోక్యో’లో బరిలోకి దిగనున్న భారత బాక్సింగ్ ‘నవ రత్నాల’ గురించి తెలుసుకుందాం..! అమిత్ పంఘాల్ (52 కేజీలు) హరియాణాకు చెందిన 25 ఏళ్ల అమిత్‌పై భారత్ గంపెడాశలు పెట్టుకున్నాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రింగ్‌లో కింగ్ అయ్యేందుకు ఈ ప్రపంచ నంబర్‌వన్ బాక్సర్ చెమటోడ్చుతున్నాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్న అమిత్ గత నాలుగేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్ (2017)లో కాంస్యం నెగ్గిన ఈ యువ బాక్సర్... ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లో రజతాలు గెలిచాడు. 2018 ఆసియా గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ‘టోక్యో’లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్న అమిత్‌కు క్వార్టర్ ఫైనల్ వరకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటి సెమీస్ చేరితో అమిత్‌కు పతకం ఖాయమే. మనీశ్ కౌశిక్ (63 కేజీలు) విజేందర్ 2008 ఒలింపిక్స్‌లో గెలిచిన కాంస్యమే మనీశ్‌ను బాక్సింగ్ కలల్లో ముంచెత్తింది. అదే లోకంగా ఎదిగి... బాక్సింగ్‌లో ఒదిగాడు. ఇప్పుడు మొదటి ఒలింపిక్స్‌లో పంచ్ విసిరేందుకు సిద్ధమయ్యాడు. మనీశ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. అన్నట్లు... ఇతని ఒలింపిక్స్ ‘కల’కు గతేడాది గాయమైంది. చిత్రంగా మెగా ఈవెంట్ వాయిదా పడటం వరమైంది. లేదంటే విశ్వక్రీడల ముచ్చటకు మరో మూడేళ్లు పట్టేది. జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో గాయపడ్డాడు. తర్వాత కరోనా బారినపడ్డాడు. ఇప్పుడైతే టోక్యో బాట పట్టాడు. పూజా రాణి (75 కేజీలు) బాక్సింగ్ ప్రారంభంలో గ్లౌజులు వేసుకునేందుకే తెగ ఇబ్బందిపడిన పూజ తర్వాత కఠోరశ్రమతో బాక్సర్‌గా ఎదిగింది. 2016లో దీపావళి వేడుకల్లో చేతులు కాల్చుకోవడం... కోలుకున్న తర్వాత మరుసటి ఏడాదే భుజానికి తీవ్ర గాయం వల్ల ఆమె కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలో పడింది. అయినా సరే ఒలింపిక్స్ అర్హతే లక్ష్యంగా తన ఫిట్నెస్, ప్రదర్శనను మెరుగుపర్చుకొని చివరకు టోక్యో బాటపట్టింది. సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) భారత్ తరఫున హెవీ వెయిట్ కేటగిరీలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి బాక్సర్ సతీశ్. జట్టులో పెద్ద వయస్కుడు కూడా అతనే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల ఈ బాక్సర్‌కు ఇదే తొలి ఒలింపిక్స్. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించాడు. విశ్వక్రీడల కోసం నిత్యం శ్రమించిన సతీశ్ ప్రత్యర్థులపై ముష్ఠిఘాతాలు విదిల్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆశిష్ కుమార్ (75 కేజీలు) బీజింగ్‌లో విజేందర్ సింగ్ చరిత్రకెక్కిన వెయిట్ కేటగిరీలో ఆశిష్ కుమార్ తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నాడు. ఆశిష్‌ను ఒలింపియన్‌గా చూడాలన్న లక్ష్యం అతని తండ్రిది కాగా... అతను అర్హత సాధించడానికి సరిగ్గా నెలముందే తండ్రి కన్నుమూశాడు. దీన్ని జీర్ణించుకోవడం కష్టమైనా... తండ్రి లక్ష్యం తనని టోక్యో దాకా నడిపించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల ఆశిష్ 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు. ఇప్పుడు ఒలింపిక్ పతకాన్ని సాధించి తండ్రికి ఆంకితమివ్వాలనే ఆశయంతో ఉన్నాడు. వికాస్ కృషన్ (69 కేజీలు) బాక్సింగ్ జట్టులో అనుభవజ్ఞుడైన ఒలింపియన్ వికాస్. 2012 లండన్, 2016 రియో ప్రయత్నాల్లో కలగానే మిగిలిపోయిన ఒలింపిక్ పతకాన్ని టోక్యోలో నిజం చేసుకునేందుకు పగలురాత్రి అనకుండా కష్టపడుతున్నాడు. 29 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్ ఏడాదికి పైగా ఇంటి ముఖమే చూడలేదు. తన రెండు కళ్లు పతకాన్నే చూస్తుండటంతో... తను కన్న పిల్లల్ని ఫోన్లోనే చూసుకుంటున్నాడు. బహుశా ఇదే తన కెరీర్‌కు ఆఖరి ఒలింపిక్స్ అనుకుంటున్న వికాస్ పంచ్‌లకు అనుభవం కూడా తోడుగా ఉంది. మేరీకోమ్ (51 కేజీలు) ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్ ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణంపై గురిపెట్టింది. రెండు దశాబ్దాలుగా బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థుల్ని దడదడలాడిస్తున్న 38 ఏళ్ల మేరీకిది చివరి ఒలింపిక్స్... దీంతో పతకం వన్నే మార్చేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మేరీ తాజా వేటలో ఎదురయ్యే ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చి దీటైన బాక్సర్‌గా ఎదిగిన సిమ్రన్‌జిత్ ఒలింపిక్స్ పతకంతోనైనా తన కుటుంబకష్టాలు తీరుతాయనే ఆశతో ఉంది. 26 ఏళ్ల ప్రతిభావంతురాలైన ఈ బాక్సర్‌కు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగం హామీని నిలబెట్టుకోలేకపోయింది. కూలీ పనిచేసే తండ్రి 2018లో మరణించడంతో కుటుంబానికి సిమ్రన్జితే పెద్దదిక్కయింది. ఓ వైపు ఆర్థిక సమస్యలతో పోరాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె మరోవైపు రింగ్‌లో ప్రత్యర్థులతోనూ ‘ఢీ’కొడుతోంది. లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) యువ బాక్సర్ లవ్లీనా ప్రాథమిక విద్యను అభ్యసించే రోజుల్లోనే బాక్సింగ్ ఆటపై మనసు పెట్టింది. సాంకేతికంగా పంచ్ పవర్లో మేటి అయిన 23 ఏళ్ల ఈ అస్సాం బాక్సర్ ప్రత్యర్థుల పని పట్టడంలో దిట్ట. 20 ఏళ్ల వయసులో 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచింది. మరుసటి ఏడాది కూడా కాంస్యాన్ని చేజిక్కించుకుంది. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం నెగ్గింది. అయితే గతేడాది కీలకమై ఇటలీ శిక్షణకు కరోనా వల్ల దూరమైంది. తీరా విమానం ఎక్కబోయే రోజు ముందు వైరస్ సోకినట్లు రిపోర్టు రావడంతో ఇంటికే పరిమితమైంది. -
చరిత్ర సృష్టించిన భారత్ బాక్సర్.. ప్రపంచ నంబర్ వన్ స్థానం కైవసం
న్యూఢిల్లీ: బాక్సింగ్ క్రీడలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసి)కి చెందిన బాక్సింగ్ టాస్క్ ఫోర్స్ విడుదల చేసిన తాజా ర్యాంక్సింగ్స్‌లో పురుషుల 52 కిలోల ఫ్లై వెయిట్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే హోదాలో టోక్యో ఒలింపిక్స్‌లో బరిలో దిగనున్నాడు. ఈ క్రమంలో అమిత్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు పొందిన ఏకైక భారత ఒలింపియన్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, గత నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన షాఖోబిదిన్ జోయిరోవ్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైనప్పటికీ అమిత్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఐఓసి తాజా ర్యాంకింగ్స్‌లో అమిత్‌తో పాటు పలువురు భారత బాక్సర్లు టాప్ 20లో స్థానం సంపాదించారు. పురుషుల విభాగంలో సతీష్ కుమార్ (75, 95 కిలోలు) తొమ్మిదో స్థానంలో మనీష్ కౌశిక్ (63 కిలోలు) 18వ స్థానంలో నిలిచారు. ఇక మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ (69 కిలోలు) ఏడో స్థానంలో నిలువగా, సిమ్రాన్‌జిత్ కౌర్ (60 కిలోలు) నాలుగో స్థానంలో, లోవ్లినా బోర్గోహైన్(69 కిలోలు) ఐదో స్థానంలో, పూజా రాణి(75 కిలోలు) 8వ స్థానంలో నిలిచారు. కాగా, కరోనా కారణంగా ఏడాదిపాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై.. ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇప్పటికే కొందరు అథ్లెట్లు ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నారు. ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని నిర్వాహకులు ఇటీవలే స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, టెంపరేచర్ చెకింగ్ వంటి అన్ని కోవిడ్ జాగ్రత్తల తీసుకున్న తర్వాతే ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని, అక్కడ కూడా భౌతిక దూరంగా పాటించే విధంగా ఏర్పాట్లు చేశామని, ఆటోగ్రాఫ్‌లు, మద్యపానం తదితరరాలను నిషేధించామని నిర్వహకులు వెల్లడించారు. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా అతనే సరైనోడు: పనేసర్ -
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్.. మాజీ బాక్సర్ కన్నుమూత
ఇంఫాల్: భారత మాజీ బాక్సర్.. ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ డింగ్కో సింగ్(42) అనారోగ్యంతో గురువారం కన్నుమూశాడు. మణిపూర్‌కు చెందిన డింగ్కో సింగ్ 2017లో లివర్ క్యాన్సర్ బారీన పడ్డారు. 2020లో ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్సన్(ఐఎల్‌బీఎస్) రేడియేషన్ థెరపీ చేయించుకున్న ఆయన కాస్త కోలుకున్నట్లే కనిపించారు. కానీ కొద్దిరోజులకే కరోనా సోకడం.. దాని నుంచి కోలుకున్నప్పటికి తాజాగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు. బ్యాంకాక్ వేదికగా 1998లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా అందరి దృష్టిలో పడ్డాడు. 16 ఏళ్ల తర్వాత బాక్సింగ్ విభాగం నుంచి దేశానికి స్వర్ణ పతకం తీసుకొచ్చిన ఆటగాడిగా డింగ్కో సింగ్ నిలిచాడు. 1998లో అర్జున అవార్డు పొందిన డింగ్కో సింగ్ 2013లో భారత అత్యున్నత నాలుగో పురస్కారం పద్మ శ్రీ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు వెళ్లని డింగ్కో సింగ్ ఇండియన్ నేవికి సేవలందించడంతో పాటు బాక్సింగ్ కోచ్‌గాను పనిచేశాడు. డింగ్కో సింగ్ మృతిపై ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో పాటు.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన మహిళ బాక్సర్ మేరీకోమ్ అతని మృతి పట్ల తమ సంతాపం ప్రకటించారు. చదవండి: Indian Olympic Association: మాకొద్దీ చైనా దుస్తులు! -
Chess Boxing: చెస్‌తో చెక్.. బాక్సింగ్ కిక్..
సాక్షి సెంట్రల్ డెస్క్: చెస్ అంటే స్మార్ట్.. బాక్సింగ్ అంటే స్ట్రాంగ్.. రెండూ కలిపితే చెస్ బాక్సింగ్.. స్మార్ట్ అండ్ స్ట్రాంగ్. ఓ రకంగా చెప్పాలంటే సూపర్ హీరోలన్న మాట. చెస్‌కు, బాక్సింగ్‌కు లింకేమిటని ఆశ్చర్యపోవద్దు. కొన్నేళ్లుగా నడుస్తున్న సరికొత్త ట్రెండ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా మెల్లగా చెస్ బాక్సింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు కూడా జరుగుతున్నాయి. మన దేశంలోనూ జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. మంచి తెలివితేటలతో పాటు శారీరకంగా కూడా బలంగా ఉంటే చెస్ బాక్సింగ్ చాంపియన్ కావొచ్చు. మరి ఈ చెస్ బాక్సింగ్ సంగతేంటో తెలుసుకుందామా? తెలివి, బలం కలిస్తే.. పేరుకు తగ్గట్టుగానే చెస్ బాక్సింగ్ మిశ్రమ క్రీడ. చెస్, బాక్సింగ్ రెండింటి నిబంధనలు పాటిస్తూ.. చెస్ బోర్డు మీద, బాక్సింగ్ రింగ్‌లో తలపడాల్సి ఉంటుంది. భూమ్మీద అత్యంత తెలివైన, బలమైన మహిళ, పురుషుడు ఎవరనేది తేల్చే ఆటే చెస్ బాక్సింగ్ అని దీని రూపకర్త లీప్ రూబింగ్ చెప్తుండేవారు. సైంటిఫిక్ ఫిక్షన్ నుంచి ఆచరణలోకి.. నెదర్లాండ్స్‌కు చెందిన లీప్ రూబింగ్ అనే క్రీడాకారుడు 2003లో చెస్ బాక్సింగ్‌కు రూపకల్పన చేశాడు. 1992లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ నవల ‘ఫ్రాయిడ్ ఈక్వేటర్’ నుంచి స్ఫూర్తి పొంది చెస్ బాక్సింగ్‌కు రూపం పోశాడు. ఆ నవలలో ‘ఫ్యూచర్ బాక్స్’ అనే డివైజ్ ఉంటుంది. అందులో పెద్ద చెస్ బోర్డుపై హీరో, విలన్లు పోరాడుతారు. చెస్ బాక్సింగ్ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగింది. మ్యాచ్‌లు జరిగేదెలా? ప్రతి గేమ్‌లో వరుసగా మొదట చెస్ రౌండ్, తర్వాత బాక్సింగ్ రౌండ్, మళ్లీ చెస్, బాక్సింగ్.. ఇలా జరుగుతూ వస్తాయి. ఇలా గరిష్టంగా 11 రౌండ్ల వరకు ఆడుతారు. లేదా మధ్యలోనే విజేత ఎవరో తేలిపోతుంది. ప్రత్యర్థిని బాక్సింగ్‌లో నాకౌట్ చేసిగానీ, చెస్‌లో చెక్‌మేట్ పెట్టిగానీ గెలవొచ్చు. లేదా నిర్ణీత సమయాన్ని మించి తీసుకోవడం, జడ్జి నిర్ణయం ఆధారంగా కూడా విజేతలను ప్రకటిస్తారు. చెస్ రౌండ్ 4 నిమిషాలు, బాక్సింగ్ రౌండ్ 3 నిమిషాలు ఉంటాయి. చెస్ రౌండ్లలో ఎలాంటి ఫలితం తేలకుండా డ్రా అయితే.. బాక్సింగ్ పాయింట్ల ఆధారంగా గెలుపు ఎవరిదో నిర్ధారిస్తారు. బాక్సింగ్ పాయింట్లు కూడా సమానంగా వస్తే.. చెస్‌లో నల్ల పావులతో ఆడినవారిని విజేతగా ప్రకటిస్తారు. మన దేశంలో చెస్ బాక్సింగ్ చెస్ బాక్సింగ్ మన దేశంలో కూడా కొన్నేళ్లుగా ప్రాచుర్యంలోకి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2011లో ‘చెస్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (సీబీఓఐ)ని ఏర్పాటు చేసింది. కోల్‌కతాకు చెందిన ప్రముఖ కిక్ బాక్సింగ్ మాస్టర్, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు సెన్సీ మోంటు దాస్ నేతృత్వంలో సీబీఓఐని స్థాపించారు. మోంటు దాస్ 2020 జూన్‌లో ప్రపంచ చెస్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా చాంపియన్లు వీరే.. చెస్ బాక్సింగ్‌లో ప్రస్తుతం లైట్, మిడిల్ వెయిట్, హెవీ వెయిట్ కేటగిరీల్లో చాంపియన్ షిప్‌లు నిర్వహిస్తున్నారు. వీటిలో గెలిచిన ఆటగాళ్లు వారి ముద్దుపేర్లతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం చెస్ బాక్సింగ్‌లో ప్రముఖ ఆటగాళ్లు వీరే.. జర్మనీకి చెందిన ఫ్రాంక్ స్టోల్ట్ (యాంటీ టెర్రర్), 2008లో వరల్డ్ చాంపియన్. రష్యాకు చెందిన నికోలాయ్ సెర్గీవిచ్ (ది చైర్మన్), 2012 నుంచీ వరల్డ్ చాంపియన్. కెనడాకు చెందిన సీయాన్ మూనీ (ది మెషీన్), మిడిల్ వెయిట్లో 2015 నుంచీ చాంపియన్. భారత్‌కు చెందిన జీత్ పటేల్, అమెచ్యూర్ వరల్డ్ చాంపియన్–2017 ► ‘ప్రపంచంలో నంబర్ వన్ తెలివైన ఆటను.. నంబర్ వన్ పోరాట క్రీడను కలిపితే వచ్చిందే.. చెస్ బాక్సింగ్’’ – చెస్ బాక్సింగ్ రూపకర్త లీప్ రూబింగ్ ► ‘చెస్ బాక్సింగ్ చాలా కష్టం. అటు బాక్సింగ్‌లో ప్రత్యర్థిని ఎదుర్కొంటూ, దెబ్బలు తగులుతూ ఉంటే.. ఇటు ప్రశాంతంగా, సహనంతో చెస్ ఆడాల్సి ఉంటుంది. మనసు, శరీరం రెండింటినీ ఒకే సమయంలో నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది’’ – చెస్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మోంటు దాస్ -
కరోనాతో బాక్సింగ్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నుమూత
ఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.కె. సాచేటి(56) కొవిడ్-19తో మంగళవారం మృతిచెందారు. కొవిడ్ ఇన్ఫెక్షన్తో ఆయన గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన మరణం క్రీడా ప్రపంచంలో భారీ శూన్యతను మిగిల్చిందని బీఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. సాచేటి ఐఓసీ ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుగా కూడా ఉన్నారు. సాచేటి మృతిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు విచారం వ్యక్తం చేశారు. ఆర్ కే సాచేటి కొవిడ్-19తో జరిగిన యుద్ధంలో ఓడిపోయారన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి బాక్సింగ్ దేశాల లీగ్‌లో భారత్‌ను ఉంచిన మూల స్తంభాల్లో ఆయన ఒకరన్నారు. సాచేటి మృతిపట్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంతాపం ప్రకటించింది. -
కాంస్యం ఖాయం చేసుకున్న జరీన్
టర్కీ: ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న బాస్ఫోరస్ మహిళల బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్, హైదరాబాద్ అమ్మాయి కాంస్య పంతకం ఖాయం చేసుకుంది. 51 కేజీల విభాగంలో జరీన్.. కజకిస్థాన్‌కు చెందిన నాజీమ్ కైజేబ్‌ను మట్టికరిపించింది. జరీన్ 4-1 తేడాతో కైజేబ్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. దాంతో కనీసం కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 2014, 2016 వరల్డ్‌చాంపియన్ షిప్లో రెండుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కైజేబ్‌ను ఓడించడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. జరీన్ తర్వాత గౌరవ్ సోలంకీ 57 కేజీల విభాగంలో ప్యూజిలిస్ట్ ఐకోల్ మిజాన్‌ను గెలిచి సెమీఫైనల్ చేరుకున్నాడు. దాంతో సోలంకీ కూడా కాంస్యాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే, సోనియా లూథర్ (57కేజీలు), పర్విన్ (60కేజీల), జ్యోతి(60కేజీల) విభాగాలలో క్వార్టర్‌లోనే వెనుదిరిగారు. అయితే శివథాప(63 కేజీలు) టర్కీకి చెందిన హకన్డొగన్ చేతిలో ఓడిపోయాడు. అయితే జరీన్ తన తుది పోరులో టర్కీకి చెందిన రజత పతక విజేత బుసేనాజ్ కాకిరోగ్లూ ఎదుర్కొవాల్సి ఉంది. ఇక సోలంకీ అర్జెంటినాకు చెందిన నిర్కో క్యూలోతో తలపడతాడు. చదవండి:రితికా ఆలోచనల్ని ఎవరూ గమనించలేకపోయారా? -
బాక్సింగ్ నేర్చుకుంటున్న రాశీ ఖన్నా
రాశీ ఖన్నా బాక్సింగ్ నేర్చుకుంటున్నారు. ఏదైనా క్యారెక్టర్ కోసం నేర్చుకుంటున్నారా? అంటే.. ఆ విషయాన్ని స్పష్టం చేయడంలేదు. మరింత ఫిట్‌గా కనబడటం కోసమే ఈ ట్రైనింగ్ అంటున్నారు. హిందీలో ‘సన్నీ’ అనే సినిమా అంగీకరించారీ బ్యూటీ. ఈ శిక్షణకు ఒక కారణం ఈ సినిమా అని తెలుస్తోంది. ఇక బాక్సింగ్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘శరీర శక్తిని పెంచుకోవడానికి ఒక మంచి మార్గం బాక్సింగ్. పైగా నేను తీసుకుంటున్నది ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ (హెచ్ఐఐటి). రోజూ గంటసేపు నేర్చుకుంటున్నా. కొవ్వు, పిండి పదార్థాల సమాహారంతో నా డైట్ ఉంటుంది. బాక్సింగ్ అనేది శారీరక బలం మాత్రమే కాదు.. మానసిక బలాన్నీ పెంపొందిస్తుంది. ఎంత పెద్ద సవాల్‌ని అయినా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. అందరికీ మానసిక బలం అవసరం. బలహీనత అనేది మనల్ని హరించివేస్తుంది’’ అన్నారు. -
అంతా ‘బేబీ’ బాక్సర్లే.. భారత్ మొదటి స్థానం
భారత యువ మహిళా బాక్సింగ్ జట్టు తాజా విజయ దరహాసం వెనుక గల అసమాన శక్తి సామర్థ్యాల ఈ విశేషాన్ని బేబీరోజిసాన ఛానుతో మొదలుపెట్టడమే సబబు. యూత్ టోర్నిలో ఈ బేబీ బాక్సర్ బంగారు పతకాన్ని సాధించింది. జట్టులో మొత్తం పది మంది యువతులు ఉండగా మాంటెనెగ్రోలో జరిగిన ఈ యూత్ టోర్నీలో భారత్‌కు పది పతకాలు వచ్చాయి! ఐదు స్వర్ణాలు, మూడు రజితాలు, రెండు కాంస్యాలు. బంగారు పతకాల పట్టికలో కూడా వీరు భారత్‌ను మొదటి స్థానంలో నిలబెట్టారు. రెండు పతకాలతో ఉజ్బెకిస్థాన్, ఒక పతకంతో చెక్ రిపబ్లిక్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐరోపాలోని బాల్కన్ ప్రాంత దేశం అయిన మాంటెనెగ్రో ఆడ్రియాటిక్ సముద్రతీరం వెంబడి ఎగుడుదిగుడు పర్వతాలతో నిండి ఉంటుంది. అక్కడి బుద్వా నగరంలో జరిగిన 30వ ఆడ్రియాటిక్ పెర్ల్ టోర్నమెంట్‌లోనే భారత్ మహిళలు ఈ ఘన విజయాన్ని సాధించుకుని వచ్చారు. అంతా ‘బేబీ’ బాక్సర్లే. బరిలో మాత్రం ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్నారు. ఆదివారం టోర్నీ ముగిసింది. యువ బాక్సర్లు పది పతకాలతో వస్తున్నారని తెలియగానే భారత్‌లోని ప్రొఫెషనల్ ఉమెన్ బాక్సర్ల ముఖాలు వెలిగిపోయాయి. బేబీ ఛాను శిక్షణ పొందింది ఇంఫాల్‌లోని మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీలోనే! ఆ శిక్షణ ఏ స్థాయిలో ఉందో ఆషియన్ జూనియర్ ఛాంపియన్ సబీనా బొబొకులోవా (ఉజ్బెకిస్తాన్) ను 3–2 తేడాతో ఆమె నాకౌట్ చేసినప్పుడు ప్రత్యర్థి జట్లు కనిపెట్టే ఉంటాయి. మరొక బంగారు పతకం అరుధంతీ చౌదరి సాధించినది. మూడుసార్లు ‘ఖేలో ఇండియా’ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఈ బాక్సింగ్ ఛాంపియన్ ఉక్రెయిన్ బాక్సర్ మార్యానా స్టోయికోను 5–0 తో ఓడించింది. మిగతా మూడు బంగారు పతకాలు అల్ఫియా పఠాన్, వింకా, సనమచ ఛాను సాధించినవి. బెస్ట్ ఉమెన్ బాక్సర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు కూడా మన యువ జట్టుకే దక్కింది. ఆ అవార్డు విజేత వింకా! అబ్బాయిల్ని అనడం కాదు కానీ మన పురుషుల జట్టుకు రెండు మాత్రమే బంగారు పతకాలు సాధ్యం అయ్యాయి. చదవండి: 'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను' -
హైదరాబాద్ బాక్సింగ్ బ్రదర్స్.. కిక్స్ అదుర్స్
రహమత్‌నగర్: ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు కిక్ బాక్సింగ్‌లో రాణిస్తున్నారు కార్మికనగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు. అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధించాలనే లక్ష్యంతో కఠోర సాధనలు చేస్తున్నారు. పట్టుదలతో శ్రమిస్తూ అంతర్రాష్ట్ర, జాతీయ పతకాలు సాధిస్తూ శభాష్ అనిపించుకుంటన్నారు. రహమత్‌నగర్ డివిజన్ కార్మికనగర్‌కు చెందిన సయ్యద్ బషీర్, అంజమున్సిసా బేగం, దంపతులకు ఇద్దరు కుమారులు సుహైల్ (23) డిగ్రీ రెండో సంవత్సరం, సయ్యద్ సల్మాన్ (22) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తండ్రి బషీర్, ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. కిక్ బాక్సింగ్ పై ఆసక్తి ఉన్న అన్నదమ్ములిద్దరూ బంజారహిల్స్‌లోని ఓ కిక్ బాక్సింగ్ అకడామీలో శిక్షణ పొందారు. తొలిసారిగా 2011 నవంబర్‌లో చత్తీస్‌ఘడ్‌లో జరిగిన కిక్ బాక్సింగ్ పోటీల్లో (అండర్ 18 60 కేజీస్) సోహెల్, సల్మాన్ ఇద్దరూ పాల్గొనగా సోహెల్ బ్రౌన్ మెడల్ సాధించాడు. తాజాగా జనవరి 21 న ఢిల్లీలోని కాల్కోట్ స్టేడియంలో జరిగిన పోటీల్లో కోల్కత్తా, కర్ణాటక బాక్సర్లను ఓటించి సోహెల్ గోల్డ్ మెడల్ సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో తలబడుతా.. అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీ లు పోటీల్లో పాల్గొనడమే నా లక్ష్య ం. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తూ కఠోర సాధన చేస్తున్నా. ఇందుకు తమ తల్లి తండ్రులు మరింత పోత్సహిస్తున్నారు. ఏదో ఓ రోజు అంతర్జాతీయ స్థాయిలో తనబడుతాననే నమ్మకం ఉంది. – సోహెల్ తమ్ముడే ఆదర్శం.. తమ్ముడు సోహెల్‌ను ఆదర్శంగా తీçసుకొని ముందుకెళ్తా. నేను సైతం కిక్ బాక్సింగ్‌లో రాణించి రాష్ట్రానికి పేరుతెస్తా. తమ్ముడికి గోల్డ్ మెడల్ రావడం ఆనందంగా ఉంది. – సయ్యద్ సల్మాన్ చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మేవెదర్, లైలా అలీ
న్యూయార్క్: తమ ప్రొఫెషనల్ కెరీర్లో పరాజయంతో పరిచయం లేని అమెరికా దిగ్గజ బాక్సర్లు ఫ్లాయిడ్ మేవెదర్, మహిళా స్టార్ లైలా అలీ అంతర్జాతీయ బాక్సింగ్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. జగద్విఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ కుమార్తె అయిన లైలా అలీ తండ్రికి తగ్గ తనయగా రింగ్‌లో నిరూపించుకుంది. తన కెరీర్లో 24–0 రికార్డుతో ప్రతి బౌట్ గెలిచిన 42 ఏళ్ల లైలా 21 పోటీల్లో నాకౌట్ విజయాలు సాధించడం మరో విశేషం. పురుషుల విభాగంలో 43 ఏళ్ల మేవెదర్ది కూడా చెక్కుచెదరని రికార్డే. ఇంకా చెప్పాలంటే బాక్సింగ్‌లో అతని స్కోరు ఫిఫ్టీ నాటౌట్! 50–0తో ప్రత్యర్థులకు తలగ్గొని మేవెదర్ ఖాతాలో 27 నాకౌట్ విజయాలున్నాయి. ఇంకా ఈ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో హెవీవెయిట్ మాజీ విజేత వ్లాదిమిర్ క్లిచ్కో (ఉక్రెయిన్), ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆండ్రీ వార్డ్, అన్ వోల్ఫీ, ట్రిమియర్, మార్గరెట్ గుడ్మన్ ఉన్నారు. -
బాక్సర్ ఇన్ యాక్షన్
వరుణ్ తేజ్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఇంకొన్ని రోజులు ఇదే మూడ్‌లో ఉంటారట. ఇదంతా సినిమా కోసమే. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపిస్తారు వరుణ్. ఈ చిత్రానికి ‘బాక్సర్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తు్తన్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని టాక్. మరో పదిరోజల పాటు ఈ షెడ్యూల్ సాగనుందట. ఆ తర్వాత తన సోదరి నిహారిక పెళ్లి కోసం వరుణ్ తేజ్ చిన్న బ్రేక్ తీసుకుంటారు. -
‘ఇలాంటి స్వభావం ఉన్నవారు నాకు నచ్చరు‘
నిఖత్ జరీన్ తెలంగాణ అమ్మాయి. బాక్సర్. 24 ఏళ్లు. నిజామాబాద్. 2019లో మేరీ కోమ్‌తో తలపడి ఓడిపోయింది. ముందు అనుకున్న విధంగా ఒలింపిక్స్ జరిగి ఉంటే.. జరీన్ మీద గెలిచిన మేరీ కోమ్ టోక్యోకి వెళ్లి ఉండేవారు. కోమ్‌కి, జరీన్‌కి అప్పట్లో జరిగిన పోటీ 51 కేజీల బౌట్. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కోమ్.. జరీన్‌ని తేలిగ్గా పడగొట్టేశారు. అసలు వాళ్ల మధ్య ఆ పోటీ జరగాల్సిందే కాదు. అప్పటికే ట్రయల్స్ ఏమీ లేకుండానే ఒలింపిక్స్‌కి మేరీ కోమ్ సెలక్ట్ అయి ఉన్నారు. జరీన్ వచ్చి ‘అలా ఎలా చేస్తారు? ట్రయల్ జరగాల్సిందే. అవకాశం న్యాయంగా రావాలి. సీనియర్ అని రాకూడదు’ అని వాదించింది. అధికారులకు తప్పలేదు. ఇద్దరికీ మ్యాచ్ పెట్టారు. జరీన్ 1–9 తో ఓడిపోయింది. రింగులోనే కోమ్‌కి షేక్‌హ్యాండ్ ఇవ్వబోయింది. హగ్ కూడా చేసుకోబోయింది. ‘హు..’ అని కోమ్ ఆమెను పట్టించుకోకుండా రింగ్ దిగి వెళ్లిపోయారు. అప్పట్నుంచీ వీళ్లిద్దరికీ పడటం లేదని అంటారు. మళ్లీ ఇప్పుడెవరో అదే విషయం జరీన్‌ని అడిగారు. ‘పడకపోవడం అంత పెద్దదాన్ని కాదు. ఆమె నా ఆరాధ్య బాక్సర్. ఒలింపిక్స్‌లో కోమ్ పతకం సాధించాలని ఆశిస్తున్నా’ అంది జరీన్. ఇప్పుడు జరీన్ 2022 లో జరిగే కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ఢిల్లీలో కోమ్‌కి, జరీన్‌కి జరిగిన ఆ ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్ బౌట్ లో.. జరీన్‌కు షేక్‌హ్యాండ్, హగ్ నిరాకరించడంపై కోమ్, ‘ఇలాంటి స్వభావం ఉన్నవారు నాకు నచ్చరు‘ అన్నారు. ‘కానీ సెలక్షన్ న్యాయంగానే జరగాలి. అందుకే నేను పోటీ కోసం పట్టుపట్టాను‘ అని జరీన్. జరీన్ కరెక్ట్ అనిపిస్తోంది. అయితే కోమ్ కూడా డైరెక్ట్ ఎంట్రీకి పట్టుపట్టలేదు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అది. కోమ్ని ట్రయల్స్ లేకుండానే సెలెక్ట్ చేయాలని. -
నా కోచ్‌ను అనుమతించండి
న్యూఢిల్లీ : పాటియాలాలో జరుగుతోన్న జాతీయ బాక్సింగ్ క్యాంపులోకి తన కోచ్ అనిల్ ధన్కర్ను అనుమతించాల్సిందిగా భారత మేటి బాక్సర్, ఆసియా క్రీడల విజేత అమిత్ పంఘాల్ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)ను కోరాడు. 52 కేజీల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ బాక్సర్ అయిన అమిత్ ఇదే విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పాడు. ‘నేను కేవలం విజ్ఞప్తి మాత్రమే చేయగలను. సాయ్తో పాటు కేంద్రాన్ని కూడా కోరాను. వారి స్పందన కోసం వేచి చూస్తున్నా. ఇప్పటివరకు ఎవరూ దీనిపై స్పందించలేదు. వారి నిర్ణయం ఏదైనప్పటికీ నాకు కనీసం సమాధానం ఇవ్వాలి కదా. నా కోచ్ అనిల్ ఎన్ఐఎస్లో శిక్షణ పొందారు. ఆయన ‘ఐబా’ వన్ స్టార్ కోచ్. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఆయన అవసరం నాకెంతో ఉంది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలకు ముందు కూడా నేను ఇదే ప్రతిపాదన చేశాను. ఇప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు’ అని 24 ఏళ్ల అమిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున రజతం సాధించిన ఏకైక బాక్సర్‌గా అమిత్ ఘనత సాధించాడు. -
ప్రభుత్వ తీరుపై స్టార్ బాక్సర్ అసంతృప్తి
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలు మరిచిందని టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన స్టార్ బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల క్రితం ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హామీలు ఇవ్వగా ఏవీ నెరవేరలేదని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టిక్‌టాక్ స్టార్లకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఆర్థికం సాయం చేసిందని ఆమె విమర్శించారు. తనకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని, ఆర్థిక కష్టాల్లో ఉన్నాని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పంజాబ్ ప్రభుత్వం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుని సాయం అందిస్తుందో తెలియడం లేదని సిమ్రన్ వాపోయారు. కాగా, సిమ్రన్‌జిత్ కౌర్ జనవరిలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో మీడియా ద్వారా ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సీఎం అమరీందర్ సింగ్ అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రూ. 5 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు. (చదవండి: కుంబ్లేతో మా పని సులువవుతుంది) -
మళ్లీ బరిలోకి మైక్ టైసన్..
బాక్సింగ్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది మైక్ టైసన్. 20 ఏళ్ల వయసులోనే ట్రివర్ బెర్బిక్ను ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. బాక్సింగ్ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నటైసన్ 2005లో రిటైర్డ్ అయ్యాడు. అయితే మళ్లీ రింగ్‌లోకి దిగాలని మైక్‌టైసన్ భావిస్తున్నాడు. సెప్టెంబర్ 12న 4 డివిజన్ వరల్డ్ ఛాంపియన్ రాయ్‌జోన్స్ జూనియర్‌తో తలపడనున్నాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఒక మ్యూజిక్ ప్లాట్‌ఫాం ద్వారా టైసన్ పంచుకున్నాడు. తాను రిటర్న్ వస్తున్న సందర్భంగా చేసిన ఒక వీడియోను టైసన్ షేర్ చేశారు. చదవండి: మహాబలుడు 🥊 ANNOUNCED: Mike Tyson is having a comeback fight against Roy Jones Jr on Sept 12th at the Dignity Health Sports Park in California. The bout will be an eight-round exhibition, broadcast on PPV. Tyson, 54, last fought in 2005. Jones, 51, last fought in 2018. pic.twitter.com/eJzWT5HaL4 — Michael Benson (@MichaelBensonn) July 23, 2020 ఈ వీడియోలో టైసన్ గెలుచుకున్న డబ్య్లూబీఏ, డబ్య్లూబీసీ, ఐబీఎఫ్ టైటిల్స్‌ను చూపిస్తూ ఒక పవర్ పుల్ పంచుఇవ్వగానే హి ఈజ్ బ్యాక్ అనే మ్యూజిక్ వస్తుంది. తాను మే నుంచి ప్రాక్టీస్ ప్రారంభించానని, చారిటీకి ఫండ్స్ ఇవ్వడం కోసమే తాను మరోసారి రింగ్‌లోకి దిగుతున్నట్లు మైక్ టైసన్ పేర్కొన్నాడు. ఇక తన ప్రత్యర్థులు తనతో తలబడటానికి సిద్దంగా ఉండాలని సవాల్ విసిరాడు. టైసన్ తన కెరీర్లో మొత్తం 50 ప్రొఫెషనల్ ఫైట్స్‌ను గెలిచాడు. మొత్తానికి టైసన్ తిరిగి రావడంతో బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ప్రదీప్... కొత్త రకం డోపీ View this post on Instagram Visit MyYellowShirt.com to buy your official @tysonranchofficial training gear and help support a good cause. @smartcups @miketysoncares A post shared by Mike Tyson (@miketyson) on Jul 20, 2020 at 9:01am PDT -
'జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా'
న్యూయార్క్ : బాక్సింగ్ ప్రపంచంలో మైక్ టైసన్ పేరు తెలియని వారు ఉండరు. అతని బరిలోకి దిగాడంటే ఎంతటి ప్రత్యర్థి అయినా టైసన్ పంచ్‌లకు తలొగ్గాల్సిందే. రెండు దశాబ్ధాల పాటు తన ఆటతీరుతో ఉర్రూతలూగించిన మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ మళ్లీ తన పంచ్ పవర్ చూపించనున్నాడు. బౌట్ సత్తా చాటేందుకు మైక్ టైసన్ ప్రిపేరవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతను ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేశాడు. చాలా కఠోరంగా కసరత్తు చేస్తున్న 53 ఏళ్ల మైక్ టైసన్‌ను చూస్తుంటే అతని పవర్ ఏ మాత్రం తగ్గలేదిని తెలుస్తుంది. ఆ వీడియోలో ' నేను మళ్లీ రింగ్‌లోకి వస్తున్నా.. ప్రత్యర్థులకు ఇదే సవాల్ ' అంటూ కామెంట్ జత చేశాడు. 53 ఏళ్ల మైక్ టైసన్ వర్కవుట్ చేస్తూ చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన బాక్సింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.('ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లి ముందుంటాడు') వేగం, పంచ్ పవరుతో హెవీ వెయిట్‌గా నిలిచి పలు టైటిళ్లు సాధించిన టైసన్ మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాల సేకరణ కోసమే మైక్ టైసన్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతున్నారని సమాచారం. ఇక చివరిసారిగా 2005లో కెవిన్ మెక్‌బ్రైడ్‌తో టైసన్ చివరి బౌట్లో తలపడ్డాడు. 1986లో 20 ఏళ్ల వయసులోనే టైసన్ ట్రెవర్ బెర్బిక్ను ఓడించి ప్రపంచ యువ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా ఖ్యాతి గాంచాడు. టైసన్ తన కెరీర్లో మొత్తం 50 ప్రొఫెషనల్ ఫైట్స్‌ను గెలిచాడు. ఇక మాజీ చాంపియన్ ఇవాండర్ హోలీఫీల్డ్‌తో టైసన్ తన ఎగ్జిబిషన్ బౌట్లో తలపడే అవకాశాలు ఉన్నాయి. -
అక్కడ బాక్సింగ్ మొదలైంది...
మనాగ్వా (నికరాగ్వా): కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ ఈవెంట్లు నిరవధిక వాయిదా పడిన తరుణంలో... సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాలో మాత్రం బాక్సింగ్ పోటీలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దేశ రాజధాని అయిన మనాగ్వాలో జరిగిన ఎనిమిది బౌట్లను ప్రత్యక్షంగా, టీవీల ద్వారా ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ బౌట్లకు వేదికగా నిలిచిన అలెక్సిస్ అర్గొయె జిమ్‌లో 8 వేల సీటింగ్ సామర్థ్యం ఉండగా... 10 శాతం మందే ప్రత్యక్షంగా వీక్షించారు. బౌట్లను తిలకించేందుకు వచ్చిన వారు భౌతిక దూరం పాటించారు. తమది పేద దేశమని బాక్సర్లకు పూట గడవాలంటే వారు బౌట్లో అడుగుపెట్టాల్సిందేనని టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. దాంతో పాటు తమకు కరోనా అంటే భయం లేదని కూడా వారన్నారు. -
షరపోవా.. అన్‌స్టాపబుల్
అన్‌స్టాపబుల్ : మై లైఫ్ సో ఫార్.. అని రెండున్నరేళ్ల క్రితం మారియా షరపోవా తన బయోగ్రఫీ రాసుకున్నారు. ఆపలేని ఎదుగుదల.. అని. ఆ పుస్తకం బయటికి రావడానికి కొద్దినెలల ముందే.. పదిహేను నెలల నిషేధం తర్వాత ఆమె మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చారు. రెండేళ్లు ఆడారు. అంతలోనే మళ్లీ రెండు రోజుల క్రితం రిటైర్మెంట్ని ప్రకటించారు. ఆమెను ఎవరూ ఆపలేదు. ఆమే ఆగిపోయారు. అంతమాత్రాన ఆమె ‘అన్‌స్టాపబుల్’ కాకుండా పోరు. టెన్నిస్‌లో రాణించడానికి షరపోవా ఎంత కష్టపడ్డారో.. టెన్నిస్ తర్వాత లైఫ్‌లోనూ ఎదగడానికి అంతగా కృషి చేస్తారని అంచనా వెయ్యడానికి ఆమె కెరీర్‌లోని మలుపులే కొలమానాలు. షరపోవా క్యాండీ సుగర్‌పోవా అనే క్యాండీ ఒకటి ఉంది. అది అమెరికాలో దొరుకుతుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైనది. ఫన్నీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే స్వీట్‌గా ఉంటుంది. క్యాండీల వ్యాపారి జెఫ్ రూబిన్.. షరపోవా పేరు మీదే, ఆమెతో కలిసి సుగర్‌పోవా క్యాండీని సృష్టించాడు. దాని అమ్మకాలపై వచ్చే డబ్బు ‘షరపోవా చారిటీ’కి వెళుతుంది. ఒక సందర్భంలోనైతే షరపోవా తన పేరును సుగర్పోవాగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు! అంతగా ఆ ప్రాడెక్ట్ ఇమేజ్ పెరిగిపోయింది. షరపోవా ప్రాక్టీస్ ఆరవ యేట మాస్కోలోని మార్టినా నవ్రతిలోవా నడుపుతున్న టెన్నిస్ క్లినిక్‌లో చేరడం షరపోవా కెరీర్‌ను మలుపుతిప్పింది. మార్టినా ఈ చిన్నారిని ఫ్లారిడాలోని ఐ.ఎం.జి.అకాడమీకి రికమండ్ చేసింది! ఆండ్రీ అగస్సీ, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా లాంటి టెన్నిస్ దిగ్గజాలు ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ అది. కానీ షరపోవా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. అప్పు చేయాలి. డబ్బైతే అప్పు చేయగలడు కానీ, ఇంగ్లీషులో మాట్లాడలేడు కదా! ఇంట్లో ఎవ్వరికీ ఇంగ్లిష్ రాదు. ఆ భయంతో ఏడాది తాత్సారం చేసి ధైర్యం చేశాడు. మరోవైపు వీసా నిబంధనలు తండ్రీ కూతుళ్లను మాత్రమే యు.ఎస్.లోకి రానిచ్చాయి. తల్లి ఎలీనా రెండేళ్ల పాటు భర్తకు, కూతురికి దూరంగా రష్యాలోనే ఉండిపోవలసి వచ్చింది. షరపోవా, ఆమె తండ్రి తొలిసారి ఆమెరికాలో అడుగుపెట్టేనాటికి వాళ్ల దగ్గరున్న డబ్బు 700 డాలర్లు. ఇప్పటి లెక్కల్లో సుమారు 47 వేల రూపాయలు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూనే ఫ్లారిడాలో ఇళ్లల్లో పాత్రలు కడగడం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టాడు తండ్రి. తర్వాతి ఏడాదికల్లా అకాడమీ ప్రవేశానికి అర్హమైన తొమ్మిదేళ్ల వయసు రాగానే కూతుర్ని ఐ.ఎం.జి.లో చేర్చాడు. ఇక షరపోవాకి ట్యూషన్ ఫీజు, ఇంత సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ అకాడమీవే. అలా కెరీర్‌తో పాటు, షరపోవా జీవితం కూడా యు.ఎస్.తో ముడిపడిపోయాయి. ఆటల్లోనే కాదు, చారిటీల్లో కూడా ఆమె పెద్ద సెలబ్రిటీ అయ్యారు. షరపోవా ‘తప్పు’ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం’ అనే మందు బయటపడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అప్పటికి పదేళ్లుగా ఆమె తన ఆరోగ్యం కోసం తనకు తెలియకుండానే మెల్డోనియం కలిసి ఉన్న మెడిసిన్‌ని వాడుతున్నారు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కొత్తగా విడుదల చేసిన నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషి కావలసి వచ్చింది! అందుకు పడిన శిక్ష ఆట నుంచి పదిహేను నెలల బ్యాన్! షరపోవా ఆట షరపోవా రష్యన్ ప్రొఫెషనల్ ప్లేయర్. ఇరవై ఐదేళ్లుగా యు.ఎస్.లో ఉంటున్నారు. ఒలింపిక్ మెడలిస్ట్. టెన్నిస్ కోర్టులో గర్జించే సింహం. 6 అడుగుల 2 అంగుళాల ఎల్తైన మనిషి. ఆమెకు మాత్రమే ప్రత్యేకమైన ఆ స్వింగింగ్ వ్యాలీలు ప్రత్యర్థుల గుంyð ల్ని కిందికి జారుస్తాయి. ఒక ఆట గెలిచినప్పుడు షరపోవా వెంటనే తర్వాతి ఆటకు ప్రాక్టీస్ మొదలు పెడతారు! ఆటలో ఓడిపోయినప్పుడు ఆ ప్రెజర్ నుంచి బయట పడడానికి షాపింగ్‌కి వెళతారు! షరపోవా ‘రీబర్’ సోవియెట్ యూనియన్‌లో చెర్నోబిల్ అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఏడాదికి న్యాగన్ పట్టణంలో షరపోవా పుట్టింది. ఆ పట్టణం చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన ప్రిప్యత్ పట్టణానికి 3,500 కి.మీ. దూరంలో ఉంటుంది. చెర్నోబిల్ ప్రమాద ప్రభావం పడకుండా ఉండేందుకు షరపోవా తల్లిదండ్రులు ప్రిప్యత్ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్లిన తర్వాతే బిడ్డను కనాలని నిర్ణయించుకుని న్యాగన్‌లో తలదాచుకున్నారు. చెర్నోబిల్ ప్రమాదం 1986 ఏప్రిల్ 26న జరిగింది. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున నిషేధం తర్వాత షరపోవా తన ‘రీబర్త్’ టెన్నిస్‌ను ఆడారు. షరపోవా స్నేహం పద్దెనిమిదవ యేటే టెన్నిస్‌లో ఆమె వరల్డ్ నెం.1 ర్యాంకులోకి వచ్చేశారు. ఆదే ఏడాది 18వ బర్త్‌డే పార్టీలో అమెరికన్ పాప్ రాక్ బ్యాండ్ మెరూన్ 5 సింగర్ ఆడమ్ లెవీన్ ఆమెకు పరిచయం అయ్యాడు. తర్వాత అమెరికన్ టెలివిజన్ ప్రొడ్యూజర్ చార్లీ ఎబర్సోల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. తర్వాత స్లొవేనియా బాస్కెట్‌బాల్ ప్లేయర్ సషా ఉజాసిక్, తర్వాత బల్గేరియన్ టెన్నిస్ ప్లేయర్ గ్రిగర్ దిమిత్రోవ్. ప్రస్తుతం ఆమె బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ గిల్కెస్. షరపోవా రిటైర్మెంట్ని ప్రకటించినప్పుడు ఆమె కెరీర్‌ను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. షరపోవా రాకెట్ షరపోవాకు రెండేళ్ల వయసులో ఆమె కుటుంబం సోచ్ సిటీకి మారింది. అక్కడ ఆమె తండ్రికి అలెగ్జాండర్ కఫెల్నికోవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్ తన పద్నాలుగేళ్ల కొడుకు ఎవ్‌జెనీకి టెన్నిస్‌లో శిక్షణ ఇప్పిస్తున్నప్పుడు వారి పరిచయం జరిగింది. తర్వాత రెండేళ్లకు తండ్రితో పాటు ఆట చూడడానికి వచ్చిన షరపోవాను చూసి ముచ్చట పడి ఆ చిన్నారికి కూడా ఓ టెన్నిస్ రాకెట్ కొనిచ్చాడు అలెగ్జాండర్. అదే తొలిసారి షరపోవా రాకెట్ పట్టుకోవడం. లోకల్ పార్క్‌లో చాలాకాలం పాటు ఆ రాకెట్‌తోనే ఆడింది. తర్వాత రష్యన్ కోచ్ యూరి యట్కిన్ దగ్గర టెన్నిస్ పాఠాలు నేర్చుకుంది. తొలి ఆటలోనే షరపోవాలోని అతి ప్రత్యేకమైన ‘హ్యాండ్–ఐ కోఆర్డినేషన్’ని గమనించాడు కోచ్. షరపోవా కోపం కోపంగా ఉన్నప్పుడు షరపోవా రాకెట్‌తో లాగిపెట్టి టెన్నిస్ బంతిని కొడతారు. అవతల ఎవరూ ఉండరు. ప్రాక్టీస్ వాల్‌ను పిడిగుద్దులు గుద్దినట్టుగా బంతిని వాల్ పైకి ఈడ్చి కొడుతూనే ఉంటారు. ఊరికినే తనకు కోపం రాదు. వస్తే ఊరికే ఉండిపోదు. కోపం తీర్చుకుంటుంది. ఎదురుగా ఉన్న గోడల్ని బంతులతో పగలగొడుతుంటారు. షరపోవా యోగా పదిహేను నెలల నిషేధంలో షరపోవా యోగా, ధ్యానం సాధన చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరారు. మంచి మంచి బుక్స్ చదివారు. బయోగ్రఫీ రాశారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆట నుంచి బ్యాన్ అవగానే చాలామందే చికాకు పరిచారు ఆమెను. మొదటగా డేవిడ్ హెగర్టీ! ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఆమె బ్యాన్ నిర్ణయం అతడిదే. ఇంకా.. సాటి ప్లేయర్లు జాన్ మెకెన్రో, ప్యాట్ క్యాష్, జెన్నిఫర్ కాప్రియాటీ, సెరెనా విలియమ్స్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్ జకోవిక్.. తలో మాటా అన్నారు. ‘ఇలా చేసిందంటే నమ్మలేక పోతున్నాం’ అని ఒకరు, ‘తన టైటిళ్లనీ వెనక్కు తీసేసుకోవాలి’ అని ఒకరు, ‘సారీ చెప్పినా ఒప్పుకోవద్దని ఒకరు’... తలో రాయి విసిరారు. షరపోవా ఎవరికీ సారీ చెప్పలేదు. వీళ్లందర్నీ క్షమించేయడానికి బాక్సింగ్ కన్నా, ధ్యానం ఆమెకు ఎక్కువ ఉపయోగపడింది. షరపోవా బాల్యం బాల్యం నుంచి దూరంగా వచ్చేస్తున్నకొద్దీ, బాల్యం ఆమె దగ్గరగా రావడం షరపోవా జీవితంలోని ఒక విశేషం. చిన్నపిల్ల నవ్వు, చిన్నపిల్ల వెక్కిరింపు ఇవెక్కడికీ పోలేదు. ఆమె దగ్గర చిన్నప్పటి స్టాంప్ కలెక్షన్ ఇంకా పోగవుతూనే ఉంది. చిన్నప్పటి ఆమె జ్ఞాపకాల సుగంధ పరిమళం స్టెల్లా మెకార్ట్నీ ఎప్పుడూ ఆమెను అంటుకునే ఉంటుంది! పిప్పీ లాంగ్‌స్టాకింగ్ బుక్స్ కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు షరపోవా. పిప్పీ లాంగ్‌స్టాకింగ్ అనేది స్వీడిష్ రచయిత్రి ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ నవలల్లోని ఒక అమ్మాయి క్యారెక్టర్. పిప్పీ జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు జడలు ఉంటాయి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగిల్ హ్యాండ్‌తో తన గుర్రాన్ని అదుపు చేస్తుంటుంది. చురుగ్గా ఉంటుంది. ఎప్పుడేం చేస్తుందో చెప్పలేనంత ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రలో తనను తను చూసుకున్నట్లుంది షరపోవా. అందుకే పిప్పీ అంటే అంతిష్టం. మిగతా పిల్లల సాహిత్యాన్ని కూడా ఆసక్తిగా చదువుతుంది. -
77 ఏళ్ల వ్యక్తి దొంగకు చుక్కలు చూపించాడు
-
బాక్సింగ్‌తో దొంగకు చుక్కలు చూపించాడు
కార్డిఫ్ : అమెరికాలో ఒక వృద్దుడు తన బాక్సింగ్ పంచ్‌లతో ఒక దొంగకు చుక్కలు చూపెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. యూకేలో కార్డిఫ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో 77 ఏళ్ల వ్యక్తి తన కారును పార్క్ చేసి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ముసలాయన తిరిగి కారు వద్దకు వెళుతుండగా ఒక వ్యక్తి ముసుగు వేసుకొని అతనికి అడ్డు వచ్చి డబ్బులు ఇవ్వమంటూ దౌర్జన్యం చేశాడు. అయితే అసలు మలుపు ఇక్కడే చోటుచేసుకుంది. దీనికి తాత భయపడక పోగా దొంగపై తన బాక్సింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. దొంగకు తన పంచ్‌లతో ముచ్చెమటలు పట్టించాడు. ఆ దొంగ ఈ తాతతో అనవసరంగా పెట్టుకున్నానంటూ అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. కానీ తాత అతన్ని అంత తేలిగ్గా ఏం వదల్లేదు. చివరకు ఎలాగోలా తాత పంచ్‌ల నుంచి బతుకుజీవుడా అనుకుంటూ దొంగ అక్కడినుంచి పారిపోయాడు. ఇదంతా అక్కడి సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డయింది. దీనిని కాస్త కార్డిఫ్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తాత చేసిన పనికి పొగడ్తలతో ముంచెత్తారు. తాత ప్రదర్శించిన ధైర్య సాహసాలు అదుర్స్ అని.. తాత తన స్కూల్లో నేర్చుకొన్న బాక్సింగ్ స్కిల్స్ ఇప్పుడు పనికివచ్చాయంటూ.. తాతయ్య చేసిన సాహసం మా కుర్రకారుకు ఇన్స్పిరేషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. -
వరుణ్ తేజ్‌కు స్పెషల్ సర్ప్రైజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న్యూ లుక్‌తో అలరిస్తున్నాడు. తన తదుపరి చిత్రం కోసం పూర్తిగా మేకోవర్‌ను మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవలే వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేశ్’ బ్లాక్ బస్టర్‌ను అందుకొన్న ఉత్సాహంతో తన తదుపరి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్దా, అల్లు వెంకటేశ్ నిర్మాతలుగా బాక్సింగ్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. వరుణ్ తేజ్ సరసన నిధి అగర్వాల్, నాభా నటేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. (బాక్సింగ్‌కి రెడీ) వరుణ్ తేజ్‌కు స్పెషల్ సర్ప్రైజ్ ఇక వరుణ్ తేజ్ కి సూపర్ మేన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్‌బీఓ ఇండియా వరుణ్ తేజ్‌కి ఇష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతిగా ఇచ్చింది. బాట్ మ్యాన్ మాస్క్, వండర్ వుమెన్ మాస్క్‌ల్ని, ఓ కారు బొమ్మను ఈ సంస్థ పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపాడు. (బాక్సర్‌కు జోడీ) -
పంచ్ పడితే..పతకాలు దాసోహం..!
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : బాక్సింగ్‌లో తన పంచ్‌లకు పతకాలు దాసోహం అనాల్సిందే.. నిరంతర కఠోర శ్రమతో ఫిట్నెస్ సాధిస్తూనే బాక్సింగ్‌లో పతకాలు ఒడిసి పడుతూ.. అర్జున అవార్డును అందుకున్నాడు. తాజాగా ఢిల్లీ, బ్యాంకాంక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటి బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. 2020లో నిర్వహించే వరల్డ్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. దీంతో ఒలింపిక్స్‌లో దేశం తరపున పాల్గొని స్వర్ణం గెలుపొందడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. అతనే నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్. తనదైన శైలితో ముందుకు.. నరేష్ నిరంతర కఠోర శ్రమతో కూడుకున్న బాక్సింగ్‌లో తనదైన శైలితో ముందుకు సాగుతూ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నార్ల యాదయ్య–పుల్ల మ్మ దంపతుల కుమారుడు నరేష్. యాదయ్య దినసరి మేస్త్రిగా పని చేస్తాడు. పీఏపల్లిలోని శ్రీ సాయికృష్ణవేణి పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన నరేశ్‌కు కరాటే మాస్టర్ సురేష్ బాక్సింగ్‌లో మెళకువలు నేర్పించాడు. కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌కు ఆ కుటుంబం వలస వెళ్లింది. నరేశ్ ప్రస్తుతం అవెన్యూ గ్రామర్ స్కూల్లో పదో తరగతి చదువుతుండగా అతడికి బాక్సింగ్‌పై మక్కువను గమనించిన అవెన్యూ గ్రామర్ స్కూల్ పీఈటీ నరేష్‌ను ప్రోత్సహించాడు. ఈ క్రమంలో లాల్‌బహదూర్ స్టేడియంలోని బాక్సింగ్ కోచ్ సత్యనారాయణ అతనికి బాక్సింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. ఈ ఏడాది నైజీరియా వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. సాధించిన విజయాలు.. ⇔ తాజాగా ఢిల్లీలో జరిగిన జూనియర్ నేషనల్ లెవల్ ఆర్మీ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. ⇔ నవంబర్ 14 నుంచి 19 వరకు బ్యాంకాక్‌లో నిర్వహించిన ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్‌లో ఆస్ట్రేలియా, కొరియా, పాకిస్థాన్లతో తలపడి బంగారు పతకం నెగ్గాడు. ⇔ 2019 జనవరి 3– 6 తేదీల్లో నైజీరియాలో నిర్వహించిన అంతర్జాతీయ జూనియర్ బాక్సింగ్‌లో తొలి మ్యాచ్‌లో బల్గేరియా ఆటగాడిని ఒడించి రెండో మ్యాచ్‌లో రష్యా ఆటగాడిని మట్టికరిపించి ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడిని నాకౌట్ చేసి బంగారు పతకాన్ని సాధించాడు. ⇔ 2018 ఢిల్లీ, హర్యాణ, మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ జూనియర్ బాక్సింగ్‌లో బంగారు పతకాలు సాధించాడు. ⇔ 2017లో ముంబాయి, పూణె, గోవాలో జరిగిన అండర్–17 బాక్సింగ్ క్రీడా పోటీల్లో పాల్గొని బంగారు పతకంతో పాటు బెస్ట్ ప్లేయర్ అవార్డు, ఐరిష్ బాక్సర్ అవార్డు అందుకున్నాడు. ⇔ 2016లో పంజాబ్‌లో నిర్వహించిన అండర్–16 రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంతో పాటు ఉత్తమ క్రీడాకారుడిగా పురస్కారం అందుకున్నాడు. ⇔ 2014, 2015లలో నిర్వహించిన సబ్ జూనియర్ విభాగంలో 8 బంగారు పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం బాక్సింగ్ అంటేనే కఠోర శ్రమతో కూడుకున్నది. ఎప్పుడు ఫిట్నెస్ను కాపాడుకుంటూ శ్రమించాల్సి ఉంటుంది. దేశం తరపున ఇప్పటి వరకు జూనియర్ విభాగంలో ఆడాను. తాజాగా ఢిల్లీ, బ్యాంకాక్‌లో నిర్వహించిన బాక్సింగ్ పోటీలో బంగారు పతకం గెలుపొందడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దేశం తరపున ఒలింపిక్స్‌లో ఆడి బంగారు పతకం నెగ్గాలనేది నా లక్ష్యం. – నరేశ్ -
ఒడిశా వారియర్స్‌కు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న ‘బిగ్ బౌట్ ఇండియన్ బాక్సింగ్ లీగ్’ బరిలో దిగే బాక్సర్ల వివరాలను ప్రకటించారు. ఈ లీగ్ డిసెంబర్ 2 నుంచి 21 వరకు జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణ బాక్సర్, ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్ ఒడిశా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పంజాబ్ రాయల్స్ తరఫున పోటీపడనుంది. వీరిద్దరు 51 కేజీల విభాగంలో బరిలోకి దిగుతారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్ పురుషుల 52 కేజీల విభాగంలో పంజాబ్ రాయల్స్ జట్టుకు ఆడతాడు. ఇదే విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్ టీమ్ గుజరాత్ అదానీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. జట్ల వివరాలు ఒడిశా వారియర్స్, బెంగళూరు బ్రాలర్స్, పంజాబ్ రాయల్స్, టీమ్ గుజరాత్ అదానీ, బాంబే బుల్లెట్స్, నార్త్ ఈస్ట్ రైనోస్. వెయిట్ కేటగిరీలు మహిళల విభాగం: 51 కేజీలు, 60 కేజీలు; పురుషుల విభాగం: 52 కేజీలు, 57 కేజీలు, 69 కేజీలు, 75 కేజీలు, 91 కేజీలు. -
వచ్చే నెలలో ఇండియన్ బాక్సింగ్ లీగ్
న్యూఢిల్లీ: క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాంశాల్లో భారత్‌లో లీగ్‌లు జరుగుతుండగా... వీటి సరసన బాక్సింగ్ కూడా చేరనుంది. తొలిసారి ఒలింపిక్ స్టయిల్ ఇండియన్ బాక్సింగ్ లీగ్‌కు వచ్చే నెలలో తెర లేవనుంది. డిసెంబర్ 2 నుంచి 21 వరకు జరిగే ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మూడు నగరాల్లో ఈ లీగ్‌ను నిర్వహిస్తామని లీగ్ నిర్వాహక సంస్థలు ప్రొ స్పోర్టీఫై–స్పోర్ట్జ్ లైవ్ తెలిపాయి. లీగ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భారత మేటి బాక్సర్లు మేరీకోమ్, అమిత్ పంఘాల్, మనోజ్‌కుమార్, సోనియా లాథెర్ తదితరులు ఈ లీగ్‌లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
మేరీకోమ్ X నిఖత్
న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పట్టుదల నెగ్గింది. భారత దిగ్గజం మేరీకోమ్‌తో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ పోరు నిర్వహించాలనే ఆమె మొరను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆలకించాయి. ఇద్దరి మధ్య ట్రయల్ బౌట్ పెట్టాలని బీఎఫ్ఐని క్రీడాశాఖ ఆదేశించింది. దీంతో బీఎఫ్ఐ డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లందరికీ సెలక్షన్ బౌట్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటీవల బీఎఫ్ఐ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్‌కి అనుకూలంగా వ్యవహరించింది. ట్రయల్స్ లేకుండానే 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ని ఒలింపిక్స్ క్వాలియఫర్స్కు ఎంపిక చేసింది. ఇది వివాదం రేపింది. తన ఒలింపిక్స్ అవకాశాల్ని ఇలా తుంచేయడాన్ని సహించలేకపోయిన నిఖత్ ఏకంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అందులో కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన క్రీడాశాఖ ట్రయల్స్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లకు ట్రయల్స్ పోటీలు జరుగనున్నాయి. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్, నిఖత్ల మధ్య నిర్వహించే ట్రయల్స్ బౌట్లో నెగ్గిన బాక్సర్... ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ఈ క్వాలిఫయర్స్ పోటీలు జరుగుతాయి. 51 కేజీల విభాగంతోపాటు 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో కూడా సెలెక్షన్ ట్రయల్స్ బౌట్లు ఉంటాయి. ఆ ఇద్దరికి మినహాయింపు... ఇక పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన అమిత్ పంఘాల్ (52 కేజీలు), కాంస్యం సాధించిన మనీశ్ కౌశిక్ (63 కేజీలు)లకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా జట్టులోకి ఎంపిక చేయనున్నారు. మిగతా ఆరు కేటగిరీల్లో (57, 69, 75, 81, 91, ప్లస్ 91 కేజీలు) మాత్రం డిసెంబర్ 27, 28 తేదీల్లో ట్రయల్స్ ఉంటాయి. -
మేరీకోమ్-నిఖత్ జరీన్ల ‘మెగా’ ఫైట్!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా నువ్వెంత అంటే నువ్వెంత అనేంతగా భారత మహిళా స్టార్ బాక్సర్లు మేరీకోమ్-నిఖత్ జరీన్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో భాగంగా చైనాలో జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ను పంపడానికి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) నిర్ణయించగా, దాన్ని మరో స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాను కూడా 51 కేజీల విభాగంలో ఉండటంతో తమ మధ్య ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్ నిర్వహించాలంటూ కోరుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జరీన్‌పై మేరీకోమ్ తీవ్రంగా ధ్వజమెత్తడం, దానికి నిఖత్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేని బీఎఫ్ఐ.. వారి మధ్య సెలక్షన్ ట్రయల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌తో యువ స్టార్ బాక్సర్ జరీన్‌తో పోరు నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ చివరి వారంలో వీరిద్దరికీ మధ్య ఫైట్ నిర్వహించడానికి యత్నిస్తోంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) జరుగనున్న తరుణంలో ఆ తర్వాత మేరీకోమ్-జరీన్లకు మెగా ఫైట్ ట్రయల్స్ ఏర్పాటు చేసేంందుకు దాదాపు రంగం సిద్ధమైంది. దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాశాఖా మంత్రి కిరణ్ రిజ్జుకు సైతం నిఖత్ లేఖ కూడా రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాదం మరింత రాజుకుంది. నిఖత్ జరీన్‌కు భారత విఖ్యత షూటర్ అభినవ్ బింద్రా మద్దతుగా నిలవడం కూడా మేరీకోమ్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘నాకు మేరీకోమ్‌తో పోటీ ఏంటి. అభివన్ నువ్వు బాక్సింగ్ విషయంలో తలదూర్చుకు. ఇది షూటింగ్ కాదు. నీ షూటింగ్ పని నువ్వు చూసుకో’ అంటూ మేరీకోమ్ విరుచుకుపడింది. కాగా, దీనిపై బీఎఫ్ఐ కాస్త మెట్టుదిగినట్లే కనబడుతుండటంతో మేరీకోమ్-జరీన్ల మధ్య పోటీ దాదాపు ఖాయమేనని అనిపిస్తోంది. ఒకవేళ ఈ సెలక్షన్ ట్రయల్స్ జరిగితే అందులో గెలిచిన బాక్సర్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు. -
వచ్చే నెల 22న విజేందర్ బౌట్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ మరో ప్రత్యర్థిని మట్టికరిపించే పనిలో పడ్డాడు. వచ్చేనెల 22న తన తదుపరి బౌట్ కోసం కసరత్తు చేస్తున్నాడు. ప్రత్యర్థి ఇంకా ఖరారు కానప్పటికీ... దుబాయ్‌లో ఈ బాక్సింగ్ పోరు జరగనుంది. ప్రొఫెషనల్ సర్క్యూట్లో భారత బాక్సర్ది దుర్బేధ్యమైన రికార్డు. ఇప్పటి వరకు పాల్గొన్న 11 బౌట్లలో విజేందర్దే విజయం. ఇందులో ఏకంగా ఎనిమిది మందిని నాకౌట్ చేయడం మరో విశేషం. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అరంగేట్రం నుంచి అద్భుతాలు చేస్తున్న విజేందర్ అందుకు అనుగుణంగానే రాటుదేలుతున్నాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఉన్న ఈ మిడిల్ వెయిట్ బాక్సర్ తదుపరి బౌట్ కోసం చెమటోడ్చుతున్నాడు. ట్రెయినర్ లీ బర్డ్‌తో కలిసి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. అ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ ‘నా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. దీన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించాలనుకుంటున్నాను. దుబాయ్‌లో నా అభిమానులు ఆశించే పోరాటాన్నే కనబరుస్తాను. నా శక్తి సామార్థ్యాల్ని చాటేందుకు ప్రొఫెషనల్ సర్క్యూట్ చక్కని అవకాశాన్ని కల్పించింది. నా జైత్రయాత్రను ఇలాగే కొనసాగించి మెల్లగా ప్రపంచ టైటిల్‌పై దృష్టిసారిస్తా’ అని అన్నాడు. -
జమున బోరో శుభారంభం
ఉలాన్–ఉదే (రష్యా): ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. జమున బోరో... తన పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన 54 కేజీల తొలి రౌండ్ బౌట్లో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగి అయిన జమున 5–0తో మిచిద్మా ఎర్దెనెదలై (మంగోలియా)ను ఓడించింది. నేడు జరిగే 57 కేజీల విభాగంలో క్వైయో జైరు (చైనా)తో నీరజ్ (భారత్); 75 కేజీల విభాగంలో ముంఖ్బాట్ (మంగోలియా)తో సవీటి బూరా తలపడతారు. -
మన హీరోల్ని ట్రీట్ చేసే విధానం ఇదేనా?
కరాచీ: ఇటీవల దుబాయ్‌లో జరిగిన బాక్సింగ్ బౌట్లో ఫిలీప్పిన్స్ బాక్సర్ కార్నడో తనోమోర్‌ను కేవలం 82 సెకండ్లలో నాకౌట్ చేసి దిగ్విజయంగా స్వదేశానికి వచ్చిన పాకిస్తాన్ ప్రొఫెషనల్ బాక్సర్ మహ్మద్ వసీంకు చేదు అనుభవమే ఎదురైంది. దేశం తరఫున విజయం సాధిస్తే అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మహ్మద్ వసీంకు కనీస స్వాగత ఏర్పాట్లు చేయలేదు. దీన్ని ఘోర అవమానంగా భావించిన వసీం.. ‘తాను పాకిస్తాన్ టాలెంట్‌ను ప్రపంచ వేదికపై చాటడానికి మాత్రమే వెళతాను. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతాల కోసం నేను ఫైట్ చేయడం లేదు. ప్రతీ క్యాంప్, ప్రతీ టూర్, ప్రతీ ట్రైయినింగ్ నాకు ముఖ్యమే. పాకిస్తాన్ బాక్సింగ్ టాలెంట్‌ను ప్రపంచం గుర్తించాలనే కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. దీనిపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందిస్తూ.. ఇదేనా తమ దేశ హీరోల్ని గౌరవించుకునే విధానం అంటూ ధ్వజమెత్తాడు. ‘నేను వసీంకు పాక్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. దేశం తరఫున ఎవరైనా సత్తా చాటితే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మన హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అనేది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇవే నా క్షమాపణలు. నువ్వు తర్వాత బౌట్లో గెలిచినప్పడు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటా. నీ విజయానికి ఇవే నా అభినందలు’ అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ పది బౌట్లలో పాల్గొన్న వసీం.. ఒకదాంట్లో మాత్రమే పరాజయం చూసి తొమ్మిది బౌట్లలో గెలుపు అందుకున్నాడు. ఇందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం విశేషం. -
అందమైన భామల మధ్య వేలంవెర్రి పోటీ!
‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ పోటీలను వేలంవెర్రిలాగా చూస్తున్న జనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనే విషయం తెల్సిందే. అదే తరహాలో ఇప్పుడు బ్రిటన్ విద్యార్థులకు వేలం వెర్రిలాగ ఓ ఆట పట్టుకుంది. అదే బాక్సింగ్. డబ్లూడబ్లూఎఫ్ పోటీల్లో పాల్గొనే కండల వీరులు కదం తొక్కుతు రింగ్‌లోకి వస్తుంటే అందమైన భామలు కరతాల ధ్వనులతో హావభావాలతో వారికి స్వాగతం చెప్పడం, నిర్వాహకులు హంగామా చేయడం తెల్సిందే. అదే తరహాలో లండన్‌లో జరుగుతున్న బాక్సింగ్‌లో పాల్గొనే విద్యార్థులు చొక్కా లేకుండా వేదికపైకి వస్తుంటే పొగ గొట్టాలు చిమ్మడం, గాలి బుడగల నురుగు ఎగిసి పడటం, స్వర్ణ కాంతులు విరజిమ్మడం చూడముచ్చటగా ఉంటుంది. అంతకన్నా ముచ్చటగా ఉండే ముద్దుగుమ్మలు హొయలుపోతూ పోటీదారులకు స్వాగతం చెప్పడం, కరతాళ ధ్వనులతో తోటి విద్యార్థినులే వారిని ప్రోత్సహించడం అంతా ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌లా ఉంటుంది. అదిరిపోయే సంగీత హోరు మధ్య బాక్సర్లు ఒకరికొకరు తలపడుతుంటే తాగుతున్న విద్యార్థి, కుర్రకారులోకం తన్మయులై చూస్తుంటారు. తెల్లారాక తీరిగ్గా ఇల్లు వెతుక్కుంటూ వెళతారు. డబ్లూడబ్లూఎఫ్ పోటీలు లైసెన్స్‌తో నడుస్తున్నాయి. కానీ విద్యార్థులు పాల్గొంటున్న ఈ బాక్సింగ్ పోటీలకు మాత్రం ఎలాంటి లైసెన్స్‌లు లేవు. పర్యవసానంగా కొన్నిసార్లు విద్యార్థులు మత్యువాత కూడా పడుతున్నారని తెలుస్తోంది. లైసెన్స్డ్ బాక్సింగ్ పోటీలు ప్రభుత్వ హయాంలో నడుస్తుంటే లైసెన్స్ లేకుండా చాటుమాటుగా రాత్రిపూట నడుస్తున్న బాక్సింగ్ పోటీలను ప్రైవేటు కంపెనీలు నిర్వహిస్తున్నాయి. కార్డిఫ్ నగరంలో ఇలాంటి పోటీలను ‘పేపర్ ఏజెన్సీ యూకే’ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ పోటీలకు విద్యార్థులనే ఎన్నుకోవడానికి కారణం. గ్యాధరింగ్ ఎక్కువగా ఉంటుందని, ప్రచారం ఎక్కువగా లభిస్తుందని. ఇదే విషయమై పేపర్ ఏజెన్సీని మీడియా ప్రశ్నించగా, తాము టాలెంట్ హంట్లాగా విద్యార్థులకు ఉపయోగపడుతున్నామని, ప్రభుత్వ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం అందరికి రాదని, అందుకనే తాము మున్ముందు బాక్సింగ్‌లో రాణించగల జాతి రత్నాలను ఇప్పటి నుంచే వెలికి తీస్తున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. తలకు రక్షణగా హెల్మెట్, చేతికి సరైన గ్లౌజులతోనే పోటీకి అనుమతిస్తామని, పోటీదారులకు కూడా ప్రొఫెషనర్స్తోనే శిక్షణ ఉంటుందని, పోటీదారులకు భారత కరెన్సీలో 20 కోట్ల రూపాయల వరకు జీవిత బీమా చేసినట్టు చెప్పారు. ఈ పోటీలతో కార్డిఫ్ యూనివర్శిటీ, కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమకు కూడా ఎలాంటి సంబంధం లేదని ఇగ్లండ్ బాక్సింగ్, వేల్ష్ అమెచ్యూర్ బాక్సింగ్ అసొసియేషన్ స్పష్టం చేశాయి. ఈ ప్రైవేటు పోటీలు సురక్షితం కావని, బాక్సింగ్ పోటీలకు అనవసరంగా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని ఇంగ్లండ్ బాక్సింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గెతిన్ జెన్కిన్స్ హెచ్చరించారు. తాను మాత్రం గత ఏడు వారాలుగా ప్రొఫెషనల్ బాక్సర్‌తోనే శిక్షణ తీసుకుంటున్నానని కార్డిఫ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోతున్న 22 ఏళ్ల క్రిస్ కాన్వే తెలిపారు. బాక్సింగ్ పోటీలప్పుడు వైద్యులు అందుబాటులో ఉంటారని, అయితే పోటీదారులకు ముందుగానే హెల్త్ చెకప్‌లు చేయడం ఏమీ ఉండదని గతంలో ఈ పోటీల్లో పాల్గొన్న ఎక్సెటర్, బాత్, న్యూకాజల్, గ్లాస్గో, సెయింట్ ఆండ్రీస్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోటీలకు ముందుగా బాక్సర్లు వైద్య పరీక్షలు చేసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అనధికారికంగా జరుగుతున్న పోటీలు రేపు ‘ఐపీఎల్ బాక్సింగ్’ పోటీలకు దారితీయవచ్చేమో! -
నా పంచ్ పవర్ చూపిస్తా
చేతికి గ్లౌజులు తొడుక్కుని తన పంచ్ పవరేంటో చూపించడానికి రెడీ అవుతున్నారు సంజన. ఈ పంచ్‌లు ఎవరి మీద పడతాయో వేచి చూడాలి. అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బాక్సర్’. వివేక్ కణ్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంజన హీరోయిన్. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో హీరోహీరోయిన్లు ఇద్దరూ బాక్సర్స్‌గా కనిపిస్తారు. ఈ సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు సంజన. ‘‘ఇందులో నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర నాది. ఇంతకు ముందు సినిమాల కోసం నేర్చుకున్న గుర్రపు స్వారీ, నా ఫిజిక్ ఈ సినిమాకి అవకాశం వచ్చేలా చేశాయి. ఈ సినిమాలో నా పాత్రను చూసి కచ్చితంగా షాక్ అవుతారు. సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాను’’ అన్నారు సంజన. ఈ సినిమా కాకుండా రెండు కన్నడ చిత్రాలు, ఓ తమిళ వెబ్ సిరీస్‌తో సంజన బిజీగా ఉన్నారు. -
భారత బాక్సర్లకు ప్రత్యేక శిక్షణ
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి మెగా ఈవెంట్లు ముందున్న తరుణంలో భారత బాక్సర్లకు సన్నాహకం కోసం ప్రత్యేకంగా విదేశీ పర్యటనలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు, దిగ్గజ బాక్సర్లపై అవగాహన కోసం ఇటలీ, ఐర్లాండ్, కొరియా దేశాల్లో భారత బాక్సర్లను ప్రాక్టీస్ నిమిత్తం పంపించారు. జూన్ 12 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం భారత అగ్రశ్రేణి బాక్సర్లు నిఖత్ జరీన్, అమిత్ పంగల్, సిమ్రన్‌జిత్ కౌర్, లవ్లీనా బోర్గోహైన్, శివ థాపా బెల్ఫాస్ట్లో ఇటలీ జట్టుతో ద్వైపాక్షిక ట్రెయినింగ్ క్యాంపులు, ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో తలపడుతున్నారు. వీరితో పాటు ఆరు యూరోపియన్ దేశాలకు చెందిన బాక్సర్లు కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారు. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ, ఐర్లాండ్ వంటి దేశాలకు చెందిన ఎలైట్ బాక్సర్లతో మ్యాచ్‌లకు ఎలా సన్నద్ధం కావాలో అనుభవపూర్వకంగా భారత క్రీడాకారులకు తెలియజెప్పడమే ఈ పర్యటనల ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇటలీ పర్యటన తమకు గొప్ప అవకాశమని ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అమిత్ పంగల్ అన్నాడు. ‘రెండు రోజులుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. దిగ్గజ బాక్సర్లను పరిశీలించడానికి ఇది మాకు మంచి అవకాశం. ఇక్కడికి వచ్చాక మానసికంగా, ఆటపరంగా చాలా మెళుకువలు తెలుసుకున్నాం’ అని తెలిపాడు. -
‘టోక్యో’నే ఆఖరు: మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్‌కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయం వెల్లడించింది. ‘టోక్యో ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఆ మెగా టోర్నీలో భారత్‌కు పసిడి పతకం అందించడమే’అని ఆమె పేర్కొంది. కాగా, 36 ఏళ్ల మేరీకోమ్ తన 18 ఏళ్ల బాక్సింగ్‌లో భారత్‌కు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టింది. ఆరురుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి వరల్డ్ రికార్డు సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీ ఖాతాలో ఐదు ఆసియా చాంపియన్‌షిప్‌లు సైతం ఉన్నాయి. ప్రస్తుతం మేరీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతోంది. -
కూలీబిడ్డలు.. బాక్సింగ్ కింగ్‌లు
కరీంనగర్ స్పోర్ట్స్: వారంతా కూలీల బిడ్డలు. ఇల్లుగడవడమే కష్టంగా ఉన్న తరుణంలో వారి తల్లిదండ్రులు తమ పిల్లలను బాక్సర్లుగా చూడాలనుకున్నారు. మేరీకాం లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నారు.దేశానికి ఒలింపిక్ పతకం తేవాలనుకున్నారు.ప్రపంచానికి ఇండియా పంచ్ పంచ్ చూపించాలనుకుంటున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో రెండ్రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి నేపథ్యంపై కథనం.. కూలీబిడ్డ కాంస్య పతక విజేత వరంగల్ జిల్లా హన్మకొండకు సీహెచ్.దివ్య బాక్సింగ్‌లో దిట్ట. నాన్న కూలీ చేస్తుండగా అమ్మ గృహిణి. ఇప్పటి వరకు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గత సంవత్సరం పాఠశాలల జాతీయక్రీడా పోటీల్లో అద్వితీయ పోరాటపటిమ కనబరిచి కాంస్య పతకం సాధించింది. మేరీకామ్ స్ఫూర్తితో ఒలింపిక్లాంటి మెగాపోటీల్లో ప్రాతినిథ్యం వహించాలనుకుంటోంది. ఆటోడ్రైవర్ కొడుకు భాగ్యనగరంలో బాక్సింగ్‌లో రాణించి ఇండియన్ బాక్సర్‌గా పేరుసంపాదించడమే తన ఆశయమంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన వేణు. నాన్న సిటీలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. నాలుగుసార్లు జాతీయస్థాయితో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో పాల్గొని సత్తా చాడాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఖేలో ఇండియాలో కూలీకొడుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణేష్ బాక్సింగ్‌లో దిట్ట. మంథనిలోని గురుకుల కళాశాలలో చదువుతున్నాడు. ఇప్పటి వరకు 8సార్లు సత్తా చాటాడు. తండ్రి కూలీ పనిచేస్తుండగా తల్లి గృహిణి. గతేడాది జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో కరీంనగర్ నుంచి సత్తాచాటాడు. గణేష్ భవిష్యత్‌లో ఐపీఎస్ అధికారిగా సేవలందించాలనుకుంటున్నాడు. -
విజేతలు సోహన్– విక్రమ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిబిరాల్లో భాగంగా నిర్వహించిన స్పోర్ట్స్ క్విజ్‌లో బి.సోహన్–జి. విక్రమ్ దేవ్ ఆకట్టుకున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్లో భాగంగా విక్టరీ ప్లేగ్రౌండ్‌లో నిర్వహించిన ఈ పోటీలో సోహన్– విక్రమ్ దేవ్ (వీపీజీ బాక్సింగ్ టీమ్) విజేతలుగా నిలిచారు. జీహెచ్ఎంసీ రహీంపురా ప్లేగ్రౌండ్ క్రికెట్ జట్టుకు చెందిన బి. సాయివరుణ్ గుప్తా–ప్రాంజల్ ఠాకూర్ రన్నరప్‌తో సరిపెట్టుకోగా... ఎస్. అభినవ్ యాదవ్–కేఎల్వీ కార్తికేయ (వీపీజీ టేబుల్ టెన్నిస్) మూడోస్థానంలో నిలిచారు. వీరికి షాదాన్ కాలేజి ప్రొఫెసర్ మొహమ్మద్ సయీద్ బహుమతులు అందజేశారు. -
చెంప దెబ్బల ఛాంపియన్ షిప్
-
చెంపదెబ్బలను తట్టుకునే సామర్థ్యం ఉంటే చాలు..
వినడానిక వింతగా ఉన్నా చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమేనండి. చెంపదెబ్బలకూ ఒక ఛాంపియన్షిప్ ఉంది. అన్ని ఆటల పోటిల్లానే దీనికి రూల్స్ ఉంటాయి. గెలిచిన వారికి బహుమతులుంటాయి. విజేతలు పొందే బహుమతులు కూడా చిన్నవేం కాదు. వేల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. మూడే మూడు చెంపదెబ్బలు నిర్ణయిస్తాయి. ఓడెదెవెరో గెలిచేదెవరో. మరి ఈ ఛాంపియన్షిప్ విశేషాలేంటో తెలుసుకుందామా..తల్లిదండ్రులైన, సోదరులైనా, స్నేహితులైనా, బంధువులైనా....చెంప మీద ఒక్క దెబ్బ కొడితే చాలు ఎవరికైనా కోపం నషాళానికంటుతుంది. ముక్కూ మొహం తెలియనివారైతే ఇంక చెప్పేందుకేముంది. మరుక్షణం వాళ్ల చెంపకూడా ఛెళ్లుమంటుంది. కానీ రష్యాలో నిర్వహించే చెంపదెబ్బల పోటీలో మాత్రం ఎదుటివాళ్లు చెంపమీద చాచిపెట్టికొట్టినా, బాధనీ, కోపాన్నీ పంటిబిగువున ఒత్తిపెట్టి అలాగే నిలబడాలి. అలా నిలబడిగలిగినవాళ్లే ఈ టోర్నమెంట్ విజేతలుగా నిలిచి ఔరా అనిపించుకుని ఆశ్చర్యపరుస్తారు. వారాంతాల్లో ఆటవిడుపు ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారంటే ఎవరైనా ఏంచేస్తారు?వాళ్ళెవరో తమకు తెలీకపోయినా తలా ఓ పక్క చేరి నచ్చజెప్పేందుకు, సమాధానపరిచేందుకు ప్రయత్నిస్తారు. రష్యా ప్రజలు మాత్రం ఎదురుగా ఇద్దరు వ్యక్తులు చెంపలు వాయించుకుంటుంటే సరదాగా తలా ఒక్కరిని బలపరుస్తూ వారి అభిమాన పోటీదారుణ్ణి ఈలలతో, చప్పట్లతో ఉత్సాహపరుస్తారు. వారాంతపు రోజుల్లో ఆటవిడుపుకోసం ఇలా చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌ని నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వింత టోర్నీ రష్యాలోని క్రాస్నోయార్క్ పట్టణంలో నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి వారాంతపు రోజుల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. టోర్నమెంట్ అనేసరికి కంగారు పడుతుంటారు. చాలామంది పోటీదారులు. కానీ ఈ టోర్నీ మాత్రం వాటన్నింటికీ భిన్నం. పెద్దగా కసరత్తు చేయాల్సిన పని ఉండదు. ప్రత్యర్థిని చాచికొట్టేందుకు చేతుల్లో బలం, ప్రత్యర్థి కొంటే చెంపదెబ్బలను తట్టుకునే సామర్థ్యం ఉంటే చాలు, ఎవరైనా విజేతలుగా నిలవచ్చు. ఈ టోర్నమెంట్లో పాల్గొని, తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. పోటీదారులు. సైబీరియన్ పవర్ షో స్పోర్ట్స్ ఫెస్టివల్లో భాగంగా ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఏదైనా కొత్తగా వింతగా ఏ ఆట అయినా ఆడినకొద్దీ, చూసినకొద్దీ ఎప్పుడో ఒకప్పుడు బోర్‌గా అనిపిస్తుంది. ఏదైనా కాస్త భిన్నంగా ఉండేదాన్ని ఆదరిస్తారు అందరూ. అందుకే ఈ ఛాంపియన్షిప్ నిర్వాహకులు కొత్తగా జనాలను ఆకర్షించేందుకు ఏంచేయాలా అని చర్చించగా స్ఫురించిందే చెంపదెబ్బలాట. బాక్సింగ్ రింగ్‌లో ఒకరినొకరు కొట్టుకోవడం మాములే. కానీ కేవలం చెంపదెబ్బలు మాత్రమే అయితే కొత్తదనం. అందుకే రష్యాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ వింత టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఎలా కొనసాగుతుందంటే వేదిక మీద ఓ టేబుల్ ఉంటుంది. దానికి చెరో పక్క ఇద్దరు పోటీదారులు నిల్చుంటారు. ఓ కామెంటేటర్ కమ్ అంపైర్ ఉంటారు. ఈ పోటీదారులు ఇద్దరూ పరస్పరం ఒకరి చెంపను ఒకరు పగులుగొట్టాల్సి ఉంటుంది. ఎంత గట్టిగా కొట్టగలిగితే అంతగా టైటిల్‌కు చేరువవుతారు. మూడు సార్లు మాత్రమే ఛాన్స్ ఈ మూడు ఛాన్స్‌లో ఎదురుగా ఉన్న వారి చెంపను పగులుగొట్టాల్సి ఉంటుంది. ఈ మూడు చెంపదెబ్బలతో ప్రత్యర్థిని పడగొట్టేయాల్సిందే. అలా చేసిన పోటీదారుడిని విజేతగా ప్రకటిస్తారు. ఓడినా, గెలిచినా ఈ పోటీలో పాల్గొన్న అందరి గాయాలకీ ఉచితంగానే వైద్యం అందిస్తారు. ఒక్కరోజులో సెలెబ్రిటీ! సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఒక్కరోజులో ఎంతోమంది సెలెబ్రెటీలుగా మారిపోతున్నారు. పక్కింటివాళ్లకి కూడా తెలియనివాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు. అదేవిధంగా ఈ చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి వాసిలీ కామోట్క్సీ అనే 28 ఏళ్ల వ్యక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఇందులో గెలిచినందున బహుమతిగా రష్యన్ కరెన్సీలో ముప్పె వేల రూబుళ్లు అనగా మన రూపాయల్లో ముప్పైరెండు వేలను సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ టోర్నమెంట్ వీడియోలు వైరల అవడంతో ఓవర్ నైట్ స్టారయ్యాడు వాసలీ. రూల్స్ నచ్చట్లేదట! ఈ వింత పోటీగురించి సోషల్ మీడియాలో చర్చబాగానే జరుగుతోంది. ఈ ఆట రూల్స్ అందరికీ నచ్చడంలేదు. ఇంతకీ ఆ రూల్సేంటంటే ..ఇద్దరు పోటీదారులు మూడుసార్లు ఒకరి చెంప ఒకరు వాయించుకోవాలి. ఈ మూడుసార్లలో కిందపడినా, తట్టుకోలేక తుళ్లిపడినా ఎదుటివ్యక్తి గెలిచినట్టే. కొట్టడానికీ రూల్ ఉంది. కొట్టేటప్పుడు చేతివేళ్లతో పాటు కొంత మాత్రమే అరచేతిని ఉపయోగించాలి. పూర్తిగా అరచేతితో కొట్టకూడదు. అయితే ఈ సంవత్సరం విజేతగా నిలిచిన వాసిలీ బరువు 168 కిలోలు. అతని బరువే అతణ్ణి విజేతను చేసిందని కొందరి అభిప్రాయం. అన్ని ఆటల్లోలానే ఇందులోనూ బరువు కేటగిరీలు ఉంటే మరింత బాగుంటుందని కొంతమంది సలహా. -
కవల పిండాల క్యూట్ ఫైట్
-
వైరల్ వీడియో : ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు
బీజింగ్ : తోబుట్టువుల మధ్య పోట్లాట అనేది సహజం. ప్రతీ విషయానికి గొడవపడటం.. కొట్టుకోవటం కూడా కామనే. ఇదంతా బయట అంటే వారు పుట్టాక జరుగుతుంది. కానీ ఈ వీడియో చూస్తే.. తల్లి గర్భంలోనే ఈ తగదా ప్రారంభమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలలు కూడా నిండని ఇద్దరు కవలలు అమ్మ పొట్టలోనే కిక్‌బాక్సింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ కవల పిండాల దెబ్బలాటకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగో నెలల గర్భంతో ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. ఈ సమయంలో ఆమె గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్ చేస్తూ కనబడ్డారు. అక్కడే ఉన్న ఆమె భర్త దీన్నంతా వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవ్వడమే కాక అనేక ప్రశంసలు అందుకుంటుంది. ‘తల్లి గర్భంలోనే ఇలా పోట్లాడుకుంటున్నారు.. ఇక బయటకు వచ్చాక ఇంకెంత తన్నుకుంటారో’.. ‘ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
పాటతో అదరగొట్టిన మేరీకోమ్
-
మేరీ.. పంచ్‌లతోనే కాదు.. పాటతో అదరగొట్టింది!
పనాజి : ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్. ఒక ఒలింపిక్ మెడల్.. ఇది భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ గురించి మనందరికి తెలిసిన విషయం. కానీ ఆమె ఓ మంచి పాప్ సింగరని, అద్బుత గొంతులో పాటలు పాడుతుందని ఎవరికి తెలియదు. ఆమెలోని ఈ కొత్త టాలెంట్ గోవా ఫెస్ట్ 2019 ద్వారా ప్రపంచానికి తెలిసింది. ప్రచారసంస్థలు, మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ ఫెస్ట్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడల నుంచి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేరికోమ్.. వాట్సాప్.. అమెరికన్ క్లాసిక్ సాంగ్‌ను ఆలపించి ఔరా అనిపించారు. ఆమె గానంతో అందరిని మైమరిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మేరీ గాత్రానికి ముగ్దులైన నెటిజన్లు... మేరీ పంచ్‌లతోనే కాదు.. పాటతోను అదరగొట్టారు అంటూ కామెంట్ చేస్తున్నారు. -
బాక్సర్ ఘనీచాంద్ మృతి
హైదరాబాద్: జాతీయ మాజీ బాక్సింగ్ చాంపియన్, సర్వీసెస్ సీనియర్ విభాగం బాక్సింగ్ చాంపియన్ ఎస్ఏ ఘనీచాంద్ (74) గురువారం రాత్రి కన్నుమూశారు. రక్షణశాఖలో వివిధ హోదాలలో పని చేసిన ఆయన వరుసగా 17 సంవత్సరాలు సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహించి, 8 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత ఆయన గోల్కొండ బాక్సింగ్ అసోసియేషన్ స్థాపించి యువకులకు బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇతని కుమారుడు ఎజాజ్ తెలంగాణ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నాడు. ఘనీ చాంద్ అంత్యక్రియలు శుక్రవారం మ«ధ్యాహ్నం జరిగాయి. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. -
మట్టిలో మాణిక్యానికి కావాలి చేయూత
సాక్షి, కమాన్‌చౌరస్తా: తనొక సాధారణ కుటుంబానికి చెందిన యువతి కాని కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. కాని ఆర్థిక ఇబ్బందులు ఆమెను కలవరపెడుతున్నాయి. తనలోని టాలెంట్‌ను గుర్తించిన సన్నిధి ఫౌండేషన్ తమ వంతు చేయూతనిచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన కరాటే, కిక్‌బాక్సింగ్ క్రీడాకారిణి కందుల మౌనికకు సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు అండగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఆమెకు ఏషియన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం రాగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు మంగళవారం రూ.5 వేలు అందజేశారు. క్రీడల్లో రాణించి, తనకు సహకరిస్తోన్న వారి నమ్మకాన్ని నిలబెడతానని మౌనిక తెలిపింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రాధారపు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షుడు అంబాల ప్రదీప్‌రెడ్డి, పృధ్యున్నత్ తదితరులు పాల్గొన్నారు. -
తీన్మార్ పంచ్
కొత్త సీజన్‌ను భారత బాక్సర్లు పతకాల పంటతో ప్రారంభించారు. స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మొత్తం ఏడు పతకాలు సొంతం చేసుకుని అదరగొట్టారు. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్... మణిపూర్ అమ్మాయి మైస్నం మీనాకుమారి దేవి... హరియాణా బాక్సర్ అమిత్ పంగల్ ‘పసిడి పంచ్’లతో మెరిశారు. సోఫియా (బల్గేరియా): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బాక్సర్లు స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మెరిపించారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి మహిళల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. 51 కేజీల విభాగంలో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్... 54 కేజీల విభాగంలో మైస్నం మీనా కుమారి దేవి... పురుషుల 49 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత అమిత్ పంగల్ పసిడి పతకాలు గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో మంజు రాణి రజతం నెగ్గగా... సెమీఫైనల్లో ఓడిపోయిన ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. గతంలో మహిళల విభాగంలో భారత్ తరఫున మేరీకోమ్ (రజతం) ప్రదర్శనే అత్యుత్తమంగా ఉంది. మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జిల్లా అమ్మాయి నిఖత్ జరీన్ 5–0తో ఐరీష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై... మీనా కుమారి 3–2తో ఐరా విలెగాస్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గగా... మంజు రాణి 2–3తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్) చేతిలో ఓడిపోయింది. మరో టైటిల్ పోరులో అమిత్ పంగల్ 3–2తో తెమిర్తాస్ జుసుపోవ్ (కజకిస్తాన్)పై గెలిచాడు. ఐరీష్ మాగ్నోతో జరిగిన తుది పోరులో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. అవకాశం వచ్చినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. నిఖత్‌ను నిలువరించడానికి ఐరీష్ మాగ్నో రక్షణాత్మకంగా ఆడినా ఫలితం లేకపోయింది. అమర జవాన్లకు అంకితం... ఈ స్వర్ణం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితం ఇస్తున్నాను. ఫైనల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా పోరాడాను. ఆ అమ్మాయి తొలి రౌండ్లో భారత్‌కే చెందిన పింకీ జాంగ్రాను ఓడించింది. ఈ స్వర్ణం నా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానం. –నిఖత్ జరీన్ -
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలకు నిఖత్ జరీన్, ప్రసాద్
న్యూఢిల్లీ: గతేడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో మెరిసిన భారత బాక్సర్లు కొత్త సీజన్లోనూ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో భారత బాక్సర్లు మూడు అంతర్జాతీయ టోర్నీల్లో బరిలోకి దిగనున్నారు. బల్గేరియాలో జరిగే స్ట్రాండ్జా టోర్నీలో... ఆ తర్వాత ఇరాన్లో జరిగే టోర్నీలో... ఫిన్లాండ్లో జరిగే టోర్నీలో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్ట్రాండ్జా టోర్నీలో భారత్ తరఫున మహిళల విభాగంలో 10 మంది... పురుషుల విభాగంలో తొమ్మిది మంది పోటీపడుతున్నారు. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఇరాన్లో జరిగే టోర్నీలో పాల్గొనే భారత పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ ఎంపికయ్యాడు. అతను 52 కేజీల విభాగంలో పోటీపడతాడు. -
శుభమ్ శర్మపై రాహిమి గెలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్నేషనల్ బాక్సింగ్ లీగ్‌లో భారత బాక్సర్ శుభమ్ శర్మకు నిరాశ తప్పలేదు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం హోరాహోరీగా జరిగిన బౌట్లో అఫ్గానిస్తాన్ బాక్సర్ అల్లాహ్దాద్ రాహిమి విజేతగా నిలిచాడు. బౌట్ ఆసాంతం అద్భుతంగా పోరాడిన శుభమ్ చివర్లో రాహిమి ముందు తలవంచాడు. వీరిద్దరూ టైటిల్ కోసం 40 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డారు. ప్రతీ దశలోనూ ఇరువురు సమానంగా నిలవడంతో విజేతను నిర్ణయించడానికి అదనంగా మరో రెండు రౌండ్ల పాటు బౌట్‌ను కొనసాగించారు. అప్పటికే అలసిపోయిన శుభమ్ చివర్లో ఓడిపోక తప్పలేదు. ఇతర బౌట్లలో దక్షిణాఫ్రికాకు చెందిన రికర్డో హీరామన్ను గురుప్రీత్ సింగ్ నాకౌట్ చేశాడు. హర్ష్ పురోహిత్‌పై సపర్బాయ్ ఐదరోవ్ (కజకిస్తాన్) గెలిచాడు. మహిళల విభాగంలో అనిత మౌర్యపై రమణ్‌దీప్ కౌర్ కష్టంగా గెలవగా... అనహిత్ అరియా (అర్మేనియా) చేతిలో కమలా రోకా పరాజయం చవిచూసింది. -
తెలంగాణ బాక్సింగ్ లీగ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్నేషనల్ బాక్సింగ్ లీగ్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి వేదికగా జరుగుతోన్న ఈ మెగా లీగ్ తొలి సీజన్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. నగరం తొలిసారి ఆతిథ్యమిస్తోన్న ఈ లీగ్ రెండు రోజుల పాటు జరుగనుంది. బాక్సింగ్ క్రీడకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో తెలంగాణ బాక్సింగ్ సంఘం లీగ్ నిర్వహణ బాధ్యతను భుజానికెత్తుకుంది. ఇందులో భారత్‌తో పాటు కజకిస్తాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, కెన్యా, థాయ్‌లాండ్, ఇరాన్‌లకు చెందిన 14 మంది పురుష బాక్సర్లు, నలుగురు మహిళా బాక్సర్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తొలి రోజు పోటీల్లో భారత బాక్సర్ ఆసిఫ్ అసద్ నాకౌట్ విజయంతో సత్తాచాటాడు. కజకిస్తాన్‌కు చెందిన అస్కాన్పై ఆసిఫ్ గెలుపొందాడు. మరో బౌట్లో నికోలస్ వాంగపై ఆకాశ్ దీప్ సింగ్ గెలిచాడు. ఇతర బౌట్లలో పుష్కర్ భోస్లేపై నోర్బెర్టో టానో, విక్రమ్‌జీత్ సింగ్‌పై ఫిగరో మహేశ్ గెలిచారు. రూపిందర్ కౌర్, థిదరత్ యువాన్వాంగ్ల మధ్య జరిగిన పోరు డ్రా అయింది. పోటీల అనంతరం ప్రముఖ డ్రమ్ వాయిద్యకారుడు శివమణి తన బృందంతో కలిసి ప్రేక్షకులకు వినోదం పంచాడు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ బాక్సింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రొఫెషనల్ సర్క్యూట్లో బాక్సర్ వికాస్ శుభారంభం
భారత బాక్సర్ వికాస్ క్రిషన్కు ప్రొఫెషనల్ సర్క్యూట్లో శుభారంభం లభించింది. న్యూయార్క్‌లో జరిగిన తన తొలి బౌట్లో వికాస్... స్టీవెన్ అండ్రడే (అమెరికా)పై గెలుపొందాడు. విఖ్యాత బాక్సింగ్ ప్రమోటర్ బాబ్ అరుమ్కు చెందిన ‘టాప్ ర్యాంక్ ప్రమోషన్స్’తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న భారత బాక్సర్ వెల్టర్‌వెయిట్ కేటగిరీతో ప్రొఫెషనల్ కెరీర్ మొదలుపెట్టాడు. ఆరు రౌండ్ల ఈ బౌట్ కేవలం రెండు రౌండ్లలోనే ముగిసింది. నిర్వాహకులు వికాస్ ప్రత్యర్థి అండ్రడే సాంకేతికంగా నాకౌట్ అయినట్లు ప్రకటించారు. -
బాక్సర్ వరుణ్!
బాక్సర్‌గా హీరో వరుణ్ తేజ్ హైట్ అండ్ వెయిట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఫుట్‌బాల్, క్రికెట్.. ఇలా విభిన్న రకాల స్పోర్ట్స్ ఉండగా ఒక్క బాక్సింగ్‌నే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నామనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. వరుణ్ తేజ్ హీరోగా స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు శ్రీనుౖ వెట్ల దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్’, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘తొలిప్రేమ’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారట కిరణ్. ‘మిస్టర్, తొలిప్రేమ’ ఈ రెండు చిత్రాల్లో వరుణ్ తేజ్‌నే హీరో అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ (అల్లు బాబీ) ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తారని సమాచారం. రీసెంట్గా ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పీహెచ్’ సినిమాలో అంతరిక్షంలోకి వెళ్లిన వరుణ్ ఇప్పుడు బాక్సింగ్ రింగులోకి దిగనున్నారన్నమాట. ఇక వెంకటేశ్‌తో కలిసి వరుణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. -
సొహైల్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: భారత పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్లో హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సొహైల్ ఆకట్టుకున్నాడు. అస్సాంలో జరిగిన ఈ టోర్నీ అండర్–17 బాలుర 75–80 వెయిట్ కేటగిరీలో సొహైల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌లో సొహైల్ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. పెద్దపల్లి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మొహమ్మద్ సొహైల్ రాణించాడు. -
బాసు.. భలే పోజు!
ఇక్కడున్న ఫొటో చూశారుగా! సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సింగ్ చేస్తున్నట్లు పోజిచ్చారు. పక్కనున్నది ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మణిపూర్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ అని అందరికీ తెలుసు. కానీ వీళ్లు ఎందుకు కలిశారు? సినిమా కోసమా? అనే ఆలోచనలు తగవు. రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ చెన్నైలో ఓ ఈవెంట్‌ను నిర్వహించారట. ఆ ఈవెంట్‌కి వెళ్లిన మేరికోమ్ అలా రజనీకాంత్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రజనీ అభిమానులు బాసు.. భలే పోజు అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ సినిమా ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల అవుతుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్ టాక్. -
బస్తీల నుంచే బడా బాక్సర్లు
ముంబై: మురికివాడల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే పెద్ద పెద్ద బాక్సర్లుగా ఎదిగారని మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ చెప్పాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) కుమిటే–1 లీగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారి భారత్‌కు విచ్చేసిన ఈ బాక్సింగ్ దిగ్గజం మీడియాతో మాట్లాడుతూ ‘నాతో సహ చాలా మంది బాక్సర్లు మురికివాడల నుంచి కష్టపడి వచ్చినవాళ్లే! వాళ్లంతా ఇప్పుడు మేటి బాక్సర్లయ్యారు. ప్రస్తుతమున్న టాప్ బాక్సర్లు కూడా బస్తీలకు చెందిన వారే’ అని అన్నాడు. 52 ఏళ్ల మాజీ బాక్సర్ 2005లో రిటైరయ్యాడు. అతను 1988లో 20 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి యువ బాక్సర్‌గా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో 50 విజయాలు సాధించగా... ఇందులో 44 నాకౌట్లుండటం విశేషం. కేవలం ఆరు బౌట్లలో మాత్రం ఓటమి పాలయ్యాడు. గొప్ప విజయాలే కాకుండా వివాదాలూ టైసన్ వెంట నడిచాయి. 1991లో ‘మిస్ బ్లాక్ రోడ్ ఐలాండ్’ డిజైరీ వాషింగ్టన్‌పై అత్యాచారం చేసి ఆరేళ్ల శిక్షకు గురయ్యాడు. అనంతరం 1997లో ఇవాండర్ హోలీఫీల్డ్‌తో జరిగిన బౌట్లో హోలీఫీల్డ్ చెవిని కొరికి డిస్క్వాలిఫై అయ్యాడు. భారత పర్యటనలో అతను ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా పేరొందిన ధారవిని, అలాగే ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించాల్సి ఉంది. ఈ సందర్భంగా టైసన్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘నేనూ పేదవాణ్నే. మురికివాడలోనే పుట్టిపెరిగా. వాడల నుంచి బయటపడాలనే లక్ష్యంతోనే కష్టపడ్డాను. అనుకున్నది సాధించి ఇప్పుడు ఈ స్థితికి ఎదిగాను. ఎవరైనా సరే చెమటోడ్చితే అక్కడ్నించి బయటపడొచ్చు. ఎంతో బాగా ఎదగొచ్చు’ అని టైసన్ చెప్పాడు. తనకు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్అంటే చాలా ఇష్టమన్నాడు. లాస్ వెగాస్‌లో జరిగే యూఎఫ్‌సీ పోటీలను తిలకించేవాడినని చెప్పుకొచ్చాడు. క్రికెట్ గురించి మాట్లాడుతూ ఈ ఆట తనకు తెలుసని బేస్బాల్లా ఉంటుందని, బ్యాట్‌తో బంతిని బాదే ఆటే క్రికెట్ అని చెప్పాడు. ఎమ్ఎమ్ఏ కుమిటే–1 లీగ్‌లో భాగంగా శనివారం భారత్, యూఏఈ జట్ల మధ్య తొలి ఫైట్ జరగనుంది. -
చందనకు రెండు స్వర్ణాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు పి. చందన, మైత్రి సత్తా చాటారు. ఇటలీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ భారత్‌కు 3 పతకాలను అం దించారు. మంచిర్యాలకు చెందిన పదేళ్ల చందన రెండు స్వర్ణాలను కైవసం చేసుకోగా... నగరానికి చెందిన మైత్రి కాంస్యంతో ఆకట్టుకుంది. మ్యూజికల్ ఫామ్, మ్యూజికల్ వెపన్ ఫామ్ విభాగాల్లో చందన విజేతగా నిలిచి పసిడి పతకాలను అందుకుంది. క్యాడెట్ కేటగిరీలో మైత్రి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. సోమవారం భారత్‌కు చేరుకున్న వీరిద్దరూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు వీరిద్దరినీ అభినందించారు. -
ఓవరాల్ చాంపియన్ ఏవీ కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దోమలగూడ ఏవీ కాలేజి జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్లో అన్వర్ ఉల్ ఉలూమ్, మల్లేపల్లి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా... సిద్ధార్థ డిగ్రీ కాలేజి జట్టు మూడోస్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన సూపర్ హెవీ (91 ప్లస్) వెయిట్ కేటగిరీలో అన్వర్ ఉల్ ఉలూమ్‌కు చెందిన మొహమ్మద్ మోసిన్ విజేతగా నిలిచాడు. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి వి. మాన్విత్ రెడ్డి రెండోస్థానాన్ని దక్కించుకోగా, ఎస్వీజీ డిగ్రీ కాలేజికి చెందిన బి. సాయికుమార్ మూడోస్థానంలో నిలిచాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామవిద్య కాలేజి ప్రిన్సిపాల్ రాజేశ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు లైట్ ఫ్లయ్ (46–49 కేజీలు): 1. మొహమ్మద్ రయీస్, 2. పి. రాజు, 3. మొహమ్మద్ రోషన్, 3. ఎం. శ్రీనివాస్ నాయక్. ఫ్లయ్ వెయిట్ (49–52 కేజీలు): 1. డి. అనిల్, 2. పి. ఉపేందర్, 3. టి. జీవన్, 3. హస్జీత్. బాంటమ్ (52–56 కేజీలు): 1. కె. రాజు, 2. పి. మహేందర్, 3. హబీబ్ ఉల్ రహమాన్, 3. అల్తాబ్ అహ్మద్. లైట్ వెయిట్ (56–60 కేజీలు): 1. మొహమ్మద్ ముదస్సర్ అహ్మద్, 2. పి. సురేశ్, 3. ఎం. రోహిత్, 3. జి. నీరజ్ కుమార్. లైట్ వెల్టర్ (60–64 కేజీలు): 1. ఆర్. పృథ్వీరాజ్, 2. బి. శ్రావణ్, 3. ఉదయ్ కిశోర్ యాదవ్, 3. ఖాగి మొహమ్మద్ సహబుద్దీన్. వెల్టర్ (64–69 కేజీలు): 1. జి. కైలాశ్ రావు, 2. కె. అక్షయ్, 3. టి. అజయ్, 3. ఎన్. అభిషిత్. మిడిల్ వెయిట్ (69–75 కేజీలు): 1. జి. అనిరుధ్, 2. ఎం. దేవానందం, 3. శ్రీకాంత్, 3. మొహమ్మద్ జకీయుద్దీన్. లైట్ హెవీ (75–81 కేజీలు): 1. ఎం. సాయి కల్యాణ్ గౌడ్, 2. టి. విశాల్ చంద్ర, 3. ఆర్. వరుణ్ రెడ్డి, 3. ఎ. దీపక్ సాయి. హెవీ వెయిట్ (81–91 కేజీలు): 1. డి. ఆకాశ్ రెడ్డి, 2. ముజహీత్ ఖాన్, 3. కె. సన్నీ, 3. మొహమ్మద్ అవాజ్ ఖాన్. -
గ్లోవ్స్ కొనడానికి కూడా డబ్బుల్లేవు..
హరియాణా:ఆసియా క్రీడల్లో భారత యువ బాక్సర్ అమిత్ పంఘాల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్ చాంపియన్ దుస్మతోవ్‌ను ఓడించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు. ఆసియా క్రీడల 49 కిలోల లైట్ ఫ్లై విభాగంలో అమిత్ 3-2తో విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. అయితే, అమిత్ ఈ దశకు చేరుకోవడానికి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అతని క్రీడా పయనం అంతా సులువుగా ఏమీ సాగలేదు. హరియాణాలో మైనా గ్రామంలో జన్మించిన అమిత్ విజయాల వెనుక అతని అన్న అజయ్ త్యాగమే ప్రధానంగా కనిపిస్తోంది. బాక్సింగ్‌లో రాణిస్తున్న సమయంలో అతడి సోదరుడు అజయ్.. తమ్ముడు అమిత్ కోసం కెరీర్‌ను త్యాగం చేశాడు. వారిద్దరూ క్రీడల్లో ముందుకు సాగేందుకు వారి పేదరికం అడ్డుపడింది. 12 ఏళ్ల క్రితం అజయ్, అమిత్.. ఇద్దరూ హరియాణాలోని రోహ్తక్ సమీపంలోని మైనా గ్రామంలోని ప్రైవేట్ అకాడమీలో బాక్సింగ్ శిక్షణ కోసం చేరారు. కొన్నాళ్లకు ఆర్థిక పరిస్థితుల కారణంగా బాక్సింగ్ నుంచి అజయ్ తప్పుకున్నాడు. కుటుంబ పోషణ కోసం ఆర్మీలో చేరాడు. అనంతరం అమిత్ బాక్సింగ్‌ను కొనసాగించాడు. తన త్యాగం వృథాగా పోలేదని గతేడాది ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో అమిత్ కాంస్యం గెలవడంతో తనకు ఎంతో సంతోషాన్నించిందని అజయ్ తెలిపాడు. తాజాగా ఆసియా క్రీడల్లో అమిత్ స్వర్ణం గెలిచి హీరోగా నిలవడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు. త్యాగానికి మంచి ప్రతిఫలం లభించిందని పేర్కొన్నాడు. ‘మా ఇద్దరికీ బాక్సింగ్ గ్లోవ్స్ కొనివ్వడానికి కూడా మా నాన్న వద్ద డబ్బులు ఉండేవి కావు. ఒట్టి చేతులతోనే శిక్షణ తీసుకోవాల్సి వచ్చేది. అమిత్ అలానే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. మరొకవైపు బాక్సింగ్‌లో రాణించాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అది ఖర్చుతో కూడుకున్నది. నా తమ్ముడైనా బాక్సింగ్‌లో రాణించాలని నేను త్యాగం చేశాను. ఆర్మీలో చేరాను' అని అజయ్ అనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు. భారత్ పసిడి పంచ్ -
ఏషియన్ గేమ్స్: భారత్ పసిడి పంచ్
-
భారత్ అత్యుత్తమ ప్రదర్శన
బాక్సింగ్‌లో కుర్రాడు అమిత్ అదరగొట్టగా... బ్రిడ్జ్‌లో పెద్దోళ్లు ప్రణబ్ బర్దన్, శివ్‌నాథ్ సర్కార్ చేయి తిరగడంతో జకార్తా ఏషియాడ్‌ను భారత్ తమ అత్యధిక పతకాల రికార్డుతో ముగించింది. స్క్వాష్‌లో భారత మహిళల జట్టు రజతం... పురుషుల హాకీలో కాంస్యం సాధించడం ఊరటనిచ్చాయి. శనివారంతో మన ఆటగాళ్లు పాల్గొనే ఈవెంట్లు పూర్తికాగా... మొత్తం 15 స్వర్ణాలు ఖాతాలో చేరాయి. ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి (1951) ఆసియా క్రీడల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ 15 పసిడి పతకాలు సాధించడం విశేషం. దీంతోపాటు 24 రజతాలు, 30 కాంస్యాలతో మొత్తం 69 పతకాలు నెగ్గి ఆసియా క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసి అభిమానులకు అమితానందం కలిగించింది. నేడు జరిగే ముగింపు వేడుకలతో జకార్తా ఏషియాడ్‌కు తెర పడనుంది. జకార్తా: బరిలో దిగబోతున్నది ఫైనల్ బౌట్... ప్రత్యర్థి రియో ఒలింపిక్స్ చాంపియన్, ఆసియా విజేత... ఇటు చూస్తే 22 ఏళ్ల కుర్రాడు... ఇటీవలే అతడి చేతిలో ఓటమి పాలయ్యాడు! పైగా తొలిసారిగా ఏషియాడ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు! ఈ సమీకరణాలన్నీ చూస్తే ఆ యువకుడు చిత్తుగా ఓడిపోయి ఉండాలి.! కానీ, అంతా తారుమారైంది. అద్భుతం జరిగింది. స్వర్ణం భారత్ సొంతమైంది. దీనంతటినీ సాధించింది హరియాణా బాక్సర్ అమిత్ పంఘాల్. 49 కేజీల విభాగంలో శనివారం జరిగిన తుది పోరులో అతడు 3–2 తేడాతో హసన్‌బోయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను మట్టికరిపించి రింగ్‌లో ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి బంగారు పతకం అందించాడు. తేలిపోతాడనుకుంటే... ఫైనల్లో చురుకైన వ్యూహం, వేగం, చక్కటి డిఫెన్స్, దూకుడుతో పాటు ఎలాంటి తప్పులు చేయకుండా అమిత్... దుస్మతోవ్ ఆట కట్టించాడు. ఓవైపు ప్రత్యర్థికి చిక్కకుండా చూసుకుంటూనే బలమైన పంచ్‌లు విసిరాడు. సహజంగా ఎదురు దాడితో దెబ్బతీసే దుస్మతోవ్... అమిత్ జోరుముందు ఆ పనీ చేయలేకపోయాడు. చివరకు వచ్చేసరికి పూర్తిగా అలసిపోయాడు. దీంతో అమిత్‌ను విజయం వరించింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో దుస్మతోవ్ చేతిలో పరాజయానికి బదులు తీర్చుకున్నా. కోచ్‌లు నన్ను బాగా సిద్ధం చేశారు. ఇంగ్లండ్‌లో శిక్షణ, భారత్‌లో సన్నాహక శిబిరంలో పాల్గొనడం ఉపయోగపడింది’ అని అమిత్ అన్నాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన అమిత్... కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచాడు. ఈ ఏషియాడ్‌లో బాక్సింగ్‌లో భారత్‌కు రెండు పతకాలు (అమిత్ స్వర్ణం, వికాస్ కాంస్యం) లభించాయి. పురుషుల హాకీ జట్టుకు కాంస్యం డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగి... గోల్స్ వర్షంతో ప్రత్యర్థిని బెంబేలెత్తించి... సెమీస్‌లో మలేసియాపై చతికిలపడిన భారత పురుషుల హాకీ జట్టు... వర్గీకరణ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌పై చక్కటి విజయంతో ఏషియాడ్‌లో కాంస్యం నెగ్గి పరువు దక్కించుకుంది. ఆట ఆరంభంలో ఆకాశ్‌దీప్ సింగ్ (3వ ని.లో)... ముగింపులో హర్మన్‌ప్రీత్ సింగ్ (50వ ని.లో) మెరవడంతో శనివారం ఇక్కడ జరిగిన పోటీలో శ్రీజేష్ సేన 2–1తో చిరకాల ప్రత్యర్థిని ఓడించింది. పాక్ తరఫున అతీఖ్ (52వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మరోవైపు ఫైనల్లో జపాన్ ‘షూటౌట్’లో 3–1తో మలేసియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈసారి చేజారనీయలేదు... సెమీస్‌లో ఆఖరి నిమిషంలో ఆధిక్యం చేజార్చుకుని సడెన్ డెత్ వరకు వెళ్లి ఓటమి మూటగట్టుకున్న భారత్... పాక్‌పై మాత్రం పట్టు జారనీయలేదు. ప్రారంభంలోనే రెండు అవకాశాలు సృష్టించుకుంది. 3వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ్ ఇచ్చిన పాస్‌ను ఆకాశ్‌దీప్... ప్రత్యర్థి కీపర్ ఇమ్రాన్ బట్‌ను తప్పిస్తూ గోల్ పోస్ట్‌లోకి పంపి ఆధిక్యం అందించాడు. దీనికి స్పందనగా ఐదో నిమిషంలోనే పాక్ గోల్ చేసినంత పనిచేసింది. అయితే, సమీక్షలో అతీఖ్ కొట్టిన షాట్ గోల్ లైన్‌ను దాటలేదని తేలింది. టీమిండియా ఆధిపత్యంతోనే మొదటి క్వార్టర్ ముగిసింది. రెండో క్వార్టర్లో వరుస దాడులతో పాక్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. 39వ నిమిషంలో పాక్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇర్ఫాన్ గోల్ చేయలేకపోయాడు. చివరిదైన నాలుగో క్వార్టర్లో భారత్ ప్రత్యర్థి శిబిరంలోకి పదేపదే చొచ్చుకెళ్లింది. 50వ నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్ లభించగా... డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ తడబాటు లేకుండా నెట్లోకి పంపాడు. మరో రెండు నిమిషాలకే అబుబకర్ నుంచి పాస్ అందుకున్న అతీఖ్ పాక్ ఖాతా తెరిచాడు. ఈ పరిస్థితుల్లో చివర్లో గోల్స్ సమర్పించుకునే బలహీనతను అధిగమిస్తూ శ్రీజేష్ సేన... పట్టుదలతో ఆడి పాక్‌ను నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది. స్క్వాష్‌లో రజతమే మహిళల టీమ్ స్క్వాష్ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాపై సంచలన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్లో హాంకాంగ్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకంది. జోష్నా చినప్ప, దీపిక పల్లికల్, సునయన కురువిల్లా, తన్వీ ఖన్నాలతో కూడిన భారత మహిళల జట్టు తుది సమరంలో 0–2తో హాంకాంగ్ చేతిలో ఓడింది. మొదటి మ్యాచ్‌లో సునయన 8–11, 6–11, 12–10, 3–11తో జె లక్ హో చేతిలో .... రెండో మ్యాచ్‌లో జోష్నా చినప్ప 3–11, 9–11, 5–11తో వింగ్ చీ అన్నీ చేతిలో ఓడిపోయారు. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్ నిర్వహించలేదు. -
ఏషియన్ గేమ్స్‌లో భారత్ పసిడి పంచ్
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో బాక్సింగ్‌లో భారత్ పంచ్ అదిరింది. శనివారం జరిగిన పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. ఫలితంగా భారత్ పతకాల సంఖ్య 67కు చేరింది. దాంతో ఈ క్రీడల చరిత్రలోనే భారత్ అత్యధిక పతకాలను సాధించినట్లయ్యింది. 2010 గ్వాంగ్జూ ఏషియాడ్‌లో భారత్ అత్యధికంగా 65 పతకాలు సాధించగా... జకార్తా క్రీడల్లో ఆ రికార్డు కూడా తెరమరుగైంది. ఇప్పటివరకూ భారత్ 15 స్వర్ణ పతకాలు, 23 రజతాలు, 29 కాంస్యాలను సాధించింది. అంతకుముందు జరిగిన బ్రిడ్జ్ ఈవెంట్లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
బాక్సింగ్: పురుషుల 49 కేజీల ఫైనల్ (అమిత్ గీహసన్బాయ్; మ.గం.12.30 నుంచి). బ్రిడ్జ్: పురుషుల పెయిర్ ఫైనల్–2; మహిళల పెయిర్ ఫైనల్–2; మిక్స్డ్ పెయిర్ ఫైనల్–2 ఉ.గం.8.30 నుంచి). పురుషుల హాకీ: భారత్గీపాకిస్తాన్ కాంస్య పతక పోరు (సా.గం.4 నుంచి). స్క్వాష్: మహిళల టీమ్ ఫైనల్ (భారత్గీహాంకాంగ్; మ.గం.1.30 నుంచి). సోనీ టెన్–2, టెన్–3, సోనీ ఈఎస్పీఎన్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సాక్షి పసిడి పంచ్
బుడాపెస్ట్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సాక్షి (57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్ (క్రొయేషియా)పై సాక్షి విజయం సాధించింది. మనీష (64 కేజీలు), అనామిక (51 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. డెస్టినీ గార్సియా (అమెరికా) చేతిలో అనామిక; గెమ్మా (ఇంగ్లండ్) చేతిలో మనీష ఓటమి పాలయ్యారు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 2 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించారు. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
అథ్లెటిక్స్: మహిళల లాంగ్‌జంప్ ఫైనల్ (నీనా వరాకిల్, జేమ్స్ నయన; సా.గం.5.10 నుంచి); పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్; సా.గం.5.15 నుంచి); మహిళల 400 మీ. హర్డిల్స్ ఫైనల్ (జువానా ముర్ము, అను రాఘవన్; సా.గం.5.15 నుంచి), పురుషుల 400 మీ. హర్డిల్స్ ఫైనల్ (సంతోష్, ధరున్; సా.గం.5.30 నుంచి), పురుషుల హైజంప్ ఫైనల్ (చేతన్; సా.గం.5.30 నుంచి); మహిళల 3 వేల మీ. స్టీపుల్‌చేజ్ ఫైనల్ (సుధా సింగ్, చింతా; సా.గం.5.45 నుంచి); పురుషుల 3 వేల మీ. స్టీపుల్‌చేజ్ ఫైనల్ (శంకర్‌లాల్; సా.గం.6 నుంచి). బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (సైనా వర్సెస్ తై జు యింగ్, సింధు వర్సెస్ యామగుచి, ఉ.గం.10.30 నుంచి) బాక్సింగ్: పురుషుల 49 కేజీలు (అమిత్ వర్సెస్ ఎన్ఖమండఖ్, సా.గం.5.15 నుంచి), పురుషుల 56 కేజీలు (హుసాముద్దీన్ వర్సెస్ అమర్, సా.గం. 6.15 నుంచి), పురుషుల 64 కేజీలు (ధీరజ్ వర్సెస్ కుబషేవ్; సా.గం.7 నుంచి), పురుషుల 75 కేజీలు (వికాస్ వర్సెస్ తన్వీర్). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
అథ్లెటిక్స్: మహిళల 400 మీ. హర్డిల్స్ (జువానా ముర్ము; ఉ. గం.9 నుంచి); పురుషుల 400 మీ. హర్డిల్స్ (సంతోష్, ధరున్ అయ్యాసామి; ఉ.గం. 9.30 నుంచి); మహిళల 100 మీ. సెమీఫైనల్ (ద్యుతీ చంద్; సా. గం.5 నుంచి); పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్ (శ్రీ శంకర్; సా. గం.5.10 నుంచి); మహిళల 400 మీ. ఫైనల్ (హిమదాస్, నిర్మల; సా.గం.5.30 నుంచి); పురుషుల 10 వేల మీ. ఫైనల్ (లక్ష్మణన్; సా. గం.5.50 నుంచి) ఆర్చరీ: మహిళల కాంపౌండ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (సా. గం.12.10 నుంచి) బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (సైన్ఠారచనోక్); (సింధ్ఠుజిందాపొల్; ఉ. గం.11.30 నుంచి) బాక్సింగ్: పురుషుల 60 కేజీలు (శివ థాపా–జున్ షాన్; సా. గం.5.45 నుంచి); పురుషుల 69 కేజీలు (మనోజ్ కుమార్ఠ్అబ్దురక్మనొవ్; మ. గం.2.15 నుంచి); మహిళల 51 కేజీలు (సర్జుబాలాదేవి ్ఠమదినా గఫరొకొవా; మ. గం. 3 నుంచి) షూటింగ్: స్కీట్ మహిళల, పురుషుల క్వాలిఫయింగ్, ఫైనల్స్ (రష్మీ రాథోడ్, గణెమత్ షెఖాన్, అంగద్ వీర్ సింగ్ బాజ్వా, షీరాజ్ షేక్; ఉదయం 6.30 నుంచి 2.30 వరకు) పురుషుల హాకీ: పూల్ ‘ఎ’లో దక్షిణ కొరియాతో భారత్ మ్యాచ్ (సా. గం.4.30 నుంచి). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
రోల్ మోడల్.. మేరీకోమ్
ఆ అమ్మాయి పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్‌లో రాణిస్తోంది. తండ్రి బాటలో నడుస్తూ... తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది.ఆమే సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న హర్మీత్ సేఠి. రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంగెలుచుకున్న హర్మీత్... బెస్ట్ సైంటిఫిక్ బాక్సర్ అవార్డు సొంతంచేసుకుంది. రాంగోపాల్‌పేట్: తల్లిదండ్రుల సహకారం, బాక్సింగ్ కోచ్ ప్రోత్సాహంతో హర్మీత్ సేఠి బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. మారేడుపల్లికి చెందిన హర్మీత్ తండ్రి హర్మీందర్ సింగ్ కూడా బాక్సర్. ఆయన గతంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. అలాగే బాడీ బిల్డింగ్‌లో మిస్టర్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం బాక్సింగ్ కోచ్‌గా, ఫిటనెస్ ట్రైనర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి బాటలో పయణిస్తున్న హర్మీత్... బాక్సింగ్‌పై ఆసక్తితో 2016లో జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేరింది. అక్కడ కోచ్ కృష్ణ దగ్గర శిక్షణ తీసుకున్న ఆమె అనేక పతకాలు, అవార్డులు సొంతం చేసుకుంది. 2017లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో నిర్వహించిన అండర్–17 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇప్పటికీ మారేడుపల్లిలోని నెహ్రూనగర్ పార్కులో జీహెచ్ఎంసీ కోచ్ కృష్ణ దగ్గరే శిక్షణ తీసుకుంటోంది. జాతీయపోటీలకు... తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆగస్టు 13–15 వరకు ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్స్ గర్ల్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించింది. ఇందులో హర్మీత్సేఠి ఈ ఏడాది బెస్ట్ సైంటిఫిక్ బాక్సర్ అవార్డు అందుకుంది. అంతేకాకుండా 54 కిలోల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకంసాధించింది. దీంతో ఆమె జాతీయ సబ్ జూనియర్స్చాంపియన్షిప్కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 2–8 వరకు నాగ్‌పూర్‌లో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది. రోల్ మోడల్.. మేరీకోమ్ బాక్సింగ్ రాణి మేరీకోమ్ నా రోల్ మోడల్. మేరీకోమ్‌లా నేనూ భారత్‌కు పతకాలు సాధించి పెట్టాలనేది నా కోరిక. చిన్నప్పటి నుంచే నాకు బాక్సింగ్ అంటే ఇష్టం. అందుకే ఇందులోకి వచ్చాను. నా తల్లిదండ్రులు, కోచ్ కృష్ణ గారు నన్నెంతోప్రోత్సహిస్తున్నారు. – హర్మీత్ సేఠి -
హుసాముద్దీన్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. శనివారం జర్మనీలోని హాలె నగరంలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన మదన్ లాల్‌పై హుసాముద్దీన్ గెలుపొందాడు. మదన్ లాల్‌కు రజతం దక్కింది. 52 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన మరో బాక్సర్ గౌరవ్ సోలంకి పసిడి పతకం గెలిచాడు. ఫైనల్లో క్యూబా బాక్సర్ అలెజాండ్రో మెరెన్సియోపై నెగ్గాడు. సెమీస్‌లో ఓడిన అమిత్ ఫంగల్ (49 కేజీలు), ధీరజ్ (64 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు మంగోలియాలో జరుగుతోన్న ఉలాన్బాటర్ కప్ బాక్సింగ్ టోర్నీలో... పురుషుల విభాగంలో మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), హిమాన్షు శర్మ (49 కేజీలు), ఇతాష్ ఖాన్ (56 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా (57 కేజీలు), లవ్లీనా బోర్గోహెయిన్ (69 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. -
సెమీస్‌లో హుసాముద్దీన్
న్యూఢిల్లీ: కెమిస్ట్రీ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కే జీలు) సెమీఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జర్మనీలో జరిగిన క్వార్టర్స్‌లో హుసాముద్దీన్ 5–0తో అల్వాడి (జోర్డాన్)పై విజయం సాధించాడు. హుసాముద్దీన్‌తో పాటు మదన్ (56 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు)లు కూడా సెమీస్‌కు చేరారు. మరోవైపు ఉలాన్బాటర్ కప్ బాక్సింగ్ టోర్నీలో శివ థాపా (60 కేజీలు), మన్దీప్ (69 కేజీలు), వాన్‌లింపుయా (75 కేజీలు), ఇతాష్ ఖాన్ (56 కేజీలు) సెమీస్‌కు అర్హత సాధించారు.