రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అరెస్ట్‌లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో భేటీ కానున్నారు.
మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్‌ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.
ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment