
న్యూఢిల్లీ: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ల సన్నిహితుడు అమిత్ కట్యాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లు జారీ చేసినా అతడు తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ తెలిపింది.
కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం రిమాండ్ కోరుతామని ఈడీ వివరించింది. ఈ కేసులో ఈడీ సమన్లను కొట్టివేయాల్సిందిగా అతడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో లాలూ, తేజస్వీ యాదవ్, లాలూ కుమార్తెలు తదితరులతోపాటు కట్యాల్ ఇంటిపైనా ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment