
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ తొలి క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించారు. ఈ టోర్నీ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12 వరకు ఇటలీలో జరుగుతుంది. తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 29 ఏళ్ల హుసాముద్దీన్ గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో, 2022 ఆసియా చాంపియన్‌షిప్ లోనూ కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు.
భారత పురుషుల జట్టు: దీపక్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), శివ థాపా (63.5 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు), లక్ష్య చహర్ (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు), నరేందర్ (ప్లస్ 92 కేజీలు). మహిళల జట్టు: జాస్మిన్ (60 కేజీలు), అంకుశిత బోరో (66 కేజీలు).