Lovlina Borgohain
-
Paris Olympics 2024 Today Schedule: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే
ప్యారిస్ ఒలింపిక్స్‌లో పదో రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే..రెజ్లింగ్మహిళల 68 కేజీల ఫ్రీస్టయిల్ ప్రిక్వార్టర్స్: నిషా దహియా వర్సెస్ సోవా రిజ్కో (ఉక్రెయిన్) (సాయంత్రం గం. 6:30 నుంచి)టెబుల్ టెన్నిస్ మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్: భారత్ వర్సెస్ రొమేనియా (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)సెయిలింగ్ మహిళల డింగీ రేసులు: (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). పురుషుల డింగీ రేసులు: (సాయంత్రం గం. 6:10 నుంచి) అథ్లెటిక్స్మహిళల 400 మీటర్ల పరుగు తొలి రౌండ్: కిరణ్ పహల్ (హీట్ 5) (మధ్యాహ్నం గం. 3:57 నుంచి). పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ తొలి రౌండ్: అవినాశ్ సాబ్లే (హీట్ 2) (రాత్రి గం. 10:50 నుంచి)బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక పోరు: లక్ష్యసేన్ వర్సెస్ లీ జీ జియా (మలేసియా) (సాయంత్రం గం. 6:00 షూటింగ్స్కీట్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్: మహేశ్వరి చౌహాన్ఠ్అనంత్ జీత్ సింగ్ నరుకా (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ఫైనల్ (అర్హత సాధిస్తే): సాయంత్రం గం. 6:30 నుంచి. లవ్లీనా పంచ్ సరిపోలేదు విశ్వక్రీడల్లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. ఆరుగురు బాక్సర్లతో పారిస్‌లో అడుగు పెట్టిన భారత బృందం.. రిక్త హస్తాలతో తిరిగి రానుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహైన్ ఈసారి ఆకట్టుకోలేకపోయింది. ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ లవ్లీనా 1–4తో లీ కియాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. బౌట్ ప్రారంభం నుంచే చైనా బాక్సర్ లెఫ్ట్ హుక్స్‌తో విరుచుకుపడగా.. వాటిని తప్పించుకుంటూ లవ్లీనా కొన్ని మంచి పంచ్‌లు విసిరింది. అయినా తొలి రౌండ్ కియాన్‌కు అనుకూలంగా ఫలితం వచి్చంది. ఆ తర్వాత లవ్లీనా పుంజుకునేందుకు ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. పంచ్‌ల ధాటి నుంచి నేర్పుగా తప్పించుకున్న కియాన్... కీలక సమయాల్లో జాబ్స్, హుక్స్‌తో పైచేయి సాధించింది. భారత్ నుంచి పారిస్ క్రీడలకు ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించగా.. అందరూ క్వార్టర్ ఫైనల్లోపే పరాజయం పాలయ్యారు. -
Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా ఓటమి.. ముగిసిన భారత్ పోరాటం
పారిస్ ఒలింపిక్స్ మహిళల 75 కేజీల విభాగం బాక్సింగ్ పోటీల్లో భారత స్టార్ బాక్సర్, ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్ ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన లి క్యియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమిపాలైంది. లవ్లీనా ఓటమితో బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. ఒక్క పతకం కూడా లేకుండానే భారత బాక్సర్ల బృందం నిరాశపర్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. -
Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో నిఖత్ ఓటమిపాలైంది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో గురువారం నాటి బౌట్లో వు యు 5-0తో నిఖత్‌ను ఓడించింది. కాగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్. కన్నీటి పర్యంతంమహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. తొలి రౌండ్ బౌట్లో 5–0తో మ్యాక్సీ కరీనా క్లోట్జెర్ (జర్మనీ)ని ఓడించి రౌండ్ ఆఫ్ 16(ప్రి క్వార్టర్స్)కు అర్హత సాధించింది. ప్రత్యర్థిపై ఆది నుంచే పంచ్‌లు విసరుతూ పైచేయి సాధించింది. అయితే, కీలక పోరులో వు యు రూపంలో సవాల్ ఎదురుకాగా.. నిఖత్ అధిగమించలేకపోయింది. ప్యారిస్‌లో పతకం సాధించాలన్న కల చెదిరిపోవడంతో కన్నీటి పర్యంతం అయింది.క్షమించండి.. నిఖత్ భావోద్వేగం‘‘సారీ.. ఈ అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది. నేను ఇంతకుముందు వు యుతో తలపడలేదు. తను చాలా వేగంగా కదిలింది. పొరపాటు ఎక్కడ జరిగిందో సరిచూసుకోవాలి. ఎంతో కష్టపడి ఇక్కడిదాకా చేరుకున్నాను. శారీరకంగా.. మానసికంగా ఒలింపిక్స్‌కి సన్నద్దమయ్యాను. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాను’’ అని 28 ఏళ్ల నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ భావోద్వేగానికి గురైంది. లవ్లీనాపైనే ఆశలన్నీభారత ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ముగ్గురికే సాధ్యమైన ఘనతను సాధించేందుకు మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఒక్క విజయం దూరంలో ఉంది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఈ అస్సాం బాక్సర్ ఆడిన తొలి బౌట్‌లోనే ఏకపక్ష విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో (29–28, 30–27, 29–28, 30–27, 29–28) సునీవా హాఫ్స్టడ్ (నార్వే)ను చిత్తుగా ఓడించింది.కాంస్య పతకానికి అడుగుదూరంలోఇక ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ కియాన్ (చైనా)తో లవ్లీనా తలపడుతుంది. ఈ బౌట్లో గెలిస్తే లవ్లీనాకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. తద్వారా వ్యక్తిగత క్రీడాంశంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా లవ్లీనా గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు భారత్ తరఫున రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), పిస్టల్ షూటర్ మనూ భాకర్ (2024 పారిస్–2 కాంస్యాలు) రెండు ఒలింపిక్ పతకాల చొప్పున సాధించారు.క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా ఈసారి ‘పారిస్’లోనూ మెడల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగింది. సునీవాతో జరిగిన బౌట్లో లవ్లీనా పక్కా వ్యూహంతో ఆడి ప్రత్యరి్థకి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. తన ఎత్తును ఉపయోగించుకొని నార్వే బాక్సర్ ముఖంపై నిలకడగా పంచ్‌లు కురిపించింది. నిర్ణీత మూడు రౌండ్లలోనూ లవ్లీనా పూర్తి ఆధిపత్యం చలాయించింది.దాంతో బౌట్‌ను పర్యవేక్షించిన ఐదుగురు జడ్జిలు లవ్లీనాయే పైచేయి సాధించినట్లు నిర్ణయించారు. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. చైనా బాక్సర్ లీ కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో లీ కియాన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫలితంగా లవ్లీనా తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తేనే చైనా బాక్సర్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. పోరాడి ఓడిన ప్రీతి మరోవైపు మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పవార్ 2–3తో (29–28, 29–28, 30–27, 30–27, 28–29) రెండో సీడ్ మార్సెలా అరియస్ కాస్టనెడా (కొలంబియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. చదవండి: Olympics 2024: భారత్ ఖాతాలో మూడో పతకం Olympics 2024: భారత్ జైత్రయాత్రకు బ్రేక్.. బెల్జియం చేతిలో ఓటమి -
Olympics 2024: పతకానికి అడుగుదూరంలో లవ్లీనా
భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ ప్యారిస్ ఒలింపిక్స్-2024లో అదరగొడుతోంది. మహిళల 75 కేజీల విభాగంలో ఈ అస్సామీ అమ్మాయి.. క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. రెండో ఒలింపిక్ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో లవ్లీనా నార్వే బాక్సర్ సునివ హొఫ్సాటడ్‌తో తలపడింది. ఆది నుంచే ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించిన లవ్లీనా.. ఐదు రౌండ్లలోనూ పదికి తొమ్మిది పాయింట్ల చొప్పున సంపాదించింది. ఈ క్రమంలో 5-0తో సునివను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తదుపరి బౌట్లో లవ్లీనా చైనాకు చెందిన లీ కియాన్‌తో ఆగష్టు 4న పోటీపడనుంది.సెమీస్ చేరుకుంటే చాలుఇక ఈ బౌట్లో గెలిస్తే లవ్లీనా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, నిబంధనల ప్రకారం సెమీస్ చేరుకుంటే చాలు లవ్లీనా కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. విశ్వ క్రీడల్లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోటీ జరుగుతుంది. సెమీ ఫైనల్లో ఓడిన ఇద్దరు ప్లేయర్లు బ్రాంజ్ మెడల్ కోసం పోటీపడాల్సి ఉంటుంది.కానీ.. బాక్సింగ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.సెమీస్ చేరిన ఇద్దరు బాక్సర్లకు మరో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా పతకం ఖాయమవుతుంది. సహజంగానే సెమీస్‌లో పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి.. ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా.. ‘నాకౌట్’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత బాక్సర్లు స్పృహ కోల్పోయే (కన్కషన్) అవకాశం కూడా ఉండవచ్చు.అందుకే ఇద్దరికీ పతకాలుఅలాంటపుడు వారు సాధారణ స్థితికి వచ్చి.. మళ్లీ వెంటనే బౌట్‌కు సిద్ధం కావడం కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే మూడో స్థానం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు కూడా రావచ్చు. అందుకే బాక్సింగ్‌లో మూడో స్థానం కోసం పోటీ రద్దు చేసి.. సెమీస్‌చేరిన ఇద్దరికీ కాంస్యాలు ఇస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్-2020లో లవ్లీనా బొర్గొహెయిన్ ఇలాగే కంచు పతకం(69 కేజీల విభాగం) గెలుచుకుంది. సెమీస్‌లో ఓడినప్పటికీ మెడల్‌తో తిరిగి వచ్చింది. ఇక ఒలింపిక్స్‌లో ఇప్పటికే షట్లర్ పీవీ సింధు, షూటర్ మనూ భాకర్ రెండేసి పతకాలు గెలుచున్నారు. లవ్లీనా క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే వీరితో పాటు ఈ జాబితాలో చేరిన భారత మహిళా క్రీడాకారిణిగా నిలుస్తుంది. A 𝑳𝒐𝒗𝒍𝒊 PERFORMANCE FROM THE CHAMP!! 🥊She punches her way into the Quarter-Finals 😤 💪Stream the action on #JioCinema for FREE. Also, watch it LIVE on #Sports18!#Cheer4Bharat #OlympicsOnJioCinema #OlympicsOnSports18 #Paris2024 #Boxing pic.twitter.com/j5ogV5iWmQ— JioCinema (@JioCinema) July 31, 2024 -
Paris Olympics 2024: భారత బాక్సర్లకు చివరి అవకాశం
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీ శుక్రవారం నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు బాక్సర్లు (అమిత్ పంఘాల్–51 కేజీలు, సచిన్–57 కేజీలు, అభినాశ్ జమ్వాల్–63.5 కేజీలు, నిశాంత్ దేవ్–71 కేజీలు, అభిమన్యు–80 కేజీలు, సంజీత్–92 కేజీలు, నరేందర్ –ప్లస్ 92 కేజీలు)... మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు (జాస్మిన్–57 కేజీలు, అంకుశిత–60 కేజీలు, అరుంధతి–66 కేజీలు) బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌కు విశ్వ క్రీడల బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్(75 కేజీలు) ఒలింపిక్స్-2024 పోటీలకు అర్హత సాధించారు. -
పసిడి ‘పంచ్’కు లవ్లీనా
ఆసియా క్రీడల బాక్సింగ్ ఈవెంట్లో మంగళవారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్... పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్ బౌట్లలో ఓడిపోయి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రీతి 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో... నరేందర్ 0–5తో కున్‌కబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ, రజత పతకం రేసులో నిలిచింది. అంతే కాకుండా పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. సెమీఫైనలో లవ్లీనా 5–0తో బైసన్ మనికోన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ సచిన్ సివాచ్ 1–4తో లియు పింగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. చదవండి: ODI WC 2023: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్-కివీస్ జట్లు -
అట్టహాసంగా ఆరంభమైన ఆసియా క్రీడలు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీరే
Asian Games 2023 Opening Ceremony: చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలకు తెర లేచింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శనివారం సాయంత్రం ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. 19వ ఆసియా క్రీడల ఆరంభోత్సవంలో.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ భారత బృందానికి పతాకధారులుగా వ్యవహరించారు. సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలో భారత క్రీడాకారులంతా ఖాఖీ రంగు ప్రధానంగా ఉన్న సంప్రదాయ దుస్తులు ధరించారు. మహిళా ప్లేయర్లు చీరలో మెరిసిపోగా.. పురుష క్రీడాకారులు కుర్తా.. పైజామా ధరించి హుందాగా కనిపించారు. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆసియా క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి క్రికెట్ జట్లు కూడా ఇక ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అథ్లెట్ల, హాకీ జట్లతో పాటుగా.. భారత మహిళా, పురుష క్రికెట్ జట్లు తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోతున్నాయి. ఇప్పటి వరకు 18 ఆసియా క్రీడల్లో పోటీపడి భారత్ మొత్తంగా 671 పతకాలు గెలవగా.. ఇందులో కేవలం 155 మాత్రమే స్వర్ణాలు ఉన్నాయి. అత్యధికంగా 316 కాంస్యాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అయితే, ఈసారి ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆతిథ్య చైనా ఇప్పటి వరకు ఏకంగా 3187 పతకాలు గెలిచి తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగిపోతోంది. ఇక హాంగ్జౌ ఏసియన్ గేమ్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 30 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి.. ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాతి్వక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్), నేలకుడితి అనూష (సాఫ్ట్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్), బారెడ్డి అనూష (క్రికెట్), శివ కుమార్ (సెపక్తక్రా). తెలంగాణ నుంచి.. వ్రితి అగర్వాల్ (స్విమ్మింగ్), అగసార నందిని (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్), కైనన్ చెనాయ్, ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇరిగేశి అర్జున్ (చెస్), ప్రీతి కొంగర (సెయిలింగ్), బత్తుల సంజన (స్కేటింగ్), గుగులోత్ సౌమ్య (ఫుట్‌బాల్), తిలక్ వర్మ (క్రికెట్). 𝑺𝒂𝒃𝒔𝒆 𝑨𝒂𝒈𝒆 𝑯𝒐𝒈𝒂 𝑩𝒉𝒂𝒓𝒂𝒕💪🏻 The excitement & energy of the 🇮🇳 contingent is contagious as they walk into the opening ceremony of #AsianGames2022🔥 This edition of #BharatAtAG22 will rock for sure! #Cheer4India#HallaBol#JeetegaBharat pic.twitter.com/cnY5M0r2pN — SAI Media (@Media_SAI) September 23, 2023 The moment we've all been waiting for is almost here! 🌟 In just a few minutes, the Indian team will proudly march into the Asian Games opening ceremony at Hangzhou, China. 🎉 Let's unite, show our support, and create unforgettable memories together. 🙌🏆 #Cheer4India… pic.twitter.com/6PBePg9bMi — SAI Media (@Media_SAI) September 23, 2023 -
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్‌బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
క్వార్టర్ ఫైనల్లో సాక్షి, లవ్లీనా..
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాక్షి చౌధరీ (52 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రీతి (54 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి 5–0తో జజీరా ఉరక్‌బయేవా (కజకిస్తాన్)పై, లవ్లీనా 5–0తో వనెసా ఒరిట్జ్ (మెక్సికో)పై ఏకపక్ష విజయాలు నమోదు చేశారు. ప్రీతి 3–4తో జిట్‌పోంగ్ జుటామస్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. మరో బౌట్లో విజయం సాధిస్తే సాక్షి, లవ్లీనాకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సుమయె కొసిమోవా (తజికిస్తాన్)తో నీతూ (48 కేజీలు), తుర్హాన్ ఎలిప్ నూర్ (తుర్కియే)తో మనీషా (57 కేజీలు), కిటో మాయ్ (జపాన్)తో శశి చోప్రా (63 కేజీలు), ఫాతిమా హెరెరా అల్వారెజ్ (మెక్సికో)తో నిఖత్ జరీన్ (50 కేజీలు), నవ్‌బాఖోర్ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్)తో మంజు బంబోరియా (66 కేజీలు), మిజ్‌గోనా సమదోవా (తజికిస్తాన్)తో జాస్మిన్ (60 కేజీలు) తలపడతారు. చదవండి: Race Walking Championship 2023: అక్ష్దీప్ సింగ్‌కు స్వర్ణం -
ప్రపంచ మహిళల బాక్సింగ్ పోటీలకు భారత జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెల 15 నుంచి 26 వరకు స్వదేశంలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో 12 వెయిట్ కేటగిరీల్లో భారత బాక్సర్లు పోటీపడతారు. గత ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని న్యూఢిల్లీలోనూ నిలబెట్టుకునేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బరిలోకి దిగనుంది. భారత జట్టు: నీతూ ఘంఘాస్ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జాస్మిన్ లంబోరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), సవీటి బూరా (81 కేజీలు), నుపర్ షెరాన్ (ప్లస్ 81 కేజీలు). -
నిఖత్ పసిడి పంచ్..
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్ మహిళల (ఎలైట్) జాతీయ బాక్సింగ్ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్ఎస్పీబీ) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆఖరి రోజు పోటీల్లో టైటిల్ వేటలో... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్ ముందు రైల్వే బాక్సర్ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్ఎస్పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ మాత్రం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్ మేటి బాక్సర్ లవ్లీనా 5–0తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్ఎస్పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్ ప్రపంచ చాంపియన్ సనమచ తొక్చొమ్ (మణిపూర్) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఘనమైన సంవత్సరం ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్ మూడో సారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్ పంచ్ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్ ఎదురైంది. విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్ కేటగిరీకి మారింది. మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ వంతు. వరల్డ్ చాంపియన్ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది. తొలి మూడు రౌండ్లు ‘నాకౌట్’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్భట్లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది. -సాక్షి క్రీడా విభాగం -
4 స్వర్ణాలు 1 రజతం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు ఒకే రోజు ఐదు పతకాలతో మెరిశారు. ఇందులో 4 స్వర్ణాలు కాగా మరొకటి రజతం. లవ్లీనా బొర్గొహైన్, పర్వీన్ హుడా, సవీటీ బూరా, అల్ఫియా పఠాన్ వేర్వేరు విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకోగా, తొలిసారి ఈ పోటీల బరిలోకి దిగిన మీనాక్షి రజతాన్ని అందుకుంది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా 75 కేజీల విభాగం ఫైనల్లో రుజ్‌మెటొవా సొఖిబా (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేసింది. ఒలింపిక్ పతకం తర్వాత వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్ క్రీడల్లో లవ్లీనా విఫలమైంది. టోక్యోలో 69 కేజీల విభాగంలో పాల్గొన్న లవ్లీనా, పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్ లేకపోవడంతో 75 కేజీలకు మారింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో తొలిసారి పాల్గొన్న పర్వీన్ 63 కేజీల కేటగిరీ ఫైనల్లో పర్వీన్ 5–0 తేడాతో జపాన్ను చెందిన కిటోమై పై ఘన విజయం సాధించింది. 81 కేజీల ఫైనల్లో సవీటీ కూడా అదే జోరుతో 5–0తో గుల్‌సయా యెర్జాన్ (కజకిస్తాన్)ను ఓడించి విజేతగా నిలిచింది. 81 ప్లస్ కేటగిరీ ఫైనల్లో అల్ఫియా కూడా సత్తా చాటింది. ఆమె ప్రత్యర్థి, స్థానిక జోర్డాన్‌కే చెందిన ఇస్లామ్ హుసైలి తొలి రౌండ్లోనే డిస్క్వాలిఫై కావడంతో అల్ఫియాకు స్వర్ణం దక్కింది. అయితే మీనాక్షి మాత్రం రజతంతో సంతృప్తి చెందింది. ఫైనల్లో 1–4 తేడాతో కినో షియా రింకా (జపాన్) చేతిలో ఓటమిపాలైంది. -
Asian Boxing Championships 2022: స్వర్ణ పతక పోరుకు లవ్లీనా అర్హత
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. జోర్డాన్‌లో బుధవారం జరిగిన సెమీఫైనల్లో లవ్లీనా 5–0తో సెయోంగ్ సుయోన్ (కొరియా)పై గెలిచింది. భారత్‌కే చెందిన అల్ఫియా (ప్లస్ 81 కేజీలు), మీనాక్షి (52 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. అంకుశిత (66 కేజీలు), ప్రీతి (57 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్వెల్త్ గ్రామంలోకి కోచ్‌కు అనుమతి
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులు వేధిస్తున్నారంటూ నిన్న ట్విటర్ వేదికగా సంచలన ఆరోపణలు చేసిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఎట్టకేలకు పంతం నెగ్గించుకుంది. తన కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని లవ్లీనా చేసిన ఆరోపణలు నేపథ్యంలో బీఎఫ్ఐ స్పందించింది. కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసి ఆమెకు హోటెల్లో వసతి కల్పించినట్లు బీఎఫ్ఐ వెల్లడించింది. అలాగే లవ్లీనాతో పాటు ట్రైనింగ్ క్యాంపుకు కోచ్ కూడా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులతో పాటు 33 శాతం సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందన్న నిబంధన కారణంగా లవ్లీనా కోచ్‌కు కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతి లభించలేదని బీఎఫ్ఐ వివరించింది. కాగా, బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని లవ్లీనా నిన్న ట్విటర్ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. చదవండి: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్ మహిళా బాక్సర్ సంచలన ఆరోపణలు -
బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్ మహిళా బాక్సర్ సంచలన ఆరోపణలు
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధికారులపై టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. బీఎఫ్ఐ అధికారులు తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ట్విటర్ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించింది. తాను ఒలింపిక్ పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని, మరో కోచ్ రఫేల్ బెర్గమొస్కోను ఇండియాకు పంపించేశారని ఆమె వాపోయింది. 🙏 pic.twitter.com/2NJ79xmPxH — Lovlina Borgohain (@LovlinaBorgohai) July 25, 2022 ఈ కారణంగా తన ప్రాక్టీస్ ఆగిపోయిందని, వరల్డ్ ఛాంపియన్షిప్ సమయంలో కూడా బీఎఫ్ఐ ఇలాగే తనతో డర్టీ పాలిటిక్స్ చేసిందని పేర్కొంది. బీఎఫ్ఐ ఎన్ని నీచ రాజకీయాలు చేసినా తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. మరో మూడు రోజుల్లో (జులై 28) కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లవ్లీనా ఆరోపణలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. చదవండి: రిటైర్మెంట్ ప్రకటనపై యూ టర్న్ తీసుకోనున్న మిథాలీ రాజ్..? -
భారత బాక్సర్ లవ్లీనాకు చుక్కెదురు
టర్కీలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగియగా... పూజా రాణి (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలోని ఫెయిర్ చాన్స్ టీమ్ బాక్సర్ సిండీ విన్నర్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 1–4తో ఓడింది. పూజ 5–0తో టిమియా నాగీ (హంగేరి)పై గెలిచింది. -
లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ శుభారంభం చేసింది. టర్కీలో సోమవారం జరిగిన 70 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో లవ్లీనా 3–2తో చెన్ నియెన్ చిన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. నేడు జరిగే 48 కేజీల విభాగం తొలి రౌండ్లో స్టెలుటా దుతా (రొమేనియా)తో భారత బాక్సర్ నీతూ తలపడుతుంది. -
Nikhat Zareen: ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనాతో పాటు మన అమ్మాయి కూడా
Asian Games- Telangana Boxer Nikhat Zareen- న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ కోసం నిర్వహించిన ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ (51 కేజీల విభాగం) 7–0 తేడాతో మంజురాణిపై ఘన విజయం సాధించింది. ఇటీవలే స్ట్రాండ్జా మెమోరియన్ టోర్నీలో విజేతగా నిలిచిన నిఖత్... ఏషియాడ్‌లోనూ సత్తా చాటుతానని నమ్మకంతో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10–25 వరకు చైనాలోనూ హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతాయి. నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), జాస్మీన్ (60 కేజీ), మనీశా (57 కేజీ), సవీటీ బూరా (75 కేజీ) కూడా ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యారు. స్వర్ణపతకంతో తిరిగి రావాలి ఏషియాడ్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి... ఆమె స్వర్ణపతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ -
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించిన తెలంగాణ అమ్మాయి
Nikhat Zareen Into World Boxing Championships: ఇటీవల జరిగిన స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకం సాధించి జోరు మీదున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. మే 6న ఇస్తాంబుల్ వేదికగా ప్రారంభమయ్యే మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో జరీన్ 52 కేజీల విభాగంలో బరిలో దిగనుంది. సెలక్షన్ ట్రయల్స్‌లో జరీన్ 7-0తో మీనాక్షిను(హరియాణా) చిత్తుచేసి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గొహైన్ కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో (70 కేజీల విభాగం) పోటీపడేందుకు అర్హత సాధించింది. ట్రయల్స్‌లో అరుంధతిని ఓడించిన లవ్లీనా టోక్యో ఒలింపిక్స్ తర్వాత పోటీపడే తొలి టోర్నీ ఇదే. ఈ ఈవెంట్‌కు నిఖత్ జరీన్, లవ్లీనాతో పాటు నీతు, అనామికా, శిక్ష, మనీశ, జాస్మైన్, పర్వీన్, అంక్షిత బొరో, సవిటీ బూర, పూజ రాణి, నందిని కూడా అర్హత సాధించారు. వాస్తవానికి వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలు గతేడాది డిసెంబర్లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. చదవండి: పీవీ సింధుకు ఘోర పరాభవం.. -
PV Sindhu: ‘బీబీసీ అవార్డు’ రేసులో పీవీ సింధు
న్యూఢిల్లీ: రెండు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండోసారి ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో నిలిచింది. 2020లో సింధుకు ఈ అవార్డు లభించింది. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్క్ బీబీసీ మంగళవారం విడుదల చేసిన 2022 నామినీల్లో తెలుగు తేజంతో పాటు టోక్యోలో రజతం నెగ్గిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, బాక్సింగ్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్, గోల్ఫర్ అదితి అశోక్, పారాలింపియన్ షూటర్ అవనీ లేఖరా ఉన్నారు. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఈ నెల 28 వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. మార్చి 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు. 2021 సంవత్సరంలో భారత చెస్ దిగ్గజం కోనేరు హంపికి ఈ అవార్డు లభించింది. చదవండి: India Vs West Indies 2nd Odi: సిరీస్ గెలుపే లక్ష్యంగా టీమిండియా; గత మ్యాచ్‌లో ఒక్క బంతికే అవుటయ్యాడు... ఆ కెప్టెన్ రాణించేనా? -
బాక్సర్ లవ్లీనాకు బంపరాఫర్.. డీఎస్పీగా ఉద్యోగం, అదనంగా నెలకు రూ.లక్ష
Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె సెమీస్ చేరారు. అయితే వరల్డ్ నంబర్ వన్ టర్కీకి చెందిన బుసెనజ్తో జరిగిన సెమీస్‌లో ఓడిపోవడంతో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత ఆమెకు డీఎస్పీ ఉద్యోగంతోపాటు కోటి రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం లవ్లీనాకు డీఎస్పీ నియామక పత్రం అందజేశారు. నెలవారీ జీతంతోపాటు లవ్లీనాకు బాక్సింగ్ ట్రైయినింగ్ ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. దాంతోపాటు పంజాబ్‌లోని పటియాలలో కోచింగ్ తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్‌తో గువాహటిలోనే ట్రయినింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలిస్ శాఖకు కృతజ్ఞతలు చెప్పిన లవ్లీనా.. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమేనని అన్నారు. (చదవండి: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి రజని) -
ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్!
లాసానే (స్విట్జర్లాండ్): ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు అందించిన బాక్సింగ్, రెండు పతకాలు అందించిన వెయిట్లిఫ్టింగ్లకు విశ్వ క్రీడల్లో భవిష్యత్తు సందేహాత్మకంగా మారింది. 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడలను తప్పించే అవకాశం ఉంది. దీంతో పాటు ఐదు క్రీడాంశాల సమాహారమైన మోడ్రన్ పెంటాథ్లాన్‌ను (రన్నింగ్, ఈక్వెస్ట్రియన్, స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్) కూడా తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా... మూడు కొత్త క్రీడాంశాల ప్రకటనను బట్టి చూస్తే పై మూడింటిని తప్పించాలని ఐఓసీ అంతర్గత సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటి స్థానాల్లో కొత్తగా స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్‌లను చేర్చనున్నారు. యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో రెగ్యులర్ క్రీడాంశంగా మార్చేందుకు ఐఓసీ సిద్ధమైంది. 1912 ఒలింపిక్స్ నుంచి ఉన్న మోడ్రన్ పెంటాథ్లాన్‌కు చారిత్రక ప్రాధాన్యమే తప్ప వాణిజ్యపరంగా కానీ అభిమానులపరంగా పెద్దగా ఆసక్తి గానీ ఉండటం లేదని ఐఓసీ చెబుతోంది. ఇక బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలను సుదీర్ఘ కాలంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు, నైతికత లోపించడం, డోపింగ్, పరిపాలన సరిగా లేకపోవడంతో ఈ క్రీడల ప్రక్షాళన అవసరమని భావిస్తూ వీటిని తప్పించాలని ఐఓసీ ప్రతిపాదించింది. మరోవైపు 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లోకి రావచ్చంటూ వినిపించగా, తాజా పరిణామాలతో ఆ అవకాశం లేదని తేలిపో యింది. లాస్ ఏంజెలిస్ ఈవెంట్ కోసం నిర్వాహకులు ప్రతిపాదించిన 28 క్రీడాంశాల్లో క్రికెట్ పేరు లేకపోవడంతో దీనిపై స్పష్టత వచ్చేసింది. -
అన్ని క్రీడా సమాఖ్యల తీరు అంతే: ఢిల్లీ హైకోర్టు
Arundhati Choudhary Drags BFI To Court Over Direct Entry For Lovlina Borgohain In World Championships: న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం ట్రయల్స్ లేకుండానే టోక్యో ఒలింపిక్స్ పతక విజేత హోదాలో లవ్లీనా బొర్గోహైన్‌కు భారత జట్టులో నేరుగా బెర్త్ ఇవ్వడంపై బాక్సర్ అరుంధతీ చౌదరీ ఢిల్లీ హైకోర్టుకెక్కింది. బుధవారం విచారణ సందర్భంగా జస్టిస్ రేఖ పల్లి భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)ను తలంటారు. ఒక్క బీఎఫ్ఐ మాత్రమే కాదు... దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యల తీరు ఇలానే అఘోరించిందని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘క్రీడా సమాఖ్యల పనితీరు గురించి వింటుంటే సమాఖ్యకు తలోగ్గే వరకు క్రీడాకారుల మాటకు విలువ ఇవ్వరేమోననిపిస్తోంది. క్రీడాభివృద్ధి కోసం సమాఖ్యలు పని చేయాలి. క్రీడాకారులను ఇలా ఇబ్బంది పెడుతూ ఏం సాధిస్తారు’ అని రేఖ పల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు కోరుతూ కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. మరోవైపు ఈ వివాదంపై బీఎఫ్ఐ వివరణ ఇచ్చింది. అరుంధతిని ప్రపంచ పోటీలకు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశామని బీఎఫ్ఐ వివరించింది. చదవండి: పొట్టి క్రికెట్‌పై దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?!
Mary Kom And Lovlina Borgohain: హిస్సార్‌లో ఈనెల 21 నుంచి జరిగే జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన వారిని మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తామని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ప్రకటించింది. అయితే మేరీకోమ్ పాల్గొనే 48–51 కేజీల విభాగానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని బీఎఫ్ఐ భావిస్తోంది. కాగా 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన మేరీ కోమ్... ఇటీవలి టోక్యో ఒలిపింక్స్‌లో క్వార్టర్స్ చేరకుండానే రెండో రౌండ్లోనే తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే, మరో భారత మహిళా బాక్సర్ 23 ఏళ్ల లవ్లీనా బొర్గోహెయిన్.. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి విశ్వవేదికపై సత్తా చాటింది. ఈ ప్రదర్శన ఆధారంగా ఆమె వరల్డ్ ఈవెంట్(69 కేజీల విభాగం)కు నేరుగా సెలక్ట్ అయింది. చదవండి: T20 WC: ఇంగ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్.. మైకేల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్ ఏంది?! -
లవ్లీనాకు భారీ ప్రోత్సాహకాలు: డీఎస్పీ ఉద్యోగం.. రూ. కోటి నజరానా
డిస్పూర్: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్‌కు అసోం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహాకాలు ప్రకటించింది. లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేయడంతో పాటు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లవ్లీనాకు గురువారం గౌహతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం బాక్సర్ లవ్లీనాను రాష్ట్ర పోలీసుశాఖలో డీఎస్పీగా చేరమని అభ్యర్థించారు. అంతేకాక ఆమెకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అలానే లవ్లీనా కోచ్‌కు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది అసోం ప్రభుత్వం. అలానే అసోంలోని గోలాఘాట్ జిల్లాలోని సౌపాతర్‌లో లవ్లీనా బోర్గోహెయిన్ పేరు మీద రూ. 25 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు హిమంత శర్మ తెలిపారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా హిమంత బిస్వా శర్మ స్వయంగా గౌహతి విమాన్రాశయం చేరుకుని లవ్లీనాకు స్వాగతం పలికారు. అనంతరం బాక్సర్ భారీ కటౌట్లతో అలంకరించిన బస్సులో లవ్లీనాను ఎక్కించుకుని సిటీ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో లవ్లీనాకు సన్మానం జరిగింది. సాయంత్రం లవ్లీనా.. గవర్నర్ జగదీష్ ముఖిని కూడా కలిసే అవకాశం ఉంది. -
కొడుకు పుట్టలేదని అమ్మానాన్నను వేధించారు.. వారికిదే జవాబు
సాక్షి, వెబ్‌డెస్క్: అసోంలోని గోల్ఘాట్ జిల్లాలోని మారుమూల గ్రామం బారోముఖియా.. రాజధాని డిస్పూర్ నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ఊరికి ఇంతవరకు సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు.. బయటి ప్రపంచాన్ని చూడాలనుకుంటే మట్టి రోడ్డే దిక్కు.. అటువంటి గ్రామం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ పుట్టిన గడ్డగా ప్రత్యేకతను సంతరించుకుంది. విశ్వ క్రీడల్లో భారత కీర్తి పతాకను ఎగురవేసిన ఘనతను సాధించినందుకు తమ ఆడపడుచుకు స్వాగతం పలికేందుకు ముస్తాబు అవుతోంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన లవ్లీనా ఈ విజయంతో తన దేశమంతా గర్వపడేలా చేసింది. పొలంలో నాట్లు వేయడం కూడా వచ్చు.. లవ్లీనా తండ్రి టికెన్ బొర్గోహెయిన్‌కు స్వస్థలంలో చిన్న తేయాకు తోట ఉంది. సాధారణ కుటుంబం. మొత్తం ముగ్గురు అమ్మాయిల్లో లవ్లీనా చిన్నది. కవల అక్కల బాటలో సరాదాగా ఆమె కూడా మువతాయ్ (కిక్ బాక్సింగ్)తోనే కెరీర్ ఆరంభించింది. 2009లో కోచ్ ప్రశాంత కుమార్ దాస్ వద్ద తన అక్కలతో పాటు శిక్షణ తీసుకుంది. ముగ్గురూ కలిసి బారోముఖియా నుంచి 3- 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్పాథార్లోని కోచింగ్ సెంటర్‌కు సైకిల్‌పై వెళ్లేవారు. ఫొటో కర్టెసీ: ఇండియా టుడే ఈ విషయాల గురించి లవ్లీనా తండ్రి టికెన్ మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలు చాలా కష్టపడేవారు. రాళ్లురప్పలతో నిండిన మట్టిరోడ్డు మీద ప్రయాణం వారికి నరకప్రాయంగా ఉండేది. వచ్చేటపుడు గాయాలతో తిరిగి వచ్చేవారు. వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా లవ్లీనా ఎన్నటికీ తన మూలాలు మర్చిపోదని, లాక్డౌన్ సమయంలోలో పొలంలో నాట్లు వేస్తూ తమకు సహాయపడిందని బిడ్డపై ప్రేమను కురిపించారు. కాగా మువతాయ్ కొనసాగిస్తున్న సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్ పదమ్ బోరో దృష్టిలో పడటంతో లవ్లీనా కెరీర్ మలుపు తిరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని... టోక్యోకు కోచ్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగిన లవ్లీనా... 2020లో జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. లాక్డౌన్లో సొంతూరిలోనే ఉన్న ఆమె.. ప్రాక్టీస్ ప్రారంభం కావడంతో పటియాలాలోని శిక్షణా శిబిరానికి పయనమైంది. కానీ, కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న తల్లికి సహాయంగా ఉండేందుకు అదే ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలో లవ్లీనా కరోనా బారిన పడింది. దీంతో 52 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం స్పెయిన్ వెళ్లాల్సిన భారత బాక్సర్ల బృందం నుంచి ఆమె వైదొలగాల్సిన పరిస్థితి. అయినా సరే ఆమె కుంగిపోలేదు. కోవిడ్‌ను జయించడమే కాకుండా.. పట్టుదలగా ముందుకు సాగి టోక్యోలో సత్తా చాటింది ఈ 23 ఏళ్ల బాక్సర్. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి, ప్రతిభ ముందు ఏ అవాంతరాలైనా దూదిపింజల్లా తేలిపోవాల్సిందేనని నిరూపించింది. విశ్వ క్రీడల్లో పతకంతో మెరిసి, ఈ ఘనత సాధించిన మూడో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. అమ్మానాన్నలను ఎన్నో మాటలు అన్నారు.. వారికిదే సమాధానం ‘‘ముగ్గురు ఆడపిల్లలను కలిగి ఉన్నందుకు గానూ నా తల్లిదండ్రులను ఈ సమాజం ఎన్నో మాటలు అన్నది. గత జన్మలో ఏదో పాపం చేసినందుకే కొడుకు పుట్టలేదంటూ వేధించేవారు. నిజానికి నేను బాక్సింగ్ చేయడం ప్రారంభించినపుడు చాలా మంది నన్ను చూసి నవ్వారు. ముఖ్యంగా లింగ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి నా ప్రదర్శన, ఈ పతకం ముఖం మీద కొట్టినట్లుగా సమాధానం ఇస్తుందని భావిస్తున్నా. మాకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నా తల్లిదండ్రులకు ఈ విజయం అంకితం చేస్తున్నా’’ అని సెమీ ఫైనల్ అనంతరం ఆజ్‌తక్‌తో మాట్లాడుతూ లవ్లీనా భావోద్వేగానికి గురైంది. ఫైనల్ చేరాలని భావించానని, అయితే తన ప్రణాళికను పక్కాగా అమలు చేయలేకపోయానని పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్‌తో తప్పక ఇంతకంటే మెరుగ్గా రాణించి, మరో పతకం గెలుస్తానని లవ్లీనా చెప్పుకొచ్చింది. అంతకంటే ముందు... వరల్డ్ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటాల్సి ఉందని అని పేర్కొంది. ఏదేమైనా.. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించిన లవ్లీనా నిజంగానే బంగారుకొండ.. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ లవ్లీనా!! -
Tokyo Olympics: లవ్లీనాను అభినందించిన సీఎం వైఎస్ జగన్
-
లవ్లీనాను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం గెలుపొందేందుకు ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడారు. ఎల్లప్పుడూ ఇలాగే గొప్పగా ఆడుతూ.. యువ క్రీడామణులకు, యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ బుధవారం ట్వీట్ చేశారు. కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో లవ్లీనా, టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో ఓడి పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిన్‌చెన్‌పై విజయం సాధించి ఆమె కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. తద్వారా ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా నిలిచారు. అంతకు ముందు విజేందర్ సింగ్, మేరీ కోమ్ ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Congratulations to @LovlinaBorgohai for winning the third medal for India at #Tokyo2020 . She fought the best in her category and won a medal in her debut #Olympics . May you keep shining and inspire many young girls through your career ahead. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 4, 2021 -
టోక్యో ఒలింపిక్స్ సెమీస్ లో ఓడిన లవ్లీనా
-
మూడో బాక్సర్‌గా లవ్లీనా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది!
టోక్యో/న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో భారత్‌కు మూడో పతకం అందించిన మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడినప్పటికీ ఇప్పటి దాకా ఆమె సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అంకితభావంతో ముందుకు సాగి కాంస్య పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘చాలా బాగా పోరాడావు లవ్లీనా! బాక్సింగ్ రింగ్‌లో ఆమె విజయం ఎంతో మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చింది. కాంస్యం సాధించినందుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించాలి’’ అని ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. కాగా బుధవారం జరిగిన బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్లో లవ్లీనా.. టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గతనెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్ సింగ్(2008), మేరీ కోమ్(2012) ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. గర్వంగా ఉంది లవ్లీనా.. ‘‘బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్యం. నిన్ను చూసి భారత్ గర్వపడుతోంది లవ్లీనా’’ అని లండన్ ఒలింపిక్స్ పతక విజేత, భారత బాక్సర్ విజేందర్ సింగ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. #IND's Lovlina Borgohain wins India's THIRD medal at #Tokyo2020 - and it's a #Bronze in the women's #Boxing welterweight category! #StrongerTogether | #UnitedByEmotion | #Olympics pic.twitter.com/wcX69n3YEe — #Tokyo2020 for India (@Tokyo2020hi) August 4, 2021 𝐁𝐑𝐎𝐍𝐙𝐄 𝐈𝐓 𝐈𝐒 🥳 We are proud of you @LovlinaBorgohai , you went on to @Tokyo2020 to play your maiden #Olympics and clinched 🥉 in it. It's a all time 3️⃣rd Olympic medal from #Boxing for 🇮🇳.#RingKeBaazigar#Tokyo2020#Cheer4India#TeamIndia pic.twitter.com/snmCiuWwtL — Boxing Federation (@BFI_official) August 4, 2021 Well fought @LovlinaBorgohai! Her success in the boxing ring inspires several Indians. Her tenacity and determination are admirable. Congratulations to her on winning the Bronze. Best wishes for her future endeavours. #Tokyo2020 — Narendra Modi (@narendramodi) August 4, 2021 -
లవ్లీనా మ్యాచ్: అసోం కీలక నిర్ణయం
-
లవ్లీనాకు వెల్కం : శరవేగంగా పనులు
టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో సెమీస్‌లోకి దూసుకొచ్చిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ స్వర్ణం వేటలో నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన పోటీలో టర్కీకి చెందిన బుసేనాజ్ సుర్మెనెలీ ఓటమి పాలైంది. అయినా కాంస్య పతకాన్ని గెల్చుకున్నలవ్లీనాపై ‘లవ్లీ’ అంటూ అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు లవ్లీనా స్వగ్రామం అస్సాం రాష్ట్రంలోని బారోముఖియా ఆమెకు వెల్కం చెప్పేందుకు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో గోలాఘాట్ జిల్లాలోని ఆమె నివాసానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఊపందు కున్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు ఇక్కడ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు 3.5 కిలోమీటర్ల నిర్మితమవుతున్న ఈ రోడ్డు ఒలింపిక్స్ పతకంతో మురిపించిన లవ్లీనాకు వెల్కం చెప్పేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. మరోవైపు సెమీ ఫైనల్ నేపథ్యంలో అసాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు అసెంబ్లీని వాయిదా వేయాలని నిర్ణయించింది. చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించాలని కోరుకుంటూ తమ అభిమాన బాక్సర్‌ని ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించాలని డిప్యూటీ స్పీకర్ నుమాల్ మోమిన్ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని అభ్యర్థించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. బౌట్ ముగిసేంతవరకు సభలోని సభ్యులందరూ, అసెంబ్లీ సిబ్బంది దీన్ని వీక్షించారు. కాగా అస్సాం నుంచి ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణి, అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్రం నుండి మొదటి మహిళా అథ్లెట్ కూడా లవ్లీనే కావడం విశేషం. కాగా టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ సెమీస్‌లో లవ్లీనా బొర్గోహైన్‌కు నిరాశ ఎదురైంది. టర్కీకి చెందిన బుసేనాజ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో లవ్లీనా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
నాన్న, నేను, ఒలింపిక్ పతకం...
అమ్మాయికి ఆటలు ఎందుకని నాన్న ఏనాడూ అడ్డు చెప్పలేదు... బాక్సింగ్ లాంటి ప్రమాదకర క్రీడ ఎంచుకోవడం ఎందుకని నాన్న అభ్యంతర పెట్టలేదు... ఆర్థిక స్థితి అంతంత మాత్రమే, ఆడించడం కష్టం అంటూ అర్ధాంతరంగా తప్పుకోమని నాన్న ఆపలేదు... బౌట్లు, కేటగిరీలు, పంచ్‌ల గురించి తెలియకపోయినా దేశం తరఫున ఆడటం గొప్ప గౌరవం అనే విషయం మాత్రం నాన్నకు బాగా తెలుసు... అందుకే తన కూతురు ఒలింపిక్స్‌లో బరిలోకి దిగితే చాలనేది మాత్రం ఆ నాన్న కల... సరిగ్గా రెండేళ్ల క్రితం లవ్లీనా చెప్పిన మాటలు ఇవి! అదే లక్ష్యంగా కష్టపడుతున్నానన్న లవ్లీనా ఇప్పుడు నాన్న చిరు కోరికను తీర్చడంతోనే సరి పెట్టలేదు. ఏకంగా పతకం సాధించి అంతకంటే ఎన్నో రెట్ల ఆనందాన్ని పంచింది. సాక్షి క్రీడా విభాగం సరదాగా ప్రారంభించిన కిక్ బాక్సింగ్/మువతాయ్ నుంచి సీరియస్ బాక్సింగ్‌కు మళ్లాలనే నిర్ణయం సరైన సమయంలో తీసుకోవడం వల్లే లవ్లీనా కెరీర్ మలుపు తిరిగింది. కవలలైన ఆమె ఇద్దరు అక్కలు లిచా, లిమా కిక్ బాక్సింగ్ ఆడేవారు. ఏడాదిపాటు లవ్లీనా కూడా అదే బాటలో నడిచింది. కానీ ఆ ఆటకు తగిన గుర్తింపు లేదని, భవిష్యత్తూ ఉండదని ఆమెకు తెలిసొచ్చింది. అస్సాం రాష్ట్రం, గోలాఘాట్ జిల్లా సమీపంలోని బారోముఖియా ఆమె స్వస్థలం. ప్రతిభాన్వేషణలో భాగంగా అస్సాంలోని వివిధ ప్రాంతా లకు వెళ్లిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్ పదమ్ బోరో దృష్టిలో పడటం లవ్లీనా కెరీర్‌కు నాంది పలికింది. ఆమెలో ప్రతిభను గుర్తించిన పదమ్, బాక్సింగ్‌కు సరిగ్గా సరిపోతుందని భావించి గువహటి అకాడమీలో శిక్షణకు ఎంపిక చేశారు. ఆ తర్వాత లవ్లీనా వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. బాక్సింగ్‌లో తన ప్రతిభకు పదును పెడుతూ వరుస విజయాలతో ఆమె జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌గా కూడా నిలిచింది. 2016లో భారత సీనియర్ టీమ్ శిక్షణా శిబిరంలోకి వచ్చాక లవ్లీనాకు తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. గతంలో మిడిల్ వెయిట్ కేటగిరీలో తలపడిన ఆమె... ఒలింపిక్స్‌లో తొలిసారి వెల్టర్ వెయిట్‌ను చేర్చడంతో అందుకోసమే సాధన చేసింది. ఈ కేటగిరీ లో సరైన ప్రాక్టీస్ పార్ట్నర్లు లభించకపోయి నా... మరో విభాగానికి చెందిన సీనియర్ సరితా దేవితో పోటీ పడుతూ సాధన కొనసాగించింది. అమ్మ అనారోగ్యం... కరోనా... జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో రాణించి గత ఏడాదే లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అనంతరం లాక్డౌన్ సమయమంతా సొంత ఊరిలోనే గడిపింది. అనంతరం మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభం కావడంతో పటియాలాలోని శిక్షణా శిబిరానికి వచ్చేసింది. అప్పటి వరకు అంతా బాగుంది. అయితే గత ఫిబ్రవరిలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తల్లి మమోని చెంతన ఉండేందుకు పది రోజులు మళ్లీ ఇంటికి వచ్చింది. ఇంట్లో పరిస్థితి చక్కబడినా... తిరిగి పటియాలా చేరుకున్న తర్వాత ఆమె కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇది లవ్లీనాకు బాగా నష్టం కలిగించింది. ఒలింపిక్స్ సన్నద్ధమయ్యే క్రమంలో 52 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం స్పెయిన్ వెళ్లాల్సిన భారత బాక్సర్ల బృందం నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. కరోనా నుంచి కోలుకోవడం ఒకవైపు... ఆపై ప్రాక్టీస్ కొనసాగించడం మరోవైపు... ఈ కఠిన సమయాన్ని లవ్లీనా పట్టుదలతో అధిగమించింది. ఇప్పుడు ఆమె విజయం చూస్తున్న తండ్రి టికెన్ బొర్గోహైన్ ఆనందానికి అవధులు లేవు. ఎన్నో ఇబ్బందులను దాటిన తర్వాత తన కూతురు తీసుకువస్తున్న ఒలింపిక్ పతకాన్ని చూసేందుకు ఆ నాన్న వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు! -
TOKYO OLYMPICS: ‘లవ్లీ’ పంచ్
లవ్లీనా బొర్గొహైన్... ఈ పేరు భారత క్రీడాభిమాని ఇక ఎప్పటికీ మరచిపోలేడు. టోక్యో ఒలింపిక్స్‌లో ‘పంచ్ పవర్’ తగ్గుతూ ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ నేనున్నానంటూ లవ్లీనా తన పదును చూపించింది. అద్భుతమైన ఆటతో చెలరేగి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్‌లోనూ గెలిస్తే ఆమె స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడుతుంది. ఒకవేళ ఓడినా... కనీసం కాంస్య పతకం దక్కుతుంది. 2012లో మేరీకోమ్, విజేందర్ సింగ్‌ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. టోక్యో: 2020 ఒలింపిక్స్‌లో మరో మహిళ భారత్ ఖాతాలో పతకాన్ని చేర్చింది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ (69 కేజీల విభాగం)లో లవ్లీనా బొర్గొహైన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె 4–1 తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ నీన్–చిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత బాక్సర్... చివరి మూడు నిమిషాల్లో సమర్థవంతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని నిరోధించి విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో చెన్ చిన్ చేతిలో ఓడిన లవ్లీనా ఈసారి ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి రౌండ్లో ముగ్గురు జడ్జీలు భారత బాక్సర్‌కు 10 పాయింట్లు ఇవ్వగా, రెండో రౌండ్లో ఆమె జోరుకు ఐదుగురూ 10 పాయింట్ల చొప్పున అందజేయడం విశేషం. మూడో రౌండ్లోనూ నలుగురు జడ్జీలు లవ్లీనాకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఈ అస్సాం బాక్సర్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకుంటూ ఒలింపిక్ పతకంతో మెరిసింది. ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో ఆమె ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలీ (టర్కీ)తో తలపడుతుంది. ఈ బౌట్లో గెలిస్తే ఒలింపిక్ చరిత్రలో భారత బాక్సింగ్ ఘనత కూడా కాంస్యాన్ని (మేరీకోమ్, విజేందర్) దాటి మరింత మెరుగైన స్థితికి చేరుతుంది. తాను గెలిచినట్లు రిఫరీ ప్రకటించగానే ఆనందం పట్టలేక 23 ఏళ్ల లవ్లీనా స్టేడియం దద్దరిల్లేలా గట్టిగా అరిచేసింది! సిమ్రన్‌జిత్‌కు నిరాశ... 60 కేజీల విభాగంలో తలపడిన మరో భారత బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ ఓటమితో ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. థాయ్‌లాండ్‌కు చెందిన సుదపొర్న్ సిసొండీ 5–0తో సిమ్రన్ను చిత్తు చేసింది. థాయ్‌లాండ్ బాక్సర్ ఆరంభం నుంచి చివరి వరకు సిమ్రన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా ఆమె ‘లెఫ్ట్ హుక్’లకు సిమ్రన్ వద్ద జవాబు లేకపోయింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జీలు ప్రతీసారి సుదపొర్న్కు పర్ఫెక్ట్ ‘10’ పాయింట్లు ఇవ్వడం విశేషం. ఇద్దరికీ కాంస్యం ఎందుకు? ఒలింపిక్స్‌లో అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (కాంస్యం) కోసం పోరు జరుగుతుంది. సెమీస్‌లో ఓడిన ఇద్దరు కంచు పతకం కోసం ఆడాల్సి ఉంటుంది. అయితే బాక్సింగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నం. సెమీఫైనల్ చేరిన ఇద్దరికీ మరో మ్యాచ్ లేకుండా పతకం ఖాయమవుతుంది. సాధారణంగా సెమీస్‌లో ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘నాకౌట్’ ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత స్పృహ కోల్పోయే (కన్కషన్) అవకాశం కూడా ఉండవచ్చు. వారు సాధారణ స్థితికి వచ్చి తక్కువ సమయంలో మళ్లీ బరిలోకి దిగడం చాలా కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48–72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దానికి ముందే కాంస్యం కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయినా ఆడితే ఇద్దరికీ ప్రమాదం జరగవచ్చు కాబట్టి మూడో స్థానం మ్యాచ్‌ను రద్దు చేసి ఇద్దరికీ పతకాలు ఇస్తున్నారు. సెమీస్‌లో ఓడిన ప్రతీ బాక్సర్ సమస్య ఎదుర్కోవాలని లేదు కానీ ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు రాకుండా ముందు జాగ్రత్త అని చెప్పవచ్చు! ఆమె చేతిలో నేను గతంలో నాలుగుసార్లు ఓడాను. ఇప్పుడు మాత్రం బెదరకుండా దూకుడుగా పంచ్‌లు విసరాలని నిర్ణయించుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడి వంద శాతం నా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాను. సరిగ్గా చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించిది. ఆమె గురించి బాగా తెలుసు కాబట్టి కొత్తగా ప్రణాళిక, వ్యూహం అవసరమే రాలేదు. సెమీస్ పోరుకు తగినంత సమయం ఉంది కాబట్టి వీడియో ద్వారా ప్రత్యర్థి బలాబలాలు తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిస్తా. గతంలో రింగ్‌లో దిగేటప్పుడు కొంత భయం వేసేది. ఇప్పుడు అది దూరం కావడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. నాలుగు నెలల క్రితం వరకు కూడా మెడిటేషన్ చేసేదాన్ని కానీ... బాక్సింగ్‌లాంటి క్రీడలో ప్రశాంతంగా ఉండలేం. అనుకోకుండానే ఆవేశాన్ని ప్రదర్శిస్తాం. తాజా ఘనత గురించి ఇప్పుడే వివరంగా మాట్లాడలేను. ఇంకా ఆట మిగిలి ఉంది కదా. –లవ్లీనా బొర్గొహైన్ -
అంచనాలు లేకుండా బరిలోకి; సెమీస్‌కు దూసుకెళ్లిన లవ్లీనా
-
అంచనాలు లేకుండా బరిలోకి.. పంచ్ మాత్రం అదిరింది
టోక్యో: ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ సంచలనం సృష్టించింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఎలాంటి అంచనాలు లేకుండానే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. తాజాగా 69 కేజీల విభాగంలో పోటీపడిన లవ్లీనా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో మాజీ వరల్డ్ చాంపియన్.. చైనీస్ తైపీ ప్లేయర్ చెన్ నైన్ చిన్‌పై 4-1 తేడాతో ఆమె ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో లవ్లీనా బాక్సింగ్ విభాగంలో కనీసం క్యాంస్యం పతకం గెలుచుకునే అవకాశం లభించింది. సెమీస్‌లో ఒకవేళ లవ్లీనా ఓడినా.. క్యాంసం దక్కడం ఖాయం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లవ్లీనా మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్లో 3:2 తో ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్లో మొత్తం ఐదుగురు జడ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్లో నలుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక ఆగస్టు 4న జరగనున్న సెమీఫైనల్లో టర్కీకి చెందిన సుర్మెనెలి బుసెనాజ్తో తలపడనుంది. కిక్ బాక్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. 1997 అక్టోబర్ 2న అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో టికెన్- మామోని దంపతులకు లవ్లీనా బోర్గోహైన్ జన్మించింది. లవ్లీనాకు కవలలైన ఇద్దరు అక్కలు ఉన్నారు. లవ్లీనా తండ్రి టికెన్ బోర్గోహైన్ ఒక చిన్న వ్యాపారి. టికెన్‌కు ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా తన ముగ్గురు కూతుళ్లను బాక్సర్లుగా తయారు చేయాలనే పట్టుదలను మాత్రం వదల్లేదు. ఆయన కోరికకు తగ్గట్టే లిచా, లిమాలు కిక్ బాక్సింగ్‌లో నేషన్ల్ లెవల్ పోటీల్లో పాల్గొన్నారు. అయితే వివాహం తర్వాత వారిదరు బాక్సింగ్‌ను పక్కనపెట్టారు. అయితే లవ్లీనా మాత్రం కిక్ బాక్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినా కొంతకాలానికి బాక్సింగ్‌లో అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అందులోకి మారింది. 2011లో లవ్లీనా బర్తాపూర్ బాలిక పాఠశాలలో చదువుతున్నప్పుడు బాక్సింగ్ ఈవెంట్లో పాల్గొని గెలుపొందింది. ఈ విజయంతో ఆమె తొలిసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. ఆ తర్వాత భారత బాక్సింగ్స్ వుమెన్స్ చీఫ్ కోచ్ శివ్ సింగ్ వద్ద ఆమె కోచింగ్ తీసుకుంది. తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్ విభాగంలో దేశానికి పతకం అందించునున్న మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలవనుంది. ఇంతకముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ బాక్సింగ్ విభాగం నుంచి క్యాంస్యం గెలుపొందారు. ఇక 69 కేజీల విభాగంలో మనకు క్యాంస్య పతకం రానుండడం ఇదే తొలిసారి. లవ్లీనా సాధించిన పతకాలు 2018లో ఏఐబీఏ వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం 2019లో ఏఐబీఏ వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో క్వార్టర్‌పైనల్లో ఓటమి