సాక్షి, న్యూఢిల్లీ: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై అందిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దళితులు శుభ్రంగా ఉండర ని, వాళ్లు చదువుకోరని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డిపై చర్యలు తీసు కోవాల్సిందిగా ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సభ్యుడు బోరుగడ్డ అనిల్‌కు మార్ ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ కేసును విచా రణకు స్వీకరించింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడు తూ.. తాను చేసిన ఫిర్యాదును స్వీకరించి న కమిషన్ విచారణ జరిపి మంత్రి ఆదిపై చర్యలు తీసుకోనుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment