Minister Adi Narayana Reddy
-
మంత్రికి క్లబ్, పేకాట శాఖలపైనే పట్టుంది
జమ్మలమడుగు/మైలవరం : మంత్రి ఆదినారాయణరెడ్డి తనకు కేటాయించిన శాఖల కంటే క్లబ్, పేకాట శాఖలపైనే పట్టు ఉందని ప్రభుత్వం ఆ శాఖలను కేటాయించి ఉంటే బాగుండేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్సుధీర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మైలవరం మండల కేంద్రం పాతబస్టాండ్ వద్ద నుంచి జగన్ పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాటినందుకు ఆయనకు మద్దతుగా మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులతో కలిసి సంఘీభావ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా వేపరాల గాంధీ విగ్రహం వద్ద, దొమ్మరనంద్యాల గ్రామంలోని చావిడి వద్ద జరిగిన బహిరంగ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి తన స్వార్థప్రయోజనం కోసం పార్టీ ఫిరాయించాడు. పైగా పార్టీ మారింది ప్రజల అభివృద్ధి కోసమంటూ అసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన పార్టీ మారింది కేవలం ఆయన అభివృద్ధి చెందడానికే అన్నారు. చేనేత కార్మికుల కోసం మైలవరం మండలంలోని నార్జాంపల్లి గ్రామ రహదారిలో చేనేతల కోసం టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలైన ఇంత వరకు ఎటువంటి ప్రారంభానికి నోచుకోలేదు. చేనేత కార్మికులపైనే ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. అంతేకాకుండా మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లో తయారైన చేనేత వస్త్రాలకు ఎటువంటి పేటెంట్ లేదు. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలు ధర్మవరం, కంచి పట్టుచీరలంటూ అమ్ముకుంటున్నారన్నారు. మైలవరం మండలంలో 29వేల మంది ఓటర్లు ఉన్నారు. వారికందరికి ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద 200 ఇళ్లను కేటాయించింది. మండలంలో నిరుపేదలకు కనీసం రెండు వందల ఇళ్లు ఏమాత్రం సరిపోతాయని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కేవలం తనస్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లును నోటుతో కొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికులకు 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రూ.2000 పెన్షన్ ఇస్తారన్నారు. దానితో పాటు మైలవరం జలాశయంపై ఆధారపడి ఉన్న మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. ఆదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలను దారి పొడవున అడిగి తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా నిలవాలంటూ ఆయన కోరుతూ వచ్చారు. నీరాజనాలు పలికిన ప్రజలు ప్రతిపక్షనాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఆయనకు మద్దతుగా డాక్టర్ సుధీర్‌రెడ్డి, మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. దాదాపు ఐదున్నర కిలోమీటర్ల దూరం జరిగిన ఈ పాదయాత్ర మైలవరం మండల కేంద్రం నుంచి ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ పాదయాత్రలో సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ అల్లె చెన్నారెడ్డి, రామాంజనేయ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి హనుమంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి మహేశ్వరరెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి మున్నా, మాబాష, ఇస్మాయిల్, దళిత నాయకుడు మంగదొడ్డి సింగరయ్య, పెద్దముడియం నాయకులు చవ్వాక్రిష్ణారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, బీసీ జిల్లా కార్యదర్శి పాలూరి నరసింహులు, రామకృష్ణ, గురుమూర్తి, దొమ్మరనంద్యాల సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ జెండానుఆవిష్కరించిన సుధీర్‌రెడ్డి మైలవరం : మండల కేంద్రంలో నాలుగురోడ్ల కూడలిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర 2000 కీలోమీటర్ల మైలురాయిని దాటడంతో మండలంలో పాదయాత్రను చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 5 కిలోమీటర్లు కొనసాగి దొమ్మరనంద్యాల ఉన్నత పాఠశాల వరకు చేరి పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అల్లె చిన్నచెన్నారెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, చిన్నకొమెర్ల శివగురివిరెడ్డి, జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణారెడ్డి, రామక్రిష్ణ, మున్నా, ఇస్మాయిల్, ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆదినారాయణ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం
-
మా దగ్గర ఆధారాలు ఉన్నాయి
-
మా దగ్గర ఆధారాలు ఉన్నాయి: విజయసాయి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నలుగురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై తక్షణ చర్య తీసుకోవాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తూ.. పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వజూపుతూ అనైతికంగా వ్యవహరిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు రాజమౌళి, సాయిప్రసాద్ తో పాటు ఐపీఎస్ అధికారి ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. ఇటీవల చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపుల్లో వీరి ప్రమేయం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉందని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తనవద్ద ఉన్నాయని సాయిరెడ్డి తెలిపారు. తాము చేసిన ఆరోపణలు బయటపెట్టాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోరుకుంటే కచ్చితంగా ఆధారాలు చూపిస్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో తమ ఆరోపణలు నిజమని తేలాయని ఆయన అన్నారు. -
సీఎం సతాయింపులు అభివృద్ధి కోసమే
కడప: రాత్రి 11 గంటల సమయంలో కూడా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలం టూ కార్యాలయాల్లో ఉంటున్న మాట నిజమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతాయింపులన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసమేనని మార్కెటింగ్‌శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. అధికారులు కూడా జిల్లా అభివృద్ధి కోసం పోటీపడి పని చేయాల ని కోరారు. జన్మభూమిలో మంచి సేవలు అందించి న ఉద్యోగులకు బహుమతులు, ప్రశంసాపత్రాల పం పిణీ కార్యక్రమం శుక్రవారం కలెక్టరేట్ సభా భవనంలో జరిగింది. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గండికోట ఉత్సవాల విజయవంతానికి అధి కారులు కృషి చేయాలన్నారు. గండికోటలో రోప్‌వే ఏర్పాటు చేసేందుకు రూ. 7.50 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జొన్న, శనగకు ఫసల్‌బీమా కింద డబ్బు మంజూరైందని, అయితే రైతుల అకౌంట్లలో పడలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీన్ని అధికారులు సరిదిద్దాలన్నారు. కత్తులు లేకుండా కోడిపందేల నిర్వహణకు అనుమతించాల ని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ ఈనెలాఖరు నాటికి జిల్లా ను ఓడీఎఫ్ కింద ప్రకటించాల్సి ఉందన్నారు. జేసీ శ్వేత తెవతీయ, రెండవ జేసీ శివారెడ్డి పాల్గొన్నారు. -
జన్మభూమి సభలో ఏపీ మంత్రికి షాక్
-
మంత్రి ఆదిపై ఫిర్యాదు ఎన్‌హెచ్చార్సీ స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిపై అందిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. దళితులు శుభ్రంగా ఉండర ని, వాళ్లు చదువుకోరని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డిపై చర్యలు తీసు కోవాల్సిందిగా ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సభ్యుడు బోరుగడ్డ అనిల్‌కు మార్ ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ కేసును విచా రణకు స్వీకరించింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడు తూ.. తాను చేసిన ఫిర్యాదును స్వీకరించి న కమిషన్ విచారణ జరిపి మంత్రి ఆదిపై చర్యలు తీసుకోనుందని చెప్పారు. -
మిస్ ఫైర్‌తో మంత్రి ‘ఆది’ గన్‌మ్యాన్ మృతి
కడప అర్బన్: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి గన్‌మ్యాన్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌గా (ఏఆర్ పీసీ 1245) బసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (45) గురువారం తన ఇంట్లో ‘పిస్టల్’ని శుభ్రపరుస్తుండగా పేలడంతో మృతి చెందారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా వున్నాయి. వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం అంబవరానికి చెందిన బసిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణ రెడ్డి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ‘పిస్టల్’ను శుభ్రపరుస్తుండగా అకస్మాత్తుగా పేలి బుల్లెట్ అతని ఛాతీ కింది భాగం నుంచి దూసుకెళ్లింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి కడపలోని హిమాలయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు రిమ్స్‌లో వైద్యులు నిర్ధారించారు. అతని మృతదేహాన్ని జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘పిస్టల్’ను శుభ్రం చేస్తుండగా దురదృష్టవశాత్తు పేలడంతో ప్రమాదం జరిగిందన్నారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా అదనపు ఎస్పీ ఎ. శ్రీనివాసులరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేశవ్ రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాష, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
'ఏపీ మంత్రి మూల్యం చెల్లించక తప్పదు'
నంద్యాల వ్యవసాయం: రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి అహంకారంతో చేసిన వ్యాఖ్యలతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటారని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గురువారం నంద్యాల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంత్రి హోదాలో ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఎస్సీలు చదువుకోరని, శుభ్రంగా ఉండరని చెప్పిన మంత్రి, క్షమాపణలు చెప్పకుండా, అలా అనలేదని తప్పించుకోవడం సిగ్గు చేటరన్నారు. సీఎంకు, మంత్రులకు సలహాదారులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లలో ఎస్సీలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్.. ఎస్సీ, ఎస్టీలపైన అభిమానం, ప్రేమానురాగాలు చూపించేవారన్నారు. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలి పించి జననేతకు కానుకగా ఇవ్వాలని నంద్యాల ఓటర్లను కోరారు. సమావేశంలో సింగనమల నాయకురాలు బండి లలితా కల్యాణి, బ్యాళ్ల శీను పాల్గొన్నారు.