కర్హల్: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా కర్హాల్ అసెంబ్లీ స్థానానికి నేడు (బుధవారం) పోలింగ్ కొనసాగుతుండగా, మరోవైపు దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక దళిత యువతి హత్యకు గురైంది. ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రశాంత్ యాదవ్ హత్య చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఆ యువతి బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లుతో చెప్పిందని అందుకే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్హల్‌లో దళిత యువతి హత్యకు కారణకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎస్పీ నేతనే ఈ హత్యకు పాల్పడ్డారని బీజేపీ కర్హల్ అభ్యర్థి అనుజేష్ ప్రతాప్ ఆరోపించారు.
పలు మీడియా కథనాల ప్రకారం బాలిక మృతదేహం నగ్న స్థితిలో లభ్యమయ్యింది. ఇటీవల ఆ యువతికి బెదిరింపులు వచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని, ఆ తరువాత యువతి మృతదేహం కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజ్రా నది వంతెన సమీపంలో కనిపించిందన్నారు. పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఇటీవల ఒక నేత ఈ ప్రాంతంలో తిరుగుతూ సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని కోరాడన్నారు. అయితే తమ కుమార్తె మా ఓటు బీజేపీకేనని చెప్పింది. దీంతో ఆ నేత, అతని సహచరులు తమ కుమార్తెను బెదిరించారని, ఆ తరువాత ఈ దారుణం చోటుచేసుకుందని’ తెలిపాడు.
ఈ రోజు(బుధవారం) కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో దళిత యువతి హత్యకు గురికావడం గమనార్హం. ఈ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ నుంచి అనుజేష్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment