
రాంచీ: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. రాంచీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లో అలమ్‌ను మంగళవారం(మే14) తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రశ్నించిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది.
గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో అలమ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌కుమార్ లాల్ పనిమనిషి ఇంట్లో రూ.37 కోట్ల లెక్కల్లోకి రాని నల్లధనం పట్టుబడిన విషయం తెలిసిందే.
పనిమనిషి ఫ్లాట్‌లో గుట్టలుగుట్టలుగా నల్లధనం పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం గమనార్హం.