land for
-
Land-for-jobs case: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం.. లాలూ సన్నిహితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ల సన్నిహితుడు అమిత్ కట్యాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లు జారీ చేసినా అతడు తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ తెలిపింది. కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం రిమాండ్ కోరుతామని ఈడీ వివరించింది. ఈ కేసులో ఈడీ సమన్లను కొట్టివేయాల్సిందిగా అతడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో లాలూ, తేజస్వీ యాదవ్, లాలూ కుమార్తెలు తదితరులతోపాటు కట్యాల్ ఇంటిపైనా ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఇవాళ ఒక్కసారిగా అలజడి రేగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీ దేవి ఇంటికి వెళ్లింది. సోమవారం పాట్నాలోని ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనయులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.అయితే.. ఈ కుంభకోణానికి సంబంధించి కేవలం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకే వెళ్లినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేగానీ తనిఖీలు, సోదాలు నిర్వహించేందుకు కాదని స్పష్టత ఇచ్చాయి. మరోవైపు ముందు తీసుకున్న అపాయింట్మెంట్ ప్రకారమే అధికారులు ఇంటికి వచ్చారని రబ్రీ దేవి అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయ ఉద్దేశ్యాలతో దర్యాప్తు సంస్థలను తప్పుడు దోవలో కేంద్రం ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ.. ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఈ లేఖలో రబ్రీ దేవి తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం సంతకం చేశారు. అంతేకాదు.. దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న నేతల్లో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. సీబీఐ ప్రకారం.. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం లాలూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. 2004-09 మధ్య రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా లాలూ కుటుంబం కారుచౌక ధరలను చెల్లించి భూముల్ని కొనుగోలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 2022లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. ఆపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. అంతేకాదు గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. ఇక బీజేపీ దర్యాప్తు సంస్థల బూచీతో బయటపెట్టాలని యత్నిస్తోందని, లాలూ కుటుంబం అలాంటి వాటికి బెదరదని, గత 30 ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు తాము ఎదుర్కొంటున్నామని రబ్రీ దేవి తాజాగా ఓ ప్రకటన చేశారు కూడా. -
పరిశ్రమలకు భూములు ఇవ్వం
పురుగుమందు డబ్బాలతో ఎలుకుర్తి రైతుల నిరసన ధర్మసాగర్ : పరిశ్రమల స్థాపనకు తమ భూములు ఇచ్చేది లేదని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామ రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఉద్య మం తప్పదని హెచ్చరించారు. పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం గుర్తించిన భూ యజమానులు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్ 160లోని 216 ఎకరాల భూమిని 40 సంవత్సరాల క్రితం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 250 మంది పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసి పట్టాలు ఇచ్చిందని, ఇప్పటి ప్రభుత్వం వాటిని లాక్కోవాలని చూస్తోందని ఆరోపిం చారు. భూములు కోల్పోతే తమకు జీవనాధారం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమన్నారు. భూములు తీసుకుంటామంటూ తమ కు ఇటీవలే నోటీసులుఇచ్చారని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాలు పం పిణీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. అవి ఇవ్వకపోగా తమ భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించా రు. అనంతరం భూములను లాక్కోవద్దని కోరుతూ రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలు చేతి లో పట్టుకుని నిరసన తెలుపుతూ స్థానిక సర్పంచ్ గుం డవరపు రాంచందర్‌రావు, ఎంపీటీసీ సభ్యు డు జోగు శేఖర్‌లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ గ్రామంలోరైతులపక్షాన నిలుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోను భూములుప్రభుత్వంతీసుకోకుండా చూస్తామని తెలిపారు.రైతులు కొలిపాక జార్జ్, కన కం ఇజ్రాయిల్, పిట్టల వెంకటయ్య, కేతిరి వెంకటయ్య,రాజయ్య, ఎం. సమ్మయ్య పాల్గొన్నారు.