jharkhanad
-
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అరెస్ట్‌లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో భేటీ కానున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్‌ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
Jharkhand: పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్‌లో బోల్తా.. ఏడుగురు మృతి
హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్‌లో పట్నా వెళుతున్న బస్సు హజారీబాగ్ జిల్లాలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కోల్‌కతా నుంచి పాట్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. బర్కతాలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని గోర్హర్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
Jharkhand: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
తుప్కాడి: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొకారో స్టీల్ ప్లాంట్ నుండి వల్లభ్‌గఢ్‌కు వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. తుప్కాడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపధ్యంలోనే వారణాసి నుంచి రాంచీ వెళ్తున్న వందే భారత్ రైలును చందర్పురా రైల్వే స్టేషన్లో నిలిపివేశారు.ఈ ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దానిలో గూడ్స్ రైలు వ్యాగన్లు బోల్తా పడటాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం రైల్వే ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ఇటీవలి కాలంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మధురలలో రైళ్లు పట్టాలు తప్పాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో పంజాబ్‌లోని భటిండాలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నారు. అయితే డ్రైవర్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. Bokaro, Jharkhand: A goods train passing through Tupkadih got detached in two, with two of its wagons overturning after derailment. The incident occurred between Tupkadih and Rajabera sections. Train movement affected and the plying of trains on down line track suspended. A… pic.twitter.com/p3luQ0gppk— ANI (@ANI) September 26, 2024ఇది కూడా చదవండి: ఊపిరి తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ -
కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్ నోటీసులు
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జయంత్ సిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. పార్టీపరమైన సంస్థాతగ పనులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆదిత్య సాహూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. సోమవారం జరిగిన ఐదో విడత పోలింగ్‌లో జయంత్ సిన్హా తన ఓటు హక్కు వినియోగించుకోకపోవటంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహించి ఆయనపై చర్యలకు పూనుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మార్చిలో జయంత్ సిన్హా.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించిన విషయం తెలిసిందే.‘‘లోక్‌సభ ఎన్నికల్లో భాగం పార్టీ అధిష్ణానం హజారీబాగ్‌లో మనీష్ జైశ్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు( జయంత్ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్‌లో ఓటు కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటివరకు ఈ నోటీసుకుల స్పందించకపోవటం గమనార్హం.మర్చి 2న జయంత్ సిన్హా.. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారత్, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులను ఎదుర్కొవడానికి తన వంతుగా కృషి చేయటంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హజారీబాగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించింది. అయితే ఈసారి ఎన్నికల్లో హజారీబాగ్ స్థానంలో జయంత్ సిన్హాకు మరోసారి టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టాలని బీజేపీ భావించిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. -
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
రాంచీ: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. రాంచీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లో అలమ్‌ను మంగళవారం(మే14) తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రశ్నించిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది.గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో అలమ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌కుమార్ లాల్ పనిమనిషి ఇంట్లో రూ.37 కోట్ల లెక్కల్లోకి రాని నల్లధనం పట్టుబడిన విషయం తెలిసిందే. పనిమనిషి ఫ్లాట్‌లో గుట్టలుగుట్టలుగా నల్లధనం పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం గమనార్హం. -
Jharkhand: అక్రమ బొగ్గు గని కూలి ఘోరం
రాంచీ: జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఇవాళ ఘోరం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో భారత్ కోకింగ్‌కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) భౌరా కాలరీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భౌరా పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సింద్రీ డీఎస్సీ అభిశేక్ కుమా మాట్లాడుతూ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. గనిలోకి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు సత్వరమే స్పందించి ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని, ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు తెలిపారు. -
లవ్ యూ అంటూ వెంటపడ్డాడు.. నో చెప్పడంతో ఆమె నిద్రిస్తుండగా..
ఐ లవ్ యూ.. నిన్నే ప్రేమిస్తున్నా అంటూ ఆమె వెంటపడ్డాడు. ఆమె నువ్వుంటే నాకు ఇష్టం లేదని చెప్పినా.. వెనకాలే తిరుగుతూ వేధింపులకు గురిచేశాడు. చివరిసారిగా అడుగుతున్నా.. ప్రేమిస్తావా లేదా అని బెదిరించి.. ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీలోని నుంచి గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో 90 శాతం శరీరం కాలిపోయి బాధితురాలు ప్రాణాల కోసం పోరాడి చివరకు చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధుమ్కా ప్రాంతానికి చెందిన బాధితురాలు(19).. 12వ తరగతి చదువుతోంది. కాగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ షారుఖ్ ఖాన్ అనే యువకుడు ఆమెను వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించిదన్న కోపంతో ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. బాధితురాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె గదిలో పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు ఆమె.. 90 శాతం కాలిపోయిన గాయాలతో బయటపడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, మెరుగైన వైద్య సేవల కోసం బాధితురాలని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసులు.. నిందితుడు షారుఖ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. కాగా, షారుఖ్ ఖాన్‌ను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో తాను ఏ తప్పు చేయలేదన్నట్టుగా చిరునవ్వుతో పోలీసులతో కలిసి వెళ్లాడు. అతడి ముఖంతో ఆనందం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు సీరియస్‌గా స్పందిస్తున్నారు. అతడికి కొంచెం కూడా పశ్చాతాపం లేదని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ అంకితా #JusticeForAnkita హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేస్తూ న్యాయం కావాలని కోరుతున్నారు. See the shameless #Smile of Shahrukh. He has no regrets after burning a Hindu girl to de@th, even after being arrested. #JusticeForAnkita pic.twitter.com/LQ1rJAMOy9 — Akhilesh Kant Jha (@AkhileshKant) August 28, 2022 -
స్మగ్లింగ్ మాఫియా దారుణం.. మహిళా ఎస్సైని లారీతో తొక్కించి హత్య
రాంచీ: హర్యానా మైనింగ్ మాఫియా చేతిలో హత్యకు గురయ్యారు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో దారణం చోటు చేసుకుంది. డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మంగళవారం రాత్రి జరిగింది. రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య టోప్నే. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చి ఎస్సైని తొక్కించారు. ‘పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో ఎస్సైని ఢీకొట్టాడు డ్రైవర్. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశాం. ’అని సీనియర్ ఎస్పీ కౌశల్ కిశోర్ తెలిపారు. హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్ అధికారిని మైనింగ్ మాఫియా హత్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: Haryana DSP Murder: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
వర్షాల వేళ విషాదం.. ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి
భారీ వర్షాల వేళ డ్యామ్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అకాల మరణం చెందారు. ఈ విషాద ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోడ్మెరా జిల్లాలో రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం ఆదివారం సెలవు రోజు కావడంలో ఎంజాయ్మెంట్ కోసం పంచఖేరో డ్యామ్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వారంతా ఓ పడవలో డ్యామ్ చూసేందుకు వెళ్లారు. ఇంతలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. దీంతో, పడవలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది నీటిలో మునిగిపోయి అకాల మరణం చెందారు. మరణించిన వారిని సీతారాం యాదవ్ (40), శివమ్ సింగ్ (17), రాహుల్ కుమార్ (16), అమిత్ కుమార్ (14), సెజల్ కుమారి (16), పాలక్ కుమారి (14),హర్షల్ కుమార్ (8), భావ (5)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఈది సురక్షితంగా ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. పడవ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందంలో రంగంలోకి దిగి డ్యామ్‌లో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, ఇప్పటి వరకు వారి డెడ్‌బాడీలు మాత్రం బయటకు తీసుకురాలేదు. ఈ సమాచారం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు డ్యామ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ❗️Boat Tragedy: Eight members of family die after boat capsizes in Panchkhero Dam, Jharkhand One survivor swam to safety. The dead were aged from 5-40, seven of them under the age of 18. @RT_India_official pic.twitter.com/IsVG99QC3W — @NabaKumarRay (@Naba_Kumar_Ray) July 17, 2022 -
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. మోదీతో క్లోజ్‌గా సీఎం.. షాక్‌లో కాంగ్రెస్!
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తమ మద్దతు అని సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించడంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షం కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించగా.. దానికి విరుద్ధంగా జేఎంఎం వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవల జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఆ సమయంలో సీఎం హేమంత్ సోరెన్ ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కేంద్రం మద్దతు ఉంటే ఐదేళ్లతో జార్ఖండ్ పురోగతి సాధిస్తుంది. ఇది జార్ఖండ్ చరిత్రలో చారిత్రక రోజు. కేంద్రం, రాష్ట్రం మధ్య సహకారం ఉంటే అభివృద్ధి వేగంగా జరగడం సాధ్యమవుతుంది.' అని మోదీ వేదికపై ఉన్నప్పుడు సోరెన్ అన్నారు. అంతేకాదు మోదీ రావడానికి ఒక రోజు ముందే దేవ్‌ఘర్ వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో జేఎంఎం బీజేపీతో జతకడుతుందని, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే జేఎంఎం నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రోటోకాల్‌లో భాగంగానే ప్రధానితో సీఎం వేదికను పంచుకున్నారని పేర్కొన్నారు. ముర్ముకు ఘన స్వాగతం రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 4న జార్ఖండ్ వెళ్లారు. ఆ రోజు సీఎం సోరెన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని, అందుకే తమ పూర్తి మద్దతు ముర్ముకు ఉంటుందని జేఎంఎం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా జులై 16న జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఆ రోజు జేఎంఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. జార్ఖండ్‌లో ట్రైబల్ ఓటర్లే చాలా కీలకం. జేఎంఎం కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంది. అందుకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు విరుద్ధంగా ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలుస్తోంది. 2019లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 26 స్థానాలు కైవసం చేసుకుంది. మరో ఐదు చోట్ల ఇతరులు గెలుపొందారు. చదవండి: జాతీయ పార్టీలపై కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విరాళాలు -
షార్ట్‌కట్‌లో ఓట్లు సంపాదించటం సులభమే.. కానీ: మోదీ
రాంచీ: షార్ట్‌కట్‌లో ఓట్లు సంపాదించడం సులభమే కానీ, ఆ తరహా రాజకీయాలు దేశాన్నే నాశనం చేస్తాయని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. షార్ట్‌కట్ రాజకీయాలకు పాల్పడేవారు ఎప్పటికీ కొత్త విమానాశ్రయాలు, రహదారులు, ఎయిమ్స్‌లు నిర్మించలేరని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. ఝార్ఖండ్‌లోని దేవఘర్లో సుమారు రూ.16,800 కోట్లతో చేపట్టిన నూతన విమానాశ్రయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ. అనంతరం దేవఘర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. 'షార్ట్‌కట్ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతం ఈ షార్ట్‌కట్ రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయి. అలా ఓట్లు సులభంగా సాధించవచ్చు. ఒక దేశంలోని రాజకీయాలు షార్ట్‌కట్‌పై ఆధారపడితే.. అది షార్ట్ సర్క్యూట్‌కు దారి తీస్తుంది. అలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను కోరుతున్నా. అలా షార్ట్‌కట్ రాజకీయాలకు పాల్పడేవారు దేశాభివృద్ధి కోసం పనిచేయలేరు.' అని పేర్కొన్నారు మోదీ. దేవఘర్లో విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు తనకు అవకాశం లభించిందని, ఈరోజు అదే ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు మోదీ. గతంలో ప్రాజెక్టులు ప్రకటించటం.. 2-3 ప్రభుత్వాలు మారాక శంకుస్థాపన చేయటం జరిగేదన్నారు. అలా కొన్ని ప్రభుత్వాలు మారాకే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని విమర్శలు గుప్పించారు. భారత్ భక్తి, ఆధ్యాత్మికత, పుణ్యక్షేత్రాలకు నిలయమని పేర్కొన్నారు. తీర్థయాత్రలు మనల్ని మెరుగైన సమాజంగా, మంచి దేశంగా తీర్చిదిద్దుతాయన్నారు. దేవఘర్లో జ్యోతిర్లింగంతో పాటు మహాశక్తి పీఠం ఉందని గుర్తు చేశారు. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు దేవఘర్‌కు వచ్చి మహాశివుడిని దర్శించుకుంటారని తెలిపారు. ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్ హైవే'.. దేశంలోనే తొలిసారి! -
సింప్లిసిటీ చాటుకున్న ద్రౌపది ముర్ము.. పలువురి ప్రశంసలు
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆమె మరోసారి తన సింప్లిసిటీని చూపించుకున్నారు. అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల ప్రకారం.. ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం ఒడిషాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్లారు. అనంతరం ఆమె.. చీపురు చేతపట్టి స్వతహాగా ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె.. ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం అక్కడున్న వారితో సహా పలువురిని ఆశ్యర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ద్రౌపది ముర్ముకు కేంద్రం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఆమెకు సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. ఇక, దేశానికి కాబోయే భారత రాష్ట్రపతి బీజేపీ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందించారు. దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలం దించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయాస్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని అన్నారు. #WATCH | Odisha: NDA's presidential candidate Draupadi Murmu sweeps the floor at Shiv temple in Rairangpur before offering prayers here. pic.twitter.com/HMc9FsVFa7 — ANI (@ANI) June 22, 2022 ఇది కూడా చదవండి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ -
భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాము. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కారణంగా 20జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. పంజాబ్‌లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసుల అలర్ట్ ప్రకటించారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జైపూర్, నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. All schools in Jharkhand will remain closed today in view of the #BharatBandh protests. #AgnipathProtests #AgnipathScheme https://t.co/I2m9R2IM59 — India.com (@indiacom) June 20, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే లవ్ ఎఫైర్.. సెక్స్ రాకెట్ బట్టబయలు -
హింసాత్మకంగా మారిన నిరసనలు.. రాజధానిలో కర్ఫ్యూ విధింపు
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలకు దిగాయి. పలు రాష్ట్రాల్లో శుక్రవారం మసీద్‌లో నమాజ్ ముగిసిన వెంటనే నిరసనకారులు ఆందోళనలకు దిగారు. కాగా, ముస్లింల ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లో నిరసనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు నిరసనకారులు కూడా గాయపడ్డారు. దీంతో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మీడియాతో మాట్లాడుతూ.. నిరసనల గురించి సమాచారం అందింది. జార్ఖండ్ ప్రజలు ఎప్పుడూ చాలా సహనంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. నిరసనకారులు వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. #WATCH | Jharkhand: Protest over the controversial remarks by suspended BJP leader Nupur Sharma turned violent in Ranchi. Vehicles were torched and vandalised and stone-pelting occurred. Injuries reported. pic.twitter.com/Z5FIndjZzf — ANI (@ANI) June 10, 2022 #WATCH | West Bengal: A huge crowd gathers at Howrah in protest over the controversial remarks of suspended BJP leader Nupur Sharma & expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/m8Bak7Q0nF — ANI (@ANI) June 10, 2022 ఇది కూడా చదవండి: టెన్షన్.. టెన్షన్.. పాతబస్తీలో మోహరించిన పోలీసులు.. వీడియో -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లో పలామూ జిల్లాలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటున్న ఆయన గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎలాంటి అపాయం జరగలేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్ పర్యటనలో భాగంగా లాలూ ప్రసాద్.. పలామూకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆయన స్థానిక అతిథి గృహంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం.. లాలూ టిఫిస్ చేస్తున్న సమయంలో గదిలోని ఫ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లాలూను వెంటనే బయటకు తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. అనంతరం ఫ్యాన్‌ను తొలగించారు. లాలూకు ప్రమాదమేమీ జరగకపోవడంతో అధికారులు, పార్టీ కార్యకకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. #Ranchi: लालू प्रसाद यादव के कमरे में लगी आग, सर्किट हाउस में हादसे से बाल-बाल बचे RJD सुप्रीमो.@laluprasadrjd @RJDforIndia #RanchiNews #Jharkhand #JharkhandNews #RJD #LaluPrasadYadav pic.twitter.com/qS2N1VtiG4 — India Voice (@indiavoicenews) June 7, 2022 ఇది కూడా చదవండి: ఇక ‘చాన్సలర్’ మమత బెనర్జీ -
దేశంలో అత్యంత పేదరికంలో ఉన్న రాష్ట్రాలు ఇవే : నీతి ఆయోగ్
నీతి ఆయోగ్‌కు చెందిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) పై రిపోర్ట్లు విడుదలయ్యాయి. ఈ రిపోర్ట్లలో దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాలు దేశంలో అత్యంత పేద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. నివేదిక ప్రకారం..ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (OPHI),యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP)ల ఆధ్వర్యంలో సర్వే జరిగింది. ఈ రెండు సంస్థలు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, పోషకాహారం, పిల్లలు, కౌమర దశలోని మరణాలు, ప్రసవానంతర సంరక్షణ, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, మద్యపానం వంటి 12 అంశాల ఆధారంగా దేశంలోని ఏఏ రాష్ట్రాలు పేదరికంలో ఉన్నాయనే విషయాల్ని వెల్లడిస్తాయి. ఆ సంస్థలు చేపట్టిన అభిప్రాయ సేకరణ ఆధారంగా బీహార్‌లో 51.91 శాతం మంది పేదరికంలో ఉన్నట్లు అభిప్రాయం సేకరణలో వెల్లడైంది. ఇక బీహార్ తరువాత జార్ఖండ్ 42.16 శాతంతో రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ 37.79 శాతంతో మూడో స్థానంలో, మధ్యప్రదేశ్ 36.65 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, మేఘాలయ 32.67 శాతం ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత కేరళ 0.71 శాతం, గోవా 3.76 శాతం, సిక్కిం 3.82 శాతం, తమిళనాడు 4.89 శాతం, పంజాబ్ 5.59 శాతంతో దేశంలో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. చదవండి : బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిదపాలు -
జార్ఖండ్ జడ్జి మృతి: వారంలోగా నివేదిక ఇవ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: జార్ఖండ్ జడ్జి మృతి కేసుపై సుప్రీంకోర్టు స్పందించింది. వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా.. జార్ఖండ్ ఏజీని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా ధన్బాద్లో ఉదయం జాగింగ్‌కు వెళ్లిన డిస్ట్రిక్ట్, 8వ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను దుండగులు ఆటోతో ఢీకొట్టగా.. ఆయన మృతి చెందిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జార్ఖండ్ హైకోర్టు స్పందింది, ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించింది. ఇక ఈ ఘటనను సమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం సీఎస్, డీజీపీని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. -
జార్ఖండ్‌లో సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్
రాంచీ : కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి నిషేదం విధించలేదు. క్రీడలు, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు వంటి వాటికి అనుమతి ఉండదు. ఈ మేరకు సీఎం హేమంత్ సోరెన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నియమాలను పాటించాలని కోరారు. ఇప్పటికే విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్రదేశాల్లో అనుమతి లేదు. అయితే అన్‌లాక్3లో భాగంగా జిమ్ సెంటర్లు, యోగా కేంద్రాలకు సైతం ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ర్టంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 1365 కొత్త కరోనా కేసులు వెలుగచూడగా మొత్తం నమోదైన కేసులు 34,676కు చేరగా 378 మంది మరణించారు. రాష్ర్టంలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తాజా నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. (ఎయిరిండియాకు కరోనా దెబ్బ : ఏడుగురికి పాజిటివ్) -
జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా
రాంచీ : కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నాగుప్తాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. అయితే గుప్తాకు అంతకుముందు కాబినెట్ సమావేశంలో పాల్గొనడంతో మిగతా మంత్రులకు సైతం కరోనా భయం పట్టుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ గుప్తా పక్కనే కూర్చున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా గుప్తాకు కరోనా లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యంగా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారని ఆరోపించారు. గుప్తా అవలంభించిన నిర్లక్ష్య ధోరణి వల్ల మిగతా మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సి వచ్చిందని విమర్శించారు. ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా అని తేలడంతో వెంటనే ఆయనతో పాటు హాజరైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ క్వారంటైన్‌కి వెళ్లారు. ఇక మరో నాయకుడు ఏజేఎస్‌యూ పార్టీ అధ్యక్షుడు సుదేష్ మహతోకు కూడా కరోనా సోకింంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి ఖశ్చితమైన నిబంధనలు పాటించాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. (ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా) -
నిత్యం తగలబడుతున్న గ్రామం
ఇంటి ముందు హఠాత్తుగా భూమి నుంచి మంటలు ఎగిసిపడతాయి! నడుస్తుండగానే రోడ్డుపైన గోతులుపడి అగ్నికీలలు చీల్చుకొస్తాయి! ఆ సమయంలో అక్కడున్నవాళ్ల కాళ్లు బొబ్బలెక్కుతాయి.. ఆ మంటల్లో నుంచి పుట్టే టాక్సిక్ వాయువులతో కళ్లు మంటలెత్తుతాయి! ఆరని అగ్నిగుండంలాంటి ఈ వ్యవహారం జార్ఖండ్ లోని ఝరియా గ్రామంలో నిత్యం జరుగుతున్నదే! దీని వెనుక మాయా మంత్రం ఏమీ లేదు. భగభగమండుతున్న బొగ్గుల కొలిమిపై ఆ గ్రామం ఉంది. అక్కడ భూమి కింద నిత్యం మండుతున్న అపారమైన బొగ్గునిల్వలు ఉన్నాయని అధికారులు ఎప్పుడో గుర్తించారు. అవి మండుతూ అప్పుడప్పుడు తన్నుకొని భూమిపైకి మంటలు విరజిమ్ముతాయని చెప్పారు. అక్కడ నివసించడం క్షేమదాయకం కాదని, ఆ ఊరిని మరో సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని రాజకీయ నేతలు, అధికారులు ఎన్నోసార్లు ఆ ఊరి ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ఇసుమంతకూడా పని జరగలేదు. ఎన్నికల సమయంలోతప్ప ఆ ఊరి వైపు నాయకులెవరూ కన్నెత్తిచూడరు! కొన్ని తరాలు అంతరించి పోయినా ఆ గ్రామస్థులు మాత్రం తమంతటతాము ఎక్కడికి వలసపోవడం లేదు. కారణం పేదరికం! కొందరు సమీపంలోని బొగ్గుగనిలో పనిచేస్తే.. మరికొందరు పరిసరాల్లో దొరికే బొగ్గును తట్టల్లో తీసుకెళ్లి సమీప మార్కెట్లో అమ్ముకుంటూ పొట్టనింపుకొంటున్నారు. మరోచోటుకు తరలివెళితే ఎక్కడ తలదాచుకోవాలో, జీవనోపాధికి ఏం చేయాలో వారికి తెలియదు. సురక్షిత ప్రాంతంలో కొత్త గ్రామాన్ని కట్టిస్తామన్న అధికారులు ఆ గ్రామంవైపు రారు! బొగ్గు మంటల నుంచి వెలువడే సల్ఫర్, కార్బన్, టాక్సిక్ వాయువుల వల్ల కంటి జబ్బులతోపాటు, చర్మ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అయినా దీపాలవసరంలేదుగదా! అని ఆ మంటల వద్దే రాత్రిళ్లు గడపడం, అవసరమైనప్పుడు ఆ మంటలతోనే వంట చేసుకోవడం వారికి అలవాటైంది. ఝరియా గ్రామం కింద కుప్పకూలిపోయిన ఓ బొగ్గుగనిలో 70 చోట్ల నిరంతరం మంటలు చెలరేగుతున్నాయని 1916లోనే అధికారులు గుర్తించారు. కాని వారు కారణాలు వెల్లడించలేదు. సమీపంలోని గనిలో ఓపెనీ క్యాస్టింగ్ సక్రమంగా చేయకపోవడం వల్ల గ్రామం కింద ఓ బొగ్గుగని కూలిపోయిందనే ఆరోపణలు, వాదనలూ ఉన్నాయి. ఆ గ్రామం కింద దాదాపు 150 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, అవి మండిపోయి చల్లారడానికి ఇంకా 3,800 సంవత్సరాలు పట్టవచ్చని ‘ఎర్త్ మేగజైన్’ వెల్లడించింది. అప్పటివరకు ఆ గ్రామాన్ని తరలించకుండా మన నేతలు నిరీక్షిస్తారేమో!