amit
-
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్: ఆ హెయిర్ ట్రీట్మెంట్లు వద్దు..!
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కియారా అద్వానీ నుంచి నీతా అంబానీ వంటి ప్రముఖులందిరికీ హెయిర్ స్టైలిస్ట్ అమిత్. సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ మాత్రం కురుల అందం కోసం హెయిర్ బోటాక్స్, కెరాటిన్ వంటి ట్రీట్మెంట్లు అస్సలు తీసుకోవద్దని చెబుతున్నారు. తాను తన క్లయింట్లకు కూడా అస్సలు సూచించని అన్నారు. అసలు ఇవెందుకు మంచివి కావు అనేది అమిత్ మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.ఈ రోజుల్లో జుట్టుకి సంబంధించిన హెయిర్ ట్రీట్మెంట్లు సర్వసాధారణం. అయినప్పటికీ అందమైన శిరోజాల కోసం ఈ ట్రీట్మెంట్లు మాత్రం తీసుకోవద్దని హెయిర్ స్టైలిస్ట్ అమిత్ అంటున్నారు. తన క్లయింట్లకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్లను సూచించని అన్నారు. ఈ రోజుల్లో కురుల కోసం అందరూ చేయించుకునే హెయిర్ బోటాక్స్ లేదా కెరాటిన్ వంటి వాటికి తాను ప్రాధాన్యత ఇవ్వనని అన్నారు. తాను బాలీవుడ్ హీరోయిన్లకు, ప్రముఖులకు ఇలాంటి హెయిర్ ట్రీట్మెంట్లు అస్సలు సిఫార్సు చేయనని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఈ ట్రీట్మెంట్లు సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇవి మంచివి కావని వాటి గురించి వివరించారు అమిత్. ఎందుకు మంచివి కావంటే..హెయిర్ బోటాక్స్ అనేది ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్. ఇది తాత్కాలిక చికిత్స. ఇది సాధారణంగా రెండు నుంచి నాలుగు నెలలు పడుతుంది. ఇక కెరాటిన్ చికిత్స అంటే.. ఇది జుట్టులో సహజంగా ఉండే ప్రోటీన్. ఈ చికిత్సలో ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి. వాస్తవానికి దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇది కేన్సర్ కారకమైనదని అన్నారు అమిత్. ఈ రెండు చికిత్సల ప్రాథమిక స్వభావమే తాను ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు అమిత్. హెయిర్ బోటాక్స్ జుట్టుని మంచిగా ఉంచినప్పటికీ..జుట్టులోని సహజ పోషకాలను కోల్పోయేలా చేస్తాయి. పైగా ఇది అధిక వేడిని కలుగజేస్తుంది. దీని వల్ల జుట్టులో ఉండే సహజ ప్రోటీన్ల నిర్మాణం ప్రాథమికంగా మారిపోతుంది. ఇవి స్వల్పకాలిక చికిత్సలే తప్ప ఏ మాత్రం సత్ఫలితాలనివ్వదు. పైగా దీర్ఘకాలంలో జుట్టుకి ఎక్కువ హానిని చేకూరుస్తాయి. పదేపదే ఈ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల పలు దుష్ప్రభావాలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అదీగాక తాను సహజమైన జుట్టు ఆకృతికే ప్రాధాన్యత ఇస్తానని, అలాగే దీర్ఘకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి అలవాట్లకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు అమిత్. ఆ దిశగానే తన కస్టమర్లను కూడా ప్రోత్సహిస్తానని అన్నారు. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: శ్రద్ధా కపూర్ బ్యూటీ సీక్రెట్ ఇదే..! ఇష్టంగా పోహా..!) -
17 మంది మావోయిస్ట్ మిలీషియా సభ్యుల లొంగుబాటు
పాడేరు: పెదబయలు ఏరియా కమిటీకి చెందిన నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది మిలీíÙయా సభ్యులు మంగళవారం పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్‌బర్ధర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఆ వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. పలు నేరాలకు పాల్పడిన మిలీషియా సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నట్టు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లొంగిపోయిన వారిపై ఎలాంటి కేసులుండవని స్పష్టం చేశారు. పాడేరు ఏఎస్పీ ధీరజ్, సీఆరీ్పఎఫ్ 198 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కె.ధారియన్ రాజు తదితరులున్నారు. -
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ నెయ్యి
లాలాపేట (హైదరాబాద్): రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన నెయ్యిని విజయ డెయిరీ ద్వారానే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) నూతన చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలను మరింత పెంచడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, హాస్పిటల్స్‌కు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేయాలని ఆయన సూచించారు.పాడి రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సహకారంతో పెండింగ్ పాల బిల్లులను త్వరలో చెల్లించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం లాలాపేటలోని విజయ భవన్లో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను ఆదరించి తెలంగాణ రాష్ట్ర పాడి రైతులను, పాడిపరిశ్రమను బలపరచాలనీ కోరారు. పాల సేకరణ ధరను మూడు పర్యాయాలు పెంచాం రాష్ట్రంలోని 32 జిల్లాలోని 40,445 పాడి రైతుల నుంచి 6,148 పాల సేకరణ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ సుమారు 4.20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెపె్టంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడాలేని విధంగా 3 పర్యాయాలు రూ. 12.48 పైసలు పెంచామన్నారు. దీంతో పాల సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు.అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డెయిరీలు, ప్రైవేట్ డెయిరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను తక్కువ ధరకు రూ. 26 నుంచి రూ. 34లకే కొని ఇక్కడ తక్కువ ధరకు అమ్మకాలు చేపట్టాయని, దీంతో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందన్నారు. అందుకే పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. -
భారత హాకీ జట్టకు ఘన సన్మానం.. అమిత్‌కు రూ. 4 కోట్ల నజరానా
భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం కొనసాగిస్తుందని... 2036 వరకు భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా కొనసాగుతుందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు.బుధవారం భువనేశ్వర్‌లో భారత జట్టు సభ్యులకు ఒడిశా ప్రభుత్వం సన్మానించింది. పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానాను చెక్ రూపంలో అందించింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు తలా రూ. 15 లక్షల, సహాయక సిబ్బదికి రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేసింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.ఈ సందర్భంగా భారత సారథి హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చాం. చాలా అవకాశాలు సృష్టించుకున్నాం. అయితే అది మా రోజు కాదు. అయినా కాంస్య పతక పోరులో తిరిగి సత్తాచాటాం. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పారిస్‌కు వెళ్లాం. కానీ అది సాధ్యపడలేదు. వరసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని.. ఇక్కడ హాకీకి కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి’ అని అన్నాడు. -
వివేక్‌కు కోటి.. అతడికి రూ. 4 కోట్లు: ప్రభుత్వాల భారీ నజరానాలు
భారత హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల రివార్డుతో సత్కరించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారంటూ వివేక్‌తో పాటు భారత హాకీ జట్టు ఆటగాళ్లందరినీ ప్రశంసించారు.వరుస ఒలింపిక్స్లోకాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. స్పెయిన్‌తో గురువారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 2-1తో విజయం సాధించింది.టోక్యో ఫలితాన్ని పునరావృతం చేస్తూ మరోసారి మెడల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన హాకీ జట్టుగా నిలిచింది. విశ్వ క్రీడల్లో హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది 13వ పతకం.వివేక్‌కు ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగంఈ నేపథ్యంలో హాకీ ఇండియా కాంస్యం గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు నజరానా ప్రకటించింది. ప్లేయర్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్‌కు ఫోన్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. ‘‘అద్బుతమైన ప్రదర్శన. దేశం మొత్తం మిమ్మల్ని చూసి సంతోషిస్తోంది. జట్టుకు అభినందనలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీ అకౌంట్‌కు కోటి రూపాయలు రివార్డుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా మీరు పనిచేస్తున్నారు. మీకు ఈ కోటి రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.అమిత్‌కు రూ. 4 కోట్లుకాగా టోక్యోలో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడైన వివేక్‌కు నాటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ఇచ్చింది. మరోవైపు.. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తమ హాకీ స్టార్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానా ప్రకటించారు. జట్టులోని ఇతర సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు. -
థ్రిల్లింగ్‌గా ‘1000 వాలా’ టీజర్
అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘1000 వాలా’. అఫ్జల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అనే నమ్మకం కలిగింది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం" అని తెలిపారు. -
విడుదలకు సిద్ధమైన ‘1000 వాలా’
సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000 వాలా. టెన్ రూపీస్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది.అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో వచ్చిన స్పందన చూసి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "మా 1000 వాలా చిత్రం ఫస్ట్ లుక్ సోషల్ మీడియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా సినిమా తప్పక విజయం సాధిస్తుంది అని నమ్మకం కలిగింది. షూటింగ్ అంత పూర్తి అయింది. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
Paris Olympics 2024: భారత బాక్సర్లకు చివరి అవకాశం
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీ శుక్రవారం నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు బాక్సర్లు (అమిత్ పంఘాల్–51 కేజీలు, సచిన్–57 కేజీలు, అభినాశ్ జమ్వాల్–63.5 కేజీలు, నిశాంత్ దేవ్–71 కేజీలు, అభిమన్యు–80 కేజీలు, సంజీత్–92 కేజీలు, నరేందర్ –ప్లస్ 92 కేజీలు)... మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు (జాస్మిన్–57 కేజీలు, అంకుశిత–60 కేజీలు, అరుంధతి–66 కేజీలు) బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌కు విశ్వ క్రీడల బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్(75 కేజీలు) ఒలింపిక్స్-2024 పోటీలకు అర్హత సాధించారు. -
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్‌లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది. అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ రోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తీసుకోవాల్సిన క్రమశిక్షణ చర్యలు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వీరేతిరుపతి జిల్లాఎ.సురేందర్‌రెడ్డి డీఎస్పీ–తిరుపతికె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీఒ.రామచంద్రారెడ్డి ఇన్స్పెక్టర్–అలిపిరిపల్నాడు జిల్లాఎ.పల్లపురాజు ఎస్డీపీవో–గురజాలవీఎస్ఎన్ వర్మ ఎస్డీపీవో–నరసరావుపేటకె.ప్రభాకర్‌రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడిడి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్అనంతపురం జిల్లాసి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రిఎస్. మురళీకృష్ణ ఇన్స్పెక్టర్–తాడిపత్రి -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్.. బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. -
దొంగలొస్తే.. దొరకబుచ్చుకుని..
సనత్‌నగర్ (హైదరాబాద్): ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించి, దోపిడీకి ప్రయత్నించారు. కానీ వారు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లోని బేగంపేట పైగాకాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల మేరకు.. మాస్్క, హెల్మెట్ పెట్టుకుని.. బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్ జైన్, అమిత్ మహోత్ (46) భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో పనిచేసిన వ్యక్తే.. ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి నుంచి రెండు కత్తులు, తపంచా (నాటు తుపాకీ)లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దుండగులు మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. క్లారిటీ ఇచ్చిన సుఖేందర్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో క్షేత్రస్థాయిలో నిర్మాణ లోపం ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో సీఎం రేవంత్ పాలన బాగానే ఉన్నట్టు ప్రజలు భావిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధంలేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు సీఎం రేవంత్ బంధువు అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాత్రమే కలిశాను. బయట ఎప్పుడూ కలవలేదు. నేను ఏ రాజకీయ పార్టీలో చేరను. నా కుమారుడు అమిత్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. కానీ ఎలాంటి చర్చలు జరగలేదు. అలాగే, బీఆర్ఎస్లో కొందరు నేతలు అమిత్‌కు సహకరించకపోవడంతో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నాడు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అమిత్ దూరంగా ఉన్నాడు’ అని క్లారిటీ ఇచ్చారు. -
భారత్.. దేశం కాదు ఉపఖండం
చెన్నై: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇదొక ఉపఖండం మాత్రమేనని అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని చెప్పారు. మధురైలో మంగళవారం డీఎంకే కార్యక్రమంలో ఎ.రాజా ప్రసంగించారు. ‘‘రాముడికి శత్రువు ఎవరు? రాముడి గురించి, రామాయణం గురించి నాకు అంతగా తెలియదు. వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్లాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు. ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం, మతం ప్రసక్తి లేదని అర్థమవుతోంది. ఇండియా ఒకే దేశమని అంటున్నారు. ఒకే దేశమైతే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇదొక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. తమిళనాడులో డీఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకొంటోందా?’’ అంటూ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాను వెంటనే అరెస్టు చేయాలి డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని బీజేపీ నేత∙అమిత్ మాలవీయా విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ అనుచితంగా మాట్లాడారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే డీఎంకే నేతల కుటిల యత్నమని మండిపడ్డారు. రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని తిమళనాడు డీఎంకే అధికార ప్రతినిధి తిరుపతి అన్నారు. రాజా వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించింది. రాజా వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చెప్పారు. -
Parliament: నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’: బీజేపీ ఎంపీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం బుధవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. సభలో దుండగులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించి.. ఎంపీలను భయాందోళను గురిచేసిన ఈ ఘటన ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ విజిటర్ గ్యాలరీకి అనుమతి సిఫార్స్ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహకు నిందితుల్లో ఓ వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వెంటనే ఆయన్ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. सत्ता परिवर्तन or regime change is a phrase Congress leaders often use. Meet Neelam Azad, the lady who breached Parliament’s security today. She is an active Congress/I.N.D.I Alliance supporter. She is an आंदोलनजीवी, who has been seen at several protests. Question is who sent… pic.twitter.com/9pilzFUgZZ — Amit Malviya (@amitmalviya) December 13, 2023 ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అమిత్ మాల్వియా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. నిందితుల్లో ఒకరైన నీలం ఆజాద్ ‘ఆందోళన జీవీ’ అని అన్నారు. అంతే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ మద్దతురాలు అంటూ వ్యాఖ్యానించారు. భదత్ర వైఫల్యం వల్లనే పార్లమెంట్లో ఆగంతకులు చొరబడి కలకంలో రేపారని కాంగ్రెస్ మండిపడుతున్న క్రమంలో బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో బీజేపీ అమిత్ మాల్వియా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. అమోల్ షిండే, నీలం ఆజాద్ పార్లమెంట్ ప్రాగణంలో రంగు గ్యాస్ గొట్టాలు వెదజల్లినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నిర్వహించిన పలు ఆందోళనల్లో నీలం అజాద్ కీయాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. ఆమె ఒక ‘ఆందోళన జీవి’ మండిపడ్డారు. ఆమె ఇండియా కూటిమి, కాంగ్రెస్ పార్టీ మద్దతురాలని ఆరోపణలు చేశారు. పలు నిరసనల్లో ఆమె కనిపించిన వీడియోను సైతం తన ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. వారిని పార్లమెంట్‌కు ఎవరు పంపారు?. వారీలో మైసూరుకు చెందిన వారు ఉండటానికి గల కారణం ఏంటీ? అని అమిత్ మాల్వియా సూటిగా ప్రశ్నించారు. పవిత్ర ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ను కాంగ్రెస్ పార్టీ అపవిత్రం చేస్తోందని మండిపడ్డారు. ఇక మరో నిందితుడు మనోరంజన్ కూడా కాంగ్రెస్ చెందిన వాడా?. రాహుల్ గాంధీ.. ‘భారత్ జోడా యాత్ర’లో పాల్గొన్నాడా? వంటి అనుమానాలు వస్తున్నాయని అమిత్ మాల్వియా ఆరోపించారు. చదవండి: Parliament Issue: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
Land-for-jobs case: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం.. లాలూ సన్నిహితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ల సన్నిహితుడు అమిత్ కట్యాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లు జారీ చేసినా అతడు తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ తెలిపింది. కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం రిమాండ్ కోరుతామని ఈడీ వివరించింది. ఈ కేసులో ఈడీ సమన్లను కొట్టివేయాల్సిందిగా అతడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో లాలూ, తేజస్వీ యాదవ్, లాలూ కుమార్తెలు తదితరులతోపాటు కట్యాల్ ఇంటిపైనా ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
కమ్యూనిస్టులతో కలిసుంటే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మిత్ర పక్షంగా ఉంటే బాగుండేదని, ఎన్నికలకు ముందు వామపక్షాలు దూరం కావడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ‘ఇండియా’, ‘ఎన్డీఏ’కూటములకు సమదూరం పాటిస్తున్నందునే కమ్యూనిస్టులతో మైత్రి సాధ్యం కాలేద ని తాను భావిస్తున్నానన్నారు. మండలిలోని తన చాంబర్లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో గుత్తా మాట్లాడారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై బి. వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి సంప్రదింపులు జరిపారని, వారికి నామినేటెడ్ పోస్టు లు కూడా ఇస్తామన్నారని గుత్తా తెలిపారు. కాగా, తాను ఉన్న పదవిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడబోనన్నారు. అవకాశమిస్తేనే గుత్తా అమిత్ పోటీ నల్లగొండ ఎంపీగా 2019లో తాను పోటీ చేస్తే విజయం సాధించేవాడినని, అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి నామినేటెడ్ పదవులవైపు వచ్చానని గుత్తా వెల్లడించారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం కేసీఆర్ వెంటే ఉంటానని, భవిష్యత్తులో ఆయనకు నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుత్తా ప్రకటించారు. తనకు శాసన మండలి చైర్మన్‌గా పదవీ కాలం చాలా ఉందని, సీఎం, తాను అనుకున్నంత కాలం ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పార్టీ టికెట్ ఆశించిన మాట వాస్తమేనని, కానీ అవకాశం లేకుంటే పార్టీ మాత్రం ఏం చేస్తుందని అన్నారు. బట్టకాల్చి మీదేయడమే రేవంత్ పని బట్టకాల్చి ఎదుటి వారిపై వేయడమే పనిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని గుత్తా అన్నారు. రెడ్లకు భయపడి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచి్చందనేది అవాస్తవమని, ప్రస్తుత రాజకీయాల్లో క్వాలిటీ ఆఫ్ లీడర్ షిప్ పడిపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల రాజ్యం నడుస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
మంత్రి జగదీష్‌తో ఎలాంటి విభేదాలు లేదు: గుత్తా కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంందనే ప్రచారం సాగుతోంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంతో సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై కూడా వ్యాఖ్యలు చేశారు. కాగా, గుత్తా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు, మంత్రి జగదీష్‌కి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అలాగే, ఉద్యోగుల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల్లో నేను జోక్యం చేసుకోలేదన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. తన కుమారుడు అమిత్‌కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తారు. టికెట్ కోసం పైరవీలు చేయనని చెప్పారు. వామపక్షాలతో సీట్లు పొత్తు ఖరారు అయ్యాకనే ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మార్పు క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. వామపక్షాలు బీఆర్ఎస్తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఎక్కడ పని చేసినా రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలన్నారు. కాగా, సొంత పార్టీ ఎంపీపీ, మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సరికాదు. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై సీరియస్ అయ్యారు. వెంకట్ రెడ్డి నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. తాను భాష ప్రయోగం విషయంలో హుందాగా ఉంటుందని తెలిపారు. బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదన్నారు. తమ పనిని ప్రజలు మెచ్చుతున్నారా.. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించాలని హితవు పలికారు. ఇది కూడా చదవండి: కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు! -
అమిత్ మాలవీయాపై కర్ణాటకలో కేసు నమోదు
బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయాపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు మాలవీయాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాలవీయా ఓ వీడియోను పోస్టు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు రగిలించడమే మాలవీయా ఉద్దేశమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, తనపై కర్ణాటకలో కేసు నమోదు కావడంపై మాలవీయా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ ఓ పావు అని విమర్శించారు. మాలవీయాపై కేసు పెట్టడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. -
నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమి తులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్ టు మార్స్’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఆయన కామన్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ డివిజన్ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు. -
రతన్ టాటా శిష్యుడు.. వేల కోట్లకు అధిపతి!
భారత్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ లెన్స్‌కార్ట్‌లో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. కంపెనీకి చెందిన పాత, కొత్త షేర్లను 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4100 కోట్లు)తో సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం లెన్స్‌కార్ట్ విలువ 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33,000 కోట్లు). ఇదీ చదవండి: రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్.. ఎవరిదో తెలుసా? పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, సుమీత్ కపాహి ఈ లెన్స్‌కార్ట్ సంస్థను స్థాపించారు. ఇందులో కేకేఆర్ అండ్ కంపెనీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టెమాసెక్ హోల్డింగ్స్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. వీరిలో పీయూష్ ప్రముఖ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో కనిపించిన తర్వాత సెలబ్రిటీ అయ్యారు. అయితే కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న అమిత్ చౌదరి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఎవరీ అమిత్ చౌదరి? అమిత్ చౌదరి లెన్స్‌కార్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, కంపెనీకి సీవోవో. అనలిటిక్స్ రంగంలో ప్రావీణ్యం ఉన్న అమిత్ చౌదరి కంపెనీని అభివృద్ధి దిశగా ముందుండి నడిపించారు. వ్యాపారంలో వృద్ధిని తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. లెన్స్‌కార్ట్ ఆఫ్‌లైన్ స్టోర్లను పెంచడంలో కీలకపాత్ర పోషించారు. కోల్‌కతాలో జన్మించిన అమిత్ చౌదరి స్థానిక భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నారు. బీఐటీ మెస్రా నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ పట్టా అందుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను తన మెంటర్‌గా చెబుతుంటారు. 2019లో రతన్ టాటాను కలిసిన ఆయన తాను రతన్ టాటాను ఎంతలా ఆరాధించేది తెలుపుతూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో పలువురిని బాగా ఆకట్టుకుంది. రతన్ టాటా అమిత్ చౌదరి కోసం 2016లో లెన్స్‌కార్ట్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇది తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాదు.. కష్టాల్లో ఉన్న స్టార్టప్ కంపెనీ అండగా నిలిచేందుకు. అలా అప్పట్లో రతన్ టాటా నుంచి సాయం పొందిన ఆయన శిష్యుడు నేడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. ఇదీ చదవండి: సమాచారం ఇవ్వండి.. రూ.20 లక్షలు అందుకోండి! సెబీ నజరానా.. -
టీఆర్ఎస్లో వారసుల హవా: మా వాడు వస్తున్నాడు.. దీవించండి!
సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది తమ వారసుల అరంగేట్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత.. తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహ రచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తన కుమారుడి గురించి నలుగురు చర్చించుకునే విధంగా స్లోగా తెరమీదకు తెస్తున్నారు. ఏదోవిధంగా గులాబీ బాస్ దృష్టిలో తన కుమారుడు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. మా వాడు వస్తున్నాడు.. దీవించండి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా కొనసాగారు. ఎంతో సీనియర్ అయినప్పటికీ ఆయన రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. ఆ కోరిక అలాగే మిగిలిపోవడం సుఖేందర్‌రెడ్డిని తొలచివేస్తోందట. అలాగే తన కుమారుడు అమిత్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా ఆయన కోరికల్లో మరొకటి. ఉమ్మడి జిల్లా నుంచి జగదీష్‌రెడ్డి మంత్రిగా ఉన్నందున మరో రెడ్డి సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశంలేదు. భవిష్యత్‌లో కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొడుకునన్నా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభలోకి పంపించాలని గుత్తా ప్లాన్ చేస్తున్నారు. కొంచెం గుర్తు పెట్టుకోండి. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారట. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. జిల్లాలో ఏదో ఒక నియోజవకర్గం నుంచి అమిత్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని గుత్తా చూస్తున్నారట. అయితే అది అంత సులువుగా నెరవేరే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆరే ప్రకటించారు. మరోవైపు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం ఎలా వస్తుంది? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తెలియాలి. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి అయినా పోటీ చేయించాలని సుఖేందర్ రెడ్డి అనుకుంటున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కావడంతో తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట. మేమూ పోటీలో ఉన్నాం అయితే నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే నేతల లిస్ట్ కూడా టీఆర్ఎస్లో పెద్దగానే ఉందట. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డితో పాటు మరో పారిశ్రామికవేత్త, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న ఓ మాజీ ఎంపీ కుమారుడితో పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మరో నేత కూడా టికెట్ కావాలని కోరుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్ ప్రజల్లోకి రాకపోవడం మైనస్‌గా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తాను పదవిలో ఉన్నప్పుడే కొడుకు రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలం అయితే మాత్రం.. అది అమిత్ రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమ భవిష్యత్ కోసం, వారసుల రాజకీయ భవిష్యత్ కోసం చాలా మంది కలలు కంటారు. కాని కొందరికీ కలలు వాస్తవ రూపంలో నెరవేరతాయి. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడిని చట్టసభకు పంపాలన్నా కల నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమీత్ గుజరాతీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అమిత్.. గత కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగ్తో కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. పీటీ వారెంట్‌పై అమిత్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆపై మీడియా ముందు, కోర్టులోనూ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా బూకీలను ఏర్పాటు చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగులకు పాల్పడుతున్నాడని అమిత్ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ సేకరించారు హైదరాబాద్ పోలీసులు. అంతేకాదు.. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విశాఖలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు -
అమిత్ రోహిదాస్కే భారత హాకీ పగ్గాలు
FIH Pro League: జర్మనీ జట్టుతో ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్‌లో జరిగే ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో పాల్గొనే భారత పురుషుల జట్టును ప్రకటించారు. ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ జట్టులో సభ్యుడిగా, వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. స్వదేశంలో అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో జరిగిన నాలుగు ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో అమిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్ 21 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో ఉంది. చదవండి: IPL 2022: టైటాన్స్ జోరుకు రైజర్స్ బ్రేక్ -
నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చారు : బిగ్‌బాస్ ఫేం అమిత్
‘‘గోవులను సంరక్షించుకోవాలనే సందేశాన్ని ‘నల్లమల’ సినిమా ద్వారా ప్రజలకు వివరించిన రవి చరణ్‌ని అభినందిస్తున్నాను. గో సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ‘నల్లమల’ లాంటి సందేశాత్మక సినిమాలు మరిన్ని రావాలి’’ అని ‘యుగతులసి ఫౌండేషన్’ చైర్మన్ కె.శివ కుమార్ అన్నారు. అమిత్ తివారీ, భానుశ్రీ జంటగా, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, ‘బాహుబలి’ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో రవి చరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నల్లమల’. నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో అమిత్ తివారి మాట్లాడుతూ– ‘‘క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చిన ఆర్ఎమ్కి థ్యాంక్స్. రెండున్నరేళ్ల మా కష్టానికి ‘నల్లమల’ విజయంతో తగిన ప్రతిఫలం దొరికింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకి మా సినిమా నచ్చింది. నా మొదటి చిత్రానికే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రవిచరణ్. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, పాటలు, సంగీతం: పి.ఆర్. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ. 19,675 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ల కొనుగోలుకు ఈనెల 20వ తేదీ దాకా రూ. 19,675 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేశామని సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానమిచ్చింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది జనవరి 16న మనదేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. కోవిన్ పోర్టల్ ప్రకారం దేశంలో ఇప్పటిదాకా 140 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. మే 1 నుంచి డిసెంబరు 20వ తేదీ దాకా 117.56 కోట్ల డోసులను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో (సీవీసీ) ప్రజలకు ఉచితంగా అందజేశామని, 4.18 కోట్ల డోసులను మాత్రం ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ వివరించింది. జూన్ 21న మార్చిన నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తయారీ సంస్థలు తమ నెలవారీ ఉత్పత్తి సామర్థ్యంలో 25 శాతం టీకాలను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవచ్చు. 60 శాతం మందికి డబుల్ డోస్ దేశంలో అర్హులైన వారిలో (18 ఏళ్లకు పైబడిన వారిలో) 60 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు. 89 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని తెలిపారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గురువారం 300 దాటింది. -
అమిత్ ఖత్రీకి రజతం
నైరోబి: భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ సుదీర్ఘ పరుగులో సత్తా చాటుకున్నాడు. ప్రపంచ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 10,000 మీ. పరుగులో అతను రజత పతకం సాధించాడు. మహిళల 400 మీ. పరుగులో ప్రియా మోహన్ తృటిలో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రోహ్టక్కు చెందిన 17 ఏళ్ల టీనేజ్ అథ్లెట్ అమిత్ ఖత్రీ ఓ రకంగా అద్భుతమే చేశాడు. సాధారణంగా ఆఫ్రికా అథ్లెట్లకు మాత్రమే సాధ్యమయ్యే సుదీర్ఘ పరుగులో భారత అథ్లెట్ పతకం గెలవడం విశేషం. శనివారం జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో అతను పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. నిజానికి ఖత్రీ స్వర్ణం గెలిచే అవకాశాలు చివరి వరకు కనిపించాయి. వేగంగా దూసుకెళ్లిన అతను 8 ల్యాపులు ముగిసే సరికి అందరికంటే ముందున్నాడు. దాదాపు 9000 మీటర్ల దాకా ఇదే వేగం నమోదు చేయగా... స్థానిక అథ్లెట్ వాన్యోని అనూహ్యంగా ఆఖరి ల్యాపులో అమిత్ ఖత్రీని అధిగమించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. కెన్యా రాజధాని నైరోబి సముద్ర మట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంటుంది. ఇది భారతీయులకు ప్రతికూల ప్రదేశం. ఇలాంటి చోట భారత అథ్లెట్ సుదీర్ఘ పరుగులో స్వర్ణానికి చేరువగా వెళ్లడం ఆషామాషీ విషయం కాదు. పరుగు ముగిసిన అనంతరం ఖత్రీ మాట్లాడుతూ ‘నేను ఆశించిన ఫలితం కాదిది. అయినా సరే రజతంతో తృప్తిగా ఉన్నాను. ఐదు రోజుల ముందు ఇక్కడికొచ్చిన నన్ను ప్రతికూల వాతావరణం ఇబ్బంది పెట్టింది. ఒక ల్యాప్‌లో అయితే శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది’ అని అన్నాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడి ప్రదర్శన పట్ల కోచ్ చందన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల 10వేల మీటర్ల రేస్‌వాక్‌లో బల్జీత్‌కౌర్ (48 ని.58.17 సె) ఏడో స్థానంలో నిలిచింది. ప్రియకు చేజారిన పతకం... మహిళల 400 మీటర్ల పరుగులో అనేక అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రియా మోహన్‌కు నిరాశే ఎదురైంది. దురదృష్టవశాత్తూ ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ఫైనల్ పోటీని ప్రియ 52.77 సెకన్లలో ముగించింది. ఈ ఈవెంట్లో ఇమావోబంగ్ (నైజీరియా; 51.55 సె.), కార్నెలియా (పోలండ్; 51.97 సె.), కెన్యా అథ్లెట్ సిల్వియా చెలన్‌గట్ (52.23 సె.) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలిచారు. పురుషుల 400 మీ. హర్డిల్స్‌లో రోహన్ గౌతమ్ కాంబ్లి ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో అతను 52.88 సెకన్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల హీట్స్‌లో అబ్దుల్ రజాక్, సుమిత్ చహల్, కపిల్, భరత్ శ్రీధర్‌లతో కూడిన జట్టు హీట్స్‌తోనే సరిపెట్టుకుంది. -
హీరో, హీరోయిన్లుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో ఆసక్తికర కథా కథనాలతో తెరకెక్కుతోన్న చిత్రం `నల్లమల`. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రవి చరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నవే పిల్లా సాంగ్ ఇప్పటికే 17 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాటకు లక్షకు పైగా కవర్‌సాంగ్స్ రావడం విశేషం. అలాగే ఈ చిత్రంనునుండి విడుదలైన అన్ని పాటలు 1మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించడం ఆడియన్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదలతేదిని ప్రకటించనున్నారు. -
భారత్ పంచ్ అదిరింది
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో వచ్చిన విరామం తర్వాత పాల్గొన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. జర్మనీలోని కొలోన్ పట్టణంలో ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అమిత్‌కు ఫైనల్లో తన ప్రత్యర్థి బిలాల్ బెన్నమ్ (ఫ్రాన్స్) నుంచి వాకోవర్ లభించగా... సిమ్రన్‌జిత్ కౌర్ 4–1తో మాయా క్లీన్హాన్స్ (జర్మనీ)పై, మనీషా 3–2తో భారత్‌కే చెందిన సాక్షిపై గెలుపొందారు. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఫైనల్లో సతీశ్ తన ప్రత్యర్థి నెల్వీ టియాఫాక్ (జర్మనీ)కి వాకోవర్ ఇచ్చాడు. సెమీఫైనల్లో ఓడిన సోనియా (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), గౌరవ్ (57 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జర్మనీ, బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, మాల్డోవా, నెదర్లాండ్స్, పోలాండ్, ఉక్రెయిన్ దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొన్నారు. -
ఐస్‌క్రీమ్ వద్దన్నాడని చంపేశారు..
న్యూఢిల్లీ: ఉచితంగా ఇచ్చిన ఐస్‌క్రీమ్‌ను కాదన్నాడన్న కారణంతో నలుగురు యువకులు మరో యువకున్ని చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన లక్ష్యయ్ (27) మిత్రులు ధీరజ్ (26), కరణ్ (29), అవినాశ్‌లతో విందు చేసుకున్నాడు. ఆపై ఐస్‌క్రీములు కొనుక్కుని తమకు ఎదురైన అమిత్ (25), రాహుల్, ఇశాంత్‌లకు వాటిని ఇవ్వబోగా తిరస్కరించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న లక్ష్యయ్ బృందం వారిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అమిత్ ప్రాణాలు విడిచాడు. అతడి మిత్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. -
శివరాత్రి కానుకగా ‘చీమ- ప్రేమ మధ్యలో భామ’
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది శివుడికి ఎంతో ఇష్టమైన రోజు ‘మహాశివరాత్రి’ పర్వదినాన మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు నిర్మాత ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ. మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘మహాశివరాత్రి కానుకగా మా చిత్రం ‘చీమ- ప్రేమ మధ్యలో భామ’ విడుదల చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాటి యువతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణితితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుందని తెలియజేసేందుకు మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదించగలరని కోరుతున్నాము.’ అని అన్నారు. సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు నటించిన ఈ చిత్రానికిరవి వర్మ సంగీతం అందించారు. -
స్వచ్ఛమైన ప్రేమ
అమిత్, ఇందు జంటగా నటించిన చిత్రం ‘చీమ ప్రేమ మధ్యలో భామ’. మాగ్నమ్ ఓపస్ ఫిలింస్ పతాకంపై శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్.ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘చిన్న సినిమాల్లో మా సినిమా స్పెషల్. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రస్తుతం యువతీ యువకులు ప్రేమవిషయంలో ఎంత పరిణతితో ఉన్నారో చూపే చిత్రమిది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉంటుందని చెబుతున్నాం. మా సినిమా అన్ని వర్గాలవారికి నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత. ‘‘మంచి పాత్ర చేశా’’ అన్నారు అమిత్. -
హీరో చీమ
అమిత్, ఇందు జంటగా శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీమ– ప్రేమ మధ్యలో భామ’. ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో విడుదల కానున్న ఈ చిత్రం గురించి శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో చీమే హీరో. అలా అని ఈ చిత్రం చిన్న పిల్లలకు ప్రత్యేకం అని చెప్పలేం. ఈ సినిమా అందరి కోసం... కాకపోతే కొంచెం ఎక్కువ మహిళల కోసం’’ అన్నారు. ‘‘మా సినిమాకి ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండా విడుదలకు అనుమతి లభించింది. విలువలకు ప్రాధాన్యతనిస్తూ తీసిన వినూత్నమైన సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
అంతఃకరణ శుద్ధితో...
అమిత్, ఇందు జంటగా చీమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చీమ ప్రేమ మధ్యలో భామ!’. శ్రీకాంత్ శ్రీ అప్పల రాజు దర్శకత్వంలో ఎస్ఎన్ లక్ష్మీనారాయణ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘‘మా సినిమాకి చీమే హీరో. అంతఃకరణ శుద్ధితో అడుగు ముందుకు వేస్తే ఏదైనా సాధ్యమే, ఎవరేం కావాలనుకున్నా కావచ్చనే అంతర్లీన సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రం హీరో ప్రభాస్‌గారి అభిమానులకు ప్రత్యేకంగా నచ్చుతుంది.. అది ఎందుకో తెలియాలంటే విడుదల వరకూ ఆగాలి’’ అన్నారు శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు. ‘‘ఫ్యాంటసీతో కూడిన ప్రేమ కథ ఇది’’ అన్నారు లక్ష్మీనారాయణ. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
చీమ ప్రేమకథ
అమిత్, ఇందులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చీమ– ప్రేమ మధ్యలో భామ!’. లక్ష్మీ నారాయణ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రమిది. అలాగని పూర్తి యానిమేషన్ చిత్రం కాదు. అందరూ చూడదగ్గ మంచి కుటుంబ కథా చిత్రం’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ చూసి, రాజమౌళిగారి ‘ఈగ’ను మా చీమతో పోల్చాడం గొప్ప ప్రశంసగా భావిస్తున్నాం. ‘ఈగ’ది ప్రతీకారం. మా చీమది ప్రేమకథ’’ అన్నారు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు. సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
బాలు పాట హైలైట్
అమిత్, ఇందు, సుమన్, హరిత ముఖ్య తారలుగా శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీమ–ప్రేమ.. మధ్యలో భామ’. చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్‌పై లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈగ’ సినిమా మాకు స్ఫూర్తి. చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు టైటిల్ సాంగ్‌ని అద్భుతంగా ఆలపించారు. రవివర్మగారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట పదికాలాలు అందర్నీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
చీమ మనిషిగా మారితే...!
మనిషిలా మారాలని ఓ చీమ తాపత్రయపడుతుంది. అసలు.. అది సాధ్యమా? ఒకవేళ కుదిరితే ఆ చీమకు ప్రేమ, శృంగారం ఫీలింగ్స్ కలిగితే ఎలా ఉంటుంది? అనే అంశాలతో ‘చీమ – ప్రేమ మధ్యలో భామ’ అనే చిత్రం తెరకెక్కింది. అమిత్, ఇందు హీరోహీరోయిన్లుగా నటించారు. మాగ్నస్ ఓపస్ ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్.ఎన్. లక్ష్మీనారాయణ నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఇది ఓ యువజంట ప్రేమకథ. కుటుంబ విలువలతో, కామెడీ సన్నివేశాలతో ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించాం. యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సంగీతం, గ్రాఫిక్ వర్క్స్ హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘మా చిత్రంలో చీమ ప్రధాన ఆకర్షణ . ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, గీతామాధురి పాడిన పాటలు హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు లక్ష్మీనారాయణ. -
భారత్ పంచ్ అదిరింది
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల పంచ్ పవర్ కొనసాగుతోంది. పురుషుల విభాగంలో అమిత్ పంగల్ (52 కేజీలు), కవిందర్ సింగ్ బిష్త్ (56 కేజీలు), దీపక్ (49 కేజీలు)... మహిళల విభాగంలో సోనియా చహల్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. అయితే లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు), రోహిత్ టోకస్ (64 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అదే ఫలితం: సోమవారం జరిగిన బౌట్లలో అమిత్, కవిందర్ తమ అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టారు. రియో ఒలింపిక్స్ చాంపియన్ హసన్‌బాయ్ దస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)పై అమిత్... ప్రపం చ చాంపియన్ కైరాట్ యెరాలియెవ్ (కజకిస్తాన్)పై కవిందర్ అద్భుత విజయాలు సాధించారు. గతేడా ది జకార్తా ఆసియా క్రీడల ఫైనల్లో దస్మతోవ్‌ను ఓడించి స్వర్ణం నెగ్గిన అమిత్ ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. తొలి రౌండ్ నుంచే పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన అమిత్ 4–1తో దస్మతోవ్‌ను ఓడించాడు. ఇటీవలే ఫిన్లాండ్లో జరిగిన గీబీ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సాధించిన కవిందర్ ఫామ్‌ను కనబరుస్తూ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ను బోల్తా కొట్టించాడు. తొలి రౌండ్లో కైరాట్ ఆధిపత్యం చలాయించినా... తదుపరి రెండు రౌండ్లలో కవిందర్ తన ప్రత్యర్థి పంచ్‌లను కాచుకొని అవకాశం దొరికినపుడల్లా ఎదురుదాడి చేశాడు. చివరకు కవిందర్‌ను 3–2తో విజయం వరించింది. దీపక్ సింగ్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన అఫ్గానిస్తాన్ బాక్సర్ రామిష్ రహ్మాని గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో దీపక్‌ను విజేతగా ప్రకటించారు. మహిళల 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో జో సన్ వా (కొరియా)పై సోనియా 3–2తో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో లవ్లీనా 0–5తో చెన్ నియెన్–చిన్ (చైనీస్ తైపీ) చేతిలో... సీమా పూనియా 0–5తో యాంగ్ జియోలి (చైనా) చేతిలో... రోహిత్ 2–3తో చిన్‌జోరిగ్ బాతర్సుక్ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు. -
పోలీసులూ మామూలు మనుషులే..
‘పోలీసుల నుంచి ప్రజలు సత్వర సేవలు, మార్పులు, పరిష్కారాలుకోరుకుంటారు. అయితే వనరులు, సమయం తక్కువగా ఉండడం తదితరఇబ్బందులు ఉంటాయి. దోషిని కోర్టులో అప్పగిస్తేనే సరిపోదు కదా... సాక్ష్యాలు కూడా కావాలి. దానికి సమయం పడుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. పోలీస్కూడా అందరిలాగే మామూలు మనిషేనని గుర్తించాలి. ప్రస్తుతం సిస్టమ్ ఆర్గనైజ్డ్గానే ఉంది. నిబద్ధత ఉంటే ఎలాంటి మార్పు అయినా తీసుకురావచ్చు. అది నేను స్వయంగా చూశాను. పోలీసులు ప్రజలని, ప్రజలు పోలీసులను గౌరవించుకోవాలి. ప్రజలు పోలీసులను నమ్మాలి. అసలు మా దగ్గరికి రాకుండానే వ్యవస్థ సరిగా లేదనడం సరికాద’ని అన్నారు బిహార్‌కు చెందినఐపీఎస్ అధికారి, రచయిత అమిత్ లోదా. ఆయన రాసిన ‘బిహార్ డైరీస్’పుస్తక అనుభవాలను పంచుకునేందుకు ఇటీవల సిటీకి వచ్చిన లోదా‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... సాక్షి, సిటీబ్యూరో :నా తొలి పోస్టింగ్(2006) శిక్‌పురా. అక్కడికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక పెద్దావిడ ఏడుస్తూ వచ్చి నా కుటుంబంలో అందరినీ చంపేశారని చెప్పింది. ఓ చిన్న కారణానికే ఓ ముఠా 24 గంటల్లో 15 మందిని చంపేసింది. అదే ముఠా అంతకముందు 70 మందిని పొట్టనపెట్టుకుంది. వాళ్లని పట్టు కోవడం చాలెంజింగ్‌గా తీసుకున్నాను. అప్పట్లో ఇంత సాంకేతికత లేకున్నా కష్టపడి వాళ్లను పట్టుకున్నాం. ఇప్పుడు వారంతా జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఆ ముఠా అరాచకాలు సాగి ంచిన నాలుగైదు జిల్లాల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వారిని అరెస్టు చేశాక నా కంటే ఎక్కువ నా భార్య ఆనందించింది. మరో పుస్తకం... బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌తో డిన్నర్ చేస్తున్నప్పుడు బిహార్‌లో నేను ఛేదించిన కేసుల గురించి చెప్పాను. ఆయన సినిమా తీస్తే బాగుంటుందని సూచించారు. దర్శకుడు నీరజ్‌పాండే ఆ పనిలో ఉన్నారు. అదే సమయంలో ట్వింకిల్, ఇమ్రాన్హష్మీ తదితరులు పుస్తకం రాయమన్నారు. ‘బిహార్ డైరీస్’ పేరుతో నేను రాసిన పుస్తకానికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు మరో పుస్తకం రాసే పనిలో ఉన్నాను. సిటీ.. బెస్ట్ 21ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనే నా ట్రైనింగ్ జరిగింది. అప్పటికే ఇక్కడి ట్రాఫిక్ సిస్టమ్ దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఆర్గనైజ్డ్గా ఉండేది. టెక్నికల్‌గా ఏదైనా అడాప్ట్ చేసుకోవడంలో ఇక్కడి పోలీసులు ముందుంటారు. జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్... లాస్‌వేగాస్‌లోని పీఎస్‌లాగా ఎంతో అందంగా ఉంది. నాకు రోల్‌మోడల్ అంటూ ఎవరూ లేరు. చాలామంది నుంచి ఎన్నో నేర్చుకున్నాను. మహిళలపై దాడులు, అత్యాచారాలు తగ్గాలంటే పురుషులు మారాలి. పురుషులు మహిళలతో మర్యాదగా నడుచుకోవాలి. అందరం సమానత్వమనే భావన రావాలి. ఇది పిల్లలకు చెప్పాలి. నీతి నిజాయతీతో అవినీతికి దూరంగా ఉండేవారే నిజమైన హీరోలు. భారత్ కే వీర్... ‘భారత్ కే వీర్’ పేరుతో ఓ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశాను. మనదేశ జవానుల సేవలు, వారి త్యాగాల గురించి అందరికీ తెలియకపోవచ్చు. అలాంటి హీరోల గాథలు ఇందులో ఉంచుతాం. అమరుల కుటుంబసభ్యులు, వారి బ్యాంకు అకౌంట్ వివరాలను ఇందులో పొందుపరుస్తాం. ఎవరైనా వారికి విరాళాలను అందించవచ్చు. ఒకటిన్నర ఏడాదిలో రూ.45 కోట్ల విరాళాలను సేకరించాం. ఢిల్లీ ఐఐటీలో చదివిన అమిత్ లోదా రచయిత, వక్త, పోలీస్ ఆఫీసర్. బిహార్‌లో ఎన్నో సాహసోపేతమైన పోలీస్ ఆపరేషన్లలో పాల్గొని గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేశారు. ఆయన ఛేదించిన అనేక క్రైమ్ సంఘటనలు సినిమా కథలకు ఏ మాత్రం తీసిపోవు. పోలీస్ అధికారిగా ఆయన ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్, గుడ్ గవర్నెన్స్‌కు జీఫైల్స్ అవార్డ్, ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. -
రైలొచ్చేలోగా.. రిలాక్స్
రైలు దిగగానే ఎక్కడో ఒక చోట అలా వాలిపోతే బావుండుననిపించేంతటి బడలిక. ఒత్తిడి. అదిగో ... సరిగ్గా అలాంటి ప్రయాణికుల కోసమే దక్షిణ మధ్య రైల్వే చక్కని సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణ బడలికను తీర్చి ఎంతో ఊరటను, హాయిని కలిగించే మసాజ్ చైర్లను తొలిసారి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టులకు మాత్రమే పరిమితమైన మసాజ్ చైర్ సేవలు ఇప్పుడు రైల్వేస్టేషన్లలో సైతం అందుబాటులోకి వచ్చాయి. గురువారం సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదాన్ ఈ మసాజ్ చైర్లను లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికులకు విమానాశ్రయం తరహాలో సదుపాయాలను అందజేసేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు చర్యలు చేపట్టిందన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ట్రైన్ దిగగానే కొద్ది సేపు సేదదీరేందుకు ఈ చైర్లు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఐదు నిమిషాల మసాజ్ అనంతరం తిరిగి తమ గమ్యస్థానానికి బయలుదేరవచ్చునని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోనే అతి పెద్ద స్టేషన్ అయిన సికింద్రాబాద్‌లో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలను అందజేస్తున్నట్లు చెప్పారు. 50 రూపాయలు 5 నిమిషాలు.. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైన రెండు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైన రెండు మసాజ్ చైర్లను ఏర్పాటు చేశారు. ఈ చైర్లో 5 నిమిషాల సర్వీసుకు రూ.50 చార్జీ ఉంటుంది. దీనితో పాటు శరీరం మొత్తం రిలాక్స్ అయ్యేవిధంగా మసాజ్ అవుతుంది. శరీరంలోని ప్రతి కండరానికి రక్తసరఫరా పెరిగి ఒత్తిడి తగ్గేలా ఈ చైర్ చక్కటి మసాజ్‌ను అందజేస్తుంది. సుదూరప్రయాణాలు చేసి వచ్చే వారికి ఇది ఎంతో అవసరమని, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న మసాజ్ చైర్లకు అనూహ్యమైన డిమాండ్ ఉందని నిర్వాహకుడు శివకుమార్ తెలిపారు. ‘సాధారణంగా మసాజ్ సెంటర్లు, ఫిజియోథెరపీ కేంద్రాల్లో రూ.వందల్లో ఫీజు తీసుకుంటారు. రైల్వేస్టేషన్లో కేవలం రూ.50లు తీసుకుంటున్నాం. బయట ఒక అరగంట పాటు మసాజ్ చేసినప్పుడు ఎలాంటి రిలాక్స్ అనుభూతి కలుగుతుందో ఈ చైర్లో కేవలం 5 నిమిషాల్లో కూడా అలాంటి అనుభూతినే పొందవచ్చు.’’అని చెప్పారు. ఒక్కసారిగా బడలిక ఎగిరిపోతుందన్నారు. ఇవీ ప్రయోజనాలు.. ►తల, మెడ, వెన్ను భాగం మొదలుకొని కాళ్లు, చేతుల వరకు అన్నింటికి మసాజ్ అందుతుంది. ►ఒకే సమయంలో శరీరంలోని అన్ని భాగాలు రిలాక్స్ అవుతాయి. ► క్షణాల్లో ఒత్తిడి మాయమవుతుంది. రక్తసరఫరా బాగా మెరుగు పడుతుంది. ►శరీరంలో ఉండే నొప్పులు, బాధలు తగ్గిపోతాయి. ►దశలవారీగా కాచిగూడ, నాంపల్లి, తదితర ప్రధాన స్టేషన్లలోనూ మసాజ్ చైర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ -
బిగ్‌బాస్ : కౌశల్ టాప్ త్రీ లో ఉండడట!
బయట కౌశల్ ఆర్మీ విజృంభిస్తుంటే.. లోపల మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. గత వారం ఎలిమినేట్ అయిన శ్యామలను నాని.. టాప్ త్రీలో ఎవరు ఉంటారని అడిగితే.. కౌశల్ పేరు చెప్పలేదు. అసలే కౌశల్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటారు. ఇక తమ అభిమాన కంటెస్టెంట్ పేరును చెప్పలేదని శ్యామలను విపరీతంగా ట్రోల్చేశారు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన అమిత్ కూడా ఇదే బాటలో సాగుతూ.. రోల్‌రైడా, గీతా, సామ్రాట్ టాప్ త్రీలో ఉంటారని.. రోల్, సామ్రాట్ ఇద్దరిలో ఏవరైనా టైటిల్ గెలవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. సోషల్ మీడియాలో కౌశల్‌కు సపోర్ట్‌గా భారీగానే మద్దతు లభిస్తోంది. అయితే అది పెయిడ్ క్యాంపెన్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి పెయిడ్ క్యాంపెయిన్ల గురించి చాలానే చర్చ జరుగుతుంది. దీప్తి తరపున కూడా పెయిడ్ క్యాంపెన్ నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే రీసెంట్గా కౌశల్ ఫాలోవర్స్ నిర్వహించిన 2కే రన్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపైనా.. పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కౌశల్ విన్నర్ కావాలని, అవుతాడని సోషల్ మీడియా కోడై కూస్తుంటే.. హౌజ్‌మేట్స్ మాత్రం కౌశల్ పేరు అసలే ప్రస్తావించడం లేదు. వాళ్లు కావాలని అలా అంటున్నారో, ఏదైనా పథకం ప్రకారం మాట్లాడుతున్నారో తెలియదు కానీ కౌశల్ మాత్రం టాప్త్రీలో గాని, ఫైనల్లోగానీ ఉంటాడని పొరపాటున కూడా చెప్పడం లేదు. బయట జరిగే టీవీ షోల్లో... పాల్గొనే వ్యక్తులు మాత్రం కౌశల్ విన్నర్ అవుతాడని చెప్పుకొస్తున్నారు. మాధవీలత, సంజన, యాంకర్ రష్మీ ఇలా ఎంతోమంది కౌశలే బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తాడని చెప్పుకొచ్చారు. నూతన్ నాయుడికి ఓట్లు ఎక్కువ వచ్చాయని, అయినా సరే కావాలనే నూతన్‌ను ఎలిమినేట్ చేశారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ప్రజల ఓట్లకు వ్యతిరేకంగా బిగ్‌బాస్ నిర్ణయం తీసుకున్నాడని.. బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఈ షోలో బిగ్‌బాస్ చెప్పిందే జరుగుతుంది.. చెయ్యాలనుకున్నదే చేస్తాడు.. కాబట్టి ఏదైనా జరుగొచ్చు. బయటి విషయాలతో సంబంధం లేకుండా బిగ్‌బాస్ వ్యవహరిస్తాడేమో చూడాలి. అయినా ఈ కార్యక్రమం కూడా చివరి అంకానికి చేరుకుంది కాబట్టి... ఇంకా షో లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. చివరకు ఎవరు మిగులుతారో.. ఎవరు టైటిల్ కొడతారో చూడాలి. -
‘పసిడి’ పోరుకు బాక్సర్ అమిత్
భారత బాక్సర్ అమిత్ పంఘాల్ (49 కేజీలు) ఆసియా క్రీడల ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అమిత్ 3–2తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)పై గెలిచి పసిడి పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏషియాడ్‌లో భారత్ తరఫున ఫైనల్ చేరిన ఏకైక బాక్సర్‌గా నిలిచాడు. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ దుస్మతోవ్ హసన్‌బాయ్ (ఉజ్బెకిస్తాన్)తో అమిత్ తలపడతాడు. మరో భారత బాక్సర్ వికాస్ కృషన్ (75 కేజీలు) ఎడమ కంటి గాయం కారణంగా సెమీస్ బరిలోకి దిగలేదు. దీంతో అతనికి కాంస్య పతకం ఖాయమైంది. వికాస్ శుక్రవారం సెమీఫైనల్లో అబిల్‌ఖాన్ (కజకిస్తాన్)తో తలపడాల్సి ఉం డగా... గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను పోటీ నుంచి తప్పుకున్నాడు. ఈ పతకంతో వికాస్ వరుసగా మూడు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. -
బిగ్‌బాస్ : అమిత్‌కు బంపర్ ఆఫర్!
లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చేసరికి హౌజ్‌మేట్స్ సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్లు అయింది. ఈ యూనివర్సల్ హీరో తమ ముందు దర్శనమిచ్చేసరికి ఇంటి సభ్యులు తమ ఇష్టాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు. అందరూ కాళ్ల మీద పడి నమస్కరించారు. వారందరిని కమల్ హాసన్ ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. కొంతమంది హౌజ్‌మేట్స్‌కు అది కలో నిజమో గుర్తించలేనంత ఆశ్యర్యానికి లోనయ్యారు. విశ్వరూపం2 ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చానని, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చానంటూ కమల్ హాసన్ హౌజ్‌మేట్స్‌కు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో ప్లే చేయించారు. అనంతరం సినిమాకు పనిచేసిన మరికొంతమందిని కూడా హౌజ్‌లోకి విచ్చేశారు. హీరోయిన్ పూజా కూడా వచ్చారు. ఇంటి సభ్యులందరికి కమల్ హాసన్ విశ్వరూపం2 టీషర్ట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. తన టీమ్ సభ్యులైన మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, సినిమాటోగ్రఫర్ దత్, హీరోయిన్ పూజలను పరిచయం చేశారు. అమిత్ తనకిష్టమైన ట్యూన్‌ను కమల్‌కు వినిపించాడు. రోల్‌రైడా తన స్టైల్లో ర్యాప్ పాడి హోరెత్తించాడు. గీతా మాధురి కూడా కమల్ హిట్ సాంగ్‌ను పాడి వినిపించారు. కౌశల్ కోరిక మేరకు.. భారతీయుడు సినిమాలోని ‘అదిరేటి డ్రేస్సు’ సాంగ్‌ను ఇంటి సభ్యులు ఆలపిస్తుండగా.. తనదైన శైలీలో కమల్ హాసన్ నడుస్తూ ఇంటి సభ్యులను ఆనందపరిచారు. బిగ్‌బాస్ ప్రోగ్రామ్ గురించి కమల్ వ్యాఖ్యానిస్తూ.. కొంతమంది ఈ ప్రొగ్రామ్‌పై విమర్శలు చేస్తున్నారంటూ.. బయట జరిగేదే ఇక్కడ కూడా జరుగుతుందని.. ఇందులో తప్పేం లేదంటూ.. మరికొన్ని విషయాలను ఇంటి సభ్యులతో పంచుకున్నారు. అమిత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కమల్ బిగ్‌బాస్ హౌజ్‌మేట్స్ అందరిలోంచి ఒక్కరికి మాత్రం.. ఓ రెండు వారాలు ఎలిమినేషన్ కాకుండా ఉంటే పవర్‌ను ఇస్తానని కమల్ హాసన్ చెప్పారు. బాగా ఫేమస్, కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్‌కు మాత్రం ఆ చాన్స్ ఇవ్వనని, ఎవరైతే కొంచెం వెనుకబడి ఉన్నారో వారికే ఇస్తానని చెప్పుకొచ్చారు. తన నిర్ణయం సరైనది కావచ్చు కాకపోవచ్చు అంటూ.. ఆ చాన్స్‌ను అమిత్‌కు ఇచ్చేశారు కమల్. దీంతో అమిత్ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ చాన్స్‌తో అమిత్ ఓ రెండు వారాలు సేఫ్ అయ్యాడు. ఇలా శుక్రవారం కార్యక్రమం కమల్ హాసన్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌజ్ అంతా కోలాహలంగా మారింది. -
డేర్ డెవిల్
నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్, కత్తి మహేశ్, అమిత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌడీ పోలీస్’. ఆర్.ఎ. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ కృష్ణంరాజు నేతృత్వంలో గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ తదితరులపై పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత జాని మాట్లాడుతూ–‘‘మాఫియా నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది. నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. మే చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తొలిసారిగా ఓ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా’’ అన్నారు గుర్లిన్ చోప్రా. ‘‘అదుర్స్, కృష్ణ’ వంటి హిట్ చిత్రాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తెలుగులో ‘రౌడీ పోలీస్’ చేస్తున్నా’’ అన్నారు ముకుల్ దేవ్. కత్తి మహేశ్, కెమెరామెన్ ముజీర్ పాల్గొన్నారు. -
అమిత్ ‘పసిడి’ పంచ్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ఫైనల్లో సయీద్ మొర్దాజీ (మొరాకో)పై అమిత్ విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో సెవ్దా అసెనోవా (బల్గేరియా) చేతిలో మేరీకోమ్... అనా ఇవనోవా (రష్యా) చేతిలో సీమా ఓడిపోయారు. మహిళల విభాగంలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు లభించాయి. మీనా కుమారి దేవి (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
నటుడు అమిత్‌పై ఫిర్యాదు
బొమ్మనహళ్లి : శాండిల్‌వుట్ నటుడు అమిత్‌పై ఓ సహాయ నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఇక్కడి ఆర్ఆర్ నగర పోలీసులకు బుల్లితెర నటి రాధిక శెట్టి ఫిర్యాదు చేసింది. వివరాలు... బుల్లితెర సహాయ నటిగా గుర్తింపు పొందిన రాధికకు గతంలోనే పెళ్లి జరిగింది. ఈమెకు 17 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భర్తతో విడాకులు తీసుకున్న రాధిక అమిత్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ప్రస్తుతం అమిత్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని రాధిక ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. 2013 మేలో వివాహం చేసుకున్నామని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. 2017 నవంబర్ వరకు కలిసి ఉన్నామని, అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని, విషయం తెలిసి ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. ఈ విషయంపై అమిత్ ఇంతవరకు స్పందించలేదు. ఈ విషయంపై అమిత్ తల్లి స్పందిస్తూ తన కుమారుడికి రాధికతో వివాహం కాలేదని, సినిమా ఫొటోలు తీసుకుని డబ్బుల కోసం బ్లాక్‌మొయిల్ చేస్తోందని ఆమె ఆరోపించింది. -
పతకానికి విజయం దూరంలో...
♦ క్వార్టర్ ఫైనల్లో అమిత్, గౌరవ్ ♦ వికాస్, సుమీత్‌లకు చుక్కెదురు హాంబర్గ్ (జర్మనీ): ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అమిత్ ఫంగల్(49 కేజీలు), గౌరవ్ బిధురి(56 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... వికాస్ కృషన్(75 కేజీలు), సుమీత్ సాంగ్వాన్(91 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), శివ థాపా(60 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఏడో సీడ్ కార్లోస్ కిపో (ఈక్వెడార్)తో జరిగిన బౌట్లో అమిత్ 5–0తో సంచలన విజయం సాధించగా... గౌరవ్ 4–1తో మికోలా బుత్సెంకో (ఉక్రెయిన్)ను ఓడించాడు. మరో విజయం సాధిస్తే అమిత్, గౌరవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత వికాస్ 0–5తో విటేకర్ (ఇంగ్లండ్) చేతిలో, సుమీత్ 2–3తో జాసన్ వాటెలె (ఆస్ట్రేలియా) చేతిలో, మనోజ్ కుమార్ 1–4తో గాబ్రియెల్ పెరెజ్(వెనిజులా) చేతిలో ఓడిపోయారు. ఒటార్ ఎరానోసియాన్(జార్జియా)తో తలపడా ల్సిన శివ థాపా తీవ్ర జ్వరం కారణంగా బరిలోకి దిగకుండానే తన ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. -
ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్
హంబర్గ్ (జర్మనీ): భారత బాక్సర్లు అమిత్ ఫంగల్, గౌరవ్ బిధురి సత్తా చాటారు. ప్రపంచ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల 49 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో అమిత్ 4–1తో ఫెడెరికొ సెర్రా (ఇటలీ)పై గెలుపొందాడు. 56 కేజీల విభాగంలో గౌరవ్ 5–0తో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సామ్ గుడ్మాన్ (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించాడు. ప్రిక్వార్టర్స్‌లో అమిత్... ఏడో సీడ్ కార్లస్ క్విపో (ఈక్వెడార్)తో, గౌరవ్... ఆఫ్రికా చాంపియన్ జీన్ జోర్డి వాడముటూ (మారిషస్)తో తలపడతారు. ఈ చాంపియన్‌షిప్‌లో 250 మంది అంతర్జాతీయ బాక్సర్లు తలపడుతుండగా... భారత్ తరఫున ఎనిమిది మంది పోటీపడుతున్నారు. -
అమిత్ అజేయ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో ఏఓసీ జట్టు బ్యాట్స్‌మన్ అమిత్ పచేరా (354 బంతుల్లో 221 నాటౌట్; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ డబుల్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీస్కోరును అందించాడు. దీంతో కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఏఓసీ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 8 వికెట్లకు 481 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అమిత్‌తో పాటు విష్ణు తివారీ (253 బంతుల్లో 148; 21 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్మీత్ సింగ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు తడబడింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి 54 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులతో నిలిచింది. అనురాగ్ హరిదాస్ (42) రాణించాడు. ఏఓసీ బౌలర్లలో అభిషేక్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రణీత్, హిమాన్షు శతకాలు స్పోర్టింగ్ ఎలెవన్ జట్టుతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆటముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లకు 298 పరుగులతో నిలిచింది. ప్రణీత్ కుమార్ (192 బంతుల్లో 141 బ్యాటింగ్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), హిమాన్షు జోషి (183 బంతుల్లో 126; 17 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 358/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు 107.4 ఓవర్లలో 440 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ ఫైజల్ అల్వి (47) రాణించాడు. ఇన్కమ్ ట్యాక్స్ బౌలర్లలో హిమాన్షు జోషి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 285/3 (బి. రేవంత్ 57, వరుణ్ గౌడ్ 56 బ్యాటింగ్, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి 119 బ్యాటింగ్), ఆంధ్రాబ్యాంక్‌తో మ్యాచ్. ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 260/9 (వై. చైతన్య కృష్ణ 46, కుషాల్ పర్వేజ్ జిల్లా 118; జి. అనికేత్ రెడ్డి 4/95, పి. సాకేత్ సాయిరామ్ 3/66), బీడీఎల్‌తో మ్యాచ్. జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 283 (ఆకాశ్ సనా 5/53), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 178 (సి. దుర్గేశ్ 65 నాటౌట్; సంకేత్ 3/75). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 179, హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 134 (ఆశ్రిత్ 34, మధు 36; ప్రణీత్ రెడ్డి 6/36). ఇండియా సిమెంట్స్: 132 (హృషికేశ్ 37; బి. సుధాకర్ 5/53, షేక్ మహబూబ్ పాషా 3/ 21); ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 147/3 (ఎస్సీ మొహంతి 79, ఎం. సురేశ్ 61). -
'నా భర్తను కళ్ల ముందే కాల్చేశారు'
జైపూర్: కళ్ల ముందే తన భర్తను కాల్చి చంపారని రాజస్ధాన్‌లోని జైపూర్‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హత్య వెనుక తన తల్లిదండ్రుల హస్తం ఉందని ఆమె ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మమత చౌదరి(30), అమిత్ నయ్యర్(28)లు ఏడాదిన్నర క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. సివిల్ ఇంజనీర్ అయిన అమిత్.. జైపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మమత ఇంటి పక్కనే నివసించేవాడు. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో మమత తన ఇంట్లో ప్రేమ విషయం చెప్పి పెద్దలను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే, అమిత్‌ది వేరే కులం కావడంతో మమత తల్లిదండ్రులు వారి వివాహానికి అడ్డుచెప్పారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మమత, అమిత్‌ను వివాహం చేసుకుని జైపూర్‌లోనే కాపురం పెట్టారు. మమత గర్భవతి అని తెలిసిన ఆమె తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి పలకరించారు. బుధవారం మమతను కలిసేందుకు ఇంటికి వచ్చారు. అమిత్ గురించి వాకబు చేశారు. అమిత్‌ను వదిలేసి తమతో వచ్చేయాలంటూ బలవంతపెట్టారు. మమత ప్రతిఘటించడంతో ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి అమిత్‌పై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అమిత్ మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు అయ్యాయి. రక్తం ఎక్కువగా పోవడంతో అమిత్ చనిపోయినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అమిత్‌పై కాల్పుల తర్వాత ఆచూకీ లేకుండా పోయిన మమత తల్లిదండ్రుల కోసం వెతుకులాట కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
దలపతి 'షా'
-
పెళ్లి మంత్రాలు చెప్పలేని వరుడిని వదిలేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మైనర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సరియైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తెలివిగా వ్యవహరించింది. పెళ్లి తంతులో మంత్రాలు సరిగా వల్లించలేని వరుడిని కాదని, సొంత గ్రామానికి చెందిన రైతును సంతోషంగా పెళ్లాడింది. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివరాల్లోకి వెళ్లితే మణిపూరి జిల్లాకు చెందిన గులియాపూర్కు చెందిన ఖుష్బూ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి మంటపంలో బాజా భజంత్రీలు జోరుగా మోగుతున్నాయి. ఇక మూడు ముళ్లు పడడమే తరువాత. ఇంతలో పెళ్లి కొడుకు యవ్వారం గురించి పెళ్లి కూతురి చెవిలో వేసారు ఆమె స్నేహితులు. ఇది విని షాకైన ఖుష్బూ స్వయంగా తానే రంగంలోకి దిగింది. పెద్దలు వారిస్తున్నా వినకుండా...ధైర్యంగా ముందుకెళ్లి అతగాడికి కొన్ని పరీక్షలు పెట్టింది. లెక్కల పరీక్షలో ఫెయిలైన సదరు పెళ్లికొడుకు కనీసం మొబైల్లో నెంబర్‌ను డయల్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో కనీస విద్యార్హత కూడా లేదని, మానసికంగా కూడా దృఢంగా లేని వ్యక్తిని పెళ్లి చేసుకోనంటూ ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. తనకు చదువంటే చాలా యిష్టమంటున్న ఖుష్బూ ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతోంది. టీచర్ కావాలనేది ఆమె కోరిక. చదువు సంధ్యాలేని మొద్దుకంటే పదో తరగతి చదువుకొని, గౌరవంగా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న తెలివైన రైతే మేలని భావించింది. అందుకే ఆనందంగా స్థానిక యువకుడు అమిత్(21) ను ఆనందంగా మనువాడింది.