సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కు ఎంఎన్‌సీ కంపెనీలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బిల్డ్ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి వెల్లడించారు.
మంత్రి శ్రీధర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. లీజింగ్ మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది. లేఔట్ పర్మిషన్లు దాదాపు 22 శాతం పెరిగాయి. హైదరాబాద్‌కు ఎంఎన్‌సీ కంపెనీలు చాలా వస్తున్నాయి. గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం. ఈ క్రమంలోనే బిల్డ్ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం.
ప్రతి దరఖాస్తును ధృవీకరించి ట్రాక్ చేసేందుకు నమ్మకాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. డిజిటల్ రంగంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. గత సంవత్సరం కాలంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ శాఖ భూములకు ఆమోదం పొందటం జరిగింది. రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం 18కి.మీల పొడవుతో నిర్మాణం చేపడుతున్నాం. ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫాం వరకు 5.2km కారిడార్ నిర్మాణం చేపడుతాం. నగర సుందరీకరణ, పచ్చదనం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము.
రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. బెంగళూర్ కన్నా మన దగ్గర 467 మంది UHAI ఉన్నారు. ఐటీ రంగంలో 45000 జాబ్స్.. దాదాపు 10 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తున్నారు. దేశంలో ఈరోజు 21% గ్లోబల్ సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. నగరాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చే సంస్థ సావిల్స్ గ్రో హబ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే టాప్ 5గా ఉంది. ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలి అని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము.
ఆన్‌లైన్‌లో నూతన భవన, లేఅవుట్‌కు సంబంధించిన వ్యవస్థను ప్రవేశ పెట్టాము. డ్రాయింగ్, స్కూటిని ప్రొపెస్ లేట్ అవుతుంది అని మా దృష్టికి తీసుకొని రావటం జరిగింది. వినియోగదారులకు వారాల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించడానికి బిల్డ్ నౌను ప్రవేశ పెడుతున్నాం. ఇది భవన నిర్మాణానికి అవసరమైన సమాచారాన్ని, అనుమతులను, వివరాలను వేగంగా అందిస్తుంది. 3D టెక్నాలజీ ద్వారా ప్రజలు తమ భవన నిర్మాణం ముందే అగ్మెంటెడ్ విసువలైజేషన్ ద్వారా చూడవచ్చు. త్రీడీలో పెద్ద పెద్ద భవనాలు, ఫ్లాట్స్ మోడల్ త్రీడీలో వీక్షించే అవకాశం ఉంది. ఇంగ్లీష్ తెలుగు, ఉర్దూ, భాషల్లో బిల్డ్ నౌ టెక్నాలజీ సేవలు ఉంటాయి అని తెలిపారు.
ఇదే సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోటి నెరవేరుస్తున్నాం. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment