assebly elections
-
ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ (ఆప్) కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ వస్తుంది.ఈ నేపథ్యంలో బుధవారం పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకుంటామని ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో పొత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ మాజీ సీఎం స్పందించారు. తాము ఇండియా కూటమిలో భాగమే అయినప్పటికీ మూడోసారి సైతం పొత్తు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024 లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆప్ దూరంగా ఉండటానికి కారణం ఈ ఏడాది జరిగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తోంది.సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కలిసి పోటీ చేశాయి. ఏడు లోక్‌సభ స్థానాలకు గాను ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. అన్నీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాబట్టే, అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు విషయంలో రెండు పార్టీలు పునరాలోచనలో పడ్డాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇండియా కూటమిలో చీలికలు మరోవైపు 26 ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తుంది. అయితే కేజ్రీవాల్ వైఖరితో ఇండియా కూటమిలో చీలిక దిశగా పయనిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆప్‌తో పొత్తు ‘పొరపాటే’ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ సైతం ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే పొరపాటే అవుతుందన్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని నొక్కి చెప్పారు.‘లోక్‌సభ ఫలితాల తర్వాత ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదో ఈ నిర్ణయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. అధికారం కోసం ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. 2015 ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు, బీజేపీ మూడు స్థానాల్ని సొంతం చేసుకుంది. 2020లో ఆప్ 62 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుని ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. -
ప్రధానిని కలిసిన హేమంత్ దంపతులు..
న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్ నూతన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్ సోరెన్ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా రాజధాని రాంచీలోని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి. आज दिल्ली में माननीय प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी से मुलाकात कर उन्हें 28 नवंबर को अबुआ सरकार के शपथ ग्रहण समारोह में शामिल होने हेतु आमंत्रित किया। pic.twitter.com/dPgWW6l7ir— Hemant Soren (@HemantSorenJMM) November 26, 2024మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్‌తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి.. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అరెస్ట్‌లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో భేటీ కానున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్‌ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
Uttar Pradesh: ఒక పార్టీకి మద్దతు పలికిందని దళిత యువతి హత్య
కర్హల్: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా కర్హాల్ అసెంబ్లీ స్థానానికి నేడు (బుధవారం) పోలింగ్ కొనసాగుతుండగా, మరోవైపు దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక దళిత యువతి హత్యకు గురైంది. ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రశాంత్ యాదవ్ హత్య చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ యువతి బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లుతో చెప్పిందని అందుకే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్హల్‌లో దళిత యువతి హత్యకు కారణకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎస్పీ నేతనే ఈ హత్యకు పాల్పడ్డారని బీజేపీ కర్హల్ అభ్యర్థి అనుజేష్ ప్రతాప్ ఆరోపించారు.పలు మీడియా కథనాల ప్రకారం బాలిక మృతదేహం నగ్న స్థితిలో లభ్యమయ్యింది. ఇటీవల ఆ యువతికి బెదిరింపులు వచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని, ఆ తరువాత యువతి మృతదేహం కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజ్రా నది వంతెన సమీపంలో కనిపించిందన్నారు. పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఇటీవల ఒక నేత ఈ ప్రాంతంలో తిరుగుతూ సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని కోరాడన్నారు. అయితే తమ కుమార్తె మా ఓటు బీజేపీకేనని చెప్పింది. దీంతో ఆ నేత, అతని సహచరులు తమ కుమార్తెను బెదిరించారని, ఆ తరువాత ఈ దారుణం చోటుచేసుకుందని’ తెలిపాడు.ఈ రోజు(బుధవారం) కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో దళిత యువతి హత్యకు గురికావడం గమనార్హం. ఈ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ నుంచి అనుజేష్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో యోగి(సమాజ్‌వాదీ), అఖిలేష్(బీజేపీ) మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. యూపీలో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు.ఉప ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ రెండూ తమ సత్తామేరకు ప్రచారపర్వాన్ని నిర్వహించాయి. ఈ స్థానాల్లో జరుగుతున్న ఉపఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు యూపీ అధికార సింహాసనానికి మార్గాన్ని నిర్ణయించేవిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు యోగి ఆదిత్యనాథ్ ఇటు అఖిలేష్ యాదవ్‌లలో తదుపరి సీఎం ఎవరు అనే దానిపై ఈ ఎన్నికలు అంచనాలను వెలువరించనున్నాయి. అందుకే ఈ ఎన్నికలు యూపీకి అగ్నిపరీక్షగా నిలిచాయని పలువురు అభివర్ణిస్తున్నారు.అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కంటే అధికంగా సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో 90 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో బీజేపీ-ఎస్పీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అయితే ప్రత్యక్ష పోటీ మాత్రం బీజేపీ, ఎస్పీ మధ్యే ఉండనుందనే అంచనాలున్నాయి.ఈ తొమ్మిది స్థానాల్లో 2022లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే సమాజ్ వాదీ పార్టీకి నాలుగు సీట్లు, ఎన్డీఏకు ఐదు సీట్లు, బీజేపీకి మూడు సీట్లు, మిత్రపక్షాలకు రెండు సీట్లు దక్కాయి. టిక్కెట్ల పంపిణీలో అఖిలేష్ ముస్లిం కార్డును ఉపయోగించుకోగా, బీజేపీ ఓబీసీలను రంగంలోకి దింపింది. బీజేపీ గరిష్టంగా ఐదుగురు ఓబీసీ అభ్యర్థులను నిలబెట్టగా, వీరిలో ఒకరు దళితుడు, ముగ్గురు అగ్రవర్ణాలకు చెందినవారు ఉన్నారు. ముస్లింలకు బీజేపీ టిక్కెట్టు ఇవ్వలేదు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ అత్యధికంగా నలుగురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. అలాగే ముగ్గురు ఓబీసీ అభ్యర్థులు, ఇదరు దళిత అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. అగ్రవర్ణాలకు ఒక్క టిక్కెట్టు కూడా కేటాయించలేదు. ఈసారి ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో, ఎవరిని ఓడిస్తారో వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు -
మెహబూబా వారసురాలు...కంచుకోటను నిలబెట్టేనా?
కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి కంచుకోటగా పేరుపడ్డ శ్రీగుఫ్వారా–బిజ్బెహరా నియోకజవర్గంపై ఇప్పుడందరి దృష్టి కేంద్రీకృతమైంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తొలిదశలో.. సెప్టెంబరు 18న పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బిజ్బెహరా ఒకటి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండటంతో బిజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం ముగ్గురే పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు బషీర్ అహ్మద్ షా (నేషనల్ కాన్ఫరెన్స్), సోఫీ మొహమ్మద్ యూసుఫ్ (బీజేపీ)లతో రాజకీయాలకు కొత్తయిన ఇల్తిజా తలపడుతున్నారు. 37 ఏళ్ల ఇల్తిజా విజయం సాధిస్తే.. 1996 నుంచి పీడీపీకి కంచుకోటగా బిజ్‌బెహరాపై పీడీపీ, ముఫ్తీ కుటుంబం పట్టు మరింత పెరుగుతుంది. మాజీ సీఎం, పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్‌కు బిజ్బెహరా నుంచే శ్రీకారం చుట్టారు. 1962లో గులామ్ సాధిక్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ చీలికవర్గం నుంచి 1962లో బిజ్బెహరా ఎమ్మెల్యేగా సయీద్ విజయం సాధించారు. ఇల్తిజా తల్లి మెహబూబా ముఫ్తీ కూడా బిజ్బెహరా నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కాంగ్రెస్‌ను వీడి పీడీపీని స్థాపించడంతో మెహబూబా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ముఫ్తీకి నమ్మకస్తుడైన అబ్దుల్ రెహమాన్ భట్ బిజ్బెహరా నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచారు. చివరిసారిగా జమ్మూకశ్మీర్‌కు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భట్ బిజ్బెహరాలో నెగ్గారు. ఈసారి సీనియర్ నాయకుడైన భట్‌పై నమ్మకంతో ఆయనకు షాంగుస్– అనంత్‌నాగ్ పశి్చమ సీటును పీడీపీ కేటాయించింది.ఎన్సీ ప్రత్యేక దృష్టి పీడీపీ కోటను బద్ధలు కొట్టాలని నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుదలగా ఉంది. ఎన్సీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా తండ్రి అబ్దుల్‌గనీ షా 1977–1990 దాకా బిజ్‌బెహరాకు ప్రాతినిధ్యం వహించారు. పలుమార్లు ఓటమి పాలైనా ఎన్సీ ఇక్కడ బషీర్నే నమ్ముకుంటోంది. 2009–1014 మధ్య కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినపుడు బషీర్‌ను ఎమ్మెల్సీని చేసింది. పీడీపీ– ఎన్సీ మధ్య సంకుల సమరంలో ఓట్లు చీలి తాము లాభపడతామని బీజేపీ అభ్యర్థి యూసుఫ్ భావిస్తున్నారు. బీజేపీలో చేరడం నిషిద్ధంగా పరిగణించే కాలంలో కమలదళం తీర్థం పుచ్చుకున్న యూసుఫ్‌ను పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఎమ్మెల్సీని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అలహాబాద్ టు అంబేడ్కర్‌నగర్... యూపీలో రసవత్తర పోరు!
ఉత్తరప్రదేశ్ సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఇప్పటిదాకా ఐదు విడతలకు 53 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలోకి చేరిపోయాయి. ఆరో విడతలో 14 స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. వీటిలో 9 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా బీఎస్పీ 4, ఒకటి ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ నడుమ హోరాహోరీ సాగుతోంది. బీఎస్పీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరో విడతలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... – సాక్షి, నేషనల్ డెస్క్అలహాబాద్... త్రివేణి సంగమంలో హోరాహోరీ ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి ఉద్దండులైన ప్రధానులను దేశానికి అందించిన కాంగ్రెస్ కంచుకోట ఈ స్థానం. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీ ఇక్కడ గెలుపు ముఖం చూడలేదు. చివరిగా 1984లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ నుంచి అలహాబాద్‌లో గెలుపొందారు. తర్వాత బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం రెండుసార్లు సమాజ్‌వాదీ గెలిచినా తిరిగి కమలనాథులు పట్టుబిగించారు.2016లో బీజేపీ గూటికి చేరిన యూపీసీసీ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషి గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి బీజేపీ ఆమెను పక్కనపెట్టి మాజీ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కుమారుడు నీరజ్ త్రిపాఠికి టికెటిచ్చింది. ఇండియా కూటమి తరఫున ఎస్పీ సీనియర్ నేత కున్వర్ రియోతీ రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ పూర్వవైభవం కోసం ఎస్పీ దన్నుతో కాంగ్రెస్ తీవ్రంగా చెమటోడుస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.సుల్తాన్పూర్... త్రిముఖ పోరు గోమతి నదీ తీరంలో కొలువుదీరిన ఈ నియోజకవర్గం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటే. తర్వాత కమలనాథులు పాగా వేశారు. బీజేపీ నుంచి 2014లో వరుణ్ గాంధీ గెలిచారు. 2019లో వరుణ్ పిలిభిత్‌కు మారగా ఇక్కడ ఆయన తల్లి మేనకా గాంధీ పోటీ చేశారు. కానీ బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ ఆమెను ఓడించినంత పని చేశారు. కేవలం 14,500 ఓట్లతో మేనక గట్టెక్కారు. ఈసారి కూడా బీజేపీ నుంచి మేనకే రేసులో ఉన్నారు.ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ బలమైన ఓటు బ్యాంకున్న ఉద్రజ్ వర్మకు టెకెటిచి్చంది. బీఎస్పీ ఇక్కడ 1999, 2004ల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. అంబేడ్కర్‌నగర్... బీఎస్పీకి ప్రతిష్టాత్మకం! సోషలిస్ట్ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా జన్మస్థలమిది. 2004 దాకా అక్బర్పూర్గా ఉండేది. బీఎస్పీ కంచుకోట అయిన ఈ స్థానం నుంచి పార్టీ చీఫ్ మాయవతి మూడుసార్లు గెలిచారు. 2008లో పునర్విభజన తర్వాత అంబేద్కర్నగర్గా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రితేశ్ పాండే గెలిచారు. ఇక్కడ దళిత, కుర్మి, బ్రాహ్మణ, ముస్లిం ఓటర్లు కీలకం. బీఎస్పీ సిట్టింగ్ ఎంపీ రితేశ్ పాండే ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. దాంతో బీఎస్పీ కవార్ హయత్ అన్సారీకి టికెటిచ్చింది. ఎస్పీ నుంచి లాల్జీ వర్మ బరిలో ఉన్నారు. త్రిముఖ పోరులో బీఎస్పీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.ప్రతాప్‌గఢ్... కుర్మి, బ్రాహ్మణ ఓట్లు కీలకం బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా, ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి ఎస్.పి.సింగ్ పటేల్ బరిలో ఉన్నారు. ఇక్కడ కురి్మ, బ్రాహ్మణ ఓట్లది కీలక పాత్ర. కుర్మి ఓటర్లు 11%, బ్రాహ్మణ ఓటర్లు 16 శాతం ఉంటారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా), సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ కూడా ప్రభావం చూపుతారు. జనసత్తా దళ్ లోక్తాంత్రిక్ పేరుతో కొత్త పార్టీ పెట్టి తనతో పాటు మరో ఎమ్మెల్యేనూ గెలిపించుకున్న రాజా భయ్యా మద్దతు ఈసారి ఎవరికన్నది ఆసక్తికరం.ఆజంగఢ్... ఎస్పీకి సవాల్ యూపీలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఆజంగఢ్ ఒకటి. ఓటర్లలో 21 శాతం యాదవులు, 17 శాతం ముస్లింలు, 19 శాతం దళితులున్నారు. భూమిహార్, ఠాకూర్, బ్రాహ్మణ, కాయస్థ ఓటర్లూ ప్రభావం చూపుతారు. 2014లో ములాయం సింగ్ యాదవ్, 2019లో ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్‌లో సైతం ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అఖిలేశ్ ఈ సీటును ఖాళీ చేయడంతో వచి్చన ఉప ఎన్నికలో ప్రముఖ భోజ్‌పురీ నటుడు దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా ఇక్కడ బీజేపీకి తొలి విజయం అందించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి ధర్మేంద్ర యాదవ్, బీఎస్పీ నుంచి భీమ్ రాజ్‌భర్ బరిలో ఉన్నారు.ఫూల్పూర్.. నెహ్రూ కోట ప్రయాగ్‌రాజ్ జిల్లాలో చరిత్రాత్మక నియోజకవర్గమిది. తొలి ప్రధాని నెహ్రూ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన స్థానం. ఇక్కడి నుంచి హ్యట్రిక్ కొట్టారాయన. 1962 ఎన్నికల్లో సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా గట్టి పోటీ ఇచ్చినా విజయం నెహ్రూనే వరించింది. ఆయన మరణానంతరం సోదరి విజయలక్ష్మీ పండింట్ ఇక్కడ గెలిచారు. 1975 ఎమర్జెన్సీతో ఫూల్పూర్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 1971లో వీపీ సింగ్ చివరిసారిగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత ఇప్పటిదాకా ఇక్కడ హస్తానికి చాన్సే లేకుండా పోయింది! ఏళ్లుగా ఇక్కడ సమాజ్‌వాదీ పాగా వేసింది.2004లో మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్ సమాజ్‌వాదీ తరఫున గెలుపొందడం విశేషం. 2014లో కేశవ్ ప్రసాద్ మౌర్య తొలిసారి ఇక్కడ కాషాయ జెండాను ఎగరేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి మారడంతో వచి్చన ఉప ఎన్నికలో మళ్లీ ఎస్పీ గెలిచింది. 2019లో బీజేపీ నేత కేసరీదేవి పటేల్ విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్, ఎస్పీ నుంచి అమర్నాథ్ మౌర్య, బీఎస్పీ నుంచి జగన్నాథ్ పాల్ బరిలో ఉన్నారు. ముగ్గురూ తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తుండటం విశేషం! -
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షో
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ రోడ్డు షోలో పాల్గొన్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని వెంట వాహనంపై కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్‌లు ఉన్నారు. వారితో ర్యాలీలో 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా ప్రధాని మోదీ రోడ్ షో సాగింది. రోడ్ షోలో ప్రజాలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తూ అభిమానులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్ షో అనంతరం అమీర్‌పేట్ గురుద్వార్‌ను మోదీ సందర్శించారు. ఆపై కోటి దీపోత్సవం కార్యక్రమానికి మోదీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్లను ఈ రోజు( సోమవారం ) సాయంత్రం మూసివేశారు. రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా నగరంలో భారీగా బలగాలను మోహరించారు. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 🚨 Important Update, Hyderabad! 🚨 For security reasons, in light of PM Shri Narendra Modi's Roadshow today (27/11/2023), Chikkadpally and Narayanaguda stations will be closed 15 minutes before and after the event, tentatively from 16:30 to 18:30 hrs. Arm-B of RTC X Roads… pic.twitter.com/3dps74NQvC — L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 27, 2023 హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి రోడ్ షో.. 2 కి.మీ మేర రోడ్ షో.. కాచిగూడలో ప్రధాని ప్రసంగం.. ర్యాలీలో పాల్గొననున్న గ్రేటర్ లోని 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బేగంపేట్, గ్రీన్లాండ్స్, పంజగుట్ట, మొనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్.. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్‌నగర్ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు రోడ్ షో ఉంటుంది. -
మొయినాబాద్‌లో రూ.7.5 కోట్లు పట్టివేత
మొయినాబాద్/సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ మొయినాబాద్‌లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శనివారం సాయంత్రం అజీజ్‌నగర్ రెవెన్యూలోని ఓ మట్టి రోడ్డులో ఏకంగా ఆరు కార్లలో తరలిస్తున్న రూ.7.5 కోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కార్లలో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తరలిస్తున్న కార్ల నంబర్లు టీఎస్ 36 కె 3030, టీఎస్ 07 జేకే 4688, టీఎస్ 09 ఈడబ్ల్యూ 3747, ఏపీ 39 ఏఎం 4442, టీఎస్ 02 ఎఫ్ఈ 8332, టీఎస్ 09 జీబీ 5841. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఐటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డబ్బులను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు..? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ చెప్పారు. కార్లను మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకొచ్చిన కార్లు? మొయినాబాద్‌లో నగదు తరలిస్తూ పట్టుబడిన కార్లు ఓ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అజీజ్‌నగర్ రెవెన్యూలో విద్యా సంస్థ నిర్వహిస్తున్న ఆ సంస్థ చైర్మన్ హిమాయత్‌సాగర్ జలాశయం ఒడ్డునే నివాసముంటున్నట్లు సమాచారం. ఆ ఇంట్లో నుంచి కార్లు బయటకు రాగానే విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు కార్లను పట్టుకున్నట్లు తెలిసింది. కార్లలో డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలు మాత్రం తెలియలేదు. కార్లు పట్టుబడింది ఓ మంత్రి డెయిరీ ఫాం పక్కనే కావడం విశేషం. ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు? కాగా ఆ విద్యా సంస్థ చైర్మన్ ఇంట్లో ఐటీ అధికారులు శనివారం రాత్రి సోదాలు చేపట్టినట్టు సమాచారం. అక్కడి ఇంటితో పాటు ఐటీ అధికారులు, పోలీసులు సదరు చైర్మన్‌కు సంబంధించిన ఫుట్ బాల్ అకాడమీ, క్రికెట్ అకాడమీ కార్యాలయాల్లో సైతం సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్లలో పట్టుబడిన ఆ సొమ్ముతో సదరు సంస్థకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. -
ఆరు గ్యారంటీలు.. నూరు సీట్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కోసం లండన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని అందుకుంది. ‘‘ఆరు గ్యారంటీలు–నూరు సీట్లు’ పేరు తో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ ఎన్నారై సెల్ (యూకే) ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్‌లో చేప ట్టారు. దీనిని గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ పథకాలు, నూరు గ్యారంటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలని.. విదేశాల్లో ఉన్న వారి బంధువులు, సన్నిహి తులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసే లా తోడ్పడాలని ఆయన మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని యువత, మహి ళలు, రైతులకు ప్రాధాన్యం ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై సెల్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాన్ని పరిశీ లిస్తామని తెలిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన కార్య క్రమంలో ఎన్నారై సెల్ నేతలు రంగుల సుధా కర్ గౌడ్, బిక్కుమండ్ల రాజేశ్, మంగళారపు శ్రీధర్, గంగసాని ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకుల మధ్య ఐక్యత, ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి సారించింది. ఇందుకోసం కోసం ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో బీజేపీ మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి తెలంగాణలో బీజేపీ వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృత ప్రచారం చేయనున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తమ దగ్గర అనేక అస్త్రాలు, వ్యూహాలు ఉన్నాయని అన్నారు. ఎంపీ బండి సంజయ్‌కు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించామన్నారు ప్రకాష్ జవదేకర్. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏదో అవగాహన ఉందని కాంగ్రెస్ కుట్రపూరిత ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయకారిగా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. చదవండి: తెలంగాణలో మాకు విజయావకాశాలు: రాహుల్ గాంధీ -
TS Election 2023: ‘గ్రేటర్’ పరిధిలో ఐదు సీట్ల కోసం గొడవ!
వరంగల్: ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పార్టీలో కొందరు ఆశావహుల తీరు. ఆగస్టు 18 నుంచి 25 వరకు అసెంబ్లీ స్థానాల వారీగా ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్టానం దరఖాస్తులు స్వీకరించింది. డీసీసీ, టీపీసీసీ, ఎన్నికల నిర్వహణ కమిటీలో పరిశీలన పూర్తయిన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) కూడా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఇదంతా సుమారు 15–20 రోజుల పాటు జరిగే ప్రక్రియ. అయితే ఓ వైపు ఆ తంతు సాగుతుండగానే.. నియోజకవర్గస్థాయి సదస్సుల్లో చాలాచోట్ల ఆశావహ నేతలు బలప్రదర్శనకు దిగడం వివాదాస్పదం అవుతోంది. మీసాలు మెలేయడం.. తొడలు కొట్టుకోవడం క్యాడర్‌ను అయోమయంలో పడేస్తుండగా.. వర్గాల పోరు రోజురోజుకూ రాజుకుటోంది. ఇటీవల వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఆశావహ నేతలు పార్టీ కేంద్ర పరిశీలకుల ఎదుటే బలప్రదర్శనకు దిగారు. దీంతో రసాభాసగా ముగిసిన సమావేశాలపై టీపీసీసీ, ఏఐసీసీలు ఆరా తీస్తుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కుమ్ములాటలు.. కొట్లాటలు ఉమ్మడి వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూడు కుమ్ములాటలు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా తయారైంది. వరంగల్ జిల్లా కేంద్రంలోనే కాదు ఎనిమిది నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నా యి. వరంగల్ పశ్చిమ నుంచి 2018లో ఆశించి భంగపడ్డ నాయిని రాజేందర్‌రెడ్డికి ఈసారి దాదాపు టికెట్ ఖాయమన్న అధిష్టానం సంకేతాలతో పని చేస్తున్నారు. గతంలో పశ్చిమ కోసం నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మధ్య పోటీ ఉండేది. దీంతో ఆ ఇద్దరి నేతల మధ్యన వర్గపోరు చాలానాళ్లు సాగగా స్వర్ణ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు కావడంతో ఆమె తూర్పు నియోజకవర్గంవైపు మారారు. కొత్తగా జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పశ్చిమ టికెట్‌పై గురి పెట్టడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల హన్మకొండ డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్లమెంట్ ఇన్చార్జ్ దాల్వి సమక్షంలోనే పోటాపోటీ నినాదాలతో బలప్రదర్శనకు దిగ డం చర్చనీయాంశమైంది. తూర్పు నియోజకవర్గం కొండా సురేఖకు ఖాయమనుకున్న సమయంలో ఇక్కడి నుంచి ఎర్రబెల్లి స్వర్ణ కూడా దరఖాస్తు చేసుకున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి హాజరైన పార్లమెంటు ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమ్‌రావు దాల్వి, రాష్ట్ర పార్టీ నుంచి శోభారాణి తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న కేఆర్.నాగరాజు, నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు బల ప్రదర్శనకు దిగారు. కాగా వేదిక పైకి నాగరాజును పిలవడంతో నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో అరగంట పాటు సమావేశం స్తంభించగా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీసింది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు మొత్తం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. పరాకాష్టకు పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్.. పరకాల నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశం కూడా రసాభాసగా జరిగింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండా మురళీధర్‌రావులు పరిశీలకుల ముందే బాహాబాహీకి దిగారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇది నా అడ్డా అంటూ మీసం తిప్పగా.. ఇనగాల వెంకట్రామిరెడ్డి ఇది నా అడ్డా అంటూ తొడ గొట్టడం వివాదాస్పదం అయ్యింది. ఈ సమావేశానికి హాజరైన పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు రెండుగా చీలిపోగా.. కొండా, ఇనుగాల వర్గీయులు పరస్పరం దుర్భాషలాడుకోవడం, తోపులాటకు దిగిన ఘటనలపై అధిష్టానం ఆరా తీస్తున్నది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సైలెంట్‌గా కొనసాగిన వర్గ రాజకీయాలు ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. ఇటీవల నిర్వహించిన నియోజకవర్గం స్థాయి సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య అనుచరులు రెండు వర్గాలుగా ఏర్పడి నేతలకు అనుకూలంగా నినాదాలు చేయడం, ఒకరికొకరు నెట్టివేసుకోవడం, పరస్పరం దాడి చేసుకోవడం వరకు వెళ్లింది. వీరితోపాటు మరో ఆరుగురు ‘స్టేషన్’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. జనగామ నియోజకవర్గంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా మారింది. ఈ రెండు వర్గాల పంచాయితీ పలుమార్లు గాంధీభవన్‌కు కూడా చేరింది. -
అసమ్మతులకు ‘చేరికల’తో చెక్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను దాదాపు సిద్ధం చేసిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అదే సమయంలో సొంత పార్టీని చక్కదిద్దే చర్యలపైనా దృష్టి పెట్టారు. సిట్టింగ్‌లకు ప్రాధాన్యత ఇస్తూనే.. ప్రజల్లో, స్థానిక పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత, ఆరోపణలున్నవారిని పక్కనపెడుతున్నారు. ఆయా చోట్ల సర్వేలు, నిఘా నివేదికల ఆధారంగా గెలవగలిగిన వారిని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహుల నుంచి ఎదురయ్యే అసమ్మతికి చెక్ పెట్టేదిశగా పావులు కదుపుతున్నారు. ఆయా నేతలు పార్టీని వీడినా, అంతర్గతంగా సహకరించకపోయినా నెలకొనే నష్టాన్ని అంచనా వేస్తూ.. దానికి విరుగుడుగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల వారిని ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం. అసమ్మతి నేతలకే గెలుపు బాధ్యతలు రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టిపోటీ ఉండగా.. అందులో కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు ఇతరులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్థుల జాబితా విడుదల చేశాక టికెట్ దక్కని నేతల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని అంచనా వేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసే నేతల వివరాలను నిఘా సంస్థల ద్వారా సేకరిస్తున్నారు. టికెట్ ఆశించి, భంగపడిన నేతలను కూడా కలుపుకొనిపోవాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు బాధ్యతల్లో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా చేరికలతో.. మరోవైపు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సొంత పార్టీ నేతలు, విపక్షాల నాయకుల వివరాలను బీఆర్ఎస్ ఇప్పటికే సేకరించింది. అసమ్మతులతో పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. క్షేత్రస్థాయిలో బలం కలిగిన ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకునే పని మొదలుపెట్టింది. గతంలో స్వతంత్ర అభ్యర్థులుగా లేదా ఇతర చిన్న పార్టీల నుంచి పోటీచేసి గణనీయంగా ఓట్లు సాధించిన నాయకుల డేటాపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే స్థానికంగా బలం కలిగిన కౌశిక్ హరి (రామగుండం), ఉప్పుల వెంకటేశ్ (కల్వకుర్తి) వంటి నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇలాంటి చేరికల ద్వారా అంతర్గత అసమ్మతికి చెక్ పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్ దక్కని నేతలను కూడా చివరి నిమిషంలో బీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా కూడా.. విపక్షాల ఎత్తుగడలను దెబ్బకొట్టవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలకు సంబంధించి జిల్లా మంత్రులు, నమ్మకస్తులైన నేతలకు కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేశారని వివరిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఈ చేరికల ఆపరేషన్‌ను సమన్వయం చేసే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు సమన్వయం చేస్తున్నారు. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగొలును కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. సునీల్ గతంలో ఈయన ప్రధాని మోదీతో కలిసి బీజేపీ ప్రచార వ్యూహాన్ని రచించారు. 2017లో యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ గెలుపునకు బాటలు వేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వెనుక సునీల్ కృషి ఉంది. సునీల్ కనుగొలు(39) తండ్రి కర్ణాటక, తల్లి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం తమిళనాడులో సాగింది. ఎంబీఏ, ఎంఎస్ అమెరికాలో పూర్తి చేశారు. -
కావాలనే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్ చేశారు..
-
'ఒక్కొక్కరికి రూ.6,000 ఇస్తాం.. డబ్బులు అందితేనే ఓటెయ్యండి'
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోలి ఓటర్లకు బంపరాఫర్ ఇచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే ఓటు వేయాలని, ఇందు కోసం ఒక్కొక్కరికి రూ.6,000 ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బు అందితేనే ఓటు వెయ్యాలని లేకపోతే వేయొద్దని స్పష్టం చేశారు. బెలగావి రూరల్‌లోని సులేబావి గ్రామంలో రమేష్ జర్కిహోలి అభిమానులు శుక్రవారం ఓ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జర్కిహోలి.. ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్‌ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఆమె తన వల్లే గెలిచిందని, ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనివ్వొద్దని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలోని ఓటర్లకు లక్ష్మీ హెబ్బాల్కర్ మిక్సీలు, కిచెన్ సామాన్లు కానుకగా ఇస్తోందని, వాటి విలువ రూ.3,000 ఉంటుందని రమేశ్ పేర్కొన్నారు. అందుకు రెండింతల డబ్బు తాము ఇస్తామని, బీజేపీకే ఓటు వేయాలని సూచించారు. అయితే ఈ డబ్బులు తాను ఇవ్వనని, తన అభిమానులే సమీకరించి ఓటర్లకు పంపిణీ చేస్తారని జర్కిహోలి పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అందుకు రూ.10 కోట్లు అదనంగా తాము ఖర్చు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందన.. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ తోసిపుచ్చారు. మహిళలంటే రమేశ్ జర్కిహోలికి చులకన అని, ఎలాగైనా ఓడించాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరికీ కానుకలు, డబ్బు పంచలేదన్నారు. బహిరంగంగా ఓటర్లకు డబ్బు ఇస్తానని చెప్పిన రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో రమేష్ జర్కిహోలి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి మారారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడంతో ఉపఎన్నికలు వచ్చి బీజేపీ గెలిచి అధికారం చేపట్టింది. చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు.. -
గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్‌దే విజయం..
అహ్మదాబాద్: గుజరాత్లో బీజేపీ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అంచనా వేశారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులతో 12 గంటల మారథాన్ సమావేశంలో మాట్లాడుతూ కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి, గుజరాత్ ఎన్నికల పరిశీలకుడు అశోక్ గహ్లోత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్లో ఇటీవల కల్తీమద్యం కారణంగా చాలా మంది చనిపోయిన విషయాన్ని కూడా వేణుగోపాల్ ప్రస్తావించారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు కూడా ఎక్కువయ్యాయని ఆరోపించారు. గజరాత్ ప్రభుత్వం అవినీతి, అసమర్థంగా మారిందని ధ్వజమెత్తారు. అందుకే గతేడాది మంత్రివర్గం మొత్తాన్ని మార్చారని పేర్కొన్నారు. ఇటీవలే ఇద్దరు బీజేపీ నేతలను మంత్రి పదవుల నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్లో 90 రోజుల ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ బుధవారం ప్రారంభించింది. ఈ సారి ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నామని, అందరం ఐకమత్యంతో పోరాడుతామని వేణుగోపాల్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపదని అంతా అనుకున్నారని కానీ కొద్ది సీట్ల తేడాతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. ఈసారి బీజేపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నందున కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. చదవండి: జార్ఖండ్ సీఎం సన్నిహితుడి ఇంట్లో ఏకే 47 తుపాకులు -
ఒక్క ఛాన్స్ - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్
-
ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే, ఢిల్లీలో పార్టీల ప్రచారమెందుకు? కారణం ఇదే..
More than half of Delhi’s assembly seats are dominated by migrants from other states న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఐతే ఈ ఎన్నికల జాబితాలో ఢిల్లీ లేనప్పటికీ అక్కడ ఎన్నికల జాతర జరుగుతోంది. ఢిల్లీ నలుమూలలా పోస్టర్లు వెలిశాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పోస్టర్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఢిల్లీలో ఎన్నికల జాతర.. ఆ మూడు రాష్ట్రాల వలసదారుల ఓట్లే కీలకం కాగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్లలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు 2022 జరగనున్నవిషయం తెలిసిందే. ఐతే వీటిలో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన పోస్టర్లు రాజధాని ఢిల్లీలో ఎక్కపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఏకరువు పెడుతున్న పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఐతే ఢిల్లీలో మొత్తం 70 విధానసభలు ఉన్నాయి. ఇక్కడ అధిక శాతం ప్రజలు యుపీ, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాకు చెందిన వలసదారులు ఉంటున్నారు. అందువల్ల ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఢిల్లీలోని వలసవాసుల దృష్టిని ఏదో ఒక విధంగా ఆకర్షించేందుకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాల్లో మెజార్టీ ప్రజలు పూర్వాంచలికి చెందిన వారే ఉన్నారని సమాచారం. అందుకేనేమో యోగి ప్రభుత్వం ఢిల్లీలో పోస్టర్లు వేసి అక్కడి వలసదారుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రజలవద్దకే పోస్టర్లు అలాగే ఢిల్లీ, వికాస్పురి, రాజౌరీ గార్డెన్, హరి నగర్, తిలక్ నగర్, జనక్‌పురి, మోతీ నగర్, రాజేంద్ర నగర్, గ్రేటర్ కైలాష్, జంగ్‌పురా, గాంధీ నగర్, మోడల్ టౌన్, లక్ష్మీ నగర్, రోహిణిలోని 13 స్థానాల్లో పంజాబీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల చన్నీ ప్రభుత్వం ఇక్కడ పోస్టర్లు వేసి పంజాబీలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీలో కొండ ప్రాంత వలసదారుల సంఖ్య దాదాపు 30 లక్షలు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం ధామి పోస్టర్ల ద్వారా బీజేపీ ప్రచారం సాగిస్తోంది. కాగా ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులే ఆధికం. ఈ కారణంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పోస్టర్లు ద్వారా ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. చదవండి: మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ! -
వివాదాల సుడిగుండం లో కమల్ హాసన్
-
దీదీ ముహూర్తం ఫిక్స్ చేసింది..!
కోల్‌కతా: కరోనా ఎఫెక్ట్‌తో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు బంద్ అయ్యాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలను, ప్లీనరీలను కూడా వర్చవల్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చేరారు. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా దీదీ ఒక వర్చువల్ ర్యాలీని నిర్వహించనున్నారు. 1988 నుంచి టీఎంసీ ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవాన్ని జరుపుతుంది. ఇదే రోజున మమత త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. జూలై 21న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మమత ర్యాలీని ఉద్దేశించి ఫేస్బుక్ ద్వారా ప్రసంగించి.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఈ క్రమంలో 21 నాటి ర్యాలీ గురించి మమత పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.(కరోనా ఎక్స్‌ప్రెస్ వ్యాఖ్యలపై దీదీ స్పందన) ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఈసారి జూలై 21ని బహిరంగ ప్రదేశంలో జరుపుకోలేకపోతున్నాము. కాని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నేను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తాను. ప్రజలు బూత్ స్థాయిలో గుమి గూడాలి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి బూత్‌లో సుమారు 30 మంది హాజరుకావాలి. తర్వాత జెండా ఎగరవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలి. మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను’ అని తెలిపారు. బెంగాల్లో సుమారు 80,000 బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్‌లో 30 మంది సమావేశమైతే, సుమారు 2.5 లక్షల మంది పాల్గొనవచ్చు. (కరోనా : బెంగాలీలకు గుడ్‌న్యూస్) ర్యాలీని ఉద్దేశించి తృణమూల్ చీఫ్ వర్చువల్ మాధ్యమాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. బీజేపీ ఇప్పటికే ఇలాంటి ర్యాలీలు ఆరు నిర్వహించింది. మొదటి దానిని అమిత్ షా నిర్వహించారు. దీనిలో ప్రజలు పాల్గొనడానికి బెంగాల్ అంతటా 70,000 టెలివిజన్ సెట్లను ఏర్పాటు చేశామని బీజేపీ పేర్కొన్నది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. తృణమూల్ వద్ద ఆ రకమైన డబ్బు లేదు అన్నారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రజినీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ‘రజనీ మక్కల్ మన్రం(ఆర్ఎంఎం)’ శ్రేణులకు ప్రముఖ నటుడు రజనీకాంత్ పిలుపునిచ్చారు. రాజకీయ రంగప్రవేశానికి సహకరించే ఉద్దేశంతో రజినీకాంత్ ‘రజినీ మక్కల్ మన్రం(ఆర్ఎంఎం)’ అనే సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో గురువారం ఆర్ఎంఎం జిల్లా కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కమల్‌తో కలిసి వెళ్తే లాభమా..నష్టమా? ఒంటరిగా పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి? అని చర్చించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఆ వివరాలను రజినీ మీడియాతో పంచుకున్నారు. ‘చాలా విషయాలు చర్చించుకున్నాం. వాళ్లంతా సంతృప్తి చెందారు. నాకే ఒక విషయంలో మోసపోయానన్న భావన ఉంది. సమయం వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తా’ అని రజినీ వ్యాఖ్యానించారు. -
జార్ఖండ్ మూడో దశలో 62 శాతం పోలింగ్
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్‌గర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. -
నితీశ్ సారథ్యంలోనే ముందుకెళ్తాం: అమిత్‌షా
న్యూఢిల్లీ/పాట్నా: ‘జేడీ (యూ)తో మా బంధం బలంగా ఉందని, వచ్చే బీహార్ ఎన్నికలను ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా జేడీ (యూ), బీజేపీ సంబంధాలపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రెండు పార్టీల మధ్య సంకీర్ణ బంధం బలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌లో నితీశ్‌కుమార్ నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీచేస్తాం, జాతీయ స్థాయిలో తమ కూటమికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారని షా వెల్లడించారు. ‘కలహాలు సంకీర్ణం ఆరోగ్యకరంగా ఉందనడానికి సంకేతం. విభేదాలు ఉండడం సహజం, వాటిని మనసులోకి తీసుకుంటేనే కష్టం’అని షా అన్నారు. త్రిపుల్ తలాక్ చట్టం, 370 రద్దుపై కేంద్రానికి నితీశ్ కుమార్ మద్దతు ప్రకటించని విషయం తెలిసిందే. -
ఈవీఎంలపై దర్యాప్తు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వ్యక్తమైన అనుమానాలపై ఈసీ దర్యాప్తు నిర్వహించాలని సీపీఎం, బీఎల్ఎఫ్ డిమాండ్ చేశాయి. ఫలితాలపై బీఎల్ఎఫ్ అభ్యర్థులతో నిర్వహించిన సమీక్షలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపాయి. బుధవారం బీఎల్ఎఫ్ కార్యాలయంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడుతూ, కొన్ని స్థానాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో బీఎల్ఎఫ్ అభ్యర్థులకు తాము వేసిన ఓట్లు వీవీప్యాట్లలో నమోదైనట్టు పలువురు ఓటర్లు తమ దృష్టికి తెచ్చారని, అయితే ఆయా బూత్‌లలో లెక్కింపు సందర్భంగా తమ అభ్యర్థులకు సున్నా ఓట్లు రావడంతో గోల్మాల్ జరిగిందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈవీఎంలలో జరిగిన గందరగోళం కారణంగా రికార్డయిన ఓటింగ్‌కు ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చిన వివరాల్లో తేడాలున్నాయన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు కొంత సమయమిస్తామని, అప్పటికీ వాటి అమల్లో విఫలమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్య, వైద్యం, సేద్యం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎల్ఎఫ్ను ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ఎన్నికలు రావడంతో నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. సామాజిక న్యాయ ఉద్యమాన్ని తుదివరకూ తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించినట్టు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించొద్దు... గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో తగ్గించడం సరికాదని తమ్మినేని అన్నారు. రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను కూడా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తేనే ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ... పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తామని బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీల జనాభాకు అనుగుణంగా 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనరల్ సీట్లలో కూడా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.