సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కోసం లండన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని అందుకుంది. ‘‘ఆరు గ్యారంటీలు–నూరు సీట్లు’ పేరు తో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ ఎన్నారై సెల్ (యూకే) ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్‌లో చేప ట్టారు. దీనిని గాంధీభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ పథకాలు, నూరు గ్యారంటీ సీట్లు లక్ష్యంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్లాలని.. విదేశాల్లో ఉన్న వారి బంధువులు, సన్నిహి తులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసే లా తోడ్పడాలని ఆయన మార్గ నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని యువత, మహి ళలు, రైతులకు ప్రాధాన్యం ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై సెల్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాన్ని పరిశీ లిస్తామని తెలిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన కార్య క్రమంలో ఎన్నారై సెల్ నేతలు రంగుల సుధా కర్ గౌడ్, బిక్కుమండ్ల రాజేశ్, మంగళారపు శ్రీధర్, గంగసాని ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment