dalit
-
రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ప్రశ్నించిన దళితయువకుడిని..
-
Uttar Pradesh: ఒక పార్టీకి మద్దతు పలికిందని దళిత యువతి హత్య
కర్హల్: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా కర్హాల్ అసెంబ్లీ స్థానానికి నేడు (బుధవారం) పోలింగ్ కొనసాగుతుండగా, మరోవైపు దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక దళిత యువతి హత్యకు గురైంది. ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రశాంత్ యాదవ్ హత్య చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ యువతి బీజేపీకి ఓటు వేయాలని పలువురు ఓటర్లుతో చెప్పిందని అందుకే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్హల్‌లో దళిత యువతి హత్యకు కారణకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎస్పీ నేతనే ఈ హత్యకు పాల్పడ్డారని బీజేపీ కర్హల్ అభ్యర్థి అనుజేష్ ప్రతాప్ ఆరోపించారు.పలు మీడియా కథనాల ప్రకారం బాలిక మృతదేహం నగ్న స్థితిలో లభ్యమయ్యింది. ఇటీవల ఆ యువతికి బెదిరింపులు వచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లారని, ఆ తరువాత యువతి మృతదేహం కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజ్రా నది వంతెన సమీపంలో కనిపించిందన్నారు. పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఇటీవల ఒక నేత ఈ ప్రాంతంలో తిరుగుతూ సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయాలని కోరాడన్నారు. అయితే తమ కుమార్తె మా ఓటు బీజేపీకేనని చెప్పింది. దీంతో ఆ నేత, అతని సహచరులు తమ కుమార్తెను బెదిరించారని, ఆ తరువాత ఈ దారుణం చోటుచేసుకుందని’ తెలిపాడు.ఈ రోజు(బుధవారం) కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో దళిత యువతి హత్యకు గురికావడం గమనార్హం. ఈ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ నుంచి అనుజేష్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: UP By Election: అల్లరి మూకలకు అఖిలేష్ హెచ్చరిక -
KR Narayanan: దళితునిగా పుట్టి.. రాష్ట్రపతిగా ఎదిగి..
ఈ రోజున అంటే అక్టోబర్ 27న దేశ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జన్మించారు. ఆయన భారత రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలపై వివిధ రచనలు చేశారు. ఇంతేకాదు అతని మేధో పనితనం, నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేశాయి. కేఆర్ నారాయణన్ జయంతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...కేఆర్ నారాయణన్ 1921, ఫిబ్రవరి 4న జన్మించారు. ఇంటికి 8 కి.మీ దూరంలోని మిషనరీ పాఠశాలలో నారాయణన్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. నారాయణన్ తెలివైన విద్యార్థి కావడంతో ట్రావెన్కోర్ రాజకుటుంబం అతనికి కాలేజీకి వెళ్లడానికి స్కాలర్షిప్ ఇచ్చింది. దీంతో ఆయన కొట్టాయంలోని సీఎంఎస్ కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు.1948లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కేఆర్ నారాయణన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూను కలుసుకున్నారు. ఈ సమయంలో నెహ్రూ ఆయనను ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరమని కోరారు. 1949లో నారాయణన్ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. ఈ నేపధ్యంలోనే ఆయన టోక్యో, రంగూన్, లండన్, కాన్బెర్రా, హనోయిలలో రాయబారిగా పనిచేశారు. అనంతరం ఆయన టర్కియే, చైనాలలో భారత రాయబారిగా నియమితులయ్యారు.1980 నుండి 1984 వరకు అమెరికా రాయబారిగా ఉన్నారు. 1955లో కెఆర్ నారాయణన్‌ను దేశంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 1978లో పదవీ విరమణ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.1984లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సమయంలో కేరళలోని ఒట్టప్పలం స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. నారాయణన్ కాంగ్రెస్ టికెట్‌పై వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో వివిధ మంత్రి పదవులు నిర్వహించారు.1992లో కేఆర్ నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997లో దేశ 10వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కేరళ నుంచి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన మొదటి వ్యక్తి, మొదటి దళితునిగా పేరుగాంచారు.కేఆర్ నారాయణన్ తన 84వ ఏట 2005 నవంబర్ 9న కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వంట నూనె ధరలకు రెక్కలు -
భూకబ్జాను అడ్డుకున్న దళితులపై హత్యాయత్నం
ఓబులవారిపల్లె/రాజంపేట రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్న టీడీపీ నేతలు సోమవారం అన్నమయ్య జిల్లాలో దళితులపై హత్యాయత్నానికి తెగబడ్డారు. భూకబ్జాను అడ్డుకున్నందుకు కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1150లో దాదాపు 221 ఎకరాల భూమిని పెరుమాళ్లపల్లె దళితవాడ గ్రామస్తులు తాతల కాలం నుంచి వినియోగించుకుంటున్నారు. చదును చేసుకుంటున్నారు. ఈ భూమిలో తమకు పట్టాలివ్వాలని గతం నుంచే అధికారుల్ని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కాకర్లవారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారు. సోమవారం జేసీబీ యంత్రాలతో చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని పెరుమాళ్లపల్లి దళితవాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు తన అనుచరులతో కలిసి పథకం ప్రకారం తెచ్చుకున్న కర్రలతో ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. వీళ్లు తీవ్రంగా కొట్టడంతో పంట కృష్ణయ్య, పంట నరసింహులు, మడగలం ప్రభుదాస్, జనార్దన్, మరికొందరు గాయపడ్డారు.వీరిలో కృష్ణయ్య, నరసింహులు, ప్రభుదాస్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఓబులవారిపల్లె ఎస్ఐ మహేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకర్లవారిపల్లికి చెందిన కస్తూరి వెంకటేష్‌నాయుడు, కస్తూరి ఉమా, కస్తూరి శివయ్యనాయుడు, కస్తూరి కోటయ్య తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ భూములకు సంబంధించి సమన్వయం పాటించాలని, దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రైల్వేకోడూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.కార్యకర్తల కోసం ప్రాణమిస్తా.. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వేకోడూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు సమస్యలొస్తే వాటి పరిష్కారం కోసం తన ప్రాణాలను సైతం అడ్డుపెడతానని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చెప్పారు. టీడీపీ నేతల హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన రాజంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. భూ కబ్జాలు, దాడులు సర్వసాధారణం అయిపోయాయని వాపోయారు. మహిళలకు సైతం రక్షణ లేకపోవడం బాధిస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఎస్సీలపై దాడి చేయటం హేయమైన చర్యగా అభిప్రాయ పడ్డారు. ఉన్నతస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంట పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి తదితరులున్నారు. -
దళితుడి లాకప్‌డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
జెఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ధనంజయ్
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వామపక్ష కూటమి విజయం సాధించింది. ఆదివారం అర్థరాత్రి ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవుల్లో వామపక్ష అభ్యర్థులు గెలుపొందారు. బీఏపీఎస్ఏ ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో 73 శాతం ఓట్లు పోలయ్యాయి. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థి ధనంజయ్ విజయం సాధించారు. జెఎన్యూఎస్యూ సెంట్రల్ ప్యానెల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ధనంజయ్ విజయం సాధించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అభ్యర్థి ఉమేష్ చంద్ర అజ్మీరాపై ధనంజయ్ 922 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ధనంజయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నారు. ఆయన బీహార్‌లోని గయ జిల్లాకు చెందిన విద్యార్థి. ధనంజయ్ 1996 తర్వాత జెఎన్యూ స్టూడెంట్స్ యూనియన్‌కి ఎన్నికైన మొదటి దళిత అధ్యక్షుడు. 1996లో బత్తిలాల్ బైరవ విజయం సాధించారు. ధనంజయ్ మీడియాతో మాట్లాడుతూ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రత, స్కాలర్షిప్ పెంపు, మౌలిక సదుపాయాలు మొదలైనవి తన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. #WATCH नवनिर्वाचित JNU अध्यक्ष धनंजय ने कहा, "...अगर कोई है जिसने फीस वृद्धि के खिलाफ लड़ाई लड़ी है तो वह वामपंथी है। यह वामपंथ ही है जिसने सभी के लिए छात्रावास सुनिश्चित किया है और इसके लिए छात्रों ने हम पर अपना भरोसा दिखाया है..." pic.twitter.com/Wjo3X6OHac — ANI_HindiNews (@AHindinews) March 25, 2024 -
కాంగ్రెస్ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ
సిద్ధి/సూరజ్‌పూర్: విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దళిత, గిరిజన వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. నూతన ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ)గా హీరాలాల్ సమారియా ఎంపిక కోసం నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదని ఆక్షేపించారు. ఆయన దళితుడు కావడమే ఇందుకు కారణమని అన్నారు. సీఐసీగా నియమితుడైన తొలి దళితుడు హీరాలాల్‌ను కాంగ్రెస్ నేతలు నిత్యం దూషిస్తున్నారని మోదీ విమర్శించారు. దేశంలో మొట్టమొదట గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అభ్యర్థీత్వాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఆ పార్టీ మైండ్‌సెట్‌ను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో, ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. తనను రోజంతా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కానీ, వారు ఓబీసీ వర్గాలను తిడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడన్న సంగతి తెలిసిందే. దళితులు, గిరిజనులు, ఓబీసీల సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఆయా వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తోందని తెలిపారు. 2014లో తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అన్ని రకాల కుంభకోణాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అలా పొదుపు అయిన డబ్బుతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో నేరాలు, లూటీలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదులు బలం పుంజుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే, దేశమంతటా బాంబు పేలుళ్లు, హత్యల వార్తలు నిత్యం వస్తుంటాయని చెప్పారు. నేరాలు, లూటీలు విచ్చలవిడిగా జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలిజాన్ని అరికట్టడంలో దారుణంగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే మహాదేవ్ బెట్టింగ్ యాప్ బాగోతంపై విచారణ జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. ఈ కుంభకోణంలో ఎంతటి బడా బాబులున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భద్రత అనేది ప్రతి పౌరుడికి అవసరమని మోదీ చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని ప్రధానమంత్రి తెలిపారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనను క్రైస్తవ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న విషయం మీకు కూడా తెలిసిందేనన్నారు. కాగా చాలాచోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందని.. దీన్ని పరిష్కరించాలని క్రైస్తవ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని చెప్పారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని కొనియాడారు. పారదర్శకంగా, వివక్షలేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ వల్ల చివరి లబ్ధి దారుడికి సైతం పథకాల మేలు లభిస్తోందని ప్రశంసించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్నును మినహాయించాలని విన్నవించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని సీఎంను కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. దీనికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ దళిత కుటుంబంపై దాష్టీకం జరిగింది. వేధింపుల కేసులో రాజీకి రావాలంటూ ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపారు. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతని తల్లిని వివస్త్రని చేశారు. 'నా బిడ్డను విపరీతంగా కొట్టారు. కాపాడుకోలేకపోయా. మా ఇంటిని కూల్చివేశారు. ఇంట్లో వస్తువులన్నీ పాడు చేశారు. అడ్డుగా వెళ్లిన నన్ను వివస్త్రను చేశారు’’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది బాధిత మహిళ. పోలీసులు వచ్చి టవల్ అందించేంతవరకు ఆమె నగ్నంగానే ఉండిపోయారు. తన వేధింపుల కేసులో రాజీకి రావాలని తమ సోదరిపై ఒత్తిడి పెంచారని బాధితురాలి సోదరి తెలిపింది. వేధింపులకు గురిచేస్తున్నారని 2019లో మృతుని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాజీకి రావాలని కోరుతూ బాధిత కుటుంబంపై ఓ గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి మరో ఇద్దరు సోదరులను వెతుకుతూ వారి బంధువుల ఇళ్లలో కూడా నిందితులు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. తమ భర్తలపై దాడి చేసి, పిల్లలను చంపబోయినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. పోలీసు బలగాలు చేరేవరకు గ్రామంలో అల్లకల్లోలం సృష్టించారని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షిస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చాక.. మృతునికి అంత్యక్రియలు జరిపారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా దూమారం రేపింది. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళితులకు రక్షణ కరువైందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. దళితులపై దాడుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. ఘటనపై స్పందించిన ప్రభుత్వం దోషులపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఎన్నికలు జరనున్న నేపథ్యంలో నేరాలకు రాజకీయ తెరలేపుతోందని ఆరోపించింది. రెండు వర్గాల మధ్య గొడవల తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తాజా ఘటన జరిగిందని మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ఉపయోగించుకునే కుట్ర పన్నుతోందని అన్నారు. ఇదీ చదవండి: మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి.. -
మేకలు, పావురాలు చోరీ?.. దళిత యువకులను తలకిందులుగా వేలాడదీసి..
మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. మేకలను, పావురాలను చోరీ చేశారనే అనుమానంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అహ్మద్‌నగర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాము విచారణ చేపట్టి, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారని తెలిపారు. ఈ ఘటన దరిమిలా దీనికి నిరసనగా హరేగావ్లో బంద్ పాటించారు. స్థానిక విపక్ష కాంగ్రెస్ ఈ ఘటనకు బీజేపీ వ్యాపింపజేస్తున్న విద్వేషమే కారణమని ఆరోపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25న గ్రామానికి చెందిన నలుగురు దళితయువకుల ఇళ్లలోకి చొరబడిన ఆరుగురు యువకులు బలవంతంగా వారిని బయటకు తీసుకువచ్చారు. బాధిత యువకుల వయసు 20 ఏళ్లకు అటునిటుగా ఉంటుంది. ఆ యువకులు మేకలు, పావురాలు దొంగిలించారని ఆరోపిస్తూ, వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో విపరీతంగా కొట్టారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను యువరాజ్, మనోజ్, పప్పు పార్ఖే, దీపక్, దుర్గేష్, రాజులుగా గుర్తించారు. ఈ నిందితులలో ఒకరు ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితులను స్థానికులు సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. బాధితులలో ఒకరైన శుభం మగాడే జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నిందితులపై సెక్షన్ 307 (హత్యాయత్నం),360 (కిడ్నాప్), ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే మాట్లాడుతూ ఈ ఉదంతం మానవత్వానికే మాయనిమచ్చ అని అన్నారు. నిందితులు ఎంతటివారైనా వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అధికార బీజేపీ దళితులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యిందని ఆరోపించారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్ చేయాలి
తిరుపతి సిటీ: దళిత ద్రోహి నారా లోకేశ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ‘సాక్షి’ విలేకరి కరుణాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ వార్తల కవరేజ్ చేస్తున్న దళిత విలేకరిని అతి దారుణంగా లోకేశ్ గూండాలు తిట్టడం, కొట్టడం అమానుషమన్నారు. నాయకులు మల్లారపు మధు, నల్లారి బాబు, వెంకటస్వామి, యలమంచిలి ప్రవీణ్, తళారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్: దళితుల పేరిట కుట్ర రాజకీయాలు
-
దళిత కార్యకర్త ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన కేంద్ర మంత్రి జైశంకర్
వారణాసి: ఈ ఏడాది జీ-20 సమావేశం మన దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 11(ఆదివారం) నుంచి 13వ తేదీ వరకు వారణాసిలో జీ-20 మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జీ-20 సమావేశాల్లో పాల్గొన్న జైశంకర్ ఓ దళిత వ్యక్తి(బీజేపీ బూత్ అధ్యక్షుడు) ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేశారు. మంత్రి రాకకోసం ఒకరోజు ముందు నుంచే ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సుజాత చెప్పారు.'మా కుటుంబమంతా ఆ ఏర్పాట్లలో ఉన్నాం. ఇళ్లు శుభ్రం చేసి కచోరి,ఆలూ పన్నీర్ వండిపెట్టాము. కేంద్ర మంత్రి మా ఇంట్లో తినడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది'అని ఆమె అన్నారు. తమ లాంటి పేదవాళ్ల ఇంట్లో కేంద్ర మంత్రి వచ్చి తినడం చాలా ఆనందాన్ని కలిగించిందని సుజాత మామయ్య చెప్పారు. తిన్న అనంతరం భోజనం చాలా బాగుందని జైశంకర్ చెప్పారు. ఆహార భద్రత,ధాన్యం, ఫర్టిలైజర్స్, చిరుధాన్యాల గురించే ఈ రోజు సమావేశంలో చర్చ జరగనుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ కూడా ఇందులో పాలుపంచుకోనున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి:భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచికి జపాన్ జంట ఫిదా.. -
ముస్లింలను దళితులతో పోలిస్తే తప్పేంటి? రాహుల్‌కు మాయావతి మద్దతు
సాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ట్విట్టర్లో మద్దతు తెలిపారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. అందుకు ప్రస్తుత, గత ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అందులో తప్పేంటి? అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన "మొహబ్బత్ కీ దుకాన్" కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రస్తుతం భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.1980ల్లో దళితుల పరిస్థితి ఎంత దీనంగా ఉండేదో అంతకంటే ఘోరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం సమర్ధించారు. ట్వీట్ సారాంశమేమిటంటే... " అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పింది చేదు నిజం. కోట్లాది దళితులు, ముస్లింలు భారత దేశంలో దయనీయ స్థితిలో అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితికి గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల ప్రభుత్వాలే బాధ్యత వహించాలి." "యూపీలో కానివ్వండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి. ఇప్పటికీ పేద, అణగారిన వర్గాల పట్ల అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం మా హయాంలో మాత్రమే యూపీలో ప్రశాంతత నెలకొంది." కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్ధ రాజకీయ నాయకులు మతపరమైన అల్లర్లు, కులాల మధ్య కొట్లాటలను రెచ్చగొట్టి చరిత్రను ఎన్నో చీకటి అధ్యాయాలతో నింపేశారని రాశారు. చదవండి: ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు -
రాహుల్ గాంధీ తన వేలితో తన కంటినే పొడుచుకున్నారా?
భారతదేశంలో 1980లో దళితులు ఎదుర్కొన్న పరిస్థితులను ఇప్పుడు ముస్లింలు ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ‘మోహబ్బత్ కీ దుకాన్’ పేరుతో జరిగిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1980లో దళితులు ఎంతటి దీనావస్థలో ఉండేవారో ఇప్పుడు ముస్లింలు అదే దీనావస్థలో ఉన్నారని అన్నారు. కానీ 80వ దశకంలో అధికారంలో ఉంది తన నాయనమ్మ ఇందిరా గాంధీ, ఆమె తర్వాత తన తండ్రి రాజీవ్ గాంధీనే. ఈ విషయాన్ని మరచి రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చినట్లయింది. రాహుల్ గాంధీ ఏమన్నారంటే.. ఈరోజు భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వారి పరిస్థితి దయనీయం. ఇదే పరిస్థితిని సిక్కులు, క్రైస్తవులు,దళితులు, గిరిజనులు కూడా ఎదుర్కొంటున్నారు. చాలాకాలం క్రితం 1980ల్లో యూపీ వంటి రాష్ట్రాలకు వెళ్లి చూస్తే ఆనాడు దళితులు ఇటువంటి విపరీతమైన పరిస్థితులనే ఎదుర్కొనేవారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో సామరస్యం నెలకొల్పాలంటే అది ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. ప్రజల్లో వారు నింపిన ద్వేషపూరితమైన స్వభావాన్ని నిర్మూలించాలంటే ఒక్కటే మార్గం.. ప్రేమ. ద్వేషాన్ని ఎన్నటికీ ద్వేషంతో దూరం చేయలేము. కేవలం ప్రేమతోనే అది సాధ్యమవుతుందని అన్నారు. లవ్ ఫార్ములా.. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ప్రేమతోనే మనుషుల మధ్య దూరాన్ని తగ్గించవచ్చన్న మంత్రాన్ని జపించారు. ఇదే సూత్రంతో కర్ణాటకలో కాంగ్రెస్ విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ పాచికపారడంతో గ్లోబల్‌గా ఇదే సిద్ధాంతానికి ప్రచారం కల్పిస్తున్నారు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే సాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’ ను వేదికగా చేసుకున్నారు రాహుల్ గాంధీ. లవ్ ని ప్రమోట్ చేయడం వరకు అంతా బాగానే ఉంది కానీ పీరియాడిక్ పోలికతో రాహుల్ సెల్ఫ్ గోల్ వేసుకోవడమే కాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడటం లేదు. అసలే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ ఇలాంటి వాక్కు దోషాలు చేస్తే బీజేపీ వాటిని గెలుపుకి సాధనాలుగా వాడుకున్నా వాడుకుంటుంది. చదవండి : మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్ -
చంద్రబాబు దళిత ద్రోహి.. వారి కోసం ఒక్క పనైనా చేశారా?: మేరుగు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని మండిపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున. దళితుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బాబుకు సవాల్ విసిరారు. దళితుల కోసం సీఎం జగన్ రూ.53వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దళితులను అవమానించేలా మాట్లాడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇద్దరూ దళిత వ్యతిరేకులని ద్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితుల అభివృద్ధి కోసం గానీ, సంక్షేమం కోసం గానీ ఒక్క పనైనా చేశారా? అని మేరుగు ప్రశ్నించారు. దళివుల పేరుతో టీడీపీ కార్యకర్తలే దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. చదవండి: ‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’ -
దళిత బంధుపై కెసిఆర్ కీలక వ్యాఖ్యలు
-
‘దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో లేదు’
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘దళిత ముఖ్యమంత్రి’ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే స్పందించారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో లేదని, కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని ఠాక్రే స్పష్టత ఇచ్చారు. దళిత సీఎం అనే చర్చ కాంగ్రెస్‌లో ఏనాడూ జరగలేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరిస్తుందని పేర్కొన్నారాయన. అలాగే ఏలేటి మహేశ్వరరెడ్డి బీజేపీ చేరికపైనా ఠాక్రే స్పందించారు. మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించింది. ఆయన పార్టీని ఎందుకు వీడారో చెప్పాల్సిన అవసరం ఉందని ఠాక్రే వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్ శ్రేణుల్లోనే చర్చ నడుస్తోంది. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదు. ఈ విషయంపై పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని ఠాక్రే తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాసనసభలోని ఆయన కార్యాలయంలో సోమవారం వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభలో పార్టీ ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడిచేసిన ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే దాడిలో సుధాకర్‌బాబు మోచేతికి అయిన గాయం చూపించారు. సీఎంను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంశాఖ మంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, అలజంగి జోగారావు, కిలివేటి సంజీవయ్య, వి.ఆర్.ఎలీజ, తిప్పేస్వామి, కంబాల జోగులు, వరప్రసాద్, కొండేటి చిట్టిబాబు, ఆర్థర్, తలారి వెంకట్రావు, రక్షణనిధి తదితరులున్నారు. చదవండి: స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్ డే' -
దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఎస్డీఎఫ్ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్డీఎఫ్ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది. దళితబంధుకు 17,700 కోట్లు.. తాజా బడ్జెట్లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది. -
Untouchability: మీకు సరుకులు అమ్మొద్దని చెప్పారన్నా!
క్రైమ్: అంటరానితనం.. శిక్షార్హమైన నేరం. టీవీ ప్రకటనలు, మైకుల్లో వినిపించడం వరకే పరిమితమైందా?. అక్కడక్కడా ఇలాంటి ఘటనపై ఫిర్యాదులు-చర్యలు ఉంటున్నా.. చాలా వరకు ఉదంతాలు వెలుగులోకి మాత్రం రావడం లేదు. తాజాగా తమిళనాడులో ఓ ఊరు ఊరు మొత్తం తక్కువ కులమంటూ కొందరి పట్ల అస్పృశ్యత కనబర్చడం వీడియో సాక్షిగా బయటపడింది. తమిళనాడు తంజావూరు జిల్లా పాపకాడు పరిధిలోని కేళామంగళం గ్రామంలో నవంబర్ 28వ తేదీన హిందూ కులాల ఆధ్వర్యంలో పంచాయితీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎస్సీ కులస్తులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. ముందు చర్యలుగా వాళ్లకు ఎలాంటి ఉత్పత్తులు అమ్మకూడదని కిరాణ షాపు యాజమానులను ఆదేశించారు. అలాగే హోటల్లోకి రానివ్వొద్దని, క్షవరాలు చేయొద్దని ఆదేశాలు జారీచేశారు. ఇది దృష్టికి రావడంతో ఓ ఎస్సీ యువకుడు.. ఆ మరుసటి రోజే ఓ దుకాణానికి వెళ్లాడు. అయితే తాను సరుకులు అమ్మలేనని, ఇది ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయమని తెగేసి చెప్పాడు ఆ ఓనర్. ఇదంతా వీడియో తీసిన ఆ యువకుడు.. సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు. విల్లుపురం ఎంపీ రవికుమార్ దృష్టికి ఈ విషయం రావడంతో.. ఆయన సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసి చర్యలకు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలప్పుడు ఎస్సీఎస్టీ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తమిళనాడు ప్రభుత్వానికి గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వీఏవో దర్యాప్తు అనంతరం ఊరిలో షెడ్యూల్డ్ కులాల కమ్యూనిట్పై వివక్షత చూపిస్తున్న విషయం వాస్తవమేనని తేల్చారు. ఇక వీడియో ఆధారంగా షాప్ ఓనర్ వైరముత్తును అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని దుకాణానికి సీల్ వేశారు. అంతేకాదు.. ఊరిలో టీ దుకాణాల్లో రెండు గ్లాసుల విధానం అమలు అవుతోందని, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ల కోసం ఒక గ్లాస్, ఇతర కులాల కోసం మరో గ్లాస్ విధానం అమలు అవుతోందని గుర్తించారు. అలాగే బార్బర్ దుకాణాల్లోనూ కొన్నిసార్లు వాళ్లకు క్షవరం, కటింగ్‌లు చేసేందుకు కూడా నిర్వాహకులు అంగీకరించడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో.. గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో.. పోలీసులను మోహరించారు అక్కడ. అఫ్కోర్స్.. ఇలాంటి ఊర్లు తమిళనాడులోనే కాదు.. అంతటా ఉన్నాయనుకోండి!. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌లో తమిళనాడు తెన్‌కాశీ పంజాన్కుళంకు చెందిన ఓ దుకాణ యజమాని.. దళిత కులానికి చెందిన పిల్లలకు చాక్లెట్లు అమ్మలేదు. తాను గ్రామ పంచాయితీ ఆదేశాలను పాటిస్తున్నానని చూపించేందుకు అతగాడు అదంతా వీడియో తీశాడు. అయితే ఆ వీడియో బయటకు రావడంతో.. శంకరన్‌కోయిల్ పోలీసులు మహేశ్వరన్ అనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
కళ్లముందున్న వివక్ష కనబడదా?
ఉద్యోగార్థుల కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని గతంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ (ఐఐడీఎస్) బయటపెట్టింది. ఇలాంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీలు, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ వివక్ష దేశంలో ఇంకా అలాగే ఉందని తాజాగా ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా వెల్లడించింది. కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవసరమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వారికి ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. కుల వ్యవస్థ ప్రజల జీవితాలను ఇంకా నియంత్రిస్తూనే ఉంది. రమేష్ మెష్రం అనే విద్యార్థి ఉద్యోగం కోసం ఒక కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి కావాల్సిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పంపాడు. కానీ పిలుపు రాలేదు. తన పేరును కొంచెం మార్చి, అంటే ఇంటిపేరును సంక్షిప్తీకరించి పంపిస్తే పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అభ్యర్థుల కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆధిపత్య కులాలైతే సంక్షిప్తంగా మాట్లా డడం, దళితులు, వెనుకబడిన కులాలైతే, వారి కుల వివరాలు తెలి యకపోతే, మీ తండ్రి ఏం చేస్తారు? గ్రామమా? పట్టణమా? ఎటు వంటి జీవనోపాధి ఉండేది?... అట్లా కులం తెలిసేదాకా లాగడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి కులం గురించి తెలిసేదాకా ప్రయత్నం చేసే అలవాటు కంపెనీలకు ఉందని పదిహేనేళ్ళ క్రితమే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్(ఐఐడీఎస్) బయటపెట్టింది. ఉద్యోగం మాత్రమే కాదు, ప్రాథమిక విద్య, వ్యాపారం, ఆరోగ్య అవకాశాలు, ఇట్లా కొన్ని అంశాలపై ఒక సంవత్సరానికిపైగా సర్వే చేసింది ఆ సంస్థ. ఆ సర్వే ఆ రోజుల్లో సంచలనం రేపింది. దానిని 2010 సంవత్సరంలో ‘బ్లాకెడ్ బై కాస్ట్’ పేరుతో పుస్తకంగా కూడా ముద్రించారు. దానికి ఐఐడీఎస్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ థోరట్ నేతృత్వం వహించారు. ఇటువంటి అనుభవాలను చాలామంది దళిత, ఆదివాసీ, కొన్ని వెనుకబడిన కులాల యువతీ యువకులు ఎదుర్కొనే ఉంటారు. ఈ కులాల్లో అత్యధిక నైపుణ్యం కలిగినవాళ్ళకు కొన్ని ఇబ్బందుల తర్వాతనైనా అవకాశాలు వచ్చి ఉంటాయి. ఆధిపత్య కులాల్లోని మంచివాళ్ళు, లేదా విదేశీ నిపుణులు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకనే ప్రశ్న చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ‘ఆక్స్‌ఫామ్’ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఇటీవల ‘ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్టు–2020’ పేరుతో ఒక నివే దికను విడుదల చేసింది. ఇందులో కులం, మతం, స్త్రీ–పురుషులు – ఇలా రకరకాల వివక్ష కొనసాగుతోందనీ, ఉద్యోగాలు పొందడంలో, వైద్య సౌకర్యాలు అందుకోవడంలో వివక్ష ఎదురవుతోందనీ ఆ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను నేషనల్ సర్వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేల ఆధా రంగా రూపొందించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకూ, మిగతా సమాజానికీ మధ్య నెలవారీ సంపాదనలో తేడా ఉందని గుర్తించారు. ఎస్సీ, ఎస్టీలు నెలకు 10,533 రూపాయలు సంపాదిస్తే, సమాజంలోని మిగతా వ్యక్తులు నెలకు సరాసరిగా 15,878 రూపాయలు పొందు తున్నారని వెల్లడించారు. పురుషులు, మహిళల మధ్య కూడా వేత నాలు, కూలీ విషయంలో వ్యత్యాసం ఉందని తేల్చారు. మగవారు నెలకు 19,779 రూపాయలు సంపాదిస్తే, మహిళలు 15,578 రూపా యలు మాత్రమే పొందుతున్నారు. పట్టణాల్లో ముస్లింలు నెలకు 13,672 రూపాయలు సంపాదిస్తే, ఇత రులు 20,345 రూపాయలు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధిలో మగవారు సరాసరి 15,996 రూపాయల ఆదాయం పొందితే, మహిళలు కేవలం 6,620 రూపా యలు మాత్రమే సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిలో ఎస్సీ, ఎస్టీలు 7,337 రూపాయలు పొందితే, ఇతరులు 9,174 రూపాయలు సంపాదిస్తున్నారు. కోవిడ్ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు రెండు న్నర రెట్లు అధికమైందని ఈ సర్వే తెలుపుతున్నది. 10 శాతం నుంచి 22 శాతానికి పెరిగింది. పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత పడింది. జీత భత్యాల్లో కూడా కోతపడింది. లాక్డౌన్ సమయంలో, ఆ తర్వాత చాలాకాలం సగం జీతాలే లభించాయి. మహిళల్లో కోవిడ్ తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళల్లో మగవారిలో 9 శాతం మంది దెబ్బతింటే, మహిళలు 70 శాతం మంది నష్టపోయారు. ఆర్థిక వృద్ధిలోనూ, ఆదాయం పెరగడానికి ప్రారంభించే వ్యాపా రాల్లోనూ అప్పు అనేది ముఖ్యం. ఎవరైతే అవసరానికి తగ్గ ఆర్థిక సాయం పొందుతారో వారు ఆర్థిక వనరులను పెంచుకోగలుగు తారు. వేలకోట్లు ఆస్తులు కలిగిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు కూడా బ్యాంకుల నుంచి రుణాలు లభించడం వల్లనే తమ కార్యకలాపాలను కొనసాగించగలుగుతున్నారు. ఈ విషయంపై కూడా ఆక్స్‌ఫామ్ తన అధ్యయనాన్ని కొనసాగించింది. ఒక వ్యక్తి లేదా ఇద్దరు ముగ్గురు ఉమ్మడిగా లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పొందితే, 120 కోట్ల మంది కేవలం కొన్ని కోట్ల రూపాయలను మాత్రమే అప్పుగా పొంద గలిగారు. ఇందులో వివిధ వర్గాల మధ్యన మరింత వ్యత్యాసం ఉంది. ఎస్సీలు తాము తీసుకున్న రుణాల్లో 34 శాతం వాణిజ్య బ్యాంకులు, 9 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపు తున్నాయి. ఎస్టీలు 31 శాతం వాణిజ్య బ్యాంకులు, 29 శాతం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. ఎస్సీలు అతి తక్కువ బ్యాంకు రుణాలు పొందడానికి ప్రధాన కారణం, దాదాపు 90 శాతం మందికి పైగా దళితులకు నికరమైన వ్యవసాయ భూమి లేదు. ఒకవేళ ఉన్నా అది అరెకరం, ఎకరానికి మించదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గింది. 96 శాతం ఉద్యోగాలు కేవలం ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. నాలుగుశాతం ఉద్యోగాలు ప్రభుత్వ అధీనంలోని సంస్థల్లో ఉన్నాయి. 2018–19లో నిరుద్యోగుల శాతం ఎస్సీ, ఎస్టీల్లో 9.9 శాతంగా ఉంటే, అది ఇతరుల్లో 7.9 శాతంగా ఉంది. నిజానికి ఉద్యోగాల మీద ఆధారపడేది ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలే. వారి చేతిలో భూమి లేదు. వ్యాపారాల్లేవు. ఆర్థిక వనరులు లేవు. కానీ ఉద్యోగ నియామకాల్లో మాత్రం ఆ వర్గాలు వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అత్యంత అవస రమైనవే... ఉపాధి, ఉద్యోగం. కానీ వాళ్ళకు ఆ రెండూ ఆమడ దూరంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం, దేశంలో ఉన్న అసమానతలు. వీటికి పునాది కుల వ్యవస్థలో ఉంది. ఆధిపత్య కులాల్లోని ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ప్రవేశించడానికి ఏ అడ్డంకులూ లేవు. వారిలో కొద్ది శాతం మంది పేదలు ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే దళితుల్లో ధనికులు ఉన్నట్టే. ఒక గ్రామానికి సంబంధించిన వివరాలను నేను రెండు రోజుల క్రితం సేకరించాను. ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాలు భూమిని కలిగి ఉన్నాయి. అదే ఆధారంతో ఉద్యోగార్హమైన చదువులు చదివారు. ఈ రోజు వాళ్ళు విదేశాల్లో తమ పిల్లలను చదివించి, ఉద్యోగాల్లో స్థిరపరిచారు. వెనుకబడిన కులాలకు ఆదాయాన్ని పొందే కుల వృత్తులున్నాయి. వాటి ద్వారా బతుకుదెరువుకు ఇబ్బంది లేని జీవితా లను గడుపుతున్నారు. కానీ 25 శాతానికి పైగా ఉన్న ఎస్సీలు మాత్రం రోజు రోజుకీ తమ బతుకు వెళ్ళదీయడానికి పరుగులు పెడుతున్నారు. వారు భద్రత కలిగిన ఉద్యోగాల్లో లేరు. తరతరాలుగా కుల వ్యవస్థ అవలంబించిన వివక్ష ప్రజల జీవితాలను నియంత్రిస్తున్నది. పరిస్థితి ఇట్లా ఉంటే, ఇటీవల కొంతమంది తప్పుడు భావాలను ప్రచారం చేస్తున్నారు. దళితులు కొందరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొడు తున్నారని మాట్లాడుతున్నారు. పైన పేర్కొన్న వాస్తవాలు దళితులను రోజురోజుకీ ఇంకా పేదరికంలోకి, అభద్రతలోనికి నెడుతున్నాయి. వేలాది మంది దళితులు ఆధిపత్య కులాల చేతుల్లో హత్యలకు, అత్యా చారాలకు గురయ్యారు. ఎక్కడా కూడా దళితులు తిరిగి అణచివేతకు పూనుకోలేదు. దళితుల మీద నిందలు వేసేవాళ్లు అధ్యయనం చేయడం మంచిది. అంతిమంగా ఈ వివక్షను, హింసను ఎట్లా నివా రించాలో, నిర్మూలించాలో ఆలోచిస్తే మంచిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
దళితులను నిర్బంధించి చిత్రహింసలు.. మహిళకు గర్భస్రావం!
చిక్కమగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరులో ఓ వ్యక్తి తన ప్లాంటేషన్‌లో దళితులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది. జగదీశగౌడకు జెనుగడ్డె గ్రామం వద్ద కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇతడి నుంచి రోజువారీ కూలీలైన బాధితులు రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో మొత్తం 16 మందిని జగదీశ తన ప్లాంటేషన్‌లో నిర్బంధించాడు. జగదీశ గౌడ దెబ్బలతో ఒక మహిళకు గర్భస్రావం అయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు జగదీశ గౌడ, అతడి కుమారుడు తిలక్ కోసం గాలింపు చేపట్టారు. తమ బంధువులను జగదీశ గౌడ చిత్రహింసలు పెడుతున్నారంటూ కొందరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే ఆ ఫిర్యాదును వారు వెనక్కి తీసుకున్నారని బలెహొన్నూర్ పోలీసులు చెప్పారు. ఆ మరునాడు బాధితురాలైన గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించి, చిక్కమగళూరులో మరోసారి వీరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము వెళ్లి బందీలుగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మందిని విడిపించామన్నారు. వీరిని 15 రోజులుగా నిర్బంధంలోనే ఉంచినట్లు తేలిందన్నారు. వీరిలో రెండు నెలల గర్భవతి అయిన అర్పిత కూడా ఉంది. జగదీశ గౌడ ఈమె ఫోన్ లాగేసుకుని ఒక రోజు నిర్బంధించాడని, కొట్టడంతో గర్భస్రావం అయిందని ఆమె తల్లి ఆరోపించింది. జగదీశ గౌడ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న వారు ఎటో వెళ్లిపోవడంతో అతడు తమను నిర్బంధించినట్లు బాధితులు తెలిపారని చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్ చెప్పారు. కాగా, జగదీశ గౌడ బీజేపీ నేత అంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. జగదీశ గౌడతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
నిమ్న కులానికి చెందిన వైద్యుడు పోస్టుమార్టమ్ చేశారని..
బరఘా: కుల వివక్ష వెర్రి తలలు ఎలా వేస్తోందో చెప్పే ఉదంతమిది. ఒడిశాలోని బరఘా జిల్లాలో ముచును సంధా అనే వ్యక్తి ఆస్పత్రిలో మరణించారు. పోస్టుమార్టం చేసిన వైద్యడు నిమ్న కులానికి చెందిన వ్యక్తి కావడంతో గ్రామస్తులు ఏకంగా అంత్యక్రియలను బహిష్కరించారు. కనీసం బంధువులెవరూ అటువైపు తొంగి కూడా చూడలేదు. దాంతో గ్రామ సర్పంచ్ భర్త సునీల్ బెహరా ఇలా బైక్ మీద మృతదేహాన్ని తీసుకువెళ్లి ఒకరిద్దరి సహకారంతో అంతిమ సంస్కారం నిర్వహించారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా -
కార్డినల్‌గా తొలి దళితుడు.. పూల ఆంథోనీ
సాక్షి, హైదరాబాద్: ఆర్చిబిషప్ పూల ఆంథోనీ(60) క్యాథలిక్ కార్డినల్‌గా ప్రకటించబడ్డ విషయం తెలిసిందే. కేథలిక్కుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్.. వాటికన్ సిటీ(ఇటలీ) సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఇవాళ పూల ఆంథోనీని కార్డినల్‌గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ కర్నూల్‌కు చెందిన పూల ఆంథోనీ.. కార్డినల్ హోదా అందుకోబోయే తొలి దళితుడు కూడా. ఇవాళ(ఆగస్టు 27న) జరగబోయే కొత్త కార్డినల్స్ పరిషత్ సమావేశానికి కూడా పూల ఆంథోనీ హాజరుకానున్నారు. ఇక కేథలిక్ చర్చి చరిత్రలో ఈ హోదా పొందిన తొలి తెలుగు వ్యక్తి పూల ఆంథోనీ. కార్డినల్ హోదాలో.. పోప్ ఎన్నికలో పాల్గొనే అవకాశం పూల ఆంథోనీకి ఉంటుంది. ఆంథోనీతో పాటు భారత్ నుంచి గోవా, డామన్ ఆర్చి బిషప్ ఫిలిపె నెరి అంటోనియో సెబాస్టియో డొ రొసారియో ఫెర్రో కూడా కార్డినల్ ర్యాంక్ పొందిన వాళ్లలో ఉన్నారు. నేపథ్యం.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిందుకూరు గ్రామంలో జన్మించిన ఆంథోనీ.. 1992లో మొదటిసారిగా కడపలో క్రైస్తవ మతాచార్యుడుగా, 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో హైదరాబాద్ ఆర్చిబిషప్ అయ్యారు. కార్డినల్‌గా నియమితులైన ఆంథోనీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ ఆర్చిబిషప్ హోదాలోనూ కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం -
లండన్‌లో తొలి దళిత మేయర్‌గా మొహిందర్ కె.మిధా
లండన్: భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. తద్వారా యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు. మొహిందర్ కె.మిధా ఎన్నిక పట్ల లేబర్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమనియూకేలోని ‘ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్’ చైర్మన్ సంతోష్‌దాస్ చెప్పారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మిధాను 2022-23 తదుపరి ఏడాది కాలానికి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా పేర్కొంటున్నాయి. -
అమలాపురం ఘటనపై దళిత సంఘాల ఆందోళన
-
అబ్బా..! ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్
మనసులో అవతలి వాళ్ల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. బహిరంగ వేదికల్లో మాత్రం లేనిపోని ప్రేమలు ఒలకబోయడం కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి ఘటనే ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అవతలివాళ్ల పట్ల, అదీ ప్రత్యేకించి దళితుల పట్ల తన సోదరభావం ఏపాటిదో చూపించే ప్రయత్నంలో.. ఓ ఎమ్మెల్యే చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్.. ఓ దళిత స్వామిజీతో కలిసి తిండి పంచుకున్నారు. అది అలాంటి ఇలాంటి ఆహారం కాదు. ముందుగా స్వామిజీ నోట్లో పెట్టిన ఎమ్మెల్యే.. ఆయన నమిలిన తర్వాత బయటకు ఉమ్మించి.. తిరిగి అదే బయటకు తీసుకుని తన నోట్ల పెట్టుకుని మరి తిన్నాడు ఎమ్మెల్యే తిన్నాడు. దళిత వర్గానికి చెందిన స్వామి నారాయణ.. చామరాజ్‌పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఈ చేష్టలకు దిగారు. తమ మధ్య కుల వివక్షకు తావులేదని, పైగా తమ మద్య సోదరభావం ఏపాటిదో చెప్పేందుకు తాను ఈ పని చేసినట్లు బల్లగుద్ది మరీ ప్రకటించుకున్నాడాయన. ఈ ఘటన చూసి వెనక ఉన్న అనుచరులంతా చప్పట్లతో గా హాలును మారుమోగించారు. ఆదివారం చామరాజ్‌పేటలో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు ఎమ్మెల్యే ఈ చేష్టలకు పాల్పడ్డాడు. #WATCH Bengaluru, Karnataka: In an attempt to set an example seemingly against caste discrimination, Congress Chamarajapete MLA BZ Zameer A Khan feeds Dalit community's Swami Narayana & then eats the same chewed food by making Narayana take it out from his mouth to feed him(22.5) pic.twitter.com/7XG0ZuyCRS ANI (@ANI) May 22, 2022 -
ఆలస్యమే! అయినా అభిలషణీయమే!
సీపీఎం తన అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్ బ్యూరోలోకి ఎట్టకేలకు ఒక దళితుడిని చేర్చుకుంది. ఒక దళిత నాయకుడికి ఆ స్థానం కట్టబెట్టడానికి భారతదేశంలోని అతిపెద్ద వామపక్ష రాజకీయ పార్టీకి 57 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. బెంగాల్ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన రామచంద్ర డోమ్‌ను సీపీఎం ఇటీవలే నిర్వహించిన పార్టీ జాతీయ మహాసభలలో పొలిట్ బ్యూరోలోకి తీసుకుంది. ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే ఒక దళిత నాయకుడిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నంత మాత్రాన పెద్ద మార్పు జరిగిపోదని గ్రహించాలి. ఎందుకంటే భారతదేశంలో వామపక్షం కులవివక్షపై నేటికీ స్పష్టమైన వైఖరిని కలిగిలేదు. వామపక్ష పార్టీలు వర్గ వివక్షను అర్థం చేసుకున్నాయి కానీ కులాన్ని కాదు. ‘ఒక కమ్యూనిస్టుగా పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించుకున్న మొట్ట మొదటి దళితుడిగా నాకు నేనుగా భావించలేను. మరే విషయంలోనైనా సరే అలాంటి ఆలోచనలు నాకు ఉండవు’ అని రామచంద్ర డోమ్ మీడియాతో చెప్పారు. భారతీయ నేపథ్యంలో ఈ ప్రకటన కూడా సమస్యాత్మకమే. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు సుదీర్ఘ కాలం పాలించినా కానీ దళితులకు లేదా ఆదివాసీలకు కీలకమైన నాయకత్వ స్థానాల్లో చోటు కల్పించలేక పోయారు. జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య, సీతారామ్ ఏచూరి, మాణిక్ సర్కార్ తదితర సీపీఎం అగ్ర నేతలు అందరూ అగ్రకుల నేపథ్యాల నుంచి వచ్చారు. వామపక్షంలో బయటకు కన్పించని, లేదా మాట్లాడని కులపక్షపాతం చాలా ప్రమాదకరమైనది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వామపక్షాలు తమ రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోవడం వెనుక ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్లో దళిత ఓట్లు గతంలో కమ్యూనిస్టు పార్టీకే పడేవి కానీ తర్వాత వాటిని తృణమూల్ కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇప్పుడు దళితుల ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. బెంగాల్లో మాదిరి త్రిపురను కూడా సీపీఎం 25 ఏళ్లు పాలించింది. కానీ ఈరోజు ఆ రాష్ట్రాన్ని కూడా బీజేపీ స్వాధీనపర్చుకుంది. రాష్ట్రంలోని ఆదివాసీ రాజకీయాలను గుర్తించడంలో కమ్యూనిస్టుల వైఫల్యమే ఈ పతనానికి కారణం. కేంద్రీకృత నిర్ణయాలు అందరికీ సమానంగా వర్తించాలని సీపీఎం నమ్ముతుంది కానీ గిరిజనులకు అవసరమైన రాజకీయ ఆవరణను వీరు అనుమతించలేక పోయారు. ఈ రాజకీయ శూన్యతలోకి ఆరెస్సెస్ అడుగుపెట్టి గిరిజనులకు ఒక వేదికను కల్పించింది. క్రమంగా త్రిపురలో గిరిజనుల ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. చివరకు ఆ పార్టీ గెలుపు సాధించింది కూడా! 2018లో తెలంగాణలో దళిత రాజకీయ పార్టీలతో సీపీఎం చేతులు కలిపి బహుజన వామపక్ష ఐక్య సంఘటనను ఏర్పర్చింది. తెలంగాణలో సీపీఎం నాయకత్వం జై భీమ్ – లాల్ సలాం అనే నినాదాన్ని కూడా చేపట్టింది. అంబేడ్కర్‌ని కమ్యూనిస్టులు తమ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా గుర్తించిన సమయమిది. అయితే ఈ ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలాగే ఉండిపోయింది తప్పితే దళితులకు, గిరిజనులకు వారి పొలిట్ బ్యూరోలో ఎన్నడూ స్థానం కల్పించలేదు. పైగా దళిత రాజకీయాలను గుర్తింపు రాజకీయాలుగా మాత్రమే వామపక్షం పిలుస్తూ వచ్చింది. అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకాన్ని వామపక్షం ఎన్నడూ అంగీకరించలేదు. తమ పొలిట్ బ్యూరోలోకి మొట్టమొదటి దళిత నేతను చేర్చుకోవడాన్ని వ్యూహాత్మక అడుగుగా వామపక్షం ఎన్నటికీ ఆమోదించదు. అయినప్పటికీ ఇది వాస్తవం. తమ రాజకీయ అవకాశాలు ఎన్నడూ లేనంతగా కుదించుకు పోతున్నాయని వామపక్షం కొన్ని సంవత్సరాలుగా గుర్తిస్తూ వస్తోంది. (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) త్రిపుర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వామపక్షాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సంస్థలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కింది స్థాయిలో సంస్థను బలోపేతం చేసుకోవడానికి ఏకైక మార్గం మరింతగా ప్రజారాశులను చేర్చుకోవడమే అని వామపక్ష నాయకత్వం గుర్తించింది. 57 సంవత్సరాల తర్వాత పార్టీ నిర్ణాయక అంగమైన పొలిట్ బ్యూరోలో దళిత, గిరిజన నేతలను చేర్చుకోవడం అనేది సంస్థాగత మార్పులను తీసుకొస్తుందని వామపక్షం గుర్తించింది. (క్లిక్: అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత) భారతదేశంలో వామపక్ష పునరుద్ధరణ సాధ్యపడుతుందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. కానీ కుల వివక్ష, మైనారిటీల పట్ల వివక్ష ఉందన్న వాస్తవాన్ని ఆమోదించకుండా, వారి స్వరాలకు చోటు కల్పించకుండా వామపక్ష పునరుద్ధరణ అసంభవం. సాంప్రదాయికంగా తాము విశ్వసిస్తూ వచ్చిన రాజకీయ పార్టీల నుంచి ముస్లింలు కూడా బయటపడుతూ తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొత్త పార్టీలకు లేదా ఏఐఎంఐఎం వంటి పార్టీలకు ఓటు వేస్తున్నారు. భారతీయ కులాధిక్యతా సమాజంలో మార్క్సి జాన్ని తప్పుగా అన్వయించడం వల్లే వామపక్షం తనదైన చోటును కోల్పోయింది. తన పొలిట్ బ్యూరోలోకి తొలి దళితుడిని సీపీఎం చేర్చుకోవడం అనేది రాబోయే రోజుల్లో నిజమైన మార్పును తీసుకొస్తుంది. భారత రాజకీయాల్లో తమ పునరుద్ధరణకు తొలి అడుగుగా వామపక్షం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. - సాయంతన్ ఘోష్ వ్యాసకర్త స్వతంత్ర జర్నలిస్టు, కోల్‌కతా (‘ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్ల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమి, షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి.. శిక్షణకు హాజరైన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, టీయూడబ్ల్యూజే (హెచ్143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్ పాల్గొన్నారు. -
గుడిలో దళితుడికి ఘోర అవమానం
జైపూర్: రాజస్తాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలోని బెహ్రార్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందూ దేవుళ్లను విమర్శించాడని గుడిలో ఓ దళితుడితో ముక్కు నేలకు రాయించారని పోలీసులు చెప్పారు. ఈ సంఘటనకు బాధ్యులైన 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శిస్తూ రాజేశ్ కుమార్ మేఘవాల్ అనే దళిత వ్యక్తి మూడు రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై కొందరు కామెంట్లు చేయగా, ప్రతిస్పందనగా హిందూ దేవుళ్లను(రాముడు, కృష్ణుడు) కించపరుస్తూ మళ్లీ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు వ్యక్తులు మంగళవారం రాజేశ్ కుమార్‌ను గుడికి రప్పించారు. క్షమాపణలు చెప్పించారు. తప్పు ఒప్పుకోవాలంటూ బలవంతంగా ముక్కు నేలకు రాయించారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మారాయి. బాధితుడు రాజేశ్ కుమార్ మేఘవాల్ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. -
దళితులను పారిశ్రామికవేత్తలుగా...
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని బలంగా ఆకాంక్షించిన విషయం విదితమే. అందులో భాగంగా 2005లో రూపొందించిన పారిశ్రామిక విధానంలో తన ఆకాంక్షలకు అంకురార్పణ చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి పరచిన పారిశ్రామిక వాడలలోని ప్లాట్లను ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం కేటాయించాలని నిర్ణయించారు. రిజర్వేషన్లతో పాటు గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ప్రకటించారు. గరిష్టంగా 50 లక్షల మేర పెట్టుబడి రాయితీతో పాటు, విద్యుత్, వడ్డీరాయితీలు, స్టాంప్ డ్యూటీ, రీయింబర్స్మెంట్, ఏపీఎస్ఎఫ్లలో అడ్వాన్స్ సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా వందల సంఖ్యలో దళితులు వినూత్న పథకాలతో పరిశ్రమల స్ధాపనకు ముందు కొచ్చారు. 2012 వరకు ఈ వర్గాలు నగదు మొత్తం చెల్లించి ప్లాట్లు పొందే పద్ధతి అమలయింది. (చదవండి: బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాదా?) 2012లో నాటి ప్రభుత్వం యిచ్చిన 102 జీఓలో ప్లాటు ధర మొత్తంలో 25 శాతం చెల్లించి, రెండు సంవత్సరాలు మారటోరియం సదుపాయం పొంది, 10 సంవత్సరాలలో 8 కిస్తీలలో చెల్లించాలని నిర్దేశించారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ మార్గదర్శకాలు రూపొందించడంలో అలసత్వం, 16.6 శాతం వడ్డీ విధించడం, లీజు కాలం కేవలం 10 సంవత్సరాలు కావడం వల్ల బ్యాంకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులు, అధిక వడ్డీ వంటి సమస్యలు లబ్ధిదారులకు ఎదురయ్యాయి. ఈ అంశాన్ని ప్రస్తుత పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కారికాల వలవన్, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, అధికారుల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం ఈ వర్గాలకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జీఓఎమ్ఎస్ నం. 7ను 2022 ఫిబ్రవరి 5న విడుదల చేశారు. ఈ జీఓ ప్రకారం 2008 నుండి 2020 మార్చి 31 వరకు పారిశ్రామికవాడ లలో ప్లాట్లు పొందిన వారందరూ ఎటువంటి అదనపు వడ్డీలు, అపరాధ రుసుములు చెల్లించే అవసరం లేకుండా పాత ధర ప్రకారమే ప్లాటును సొంతం చేసుకోవచ్చు. నగదు చెల్లించే విధానంలోనూ ఉదారతను చాటింది ప్రభుత్వం. (చదవండి: సమానత్వం దిశగా ముందడుగు) ప్లాటు యజమాని ఏపీఐఐసీకి చెల్లించాల్సిన నగదును 3 పద్ధతుల ద్వారా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. 90 రోజుల లోపు చెల్లించే వారికి ఎలాంటి వడ్డీ ఉండదు. 91వ రోజు నుండి 180 రోజులు (6 నెలల లోపు) చెల్లించే వారికి 4 శాతం నామ మాత్రపు వడ్డీని ప్రకటించారు. 181వ రోజు నుండి 2 సంవత్సరాల లోపు చెల్లించే వారికి 8 శాతం వడ్డీని ప్రకటించారు. అయితే పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వచ్చిన దళిత పారి శ్రామికవేత్తలు బ్యాంకు రుణం పొందడంలో విఫలమైతే ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ఈ వర్గాలకు మరింత మేలు జరుగుతుంది. - వి. భక్తవత్సలం డీఐపీసీ సభ్యులు, ఒంగోలు -
‘ప్రత్యేక నిధి’పై పట్టింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం తలపెట్టిన ‘ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్), గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీ ఎస్డీఎఫ్) పర్యవేక్షణ గాడి తప్పింది. ఎస్డీఎఫ్ చట్టం ప్రకారం.. కనీసం ఆరు నెలలకోసారి కమిటీల సమావేశాలు జరగాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)కుగాను ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల పర్యవేక్షణ కమిటీల సమావేశాలు ఒక్కసారి కూడా జరగలేదు. గతేడాది జూన్ చివర్లో ఎస్టీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తూతూమంత్రంగా సాగింది. ఎస్సీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణపై గత ఏడాదిగా ఒక్కసారి కూడా కమిటీ భేటీ కాలేదు. లెక్కలపై స్పష్టత ఏది? ‘ఎస్డీఎఫ్’చట్టం ప్రకారం.. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. వాటిని 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేస్తారు. శాఖల వారీగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ నోడల్ డిపార్ట్మెంట్లుగా ఉంటాయి. వీటిని నిర్దేశించిన వార్షిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఏవైనా కారణాలతో నిధులు మిగిలితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ ప్రత్యేక అభివృద్ధి నిధుల ఖర్చు, ప్రణాళికలకు సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిస్తూ.. కొత్త వార్షిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాల రూపకల్పన ప్రారంభమైనా.. ఎస్డీఎఫ్కు కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు, చేసిన ఖర్చు, పూర్తయిన పనులు, మిగులుకు సంబంధించిన గణాంకాలపై స్పష్టత లేదు. రూ. 33,610.06 కోట్లు కేటాయించినా.. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2021–22 వార్షిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.33,610.06 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.21,306.84 కోట్లు కేటాయించగా, ఎస్టీ ఎస్డీఫ్ కింద రూ.12,304.22 కోట్లు కేటాయించింది. 2020–21 నాటికంటే రూ.7,303.81 కోట్లు అదనంగా కేటాయించడంతో.. అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ పరిస్థితి భిన్నంగా తయారైంది. -
దళిత, గిరిజనులకు కేంద్రం చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడున్నరేళ్లుగా చేసిందేమీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హరిప్రియ నాయక్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పోడు చట్టం కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయం కూడా వారికి తెలియకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పోడు భూములపై ముఖ్యమంత్రి కేబినెట్ సబ్ కమిటీ వేశారని, అర్హులైన వారికి భూ హక్కుల కల్పన కోసం తీసుకున్న దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, పోడు భూముల హక్కుల కోసం నాలుగున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కావాలంటే కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి పెంచాలన్నారు. -
దళితులపై దాష్టీకం.. గుంజీలు తీయించి, ఉమ్మి నాకించి అవమానం
దేశంలో దళితులపై భౌతిక దాడులు జరుగుతునే ఉన్నాయి. ఇంకా గ్రామల్లో పెద్ద మనుషులు వారిపై దాష్టీకానికి తెగపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకు ఓటు వేయలేదనే కోపంతో ఇద్దరు దళితులను దారుణంగా వేధించాడు. పైశాచింకంగా గుంజీలు తీయించి.. రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లో ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు సదరు దళితులు ఓటు వేయలేదని బల్వంత్ సింగ్ అనే వ్యక్తి వారిపై దాడికి దిగాడు. ఓటు వేయాలని వారికి డబ్బులు ఇచ్చానని, వారు ఓటువేకపోవటంతో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయానని దూషించాడు. వారిద్దని రోడ్డు మీదకు లాక్కొచ్చి.. ఓటు వేయనందుకు శిక్షగా గుంజీలు తీయించాడు. అంతటితో ఆగకుండా అవమానపరచాలని బలంవంతంగా రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బల్వంత్ సింగ్ అరెస్టు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. #Casteism A Dalit man made to do sit-ups, lick spit. A candidate for the post of Panchayat head, Balwant Singh, has been accused of blaming the Dalit community for his loss & beating up two people from the community as they allegedly did not vote for him.. pic.twitter.com/6102KQzeJZ — The Dalit Voice (@ambedkariteIND) December 13, 2021 -
గడ్డి కోసం వెళ్లిన మహిళపై తుపాకితో బెదిరించి సామూహిక లైంగిక దాడి
లక్నో: దేశంలో మహిళలపై జరుగుతున్న ఆగడాలకు అడ్డుకట్ట కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అవి ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఒంటరిగా పొలానికి వెళ్లిన మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జేవార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, ఒకడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఝలావర్ జిల్లాలోని ఓ దళిత మహిళ గడ్డి కోసం పోలానికి ఒంటరిగా వెళ్లింది. అయితే ఆ పరిసరాల్లో ఉన్న నలుగురు వ్యక్తులు ఎవరూ లేని సమయం చూసి మహిళపై దౌర్జన్యానికి తెగబడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో తుపాకితో బెదిరించి ఆమెపై ఆ నలుగురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బీఎస్పీ, కాంగ్రెస్‌తో సహా విపక్షాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఘటనను ఖండిస్తూ.. గౌతమ్ బుద్ధ నగర్లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేయడం చాలా విచారకరం, సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వాన్ని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నామని " ఆమె హిందీలో ట్వీట్ చేశారు. చదవండి: అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం -
TS: నేడు గజ్వేల్‌లో కాంగ్రెస్ ‘దండోరా’ సభ
-
ఈసారి అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టం.. అభివృద్ధి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పలు మార్గాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా మంగళవారం లక్నోలో జరిగిన ప్రబుద్ధ్ వర్గ్ విచార్ సమ్మేళన్ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2007లో ఫలితాన్ని ఇచ్చిన దళితులు– బ్రాహ్మణుల ఫార్ములాతో 2022లో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మాయావతి ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణులు కేంద్రంగా ఉంటారని మాయావతి స్పష్టం చేశారు. వేదికపై నుంచి త్రిశూలాన్ని ఊపుతూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యిమంది బ్రాహ్మణ కార్యకర్తలను పార్టీ తయారు చేస్తుందని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా విగ్రహాలు, స్మారకాల ఏర్పాటు కాకుండా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడతానని మాయావతి పేర్కొన్నారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్) ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ మైనారిటీలను దత్తత తీసుకున్నట్లుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు పరిగణిస్తున్నాయని ఆమె విమర్శించారు. అదే సమయంలో తమ పార్టీ ఏ వర్గంపట్ల వివక్ష చూపదని ఆమె భరోసా ఇచ్చారు. 2022లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2007లో చేసిన విధంగా ‘సర్వజన్ హితయ్.. సర్వజన్ సుఖయ్’ అనే విధానాన్ని అమలు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. గతంలో తాము కేవలం దళితులు, వెనుకబడిన వారి ప్రయోజనాలను మాత్రమే చూడలేదని, అగ్రవర్ణాలకు సైతం సమప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. బీఎస్పీ ఒక కులం లేదా మతం కోసం పనిచేసే పార్టీ కాదని, ఇది సమాజంలోని అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు. కేబినెట్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం గత కొన్ని సంవత్సరాలుగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీలు తమ ప్రభుత్వాల విధానాలతో పేదలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, దళితులు, వెనుకబడిన వర్గాలను అణగదొక్కారని మాయావతి ఆరోపించారు. అంతేగాక బీజేపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ సమాజంలోని ప్రజలు చాలా వేధింపులకు గురయ్యారని, 2022లో ఏర్పడే కేబినెట్లో బ్రాహ్మణ సమాజంలోని వారికి గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడితే బ్రాహ్మణ సమాజ భద్రత, పూర్తి గౌరవం దక్కేలా చూసుకుంటామన్నారు. ఇప్పటికే బీఎస్పీతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిపే ప్రణాళికల్లో భాగంగా మొదటి దశలో తమ పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా విజయవంతంగా పనిచేశారని మాయావతి తెలిపారు. ఇక రెండవ దశలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన బీఎస్పీతో అనుసంధానించే ప్రచారం జరుగుతుందని, ప్రతి సభలో బ్రాహ్మణ సమాజానికి చెందిన కనీసం వెయ్యిమంది కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అంతేగాక ఈసారి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళలను సైతం పార్టీతో అనుసంధానం చేసే పని జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని, 3 వ్యవసాయ చట్టాల ద్వారా రైతులను మరింత హింసించారని మాయావతి ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13% బ్రాహ్మణ ఓటర్లు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. జనాభాపరంగా రాష్ట్రంలో దాదాపు 13% మంది బ్రాహ్మణులు ఉన్నారు. కొన్ని అసెంబ్లీ స్థానాలలో అయితే బ్రాహ్మణ ఓటర్లు 20% కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి రాజకీయపార్టీ బ్రాహ్మణ ఓటుబ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతాయి. మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, దేవరియా, జౌన్పూర్, అమేథి, వారణాసి, చందౌలి, కాన్పూర్, ప్రయాగరాజ్, బలరాంపూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్ల్లో బ్రాహ్మణ ఓట్లు 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలుపోటముల్లో బ్రాహ్మణ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2017లో బ్రాహ్మణ అభ్యర్థులు 56 సీట్లను గెలుచుకున్నారు. కాగా 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ బ్రాహ్మణ, దళిత, ముస్లిం ఫార్ములాతో బరిలో నిలిచి అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. 2007 ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ అభ్యర్థులకు 86 టిక్కెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం
తుర్కపల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఒప్పించి దళితుడిని లేదా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికేకి ముఖ్యమంత్రి పదవి వచ్చేలా ప్రయత్నం చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితులకు, గిరిజనులకు లబ్ధిచేకూరిందన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ తండాలో గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గెలవాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ముందుకు తీసుకువచ్చారన్నారు. సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి దళితులకు ఇప్పటి వరకు ఎందుకు దళిత బంధు డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కలెక్టర్ ఖాతాలో డబ్బులుంటే అవి దళితులకు ఏ విధంగా చెందినట్లు అని, అధికారులతో మాట్లాడితే దళితులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారని అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని వాసాలమర్రిలో సభ నిర్వహించి కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి విమర్శించారు. తనను పిలిస్తే దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా లబ్ధిచేకూరేలా ప్రశ్నిస్తాననే ఉద్దేశంతోనే ప్రొటోకాల్ పాటించకుండా సభ నిర్వహించారని చెప్పారు. -
డప్పుల కూలి పెంచమన్నందుకు బహిష్కరించారు: బాధితులు
-
దళితులపై చంద్రబాబుది కపట ప్రేమ : మేరుగ నాగార్జున
-
ఎన్నికలొస్తేనే పైసలు.. బిడ్డ బిర్లా .. కొడుకు టాటా
సాక్షి, ఆదిలాబాద్: ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రికి దళితులు, గిరిజనులు, బడుగు, బలహీనవర్గాలు యాదికొస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలున్న నియోజకవర్గాలకే పైసలిస్తారంటూ.. 119 నియోజకవర్గాల్లో ఎన్నికలొస్తేనే కేసీఆర్ అందరికీ పైసలిస్తా రని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా ఇస్తారా..? చస్తారా..? వారే తేల్చుకోవాలన్నారు. ‘లక్ష మందికి ఒక్క తల తక్కువగా ఉన్నా నా తల నరుక్కుంటా అన్నా.. లక్షకు ఒక తల తక్కువగా ఉన్నా తల వంచుతా.. ఇంద్రవెల్లిలో వచ్చిన ఈ లక్ష దండుతో కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తా..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచే సమర శంఖం ఊదాలని, దండోరా వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభ ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగింది. ముందుగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ నివాళులర్పించారు. అనంతరం సభలో మాట్లాడారు. ఏడేళ్లలో ఏం చేశారు? ‘నీ ఫామ్ హౌస్‌లో జాగా అడిగినామా, చింతమడకలో గవ్వ అడిగినామా. చింతమడకలో రూ.15 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నీవు.. 10 పైసలు కూడా దళిత, గిరిజనులకు ఇచ్చినావా?’ అని రేవంత్ నిలదీశారు. 70 ఏళ్లలో దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదంటున్న కేసీఆర్ ఈ ఏడేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లతోనే దళితులు, గిరిజనులు అనేక రంగాల్లో అభ్యున్నతి సాధించారని, రాజకీయంగా ఉన్నత పదవులు పొందారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎండగట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కొక్కరి తల మీద లక్ష అప్పు మోపారని విమర్శించారు. బిడ్డ బిర్లా .. కొడుకు టాటా ‘నీ బిడ్డను బిర్లాను చేసినావ్. నీ అల్లుళ్ని అంబానీలుగా చేసినావ్..కొడుకును టాటా చేసినావ్..నీవు నరరూప రాక్షసుడిగా తయారై కుంభకర్ణుడిలా మద్యం తాగి ఫామ్ హౌస్‌లో పండుకుంటున్నావ్..’ అంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరో 20 నెలలే పడుకునేదని, ఫామ్ హౌస్, ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి చర్లపల్లి జైలుకు పంపిస్తానని, అక్కడ సేద తీరాల్సిందేనని అన్నారు. దండోరా సభకు వస్తున్న వేలాది మందిని ఉట్నూర్‌లో అడ్డుకున్నారని, దెబ్బకు దెబ్బ తీస్తామని, కేసీఆర్‌ను బొందపెట్టడం ఖాయమంటూ ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో రావణ రాజ్యం పోవాలని, దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలని అన్నారు. సోమవారం దళిత, గిరిజన దండోరా సభలో గుస్సాడి నృత్య ప్రదర్శనను తిలకిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ అన్నీ డైరీలో రాస్తున్నాం కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, ఇతరుల భూములు గుంజుకోవడం, పార్టీ ఫిరాయింపులు అన్ని డైరీలో రాసుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. అసలు మిత్తితో సహా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇది కార్యకర్తల పార్టీ అని, గ్రామ, మండల, నియోజవర్గ స్థాయిలో కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ప్రజల కోసమే తానున్నానని, ‘నన్ను నమ్మండి.. ఆశీర్వదించండి.’ అంటూ కోరారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కాయని, మళ్లీ సోనియమ్మ రాజ్యం వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. దండోరా తదుపరి కార్యక్రమం ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. గిరిజన బంధు అమలు చేయాలి: భట్టి జల్, జంగల్, జమీన్ కోసం పోరు సల్పిన గడ్డ నుంచి కాంగ్రెస్ పోరు ప్రారంభించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై దండోరా మోగివ్వడం కోసమే ఈ సభ అన్నారు. అడవి బిడ్డలను అక్కడినుంచి పంపించేస్తున్నారని, అలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటు అంబేడ్కర్ .. అటు కొమురం భీం దండోరా సభ వేదికకు ఇరువైపులా అంబేడ్కర్, కొమురం భీం భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో మొదట కొమురం భీం పోరాటాన్ని వివరించారు. రాంజీ గోండు పోరాట స్ఫూర్తితో కేసీఆర్‌కు గోల్కొండ కోట కింద ఘోరీ కడతామని అన్నారు. భీం రావ్, మడావి రాజు, మడావి తుకారాం, మరు మాస్టార్లు ఉన్నత స్థాయిలో రాణించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ, మల్లు రవి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, సంపత్, శ్రావణ్‌కుమార్, మహేష్‌కుమార్‌గౌడ్, జి.వినోద్ తదితరులు సభకు హాజరయ్యారు. సోమవారం ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన దండోరా సభలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే సీతక్క -
ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు: సీఎం కేసీఆర్
-
ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం దళితబంధుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వంద శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. దళితులకు స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. వారం, పది రోజుల్లో హుజురాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దళిత బంధు లబ్ధిదారులకు గుర్తింపు కార్డు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఐడీకార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని తెలిపారు. పథకం అమలు తీరు సమాచారమంతా పొందుపరుస్తామన్నారు. పథకం అమలులో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారుడు ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని భరోసానిచ్చారు. లబ్ధిదారులకు దళిత బీమా వర్తింపజేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మంత్రి సహా, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ డెవలప్‌మెంట్‌శాఖ, ఉన్నతాధికారులు ఈ కార్యాచరణపై కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. కొంచెం ఆలస్యమైనా దశల వారీగా దళిత బీమాను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. -
దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) తెలిపారు. అర్హులైన దళితుందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామన్నారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతుందని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని, దళిత ప్రజా ప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
మహనీయుల కలలను నిజంచేస్తా
సాక్షి, ఆదిలాబాద్: లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని, వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఉట్నూర్ మండలం దంతన్‌పల్లిలో ఓ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. మార్గమధ్యలో ముత్నూర్ వద్ద కుమ్రంభీం విగ్రహానికి, ఇంద్రవెల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘అందరూ అనుకున్నట్టుగా నేను ఫలానా పార్టీలో అభ్యర్థి అనేది ఫేక్ న్యూస్.. ప్రజలు నమ్మొద్దు’అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాన్యవార్ కాన్షీరాం, కుమ్రంభీం, పూలే వంటి మహనీయుల ఆశయాలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని, వారి కలలను నిజం చేసేందుకే తాను ముందుకొచ్చానని తెలిపారు. వీఆర్ఎస్ ఒకరు చెబితే చేసింది కాదని, మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 26 ఏళ్ల వృత్తిలో గిరిజన, దళిత, బహుజన బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేశానని, అది కేవలం ఒక శాతమేనన్నారు. మిగిలిన 99 శాతం కూడా సాధించేందుకే తన ఈ ప్రయత్నమన్నారు. పేద బిడ్డల అభ్యున్నతే నిజమైన సామాజిక విప్లవమని, ఇదే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధిని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి తీసుకెళ్లబోతున్నామని తెలిపారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఎజెండాగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖా స్తు చేసుకోగా.. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 26 ఏళ్లుగా పోలీస్ శాఖలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన, తొమ్మిదేళ్లుగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఉంటూ, ఆ విద్యాసంస్థలకు గుర్తింపు తెచ్చిన సంగతి విదితమే. ఆయన స్థానంలో ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్రాస్కు గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేను వెళ్లి పార్టీని రక్షించాను : మోత్కుపల్లి
-
దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ: కేసీఆర్
-
లవర్‌కి గిఫ్ట్‌గా ఫోన్ ఇచ్చాడని మరీ ఇంత దారుణమా..
జబల్పూర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్ ఫ్రెండ్‌కి మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడని దారుణానికి తెగబడ్డారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఫోన్ కొనిచ్చిన యువకుడు, అతని స్నేహితుడి పట్ల అమానవీయంగా అవమానించారు. అమానవీయం అగ్రవర్ణానికి చెందిన అమ్మాయికి ఫోన్ ఇచ్చినందుకు గాను ఇద్దరు దళిత యువకులకు గుండు కొట్టించారు. ఆ తర్వాత వారి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. అంతటితో ఆగకుండా ఇద్దరిని నేలపై ఉమ్మించి ఒకరి ఉమ్మును మరొకరి చేత నాకించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌లో మే 22 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫోన్ ఇచ్చాడని జబల్పూర్ జిల్లాలో దామన్ ఖమారియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ మెహ్రా అనే దళిత యువకుడు అదే ఊరిలో అగ్రవర్ణానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి కుదరడం లేదని, తనకో ఫోన్ కొనివ్వాలంటూ ఆ అమ్మాయి కోరింది. దీంతో రాజ్‌కుమార్ తన స్నేహితుడైన మహేంద్రకు చెందిన ఫోన్‌ను ఆ అమ్మాయికి ఇచ్చాడు. విచక్షణ కోల్పోయారు ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుండగా కుటుంబ సభ్యులు చూశారు. ఆమెను విచారిస్తే ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఇద్దరు దళిత యువకులను నిర్బంధించి దారుణానికి తెగబడ్డారు. -
బెంగాల్లో ‘దళిత రాజకీయం’!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎన్నికల సమయంలో రసవత్తరంగా మారాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు పూర్తవగా, మిగతా నాలుగు దశల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొనేందుకు అధికార టీఎంసీతో పాటు కమలదళం ఉవ్విళూరుతున్నాయి. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎటాక్ మోడ్‌లోనే పనిచేస్తోంది.రాష్ట్రంలో కీలకంగా, నిర్ణయాత్మకంగా ఉన్న దళితులను మచ్చిక చేసుకొనేందుకు చిన్న అవకాశాన్ని టీఎంసీ, బీజేపీలు వదులుకోవట్లేదు. రాష్ట్రంలోని 294 అసెంబీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కు 68, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)\కు 16 స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ఓటర్లలో 23.5 శాతం, జనాభాలో 25-30 శాతం మంది ఉన్న దళితులు రాష్ట్రంలోని కనీసం 100-110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు. ఈనెల 17 నుంచి 29వ తేదీ మధ్య జరుగబోయే చివరి నాలుగు దశల్లోని ఎక్కువ స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మాతువా, ఆదివాసి, రాజవంశీ, బౌరి,బాగ్డి వంటి కులాలను తాయిలాలు ప్రకటించడం ద్వారా తమవైపు తిప్పుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఈ వర్గాలను ఆకర్షిం చేందుకు బీజేపి నాయకులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్, ఇతర సరిహద్దు జిల్లాల్లో నివసిస్తున్న రాజ్‌వంశీలు, తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు మతువాలు. దళితుల్లోని ఈ రెండు బలమైన సామాజిక వర్గాలు దక్షిణ బెంగాల్‌లోని 30-40 సీట్లలో తమ ప్రభావాన్ని చూపిస్తారు. ఆ సామాజిక వర్గమే కీలకం మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.మతువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ)ను అమలు చేయడంపై వారికి బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. అంతేగాక ఇతర రాష్ట్రాల్లో తమ విజయానికి కారణమైన ఎంతో నమ్మకమున్న పాత ఫార్ములాను పూర్తిస్థాయిలో కమలదళం అమలుచేస్తోంది. గిరిజనులు, దళితులు, రైతుల ఇళ్ళలో భోజనం చేయడం, స్థానిక దేవాలయాల్లో పూజలు చేయడం వంటి పాత ఫార్ములాను అనుసరించడంతో పాటు బెంగాల్లో కొత్త ప్రయోగాలను అమలు చేస్తోంది. అందులోభాగంగా ఇంటింటికి వెళ్ళి పిడికిలి బియ్యం తీసుకోవడం, సహపంక్తి భోజనాలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకొనే ప్రయత్నాలు గత ఏడాదిగా ముమ్మరం చేశారు. బీజేపీ దశ మార్చిన సార్వత్రిక ఎన్నికలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 79 మంది దళిత అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టగా, ఒక టీఎంసీ అభ్యర్థి దళితులను బిచ్చగాళ్లతో పోల్చినట్లు ఆరోపణలు రావడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం రాష్ట్రంలోని రిజర్వ్ సీట్లలో ఎక్కువ భాగం గెలుచుకుంది. ఆ తర్వాత మమతాబెనర్జీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సీఎఎ అమలు ఆలస్యంతో పాటు అన్ని శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరించడానికి, వారికి భూమి హక్కులు ఇవ్వడం అంశాలపై దీదీ దృష్టిపెట్టింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రిజర్వు చేసిన 50 స్థానాల్లో తృణమూల్ విజయం సాధించగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం ఎస్సీ ఆధిప త్య ప్రాంతాల్లో తమదైన ముద్ర వేసుకొని 46 స్థానా ల్లో ఆధిక్యం సాధించింది. దీంతో ఇప్పుడు అధికార పీఠంపై కూర్చొనేందుకు నిర్ణయాత్మకంగా ఉన్న దళి తుల విషయంలో ఇరు పార్టీలు అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మండల కమిషన్ సిఫారసుల ప్రకారం మహిష్య, తేలి, తముల్, సాహా వంటి సామాజిక వర్గాలను ఓబిసి జాబితాలో చేర్చుతామని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు హామీ ఇచ్చాయి. దళితుల అంశంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధాలు ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు విభజన రాజకీయాల ద్వారా పశ్చిమ బెంగాల్ రాజకీయాల స్థాయిని బీజేపీ, టీఎంసీలు తగ్గిస్తున్నాయని సీపీఐ (ఎం) నిందించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎప్పుడూ సైద్ధాంతిక మార్గాల్లోనే పోరాడుతున్నాయి. ఎప్పుడూ మతం, కుల ఆధారిత రాజకీయాలు వెనకబడే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీదీ బాటలో బీజేపీ మతపరమైన మైనారిటీలతో పాటు దళితుల ఓట్లను టీఎంసీకి అనుకూలంగా ఏకీకృతం చేయాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మొదట్లో భావించారు. 2011 ఎన్నికలలో టీఎంసీ అభ్యర్థులుగా మతువాల అధికార స్థానమైన మాతువా ఠాకుర్బారి సభ్యులను దీదీ నామినేట్ చేసింది. ఈ కారణంగా మమతా బెనర్జీ విజయానికి మార్గం సుగమం అయ్యింది. అనంతరం టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి కలిసి వచ్చింది. సీఏఏను అమలు చేస్తామని బిజెపి ఇచ్చిన వాగ్దానం, దళితుల్లో అత్యల్ప వర్గాలైన బౌరిస్, బాగ్డిస్ల మధ్య ఆర్ఎస్ఎస్ పని చేయడం, మాతువా ఠాకూర్బారి సభ్యులను నామినేట్ చేయాలన్న వ్యూహం కమలదళానికి అనుకూలంగా మారింది. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ మైనార్టీలను సంతృప్తిపరచడమే కాకుండా కాకుండా, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులకు అనుకూలంగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. -
దళిత అభివృద్ధికి దండిగా..
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈసారి భారీగా ఖర్చు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (సబ్‌ప్లాన్) కింద రూ.33,611.06 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్)కి రూ.21,306.84 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) కింద రూ.12,304.22 కోట్లు చూపించింది. 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,304.81 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు. పథకాల పరుగులు... గతేడాది కోవిడ్–19 వ్యాప్తి వల్ల నెలకొన్న పరిస్థితులతో పలు సంక్షేమ పథకాలు డీలా పడ్డాయి. ప్రస్తుతం ఈ పరిస్థితులను అధిగమిస్తున్నప్పటికీ కొన్ని పథకాల్లో అవాంతరాలు వచ్చాయి. ఈసారి భారీ కేటాయింపులు జరపడంతో సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకోనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే ఆర్థిక చేయూత పథకాలు పరుగులు పెట్టనున్నాయి. అదేవిధంగా ఇదివరకు పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలు సైతం పరిష్కారం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి మొత్తాన్ని సంబం ధిత సంక్షేమ శాఖలు.. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఖర్చు చేయా ల్సి ఉంటుంది. ఈసారి భారీగా కేటాయింపులు జరపడంతో ఆయా శాఖలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ -
దళిత యువకుడిపై దాడి
-
యువకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
సాక్షి, విజయనగరం : నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు శంకు ఆపన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. అప్పన్న పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. టీడీపీ నేత, గ్రామపెద్ద పంచాది సూర్యనారాయణ వారి అనుచరులతో కలిసి అప్పన్న బైక్ తాళం , సెల్ ఫోన్ తీసుకొని అతనిపై దాడికి పాల్పడ్డారు. కాగా అప్పన్న ఆర్టీఏ యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే గ్రామంలో జరిగిన భూ ఆక్రమణలపై అప్పన్న రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు తనపై దాడి చేసినట్లు శంకు అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మలుపు తిరిగిన శిరోముండనం ఘటన
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిలో దళిత యువకుడు ఇండుగుపల్లి ప్రసాద్ శిరోముండనం ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆ రోజు ఇసుక లారీ ఢీకొట్టడం వల్ల తనకు గాయాలవడంతో వివాదం తలెత్తినట్టుగా ప్రసాద్ చెబుతున్నది వాస్తవం కాదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రోజు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో దళిత యువకుడు కానేటి విజయకుమార్ శనివారం స్పృహలోకి వచ్చి స్పష్టం చేశాడు. ఇంకా అతడు ఏం చెప్పాడంటే.. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) ► ఈ నెల 18 రాత్రి ప్రసాద్, మరికొంతమంది మిత్రులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా బైకు బోల్తా పడి పక్కనే ఉన్న గోతిలో పడింది. దీంతో కాలు విరిగింది తప్ప లారీ ఢీకొని కాలు విరగలేదు. ► లారీ ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే గొడవ పడినట్టు ప్రసాద్ చెబుతున్న దానిలో నిజం లేదు. అసలు ప్రసాద్ ఆ సమయంలో అక్కడ లేనే లేడు. ► ఈ ఘటనలో నా పేరును ప్రసాద్, మరికొంత మంది దళిత నాయకులు ఎందుకు వాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ► నిజానికి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త. గత ప్రభుత్వ హయాం నుంచే ఇసుక లారీల వద్ద వసూళ్లకు పాల్పడేవాడు. ఇవ్వని వారితో గొడవ పడుతుండేవాడు. ► 2019, మార్చి 10న మరో ఇద్దరితో కలిసి సీతానగరం పలావ్ సెంటర్ వద్ద పలసపూడి నాగేంద్ర అనే వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో ప్రసాద్‌పై సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో 74/2019, ఐపీసీ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ► ప్రమాదం బారినపడ్డ నన్ను ఏ దళిత నాయకుడూ పరామర్శించలేదు. ► మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా దీన్ని రాజకీయం చేస్తుండటం నాకు బాధ కలిగిస్తోంది. (శిరోముండనం కేసు; కొత్త కోణం) -
అటకెక్కిన మూడెకరాలు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అర్హులైన దళితులకు వ్యవసాయయోగ్యమైన మూడెకరాల భూ పంపిణీ ఉమ్మడి జిల్లాలో అటకెక్కింది. అందుబాటులో లేని ప్రభుత్వ భూమి, రెక్కలు తొడిగిన ప్రైవేట్ భూముల ధరల ఫలితంగా భూ పంపిణీకి బ్రేక్‌పడింది. పలు చోట్ల పంపిణీ చేసిన భూములు రైతుల పేరిట పట్టాలు చేయకపోవడం.. మూడెకరాల లోపే పంపిణీ చేయడం.. సాగునీటి సదుపాయం లేకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి జిల్లా మొత్తంలో కేవలం 772 మందికి 1,537.66 ఎకరాల భూమి పంపిణీ చేశారు. అందులో రూ.6.76కోట్ల విలువ చేసే సుమారు 700 ఎకరాల ప్రైవేట్ భూమిని అర్హులకు అందించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. తప్పని ఎదురుచూపులు.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,93,948 మంది ఎస్సీలు ఉన్నారు. వీరిలో సగానికి పైగా మందికి భూమి లేదు. వీరందరూ ప్రభుత్వం పంపిణీ చేసే భూములపై ఆశలు పెట్టుకున్నారు. కానీ.. అవసరం మేరకు భూమి అందుబాటులో లేకపోవడంతో భూపంపిణీ ప్రక్రియకు బ్రేక్‌పడింది. మరోవైపు క్షేత్రస్థాయిలో భూమి కోసం దళితుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో అధికారులు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 251మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి 684.13 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఈ భూమిని 104 మంది పట్టాదారు రైతుల వద్దే కొనుగోలు చేశారు. ఆయా భూముల్లో నీటి వనరుల ఏర్పాటు కోసం 27బోర్లు అవసరమని అధికారులు గుర్తించారు. అందుకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం బోర్లు కూడా మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 19 బోర్లు వేశారు. మిగిలిన ఎనిమిది బోర్లు కూడా త్వరలోనే వేస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.రాములు తెలిపారు. అయితే మరో 94.04 ఎకరాలను ప్రభుత్వ అధికారులు గుర్తించి దానికి సంబంధించి పట్టాదారు రైతుల వద్ద ఎకరాకు రూ.3.90లక్షల చొప్పున చెల్లించేందుకు 2018 ఏప్రిల్ మాసంలో ఒప్పందం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రెండేళ్ల క్రితమే బ్రేక్‌పడింది. ప్రస్తుతం మార్కెట్ విలువ పెరగడంతో తాజాగా రెండేళ్ల క్రితం ఎకరానికి రూ.3.90 లక్షల చొప్పున ఇస్తామని ముందుకొచ్చిన రైతులు రూ.6లక్షలు ఇస్తేనే అమ్ముతామని చెబుతున్నారు. ఇదే పరిస్థితి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు, పారిశ్రామీకరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో ఆయా ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భూములు అప్పగించేందుకు ప్రైవేట్ భూ యజమానులు ముందుకు రావడం లేదు. ఏడాది క్రితం రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉన్న భూముల ధరలు ఇప్పుడు అమాంతంగా రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెరిగాయి. అప్పుడు అధికారులు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆలస్యంగా నిధులివ్వడంతో భూముల ధరలు పెరిగిపోయాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో, నారాయణపేట జిల్లా ధన్వాడ, నర్వ, మరికల్, మక్తల్ మండలాల్లో భూ పంపిణీ జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం పులిజల్, తంగాపూర్, చౌటుప్పలి, ఉప్పునుంతల మండలం పెనిమళ్ల, అయ్యవారిపెల్లి, కొల్లాపూర్ మండలం చింతలపల్లి, పెంట్లవెల్లి మండలం కొండూరు, సింగవరం, జాతప్రొలి, లింగాల, తెలకపల్లి మండలం గౌరారం, గడ్డంపల్లి, పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి, కొల్లాపూర్ మండలం మాల చింతల్‌పల్లి, మాచినేనిపల్లి, నర్సింహాపూర్, లింగాల మండలం చిన్నంపల్లి, అంబటిపల్లిలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, దేవరకద్ర, హన్వాడ, మిడ్జిల్, మూసాపేట, కోయిల్‌కొండ, సీసీ కుంట, అడ్డాకల మండలాల్లో భూ పంపిణీ అరకొరగా జరిగింది. అయితే నారాయణపేట జిల్లా ధన్వాడలో రెండేళ్ల క్రితం 50మందికి అధికారులు పంపిణీ చేసిన భూమికి పట్టాలు ఇవ్వలేదు. దీంతో చాలామంది అందులో వ్యవసాయం చేయడం లేదు. నాణ్యమైన భూమి ఇవ్వలేదు నా పేరు తగరం అలివేలమ్మ. భర్త మద్దిలేటి. మాకు ఎలాంటి భూమి లేదు. మాది వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు. ఎలాంటి జీవనాధారం లేని మాకు 2018లో ప్రభుత్వం తరఫున మూడెకరాల భూమి ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ 1.20ఎకరాలు మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన భూమి వ్యవసాయయోగ్యానికి అనుకూలంగా లేవు. బండరాళ్లతో నిండి ఉంది. కనీసం బోరు కూడా లేదు. వ్యవసాయానికి అనుకూలమైన మూడెకరాలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. మా మండలంలో చాలా మందికి తక్కువ భూమి వచ్చింది. పట్టా పుస్తకాలు అందించాలి దళితుల కోసమంటూ ప్రభుత్వం మాకు మూడు ఎకరాల భూమిని ఇచ్చింది. నాలుగు సంవత్సరాలుగా పంటను సాగు చేసుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. భూమి కూడా సరైనది ఇవ్వలేదు. సొంత డబ్బులు పెట్టి చదును చేయించుకున్నాం. ఇప్పుడు భూమి మాకు ఇస్తారో లేదో తెలియడం లేదు. పాసు పుస్తకాలు లేకపోవడంతో మాకు రైతుబంధు పథకం అందడం లేదు. ప్రభుత్వం చొరవ చూపి పాసు పుస్తకాలు అందజేయాలని వేడుకుంటున్నాం. – ఎలుక బాల్‌రాజు, కిష్టాపూర్, నారాయణపేట జిల్లా -
దళితులను మరోసారి మోసం చేసిన చంద్రబాబు
-
మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ: తమ్మారెడ్డి
‘ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూలు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు. దళిత కథలు సినిమాగా మారవు అంటారు. కానీ పలాసలో వారి పాత్రలను హీరో లను చేసాము. వారి సమస్యలను చర్చించాం. కానీ వారి నుండే స్పందన కరువైంది’ అని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘మీ సినిమాలు మీరు కూడా చూడకపోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి. ఇది నా ఆవేదన. నా నలభై ఏళ్ల కెరియర్లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు. కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం. అయితే ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే’ అని అన్నారు. (‘పలాస 1978’ మూవీ రివ్యూ) కాగా రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
'ఆ దాడి ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది'
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ఇద్దరు దళిత వ్యక్తులు చోరీకి యత్నించారనే కారణంతో స్క్రూ డ్రైవర్‌తో చిత్రహింసలు పెట్టి దుకాణ యజమాని, సిబ్బంది అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు.' ఆ ఇద్దరు యువకులపై చేసిన అమానుష దాడి నన్ను ఎంతగానో బాధించింది. ఆ యువకులపై సిబ్బంది దాడి చేసిన తీరు నా ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించింది. వెంటనే దీనిపై రాజస్తాన్ ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అని పేర్కొన్నారు. (స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెడుతూ..) The recent video of two young Dalit men being brutally tortured in Nagaur, Rajasthan is horrific & sickening. I urge the state Government to take immediate action to bring the perpetrators of this shocking crime to justice. — Rahul Gandhi (@RahulGandhi) February 20, 2020 రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు నాగౌర్ పట్టణ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రూ. 50 వేలు దొంగతనానికి పాల్పడ్డారంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొడుతూ.. స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెట్టారు. అనంతరం వారి దుస్తులు చించి... పెట్రోల్ పోశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడ్డ బాధితులు.. బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తమపై తోటి ఉద్యోగులే దాడి చేశారని.. ఆ తతంగాన్ని కెమెరాలో రికార్డు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (అది రాజస్థాన్‌లో జరిగిన ‘ఘోరం’) -
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో దళితుల ర్యాలీ
-
దళిత వ్యక్తి బిర్యానీ అమ్మాడని చితకబాదారు
-
‘బిర్యానీ అమ్మాడని చితకబాదారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో జరిగిన ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిర్యానీ విక్రయిస్తున్న దళితుడు లోకేష్ (43)ను కులం పేరుతో దూషిస్తూ కొందరు భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. శుక్రవారం ఈ ఘటన జరగ్గా వీడియో మాత్రం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పలుసార్లు తాము హెచ్చరించినా అతను బిర్యానీ విక్రయిస్తున్నాడనే ఆగ్రహంతో వారు దళితుడిపై దాడికి తెగబడినట్టు స్ధానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనను ఖండిస్తూ నటి ఊర్మిళా మటోండ్కర్ ట్వీట్ చేశారు. భారతీయులుగా మనం అంటరానితనం పాటించడం మన సంస్కృతి కాదని, ఇది నాగరికం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. దళితునిపై దాడి ఘటన సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ ఉద్దేశానికి విరుద్ధమని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. -
దళిత ద్రోహి చంద్రబాబు
తుళ్లూరు: రాజధాని అసైన్డ్ భూముల రైతులకు తీరని అన్యాయం చేసిన మాజీ సీఎం చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని గ్రామమైన రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రహదారిపై వారు సమావేశమయ్యారు. రాజధానిలో చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమను తీవ్రంగా మోసగించి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధానికి వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటించాక అసైన్డ్ భూములకు ఏడాది పాటు ప్యాకేజీ, కౌలు చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు, బినామీలతో తప్పుడు ప్రచారాలు చేయించి తమను భయాందోళనలకు గురి చేశారన్నారు. అసైన్డ్ భూములను కారుచౌకగా కొనుగోలు చేశాకే ప్రభుత్వం తమ భూములకు పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని నిధులు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా తప్పు చేశానని క్షమాపణ చెప్పాలని లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా?
సాక్షి, మంగళగిరి: రాజధానిలో దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో సహా ఏ ఒక్క టీడీపీ నాయకుడికి లేదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రకటించిన సమయంలో దళితులకు చెందిన అసైన్ట్, లంక, ప్రభుత్వ భూములకు రైతుల భూములతో పాటు పరిహారం ప్రకటించకుండా చంద్రబాబు బినామీలు దళితులను బెదిరించి, పరిహారం రాదని భయపెట్టి దళితుల భూములన్నింటిని తక్కువ ధరలకు కొట్టేసినప్పుడు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ నిద్రపోతున్నారా అని నిలదీశారు. రాజధాని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాని మరెవరైనా కాని రాజధాని తరలిస్తున్నట్లు చెప్పారా అని ప్రశ్నించారు. తాడికొండ, తుళ్ళూరులతో పాటు రాజధానిలో మంగళగిరి భాగం కాదా చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇప్పుడు దళితులు గుర్తుకువచ్చారా అని నిలదీశారు. అసలు రాజధానిలో దళితుల భూములన్నింటిని రాజధాని ప్రకటించేనాటికే టీడీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాజధానిలో ప్లాట్లు కేటాయించే సమయంలోనూ దళితులకు ప్రత్యేకంగా ప్లాట్లు కేటాయిస్తుంటే మాజీ ఎమ్మెల్యేకు కనిపించలేదా అన్నారు. ప్లాట్ల కేటాయింపులోను టీడీపీ నాయకులు వారికి నచ్చిన చోట వారికి నచ్చిన విధంగా వాస్తులు చూసుకుని మరీ ఇచ్చుకుని లాటరీ అంటూ రైతులను మభ్యపెట్టారన్నారు. రాజధాని భూములపై విచారణ కొనసాగుతుందని, పూర్తిస్థాయిలో విచారణ చేసి రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌ను నిరూపిస్తామని స్పష్టం చేశారు. అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మంచి రాజధానిని అందించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు. -
మాదిగలకు వాటా దక్కాల్సిందే
హైదరాబాద్: మాదిగలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో వాటా దక్కాల్సిందే అని, దీనికోసం మాదిగలందరూ ఐక్యంగా పోరాడాలని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్యెల్యే టి.రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో మాదిగల అలయ్–బలయ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాజయ్య ముఖ్య వక్తగా హాజరయ్యారు. రాజయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాటం చేసిన చరిత్ర మాదిగలదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు చోటు లభించకపోవడంతో ఆ వర్గంలో చలనం వచ్చిందని వెల్లడించారు.కార్యక్రమంలో అసెంబ్లీ విప్ గువ్వల బాలరాజు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’
సాక్షి, బెంగళూరు: దేశంలో కులవివక్ష జాఢ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట అణగారిన వర్గాలపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అల్ప కులస్తులను చిన్నచూపు చూస్తున్నారు. అయితే ఈ వివక్ష సామాన్య ప్రజలనే కాక ప్రజా ప్రతినిధులను సైతం వెంటాడుతోంది. తాజాగా కర్ణాటకలో బీజేపీ ఎంపీ దళితుడైనందున తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దని గ్రామస్తులు తీవ్ర అవమానానికి గురిచేశారు. వివరాలు.. బీజేపీ ఎంపీ నారాయణ స్వామి కర్ణాటకలోని చిత్రదుర్గ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వర్షాకాలం కావడంతో తన లోక్‌సభ పరిధిలోని తూమకూరు జిల్లా పావగడ తాలూకులో పర్యటించారు. గ్రామంలో మెడికల్ క్యాంపును నిర్వహించేందుకు వైద్య బృందాన్ని కూడా తన వెంట తీసుకెళ్లారు. అయితే వీరికి స్థానికులు (ఓ కులానికి చెందిన వారు) నుంచి అనుకోని ఘటనను ఎదుర్కొవల్సి వచ్చింది. ‘మా గ్రామంలోకి దళితులు, అల్ప కులస్తులు రావడానికి వీళ్లేదు. మీరు అంటరానివారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపొండి’ అంటూ ఎంపీ బృందాన్ని తీవ్ర అవమానానికి గురిచేశారు. గ్రామంలో ఎంట్రీకి స్థానికులు అనుమతించకపోవడంతో గత్యంతరం లేక ఎంపీ అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఆ గ్రామంలోని వారంత ఒకే వర్గానికి (గొల్ల) చెందిన వారిగా తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులకే ఇలాంటి ఘటన ఎదురైన తమలాంటి వారి పరిస్థితి ఏంటని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
టీడీపీ నేతల తీరు పై సర్వత్రా విమర్శలు
-
టీడీపీ నాయకులకు దళితులంటే అలుసా!
దళితులపై తమకు ఉన్న చిన్నచూపును టీడీపీ నేతలు పదేపదే బయటపెడుతున్నారు. నలుగురిలోనూ వారిని దూషిస్తూ, హేళనగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారు. దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడంటూ ఎమ్మెల్యే శ్రీదేవిని ఇటీవల అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం దళితుల వల్లే ఈ దరిద్రం అంటూ దళిత మహిళా ఎస్ఐని మహిళా చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి దూషించారు. ఇలా దళితులను కులం పేరుతో దూషించడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది. సాక్షి, గుంటూరు : ‘దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడు.. దళితులు దరిద్రులు..’ ఇవీ టీడీపీ శ్రేణులకు దళితులపై ఉన్న అభిప్రాయాలు ఇవి. అధికారులంటే వారికి చులకన.. దళితులంటే చిన్న చూపు. ఆధునిక సమాజంలో బతుకుతున్నామన్న కనీస జ్ఞానాన్ని కూడా టీడీపీ నాయకులు విస్మరిస్తున్నారు. నేటికీ కులం పేరుతో ఎస్సీ, ఎస్టీలను దూషిస్తుండటమే కాకుండా వారిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన హోదాలో ఉన్నామన్న ఇంగితాన్ని మరిచి అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ బుధవారం చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌పై దౌర్జన్యానికి పాల్పడి, యూజ్లెస్ ఫెలో అని దూషించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోటయ్యపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విక్రాంత్ పాటిల్, ఎస్ఐ కోటయ్యతో పాటు పలువురు పోలీసులను దూషించారు. ‘ఎవర్రా మీకు పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై ఎస్ఐ కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పట్టణ పోలీసులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. దళితులంటే దరిద్రులా.. టీడీపీ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించారు. ‘దళితులు దరిద్రులు.. మీ వల్లే మాకు ఈ పరిస్థితి పట్టింది’ అని కించపరిచారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఎస్ఐ అనురాధను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో దూషించడంపై మహిళా, దళిత, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నాయకులు కులం పేరుతో దూషించి ఘోరంగా అవమానించిన ఘటన చోటు చేసుకున్న వారం రోజులకే మరో దళిత మహిళా అధికారిపై టీడీపీ నాయకులు అగ్రకుల అహంకారం చూపించారు. ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించిన ఘటనలో టీడీపీ మహిళా నాయకురాళ్లు నన్నపనేని రాజకుమారి, సత్యవాణిపై మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివారికి కొత్తేమీ కాదు.. దళితులను కులం పేరుతో దూషించడం, అధికారులను చులకనగా చూడటం టీడీపీ నాయకులకు కొత్తేమీ కాదు. టీడీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అనేక మంది అధికారులపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమయంలో అడ్డుకున్నందుకు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం పై విజయవాడ ఎంపీ కేశినేని నాని, బొండా ఉమా, బుద్ధా వెంకన్న దౌర్జన్యానికి పాల్పడ్డారు. 2017లో గుంటూరు జిల్లా ముట్లూరులో జరిగిన వినాయక ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు గ్రామంలోకి వెళ్లగా అక్కడ టీడీపీలోని ఓ వర్గం వారు అతన్ని వేడుకల్లో పొల్గొనకుండా అడ్డగించి అవమానపరిచింది. చేసేదేమీ లేక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన వెనుతిరిగి వచ్చారు. అప్పట్లో దళిత సంఘాలు అగ్రకులాల అహంకారాన్ని తప్పుపడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 2019 జనవరి ఒకటిన అదే గ్రామంలో దళితులపై అగ్రకులాలకు చెందినవారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించమే కాకుండా ప్రశ్నించారనే కారణంగా దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలు కేంద్ర ఎస్సీ కమిషన్ దృష్టికి వెళ్లడంతో కమిషన్ సభ్యులు రాములు స్వయంగా గ్రామంలోకి వెళ్లి విచారణ జరిపారు. వాస్తవాలను తెలుసుకున్న అనంతరం నిందితులను అరెస్టు చేయకపోవడంపై అప్పటి పోలీస్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి. -
దళితుల వల్లే ఈ దరిద్రం.. డీసీపీ యూజ్లెస్ ఫెలో
నాకు రూల్స్ చెప్పొద్దు.. ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. యూజ్లెస్ ఫెలో.. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం. – డీసీపీ విక్రాంత్ పాటిల్‌ను ఉద్దేశించి టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం. – దళిత మహిళా ఎస్సైని ఉద్దేశించి నన్నపనేని రాజకుమారి, టీడీపీ మహిళా నేతలు సాక్షి, అమరావతి/విజయవాడ: ‘చలో ఆత్మకూరు’ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీస్ అధికారులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, చలో ఆత్మకూరుకు అనుమతి లేదని నచ్చజెప్పబోయిన పోలీసులపై వీరంగమాడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన చంద్రబాబు అలజడులు సృష్టించాలని నూరిపోయడంతో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. అక్కడ విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి, విశాఖ డీసీపీ విక్రాంత్ పాటిల్‌ను ‘యూజ్లెస్ ఫెలో’ అంటూ తిట్టారు. మరోవైపు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళగిరిలో దళిత మహిళా ఎస్ఐ అనూరాధను కులం పేరుతో తిడుతూ ‘దళితుల వల్లే ఈ దరిద్రం’ అనడంతో ఎస్ఐ తీవ్ర మనస్తాపం చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిచోట టీడీపీ నాయకులు పోలీసులతో గొడవకు దిగి రభస సృష్టించేందుకు ప్రయత్నించారు. బాబు డైరెక్షన్లో ఉండవల్లిలో హైడ్రామా టీడీపీ నాయకులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద బుధవారం హైడ్రామా నడిపాయి. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనే కారణంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చలో ఆత్మకూరుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో లోనికి వెళ్లిపోయిన చంద్రబాబు పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆందోళనలు ఎలా చేయాలి, ఏ విధంగా ఘర్షణలు సృష్టించాలనే దానిపై సూచనలు ఇచ్చారు. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. రాష్ట్ర మంతటా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమమయంలో మళ్లీ బయటకు వచ్చిన చంద్రబాబు ఆత్మకూరు వెళతానంటూ కారు ఎక్కి కూర్చున్నారు. పోలీసులు అప్పటికే ఆయన ఇంటి ప్రధాన గేటు వద్ద మోహరించి బయటకు వెళ్లడానికి అనుమతి లేదని తేల్చిచెప్పారు. అప్పటికే చంద్రబాబు ఇంటి లోపలికి వెళ్లిన పలువురు టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు లోనికి వెళ్లిపోయి అక్కడున్న నాయకులతో మంతనాలు జరిపారు. అంతకుముందు ఆయన కుమారుడు లోకేష్‌ను కూడా పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకోగా.. ఆయన కూడా వాదులాటకు దిగారు. రెచ్చిపోయిన అచ్చెన్న చంద్రబాబు నివాసం బయట కరకట్ట రోడ్డుపై మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగి రభస చేశారు. మోటార్ సైకిల్‌పై చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన్ను పోలీసులు ఆపి 144వ సెక్షన్ అమల్లో ఉన్నందున లోనికి వెళ్లకూడదని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అచ్చెన్న బిగ్గరగా అరుస్తూ తనకు రూల్స్ చెప్పొద్దంటూ పోలీసులను నెట్టుకుంటూ చంద్రబాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న విశాఖ డీసీపీ విక్రాంత్ పాటిల్ ఆయన్ను నిలుపుదల చేశారు. ఆ దశలో అచ్చెన ‘ఎక్స్‌ట్రాలు’ చేయొద్దని వేలు చూపిస్తూ బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సర్దిచెబుతున్నా వినకుండా రెచ్చిపోయి విక్రాంత్ పాటిల్‌ను ‘యూజ్లెస్ ఫెలో. నన్ను ఆపడానికి నీకెవడిచ్చాడు అధికారం’ అని దుర్భాషలాడుతూ తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వ్యానులో ఎక్కించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. దళిత ఎస్ఐని దూషించిన నన్నపనేని టీడీపీ మహిళా నాయకులు మహిళా ఎస్ఐని కులం పేరుతో దూషించి దళితులపై ఉన్న వివక్షను మారోసారి చాటుకున్నారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, జవహర్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, మరికొందరు నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో స్టేషన్‌కు తరలించేందుకు రెండు వాహనాలను ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి పెదకాకాని మహిళా ఎస్ఐ అనురాధ వాహనం. నన్నపనేని రాజకుమారి, వంగలపూడి అనిత, మరో ముగ్గురు మహిళలను ఆ జీప్‌లో ఎక్కిస్తుండగా.. ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ దూషణకు దిగారు. దీంతో దళిత ఎస్ఐ అనురాధ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ‘దరిద్రులంటూ హేళన చేస్తారా. నేను కష్టపడి ఉద్వోగం సంపాదించుకున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎస్ఐ అనురాధ చెప్పగా.. సీఐ నరేష్కుమార్ సముదాయించారు. తాను ఈ అవమానాన్ని తట్టుకుని విధులు నిర్వర్తించలేనని, వాహనం నుంచి నాయకులను దించేస్తే వెళ్లిపోతానని చెప్పడంతో సీఐ నరేష్కుమార్ తప్పని పరిస్థితులలో మాజీ మంత్రులను నాయకులను వేరే వాహనంలోకి మార్చారు. ఇంత జరుగుతున్నా టీడీపీ నాయకులు కనీసం తాము అలా అనలేదని కాని, అలా అనడం తప్పు అని కాని చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇతర నేతలదీ అదే దారి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతుండగా.. ఆమెను బయటకు రావొద్దని పోలీసులు చెప్పారు. పోలీసులను తోసుకుంటూ ఆమె హంగామా సృష్టించారు. ఎంపీ కేశినేని నాని ర్యాలీగా ప్రకాశం బ్యారేజీ వద్దకు రాగా.. ‘కైండ్లీ ర్వికెస్ట్ సార్.. ముందుకు వెళ్లొద్దు’ అంటూ సీఐ కాశీ విశ్వనాథ్ విజ్ఞప్తి చేశారు. ప్రకాశం బ్యారేజీపై తన అనుచరులతో కలిసి బైఠాయించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేశినేనిని ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ దినేష్‌రెడ్డి, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కేఈ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాస్ ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించగా.. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు వారిని ఇళ్లనుంచి బయటకు రానివ్వలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిచోట టీడీపీ నాయకులు పోలీసులపై విరుచుకుపడ్డారు. అలజడులు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారు. ఎంత రెచ్చగొట్టినా లాఠీ ఎత్తని పోలీసులు టీడీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’ పేరిట పోలీసులను ఎంత రెచ్చగొట్టినా కనీసం లాఠీ కూడా ఎత్తకుండా సంయమనం పాటించారు. పల్నాడు ప్రాంతంలో సున్నిత పరిస్థితులు ఉన్నందున పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆత్మకూరు బయలుదేరిన టీడీపీ నాయకులను అక్కడకు వెళ్లకుండా నిలువరించబోతుండగా.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు ఐపీఎస్ నుండి ఎస్ఐ స్థాయి అధికారులపైనా విరుచుకుపడ్డారు. పోలీసులు ఎక్కడా తమ పరిధి దాటకుండా ప్రవర్తించి చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా చిన్నపాటి ఘటన కూడా చోటుచేసుకోకుండా నివారించగలిగారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. పల్నాడులో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందువల్లే ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందస్తు గృహ నిర్బంధం చేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా.. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి విక్రాంతి పాటిల్‌ను యూజ్లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడి పోలీస్ ప్రతిష్టను కించపరచిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, గుంటూరు రూరల్ జిల్లా అధ్యక్షుడు టి.మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై కేసు తాడేపల్లి/టెక్కలి: ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్ఐ కోటయ్య ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదిలావుండగా.. స్వార్థ రాజకీయాల కోసం దళితుల మధ్య వివాదాలు సృష్టిస్తున్న ‘చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు మాచర్ల పార్క్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతల పైశాచికత్వం
సాక్షి, గుంటూరు(తాడికొండ) : రాజధాని తాడికొండ, తుళ్లూరు ప్రాంతాల్లోని టీడీపీ నేతల నోళ్లకు అడ్డూఅదుపూ లేదు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు నోరు పారేసుకున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు నాడు సొంత పార్టీలో ఉన్న దళితులను ఇబ్బందులకు గురి చేయడంతో ఎన్నికల్లో వారికి దిమ్మతిరిగే షాకిచ్చారు. దీంతో అక్కసు పెంచుకున్న వారు తమకు ఓట్లేయలేదంటూ గ్రామాల్లో దళితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజధానిలో ప్రతిపక్ష నేత పర్యటిస్తే మైల పడిందంటూ పసుపు నీళ్లు చల్లడం వంటి పైశాచిక ఘటనలు వీరికే చెల్లింది. చంద్రబాబు అండదండలతో రాజధాని ప్రాంతంలో దళితులపై దాడులు, పచ్చనేతల ఆగడాలు మచ్చుకు కొన్ని.... ⇔ ఎన్నికల రోజు తుళ్లూరు మండలం పెదపరిమిలో టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారనే సమాచారంతో పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకుడు పుల్లారావు, అతని అనుచరులు అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సాధారణంగా కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. ⇔ తాజాగా వినాయకచవితి సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరంలో విగ్రహం వద్ద పూజలు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని గ్రామానికి చెందిన కొమ్మినేని శివయ్య మరి కొందరు పరుష పదజాలంతో దూషించారు. శాసన సభ్యురాలు ఏడ్చేసినప్పటికీ వారిలో మార్పు రాలేదు. అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేశారు. ⇔ నెక్కల్లులో స్థల వివాదంలో బీసీ వర్గానికి చెందిన మహిళలపై దాడి చేసిన టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నారని తెలుసుకొని ఆటో కోసం రోడ్డుపై వేచి చూస్తుండగా ట్రాక్టరుతో తొక్కించి హత్య చేశారు. విలేకర్లపైనా దాడులు ⇔ 2017లో రాజధానిలో జరుగుతున్న భూదందాలపై వార్తలు ప్రచురించినందుకు అప్పటి సాక్షి విలేకరి బాకి నాగేశ్వరరావు, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి రమేష్‌పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ తప్పుడు కేసులలో వీరు నిందితులుగా కొనసాగుతుండటం గమనార్హం. తాడికొండ ప్రాంతానికి చెందిన ఓ విలేకరిపైనా ఇదే అనుచిత వైఖరి ప్రదర్శించారు. ⇔ ఉద్దండరాయునిపాలెంలో చెరుకు తోటలు తగలబెట్టిన ఘటనలో వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయించారు. రాజధానిలో పర్యటిస్తున్న నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు పెదపరిమి సెంటర్లో ఆపి తమ సమస్యలు తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఇంతటితో ఆగకుండా జగన్మోహన్రెడ్డి పర్యటిస్తే రాజధానిలో మైల పడిందంటూ పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసే పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నాటి టీడీపీ ఎమ్మెల్యేనా.. వర్గ పోరులో భాగంగా వారి సామాజిక వర్గానికి కొమ్ముకాయడం లేదనే అక్కసుతో ఆయనను టీడీపీ నాయకులే పలుమార్లు బెదిరింపులకు గురి చేశారు. బేజాత్పురం గ్రామంలో కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేని ఓ టీడీపీ సీనియర్ నాయకుడు తమ గ్రామంలో గంటకుపైగా నిర్భందించారు. చివరకు ఎన్నికల సమయంలో సైతం శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగా ప్రకటనలు చేశారు. దీంతో దళితులంతా వైఎస్సార సీపీకి అండగా నిలిచారు. భూముల విషయంలోనూ.. సాధారణ భూములకు ఇచ్చే ప్యాకేజీని దళితుల లంక, అసైన్డ్ భూముల రైతులకు ఇప్పించడంలో ఓ సామాజిక వర్గం ఏ మాత్రం చొరవ చూపలేదు. దళితుల పక్షాన పోరాడిన వామపక్షాల నాయకులను సైతం అడ్డుకొని దాడులకు దిగారు. అగ్రవర్ణాల ఆధిపత్యం ఎప్పటి నుంచో.. కొన్ని తరాలుగా ఈ ప్రాంతంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది. దళితులపై దాడులు చేయడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా బెదిరించే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు ఆ సామాజిక వర్గానికి కొమ్ము కాయడమే కారణం. -
దళిత యువకులపై చింతమనేని దాడి
-
మరోసారి రెచ్చిపోయిన చింతమనేని
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజలు ఛీ కొట్టినా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కి బుద్ధి రాలేదు. మాజీగా మారినా తన రౌడీయిజాన్ని మానుకోవడం లేదు. గతంలో మాదిరిగానే మరో సారి చింతమనేని దళితులపై దాడి చేశాడు. పిన్నకడిమిలో దళితులకు చెందిన ప్రభుత్వ భూముల్లో చింతమనేని గత ఐదు సంవత్సరాలుగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కొందరు దళిత యువకులు ఇంటి నిర్మాణం కోసం ఎడ్ల బండి ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న చింతమనేని వారిపై దాడికి దిగాడు. తన అనుచరులు తప్ప వేరే వారు ఎవరూ ఇసుక తరలించడానికి వీలులేదన్నాడు. అంతటితో ఊరుకోక దళిత యువకులను కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయ చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చింతమనేనికి దళితులపై దాడులు కొత్తకాదని తెలిపారు. పిన్నకడిమిలో దళిత యువకులను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించిన చింతమనేనిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. చంద్రబాబు రాజ్యంలో దళితులపై దాడులకు పాల్పడినప్పటికి చింతమనేనిపై చర్యలు శూన్యమన్నారు. కానీ జగనన్న రాజ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. దళితులు వైఎస్సార్ పార్టీకి వెన్నెముక అన్నారు. వైఎస్సార్ పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించమని హెచ్చరించారు. -
ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సమాజంలో మంచితనం పరిఢవిల్లితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు’ అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు. ఆయన మాట్లాడిందీ దళితులు, బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రద్దు చేయడం గురించి. ‘చట్టాన్ని మార్చకుండానే రిజర్వేషన్లపై కొనసాగుతున్న సామాజిక సంఘర్షణను ఒక్క నిమిషంలో పరిష్కరించవచ్చు. వీటిని వ్యతిరేకిస్తున్నవారు, సమర్థిస్తున్న వారి మధ్య సామరస్య భావన ఏర్పడితే చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అది ఇప్పట్లో సాధ్యమా ? అది సాధ్యమయ్యే పని కాదని గత శనివారం తమిళనాడులోని వెల్లూరి జిల్లాలో ఓ దళితుడి అంత్యక్రియల విషయంలో జరిగిన పరాభవమే అందుకు కారణం. వెల్లూరు జిల్లాలోని వనియంబమ్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని నట్రంపల్లి గ్రామంలో 55 ఏళ్ల కుప్పన్ అనే దళితుడు మరణించాడు. ఊరి శ్మశానంలో దళితుల అంత్యక్రియలకు అనుమతి లేదు. దాంతో వారు పాలర్ నది అవతలి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించడం అలవాటు. అవతల ఒడ్డుకు వెళ్లాలంటే ఓ అగ్రవర్ణ కులస్థుడి పొలం బాట గుండా వెళ్లాలి. దళితులకు ఆ స్థలం గుండా కూడా ప్రవేశం లేదు. అందుకని దళితులు ఆగస్టు 17న పాలం నది వంతెనపైకి కుప్పన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. 45 అడుగుల ఎత్తున ఉన్న ఆ వంతెన మధ్య నుంచి తాళ్ల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. అక్కడి నుంచి నిర్దేశిత చోటుకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి దళిత కుటుంబాల్లో ఇంటి పెద్ద కుమారుడిని పూడ్చి పెట్టడం, మిగతా కుటుంబ సభ్యులను తగులబెట్టడం సంప్రదాయమట. అది వేరే విషయం. ఇలా వంతెన మీది నుంచి మృత దేహాన్ని దించడం, అక్కడి నుంచి అంత్యక్రియలకు తీసుకెళ్లడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో వెల్లూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగమంతా ఒక్కసారిగా కదిలిపోయింది. తిరుపత్తూర్ సబ్ కలెక్టర్ ప్రియాంక మరుసటి రోజే హుటాహుటిన నట్రంపల్లి గ్రామాన్ని సందర్శించి ఊరవతల అర ఎకరం పోరంబోకు స్థలాన్ని దళితుల అంత్యక్రియల కోసం కేటాయించారు. సామాజిక న్యాయం చేశామనిపించుకున్నారు. హిందువులందరికి ఒకే శ్మశాన వాటిక ఉండాల్సిన చోట వేరు స్థలం కేటాయించడంతోపాటు అందుకు దారితీసిన పరిణామాలన్నీ సమాజంలోని వివక్షతను, వైషమ్యాలను స్పష్టం చేస్తున్నాయి. కుల వివక్షత పోయే వరకు రిజర్వేషన్లు తప్పవనే విషయం విజ్ఞులందరికి తెల్సిందే. హిందువులంతా ఒక్కటే దళితులందరు తమ వెంటే ఉన్నారని గత ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ ప్రకటించుకుంది. అవును దళితుల మద్దతు లేకపోయినట్లయితే ఆ పార్టీకి లోక్‌సభలో అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావు. అయినా కేంద్ర కేబినెట్లో అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు లభించాయి. కులాల పేరిట ఎక్కువనో, తక్కువనో మంత్రి పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలోనే ఇలా రిజర్వేషన్లు కొనసాగితే విద్యా, ఉపాధి అవకాశాల్లో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగడం తప్పా!? -
మార్చుకోలేని గుర్తింపు
యషికా దత్ నిదానియా రాసిన ‘కమింగ్ అవుట్ యాజ్ ఎ దళిత్’– దత్, తాను దళితురాలినని బయటపడిన కారణంతో మొదలవుతుంది. ‘‘ఇండియాలో, నేను నా దళిత ఉనికిని రుద్దిరుద్ది వదిలించుకున్నాను. రోహిత్ వేముల ఆత్మహత్యకు రెండు వారాలముందు అతను నాకు ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపినప్పుడు, నేను దాన్ని డిలీట్ చేశాను. నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు, వైరల్ అయిన అతని ఆత్మహత్య లేఖ చదివి, ‘ఆ జీవితం నాదే అయి ఉండేది. సరైన కారణాల కోసం పోరాడేందుకు రెండో ఆలోచన కూడా చేయని అతని ధైర్యం– సంవత్సరాలుగా, నా దళిత ఉనికిని దాచుకుంటూ బతికిన నన్ను బయటకి లాగి, ఫేస్బుక్లో దళితురాలినని ప్రకటించుకునే నిర్ణయానికి చేర్చింది. అణచివేత గురించి సిగ్గు పడాలి. కులం గురించి కాదు’ అన్న గుర్తింపును అతను నాకు కలుగజేశాడు. దేశానికి దూరంగా ఉండటం వల్ల, వెల్లడించడం నాకు సులభం అయింది.’’ ‘‘నేను రాజస్తాన్ అజ్మీర్‌లో దళిత కుటుంబంలో పుట్టాను. కులం దాచడం నేర్చుకుంటూనే పెరిగాను. నా కాన్వెంట్ స్కూల్ చదువు, ‘చామనచాయగా ఉన్నా మురికిగా లేని నా చర్మపు రంగు’ వల్ల, ఉన్నత కులందానిగానే చలామణీ అయ్యాను. సోఫియా బోర్డింగ్ స్కూల్లో ఏడేళ్ళప్పుడు చేరి, పై కులాల అలవాట్లు నేర్చుకున్నాక, తక్కిన జీవితమంతా వాళ్ళతో కలిసిపోగలనని అనుకున్నాను’’ అంటారు దత్. ‘‘మంచి విద్య (ఇంగ్లిష్ మీడియం) మాత్రమే మనల్ని సమాజం అంగీకరించేట్టుగా చేస్తుందని, దాన్ని పొందేందుకున్న ఒకే దారి, కులాన్ని దాచుకోవడం అనేవారు మా తాతగారు. ఆయన 60 ఏళ్ళ కిందట వదిలేసిన ‘నిదానియా’ అన్న ఇంటిపేరుని మరచిపోయాను.’’ ‘‘ఎవరైనా ‘ఏమ్మా, మీదే కులం?’ అనడిగినప్పుడు, ‘పరాశర్ బ్రాహ్మిణ్’ అనడం, ఎంత తరచుగా, నమ్మకంగా చెప్పే అబద్ధం అయుండేదంటే, వాళ్ళనేకాక నన్ను నేనే మోసగించుకోగలిగాను. అయితే, ఎవరైనా ‘కులం కేటాయింపు’, ‘భంగీ’ (నా కులం అయిన పాకీవృత్తి) లాంటి మాటలు అన్నప్పుడల్లా అసౌకర్యం కలిగేది.’’ దత్ కుటుంబంలో ముత్తాతతో సహా, మూడు తరాలు చదువుకున్నవారే. తల్లి చదువుకున్నదే అయినప్పటికీ ఇంగ్లిష్ మీడియంలో కాకపోవడం వల్ల, భర్త అవమానపరుస్తుంటాడు. ఆమె ఐపీఎస్ కావాలనుకున్నా పడదు. చిన్న ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని ఆదుకుంటుంది. ప్రభుత్వాధికారైన ఆమె తండ్రి, తాగుడు అలవాటువల్ల ఉద్యోగం పోగొట్టుకుంటారు. రచయిత్రి తమ సమాజంలోని స్త్రీలు తమ పురుషులనుండే ఎదుర్కునే అణచివేత గురించి కూడా రాస్తారు. ఆమె తల్లీ, అమ్మమ్మా చర్మపు రంగు మార్చుకునేందుకు వాడే నలుగుపిళ్ళ వివరాలుంటాయి పుస్తకంలో. ఆమె కథనంలో స్పష్టంగా కనపడేది తల్లికి తన పిల్లలకు ఉన్నత కులపు చదువు, మధ్య తరగతి పెంపకం అందించాలన్న నిశ్చయం. రచయిత్రి సెయింట్ స్టీఫెన్స్ కళాశాల (ఢిల్లీ)లో మూడు వేల విద్యార్థి వేతనం పొంది చదువుకున్నారు. తరువాత, హిందుస్తాన్ టైమ్స్, ఏషియన్ ఏజ్ పత్రికల్లో ఉద్యోగం చేసినప్పుడు, తన కులం బయటపడకుండా– ఉన్నత వర్గాలకు సంబంధం కలిగుండే ఫాషన్, జీవనశైలి వంటి విషయాలే ఎన్నుకునేవారు. కథలో– ఆమె జీవితపు సంస్మరణ, సామాజిక వ్యాఖ్యానంతో పాటు దళిత ఉద్యమాల క్లుప్తమైన చారిత్రక శకలాలూ కనిపిస్తాయి. ‘మన దేశంలో ఇంచుమించు ప్రతీ వ్యవస్థలోనూ గేర్లు మార్చే అగోచరమైన చెయ్యి’ వంటి పరిశీలనలు ఉంటాయి. అమెరికా–కొలంబియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో మాస్టర్స్ చేశారు దత్. ‘‘రోహిత్‌ను అనుకరించాలనుకున్నాను. దళిత హక్కుల కోసం అతను వెలిగించిన బాటను అనుసరిస్తూ, ‘డాక్యుమెంట్స్ ఫర్ దళిత్ డిస్క్రిమినేషన్’ మొదలెట్టాను. అక్కడ నాలాంటి వారు తమ తమ కథలను చర్చించుకుంటూ, వారూ బయటకొచ్చే అవకాశం ఉంది’’ అంటారు. కులవ్యవస్థను– అంబేద్కర్, మహాత్మా గాంధీలు సమీపించిన విధానాల్లో ఉన్న కీలకమైన తేడాలను ఎత్తి చూపిన ఈ పుస్తకాన్ని ‘ఆలెఫ్ బుక్ కంపెనీ’ 2019 ఫిబ్రవరిలో ప్రచురించింది. _కృష్ణ వేణి -
నా ముందే కుర్చీలో కూర్చుంటావా?.. దళితుడిపై ఆగ్రహం
సాక్షి, కామారెడ్డి : నా ముందే కుర్చీలో కూర్చుంటావా? అని ఓ సర్పంచ్ దళితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దళితుడు తన కుర్చీలో కూర్చోడం సహించలేని అతడు తిట్లదండకం మొదలెట్టాడు. ఈ ఘటన లింగంపేట్ మండలం జల్దిపల్లిలో చోటు చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న కొంతమంది దళితులు సర్పంచ్‌ను నిలదీయగా.. మరింత కోపంతో రగిలిపోయాడు. ఆ 15 దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణకు గురిచేశాడు. దళిత కాలనీకి బోరు, మోటార్ విద్యుత్ కనెక్షన్ తొలగించాడు. కిరాణా సరుకులు ఇవ్వొద్దని, మురికి కాలువల నుంచి తీసిన చెత్త తొలగించవద్దని సిబ్బందిని ఆదేశించాడు. -
బరాత్‌ను అడ్డుకునేందుకు యజ్ఞం.. ఆగిన పెళ్లి
గాంధీనగర్ : గుజరాత్ పాటీదార్ సామాజకి వర్గం సభ్యులు.. దళిత వ్యక్తి బరాత్‌ని ఆపేందుకు ప్రయత్నించిన ఘటనలో పోలీసులు ఇరువర్గాల మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ సంఘటన గుజరాత్‌లోని ఆరావళి జిల్లా ఖంబియాస్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. దళిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి వివాహం సందర్భంగా అతని కుటుంబ సభ్యులు బరాత్ నిర్వహించారు. పెళ్లి కొడుకును మంటపానికి ఊరేగింపుగా తీసుకెళ్లాలని భావించారు. దీన్ని జీర్ణించుకోలేని పాటిదార్ సామాజిక వర్గం సభ్యులు కొందరు ఊరేగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా రోడ్డుపైన భజన కార్యక్రమాన్ని నిర్వహించడమే కాక యజ్ఞం కూడా చేశారు. దాంతో వరుడు మరియు అతని పరివారమంతా ఐదారు గంటలపాటు రోడ్డు మీదనే ఉండాల్సి వచ్చింది. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అంతేకాక ఒకరినొకరు దూషించుకుంటూ రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల మీద కూడా రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులు ఇరు వర్గాల మీద లాఠీ చార్జ్ చేశారు. ఈ విషయం గురించి వరుడు బంధువులు మాట్లాడుతూ.. ‘పోలీసులు మాకు రక్షణ కల్పించలేదు. పాటీదార్ వర్గం వారు రోడ్డును ఇరువైపులా బ్లాక్ చేసి మమ్మల్ని మంటపానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని రోడ్డుమీద నుంచి పంపేయాల్సింది పోయి.. మమ్మల్ని బలవంతంగా వెనక్కి పంపించారు. దాంతో వివాహం ఆగిపోయింది. కనీసం ఇప్పుటికైనా పోలీసులు మాకు రక్షణ కల్పిస్తే.. సోమవారం నాడైనా పెళ్లి తంతు ముగిస్తామ’ని తెలిపారు. -
టీడీపీ నేతలు.. దళిత ద్రోహులు
సాక్షి, ఏలూరు టౌన్ : దళితులపై చంద్రబాబు హయాంలో చేసిన దాడులపై దళితులను చైతన్యవంతులను చేసేందుకు మార్చి 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచారయాత్ర చేపట్టినట్టు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తెలిపారు. ఏలూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మనవడు నేతృత్వంలో నెలకొల్పిన సమతాసైనిక్ దళ్ దళితులపై జరుగుతోన్న దాడులపై పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో దళితులకు అభివృద్ధి, రక్షణ కావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి దళితుడు సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో దాడులు ఇలా.. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులను నీచంగా మాట్లాడుతూ దళితుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. గరగపర్రులో టీడీపీ ఎమ్మెల్యే శివ, అతని అనుచరులు 263 దళిత కుటుంబాలను వెలివేసి హింసించారన్నారు. నేటికీ అక్కడ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వలేదన్నారు. 4 నెలల పాటు దళితులంతా పోరాటం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. పోరాటం చేసిన యాకోబు అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఆకిరిపల్లిలో అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడనే అక్కసుతో ఏలూరు ఎంపీ మాగంటి బాబు అనుచరులు కలపాల వీరయ్య అనే యువకుడిని నరికి చంపారని ఆరోపించారు. అన్యాయమని ప్రశ్నించిన 25 మంది దళితులను పోలీసులతో కొట్టించి, హింసించారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాగంటి బాబు ఇద్దరూ కలిసి దళితులపై అక్రమంగా కేసులు పెట్టించి, మూడు నెలలు జైళ్లలో పెట్టించారన్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక కలపాల అబ్రహం మాదిగ గుండెపోటుతో చనిపోయాడన్నారు. దేవరపల్లిలో టీడీపీకి ఓటు వేయలేదనే కక్షతో 100మంది దళిత కుటుంబాలకు చెందిన సాగుభూమిని టీడీపీ ఎమ్మెల్యే చెరువుగా తవ్వించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమతాసైనిక్ దళ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు మారుమూడి విక్టర్ ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల చిట్టిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి ప్రత్తిపాటి రవిశంకర్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు కత్తుల రవికుమార్, బి.శేఖర్, గుర్రం మాథ్యూ తదితరులు పాల్గొన్నారు. -
దేశాన్ని గెలిపించాడు.. జీవితంలో భంగపడ్డాడు
గుంటూరు: పేద కుటుంబంలో జన్మించాడు.. క్రీడలపై మక్కువతో త్రోబాల్‌పై ప్రత్యేక దృష్టి సారించాడు. ప్రతిభ కనబరచడంతో 2012లో ఇండియా త్రోబాల్ టీమ్ సభ్యునిగా ఎంపికయ్యాడు. దేశం తరఫున పాల్గొన్న ప్రతి పోటీలోనూ విశేషంగా రాణించాడు. వరుసగా ఏడు బంగారు పతకాలు సాధించాడు. తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, ప్రభుత్వం తరఫున సాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరకు దళితులకు క్రీడలు ఎందుకంటూ అవమానపరచినా పట్టువదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ సీఎం చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశాడు. అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో ఆత్మహత్యకు యత్నించాడు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల కేంద్రానికి చెందిన సునీల్ ఇండియా త్రోబాల్ టీంకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పేదరికంతో ఇబ్బందులకు గురవుతున్న సునీల్ తనకు ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ తెనాలి ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను కొద్ది నెలల క్రితం కలిసి విజ్ఞప్తి చేశాడు. కనీసం సీఎంని కలిసే అవకాశమైనా ఇప్పించాల్సిందిగా అభ్యర్థించాడు. దళితులకు డబ్బు లేనప్పుడు క్రీడలు ఎందుకంటూ ఆలపాటి అవమానకరంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉందని గుర్తించి దానికోసం పదిసార్లకు పైగా మంత్రి నక్కాను కలిసి వినతిపత్రమిచ్చాడు. ఆయన కూడా అవమానకరంగా మాట్లాడారు. మనోవేదనకు గురైన సునీల్ శుక్రవారం రాత్రి తన ఫేస్బుక్ ఖాతాలో 80 నిమిషాల నిడివి కలిగిన వీడియోను పెట్టాడు.అందులో చివరగా తాను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. బంధుమిత్రులు సునీల్‌ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ సునీల్‌ను కలిసింది. దళితులంటే చులకనగా చూశారు! సహాయం కోరగా దళితుడిననే కారణంతో టీడీపీ నేతలు తనను చులకనగా చూశారని సునీల్ చెప్పాడు. ఆలపాటి తన సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రాడని ఆరోపించాడు. నక్కా ఆనందబాబును తాను సంప్రదించినా స్పందించలేదన్నాడు. దళితులంటే టీడీపీ ప్రజాప్రతినిధులకు తీవ్ర చులకన భావమన్నాడు. సునీల్ గుంటూరులోని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసి వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నాడు. -
కర్నూలు జిల్లాలో దళితుడిపై టీడీపీ నేతలు దాడి
-
సొంత పార్టీలోనే దళితులకు విలువ లేదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణ అహంకారం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దళితులను చిన్న చూపు చూడటమే కాకుండా వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారు. దళితులకు పదవులెందుకని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానిస్తే.. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మరో అడుగు ముందుకు వేసి తమ గ్రామంలో అభివృద్ధి చేయలేదని గోడు చెప్పుకోవడానికి వచ్చిన దళితులపై దగ్గరుండి దాడి చేయించారు. మరోవైపు సొంత పార్టీలోని దళిత నేతలపైనే అంబికా కృష్ణ తక్కువ చేసి మాట్లాడిన వైనం దళితుల ఆగ్రహానికి కారణం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే... సోమవారం రాత్రి భీమడోలు మండలం పెదలింగంపాడులో టీడీపీ వర్గీయులు దళితులపై దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదలింగంపాడు పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే గన్నికి దళితుల నుంచి నిరసన ఎదురైంది. గడచిన ఐదేళ్లలో తమ గ్రామాన్ని పట్టించుకోలేదని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించలేదంటూ పెదలింగంపాడు దళితులు తమ సమస్యను చెబుతుండగా, కాన్వాయ్ వెంట వచ్చిన గన్ని అనుచరులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళిత యువకులపై పిడిగుద్దులు కురిపించారు. వారిని చితకబాదారు. మరోవైపు గన్ని వీరాంజనేయులు కూడా మీరు ఓటు వేయకపోయినా పర్వాలేదంటూ బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో భాదితులు బీమడోలులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది మంగళవారం ఉదయం ఉంగుటూరు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిటర్నింగ్ అధికారి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి బైండోవర్ చేయాలని ఆదేశించారు. మరోవైపు చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదంటూ అంబికాకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మాజీ మంత్రి పీతల సుజాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సోమవారం జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య సమావేశంలో వ్యాఖ్యలు చేయడంతో సుజాత వర్గం అడ్డుకుంది. దీంతో సమావేశం రసాభాసగా మారింది. సుజాత చేసిన పాపాలు కడిగేసుకోవడానికే చంద్రబాబు అభ్యర్థిని మార్చారని అంబికాకృష్ణ వ్యాఖ్యానించారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే పదేపదే అవమానిస్తున్నారని సుజాత వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని దళిత సంఘాలు తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలని ఆ వర్గాలు యోచిస్తున్నాయి. -
దళిత యువకులను చితకబాదిన టీడీపీ నేతలు
-
దళితులపై ‘దేశం’ దాడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టీడీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. సమస్యలపై నిలదీశారనే అసహనంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని పెదలింగంపాడు గ్రామంలో దళిత యువకులపై టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు వర్గీయులు దాడికి దిగారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తమ గ్రామాన్ని పట్టించుకోలేదని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించలేదంటూ పెదలింగంపాడు దళితులు వినతిపత్రమిస్తుండగా ఆయన కాన్వాయ్ వెంట వచ్చిన అనుచరులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళిత యువకులపై పిడిగుద్దులు కురిపించారు. వారిని చితకబాదారు. ఈ ఘటనలో పలువురు దళిత యువకులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు తన కాన్వాయ్‌తో దళితగ్రామమైన పెదలింగంపాడుకు చేరుకున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన అనుచరులు జై గన్ని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా.. పలువురు దళిత యువకులు తమ గ్రామ సమస్యలపై విన్నవిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఐదేళ్లకాలంలో తమ సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యేను వారీ సందర్భంగా ప్రశ్నించారు. మరో ఐదేళ్లపాటు అధికారమిస్తే ఏమి చేస్తారంటూ గ్రామంలోని మురుగునీరంతా రోడ్డుపై రావడాన్ని చూపుతూ నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు టి.వెంకటేశ్వరరావు, ఆర్.బుజ్జిగోపాల్ తదితరులు దళిత యువకులపై వీరంగం వేశారు. వారిపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించారు. చితకబాదారు. టీడీపీ వర్గీయుల దాడిలో దళిత యువకులు గంటా జగదీష్, కురమా సువర్ణరాజు, పులిపాటి సునీల్‌కు గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామానికొచ్చి తమవారిని చితకబాదడమేంటంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో గన్ని తన కాన్వాయ్‌తో వెనుతిరిగి వెళ్లిపోయారు. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిని వైఎస్సార్సీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు తదితరులు పరామర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీవారు గ్రామాల్లో అరాచక శక్తులతో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. -
దళిత చట్టాలు చంద్రబాబు చుట్టాలు కాదు
-
చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి
-
‘చింతమనేని.. నోరు అదుపులో పెట్టుకో’
సాక్షి, ఏలూరు : దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ నాయకురాలు తానేటి వనిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయన్నారు. దళితులపై ‘దేహి’ లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. అధికారులపై సైతం చింతమనేని దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు. కొవ్వూరు పోలీసు స్టేషన్లో చింతమనేని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకోలేదని ఆరోపించారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) చింతమని వ్యాఖ్యలు మార్ఫింగ్ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులను కేవలం ఓట్ల కోసమే చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబునాయుడు దళితులను హీనంగా చూస్తున్నారన్నారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం అన్నారు. దళితులపై అనుచిన వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు కోరడం సరికాదన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. బహిరంగంగా చింతమనేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని దళితులంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలిపించాలని కోరారు. -
వాసుపల్లీ.. నిన్ను ఓడించడం ఖాయం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): దళితుల ఓట్లతో గద్దెనెక్కిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను ఈ సారి ఆ దళితులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొత్తరముడి శ్రీనివాస్ హెచ్చరించారు. దళితుల్ని చిన్నచూపు చూస్తున్న వాసుపల్లి ఎస్సీల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ నినదించారు. నీకు దళితులంటే ఎందుకంత అసహ్యం అంటూ ఆదివారం డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీ వాసుపల్లికి మరోసారి టికెట్ కేటాయిస్తే దళితులు అతనిని ఓడించడం ఖాయమన్నారు. దక్షిణ నియోజకవర్గంలో దుర్యోధుని పాలన సాగుతుందనుకుంటే దుశ్శాసన పాలన నడుస్తోందని మండిపడ్డారు. దళితుల ఓట్లతో గెలిచిన వాసుపల్లి గణేష్‌కుమార్ దళితుల్ని పక్కన పెడుతున్నారని విమర్శించారు. 23వ వార్డులో ముగ్గురు బూత్ ప్రెసిడెంట్లు, శ్రీకనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి నుంచి ఓ దళితుడ్ని తప్పించారంటే వాసుపల్లికి దళితులంటే ఎంత చిన్నచూపో అర్థమవుతోందన్నారు. వాసుపల్లి దళితుల ద్రోహని, దురహంకారంతో వీగిపోతున్నారని మండిపడ్డారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చెంగల చిన్నారావు, చెన్నా రామయ్య, ఇజ్రాయిల్ పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
చింతమనేనికి చంద్రబాబు మద్దతు!
సాక్షి, అమరావతి : మొన్న తహసిల్దార్ వనజాక్షిపై దాడి, నిన్న దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ పుష్కలంగా ఉందనేది మరోసారి రుజువు అయింది. ఎమ్మెల్యే తీరుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నా...ముఖ్యమంత్రికి మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే చింతమనేనిని చంద్రబాబు కనీసం మందలించడం కూడా జరగలేదు. పైపెచ్చు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో దళితులు పదవులకు పనికిరారన్న చింతమనేనని సీఎం సమర్థించడం గమనార్హం. అంతేకాకుండా చింతమనేని వ్యాఖ్యలు కూడా ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారమే అంటూ నిసిగ్గుగా ఎప్పటిలాగానే ఎదురు దాడికి దిగారు. బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధిగా ఉన్న చింతమనేని బహిరంగంగానే దళితులను కించపర్చేవిధంగా మాట్లాడినా ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపడటం లేదు. గతంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే చంద్రబాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఎమ్మెల్యే చింతమనేని ఆగడాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరోవైపు చంద్రబాబు అండతోనే చింతమనేని మరింత రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. -
పెళ్లి ఊరేగింపుపై పాశవిక దాడి
జైపూర్ : రాజస్ధాన్‌లో ఓ దళిత పోలీస్ పెళ్లి ఊరేగింపుపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుగార్ గ్రామంలోకి శనివారం తన పెళ్లి ఊరేగింపు ప్రవేశించిన సమయంలో కొందరు రాజ్పుట్ వర్గీయులు తమపై దాడిచేశారని వరుడు సవాయి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు పదునైన ఆయుధాలతో దాడికి తెగబడటంతో పలువురికి గాయాలయ్యాయని బాధితుడు తెలిపారు. కాగా, కులదురహంకారంతోనే ఈ దాడి జరిగిందని దళిత సంఘాలు ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కాగా బాధితుడి స్టేట్మెంట్ను నమోదు చేశామని, కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీస్ ఇన్స్పెక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. గతంలోనూ దళితుల పెళ్లి ఊరేగింపులు తమ వీధుల నుంచి వెళ్లరాదంటూ పలు చోట్ల దాడులు జరిగాయి. -
చర్మకారుల దిక్కులేని బతుకు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చర్మకారులది దిక్కులేని బతుకైంది. నాలుగున్నర ఏళ్ల నుంచి పింఛన్, చెప్పులు కుట్టే వస్తువులు, మెటీరియల్ కొనుగోలుకు సాయం అందిస్తామని ప్రభుత్వం చర్మకారులను ఊరిస్తూనే ఉంది. ఈ నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో చర్మకారుల పరిస్థితి ఆశాజనకంగా ఉండేట్టు కనిపించడంలేదు. రాష్ట్రంలో చెప్పులు కుట్టేవారు సుమారు లక్షన్నర వరకు ఉన్నారని చర్మకారుల సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మాత్రం 24,168 మందిని మాత్రమే గుర్తించి వీరికే సాయం అందిస్తామంటోంది. అది కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పటం లేదు. ఎంతోమంది పట్టణాల్లో ఫుట్‌పాత్‌లపై ఇప్పుడు కూడా చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నారు. గతంలో ఎక్కువమంది తెగిన చెప్పులు కుట్టించుకునేవారు. ఇప్పుడు తెగిపోయిన చెప్పులు చెత్తకుప్పలో పడేసి కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. మరో పదేళ్లలో చెప్పులు కుట్టేవారి సంఖ్య కనిపించకుండా పోతుందని వారు చెబుతున్నారు. తమ పిల్లలు మట్టి పనికైనా వెళతామంటున్నారు కానీ చెప్పులు కుట్టి బతకలేమని అంటున్నారని చర్మకారులు చెబుతున్నారు. విజయవాడ నగరంలో సుమారు 150 మంది ఫుట్‌పాత్‌లపై చెప్పులు కుట్టేవారు ఉన్నట్టు చర్మకారుల యూనియన్ నాయకులు తెలిపారు. సాయం కోసం ఎదురుచూపు చెప్పులు కుట్టే వారు ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తున్నారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లు పైబడిన వారికి పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 18 నుంచి 70 ఏళ్లు పైబడిన వారు మొత్తం 24,168 మంది ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ లెక్కలు తప్పని చెప్పులు కుట్టే అరుంధతీయులు చెబుతున్నారు. సుమారు లక్షన్నర మంది చెప్పులు కుట్టేవారు ఉన్నట్టు చర్మకార సంఘాల నాయకులు చెబుతున్నారు. పింఛన్ ఎప్పుడిస్తారో? చెప్పులు కుట్టుకునే ఎస్సీ వృత్తిదారుల్లో 40 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు మొత్తం 19,750 మంది ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వీరికి ఎప్పటి నుంచి పింఛన్ ఇస్తారో చెప్పటం లేదు. 40–50 ఏళ్ల మధ్యవారు 12,953 మంది, 51–55 మధ్య వారు 3,111 మంది, 56–60 మధ్య వారు 2,036 మంది, 61–65 మధ్య వారు 1,074 మంది, 66–70 మధ్య వారు 429 మంది, 70 ఏళ్లు పైబడిన వారు 147 మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. పింఛన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారని చర్మకార సంఘాల వారు చెబుతున్నారు. నాకు ఏమీ ఇవ్వలేదు నాకు 47 ఏళ్లు. చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నా. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు వస్తాయి. ఒక్కోరోజు అవీ రావు. ముగ్గురు పిల్లలూ ఈ వృత్తిలోకి రామంటున్నారు. చదువుకుంటున్నారు. వారికి పెళ్లిళ్లు చేయాలి. ప్రభుత్వం ఏమి ఇస్తుందో మాకు తెలియదు. మాకు ఎవ్వరూ చెప్పేవారు లేరు. నేను అంతగా చదువుకోలేదు. మాదిగ దండోరా వారు వచ్చి పింఛన్లు ఇస్తారని చెప్పి ఫొటోలు తీసుకున్నారు. మళ్లీ వారు కనిపించలేదు. మాలాంటోళ్లం విజయవాడలో 150 మంది వరకు ఉన్నాం. ఫుట్‌పాత్‌లపై చెప్పులు కుట్టుకుని బతుకుతున్నాం. ఇన్నేళ్ల తర్వాత మా గురించి మీరు అడుగుతున్నారు. ఎందుకో భయంగా ఉంది. –తాళ్లూరి ప్రసాద్, చర్మకారుడు, విజయవాడ మాకసలు తెలీదు ప్రభుత్వం పింఛన్లు ఇస్తామన్న విషయం కానీ, చెప్పులు కుట్టుకునేందుకు వస్తువులు, ముడి సరుకు కొనుగోలు చేసేందుకు సాయం చేస్తారని కానీ ఇంతవరకు మాకు తెలీదు. ఈ ప్రభుత్వం ఎవరికి సాయం చేస్తుందయ్యా. మా బతుకులు ఇంతే.. మాకు సాయం చేసేవారు ఎవ్వరూ లేరు. వీధికి పదిమంది వరకు విజయవాడలో చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాం. ఇటీవల చెప్పులు కుట్టించుకునేవారు తగ్గారు. మా పిల్లలు ఈ వృత్తిలోకి రారు. ఇక చెప్పులు తెగిపోతే పారెయ్యాల్సిందే. కుట్టేవారు ఉండరు. –కువ్వారపు సామ్యుల్ (57), చర్మకారుడు, విజయవాడ -
దళితులపై టీడీపీ నాయకుల దాడి
అనంతపురం, కణేకల్లు: కణేకల్లు మండలం గరుడచేడులో దళితులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. మహిళలనే కనికరం లేకుండా వారిని పరుష పదజాలంతో దుర్భాషలాడారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీలో లక్ష్మీ అనే మహిళ తన ఇంటి ముందు దుస్తులను ఉతుకుతుండగా విద్యుత్‌శాఖ లైన్‌మన్, టీడీపీ మద్దదారుడైన నామల పరుశరాం ‘నీళ్లన్నీ రోడ్డుపై వస్తున్నాయ్... ఈ ..లకు ఎక్కడ బట్టలు ఉతకాలో తెలియదం’టూ దుర్భాషలాడాడు. ఇంతలో ఇంట్లో ఉన్న లక్ష్మీ తోడికోడళ్లు జంబక్క, వండ్రమ్మలు బయటికొచ్చి మర్యాదగా మాట్లాడండని చెబితే ఆవేశంతో అతడు అందరినీ దూషించాడు. అంతటితో ఆగకుండా అతని తమ్ముడు కుమార్, మరో ఇద్దరిని పిలిపించుకొని మహిళలపై దాడి చేశాడు. వండ్రమ్మ భర్త దర్గయ్య, అతని కుమారుడు రాజు అడ్డుకోగా వారిని కులం పేరుతో తిట్టి దాడులు చేశారు. కాళ్లు, చేతులతో ఇష్టమొచ్చినట్లు చావబాదారు. తాము ఇటీవలే బటన్హోల్ ఆపరేషన్ చేయించుకున్నామని, ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రమైన కొడుపు నొప్పి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కణేకల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
అనాదిగా అవమానాలు, ఛీత్కారాలు!
సాక్షి, న్యూఢిల్లీ: దళిత గిరిజనులపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో సింహగర్జన చేయాలని అత్యాచార నిరోధక పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ చైర్మన్ మంద కృష్ణమాదిగ నేతృత్వంలో ఇక్కడి పార్లమెంట్ వీధిలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళనలో పాల్గొననున్నట్టు కమిటీ తెలిపింది. భారత సమాజంలో పాతుకుపోయిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో చివరి మెట్లయిన దళితులు, గిరిజనులు అనాదిగా ఛీత్కారాలకు, వేధింపులకు, అవమానాలకు, అత్యాచారాలకు, అకారణ హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యంచేసే ప్రయత్నం చేసిందని, బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు మార్చి 20న దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల ఆందోళన ప్రారంభమైందని వివరించారు. -
దళిత దీపం.. సుందర్రాజు
అనంతపురం కల్చరల్ : కవి,వక్త, విద్యావేత, అక్షరయోధుడిగా చిరపరిచితులైన డాక్టర్ నాగప్పగారి సుందరరాజుది తెలుగు సాహితీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం. కర్నూలు జిల్లా వాసి అయినా ఆయనకు ‘అనంత’తో ప్రత్యేక అనుబంధం ఉంది. దళిత సాహిత్యానికి తన జీవితాన్ని అంకితం చేసి, మాదిగల అంతరంగాలను మధించి కథలుగా .. ఉద్యమాలతో దళితుల సమస్యలను ముందుకు తీసుకెళ్లినా.. అది సుందరరాజుకే చెల్లిందనడంలో సందేహం లేదు. దళిత సాహిత్యంలో తనను తాను దగ్ధం చేసుకుని ఆ బూడిద నుంచే మండే సూర్యుడిగా ఆవిష్కరించాలన్న ఆయన తపనతోనే ‘మాదిగ సాహిత్య వేదిక’ ఏర్పాటైంది. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనకబడిన బహుజనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన రాసిన ‘మా ఊరి మైసమ్మ’ నవల దర్పణం çపడుతోంది. అనంతతో సుందరరాజుకు అనుబంధం.. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నేమకల్లులో పెద్ద నరసమ్మ, రంగన్న దంపతులకు 1968 మే 30న జన్మించిన సుందర్రాజు.. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. జేఆర్ఎఫ్కూ ఎంపికయ్యారు. ఎస్కేయూలో 1999లో తెలుగు సహాయ ఆచార్యుడిగా చేశారు. విద్యార్థి దశ నుంచి ఆచార్యుడి వరకు ఎదిగిన క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఆత్మ గౌరవ పోరాటాలు అనేకం ఉన్నాయి. సెంట్రల్ వర్శిటీలో చదివే సమయంలో బ్రాహ్మణవాదంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ‘చండాల చాటింపు’ ఆయనను ద్రోహిగా అభివర్ణించినా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ప్రతి కథా ఆలోచింపజేసేదే నాగప్ప గారి సుందరరాజు కలం నుంచి జాలువారిన ప్రతి కథా ఆలోచింపజేసింది. పోరాడమని సమాజాన్ని ముందుకు నడిపించింది. వెట్టి చేయలేక పెద్దోళ్ల అహంకారానికి వెట్టిచాకిరీకి బలై నిస్సహాయ స్థితిలో వ్యధకు లోనై ఉరేసుకొని ప్రాణాలొడ్డిన ‘జోరెసావు’ కథ అందరినీ ఆలోచింపజేసింది. ‘మాదిగోడు’ కథలో అగ్రవర్ణాల పెత్తనాన్ని కాకుండా దళిత సంస్కృతి, సంప్రదాయాలను వాళ్లలో ఉండే కళాత్మకతను ఆయన చక్కగా వివరించారు. మాండలీకాలకు మహారథం పట్టి మేము నిజం, మా జీవితాలు నిజం. మా జీవన విధానమిది. మా భాష, నుడికారమిది. చేతనైతే అర్ధం చేసుకోండి అని ధైర్యంగా తన యాసను, భాషను దైనందిన జీవితాన్ని వ్యవహారశైలిని, ఆహారపు అలవాట్లను తనదైన శైలిలో చాటిన కథగా ‘చండాలపు చాటింపు’ మిగిలిపోయింది. పూచే పువ్వు గంధం నేను /వీచే గాలి కదలికను నేను / నడిచే చరిత్ర రచయితను నేను..అంటూ విశ్వాసాన్ని ప్రకటించిన ఆయనే మరోచోట ‘డప్పు కొట్టిన చేత్తోనే డొక్క చీలుస్తాం / చెప్పులు కుట్టినచేత్తోనే చరిత్ర తిరగరాస్తాం..’ అంటూ దళిత జాతిని అవమానపరచిన వారిని ఘాటుగా హెచ్చరించారు. ప్రజ్వరిల్లుతున్న దళిత దీపం.. దళిత సాహిత్య పుటల్లోంచి మాదిగ సాహిత్య నిప్పుకణికలను రగిలించి, రంగరించిన మాదిగ వైతాళికుడు, మాదిగల మణిదీపం అయిన నాగప్పగారి సుందరరాజు చిన్నవయసులోనే అర్ధంతరంగా సాహితీలోకాన్ని వీడి దళిత సాహిత్యాన్ని అంధకారంలో ముంచెత్తి వెళ్లిపోయినా... ఆయన ప్రజ్వలింపజేసిన చైతన్యజ్యోతి అనంత వాసుల గుండెల్లో కణకణమంటూ మండుతూనే ఉంది. ఆయన అకాల మరణం జాతిని చైతన్యం చేసే ప్రతివారికీ తీరని లోటే. మండే సూర్యుడికి వెలుగులు జిమ్మే కాంతి పుంజానికి అంధకారం లేనట్టు ఆయన రచనలతో చైతన్యవంతమైన ఎందరో దళిత రచయితలు ఆయన జీవితాన్ని సమాజానికి దర్పణంలా చూపిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే దళిత రచయితల వేదిక ఆధ్వర్యంలో సుందర్రాజు 18వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్నారు. ఆయన దళితజ్యోతి నాగప్పగారి సుందర్రాజుకు మాతో ఎంతో పరిచయం ఉండేది. ఆయన మాటల్లో రాయలసీమ కసి, కరుకుదనం, మాదిగోడి నిర్భయత్వం, నిక్కచ్చితత్వం కనిపించేవి. మాదిగ శబ్ధాన్ని తిరుమంత్రంలా మ్రోగించి అటు వైదిక సాహిత్యానికి ఇటు మాదిగ సాహిత్యానికి ప్రత్యాయమ్నాయంగా నిలబెట్టిన ఆయన సాహిత్యాన్ని మేము క్రమం తప్పకుండా ప్రచారం సాగిస్తున్నాం. – డాక్టర్ జెన్నె ఆనంద్, దళిత రచయితల వేదిక అత్యంత ఆప్తుడు మా ఊరి పక్కనే నాగప్పగారి సుందర్రాజు అమ్మవాళ్లు ఉండేవారు. వాళ్ల మేనమామ కవ్వప్పగారి ఈరన్న అని మా శిష్యుడు. అలా మా సాహిత్యసభకు వచ్చే సమయంలో ప్రేరణ పొంది తాను కవిత్వం రాసేవారు. అయితే సమాజంలో అతడు పొందిన అనుభవాల వల్ల మాదిగ సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. చైతన్యవంతం చేయగల వ్యక్తిత్వం ఉండడంతో అభ్యుదయ కవిగానే స్ధిరపడ్డారు. అర్థంతరంగా మన నుంచి వెళ్లిపోవడం బాధాకరం. – ఏలూరు యంగన్న, ప్రముఖ కవి, అనంతపురం యువతకు స్ఫూర్తి నేను డిగ్రీ చదివే రోజుల్లో సుందరరాజు అన్న యూనివర్శిటీలో ఆచార్యుడిగా పనిచేసేవారు. ఆయన సాహిత్యాన్ని మేము నరనరానా వంటపట్టించుకున్నాం కాబట్టే ఆయన లేకున్నా ఆయన వదిలి వెళ్లిన ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం. అన్న రాసిన సునీత..సునీత అనే పాటు ఆ రోజుల్లో మార్మోగింది. మాదిగ సాహిత్యమంటే నాగప్పగారి సుందర్రాజుదే అన్నంతగా ఇమిడిపోవడం ఎంతో ఆనందం కలిగిస్తుంది. – డాక్టర్ ఎ.ఎ.నాగేంద్ర, ఎస్కేయూనివర్శిటీ -
ఫెలోషిప్ నిరాకరించారని దళిత ప్రొఫెసర్‌పై..
లక్నో : ఫెలోషిప్ నిరాకరించినందుకు ఓ దళిత ప్రొఫెసర్‌పై ఆయన ఛాంబర్‌లోనే అగ్రవర్ణ విద్యార్థి దాడి చేసిన ఘటన బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కలకలం రేపింది. కులం పేరుతో ప్రొఫెసర్‌ను దూషిస్తూ, ఆయనను తోసివేయడంతో వర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధిత ప్రొఫెసర్ ఫిర్యాదుతో నిందితుడు, రీసెర్చ్ స్కాలర్ సంజయ్ ఉపాధ్యాయను లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వర్సిటీ క్యాంపస్‌లో భారీగా పోలీస్ బలగాలను తరలించారు. ప్రొఫెసర్‌ను రీసెర్చ్ స్కాలర్ కులం పేరుతో దూషించడం పట్ల ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఎకనమిక్స్ డిపార్ట్మెంట్లో సంజయ్ ఉపాధ్యాయ ప్రొఫెసర్ ఎల్సీ మాలియ పర్యవేక్షణలో పీహెచ్డీ చేస్తున్నారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఫెలోషిప్ కోసం ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం తిరస్కరణకు గురైందని చెప్పారు. తాను దళితుడిని కాకపోవడం వల్లే తన పేపర్‌ను తిరస్కరించారని ప్రొఫెసర్ మాలియతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. ప్రొపెసర్ను కులం పేరుతో దూషిస్తూ కాలర్ పట్టుకుని కొట్టేందుకు ప్రయత్నించారు. ఇతర ఫ్యాకల్టీ సభ్యులు ఆయనను కాపాడారని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు అగ్ర, నిమ్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్ధులు రెండు వర్గాలుగా విడిపోయారు. -
బావిలో స్నానం చేశారని..
-
రజనీకాంత్ ‘కాలా’లో ‘కుల’కలం
వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు తమిళనాడులో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితులను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులాలవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమాజంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కానీ, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బలమైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. భారత సినిమా చరిత్రలో సాధారణమైనదేగాక చెప్పు కోదగినది కిందటి వారం. జూన్ 7న రజనీకాంత్ నటించిన కాలా విడుదలైంది. 1980ల నేపథ్యంతో నిర్మించిన ఈ సినిమాలో మురికి వాడలో నివసించే సామాన్యుడు ప్రజానాయకుడవు తాడు. అంతే కాదు, పేదల ఇళ్లను కూల్చడానికి ప్రయత్నించిన బలవంతుడైన ఓ రాజకీయ నేతను ప్రతిఘటిస్తాడు. ఇది మామూలు విషయం. ఈ కథలో కొత్తేమీ లేదు. అయితే, రజనీకాంత్ స్థాయి సూపర్‌స్టార్‌తో దర్శకుడు పా రంజిత్ ఓ దళితుడి వేషం వేయించడం, తమిళ వాణిజ్య సినిమాలో దళి తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషమే. కుల వివక్షను సినిమాల్లో చూపించడం సామాన్య విషయం కాదు. మరాఠీలో సూపర్‌హిట్ అయిన చిత్రం ‘సైరాట్’ హిందీ రీమేక్ ‘ధడక్’ ట్రెయిలర్ విడుదలైంది. అగ్ర వర్ణ యువతి ప్రేమలో పడిన ఓ దళిత కుర్రాడి కథే సైరాట్. బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ఈ కథను హిందీలో నిర్మించింది. అయితే, కుల ప్రస్తావన లేకుండా, పేద యువకుడు ధనికుడి కూతురును ప్రేమించినట్టుగా ఈ హిందీ సినిమాలో చెప్పారు. నేటి మల్టీప్లెక్స్ హిందీ సినిమాలు చూసే ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగానే నిర్మాతలు కథలు రూపొందించి, సినిమాలు తీస్తారనడానికి ఇదో ఉదా హరణ. దళిత సంస్కృతి, వారి పాటలు, నృత్యాలు, వారి పండుగలు వంటి విషయాలను ప్రధాన స్రవంతి తమిళ సినిమా పట్టించుకోదనేది రంజిత్ అభిప్రాయం. అందుకే ఆయన తన చిత్రాల్లో ఈ అంశాలన్నిటినీ చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన దర్శకత్వం వహించిన కబాలి, కాలా ప్రత్యేకత సంతరించుకున్నాయి. కాలా కథ సాధారణమైనదేగాని పెద్దగా పట్టించుకోని కింది కులాల జీవనాన్ని చక్కగా చూపించడం, అందుకు రజనీకాంత్ నటన దోహదం చేయడం వల్ల ఇది విశిష్ట చిత్రంగా ఆకట్టుకుంటోంది. భారతీయ సిని మాల్లో దళితులకు ప్రాధాన్యం ఉండదు. సహాయ పాత్రలకే వారు పరిమితమౌతారు. ఆస్కార్ అవా ర్డుకు ప్రతి పాదించిన ఆమిర్‌ఖాన్ చిత్రం లగాన్‌లో దళితుడైన కచ్రా పాత్రను పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఆమిర్ పాత్రను గొప్పగా చూపించ డానికి అంటరాని వాడైన కచ్రాను వాడుకున్నారు. అంతేగాని, స్వాతంత్య్రానికి ముందు దేశంలో దళి తుల స్థితిపై ఎలాంటి వ్యాఖ్య ఇందులో కనిపించదు. కాలాలో శక్తిమంతుడైన బ్రాహ్మణుడిపై పోరాటాన్ని అంబేడ్కర్, బుద్ధుడి అభిమాని అయిన రంజిత్ 70 ఎంఎంలో గొప్పగా చిత్రించారు. అందుకే కాలాను ఓ మైలురాయి సినిమాగా పిలుస్తాను. హరిదేవ్ అభ యంకర్ అనే దుష్ట బ్రాహ్మణ పాత్ర పోషించిన నానా పటేకర్ రజనీకాంత్ పేరు కాలాను ఎగతాళి చేస్తూ, ఇదో పేరేనా అని ప్రశ్నిస్తాడు. కాలా నివసించే ముంబై మురికివాడ ధారావీని ‘అభివృద్ధి’ చేయడా నికి ప్రయత్నించిన సంస్థకు ‘మనూ రియాలిటీ’ అని పేరు పెట్టడంలో పరమార్థం ప్రేక్షకునికి అర్థంకాక పోదు. ఈ మురికివాడలో అపరిశుభ్రతపై పటేకర్ వ్యంగ్యాస్త్రాలు విసురుతాడు. తన వాడలోని మురికి పరిస్థితులను చూపి గర్వపడతాడు రజనీ. కింది కులాలంటే జుగుప్స ప్రదర్శించే వారిని ప్రతిబింబిం చేలా నానా పటేకర్ పాత్రను రంజిత్ రూపొందిం చారు. నేరుగా కులం పేరు ప్రస్తావించకుండా శుభత్ర, పేర్లు, దుస్తుల గురించి మాట్లాడుతూ కింది కులాలపై పైవారి మనస్సుల్లో అసహ్యం ఎంతగా ఉంటుందో కాలా చక్కగా చూపిస్తుంది. రంజిత్ చిత్రాల్లో కులానిదే కీలక పాత్ర రంజిత్ సినిమాలన్నింటిలోనూ కులానిదే ప్రధాన పాత్ర. కాలాలో కులాన్ని ముఖ్య భూమికలో చూపి స్తారు. క్లైమాక్స్‌లో నీలి రంగు దళితుల విజయానికి, గౌతమ బుద్ధ విహారలో కూడా ఈ రంగు దళితుల తిరుగుబాటుకు చిహ్నాలుగా కనిపిస్తాయి. ముంబైని అతలాకుతలం చేయడానికి ధారావీ సమ్మెకు దిగు తుంది. బలంగా పాతుకుపోయిన పాలకవర్గాలను కూలదోయడానికి బడుగువర్గాలకున్న శక్తికి ఇది తార్కాణంగా నిలబడుతుంది. కాలాలో ‘క్యా రే సెటింగా!’ అనే రజనీకాంత్ పంచ్ డైలాగ్‌ను ప్రేక్ష కుల ఈలలు, చప్పట్ల కోసం రాసిన మాటలుగా భావించకూడదు. దళితులకు వ్యతిరేకంగా అగ్రకు లాలు చేతులు కలపడాన్ని ఈ డైలాగ్ ప్రస్తావిస్తోంది. దళితులపై దాడి జరిగినప్పుడు రజనీకాంత్ ఒంటరి కాదు. కుల శత్రువులపై పోరుకు ఆయన వర్గీయులం దరూ ఆయన పక్కనే ఉంటారు. ఈ సినిమాలో మంచిచెడులను సంప్రదాయబద్ధంగాగాక భిన్నంగా చూపిస్తారు. విలన్ హరిదాదా తెల్ల దుస్తులే వేసు కుంటాడు. అతని ఇంటి హాల్లో రాముడి విగ్రహం ప్రముఖంగా కనిపిస్తుంది. సోఫా సెట్లు కూడా తెల్లని రంగులో కనిపిస్తాయి. అతను రామాయణంపై ఒట్టేసి మరీ మాట్లాడతాడు. అందుకు విరుద్ధంగా కాలా నల్లని బట్టలే ధరిస్తాడు. దుమ్మూధూళి అంటే అతనికి ఇష్టమేగాని చిరాకు లేదు. కాలాను రావణ్ అని విలన్ హరి పిలుస్తాడు. కాని, పెరియార్ ఈవీ రామసామి నాయకర్ ప్రకారం రావణుడు నలుపే గాని చెడ్డవాడు కాదు. కాలా తనను యమునిగా పిలుచుకుంటాడు. తనను రామునిగా భావించే హరి దాదాను యముని రూపాన్ని ప్రతిబింబించే కరికా లన్ తుదముట్టిస్తాడు. హరిదేవ్ తన కత్తి తుప్పు పట్టకుండా ఉండడానికి నూనె రాస్తూ దాన్ని పూజి స్తాడు. ఎప్పుడైనా కత్తిని ఇతరులను చంపడానికి వాడడమే అతని లక్ష్యం. అయితే, అందుకు విరు ద్ధంగా భీమ్రావు అంబేడ్కర్ పుస్తకాలను కాలా చదు వుతాడు. దళితుల ఇళ్లు కూల్చివేయాలనుకున్న హరి దేవ్ వారి విలువైన స్థలాలపై కన్నేసి వారికి మెరుగైన జీవితం కల్పిస్తానని వాగ్దానం చేస్తాడు. మా భూమిపై మాకే హక్కు కాలాలో దళిత పాత్రలు కష్టాలు, కన్నీళ్లకు ప్రతిబిం బాలు కావు. తమ నేలపై తమదే హక్కని వారు వాదిస్తారు. కాలా వారి జీవితాలు, ఆత్మగౌరవానికి చిహ్నం. ఈ మురికివాడలో వినిపించే సంగీతం భిన్నంగా ఉంటుంది. భీమ్ వాడ, మసీదు, నికా, గొడ్డు మాంసం దుకాణం, పెరియార్ చౌక్–ఇవన్నీ ధారావీ లో కనిపించే దృశ్యాల పేర్లు. లెనిన్, భీమ్జీ అనే పేర్లున్న పాత్రలు తమది భిన్న ప్రపంచమనీ, మిగతా భారతావని తమను గుర్తించాలనేలా ధ్వని స్తాయి. నేటి ఆధునిక భారతంలో నిర్మించే సిని మాల్లో చక్కటి అబ్బాయిలు, అందమైన బొమ్మలను తలపించే ఆడపిల్లలే కనిపిస్తారు. వీటిలో ఎన్నికల విశ్లేషణలో ఒక్క కులాన్నే ప్రధానాంశంగా చర్చించ డానికి అవకాశం లేదు. గతంలో ధారావీ మురికివాడ నేపథ్యంతో సినిమాలు వచ్చాయిగాని కులం గురించి ఇంత విస్తృతంగా అర్థమయ్యేలా చిత్రీకరించడం ఇదే మొదటిసారి. తెల్లగా ఉంటారనే కారణంగా ఉత్తరాది కథానాయికలను తమిళ సినిమా సహా దక్షిణాది సిని మారంగం దిగుమతి చేసుకోవడం ఎప్పటినుంచో సాగుతున్న వ్యవహారమే. కాలాలో ఇందుకు భిన్నంగా–రజనీ భార్యగా నటించిన ఈశ్వరీరావు, సామాజిక కార్యకర్తగా కని పించిన అంజలీ పాటిల్ ఇద్దరూ నల్లగానే ఉంటారు. జరీనా అనే భర్తలేని ముస్లిం తల్లి పాత్ర పోషించిన హుమా ఖురేషీ ఓ ముఖ్య సామాజిక సందేశం ఇచ్చేలా కాలాలో దర్శనమిస్తుంది. కుల వివక్షతో హత్యలు జరుగుతున్న కారణంగా తమిళనాడులో కాలా ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. 2016 మార్చిలో పశ్చిమ తమిళనాడులోని ఉడుముల పేటలో శంకర్ అనే దళిత యువకుడిని కత్తులతో పొడిచి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. అతని భార్య కౌశల్య తండ్రి కిరాయి హంతకులతో శంకర్‌ను హత్య చేయిస్తాడు. శంకర్‌తో పోల్చితే పెద్ద కులానికి చెందిన కౌశల్య తల్లిదండ్రులు తమ మాట వినకుండా కూతురు దళితుడిని పెళ్లాడడం సహించ లేక ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హత్యకేసులో దోషులుగా తేలిన ఆమె తండ్రి, ఆయన అనుచరు లకు 2017 డిసెంబర్లో తిరుపూర్ కోర్టు శిక్షలు విధిం చింది. 2014–2016 మధ్య కాలంలో తమిళనాట పరువు హత్యల పేరుతో 83 కేసులు నమోద య్యాయి. వెనుకబడిన కులాలైన వన్నియార్లు, తేవర్లు, గౌండర్లు రాష్ట్రంలో కొత్త అగ్రకులాలుగా అవతరించారు. తమ కూతుళ్లు, కొడుకులు దళితు లను పెళ్లాడితే వారు నిప్పులు చెరుగుతారు. ఇలాంటి కులాంతర వివాహాలను తమ కుటుంబా నికి అవమానంగా వారు భావిస్తారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో దళితుడిని చంపి జైలుకెళ్లడం ఈ కులా లవారికి గొప్ప గౌరవంగా కనిపిస్తోంది. మరి సమా జంలో ఇలాంటి సెంటిమెంటును కాలా సినిమా మార్చగలుగుతుందా? ఇప్పుడు రజనీకాంత్ ఈ చిత్రంలో వేసిన దళితుడి పాత్ర కారణంగా తమిళ సమాజంలో పరివర్తన వస్తుందా? జవాబు చెప్పడం చాలా కష్టం. కాని, సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితుల బాధలు, కష్టాలను విస్మరించలేమనే బల మైన ఆలోచన సినిమా వంటి సృజనాత్మక కళల్లో తప్పక మొదలవుతుంది. తమిళ సినీ ప్రేక్షక ప్రపం చంలో పెద్ద సంఖ్యలో ఉన్న సామాజికవర్గాల కథలు సినిమాలకు ఇతివృత్తాలుగా మారడానికి కాలా దోహ దం చేస్తుంది. దళితుల జీవితాలను సహానుభూతితో అర్థం చేసుకుని వారి బతుకులను కథలు కథలుగా సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందే చెప్పినట్టు మరాఠీ సూపర్ హిట్ సినిమా సైరాట్‌ను హిందీలో ‘ధఢక్’ పేరుతో నిర్మించడం ద్వారా దళితుల జీవితాలను విస్తృతంగా సినిమా తెర లకు ఎక్కించే అవకాశం వచ్చింది. అయితే, అగ్రశేణి దర్శకుడు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ హిందీ సినిమా ట్రెయిలర్ చూస్తే అలాంటి ఆశలు అడియా శలేననే భావన కలుగుతుంది. ఈ సినిమా నిర్మాతలు కేవలం శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కపూర్ల కొత్త ముఖాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కని పిస్తోంది. కుల వివక్ష వంటి బుర్రతో ఆలోచించే కథాంశాలు, భిన్న సామాజిక వాస్తవాలతో కూడిన కథనాలు ‘ఉన్నత స్థాయి’ హిందీ ప్రేక్ష కుల మెదళ్లకు ఎక్కకపోవడం నిజంగా దురదృష్టం. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
‘దళిత్’ మాటను వాడొద్దని చెప్పండి
ముంబై: ‘దళిత్’ అనే మాటను మీడియాలో వాడకుండా తగు సూచనలు చేయాలని ముంబై హైకోర్టు కేంద్ర సమాచార ప్రసార శాఖను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ పత్రాలు, ఉత్తరప్రత్యుత్తరాల్లో ‘దళిత్’ పదాన్ని తొలగించాలంటూ పంకజ్ మెష్రాం అనే వ్యక్తి వేసిన పిల్‌ను ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ విచారించింది. ‘దళిత్’కు బదులు ‘షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొనాలంటూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్లు జారీ చేసిందని పిటిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియా కూడా దళిత్ అనే మాట వినియోగించకుండా చూడాలని కోరారు. స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రెస్ కౌన్సిల్‌కు, మీడియాకు కూడా ‘దళిత్’ అనే మాట వాడరాదని సూచనలు ఇవ్వడం సబబని భావిస్తున్నట్లు పేర్కొంది. -
ఈ పిల్లలు హత్యాయత్నం చేశారట!
యోగీ ఆదిత్యనాథ్ పాలన ఉత్తర ప్రదేశ్ లో దళిత కుటుంబాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పట్టుమని పన్నెండేళ్ళు కూడా నిండని తమ పిల్లలు కేవలం దళితులు అయిన నేరానికి గత రెండు నెలలుగా జైళ్ళలో మగ్గిపోతున్నారని దళిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్టు చేసే ముందు నువ్వు చమర్‌వా? లేక జాతవా? అని ప్రశ్నించి మరీ అరెస్టు చేసినట్టు వారారోపిస్తున్నారు. ‘‘నా కొడుకు సచిన్. సెయింట్ దేవ్ఆశ్రమంలో చదువుకొంటున్నాడు. కోచింగ్ క్లాసుల గురించి తెలుసుకునేందుకు బయటకెళ్ళిన 15 ఏళ్ళ నా కొడుకుని పట్టుకుని జైల్లో పెట్టారు.’’సచిన్ తండ్రి 62 ఏళ్ళ ధర్మవీర్ సింఘ్ ఆవేదన ఇది. ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసుల్లో ఎటువంటి విచారణ లేకుండా నేరుగా అరెస్టులు చేసే అధికారాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా దళిత సంఘాల నేతృత్వంలో ఏప్రిల్ 2 న ఇచ్చిన భారత్ బంద్ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చెలరేగిన హింసలో పన్నెండు పదమూడేళ్ళ బాలురు ముగ్గురిపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పదిహేను సెక్షన్లకింద వివిధ నేరాలు మోపి, గత రెండు నెలలుగా అమాయకులైన వారిని అన్యాయంగా జైల్లో నిర్బంధించినట్టు ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. భారత్ బంద్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్లలో హింస చెలరేగింది. అది పోలీస్ ఫైరింగ్‌కి దారితీసిన విషయం తెలిసిందే. మా పిల్లలు చేసిన నేరమల్లా దళితులుగా పుట్టడమే నంటాడు ధర్మవీర్. చదువుకొని మమ్మల్నాదరిస్తాడనుకుంటే ఇలా జైల్లో మగ్గిపోతున్నాడని ఆవేదన చెందుతున్నారు ధర్మవీర్, అతని భార్య రామేశ్వరి. బాలనేరస్తులకోసం కేటాయించిన జువైనల్ హోంలో కాకుండా మీరట్ జైల్లో పెద్ద పెద్ద నేరగాళ్ళ సరసన సచిన్‌ని ఉంచారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచిన్ ఆధార్‌కార్డుని, స్కూల్ స్టేట్మెంట్ని పోలీసులకు చూపించినా జువైనల్ హోంకి పంపేందుకు వాళ్ళు నిరాకరించారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలియాగరి, సరైకాజి దళితవాడల్లో కుటుంబాలను ఈ అరెస్టులు కలవరపెడుతున్నాయి. సరైకాజికి చెందిన రోష్ని కొడుకు పన్నెండేళ్ళ అజయ్‌ది కూడా ఇదే కథ. ఐదో తరగతి చదువుతున్న అజయ్‌ని సైతం పోలీసులు వదిలిపెట్టలేదు. ఏప్రిల్ 2వ తేదీన మందులు తెస్తానని తల్లికి చెప్పి వెళ్ళిన అజయ్ రెండు రోజులు ఏమయ్యాడో తెలియదు. వికలాంగురాలైన అజయ్ తల్లి రోష్ని చివరకు తన కొడుకు ఆచూకీ తెలుసుకుని జైలుకెళ్లింది. అజయ్‌ని సైతం అరెస్టు చేసే ముందు నువ్వు చమర్‌వా అని ప్రశ్నించినట్టు రోష్ని వివరించారు. 12 ఏళ్ళు కూడా నిండని నా కొడుకు ఇంత పెద్ద నేరాలకు ఎలా పాల్పడతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. చేయని నేరానికి చిన్న పిల్లలను అరెస్టు చేయడమే కాకుండా, వారిని కలవడానికెళ్ళిన వారిని కూడా జైల్లో పడేస్తామని బెదిరిస్తున్నట్టు ఆమె ఆరోపించారు. పై అధికారులనుంచి తమకు ఆదేశాల్లేవంటూ రెండు నెలలుగా చిన్నపిల్లలను వదలిపెట్టడంలేదన్నారామె. కలియాగరీ కి చెందిన 35 ఏళ్ళ సుందరి, నానక్ చంద్ల పన్నెండేళ్ళ కొడుకు అభిషేక్ ని సైతం ఏప్రిల్ 2వ తేదీన చౌదరి చరన్ సింఘ్ యూనివర్సిటీ దగ్గర మంచినీళ్ళు తాగుతున్నవాడిని తాగుతున్నట్టే అరెస్టు చేసారు. ఈ బాలుడిని కూడా అరెస్టు చేసే ముందు కులం గురించి ఆరాతీసారు. ప్రస్తుతం జువైనల్ జైల్లో పెట్టినా లాకప్‌లోనే తన కొడుకుని రోజూ కొట్టేవారనీ అభిషేక్ తల్లిదండ్రులు చెప్పారు. కులం అడిగి మరీ తనను అరెస్ట్ చేసినట్టు అభిషేక్ తల్లిదండ్రులకు వివరించాడు. ఐపిసి 147, 149, 332, సెక్షన్ 353, 336, 435, చివరికి హత్యాయత్నం 307, సెక్షన్ 395 దోపిడీ నేరం, శాంతిని భగ్నం చేసినవారిపై పెట్టే 504, సెక్షన్ 120(బి)కుట్ర, సెక్షన్ 427లకు తోడు తీవ్రమైన నేరారోపణలు సెక్షన్ 7, ఐపిసి 1932 యాక్టు, 1984(4) ప్రివెన్షన్ ఆఫ్ డామేజింగ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ లాంటి తీవ్రమైన నేరాలను ఈ ముగ్గురు మైనర్ బాలురపైనా మోపారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం వీరి వయస్సుని ఎక్కువగా చూపించి దాదాపు 15 రకాల సెక్షన్లకింద అందరిపైనా ఒకేరకమైన నేరాలను మోపడం ఈ కేసులోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోందని వీరి తరపు న్యాయవాది సతీష్‌కుమార్ వాదిస్తున్నారు. -
పేరులో సింహ్ అని పెట్టుకున్నాడని..
అహ్మదాబాద్ : గుజరాత్లో మరో దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన పేరు చివరన సింహ్ అని చేర్చుకున్నాడని దళితుడిని చితక బాదారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర గుజరాత్‌లోని బనక్సంత జిల్లాకు చెందిన మౌలిక్ జాదవ్(22) తనపేరులో సింహ్ చేర్చుకుంటున్నట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కానీ గుజరాత్, రాజస్థాన్‌లో సింహ్ అనేది అగ్రవర్ణాల వారి పేరులో ఉంటుంది. అది తమ గౌరవం, ప్రత్యేక హక్కుగా భావిస్తారు. ఒక దళితుడు సింహ్ అని పెట్టుకోవడంతో భరించలేని రాజ్‌పుత్ యువకుడు మౌలిక్పై దాడి చేసి గాయపరిచాడు. అయితే ఈ ఘటనపై సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహదేవ్సింహ్ వగేలా అనే రాజ్‌పుత్ యువకుడు, అతని ఐదుగురు స్నేహితులు కలిసి తనపై దాడిచేసి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు స్పందిస్తూ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి కౌంటర్‌గా రాజ్‌పుత్‌లు కూడా మౌలిక్పై ఫిర్యాదు చేశారు. -
మోదీ ఇలాకాలో ఇంత అంటరానితనమా!?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ‘గుజరాత్ తరహా అభివద్ధి’ దేశానికి అవసరమని అన్నారు. అందుకు కషి చేస్తానని హామీ కూడా ఇచ్చారు. గుజరాత్ తరహా అభివద్ధి ఆ రాష్ట్రంలో ఆర్థికంగా ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో తెలియదుగానీ సామాజిక అంతరాల్లో మాత్రం ఏ మాత్రం మార్పు తీసుకరాలేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆదివారం నాడు దొంగతనం చేశాడనే అనుమానంపై 40 ఏళ్ల దళిత వ్యక్తిని ఓ స్తంభానికి కట్టేసి కొట్టి చంపేయడం. రాజ్‌కోట్ జిల్లాలో ముకేశ్ వానియా అనే వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొడుతున్న వీడియా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఓ స్థానిక ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఈ సంఘటనలో ముకేశ్ భార్యను కూడా చితక్కొట్టారు. ముకేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మరణించగా, ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె కథనం ప్రకారం ఫ్యాక్టరీ సమీపంలో పాత ఇనుప సామాను ఏరుకుంటున్న ఆ దళిత దంపతులను ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన కొందరు వ్యక్తులు పిలిచారు. కులం గురించి వాకబు చేశారు. దళితులమని చెప్పడంతో ఫ్యాక్టరీ సమీపంలోని చెత్తా చెదారాన్ని పూర్తిగా ఏరివేయాల్సిందిగా ఆదేశించారు. అందుకు ఆ దంపతులు తిరస్కరించడంతో చితకబాదారు. ఈ సంఘటన నాడు 2016, గుజరాత్‌లోని ఉనాలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తోంది. ఆవు చర్మాన్ని వలుస్తున్నారన్న అనుమానంపై గోసంర క్షకులు నలుగురు దళితులను చితక బాదిన విషయం తెల్సిందే. దేశంలోకెల్లా గుజురాత్లోనే దళితులు ఎక్కువగా అణచివేతకు, అంటరానితనానికి గురవుతున్నారని 2010లో ‘నవ్‌సర్జన్’ అనే స్వచ్ఛంద సంస్థ విస్తతంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ఆ సంస్థ రాష్ట్రంలోని 98.4 శాతం గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించింది. 97.6 గ్రామాల్లో దళితులు హిందువుల వంటపాత్రలు, మంచినీటి బిందెలు ముట్టుకోరాదు. అలా ముట్టుకుంటే అవన్నీ కలుషితం అయినట్లు హిందువులు భావిస్తారు. 98 శాతం గ్రామాల్లో హిందువులు దళితులకు టీ పోయరు. కొందరు వారికి కేటాయించిన ప్రత్యేక కప్పుల్లో పోస్తారు. ఇక మతపరమైన కార్యక్రమాలకు దళితులను మరింత దూరంగా పెడతారు. 98 శాతం గ్రామాల్లో మతానికి సంబంధించిన వస్తువులను దళితులు అసలు తాకరాదు, ఈ అంటరానితరం కారణంగా బడులు, గుడుల వద్ద, గ్రామంలోని బావుల వద్ద తరచుగా దళితులపై దాడులు జరుగుతుంటాయి. దేశంలోని అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగంలోని 17వ అధికరణం గురించి హిందువులుగానీ, పాలకులుగానీ పట్టించుకోరు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయగా, గుజరాత్లో మాత్రం ఇంతవరకు భూసంస్కరణలు అమలుకాలేదు. ఈ విషయమై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇటీవల భానూభాయ్ వాంకర్ అనే ఓ దళిత కార్యకర్త సజీవంగా దహనం చేసుకున్నారు. రాష్ట్రంలో భూసంస్కరణలను అమలు చేయకపోవడం అటుంచి స్థానిక బీజేపీ ప్రభుత్వం ధనిక రైతులు, పారిశ్రామికవేత్తలు చిన్న రైతుల భూములను సులభంగా కొనుక్కోవడం లేదా కాజేసే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగిపోయి చిన్న రైతులు తమ పొలాలను అమ్ముకోవడం లేదా అప్పగించడం జరగకుండా ఎప్పటి నుంచో అమల్లో ఉన్న రక్షణ నిబంధనలను ఎత్తివేసింది. దళితుల తరఫున మాట్లాడుతున్న వారిని కూడా గుజరాత్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ‘నవ్‌సర్జన్’ ఎన్జీవో సంస్థ రాష్ట్రంలోని దాదాపు మూడువేల గ్రామాల్లో దళితుల సంక్షేమం కోసం కషి చేస్తోంది. 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్జీవోలకు విదేశీ విరాళాలను నిలిపివేయడంతో నవ్‌సర్జన్ సంస్థ ఉనికికే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఓట్ల కోసమైనా దళితులను ఆకర్షించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. గుజరాత్లో ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల కోసం కషి చేయడం లేదు. దళితుల పక్షమంటే హిందువుల ఓట్లు కోల్పోవడంగానే ఆ పార్టీలు భావిస్తాయి. -
దళిత యువకుడిపై వర్ల రామయ్య అభ్యంతరకర వ్యాఖ్యలు
-
దళిత యువకుడిపై వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) చైర్మన్ వర్ల రామయ్య బస్సులో ప్రయాణిస్తున్న దళిత యువకుడి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం మచిలీపట్నం బస్టాండ్‌లో అధికారులతో కలసి ఆయన బస్సుల తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సులో ఓ యువకుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటాన్ని రామయ్య గమనించారు. అతని దగ్గరకు వెళ్లి చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవా? అంటూ ప్రశ్నించారు. ‘మీ కులం ఏంటో చెప్పు?. మాల లేదా మాదిగా?. మాదిగలు అసలు చదవరు. ఈ వెధవ పరీక్ష కూడా రాసి ఉండడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?. పొలం ఉందా?. బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది?. డబ్బులు లేకపోతే ఎలా చదువుకుంటావ్?. ఫోన్లు గీన్లు మానేసి చదువుకో.’అంటూ అసభ్యంగా మాట్లాడారు. రామయ్య వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు, బస్సులోని ఇతర ప్రయాణీకులు విస్తుపోయారు. గత వారంలో ప్రయాణీకులతో డ్రైవర్లు, కండెక్టర్లు మర్యాదగా ప్రవర్తించాలని, మర్యాద వారోత్సవాలు నిర్వహించారు. ఇంతలో సాక్ష్యాత్తు ఆర్టీసీ చైర్మన్ దళిత యువకుడిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దళితునిపై టీడీపీ నాయకుల దాడి
అనంతపురం సెంట్రల్: రాప్తాడులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. అప్పు తిరిగి చెల్లించమన్నందుకు దళితున్ని చితకబాదారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. రాప్తాడు మండల కేంద్రంలో నివాసముంటున్న దళిత ముత్యాలు ఏడాది కిందట టీడీపీ నాయకులైన అన్నదమ్ములు పామిళ్ల నారాయణస్వామి, పామిళ్ల కోటేశ్వర్, పామిళ్ల రామచంద్రలకు రూ. 3 లక్షల అప్పు ఇచ్చాడు. అప్పు వసూలు కోసం కొన్ని రోజులుగా ముత్యాలు టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే వారు కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం ముత్యాలు తన భార్యతో కలసి అప్పు అడిగేందుకు వెళ్లగా రెచ్చిపోయిన అన్నదమ్ములు కులం పేరుతో దూషిస్తూ వెదురు కట్టెలతో దాడి చేశారు. బాధితులు కన్నీరుమున్నీరవుతూ రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దాడికి పాల్పడింది టీడీపీ నేతలు కావడంతో కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకంజ వేశారు. గాయపడిన ముత్యాలు బుధవారం ఉదయం అనంతపురం సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. దళితులకు రక్షణ కరువు రాప్తాడు నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురై సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న ముత్యాలును ఆయన పరామర్శించారు. మంత్రి పరిటాల సునీత అండదండలతో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారన్నారు. దళితులపై రోజురోజుకు దాడులు ఎక్కువవుతున్నాయన్నారు. ఇటీవల విద్యుత్‌బిల్లులు చెల్లించలేదని ఎస్సీ కాలనీ అంతటికీ కరెంట్ నిలుపుదల చేశారన్నారు. అప్పు తిరిగి చెల్లించండని అడిగిన దళితుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బడుగులు భగ్గు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నెలరోజుల వ్యవధిలోనే నగరానికి చెందిన ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులు దళితులు, మైనారిటీలు, బలహీనవర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క దళితులు, బడుగు బలహీనవర్గాలే తమ తొలి ప్రాధాన్యమని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే.. మరో పక్క ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి గంటా శ్రీనివాసరావు సహా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబులు వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. యాధృచ్ఛికమే కావొచ్చు కానీ.. జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులపై ఒకేసారి బడుగులు, దళితులు, మైనారిటీల నుంచి తిరుగుబాటు మొదలైంది.ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మత్స్యకారుల నుంచి తూర్పు ఎమ్మెల్యేవెలగపూడి రామకృష్ణబాబు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు..విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ దళితుల నుంచి తీవ్ర ప్రతిఘటన చవిచూస్తున్నారు. ఆయనపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై ముస్లిం మైనారిటీలు ఆగ్రహంతో ఉన్నారు.ఆ ముగ్గురిపై తిరుగుబాటు చేస్తున్న ఆయా వర్గాల్లోని బాధితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం విశేషం.పార్టీకి కొమ్ముకాస్తూ ఏళ్ళతరబడి సేవ చేస్తున్న తమను పూచిక పుల్ల మాదిరిగా తీసిపారేస్తారా.. అంటూ ఆ వర్గాల నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ‘దేశం’లో ఏం జరుగుతోంది.. నాలుగేళ్లుగా అధికార బలంతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు చివరికి పార్టీలోని బడుగు బలహీన వర్గాలపై కూడా ప్రతాపం చూపిస్తున్నారనేందుకు ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనాలు. వాసుపల్లిపై దళితాగ్రహం తెలుగుదేశం అర్బన్ జిల్లా అ«ధ్యక్షుడిగా రెండోసారి కొనసాగుతున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత నియోజకవర్గంలోనే.. సొంత పార్టీ నుంచే అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. 23వ వార్డు పార్టీ అధ్యక్ష మార్పు వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. పార్టీలో సీనియర్ అయిన పీవీరామారెడ్డిని కాదని ఇటీవలే పార్టీలో చేరిన బంగారు రవిశంకర్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో రామారెడి వర్గీయులు వాసుపల్లిపై తిరుగుబాటు చేశారు. ఈ విషయమై గత నెల 18న సుపల్లిని నిలదీసేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్లగా రామారెడ్డి వెంట ఉన్న దళిత నేతల పట్ల వాసుపల్లి వ్యవహరించిన తీరు పార్టీలోనే కాకుండా దళిత సామాజిక వర్గీయుల్లో తీవ్ర దుమారం రేపింది. సహజంగానే దూకుడుగా ఉండే వాసుపల్లి దళితులని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం, అమర్యాదగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఇన్నాళ్ళూ పార్టీని, వాసుపల్లిని భుజాన మోసిన తమను కులం పేరుతో దూషించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. పార్టీలోని దళిత నేతలను కూడగట్టి వాసుపల్లిపై త్రీటౌన్ పోలీస్స్టేన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలోని దళితులందర్నీ ఏకంచేసింది. వాసుపల్లిపై తిరుగుబాటుకు దారి తీసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నెల 11న నియోజకవర్గంలో భారీ బహిరంగసభ పెట్టాలని పార్టీలోని దళిత నేతలు నిర్ణయించారు. ఈ సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు జి. చెన్నయ్యలను ఆహ్వానించారు. దళితులను బుజ్జగించేందుకు వాసుపల్లి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. రాజీ కోసం కొంతమంది నేతలకు రెండేసి ఇళ్లు, రూ.30వేల నగదు ఇవ్వచూపినట్టు ప్రచారం జరిగింది. దీనిపై కూడా దళిత నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. డబ్బుతో లొంగదీసుకోవాలని చూడటం తమను అవమానించినట్టేనని దళిత నేతలు భావించారు. ఈ ఉదంతం తర్వాతే వాసుపల్లిని సస్పెండ్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు లోకేష్, చినరాజప్ప, గంటా, అయ్యన్న, జవహర్, నక్కా ఆనందబాబు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గంటాపై ముస్లింల గుర్రు ఇక మంత్రి గంటా శ్రీనివాసరావుపై పార్టీకే చెందిన ముస్లిం మైనారిటీ నేతలు, శ్రేణులు గుర్రుగా ఉన్నారు. పార్టీ ముస్లిం మైనారిటీల సదస్సులో వారి మనోభావాలను పట్టించుకోకుండా లెక్కలేనితనంతో వెళ్లిపోయిన గంటా తీరు చిలికి చిలికి గాలివానలా తయారవుతోంది. శుక్రవారం జరిగిన ముస్లింల సదస్సులో ముం దుగా తాను మాట్లాడి వెళ్లిపోతానని గంటా మైక్ పట్టుకోగా.. మాజీ ఎమ్మెల్యే రెహమాన్ నిలువరించారు. జిల్లా మైనారిటీ నేతలు మాట్లాడే వరకు వేచి ఉండాలని కోరినప్పటికీ గంటా లెక్కచేయకుండా అలిగి ఆగ్రహంతో వెళ్లిపోయారు. గంటా తీరుపై ఇప్పుడు పార్టీలోని మైనారిటీ వర్గాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి గంటాను నిలువరించిన రెహమాన్ సామాన్య కార్యకర్త ఏమీ కాదు. మాజీ ఎమ్మెల్యేగా, వుడా మాజీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పైగా మంత్రి గంటాకు ఎన్నో ఏళ్ల నుంచి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అటువంటి రెహమాన్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా వ్యవహరించిన గంటా వ్యవహారశైలిపై ఇప్పుడు మైనారిటీ వర్గాల్లో ఆగ్ర హావేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల సదస్సులో గంటా తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిరా>్యదు చేస్తామని మైనారిటీ విభాగానికి చెందిన ఓ నేత సాక్షికి చెప్పుకొచ్చారు. వెలగపూడిపై జాలర్ల తిరుగుబాటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పెదజాలారిపేటలోని స్థానిక మత్స్యకారులను కాదని అనర్హులకు ఇళ్లు కేటాయించిన నిర్వాకంపై వారు గత నెల 22న వెలగపూడిని అడ్డుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు మళ్లీ వెలగపూడి జాలర్లను కలవలేని పరిస్థితి నెలకొంది. గతంలో పెదజాలారిపేటలో మత్స్యకారులకు ప్రభుత్వం 103 ఇళ్లు మంజూరు చేసినా ఇప్పటివరకు నిర్మాణాలకు అతీగతీ లేదు. సరిగ్గా అక్కడే వెలగపూడి మత్స్యకారులకు కాకుండా ఇతర వర్గాలకు 72 ఇళ్లు కేటాయించారు. దీనిపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఆ ఇళ్ల శంకుస్థాపనకు వెళ్లారు. వాస్తవానికి ఆ 72 ఇళ్ల లబ్ధిదారులకు గతంలోనే మధురవాడలో ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్థానిక మత్స్యకారులను కాదని వారికే మళ్లీ ఇళ్లు కేటాయించడంతో రగిలిపోయిన మత్స్యకార వర్గీయులు వెలగపూడిని శంకుస్థాపన చేయనివ్వకుండా అడ్డుకున్నారు. జాలారిపేటలోకి అడుగుపెట్టకుండా నిలువరించారు. న్యాయపరమైన డిమాండ్‌తో నిరసన తెలిపిన మత్స్యకారులను కనీసం ఆ తర్వాతైనా వెలగపూ బుజ్జగించలేదు. దీంతో జాలర్లు మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యేను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఇదేనా మాకు బహుమతి అంటూ రగిలిపోతున్నారు. -
నరేంద్ర మోదీకి సవాల్ విసిరిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. పార్లమెంట్లో తనతో కనీసం 15 నిమిషాలు అయినా చర్చకు ప్రధాని సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అంటూ చేపట్టిన ప్రచార సభలో సోమవారం రాహుల్ ప్రసంగిస్తూ...మోదీ పాలనపై మండిపడ్డారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, అధికార నేతలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మోదీ ఇచ్చిన ‘బేటి బచావో బేటీ పడావో’ నినాదాన్ని ఇప్పుడు దేశ ప్రజలు ‘బేటీ బచావో, బీజేపీ లోగోమ్‌సే పడావో’( చిన్నారులను రక్షించడి, బీజేపీ నేతల నుంచి కాపాడండి) అంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళా భద్రతను గాలికొదిలేశారని, దళితుల పరిరక్షణ, పేద ప్రజల సంక్షేమాన్ని మోదీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మోదీకి దేశ అభివృద్ధిపై ఆలోచన లేదని, ఆయనకు ఎప్పుడు ప్రధాని కూర్చిని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తారని విమిర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలనన్నింటినీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలతో నింపేశారని, ఈ వ్యవస్థల్లో సంప్రదింపులు, చర్చలు ఉండవని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని బల పరచేందుకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలన్నింటికీ బీజేపీ ఉద్దేశపూర్వకంగా గండికొడుతోందని రాహుల్ విమర్శించారు. -
దళిత పిల్లల కోసం భీమ్ పాఠశాలలు...!
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు కనీస సదుపాయాల లేమితో కూనారిల్లుతూ, పేద దళితవర్గాల వారికి ప్రైవేట్‌స్కూళ్ల ఫీజులు కట్టే స్థోమత ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నతనంలో ఈ వర్గాల పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో భీమ్ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ యూపీలో భీమ్ పాఠశాలలు మొదలుపెట్టాడు. అయితే ఈ స్కూళ్లలోని టీచర్లు గణితం, సైన్స్, ఇతర సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల బోధనకే పరిమితం కావడం లేదు. దేశంలో దళితుల చరిత్ర, కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, దళితజాతిని ఉద్ధరించిన మహానుభావుల జీవితచరిత్ర, వంటివి చిన్నారుల్లో నాటుకునేలా వివరిస్తున్నారు. విద్య ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సమాజం పట్ల అవగాహన కల్పించి, మార్పునకు రంగం సిద్ధం చేయాలని భావిస్తున్నారు. నేపథ్యం... బడి ముగిశాక కోచింగ్ క్లాస్‌ల రూపంలో దళితుల పిల్లలకు రెండు గంటల పాటు పాఠాలు చెప్పేందుకు మొదట 2015లో ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్‌లో ఓ పాఠశాలల ప్రారంభించారు. క్రమంగా మీరట్, ఆగ్రా, ముజాఫర్‌నగర్ ,ఇతర జిల్లాలకు ఈస్కూళ్లు విస్తరించాయి. ప్రస్తుతం యూపీలో ఈ స్కూళ్ల సంఖ్య వెయ్యికి పైగానే ఉంది. షహరాన్‌పూర్, హరిద్వార్ జిల్లాల్లోనైతే వీటి సంఖ్య గణనీయంగా ఉంది. చెట్టునీడలో, రవిదాస్ గుడి ఆవరణలో లేదా భీమ్ఆర్మీ కార్యకర్త నివాసంలోనో నిర్వహించే ఈ తరగతులకు అన్ని వయసుల్లోని విద్యార్థులు హాజరవుతారు. ప్రధానంగా స్టేషనరీ సామాగ్రి కోసం రూ.3 వేల వరకు ఖర్చవుతుండడంతో ఆ మొత్తంతోనే ఒక్కో పాఠశాల నిర్వహిస్తున్నారు. టీచర్లు ఎలాంటి పారితోషకం తీసుకోరు. భీమ్ఆర్మీ సభ్యులు పాఠశాల నిర్వహణకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు. ఈ వర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్లు, పోస్ట్గ్రాడ్యుయేట్లు రెండేసి గంటల చొప్పున పిల్లలకు సంబంధిత విషయాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలల కొనసాగింపునకు అక్కడి ప్రజలు తమకు తోచిన విధంగా రూ. 50 నుంచి 300 వరకు విరాళాలిస్తున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
-
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య పరాశ్రీకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆయనను రంగరాజన్ భుజస్కంధాలపై ఎత్తుకొని మండపం నుండి ప్రధాన ధ్వజస్థంభం వరకు తీసుకెళ్లారు. ప్రదక్షిణ అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. శిరస్సుపై శఠగోపం ధరింపచేసి ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సమావేశంలో రంగరాజన్ మాట్లాడుతూ 2,700 ఏళ్ల నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కుల ఆధారిత సమాజంలో దళితులు నేటికీ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ఇది అంకురార్పణ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ ప్రతిగుడిలో దళితులకు ప్రవేశం కల్పించడంతోపాటు వారిని అన్ని విధాల జాగృతిపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి కారెంపుడి లక్ష్మీనరసింహా మాట్లాడుతూ నగరంలో మొదటిసారి చేపట్టిన మునివాహన సేవా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆధిత్య పరాశ్రీ మాట్లాడుతూ దళితులు ఆలయ ప్రవేశం చేయడంతోపాటు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తిరుపావై కోకిల మంజులశ్రీ, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ వంశీతిలక్, రంగనాథస్వామి దేవాలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్టీ చార్యులు, శేషాచార్యులు, సుందర రాజన్, రాధామనోహర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో దళితుల ముసలం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీని కొన్ని దశాబ్దాల క్రితం ‘బ్రాహ్మణ్–బనియన్’ పార్టీగా అభివర్ణించేవారు. ఈ ముద్రను చెరిపేసుకొని హిందూ మతంలోని అన్ని కులాలు, ముఖ్యంగా దళితుల సంక్షేమం కోరుకునే పార్టీగా పేరు సంపాదిస్తే తప్ప ఎన్నికల్లో రాణించలేమని గ్రహించిన బీజేపీ ఆ దిశగా ప్రయత్నించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను నిజమైన స్వాతంత్య్ర యోధుడుగా అభివర్ణిస్తూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా దళితులను ఆకర్షించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో బీజేపీ అన్ని కులాల ఓటర్ల సంఖ్య 12 శాతం పెరగ్గా, అగ్రవర్ణాల ఓట్ల శాతం 18, ఓబీసీల ఓట్ల శాతం 12, ఎస్సీల ఓట్ల శాతం 12, ఎస్టీల ఓట్ల శాతం 14 పెరిగింది. ముఖ్యంగా మోదీ ప్రచారం 2014లో జరిగిన ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, గతేడాది అసెంబ్లీ ఎన్నికలపై ఎంతో ప్రభావం చూపింది. లోక్‌సభ ఎన్నికల్లో దళితులు 21 శాతం మంది ఓటు వేసిన కారణంగానే ఆ రాష్ట్రంలో 80 స్థానాలకుగాను బీజేపీ 40 స్థానాలను గెలుచుకోగలిగింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 24 శాతం దళితుల ఓట్లను సాధించడం ద్వారా అధికారంలోకి రాగలిగింది. 85 రిజర్వ్డ్ సీట్లలో 69 సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అలాంటి యూపీలోనే బీజేపీకి చెందిన దళిత ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. దేశంలోని దళితుల పట్ల పార్టీ అనుసరిస్తున్న వైఖరిని వారు తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఏప్రిల్ రెండవ తేదీన దళితులు జరిపిన భారత్ బంద్ హింసాత్మకంగా మారడం, పది మంది దళితులు చనిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో అందరికన్నా ముందుగా పార్టీ ఎంపీ సావిత్రి భాయ్ ఫూలే ఏప్రిల్ ఒకటవ తేదీనే లక్నోలో ‘రాజ్యాంగాన్ని రక్షించండి! రిజర్వేషన్లను రక్షించండి’ అంటూ దళితులతో కలసి నిరసన ప్రదర్శన జరిపారు. దళితులపట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ఆ తర్వాత ఏప్రిల్ రెండవ తేదీన పార్టీ దళిత ఎంపీ డాక్టర్ యశ్వంత్ సింగ్, ఏప్రిల్ ఐదవ తేదీన ఛోటేలాల్ ఖర్వార్, అశోక్ దోహ్రే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే లేఖలు రాశారు. నాలుగేళ్ల ఆయన పాలనలో దళితులకు ఎలాంటి మేలు జరగలేదని ఆరోపించారు. దళితులపై హింస నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు నీరుకార్చడాన్ని విమర్శించారు. మరో బీజేపీ ఎంపీ ఉదిత్ రాయ్ రాష్ట్రంలో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఇటు పార్టీలోనే కాకుండా అటు బయట కూడా దళితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. దళిత నాయకుల చొరవ లేకుండా లక్షలాది మంది దళితులు ఏప్రిల్ 2వ తేదీన వీధుల్లోకి వచ్చి భారత్ బంద్‌ను నిర్వహించడమే అందుకు కారణం. ఈ విషయాన్ని గ్రహించిన నరేంద్ర మోదీ కనిపించిన అంబేడ్కర్ విగ్రహానికల్లా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో నిజంగా దళితులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు ఉండాలే తప్ప, ప్రచార కార్యక్రమాలు మాత్రమే ఉంటే మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితుల్లో దళితులు లేరు. -
దళిత ఆగ్రహం: యోగికి అనూహ్య అవార్డు!
లక్నో: దళిత సంఘాల ఆందోళన, స్వపక్షానికి చెందిన దళిత ఎంపీలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో అటు బీజేపీ అధినాయకత్వం, ఇటు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చడం, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వైఖరి ఉన్నట్టు కనబడటం, దళితులపై పోలీసుల ఆగడాలు మొదలైన విషయాల్లో బీజేపీ అధినాయకత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఈ సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నించిన తమను యూపీ సీఎం యోగి గౌరవించడం లేదని బీజేపీ దళిత ఎంపీలు నలుగురు ఇటీవల గొంతెత్తారు. ప్రధాని నరేంద్రమోదీకి లేఖాస్త్రాలు సంధించారు. ఈ వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగిని అనూహ్య అవార్డు వరించింది. ఆయనను ‘దళిత మిత్ర’ అవార్డుతో సత్కరించనున్నట్టు అంబేద్కర్ మహాసభ ప్రకటించింది. ఒక వ్యక్తి ‘దళిత మిత్ర’ అవార్డు ఇచ్చి సత్కరించడం ఇదే తొలిసారి అని యూపీకి చెందిన దళిత సంఘమైన అంబేద్కర్ మహాసభ అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ తెలిపారు. ‘యోగి ఆదిత్యానాథ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పోలీసు స్టేషన్లో అంబేద్కర్ ఫొటో పెట్టాలని ఆయన ప్రభుత్వం మొదటిసారి ఆదేశించింది. విధాన సభలో దళితులు, వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించారు. యోగికి దళితమిత్ర అవార్డు ఇవ్వాలన్న నిర్ణయంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తమ సంస్థకు ఏ పార్టీ నుంచి నిధులు అందడం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే తమపై విమర్శలు చేస్తున్నారని నిర్మల్ పేర్కొన్నారు. మరోవైపు అంబేద్కర్ జయంతిని ఉత్తరప్రదేశ్ అంతటా ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. -
పెళ్లి బరాత్ కు అనుమతించండి...
లక్నో : ప్రతి మనిషి జీవితంలో వివాహం ఒక ముఖ్య ఘట్టం. ఆ వివాహ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. యూపీకి చెందిన ఓ యువకుడు కూడా అలానే అనుకున్నాడు. వివాహనంతరం బరాత్(పెళ్లి ఊరేగింపు) నిర్వహించాలనుకున్నాడు. అందుకోసం అనుమతివ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించాడు. అదేంటి బరాత్ వేడుక నిర్వహించడానికి కోర్టు అనుమతి ఎందుకు, ఈ కొత్త నిబంధన ఎప్పుడు పెట్టారు అనుకుంటున్నారా..? ఈ సంఘటన జరిగింది మన దగ్గర కాదులెండి ఉత్తరప్రదేశ్‌లో. వివాహం చేసుకోబేబొయే వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో బరాత్ నిర్వహణకు అనుమతించాల్సిందిగా కోర్టును వేడుకున్నాడు. వినడానికి విడ్డూరంగా అనిపించే ఈ సంఘటన లక్నోలోని కస్గంజ్ గ్రామంలో చోటుచేసుకుంది. కస్గంజ్ గ్రామానికి చెందిన సంజయ్ కుమార్‌కు వివాహం నిశ్చయం అయింది. తన వివాహ వేడుకలో సంజయ్ బరాత్ నిర్వహించలనుకున్నాడు. కానీ అందుకు గ్రామంలోని ఉన్నత సామాజిక వర్గానికి చెందిన ఠాకుర్లు ఒప్పుకోలేదు. ‘దళితులు ఊరి మధ్యలో నుంచి వెళ్లడం సంప్రాదాయనికి విరుద్ధం. మా మాట కాదని మీరు బరాత్ తీస్తే తర్వాత చాలా తీవ్ర పరిణామాలు చూడాల్సివస్తుందని’ హెచ్చరించారు. కావాలంటే మీరు ఊరి బయట ఉన్న మైదానంలో వివాహ వేడుకలు జరుపుకుని, అక్కడ నుంచే ఊరేగింపు నిర్వహించుకోవచ్చని సలహా ఇచ్చారు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమని, మీ వాదనను ఎవరూ పట్టించుకోరని ఠాకూర్లు అనటంతో... ఈ అంశం గురించి ఇరువర్గాల మధ్య ఒక నెల నుంచి గొడవ జరుగుతూనే ఉంది. దీంతో విసిగిపోయిన సంజయ్ ఈ అంశం మీద డిస్ట్రిక్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిక్ట్ కోర్టు వధువు మైనర్ కాబట్టి, మరో రెండు నెలల తర్వాత మేజర్ అవుతుందని, అప్పటి వరకూ ఈ విషయం గురించి తీర్పు చెప్పలేమని తెలిపింది. అయితే కోర్టులో ఫిర్యాదు చేయాడానికంటే ముందే సంజయ్ కుమార్ ఈ విషయం గురించి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు... ఆయన పోర్టల్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు, పలుదఫాలు పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు ఈ విషయాన్ని స్థానిక పోలీసుల వద్ద పరిష్కరించుకోవాలంటూ అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయం గురించి సంజయ్ మాట్లడుతూ ‘నేను కోర్టు తీర్పును గౌరవిస్తాను. అయితే ఒకసారి రికార్డులను పరిశీలించాల్సిందిగా నేను కోర్టు వారిని కోరుతున్నాను. ఒక వేళ వధువు మైనారిటీ తీరలేదనే విషయం వాస్తవం అయితే నేను రెండు నెలలు ఆగుతాను. కానీ బరాత్ విషయంలో మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు’ అని చెప్పాడు. ఇదిలా ఉండగా గ్రామ పెద్ద ఓమ్ ప్రకాశ్ ఠాకుర్ మాట్లాడుతూ బరాత్ పేరుతో సంజయ్ అల్లర్లు సృష్టించాలనుకుంటున్నాడని, అందుకే ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. వివాహ వేదిక నుంచి తన ఇంటి వరకూ అతను ఊరేగింపు నిర్వహించుకుంటే సమస్యే లేదని, అయితే సంప్రదాయాన్ని కాదని దళితులు ఊరంతా తిరుగుతామంటే కుదరదని అన్నారు. -
జిగ్నేశ్ మేవానీపై కేసు నమోదు
సాక్షి, బెంగుళూరు : దళిత ఉద్యమ నేత గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీపై కర్ణాటకలో కేసు నమోదైంది. కర్ణాటకలోని చిత్రదుర్గంలో శుక్రవారం దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిగ్నేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జిగ్నేశ్ మాట్లాడుతూ... మోదీ సభలో కుర్చీలు విసిరి గొడవలు సృష్టించాలని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి జయంత్ ఫిర్యాదు మేరకు చిత్రదుర్గం పోలీస్ స్టేషన్లో మేవానీపై ఐపీసీ సెక్షన్లు 153,188,117,34 కింద పలు కేసులు నమోదయ్యాయి. కాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15న ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటన చేయనున్నారు. దేశంలో దళితులపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తుందని, మోదీ రాకకు నిరసనగా రాష్ట్రంలో జరిగే మోదీ సభలో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేయాలని జిగ్నేశ్ మేవానీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. -
దళితులపై అనుచిత వ్యాఖ్యలు
మునగపాక (యలమంచిలి) : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటాన్ని ధ్వంసం చేయటమే కాకుండా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత మద్దాల కృష్ణను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలోని నాగులాపల్లిలో పూడిమడక రోడ్డుపై దళితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి రూరల్ సీఐ రామచంద్రరావు జోక్యం చేసుకుని ఆందోళనకారులను శాంతపరిచారు. వివరాలను ఫిర్యాదుదారు డు డొక్కా దేముడు విలేకరులకు తెలియ జేశారు. జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో భాగంగా మండలంలోని నాగులాపల్లి పాలసంఘ ఆవరణలో దళితుల ఆధ్వర్యంలో చిత్రపటం ఏర్పాటు చేసి నివాళు లర్పించామన్నారు. సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మద్దాల కృష్ణ జగ్జీవన్‌రామ్ చిత్రపటం ధ్వంసం చేయడంతో పాటు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దళితులపై చేసిన వ్యాఖ్యలకు నిర సనగా శుక్రవారం దళితులు పూడిమడకరోడ్డుపై నాగులాపల్లి వద్ద ఆందోళనకు దిగారు. దళితులపై దూషణలు చేసిన కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని లేకుం టే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. ఆందోళన నేపథ్యంలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనకాపల్లి సీఐ రామచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకొని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో దళిత నేత దేముడు, కోనపల్లి నాగేశ్వరరావు, గోసాల గోపాలరావు, కశింకోట నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఎస్ఐ మణికుమారికి దళితులను కించపరిచిన కృష్ణను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తాను నాగులా పల్లి వెళ్లలేదని కృష్ణ ఫోన్లో తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ రాష్ట్రంలో ఇటీవల ఇతర వెనకబడిన కులాలకు చెందిన ఎజావ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన కన్న కూతురునే ఓ దళితుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందన్న కారణంగా చంపేశారు. ఊరిలో పెళ్లి ఊరేగింపులకు తమకు అనుమతివ్వాలంటూ దళితులు డిమాండ్ చేసినట్లయితే వారి అంతు చూస్తామని ఉత్తరప్రదేశ్ ఠాకూర్లు హెచ్చరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లయితే విధ్వంసం సష్టిస్తామని మహారాష్ట్రలోని మరాఠీలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికే ఈ చట్టాన్ని ఎత్తివేయాలని అగ్రవర్ణమైన వర్ణియార్లు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని ‘పట్టాలి మక్కల్ కాచ్చి’ డిమాండ్ చేస్తోంది. దేశంలోని దళితుల పట్ట వివిధ సామాజిక వర్గాలకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి. దళితుల పట్ల దేశంలో ఇంకా ఇలాంటి అభిప్రాయాలు కొనసాగుతున్నందునే ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరుకార్చాల్సిన అవసరం లేదన్నది స్పష్టం అవుతోంది. ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందని భావించాల్సిన అవసరం లేదు. నిజంగా దుర్వినియోగం అవుతుంటే అందుకు కారణాలేమిటో క్షుణ్నంగా పరిశీలించి చట్టంలో ఆమోదయోగ్యమైన మార్పులు తీసుకరావచ్చు. అంతేగానీ చట్టాన్ని సవరణ పేరిట పలుచన చేయరాదు. సుప్రీం కోర్టు పలచన చేసిందన్న కారణంగానే, దాని సమీక్షను కోరుతూ కేంద్రం రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలంటూ నేడు ఎస్సీ, ఎస్టీలు భారత్ బంద్‌ను పాటిస్తున్నాయి. మొన్నటి వరకున్న చట్టం నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీల చట్టం కింద ఫిర్యాదు అందితే తక్షణం కేసు నమోదు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిందితులను అరెస్ట్‌చేసే అవకాశం ఉండింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ కూడా వెంటనే లభించేది కాదు. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందున్న కారణంగా బాధితుల నుంచి ఫిర్యాదు అందితే దానిపై వారం రోజుల్లో సమగ్ర దర్యాప్తు జరిపి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత నిందితులపై చర్య తీసుకోవాలని, ఇక ప్రభుత్వ అధికారులపై కేసు దాఖలైతే వారిని అరెస్ట్ చేయడానికి వారి పైఅధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో దళితులపై రోజురోజుకు దాడుల ఘటనలు పెరుగుతున్నప్పటికీ వారిపై ఎస్సీ, ఎస్టీల చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువ. ఇక వాటిల్లో శిక్ష పడుతున్న సందర్భాలు చాలా తక్కువ. మొత్తం కేసుల్లో 25 శాతం కేసులకు మించి నిందితులకు శిక్షలు పడడం లేదు. ఎందుకంటే నిందితుల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు బాధితులతో రాజీలు కుదుర్చడమే అందుకు కారణం. ఇక ఈ కేసుల్లో తక్షణ అరెస్ట్‌లు కూడా లేకపోతే నిందితులపై కేసులు దాఖలు చేయడం తగ్గిపోతుంది. దాఖలైనా రాజీలే ఎక్కువ జరిగి శిక్షలు మరింత తగ్గిపోతాయి. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితులపై గోరక్షకులు దాడులు జరపగా, వాటిల్లో 20 శాతం కేసుల్లో కూడా ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని ప్రయోగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని మరింత కఠినం చేయాలని ‘నేషనల్ కొహలిషన్ ఫర్ స్ట్రెన్తనింగ్ ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్’ డిమాండ్ చేస్తోంది. కుల మతాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికి గౌరవంతో జీవించే హక్కు ఉంది. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం కులాని, అగ్రవర్గాన్ని కాకుండా అంటరాని తనాన్ని నిషేధిస్తోంది. అందుకనే 1955లో దేశంలో అంటరానితనం నిషేధిత చట్టం అమల్లోకి వచ్చింది. అదే 1974లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మారింది. 1989లో ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంగా రూపాంతరం చెందింది. వర్ణ వ్యవస్థ ఆధిపత్యంగల భారత్‌లో ఆశించిన మార్పు రాకపోవడంతో చట్టాన్ని సవరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చట్టాన్ని కఠినతరం చేస్తూ రాగా, ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని సడలించింది. చట్టం దుర్వినియోగం అవుతుందన్న కారణంగా ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని 498ఏ, ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్టివిటీ చట్టాలు ఎస్సీ,ఎస్టీల చట్టంకన్నా ఘోరంగా దుర్వినియోగం అవుతున్నాయి. -
దళిత అర్చకులు
దళితుల ఆలయ ప్రవేశానికి గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దళితులనే ఆలయాలకు అర్చకులుగా నియమిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే నిధులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో జిల్లాలోని దళితవాడల్లో ఆలయాలు నిర్మిస్తున్నారు. వీటికి స్థానిక దళితులను అర్చకులుగా నియమించి, సరికొత్త అధ్యాయానాకి శ్రీకారం చుట్టారు. ముత్తుకూరు: జిల్లాలో 2017–18 సంవత్సరంలో టీటీడీ 64 ఆలయాలు నిర్మించింది. ముత్తుకూరు మండలంలోనే నాలుగు ఆలయాలు నిర్మించారు. కృష్ణపట్నం పంచాయతీలోని కావలిదళితవాడలో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయంలో కావలి మస్తానయ్య అనే ఎస్సీని అర్చకుడిగా నియమించారు. ముత్తుకూరులోని ఈదూరు రాజమ్మ కాలనీ నిర్మించిన సీతారామస్వామి ఆలయంలో చొక్కా శ్రీనివాసులు అనే ఎస్టీని పూజారిగా నియమించారు. గోపాలపురంలో నిర్మించిన పాండురంగస్వామి ఆలయంలో ఎస్సీని, అచ్చన్నతోపులో నిర్మించిన సీతలాంబ–పోతురాజు ఆలయంలో ఎస్టీని పూజారులుగా నియమించారు. ఒక్కొక్క ఆలయ నిర్మాణానికి టీటీడీ రూ.5 లక్షలు విడుదల చేస్తోంది. నిధులు చాలని పక్షంలో స్థానిక దాతల సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసి, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందూ ధర్మ ప్రచారం కోసం.. దళితవాడల్లో మత మార్పిడులను అరికట్టి హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ చేపట్టిన ఈ బృహత్ కార్యానికి సమరసత సేవా ఫౌండేషన్ వెన్నుదన్నుగా నిలిచింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆలయాల నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. 15 రోజుల పాటు శిక్షణ ఆలయాల అర్చకులుగా ఎంపిక చేసే దళితులకు టీటీడీకి చెందిన శ్వేత భవనంలో 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. భక్తులను ఎలా ఆకర్షించాలి, వారితో ఎలా సంభాషించాలి, ఉపచారాలు, దేవతార్చన ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆలయాల బాధ్యత స్వీకరించిన తర్వాత స్వయంకృషితో మంత్రాలు, స్తోత్రాలు, అర్చనలు నేర్చుకోవాలి. వచ్చే ఏడు బీసీ కాలనీల్లో ఆలయాలు వచ్చే సంవత్సరం నుంచి బీసీ కాలనీల్లో కూడా ఆలయాలు నిర్మించాలని సంకల్పించాం. బీసీలనే అర్చకులుగా నియమిస్తారు. టీటీడీ సహకారంతో స్థానిక దాతల సాయంతో ఈ దైవ కార్యం నిర్వర్తిస్తున్నాం. దళితుల్లో దేవాలయాల పట్ల నమ్మకం, విశ్వాసం కలిగించాలన్నదే మా ధ్యేయం. మన రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. దళితులు అర్చకులుగా ఉన్న ఆలయాలకు భక్తులు విశేషంగా రావడమే దీనికి తార్కాణం.–టీవీ కృష్ణకుమార్, సభ్యుడు, సమరసత సేవా ఫౌండేషన్ అర్చకుడు కావడం నా అదృష్టం నేను ఎస్టీని. బీకాం పూర్తి చేశాను. ఆలయానికి అర్చకుడు కావడం ఊహించని అదృష్ణం. ఉద్యోగాన్వేషణలో ఉండగా ఈ అవకాశం దక్కింది. టీటీడీలో 15 రోజులు శిక్షణ ఇచ్చారు. ముత్తుకూరు శివాలయంలో మరో 30 రోజులు గురువుల వద్ద శిక్షణ తీసుకున్నా. మంచి విషయాలు నేర్చుకున్నా. ఖాళీగా ఉన్నపుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నా. శివాలయానికి భక్తులు బాగానే వస్తున్నారు. –చొక్కా శ్రీనివాసులు, అర్చకుడు, సీతారామస్వామి ఆలయం -
దళితుల చీలికకు కుట్ర
చీరాల రూరల్ : దళిత, బహుజనులు రాజ్యాధికార దిశగా పయనించాలని, అందుకు ఐకమత్యమనే మార్గాన్ని ఎంచుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్లో దళిత, బహుజన సంఘాల మేధోమధన సదస్సు జరిగింది. సదస్సు కన్వీనర్ గోసాల ఆశీర్వాదం అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, హైదరాబాదుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎ.ఎం. ఖాన్ యస్థాని, సామాజిన న్యాయవేదిక కన్వీనర్ వై. కోటేశ్వరరావు ప్రసంగించారు. రాష్ట్రంలోని దళిత, బహుజనులంతా రాష్ట్రంలో అత్యల్పంగా ఉన్న పెత్తందార్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని సమిధలవుతున్నారని పేర్కొన్నారు. బతకటానికి పోరాటాలు చేయాల్సిన విపత్కర పరిస్థితులు ప్రస్తుత సమాజంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, బహుజనులందరూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావ్ పూలేలను ఆదర్శంగా తీసుకుని సమాజాన్ని ఏవిధంగా సంస్కరించాలో తెలుసుకొని పయనించాలని సూచించారు. ప్రమాదకరంగా బీజేపీ..ఆర్ఎస్ఎస్ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడులు అధికమయ్యాయని వక్తలు పేర్కొన్నారు. దళిత, బహుజనులంతా ఐకమత్యమై బలమైన రాజకీయ శక్తిగా అవతరించి, సాంస్రృతిక ఐక్యత సాధించాలని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాల కుంపట్లు, రిజర్వేషన్ల రగడతో దళిత, బహుజనులను చీల్చివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అలాంటి వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ చర్చించిన అంశాలన్నింటిని క్రోడీకరించి సైద్ధాంతిక రూపంలోనికి తీసుకువచ్చి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందులో భాగంగా ఐదుగురితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి వారిద్వారా ఇక్కడ చేసిన తీర్మానాలను కరపత్రాల రూపంలో ముద్రించి కార్యరూపం దాల్చే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. చీరాలలో పబ్బం గడుపుకుంటున్న పెద్దలు చేనేత జన సమాఖ్య రాష్ట్ర నాయకుడు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ ప్రస్తుతం చీరాలలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయని, ఇక్కడున్న రాజకీయ పార్టీల నాయకులు ఒక వర్గం ప్రజలను అదే వర్గం ప్రజలపైకి ఉసిగొల్పుతూ వారి పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వరికూటి అమృతపాణి, బాంసప్ రాష్ట్ర కన్వీనర్ పరంజ్యోతి మాట్లాడుతూ దేశంలోని పెట్టుబడిదారులు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి పార్టీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మాజీ మంత్రి పాలేటి రామారావు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి ఆహ్లాదకరమైన రాష్ట్ర సదస్సులు జరగడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబూరి సుబ్రహ్మణ్యం, పలుకూరి ప్రసాదరావు, నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మ, నీలం నాగేంద్రరావు, గోసాల సుధాకర్, పొదిలి ఐస్వామి, అబ్దుల్ రహీం, పిన్నిక శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన దళిత, బహుజన సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు -
వెంటాడి.. వేటాడి
మేడిపెల్లి(వేములవాడ): వివాహేతరం సంబంధం యువకుడి ప్రాణం తీసింది. పలుమార్లు సదరు విషయమై మందలించినా వినడం లేదని ఆ మహిళ తండ్రి, సోదరుడు ఆ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం తొంబర్రావుపేటలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సురేశ్(31) రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేస్తున్నాడు. ఇతడికి భార్య శైలజ, కూతురు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయమై సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి సురేశ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్దతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. దారికాసి ఘాతుకం.. సురేశ్ తన మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం విధులకు వెళ్తున్నాడు. అదే సమయంలో గ్రామశివారులో కాపుకాసిన సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి, సోదరుడు సంతోష్‌రెడ్డి సురేశ్‌పై దాడి చేశారు. మొదట కర్రలతో దాడిచేయగా స్పృహ కోల్పోయాడు. అనంతరం కొడవలితో మెడ, కడుపులో పొడిచి పారిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మెట్‌పెల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటనాస్థలంలో విచారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా నిందితులిద్దరూ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దళిత సంఘాల ఆందోళన అగ్రవర్ణాల చేతిలో హత్యకుగురైన సురేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండు చేశారు. సురేశ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మేడిపల్లిలో ఆందోళన చేశారు. -
నత్తనడకన భూ పంపిణీ పథకం
‘వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో 17 మంది దళితులకు భూమి పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు 9 ఎకరాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవగా యజమాని ఎకరానికి రూ.5.25 లక్షలకు విక్రయించేందుకు ముందుకొచ్చాడు. విషయం తెలుసుకున్న రియల్టర్లు ప్రభుత్వం చెల్లించే ధర కంటే ఎక్కువ చెల్లిస్తామని చెప్పడంతో సదరు భూమి యజమాని అటువైపు మొగ్గుచూపాడు. దీంతో ఏమిచేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి’. సాక్షి, వరంగల్ రూరల్: భూమిలేని నిరుపేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ భూమి లేని ప్రాంతంలో ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలని, ఇందుకు ఎస్సీ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎకరం భూమి రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల ధరతో కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయిం చింది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 627 మంది దళితులకు మూడేళ్లలో 1739.33 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 220 ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 40 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. ఉమ్మడి వరంగల్‌లో నాలుగేళ్లలో పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల వివరాలు.. మార్కెట్ కంటే తక్కువ ధర.. జిల్లాల పునర్విభజనతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీపడి భూములు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.15లక్షల వరకు ధర ఉంది. ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల మధ్య కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో భూమి అమ్మడానికి యజమానులు మందుకురావడం లేదు. 100 ఎకరాల పైన భూమి అమ్మడానికి యజమానులు ముందుకు వచ్చినా ధర విషయంలో వెనక్కి వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. తప్పని ఎదురు చూపులు.. దళితులకు భూ పంపిణీ పథకం అమలులోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు భూమి పంపిణీ చేసింది కొద్దిమందికే. ఇచ్చిన భూముల్లోనూ నీటి వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికి పట్టాలు మాత్రమే ఇచ్చారు. భూములకు మాత్రం చూపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వేలాది మంది లబ్ధిదారులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. అసలు భూములే పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆర్భాటంగా పథకాన్ని ప్రకటించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 150 ఎకరాల స్థలం గుర్తించాం.. వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా 150 ఎకరాల భూమిని గుర్తించాం. అనువైన స్థలం ఎంపిక చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చుస్తున్నాం. త్వరలో పంపిణీ చేస్తాం. – సురేష్, ఎస్సీకార్పొరేషన్ ఈడీ -
నిద్రలోనే మహిళకు నిప్పటించారు
లక్నో : వడ్డీ కట్టలేదన్న కారణంతో ఓ మహిళకు నిప్పటించిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన దళిత మహిళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బల్లియా జిల్లా జజౌలి గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జజౌలి గ్రామానికి చెందిన రేష్మా దేవి(45) గ్రామంలోని సోనూ ఓ వ్యాపారి వద్ద రూ. 20 వేలు అప్పుగా తీసుకుంది. ఈ మధ్యే ఆ అప్పును చెల్లించగా.. వడ్డీ కోసం ఆమెను వేధించటం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె కట్టనని తెగేసి చెప్పటంతో ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి మంచంపై నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆమె కేకలకు అంతా నిద్రలేవటంతో నిందితులు పరారయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి స్టేట్ మెంట్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు : టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలోని దళిత ప్రజాప్రతినిధులకు పదవులు తప్ప అధికారం లేదని అన్నారు. ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘పదవులు మావి.. పెత్తనం మాత్రం వాళ్లదా?’ అని నిలదీశారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. రావెల కిశోర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘తెలుగుదేశం పార్టీలో నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల నేతల పెత్తనమే ఎక్కువగా ఉంది. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు మాత్రమే ఉన్నాయి. అధికారం చెలాయించేది మాత్రం బయటి వ్యక్తులే. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని నామమాత్రపు ఎమ్మెల్యేగా చూస్తున్నారు. పెత్తనం మొత్తం అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్థన్‌రెడ్డి సాగిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి పదవిలో జవహర్ ఉన్నప్పటికీ పెత్తనం మొత్తం సుబ్బరాజు చౌదరి చేస్తుంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అధికారం మొత్తం అక్కడి చైర్మన్ బాపిరాజు చేతుల్లో ఉంటోంది. మంత్రి నక్కా ఆనందబాబు పదవిలో ఉండగా, వేమూరు నియోజకవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా చేతుల్లోనే ఉంది. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎమ్మెల్యే పదవి స్వామిది, అధికారం చెలాయించేది మాత్రం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. దాదాపు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కేవలం నామమాత్రపు నాయకత్వాన్ని ఇచ్చి అధికారం పక్కవాళ్లు చెలాయిస్తే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు చదువుకున్నవారు, విజ్ఞానవంతులు అంబేడ్కర్‌వాదులు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు అగ్రకుల ఆధిపత్యాన్ని సహించే పరిస్థితుల్లో లేరు. వీరికి పదవులతోపాటు అధికారం కూడా ఇవ్వాలి. అప్పుడే ఈ పార్టీలో నాకు గుర్తింపు ఉంది, గౌరవం ఉంది, అధికారం ఉంది అనే ఆత్మవిశ్వాసంతో వారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. నా పేరు ప్రతిష్టలు దిగజార్చారు నా నియోజకవర్గం పరిధిలోని ఓబులునాయుడుపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తే ఆయన చెప్పా. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకుండాపోయింది. నాకు వాటా పంపుతున్నామని ప్రచారం చేసి నా పేరుప్రతిష్టలను దిగజార్చడంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు విలేకరులను తీసుకుని అక్కడికి వెళ్లా. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరగడం చూసి ఆశ్చర్యపోయా. నారాయణస్వామి, అశోక్ అనేవాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు తేలింది..’’ అని రావెల పేర్కొన్నారు. -
హోలీ వేడుకల్లో టీనేజర్ హత్య.. కలకలం!
సాక్షి, జైపూర్: హోలీ వేడుకలు ఓ దళిత కుటుంబంలో పెను విషాదం నింపాయి. హోలీ అడుతుండగా ఆయుధాలతో దాడిచేయడంతో దళిత టీనేజర్ మృతిచెందడం కలకలం రేపింది. ఈ ఘటన రాజస్థాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నీరజ్ జాటవ్(16) అనే టీనేజర్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హోలీ సందర్భంగా బయటకు వెళ్లాడు నీరజ్. అయితే ఇతర సామాజిక వర్గానికి చెందిన మిత్రులు, స్థానికులతో హోలీ రంగులు రుద్దుకుంటూ హోలీ ఆడుతున్నాడు. అంతలోనే గొడవ మొదలైంది. దళిత బాలుడు నీరజ్‌పై కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న దళిత టీనేజర్ కుటుంబసభ్యులు నీరజ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన నీరజ్ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మృతిచెందాడని ఏఎస్పీ పుష్పేంద్ర సోలంకి తెలిపారు. హోలీ ఆడుతున్న నీరజ్‌ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్యచేశారని, ఆ టీనేజర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం. -
సత్యం ‘సమాధి’
వెంకటాయపాలెం(రామచంద్రపురం రూరల్): రెండు దశాబ్దాల క్రితం నాటి కేసు.. ఎలాగైనా బయటపడేందుకు అధికార బలం ప్రయోగించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకున్నారు. బాధితుల కులాన్నే మార్చేశారు. వారు దళితులు కాదని నిరూపించేందుకు పాత సమాధికి కొత్త పేరు తగిలించారు. దాన్ని ఫొటో తీసి కోర్టుకు అందజేశారు. అలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఏకంగా న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగించిన అరాచకమిది. 18 దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెరపరుస్తున్నాయి. నిజ నిర్ధారణ కమిటీ వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 21 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇద్దరు దళితులకు శిరోముండనం చేయించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు మూడు నెలలు జైలులో ఉండి వచ్చారు. అప్పటి నుంచీ కేసు కోర్టుల్లో నలుగుతూనే ఉంది. ఏడాదిన్నర కాలంగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్‌లో తుది తీర్పు ఇచ్చే సమయంలో... కేసు నుంచి బయటపడేందుకు తోట త్రిమూర్తులు కొత్త ఎత్తుగడ వేశారు. ఎస్సీలు కాదని నిరూపించేందుకు.. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని శిరోముండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిరోముండనం బాధితులు అసలు దళితులే కాదని, క్రైస్తవ మతం స్వీకరించారని, ‘బీసీ–సి’ వర్గానికి చెందినవారని నిరూపించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పావులు కదిపారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్, గ్రామ వీఆర్వోలను సెలవుపై పంపించారు. తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా బాధితులు ఎస్సీలు కాదని, క్రైస్తవ మతం స్వీకరించారంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులు గ్రామంలోని తన పాలేరు కాలుకుర్చ జీవరత్నంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయించారు. దీనికి సాక్ష్యంగా స్మశానంలో బాధితుడు కోటి చినరాజు తల్లి నాగమ్మ సమాధి అంటూ శిలువ ఉన్న ఒక పాత సమాధి ఫొటోను జత చేశారు. బాధితులు చినరాజు, వెంకటరత్నంలు రామచంద్రపురంలోని ఏసు ప్రేమాలయం చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించారని, అందుకు తానే సాక్ష్యమని పాస్టర్ పేరిట ఎన్.శామ్యూల్ రాజు అనే వ్యక్తితో చెప్పించారు. ఆ వివరాలతో బాధితులు క్రైస్తవ మతానికి చెందినవారేనని తహసీల్దార్, ఆర్డీవోలు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన 18 దళిత సంఘాల నేతలు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి తహసీల్దార్‌ను, ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులను, గ్రామస్తులను విచారించారు. ఈ విచారణలో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. బాధితులు ఎస్సీలు కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కమిటీ సభ్యులు సేకరించారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి వెంకటాయపాలెం గ్రామ స్మశానంలో ప్రొద్దోకు లక్ష్మి క్రైస్తవ మహిళ సమాధి ఉంది. దానిపై శిలువ, ముందు వైపున ఆమె పేరుతో శిలాఫలకం ఉంది. అదే సమాధి వెనుక వైపున కోటి నాగమ్మ పేరిట మరో శిలాఫలకాన్ని అతికించి, దానిని ఫొటో తీసి, జాయింట్ కలెక్టర్ కోర్టుకు సమర్పించారని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గుర్తించారు. అలాగే, శామ్యూల్‌రాజు అనే పాస్టర్ తమ చర్చిలో లేరని ఏసు ప్రేమాలయం చర్చి నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి, క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా దళితులకు అన్యాయం చేసేలా నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా బాధితులకు ఎస్సీ కుల ధ్రువపత్రాలను అందించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును పదవి నుంచి తొలగించాలని, తప్పుడు నివేదిక ఇచ్చిన తహసీల్దార్, ఆర్డీవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
తప్పుదోవపడుతున్న శిరోముండనం కేసు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి, అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కేసు నుంచి బయట పడడానికి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లాలోని 18 దళిత, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. బాధితులు ఎస్సీ కులానికి చెందినవారు కాదని, క్రైస్తవులుగా చిత్రించి, వారికి బీసీ సీ గా గుర్తించేలా చేయాలని చూస్తున్నారని ఆ సంఘాల నాయకులు ఆరోపించారు. నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడిన వారు విచారణ చేసి తమ నివేదికను ద్రాక్షారామలో గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయం వద్ద శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నం కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించిందన్నా రు. దీంతో మనుగడలో లేని ఒక పాస్టర్ ద్వారా బాధితులు బాప్తిజం తీసుకుని క్రైస్తవ మతం స్వీకరించారని, గ్రామంలోని కొందరితో క్రైస్తవులని చెప్పించారని, ఆ గ్రామంలో ఎటువంటి విచారణ చేయకుండానే స్థానిక తహసీల్దార్, ఆర్డీఓల చేత జాయింట్ కలెక్టర్‌కు గతంలో బాధితులు మోసం చేసి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నట్లుగా నివేదిక ఇప్పించారని విచారణలో తేలిందన్నారు. అధికారులను పావులుగా వాడుకుని కేసు నుంచి బయట పడాలని చూస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ప్రభుత్వం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించిన తహసీల్దార్, ఆర్డీఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు సహకరించిన నకిలీ పాస్టరు ఎన్.సామ్యూల్, కాలకుర్చ జీవరత్నం, పువ్వుల వెంకటరమణ, కనికెల్ల గణపతి, గొల్ల సాల్మన్ రాజుపై చీటింగ్ కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేయాలన్నారు. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మనోహర్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు, భారత కార్మిక సంఘాల సమైఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకట్ల వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.తిరుపతిరావు, దళిత సంఘం జిల్లా నాయకుడు దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు, మాదిగ దండోరా జిల్లా ఉపాధ్యక్షుడు మందపల్లి చిట్టిబాబు, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జి.రమ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.రాఘవులు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోనాల లాజర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు దమ్ము కృష్ణరాజు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం, జై భీం దళిత సేవా సంఘం అధ్యక్షుడు గుబ్బల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
‘దళిత ద్రోహం అని పెట్టుకోండి’
సాక్షి, విజయవాడ : ‘దళిత తేజం-తెలుగుదేశం’ పేరు కాదు దళిత ద్రోహం-తెలుగుదేశం అని పేరు మార్చుకోవాలని టీడీపీ ప్రభుత్వానికి సూచిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. కడప జిల్లా దళిత తేజం సమావేశంలో దళితులు కింద కూర్చుంటే టీడీపీ నేతలు కుర్చీల్లో కూర్చుంటారా, ఇంకెన్నాళ్లీ అస్పృశ్యత, అంటరానితనమని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీలో దళిత నేతలు సిగ్గుతో తలదించుకోవాలని, దళితులకు ఘోర అవమానం జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనా విధానం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. సమస్యలపై ప్రతిపక్షం అడిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు. బాబు పాలనలో దళిత సంక్షేమం అటకెక్కిందని, దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా చంద్రబాబు స్పందించరని ధ్వజమెత్తారు. చంద్రబాబు మీకు దళితులంటే ఎందుకు చిన్న చూపు అని సూటిగా ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా టీడీపీలో ఉన్న దళిత మంత్రులు, నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ దళితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌జిల్లా చాపాడు మండలంలోని చియ్యపాడు గ్రామంలో ఆదివారం టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో జరిగిన దళిత తేజం–తెలుగుదేశం కార్యక్రమంలో కుర్చీలలో కూర్చున్న అగ్రవర్ణ టీడీపీ నాయకులు, వేదిక ముందు కింద కూర్చున్న చియ్యపాడు దళిత మహిళలు. -
దళితులను దగా చేసేందుకే ‘దళిత తేజం’
కడప కార్పొరేషన్: దళితులను దగా చేసి మళ్లీ ఓట్లు దండుకోవడానికే తెలుగుదేశం పార్టీ దళిత తేజం కార్యక్రమం నిర్వహిస్తోందని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు త్యాగరాజు, యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు దండుకోవడానికి పెద్దమాదిగనవుతా అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వారిని అవమాన పరిచారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారని, ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళిత వాడల్లో ఉచిత విద్యుత్ ఇస్తుంటే, ఈ ప్రభుత్వం వచ్చాక దళితుల ఇళ్లకు కరెంటు కట్ చేసి, వారిపై కేసులు నమోదు చేయిస్తోందని మండిపడ్డారు. ఇన్ని విధాలుగా దళితులను దగా చేస్తున్న తెలుగుదేశం పార్టీకి దళిత తేజం కార్యక్రమం నిర్వహించే అర్హత ఉందా అని సూటిగా ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే టీడీపీ నాయకులకు దళితుతు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. -
ఏమీ చేయవ్.. ఎలా ఉన్నారని అడుతావా?
పుట్లూరు(యల్లనూరు): శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినిబాలకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ‘దళిత తేజం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండలంలోని ఎల్లుట్ల గ్రామానికి వచ్చిన ఆమె, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రచ్చకట్ట వద్ద ఉన్న మహిళలను ఉద్దేశించి.. ‘‘అందరూ... బాగున్నారా... ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయా’’ అని ప్రజలను అడిగారు. అక్కడే ఉన్న ఓ మహిళ మాట్లాడుతూ ‘‘గతంలో ఆరోగ్యం బాగా లేకపోతే ప్రభుత్వ సహాయం కోసం మీ దగ్గరకు వచ్చా...మీరు మా టీడీపీ కార్యకర్తలు కాదని వెనక్కిపంపారు. ఇప్పుడొచ్చి బాగున్నారా అని అడుగుతున్నారు’’ అని ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న మరో మహిళ ‘‘మేము గత ఐదేళ్లుగా ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నా...ఇంత వరకు ఇల్లు మంజూరు కాలేదు’’ అంటూ ఎమ్మెల్యే ముఖంపైనే చెప్పేసింది. ఇక ఉద్యానవన శాఖకు సంబంధించిన పథకాలన్నీ టీడీపీ నాయకులకే మంజూరు చేస్తూ రైతులందరిని నాశనం చేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడిన యామినీ బాల అక్కడి నుండి చల్లగా జారుకున్నారు. -
‘ఆయన ఆలోచనలతోనే కేసీఆర్ సంస్కరణలు’
– మంత్రి జగదీశ్ రెడ్డి ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ సంస్కరణలు చేపడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..విద్యా, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిస్తే అంటరానితనాన్ని పొగొట్టవచ్చన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. ఈ దిశలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దళిత విద్యార్థుల విద్య కోసం సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. పాఠశాలల్లోనూ 7 రోజులు పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. దళితుల్లో సాధికారత సాధించడమే మా లక్ష్యం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల రక్షణకై తీసుకుంటున్న చర్యల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఎస్సీలపై జరిగిన దాడుల్లో నమోదైన కేసుల పరిష్కారంలో మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు. పీసీఆర్ అండ్ పీఓఏ చట్టాల అమలులో తెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. 20 శాతం కేసులను పరిష్కరించిన రాష్ట్రం ఒక్క తెలంగాణనే అని అన్నారు. బాధితులకు ఆర్థిక సాయం, కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. పాత జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాలో ఒక కోర్టు, 9 మొబైల్ కోర్టులను ఏర్పాటు చేసినట్ల మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. -
దళితులపై దాడులు చేస్తూ దళిత తేజమా?
విజయవాడ : దళితులపై దాడులు చేస్తూ టీడీపీ దళిత తేజం కార్యక్రమం చేయడం సిగ్గుచేటని ఏపీసీసీ ప్రధానకార్యదర్శి మీసాల రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితులపై దాడులు చేస్తూ ఏ మొహం పెట్టుకుని టీడీపీ నేతలు దళితుల దగ్గరకు వెళ్లారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో దళితులపై విపరీతంగా దాడులు పెరిగాయన్నారు. గరపగర్రు, దేవరపల్లి, జెర్రిపోతులపాలెం, పెడగట్టుపాడుల్లో దళితులపై జరిగిన దాడులకు సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక బ్యాక్ లాగ్ పోస్టు కూడా భర్తీ చేయలేదని వెల్లడించారు. చంద్రబాబు ఎస్సీ సబ్ ప్లాన్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. -
'చంద్రబాబు ముమ్మాటికి దళిత ద్రోహే'
-
సిగ్గు పడదాం దళిత కంఠంపై వెలి ఖడ్గం
మహిళ అంటే ఈ దేశంలో వివక్ష... దళితులంటే ఈ సంఘంలో వివక్ష.మరి దళిత మహిళ అయితే?... బహిష్కారం ఒక ఆయుధం.బహిష్కరించడం ఒక పంజరం... మాట చెల్లుబాటు కావడానికి ఈ జులం. పైచేయి సాధించడానికి ఈ దౌర్జన్యం... ఇంకానా... ఇప్పుడు కూడానా?... సిగ్గు పడదాం. గ్రామానికి ప్రథమ పౌరురాలు ఆమె. ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామస్తులంతా కలిసి ఓట్లేసి గెలిపించిన సర్పంచ్. అలాంటి ప్రజాప్రతినిధినే ఇప్పుడు ఆ గ్రామం నుంచి బహిష్కరించారు. సాధారణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులొస్తే ముందుగా గుర్తొచ్చేది గ్రామ సర్పంచ్. మరి అలాంటి ప్రజాప్రతినిధినే ఓ భూవివాదం విషయమై గ్రామం నుంచి వెలివేయడం అమానవీయం. ఆమెతో ఆమె కుటుంబసభ్యులతో గ్రామస్తులెవరూ మాట్లాడవద్దని, ఆమె పొలాలకు ఎవరూ పనులకు వెళ్లద్దని, పండగలు, శుభకార్యాలకు పిలవొద్దని హుకూం జారీ చేశారు. కొన్ని నెలలుగా సంఘ బహిష్కరణకు గురి చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్ జక్కుల మమత ఉదంతం ఇది. ఏం జరిగింది? బుస్సాపూర్ గ్రామ శివారులో మమత పూర్వికుల పేరుతో 3 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు మమత భర్త శ్రీనివాస్ తాతల పేరుతో ఉన్నాయి. గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ భూమి ఇప్పుడు రూ.కోట్లు పలుకుతోంది. ఈ భూమిపై కొందరు గ్రామ పెద్దలు కన్నేశారు. ఎలాగైనా ఈ భూమిని మమత కుటుంబానికి దక్కకుండా చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు. భూమి తమది కాదని చెప్పమంటూ రెవెన్యూ రికార్డులపై ఆ మేరకు సంతకాలు పెట్టాలని పలుకుబడి కలిగిన పెద్దలు మమత భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చారు. ‘మీ పూర్వికులు మీ భూమిని మాకు విక్రయించారు. అందుకోసం ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సంతకాలు చెయ్యి’ అని సర్పంచ్ భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు శ్రీనివాస్ నిరాకరించడంతో 2017 అక్టోబర్ 29న సర్పంచ్ మమత కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేశారు. ఆమెతో, ఆమె భర్త శ్రీనివాస్‌తో ఎవరైనా మాట్లాడినా, తిరిగినా, భోజనం చేసినా రూ.ఐదు వేల జరిమానా ఉంటుందని తీర్మానం చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కందూరు చేయగా.. సర్పంచ్ భర్త శ్రీనివాస్‌ను భోజనానికి పిలిచారు. మరొకరు దుర్గామాత పూజ, సత్యనారాయణ వ్రతం సందర్భంగా శ్రీనివాస్‌ను ఆహ్వానించారు. శ్రీనివాస్‌ను ఆహ్వానించిన ముగ్గురిపై గ్రామపెద్దలు ఒత్తిడి తెచ్చారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడంతో వారు మమత కుటుంబసభ్యులను దూరంగా ఉంచారు. అభివృద్ధి పనులకూ ఆటంకాలు.. గ్రామంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులతో సర్పంచ్ మమత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులకు ఎంబీ రికార్డులు చేయకుండా గ్రామ పెద్దలు సంబంధిత అధికారులను అడ్డుకున్నారు. దీంతో మూడు నెలలుగా తమకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయని మమత వాపోతున్నారు. గ్రామపంచాయతీ రికార్డుల్లో కూడా ఎలాంటి తీర్మానాలు చేయవద్దని పంచాయతీ సిబ్బందిని సైతం ఆదేశించారని మమత ఆవేదన వ్యక్తంచేశారు. – పాత బాలాప్రసాద్ పొలం పనులకూ ట్రాక్టర్లను రానిస్తలేరు పొలంలో నాట్లు వేసుకోవాలని అనుకున్నాం. దమ్ము కొట్టేందుకు గ్రామంలోని ఓ ట్రాక్టర్ యజమానిని అడిగితే. ఆదివారం ట్రాక్టర్ పంపుతానని చెప్పారు. 17 మంది కూలీలను కూడా పిలుచుకుని సిద్ధంగా ఉన్నాం. సర్పంచ్ పొలంలో పనికి వెళితే రూ.ఐదు వేలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ట్రాక్టర్ యజమానిని హెచ్చరించడంతో ఆయన ట్రాక్టర్‌ను పంపలేదు. నిర్మల్ జిల్లా సోన్‌పేట్ నుంచి ట్రాక్టర్‌ను కిరాయికి తెచ్చుకుని నాట్లు వేసుకోవాల్సి వచ్చింది. ఇట్ల మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. – జక్కుల మమత, సర్పంచ్ -
జిగ్నేష్...అంబేడ్కర్‌ను విమర్శించడమా!?
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన దళిత నాయకుడు జిగ్నేష్ మెవానీపై సోషల్ మీడియా శుక్రవారం నాడు దుమ్మెత్తి పోసింది. ‘జిగ్నేష్ మెవానీ దళిత అరాచకవాది, హిందువుల మధ్య చిచ్చు పెట్టడం వల్ల భారత్‌ను అస్థిరం చేయాలనుకుంటున్నారు. ఆయన టెర్రిరిస్టులకన్నా ప్రమాదకారి. ఆయన ఇంకెంత మాత్రం దళితుల ప్రతినిధి కాదు. బీఆర్ అంబేడ్కర్, మాయావతిలను ఎలా విమర్శించారో చూడండీ!.....అంబేడ్కర్, కాన్షీరామ్, మాయావతిలు తనకన్నా గొప్పవారు, మంచివారు కాదని జిగ్నేష్ మెవానీ అనుకుంటున్నారు, దళితులను ద్వేషిస్తున్నారు. ముల్లాలను తప్ప అందర్ని ద్వేషించాల్సిందిగా కమ్యూనిస్టులు ఆయనకు నూరిపోసినట్టున్నారు..... జిగ్నేష్ మెవానీ కమ్యూనిస్టులకు, రాజదీప్ సర్దేశాయ్‌కి డార్లింగ్ కావచ్చు. ఎప్పుడయితే ఆయన అంబేడ్కర్‌ను తక్కువ చేసి మాట్లాడారో, కాన్షీరామ్, మాయావతి లాంటి వారిని కించపరిచారో ఉపేక్షించరాదు.....’ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దళితుల హక్కుల గురించి పోరాడుతున్న జిగ్నేష్ నిజంగా దళితులను కించ పరుస్తూ మాట్లాడారా? ఆయన మాట్లాడిన దానిలో దళితులకు, ఇతరులకు ఆగ్రహం తెప్పించిన అంశాలు ఏమున్నాయి? ఆయన హైదరాబాద్‌లోని లామాకాన్‌లో దళితులు, కమ్యూనిస్టులకున్న సారూప్యత, ఏయే అంశాలపై ఇరువురు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు? ఎవరు ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? దేశంలో కుల, వర్గ రహిత సమాజం ఏర్పడాలంటే ఇరువర్గాలు కలిసి పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతుంది ? అన్న అంశాలపై దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన మొత్తం ప్రసంగంలో ఎక్కడా దళిత ధ్రువ తారలనుగానీ, నాయకులనుగానీ కించపరుస్తూ మాట్లాడలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ట్వీట్లు చేశారో గమనిస్తే మనకే అర్థం అవుతుంది. దళితుల కంటే ఇతరులే ఎక్కువగా దళితుల పక్షాన విమర్శలు చేశారు. దళితులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేయడంలో ముందుండే కొన్ని ఆంగ్ల టీవీ ఛానళ్లయితే ఉన్నవి, లేనివి మాట్లాడుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎవరో కొందరు వ్యక్తులు జిగ్నేష్ మెవానీ ప్రసంగం వీడియోను తప్పుడు అర్థం వచ్చేలా అసంబద్ధంగా ఎడిట్ చేసి ప్రసారం చేయడం వల్ల ఈ రాద్ధాంతం జరుగుతోంది. ‘కుల, మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న వామపక్షాలు మనకు సహజమైన మిత్రులు. ఈ విషయాన్ని దళితులు అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో డాక్టర్ అంబేడ్కర్‌కు భిన్నమైన అభిప్రాయం ఉన్నాగానీ నా అభిప్రాయం మారదు. ముందు వర్గ రహిత సమాజం కోసం పోరాడితే కులం దానంతట అదే కనుమరుగవుతుందని, కాకపోతే ఆ తర్వాత కుల రహిత సమాజం కోసం పోరాడవచ్చన్నది కమ్యూనిస్టుల అభిప్రాయం. కుల వివక్ష దారుణాలకు దగ్ధమవుతున్నందున ముందుగా కుల రహిత సమాజం కోసమే పోరాడాలన్నది అంబేడ్కర్‌వాదుల అభిప్రాయం. నా ఉద్దేశంలో కులం, వర్గం అనేవి ఒకదానికొకటి ముడివడిన అవిభాజ్య అంశాలు. వీటి నిర్మూలనకు ఒకేసారి పోరాటం ప్రారంభించాలి. ఇందుకోసం అవసరమైతే కమ్యూనిస్టులు ఓ పక్క, దళితులు ఓ పక్క కూర్చొని సుదీర్ఘ చర్చల ద్వారా ఓ కార్యాచరణకు రావాలి. ఈ రెండు వర్గాలు కలిసి పోరాడినప్పుడే భారత్‌లో కుల, వర్గ రహిత సమాజం ఏర్పడుతుంది’ అంటూ ఓ సందర్భంలో జిగ్నేష్ వ్యాఖ్యానించారు. ‘ఆల్టర్ న్యూస్ డాట్ కామ్’ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హాను ఓ వెబ్ఫ్లాట్ ఫామ్‌పై ‘ఆయనో సిన్హా’ అని ఓ దళితుడు విమర్శించిన సందర్భాన్ని జిగ్నేష్ ప్రస్తావిస్తూ ‘నేను ఓ దళిత కుటుంబంలో పుట్టటం నా తప్పు కానప్పుడు, సిన్హా ఆయన ఇంట్లో పుట్టడం మాత్రం ఆయన తప్పెలా అవుతుందీ? ఇదంతా చెత్త. ఇదంతా బ్రాహ్మణిజమే. బ్రాహ్మణుల్లో ఉండే మనువాది తత్వం అంబేద్కర్ వాదుల్లో కూడా ఇంకా ఇమిడి ఉండడం వల్ల ఇలాంటి విమర్శలొస్తున్నాయి. ఆ భావజాలం నుంచి మనమూ బయటపడాలి’ అన్నారు. ఈ రెండు సందర్భాల్లోని మాటలనే కాకుండా ఇతర సందర్భాల్లోని ఆయన మాటలను తీసుకొని తప్పుడు అర్థం వచ్చేలా వీడియోను ఎడిట్ చేసి ఎవరో దురుద్దేశపూర్వకంగా సోషల్ మీడయాలో పోస్ట్ చేశారు. ఎవరైనా జాగ్రత్తగా ఎడిట్ చేసిన మీడియాను చూసి పొరపాటు పడి లేదా తొందరపడి విమర్శలు చేయడం సహజం. ఇలాంటి సమయాల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు అసలు వీడియోలను వెలుగులోకి తీసుకరావడం ఓ వెబ్సైట్ సామాజిక బాధ్యత. -
దళితులపై టీడీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
-
మహారాష్ట్రలో చిచ్చు పెట్టిన ‘ఫేస్బుక్ పేజీ’
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర దళితుల ఆందోళనతో దద్ధరిల్లిపోవడానికి దారితీసిన భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు? కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన భీమా కోరేగావ్ స్థూపం వద్ద ప్రశాంతంగా జరిగే సైనిక సంస్మరణ కార్యక్రమం ఎందుకు ఉద్రిక్తతలకు దారితీసింది? కాషాయ వస్త్రాలు, జెండాలు ధరించిన మరాఠా మూకలు దాడి చేశారంటూ నీలి రంగు జెండాలతో దేశం నలుమూలల నుంచి వచ్చిన దళితులు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఊరూరు నుంచి తరలి వచ్చింది దళితులేనని, ఒక్క ఊరి వారమైనా తాము పరిమిత సంఖ్యలో ఉండి దాడులకు ఎలా సాహసిస్తామని అంటున్న స్థానిక మరాఠాల మాటల్లో నిజమెంత? మహారాష్ట్రలోని పుణె నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భీమా నది ఒడ్డునున్న కోరేగావ్ గ్రామంలో నాటి నుంచి నేటి వరకు మరాఠాలు, పెషావర్లు, దళితులు ఎక్కువే. 200 సంవత్సరాల క్రితమ అగ్రవర్ణానికి చెందిన పెషావర్ల సైన్యాన్ని బ్రిటీష్ సైన్యంతో కలసి దళితులైన మహర్లు తరిమికొట్టారు. దళితులైనప్పటికీ నాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం వారిని తమ సైన్యంలో చేర్చుకొంది. (సాక్షి ప్రత్యేకం) అప్పటికే సామాజిక న్యాయం కోరుతున్న దళితులు తమకు ఉద్యోగం ఇచ్చిందన్న కతజ్ఞతతో, పెషావర్లపై నున్న ఆగ్రహంతో బ్రిటీష్ సైన్యంతో కలిసి యుద్ధం చేశారు. అందులో ప్రాణాలు కోల్పోయిన దళిత హీరోల స్మారకార్థం భీమా కోరేగావ్‌లో 1851లో స్థూపం వెలిసింది. కాషాయ జెండాలు కలిగిన హిందూ సంఘాలు తమపై దాడి చేశాయంటూ ఇటు దళితులు, నీలి జెండాలు కలిగిన దళితులే దాడులు చేశారంటూ మరాఠా, ఇతర హిందూ సంస్థల నాయకులు పరస్పరం ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు ఇవిగో అంటూ ఇరువర్గాల వారు వీడియో రికార్డింగ్‌లను చూపిస్తున్నారు. వాటిల్లో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడం, ఘర్షణ పడడం కనిపిస్తోంది. స్థానికంగా ఇరువర్గాల ఇళ్లు, దుకాణాలు తగులబడుతూ కనిపిస్తున్నాయి. పోలీసులకు ఇరువర్గాల వారు ఘర్షణ పడుతున్నారని చెబుతున్నారుగానీ, అసలు ఉద్రిక్తతలకు ఎవరు బాధ్యులన్న విషయాన్ని స్పష్టం చేయడం లేదు. మొత్తంగా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ ఉద్రిక్తలకు వారం రోజుల క్రితమే బీజాలు పడ్డాయని, వ్యూహం ప్రకారం గత వారం రోజులుగా ‘ఫేస్బుక్’లో జరుగుతున్న ప్రచారమే ఈ ఉద్రిక్తతలకు దారితీసిందని స్పష్టం అవుతోంది. కొంత మంది ఔత్సాహిక చరిత్రకారులు ఫేస్బుక్లో నడుపుతున్న ‘ఇతిహాస ఫాల్ఖుదా’ అనే మరాఠా పేజీ నేటి ఉద్రిక్తతలకు కారణమైంది. ‘భీమా కోరేగావ్’ చరిత్రతో దళితులైన మహర్లకు ఎలాంటి సంబంధం లేదని, భీమా కోరేగావ్ యుద్ధం కేవలం పెషావర్లకు, బ్రిటీష్ సైన్యానికి మధ్య జరిగినది మాత్రమేనని ఆ మరాఠా పేజీలో ఔత్సాహిక చరిత్రకారులు వాదించారు. ఆ యుద్ధం గురించి ప్రస్తావించిన బ్రిటిష్ డాక్యుమెంట్లను సాక్షంగా చూపారు. మహర్లు నిజంగా యుద్ధం చేసి ఉంటే బ్రిటిష్ డాక్యుమెంట్లలో వారి ప్రస్తావన ఉండేదని తర్కం తీసుకొచ్చారు. మహర్ రెజిమెంట్ ఏర్పాటు కాకముందే దాదాపు 500 మంది మహర్లు బ్రిటిష్ తరఫున పోరాటం చేశారని, (సాక్షి ప్రత్యేకం) అందుకు భారత చరిత్రలో సాక్ష్యాధారాలు ఉన్నాయని సావిత్రిభాయ్ ఫూలే పుణే యూనివర్శిటీలో చరిత్ర విభాగం ప్రొఫెసర్ శ్రద్ధా కుంభోజ్కర్ తెలిపారు. బ్రిటీష్ డాక్యుమెంట్లు తమ సైన్యం చేసిన యుద్ధాల గురించి చెబుతుందిగానీ, ఆ యుద్ధంలో మహర్లు పాల్గొన్నారా? మరొకరు పాల్గొన్నారా? అన్న విషయాన్ని ఎందుకు పేర్కొంటుందని ఆమె ప్రశ్నించారు. అగ్రవర్ణాలపై యుద్ధం చేయడానికి భీమా కోరేగావ్ దళితులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, అంతటి స్ఫూర్తినిచ్చిన యుద్ధంతో వారికి సంబంధం లేదంటూ చరిత్రకు మరోరూపం ఇచ్చేందుకు ఈ ఫేస్బుక్ పేజి ప్రయత్నించినట్లు అర్థం అవుతోందని ప్రొఫెసర్ వివరించారు. దేశంలో గత రెండు, మూడేళ్లుగా చరిత్రకు మరో భాష్యం చెప్పే ప్రయత్నాలు ఎక్కువగానే కొనసాగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చరిత్రో పెషావర్లు చేసిన అన్ని యుద్ధాలతోపాటు భీమా కోరేగావ్‌లో మహర్లతో పెషావర్లకు మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా ‘మంత్రవేగ్ల’ పుస్తకంలో రచయిత ఎన్ఎస్ ఇనాంధర్ వివరించారు. (సాక్షి ప్రత్యేకం) ఫేస్బుక్ మరాఠా పేజీలో వారం, పది రోజుల నుంచి జరుగుతున్న చర్చను చదువుకున్న నేటి దళిత యువతలో కొంత మంది తీవ్రంగానే ఖండించారు. ఈసారి పెద్ద ఎత్తున స్మారక దినోత్సవం జరుపుకోవాలని కూడా దళిత సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా ఎక్కువ మంది దళితులు కోరేగావ్ తరలి వచ్చారు. -
ముంబైలో మరాఠాలు, దళితుల మధ్య ఘర్షణలు
-
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. రేపు రాష్ట్ర బంద్!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హింస వాతావరణం నెలకొంది. దళితులు, మరాఠాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఈ గొడవలో ఒకరు మృతిచెందగా, పలువరికి గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ముంబై, పుణె, ఔరంగాబాద్‌లో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. వారి ఆగ్రహజ్వాలలకు పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల మధ్య గొడవల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ప్రజలు ఆందోళనలు మిరమించి, శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. ఈ హింసాత్మక ఘటన వెనుక ఉన్నదేవరో తేల్చేందుకు ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దళిత సంఘాలు రేపు మహారాష్ట్రలో బందుకు పిలుపునిచ్చాయి. -
ఏపీ భవన్ సాక్షిగా బయటపడ్డ కులోన్మాదం
న్యూఢిల్లీ : ఏపీ భవన్ సాక్షిగా కులోన్మాదం బయటపడింది. అధికారుల మధ్య వాట్స్ అప్ గ్రూపులో మాటల యుద్ధం మొదలైంది. దళిత, అగ్రవర్ణ వర్గాల అధికారులుగా ఏపీ భవన్ చీలిపోయింది. ఈనెల 17న తనకు పదోన్నతి దక్కకుండా కొందరు అగ్రకుల అధికారులు అడ్డుకున్నారని ఏపీ భవన్ దళిత ఉద్యోగి ఆనంద రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకే సింఘాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న సమయంలో 3 సహాయ కమిషనర్లు, ఒక జాయింట్ కమిషనర్ పోస్ట్ మంజూరు చేయాలని సిఫార్సు చేశారని, అయితే సహాయ కమిషనర్ పోస్టులు రెండుకు కుదించేలా అగ్రకుల అధికారులు ఒత్తిడి చేశారని, తద్వారా తనకు ఆ పదోన్నతి దక్కకుండా అడ్డుకున్నారని ఆనందరావు మెసేజ్ పెట్టారు. ప్రాప్తం లేనప్పుడు ఏమి చేసినా ఉపయోగం లేదని, క్షీరసాగర మధనంలో రాక్షసులు ఎంత కష్టపడ్డా ప్రాప్తం లేకపోయింది అని డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ ఎద్దేవా చేస్తూ మెసేజ్ చేశారు. సూర్యనారాయణ మెసేజ్‌తో దళిత ఉద్యోగులు మనస్తాపం చెందినట్లు తెలిసింది. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు దళిత ఉద్యోగి ఆనంద రావు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. -
దొరల రాజ్యం ఒక కట్టుకథ: సీపీ కార్తికేయ
సాక్షి, నిజామాబాద్ : దళితులను అవమానించిన కేసులో బీజేపీ మాజీ నాయకుడు భరత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. విలేకరులతో నిజామాబాద్ సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. దొరల రాజ్యం సినిమా ఒక కట్టుకథ అని తేల్చారు. అక్రమంగా మొరం తరలిస్తున్నందుకే అభంగపట్నం దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్ రెడ్డి అవమానించాడని పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కేసరికి సినిమా షూటింగ్ అని కొత్త నాటకానికి తెరలేపాడని వెల్లడించారు. పోలీసులకు దొరక్కుండా హైదరాబాద్, జోగులాంబ, హంపి, కడప ప్రాంతాల్లో బాధితులను వెంట వేసుకొని తిప్పాడని వివరించారు. భరత్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెడతామని, మరింత విచారణ కోసం కస్టడీ కోరతామని తెలిపారు. అభంగపట్నంలో పికెటింగ్ కొనసాగిస్తామని, అవసరం అయితే మరింత పెంచుతామని సీపీ వెల్లడించారు. -
ఆ ఇద్దరు దళితులు ఏమయ్యారు?
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఘటన వెలుగుచూసి 12 రోజులు అవుతున్నా.. దళితులను దారుణంగా అవమానించిన బీజేపీ నేత భరత్‌రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు తాజాగా మరో పోలీసు బృందం రంగంలోకి దిగింది. దీంతో మొత్తం మూడు ప్రత్యేక బృందాలు భరత్‌రెడ్డి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ కేసులో అదృశ్యమైన ఇద్దరు దళిత బాధితులు ఆచూకీ కూడా తెలియడం లేదు. 11 రోజులైనా వారు కనిపించకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దళితులు ఇద్దరినీ భరత్ రెడ్డే కిడ్నాప్ చేయించాడని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. భరత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, అజ్ఞాతంలో ఉన్న భరత్‌రెడ్డి స్థావరాలు మార్చుతూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం. అదృశ్యమైన ఇద్దరు దళితులు కూడా భరత్ రెడ్డి వద్దే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దళితులు ఎంత వేడుకున్నా వినిపించుకోని అతను.. కర్రతో వారిని బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
దళిత, గిరిజనులపై పెరిగిన దాడులు
చీరాల టౌన్: ‘గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళిత, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయింది. తనను వేధించి అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని రోడ్డెక్కిన గిరిజన జెడ్పీటీసీ సభ్యురాలి దీక్షను బలవంతంగా పోలీసులు భగ్నం చేయడం దారుణం. నియోజకవర్గంలో నియంతపాలన సాగిస్తున్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అరాచకాలు అడ్డుకుంటాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త వరికూటి అమృతపాణి అన్నారు. వేటపాలెం జెడ్పీటీసీ సభ్యురాలు కొమరగిరి విజయను వేధించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అఖి లపక్షం నాయకుడు గోసాల అశీర్వాదం అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు పలు ప్రజా, కుల, రాజకీయ పార్టీలు, కుల నిర్మూలన సమితి నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన డాక్టర్ అమృతపాణి మాట్లాడుతూ గిరి జన ప్రజాప్రతినిధిపై ఎమ్మెల్యే, అతని అనుచరులు అవలంబిస్తున్న విధానాలు బాధాకరమరన్నారు. జెడ్పీటీసీకి కేటాయించిన రూ.30 లక్షల నిధులను ఆమెకు తెలియకుండా ఖర్చు చేసుకోవడంతో పాటు ఆమె దీక్షను భగ్నం చేసి ఏరియా వైద్యశాలకు తరలించడం అన్యాయమన్నారు. జెడ్పీటీసీ తన తప్పును ఒప్పుకుని ఎమ్మెల్యేకు సాగిలపడి క్షమాపణలు చెప్పాలని, లేకుంటే కుల బహిష్కరిస్తామని ప్రకటించడం చట్టాలను అతిక్రమించడమేనని, కులం నుంచి బహిష్కరించే హక్కు ఎవరికీ లేదని, ఆ వాఖ్యలు చేసిన వారిపై అట్రా సిటీ కేసు నమోదు చేసి ఖఠినంగా శిక్షిం చాలని అమృతపాణి డిమాండ్ చేశారు. దళిత ఎంపీ శీరాం మాల్యాద్రిపై అక్కసుతో ఎమ్మెల్యే ఆమంచి రూ.1.45 కోట్ల ఎంపీ నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం దారుణమన్నారు. గిరిజన జెడ్పీటీసీ నిధులు అక్రమంగా వినియోగించడంతో పాటు ప్రొటోకాల్ ను విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొమరగిరి విజయకు న్యాయం చేసే వరకు ఆమెకు అండగా ఉంటామన్నారు. విజయ మాట్లాడుతూ తన మండలం లో అభివృద్ధి పనులకు జడ్పీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయిస్తే తనకు తెలియకుండా వేటపాలెం సర్పంచ్, ఇత ర నాయకులు ఖర్చు చేశారని, ఇదేంటని ప్రశ్నిస్తే అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. అధికార పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి జెడ్పీటీసీగా తాను విజయం సాధించానని, ఒక పార్టీపై గెలిచి మరొక పార్టీలోకి తాను వెళ్లలేదని పరోక్షంగా ఎమ్మెల్యే ఆమంచిని ఉద్దేశిం చి వ్యాఖ్యానించారు. నిధుల వినియోగాలకు సంబంధించి తనకు తీర్మానాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తనకు జరిగిన అన్యాయాన్ని జెడ్పీ చైర్మన్‌కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాలను సీఎంకు వివరిస్తానని విజయ పేర్కొన్నారు. అనంతరం పలు ప్రజాసంఘాల నాయకులు తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. ఎంపీపీ జి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు కట్టా గంగయ్య, ప్రజా, కుల సంఘాల నాయకులు కుంచాల పుల్లయ్య, ఎన్.మోహన్‌కుమార్ ధర్మా, గుమ్మడి ఏసురత్నం, పొదిలి ఐస్వామి, పి.రాజు, చుండూరు వాసు పాల్గొన్నారు. -
దళితుల మనోభావాలకు సమాధి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ గ్రామంలోని దళితులకు తీరని మనోవేదనను మిగుల్చుతోంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న రోడ్డును అధికార పార్టీకి చెందిన నేతకు పట్టాగా రాసి ఇచ్చారు. సీఎం రాక కోసం రాత్రికి రాత్రే శ్మశానాన్ని ఆక్రమించి, శవాలను సైతం పెకలించి తారురోడ్డు వేస్తున్నారు. మనోభావాలు దెబ్బతిన్న దళితులు ఈ నెల 4న సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో పట్టణ నిరుపేదల హౌసింగ్ పథకం కింద దాదాపు 1,724 ప్లాట్లను జీ+3 పద్ధతిలో నిర్మించారు. వీటిని ఈ నెల 4న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి సర్వే నెం.363లోనే రోడ్డును చూపించారు. ఈ ప్లాట్లకే కాకుండా దళితుల పొలాలకు, పైన ఉన్న దాదాపు 50 ఎకరాల్లో వేసిన 10 వెంచర్లకు సైతం ఈ రోడ్డునే చూపించారు. మట్టిగా ఉన్న ఈ రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు పంచాయతీరాజ్ అధికారులు మంగళవారం ప్రయత్నించారు. అయితే ఈ రోడ్డును తిరుపతికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పట్టాగా మార్చుకున్నాడు. తమ పట్టా భూమిలో రోడ్డు ఎలా వేస్తారని అడ్డుకున్నారు. అందేంటి.. 60 ఏళ్లకు ముందు నుంచే రోడ్డుగా ఉంటే పట్టాగా ఎప్పుడు మార్చారు.. అంటూ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ నేతలు హైదరాబాదు స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు వెనకడుగు వేసినట్లు సమాచారం. దళితుల శ్మశానం ఆక్రమణ... ఈ రోడ్డుకు అనుకునే సర్వే నెం.360లో దాదాపు 25 సెంట్లలో తనపల్లి దళితవాడకు శ్మశానం ఉంది. దాదాపు 100 ఏళ్లకు పైనుంచే ఎవరైనా చనిపోతే ఇక్కడే ఖననం చేసేవారు. పాత రోడ్డు స్థలానికి సంబంధించి టీడీపీ నాయకుడికి పట్టా ఉందని చెప్పడంతో, దళితుల శ్మశానం నుంచి రోడ్డు వేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దానిని తనపల్లి దళితులు అడ్డుకున్నారు. పోలీసులతో బెదిరించి, వారిని పక్కకు తప్పించి శ్మశానంలో మూడు అడుగుల మేర మట్టిని తీశారు. ఎముకలు, పుర్రెలు బయటపడ్డాయి. వాటిని తొలగించి రాత్రికి రాత్రే కొత్తగా తారురోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. దీంతో దళితుల శ్మశానం సగానికి పైగా కనుమరుగైంది. మండిపడుతున్న దళిత సంఘాలు శ్మశానాన్ని ఆక్రమించి తారురోడ్డు వేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కోసం దళితుల శవాలపై రోడ్డును వేస్తారా? అని తనపల్లి మాజీ సర్పంచ్ నాగరాజు నిలదీశారు. అధికార పార్టీ నేత కోసమే ఇలా ఎప్పటి నుంచో ఉన్న రోడ్డును పట్టాగా మార్చారని, దళితుల శ్మశానాన్ని ఆక్రమించి పూర్వీకుల జ్ఞాపకాలను సైతం చెరిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రినే నిలదీస్తామని హెచ్చరించారు. -
మనసులు గెలిచిన దళిత అర్చకులు
తిరువనంతపురం : దేశ చరిత్రలో తొలిసారి ఆలయాల్లో దళితులను అర్చకులుగా నియమించి సంచలనం ట్రావెన్కోర్ దేవస్థానంబోర్డు (టీడీబీ) సంచలనం సృష్టించింది. శబరిమల ఆలయం సహా కేరళలోని పలు దేవస్థానాల్లో కొత్తగా 62 మందిని అర్చకులుగా నియమించింది. ఇందులో 36 మంది బ్రాహ్మణేతరులుకాగా.. ఆరుగురు దళితులున్నారు. టీడీబీ నమ్మకాలను, భక్తుల విశ్వాసాలను నిలబెడుతూ.. దళిత అర్చకులు కొత్త చరిత్ర సృష్టించారు. ఎర్నాకుళం జిల్లా అర్కెపాడులోని మహదేవాలయంలో అర్చకునిగా నియమించబడ్డ.. 31 ఏళ్ల మనోజ్ (దళిత అర్చకుడు) టీడీబీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భగవంతుడికి.. ఆయన భక్తులకు సేవలు చేయాలన్న నాకలను టీడీబీ నిజం చేసిందని అన్నారు. భక్తులు నన్ను ఎంతో ఆదరంగా చూస్తున్నారని.. నాతో పూజలు చేయించుకునేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. ‘నేను చిన్నతనంలో మా గ్రామంలోని ఆలయంలో బ్రాహ్మణ పురోహితునికి సేవలు చేసేవాడిని.. ఆయన నన్ను ఏనాడు కులపట్టింపుతో చూడలేదు.. ఆయన దయవల్లే నేను ఈ రోజు ఈస్థానంలోకి రాగలిగాను’ అని ఆనందంగా చెప్పారు. జన్మతో కులాన్ని చూడకుండా.. గుణాలతో చూడాలని మనోజ్ అన్నారు. మా గ్రామ అర్చకుడి సేవలో గడడం వల్ల నేను ఏనాడు మద్య, మాంసాలు ముట్టుకోలేదని చెప్పారు. సంస్కృతంలో పీజీ చేసిన మరో దళిత అర్చకుడు మదుకృష్ణ కూడా టీడీబీ నిర్ణయంపట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పథినంతిట్ట జిల్లాలోని కిచ్చీరివల్ శివాలయంలో యదుకృష్ణ అర్చకత్వం వహిస్తున్నారు. యదుకృష్ణ కూడా ఎనిమిదేళ్ల వయసులో గ్రామంలోని శివాలయంలో అర్చకుడికి సహాయకుడిగా విధులు నిర్వహించారు. మా అమ్మకు భక్తి చాలా ఎక్కువ. అందువల్ల నన్ను చిన్నతనం నుంచే ధార్మిక కార్యక్రమాలు, పూజాదికాలు, సంస్కృతంపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పారు. యదుకృష్ణ రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ.. అభిషేకం చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోవని భక్తులు చెబుతున్నారు. -
మొదటిసారి ఒక దళితుడితో..
కిచెరైవల్(కేరళ): మనుషుల మధ్య కులమతాల బేధాలు తొలగిపోవడానికి ఇది ఒక ఉదాహరణంగా చెప్పవచ్చు. నాటి రోజుల్లో దళితులకు దేవాలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు శివుడి గర్భగుడిని కృష్ణా అనే దళిత పూజారితో తెరిపించారు. ఈ సంఘటన కేరళలోని కిచెరైవల్లో చోటుచేసుకుంది. వివరాలివి.. ట్రావెన్కోర్ దేవస్థాన్ రిక్రూట్మెంట్ బోర్డు ఆరుగురు దళిత పూజారులను ఎంపిక చేసింది. వీరిలో ఎస్సీ పులియా కమ్యూనిటికి చెందిన కృష్ణా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. కేరళలో దళితులను పూజరులుగా నియమించడం ఇదే మొదటిసారి. కొంతమంది దళిత పూజారులను రిజర్వేషన్ కింద గవర్నమెంట్ ఉద్యోగులుగా నియమించడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా కృష్ణా మాట్లాడుతూ.. ‘మాది త్రిసూర్‌లోని చాలక్కుడి అనే ప్రాంతం. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఎర్నాకుళంలోని దేవి ఆలయంలో పూజరిగా పని చేశాను. అక్కడి నుంచి నేను వస్తుంటే చాలా మంది భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణా సంస్కృతంలో పీజీ చేశాడు. ఇతని తల్లిదండ్రులు రవి, లీలా. 12 సంవత్సరాల వయసులోనే ఎర్నాకుళం తంత్రాయ పీఠంలో చేరనని కృష్ణా చెప్పాడు.‘నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే మా ఊరిలో పూజారిగా పనిచేశానని తెలిపాడు.’ ట్రావెన్కోర్ దేవస్థాన్ బోర్డ్ కమిషనర్ సీపీ రామ రాజా ప్రేమ ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తగా ఎంపికైనా పూజారులు 15 రోజుల్లో వారికి కేటాయించిన దేవాలయాల్లో విధులకు హజరుకావాలని తెలిపారు. కేరళ హిందూ ఐక్యా వేదిక జనరల్ సెక్రటరీ ఈ ఎస్ బిజు మాట్లాడుతూ.. గతంలో మాదిరి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ప్రజల ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దళిత పూజారులను ప్రజలు సంతోషంగా స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. -
కేరళలో పూజారుల పోస్టులకు దళితులు!
తిరువనంతపురం: కేరళలో ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్వహణలోని ఆలయాల్లో 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి సిఫారసు చేశారు. వీరిలో ఆరుగురు దళితులుండటం విశేషం. ఇందుకు సంబంధించి కేరళ దేవస్థానం నియామక బోర్డు సిఫార్సు చేసింది. దళితుల నుంచి ఆరుగురిని పూజారులుగా నియమించడానికి సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. ఈ నియామకాలు చేపట్టేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇందులో అవినీతికి చోటులేదని, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగానే ఎంపిక చేస్తున్నామని దేవస్థాన మంత్రి కదకంపల్లి రామచంద్రన్ చెప్పారు. -
మంత్రి ఆదిపై ఫిర్యాదు ఎన్‌హెచ్చార్సీ స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై అందిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దళితులు శుభ్రంగా ఉండర ని, వాళ్లు చదువుకోరని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డిపై చర్యలు తీసు కోవాల్సిందిగా ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సభ్యుడు బోరుగడ్డ అనిల్‌కు మార్ ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ కేసును విచా రణకు స్వీకరించింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడు తూ.. తాను చేసిన ఫిర్యాదును స్వీకరించి న కమిషన్ విచారణ జరిపి మంత్రి ఆదిపై చర్యలు తీసుకోనుందని చెప్పారు. -
నివురుగప్పిన నిప్పులా కన్నపుకుంట
డోన్ టౌన్ : మండల పరిధిలోని కన్నపుకుంట గ్రామంలో కులవివక్ష బుçసలు కొడుతోంది. ఐదు నెలల క్రితం గ్రామంలో జరిగిన చిన్నసంఘటనకు కొందరు రాజకీయ రంగు పులమడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన గ్రామంలో నెలకొంది. ఒక వివాహ వేడుక సందర్భంగా దళిత యువకుడు గ్రామంలోని మద్దిలేటిస్వామి గుడి మెట్లెక్కి కొబ్బరికాయ కొట్టడంతో వివాదం మొదలైంది. ఇది తెలిసిన అగ్రవర్ణాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు తప్పు చేశామని ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీనికి దళితులు ససేమిరా అనడంతో చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానలా మారి చివరికి పోలిస్ స్టేషన్ దాకా వెళ్లింది. పోలీసులు ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారే కాని సమస్య పరిష్కరించలేదనే విమర్శలున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. పంతాలు – పట్టింపులు... మోహరం, దసరా పండుగల సందర్భంగా గ్రామంలోని ఆలయాల్లోకి దళితులను రానివ్వమని అగ్రవర్ణాల వారు బహాటంగానే చెబుతున్నారు. అనాదిగా గ్రామంలో అమలవుతున్న అచారాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అగ్ర వర్ణాల వారు వాదిస్తుండగా.. దేవున్ని మొక్కడం నేరమెలా అవుతుందని దళితులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో తమ అధిపత్యాన్ని నిలుపుకునేందుకే కొందరు అధికారపార్టీ నాయకులు చిన్నసాకును ఆయుధంగా చేసుకొని అగ్రవర్ణాలను రెచ్చగొడుతున్నారని దళిత యువకులు మండిపడుతున్నారు. గతంలో దళితులపై దాడిచేసిన సంఘటనలో గ్రామంలో కొందరికి కోర్టుల్లో శిక్షలు పడిన సంగతిని దళితులు గుర్తుచేస్తున్నారు. ఇలా ఇరువర్గాల వారు పంతాలు, పట్టింపులకు పోతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతోందోననే భయాందోళనను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. బహిష్కరణల పర్వం... తమను దేవాలయాల్లోకి రానివ్వనందుకు నిరసనగా దళితులు అగ్రవర్ణాల్లో మృతిచెందిన వారి అంతిమ సంస్కారాలకు శ్మశానంలో గోతులు తవ్వడం మానేశారు. ఐదు నెలల నుంచి ముగ్గురు మృతిచెందినా దళితులు సహాయనిరాకరణతో అగ్రవర్ణాల వారే స్వయంగా శ్మశానంలో గోతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
విపక్షాల నిరసన గళం
► దళితులకు భూపంపిణీలో అన్యాయంపై ధ్వజం ► ఆత్మహత్యకు యత్నించిన బాధితులను పరామర్శించిన విపక్ష, ప్రజాసంఘాల నాయకులు హైదరాబాద్ : దళితులకు భూపంపిణీలో అన్యాయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భూపంపిణీలో న్యాయం జరగలేదని ఎమ్మెల్మే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన బాధితులను వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సోమవారం పరామర్శించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్ (35), యాలాల పరశురాం(24) ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 40 శాతం గాయాలకు గురైన శ్రీనివాస్ కిడ్నీలు పాడైపోయాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 48 గంటలు గడిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. 35 శాతం గాయాలైన పరశురాం ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన శ్రీనివాస్ భార్య తల్లి పోశవ్వ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితులను పరామర్శించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీమంత్రులు జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి ఆస్పత్రికి వచ్చారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడ్క జగదీశ్వర్‌గుప్త, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, టీ మాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, గోపాల్, జనార్దన్, శ్రీరాం నాయక్, రచయిత్రి సుజా త తదితరులు బాధితులను పరామర్శించారు. దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీ సులు మోహరించారు. ఆస్పత్రి ఎదుట టీ మాస్ ఫోరం కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వంపై నేతల ఆగ్రహం హామీలు నెరవేర్చాలి: భట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఎంత నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయో ఈ ఘటనలో బయటపడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొని హామీలను నెరవేర్చాలి. సీఎంపై కేసు పెట్టాలి: వీహెచ్ దళిత యువకుల ఆత్మహత్య ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఆయనపై కేసు నమోదు చేయాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లంచాలు అడిగితే చెప్పుతో కొట్టమని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి మాటలు సినిమా డైలాగుల్లా ఉంటున్నాయి. కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి: రేవంత్ దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. దళితులపై దాడుల ఘటనల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం, 3 ఎకరాల భూమి ఇవ్వాలి. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగి తేలుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలపై పడి లంచాలు వసూలు చేస్తున్నారు. పరిహారం చెల్లించాలి: కోదండరాం గ్రామ స్థాయిలో పరిపాలన కుప్పకూలిపోయిందనడానికి ఇదే నిదర్శనం. దీన్ని ఒక ఘటనగా తీసుకోకుండా పాలనాపరమైన లోపంగా గుర్తించాలి. ఎమ్మార్వో, ఆర్డీవో తదితర అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ బాధితులు తిరిగినా ఎక్కడా న్యాయం జరగలేదు. దీంతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం, భూమి అందించాలి. వారి వైద్య ఖర్చులను భరించాలి. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ: చాడ బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. కేవలం వీఆర్వోనే కాకుండా ఆర్డీవో, ఆపై స్థాయి అధికారులపై పూర్తి స్థాయి విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అధికారులు భూమి ఉన్నవారినే భూపంపిణీకి ఎంపిక చేసి, ఇంచ్ భూమి లేనివారిని విస్మరించారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో దళిత యువకులు ఆత్మహత్యకు యత్నించారు. రాజకీయ రాబందులే కారణం: తమ్మినేని భూ పంపిణీలో ఎమ్మెల్యే, జడ్పీటీసీ అవినీతికి పాల్పడి అర్హులకు భూ పంపిణీలో చోటు లేకుండా చేశారు. రాజకీయ రాబందులే ఈ ఘటనకు కారణం. చిన్న, చిన్న అధికారులను బలి చేయకుండా రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలి. మంగళవారం నుంచి టీ మాస్‌తో కలసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. ప్రభుత్వానిదే బాధ్యత: విమలక్క పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిలు విస్మరించి దళితులకు భూ పంపిణీ చేయడం లేదు. అందుకే ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. మూల్యం చెల్లించక తప్పదు: మంద కృష్ణ కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు 120 మంది దళితులను హత్య చేశారు, 50 మందిపై అత్యాచారం జరిగింది, 5 వేల మందిపై దాడులు జరిగాయి. దీనికి ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజా ఘటనపై ఈ నెల 5, 6వ తేదీల్లో మండల కార్యాలయాలను ముట్టడిస్తాం. 7వ తేదీన భూ పంపిణీపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ విడుదల చేస్తాం. హామీలు విస్మరించారు: జగదీశ్వర్‌గుప్తా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించినా ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దీంతో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ఈ ఘటనలో హరీశ్‌రావు బంధువు జడ్పీటీసీ డబ్బు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. -
దళితుల కన్నెర్ర
ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన రాస్తారోకోలు, ధర్నాలు దిష్టిబొమ్మల దహనం పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎస్సీల పట్ల అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి అదినారాయణరెడ్డిపై దళితులు కన్నెర్ర చేశారు. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. దళితులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. రాస్తారోకోలు, ధర్నాలు, వినతిపత్రాలు, పలు స్టేషన్లలో మంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. అత్తిలి, చింతలపూడి పోలీసు స్టేషన్లలో మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదులు చేశారు. ఆచంటలో మంత్రి ఆదినారాయణరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు మానుకొండ ప్రదీప్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో ధర్నా చేసి మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అచంటలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. నిడదవోలు పట్టణంలో సంతమార్కెట్ వద్ద, అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం కేవీపీఎస్, చర్చిపేట యూత్ ఆధ్వర్యంలో దళితులు నిరసన వ్యక్తం చేసారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేసారు. అక్కడ నుంచి తహసిల్దారు కార్యాలయం వద్దకు వెళ్లి కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసారు. సమిశ్రగూడెంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి దిష్టిబొమ్మ దహనం ప్రయత్నాన్ని ఎస్ఐ అడ్డుకున్నారు. టి.నర్సాపురంలో బీఎస్పీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ డిమాండ్ చేసింది. వెఎస్సార్సీపీ మహిళా నాయకురాలు, జిల్లా సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీ గంజిమాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ దెందులూరు బస్టాండ్ సెంటర్లో దళితులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కొవ్వలిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మౌన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులో ఫైర్‌స్టేషన్ సెంటరులో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి ఆదినారాయణ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
దళితులపై దాడుల నిరోధానికి పోరాటాలు
ఎస్సీ వర్గీరకణను సమర్థిస్తే ఏ పార్టీనైనా భూస్థాపితం చేస్తాం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు భీమారావు అమలాపురం టౌన్ : నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అత్యధికంగా మాలలు ఉన్నారని... ఎస్సీ వర్గీకరణ జోలికి వచ్చి ఆ అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకురావాలని ప్రయత్నించే ఏ రాజకీయ పార్టీనైనా భూ స్థాపితం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు హెచ్చరించారు. ఇప్పుడే కాదు భవిష్యత్‌లో కూడా వర్గీకరణను సమర్థిస్తూ భూజాన వేసుకునే పార్టీలకు తగిన గుణ పాఠం చెప్పేందుకు మాల మహానాడు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అమలాపురంలోని మదర్ థెరిస్సా పాఠశాలలో కోనసీమ దళిత నేతలు, వివిధ సామాజిక వర్గాల నాయకుల ఆధ్వర్యంలో మాల మహానాడుకు జాతీయ అధ్యక్షుడు అయిన సందర్భంగా భీమారావుకు ఆదివారం అభినందన సభ జరిగింది. సభకు భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు పుట్టిన మాల మహానాడు ఉద్యమాల, దాని ఫలితాల వల్లే నేడు ఆ అంశం మరుగున పడిందని భీమారావు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడుల నిరోధానికి మాల మాహనాడు జాతీయ స్థాయిలో పోరాటాలు చేసేందుకు నడుం బిగిస్తోందని వెల్లడించారు. పెరుగుతున్న ఎస్సీ జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం అమలువుతున్న 15 శాతం రిజర్వేషన్లను 23 శాతానికి పెంచాలన్న డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లనున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలను క్రమేపీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతుల్లో భర్తీ చేస్తుండడం వల్ల రిజర్వేషన్ల ఉనికి తగ్గిపోతున్న క్రమంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో మాల మహానాడు ఉద్యమాలకు ప్రణాళికి సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. అనంతరం సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ 21 ఏళ్ల మాల మహానాడు ఉద్యమ ప్రస్థానం ఆదిలో భీమారావు ఉద్యమకారుడిగా లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు అనుభవించారని... అలాంటి రాజీ లేని ఉద్యమ వాదికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. కోనసీమ దళిత ఐక్య వేదిక చైర్మన్ డీబీ లోక్, ఆ వేదిక ముఖ్య ప్రతినిధులు ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావు, ఉండ్రు బుల్లియ్య, సాపే బాలరవి, కాట్రు చంద్రమోహన్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పినిపే రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షుడు వెంటపల్లి జాన్‌మార్క్, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్ దివాకర్, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యిళ్ల సత్యనారాయణ, కోనసీమ కాపు మిత్ర ప్రతినిధి బండారు రామమోహనరావు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ బ్రాహ్మణ సమాఖ్య కో ఆర్డినేటర్ మంగళంపల్లి అంజిబాబు తదితరులు సభలో ప్రసంగించారు. అనంతరం భీమారావును సత్కరించారు. -
దళిత సర్పంచ్ ఫిర్యాదుపై చర్యలేవీ
ఎస్పీ విశాల్‌గున్నికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఫిర్యాదు కాకినాడ : స్పష్టమైన ఆధారాలున్నా ఓ దళిత సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆలమూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఎస్పీ విశాల్‌గున్నికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కాకినాడలో ఎస్పీని కలిసి ఈ అంశంపై చర్చించారు. ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామ సర్పంచ్ డెక్కాపాటి పాప తమ గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాన్ని ప్రశ్నించడంతో మే 20వ తేదీన అడ్డుచెప్పారన్నారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో అక్కడ నిర్మాణం చేస్తున్న మద్దిరాజు కామరాజు ఆమెపై దౌర్జన్యం చేసి కులంపేరుతో దుర్భాషలాడారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. పైగా ఆమెపై పారతో దాడి చేసి హత్యాయత్నం కూడా చేశారన్నారు. ఇందుకు సంబంధించి రికార్డింగ్‌లు, స్పష్టమైన ఆధారాలతో ఆలమూరు స్టేషన్లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్య తీసుకోవడలేదని ఎస్పీకి వివరించారు. దళిత సర్పంచ్‌పై దురుసుగా వ్యవహరించి అవమానకరంగా ప్రవర్తించిన అక్కడి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని జగ్గిరెడ్డి చెప్పారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ వెంటనే డీఎస్పీతో మాట్లాడారు. వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీటీసీ లంక వెంకటరమణ, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్‌పై ఆరేపల్లి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతిని అధికారంగా ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న దళిత నేతలు కూడా జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పించకపోవడం అవమానకరమన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితనేతను కించపరిచేవిధంగా వ్యవహరించిన కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ఓట్లకోసం కుయుక్తులు, మాయ మాటలు తప్ప దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. -
దళితులకు రక్షణ కరువు
►‘గరగపర్రు’ దోషులను శిక్షించాలి ► గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ► ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు ద్వారకానగర్ (విశాఖ దక్షిణ) : దళితులకు దేశంలో రక్షణ కరువైందని, వారిపై విచక్షణా రహితంగా దాడులు పెరిగిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. సోమవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దళిత, ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేవీ మాట్లాడుతూ గోరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా హత్యాదాడులు పెరిగాయన్నారు. యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక మహిళలపై 30 శాతం దాడులు పెరిగాయన్నారు. ఏపీలో కూడా ఆదే సంస్క్రతి ఉందని ఆరోపించారు. అగిరిపల్లి, గరగపర్రు వంటి గ్రామాల్లో దళితులపై సాంఘిక బహిష్కరణ జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దళితలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, దేవుడిని పూజించే హక్కుతో పాటు స్వేచ్ఛగా తినే హక్కును కూడా ప్రభుత్వాలు మంటగలుపుతున్నాయన్నారు. గరగపర్రు దాడులను చూస్తూ ప్రభుత్వం ఖండిచకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆచార్య సూరప్పుడు, సామాజిక హక్కుల వేదిక నాయకుడు బొడ్డు కల్యాణరావు, మాజీ వీసీ రమణ, సీపీఐ నగర కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎం.పైడిరాజు, వైఎస్సార్సీపీ మహిళా విభాగ నగర కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బొట్టా స్వర్ణ, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు ఎం.ఎ. బేగం, దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జేడీ నాయుడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి. చంద్రశేఖర్, సీపీఐ నాయకులు పైల ఈశ్వరరావు, జి,వామనమూర్తి, రాజుబాబు, సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు. ‘గరగపర్రు’పై ఏయూ బంద్ నినదించిన పరిశోధకులు, విద్యార్థులు ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు) : రాష్ట్రంలో దళితులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏయూ పరి శోధకులు, విద్యార్థులు నినదించారు. ప.గో జిల్లాలోని గరగపర్రు సంఘటనకు నిరసనగా సోమవారం విశ్వవిద్యాలయంలో బంద్ నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన ‘చలో గరగపర్రు’ కార్యక్రమం నిర్వహిచేందుకు నిర్ణ యం తీసుకున్నారు. తొలుత ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ విద్యార్థులు, గ్రంథాలయాల సిబ్బందిని పం పించేసి బంద్ నిర్వహించారు. చివరన పరీక్షలు, పరిపాలనా విభాగాల సిబ్బందిని పంపించేసి బంద్ నిర్వహించారు. సాంఘిక బహిష్కరణకు గురైన గరగపర్రు దళితులకు తగిన న్యాయం చేయాలన్నారు. జేఏసీ సభ్యులు బోరుగడ్డ మోహన బాబు, ఆరేటి మహేష్, టి.వి రాఘవులు, రంగనాథ్‌రాయ్ వైఎస్ఆర్సీపీ నాయకులు బి.కాంతారావు, తుళ్లి చంద్రశేఖర యాదవ్, సునీల్‌కుమార్, ఆనంద రత్నకుమార్, రామక్రిష్ణ, వరుణ్ చైతన్య, కె.రవికుమార్, శిరీష్, రమణ, శ్యామ్ సుందర్, టి. సురేష్ కుమార్, ప్రియాంక, రొయ్యి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. -
గరగపర్రు ఘటనలో ముగ్గురి అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు కారణమైన బలరామకృష్ణంరాజు, ముదునూరి రామరాజు, గుట్టుకుప్పల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అంబేడ్కర్ విగ్రహం వివాదం నేపథ్యంలో రెండు నెలల నుంచి అగ్రవర్ణాలు కౌలుకిచ్చిన భూముల్ని దళితుల వద్ద నుంచి వెనక్కి లాక్కోవడమే కాకుండా, పనులకు పిలవడం మానేసిన విషయం తెలిసిందే. కాగా దళితులు సామాజిక బహ్కిరణకు గురైన గరగప ర్రులో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 30, జులై 1వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో పర్యటించి అక్కడ సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యాన్ని కల్పిస్తారు. మరోవైపు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇవాళ గరగపర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం దారుణమని, వారికి న్యాయం జరిగేవరకు వారి వెన్నంటే ఉంటామన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రెండెకరాల భూమి కేటాయించాలని ముద్రగడ డిమాండ్ చేశారు.