పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీ శుక్రవారం నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది.
భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు బాక్సర్లు (అమిత్ పంఘాల్–51 కేజీలు, సచిన్–57 కేజీలు, అభినాశ్ జమ్వాల్–63.5 కేజీలు, నిశాంత్ దేవ్–71 కేజీలు, అభిమన్యు–80 కేజీలు, సంజీత్–92 కేజీలు, నరేందర్ –ప్లస్ 92 కేజీలు)... మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు (జాస్మిన్–57 కేజీలు, అంకుశిత–60 కేజీలు, అరుంధతి–66 కేజీలు) బరిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. భారత్‌కు విశ్వ క్రీడల బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్(75 కేజీలు) ఒలింపిక్స్-2024 పోటీలకు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment