పారిస్ ఒలింపిక్స్ 2024లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. మహిళల బాక్సింగ్ పోటీల్లో ఓ బాక్సర్ లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైన ప్రత్యర్ధి చేతిలో ఓటమిపాలైంది. వివరాల్లోకి వెళితే.. అల్జీరియాకు చెందిన ఇమేన్ ఖెలిఫ్, ఇటలీకి చెందిన ఏంజెలా కారిని 66 కేజీల ప్రిలిమినరీ రౌండ్‌లో తలపడ్డారు. ఈ గేమ్‌లో ఖెలిఫ్ కేవలం 46 సెకెన్లలో విజయం సాధించింది. ఖెలిఫ్ పిడిగుద్దుల ధాటికి ఏంజెలా కారిని ముక్కు విరిగినంత పనై, బౌట్ నుంచి నిష్క్రమించింది. కారిని బౌట్ నుంచి వైదొలగడానికి ముందు రెండుసార్లు ఆమె హెడ్ సేఫ్టీ తొలగిపోయింది.
Today, Angela Carini had her Olympics dreams shattered by Imane Khelif, a male boxer.
It is suspected that he BROKE HER NOSE.
Don’t let this pass quietly. MEN SHOULD NOT BE ALLOWED TO BEAT WOMEN FOR SPORT.
SAVE WOMEN’S SPORTS. pic.twitter.com/i5GMdgWrwb— Hazel Appleyard (@HazelAppleyard_) August 1, 2024
ఖెలిఫ్ రెండు పర్యాయాలు బలంగా కారిని తల భాగంపై అటాక్ చేసింది. ముక్కులో తీవ్రమైన నొప్పి రావడంతో బౌట్ నుంచి వైదొలిగినట్లు కారిని గేమ్ అనంతరం వివరించింది. కారిని నొప్పితో విలవిలలాడుతూ కన్నీటిపర్యంతమైంది. గేమ్ అనంతరం ఆమె ఖెలిఫ్‌కు కరచాలనం కూడా చేయలేదు.
The moment the Olympics died. pic.twitter.com/S0qK8Jc8iw
— Bill Moon (@BigBillMoon) August 1, 2024
కాగా, కారినిని తీవ్రంగా గాయపరిచి క్షణాల్లో గేమ్‌ను గెలిచిన ఖెలిఫ్.. లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమై 2023 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఖెలిఫ్ వివాదాల నడుమ పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్ధిని తీవ్రంగా గాయపరిచి మ్యాచ్‌ను గెలిచింది. మగ లక్షణాలున్న బాక్సర్ చేతిలో ఓటమి తర్వాత కారినిపై నెటిజన్లు సానుభూతి చూపిస్తున్నారు. కారినికి అన్యాయం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment