
పారిస్ ఒలింపిక్స్ మహిళల 75 కేజీల విభాగం బాక్సింగ్ పోటీల్లో భారత స్టార్ బాక్సర్, ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్ ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన లి క్యియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమిపాలైంది.
లవ్లీనా ఓటమితో బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. ఒక్క పతకం కూడా లేకుండానే భారత బాక్సర్ల బృందం నిరాశపర్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment