‘మేం త్వరలో బీజేపీకి మరో గిప్ట్‌ ఇస్తాం’ | Telangana Minister Sridhar Babu Slams BJP | Sakshi
Sakshi News home page

‘మేం త్వరలో బీజేపీకి మరో గిప్ట్‌ ఇస్తాం’

Published Thu, Mar 6 2025 3:15 PM | Last Updated on Thu, Mar 6 2025 4:36 PM

Telangana Minister Sridhar Babu Slams BJP

హైదరాబాద్: త్వరలో బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తామని సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు.తాము బీజేపీకి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చిమని, మళ్లీ గిఫ్ట్ ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ రంజాన్ గిప్ట్ లపై చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్ఇచ్చారు. ‘ మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం.  బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చయా?,  మేం కూడా బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తాం. 

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటకి వస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం. నరేందర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.  క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ల ఫెవికాల్ బంధం గట్టిగా చేసేందుకు చేసిన కృషి అందరూ చూశారు.  బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ సింగ్ కి వచ్చిన ఓట్లు ఎన్ని?, తనకి బీఆర్ఎస్ సంపూర్ణ సహకారం ఇచ్చిందని  రవీందర్ సింగ్ అన్నాడు. బీజేపీకి తోడుగా బీఆర్ఎస్ నిలబడింది’ అని   శ్రీధర్‌ బాబు  విమర్శించారు.

బండి సంజయ్ రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement