
కడప: రాత్రి 11 గంటల సమయంలో కూడా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలం టూ కార్యాలయాల్లో ఉంటున్న మాట నిజమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతాయింపులన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసమేనని మార్కెటింగ్‌శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. అధికారులు కూడా జిల్లా అభివృద్ధి కోసం పోటీపడి పని చేయాల ని కోరారు. జన్మభూమిలో మంచి సేవలు అందించి న ఉద్యోగులకు బహుమతులు, ప్రశంసాపత్రాల పం పిణీ కార్యక్రమం శుక్రవారం కలెక్టరేట్ సభా భవనంలో జరిగింది.
మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గండికోట ఉత్సవాల విజయవంతానికి అధి కారులు కృషి చేయాలన్నారు. గండికోటలో రోప్‌వే ఏర్పాటు చేసేందుకు రూ. 7.50 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జొన్న, శనగకు ఫసల్‌బీమా కింద డబ్బు మంజూరైందని, అయితే రైతుల అకౌంట్లలో పడలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీన్ని అధికారులు సరిదిద్దాలన్నారు. కత్తులు లేకుండా కోడిపందేల నిర్వహణకు అనుమతించాల ని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ ఈనెలాఖరు నాటికి జిల్లా ను ఓడీఎఫ్ కింద ప్రకటించాల్సి ఉందన్నారు. జేసీ శ్వేత తెవతీయ, రెండవ జేసీ శివారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment