devolopment
-
సీఎం జగన్ రెండు రోజుల కడప పర్యటన.. షెడ్యూల్, పూర్తి వివరాలు..
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 2, 3 తేదీల్లో (శుక్ర, శని) వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితర అధికారులు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఇడుపులపాయలో 2వ తేదీ రాత్రి బస చేయనున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లింగాల మండలంలోని పార్నపల్లెలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్ద సీఎం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుండటంతో అక్కడ కూడా పటిష్ట పోలీసు బందోబస్తు నియమించారు. నేటి పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడి నుంచి బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. 12.00 నుంచి 12.30 గంటల వరకు బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని 12.40 నుంచి 1.00 గంట మధ్యలో వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు లింగాల మండల నాయకులతో మాట్లాడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. రేపటి పర్యటన: శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ఎస్టేట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 9.15 నుంచి 9.30 గంటల మధ్య కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్‌కు చేరుకుని సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు పోలీసుల రిహార్సల్స్ లింగాల: లింగాల మండలం పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో సీఎం పర్యటించే ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు. అలాగే ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేర్ణా, నీటిపారుదల శాఖ ఈఈ రాజశేఖర్, పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, తహసీల్దార్ శేషారెడ్డి, ఎంపీడీఓ సురేంద్రనాథ్, పీఆర్ ఏఈ మనోహర్‌రెడ్డి, మత్ప్యశాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీబీఆర్‌పై భారీ పోలీసు బందోబస్తు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా సీబీఆర్‌పై భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50మంది ఎస్‌ఐలతోపాటు 1500 మంది పోలీసు బలగాలు సీబీఆర్‌కు చేరుకున్నాయని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. -
హక్కులే కాదు... బాధ్యతలూ గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సంఘ సేవకుడు చమన్‌లాల్ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి చమన్‌లాల్ అండగా నిలిచారన్నారు. చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రులు దేవ్‌సింగ్ చౌహాన్, రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో 22.60% సమయం సద్వినియోగం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో మూడోవారం 8 బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో ఎగువ సభలో సద్వినియోగమైన సమయం(ప్రొడక్టివిటీ) 24.2 శాతానికి పెరిగింది. ఇది మొదటి వారంలో 32.20 శాతం, రెండో వారంలో కేవలం 13.70 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు రాజ్యసభ పరిశోధక విభాగం గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా మొత్తం మూడు వారాల్లో సద్వినియోగమైన సమయం 22.60 శాతంగా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగసస్ స్పైవేర్‌తోపాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మొదటిరోజు నుంచే ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెడుతూనే ఉంది. గతవారం 17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు వివిధ బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లులపై మొత్తం 3.25 గంటలపాటు చర్చలు జరిగాయి. -
నాణ్యత మహానందీశుడికెరుక !
మహానంది: మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే రాజగోపురం ముందు భాగంలో రెండు సుపథ మండపాల మధ్యలో గ్రీనరీ కోసం యూ ఆకారంలో నిర్మించిన గోడ బుధవారం కూలిపోయింది. గోడల మధ్యలో వేసిన మట్టికి పైప్ ద్వారా నీరు పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, చిన్నపాటి నీటి ఫోర్స్‌కే ఇలా జరగడంతో నిర్మాణాల్లో నాణ్యతపై స్ధానికులు, భక్తులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఈఓ మల్లికార్జునప్రసాద్ మాట్లాడుతూ సిబ్బంది ఫైర్ ఇంజన్లకు వాడే పైపుతో నీరు పట్టడం ద్వారా ఫోర్స్‌కు గోడ కూలిపోయిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా ఈ గోడ నిర్మాణానికి సుమారు రూ. 55 వేలకు పైగా ఖర్చు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. -
నగరానికి వెలుగుజిలుగులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మార్పులు గమనిస్తున్నారా! జంక్షన్లలో జిలుగులు.. సెంట్రల్ డివైడర్లకు రంగులు.. ఐలాండ్లలో వాటర్ ఫౌంటైన్లు.. రోడ్లకు లేన్ మార్కింగ్‌లు.. ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ వెలుగులు.. పార్కుల్లో ఆకట్టుకునేలా ఫర్నిచర్.. ఇలా ఒకటేమిటి వివిధ ప్రాంతాల్లో మనసుకు ఆహ్లాదంగా, కనువిందుగా సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. రానున్న ఏడెనిమిది నెలల్లో ఇవి మరింత విస్తృతం కానున్నాయి.. దాదాపు పది నెలల్లో బల్దియా పాలకమండలి ఎన్నికలు జరగనుండటంతో.. ఈలోగా నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు, సరికొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకనుగుణంగా మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులతో తరచూ సమీక్షలునిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పలు ఆదేశాలుజారీ చేస్తూ, బాగున్న వాటిని మరిన్ని పెంచాల్సిందిగా సూచిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఖైరతాబాద్ జంక్షన్ సుందరీకరణ, ఇందిరాపార్కులో పంచతత్వ పార్కు, శేరిలింగంపల్లి జోన్‌లోని ప్లాస్టిక్ ఫుట్‌పాత్‌లు తదితరమైనవి అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. బాగున్నవాటిని సత్వరం చేయా ల్సిందిగా మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు. అంతేకాదు.. ఇతర నగరాల్లో బాగున్నవి అధ్యయనం చేసి ఇక్కడ ఆచరించాలని పేర్కొనడంతో ఈ వారం ఆరంభంలో పలువురు జోనల్, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు, తదితర అధికారులు పుణెను సందర్శించి వచ్చారు. అంతకుముందు నాగపూర్ తదితర ప్రాంతాలను సందర్శించి వచ్చారు. పుణెలోని పార్కుల మాదిరి ఫర్నిచర్, రహదారుల్లో క్యారేజ్ వే తక్కువున్న విశాలమైన ఫుట్‌పాత్‌లు, రహదారుల మార్గాల్లోని భవనాల సెట్‌బ్యాక్‌ల్లో ఫుట్‌పాత్‌లు, వీలైనన్ని చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు వంటివి నగరంలోనూ అవకాశమున్న ప్రాంతాల్లో ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. రూ.59.86 కోట్లతో జంక్షన్లలో సిగ్నలింగ్.. వీటితోపాటు ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకూ సిద్ధమయ్యారు. ప్రస్తుతం 221 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ సంస్థ కాంట్రాక్టు ముగియడంతో మరో మూడేళ్ల పాటు వాటి కొనసాగింపు, కొత్తగా 155 జంక్షన్లలో సిగ్నలింగ్ సిస్టమ్, 98 ప్రాంతాల్లో ఫెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఖర్చయ్యే రూ.59.86 కోట్లకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. నగరంలో 65 ఫౌంటెన్లకుగాను తొలిదశలో 25 ప్రాంతాల్లో రూ. 25 లక్షలతో ఆధునికీకరణ పనులకు సిద్ధమయ్యారు. వీటితోపాటు రాత్రి ఒంటిగంట వరకు ఆహారం అందించే స్ట్రీట్‌ఫుడ్ వంటి వాటిపైనా దృష్టి సారించారు. సంగీత్, ఎల్బీనగర్, లక్డికాపూల్, నల్లగొండ జంక్షన్లు సహా ఇరవై జంక్షన్లను వివిధ థీమ్‌లతో అభివృద్ధి చేయనున్నారు. ఇటీవలే మెట్టుగూడ సమీపంలోని ఆలుగడ్డ బావి జంక్షన్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దడం తెలిసిందే. పార్కులను అభివృద్ధిపర్చి, నిర్వహించేందుకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. నగరవ్యాప్తంగా మూడువేల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంట గోడలకు హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏర్పాటు ఆలోచనలున్నాయి. ప్రత్యేక థీమ్‌లతో మరికొన్ని పార్కులు తీర్చిదిద్దనున్నారు. యోగా శిక్షకులను అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని బస్తీ దవాఖానాలు.. ప్రజారోగ్యం దృష్ట్యా బస్తీ దవాఖానాల సంఖ్యను 350కి పెంచే ఏర్పాట్లలో ఉన్నారు. తొలిదశలో జోన్‌కు కనీసం రెండు దవాఖానాల చొప్పున 300 అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న 18 ఫ్లై ఓవర్లనూ పూర్తిచేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ అధికారులను పురమాయించారు. రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దేందుకు ప్రధాన మార్గాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకప్పగించారు. పనులు వేగంగా చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీల్లోనూ కచ్చారోడ్ల స్థానే సీసీ రోడ్లు వేసేందుకూ కార్యాచరణ సిద్ధం చేశారు. వీధి దీపాలు సైతం అన్ని కాలనీలు, బస్తీలు, మారుమూల ప్రాంతాల్లో సైతం ఉండేలా చర్యలకు సిద్ధమయ్యారు. ఇలా వివిధ అభివృద్ధి పనులు, సుందరీకరణలతో బల్దియా ఎన్నికల్లోగా సరికొత్త సింగారాలతో నగర ముఖచిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. -
మంగళగిరి నియోజకవర్గానికి మహర్దశ !
సాక్షి, మంగళగిరి : రాజధాని అమరావతిలో కీలకంగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీలను రాష్ట్రంలోనే మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) కృషి చేస్తున్నారు. రెండు మున్సిపాలిటీలను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందుకు నిధులు మంజూరు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్లు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. రెండు పట్టణాల్లో ఇళ్లు లేని పేదలతో పాటు ప్రభుత్వ భూముల్లో ఉంటున్న పేదలందరికీ 27 వేలకు పైగా గృహాలు నిర్మించి అందించనున్నారు. తాడేపల్లిలో కాల్వగట్లు, ప్రభుత్వ భూముల్లో ఉన్న నిర్వాసితులకు అవసరమైన 15 వేల ఇళ్ల నిర్మాణంతో మంగళగిరి మున్సిపాలిటీలో మరో 12 వేల ఇళ్లు నిర్మించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆయా పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మురుగునీటి శుద్ధి, విద్యుత్, వీధిలైట్లు, కాలువల అభివృద్ధి, పార్కులు, బరియల్ గ్రౌండ్, రోడ్ల విస్తరణలకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చేనేత బజారు ఏర్పాటు దిశగా చర్యలు.. చేనేత పరిశ్రమకు నెలవైన మంగళగిరి పట్టణంలో చేనేత బజార్ ఏర్పాటు, కమ్యూనిటీ హాలు నిర్మాణాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.670 కోట్లతో తాడేపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసిన అధికారులు మంగళగిరి మున్సిపాలిటీకి రూ.800 కోట్ల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదముద్ర వేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గం నిరాదరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున తాను గెలిచాననే అక్కసుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారు. అందుకే ఈ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు నమ్మకం లేక నన్నే గెలిపించారు. ఐదేళ్లుగా ఉండవల్లిలో నివాసముంటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ఏ ఒక్క రోజు మున్సిపాలిటీల అభివృద్ధిపై కనీసం సమీక్ష చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే రెండు సార్లు మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష చేశారు. రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు సైతం ఆమోదం తెలిపారు. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో పాటు నిధులు మంజూరుకు సీఎం అంగీకరించడం అభినందనీయం. రూ.670 కోట్లతో తాడేపల్లి, రూ.800 కోట్లతో మంగళగిరిని అభివృద్ధిపర్చేందుకు తయారు చేసిన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారంటే నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఇక కదలాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసిపోనుంది. జీహెచ్ఎంసీలో ఎంతోకాలంగా చతికిల పడ్డ అభివృద్ధి పనులు ఇకనైనా చకచకా ముందుకెళ్తాయా అంటే..అవునని కచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుతం ఫలితాలు వెలువడ్డ లోక్‌సభ ఎన్నికలు..ఈ రెండింటి నడుమ వచ్చిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఎనిమిది మాసాలుగా జీహెచ్ఎంసీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలకందాల్సిన సేవలు కూడా అందడం లేదు. అందుకు కారణం అభివృద్ధి పనులకు ఎన్నికల కోడ్ ఆటంకం కాగా, జీహెచ్ఎంసీలోని సిబ్బందే ఎన్నికల విధుల్లోనూ పాల్గొనడంతో ఆయా విభాగాల్లో సేవలు నిలిచిపోయాయి. సాధారణంగా అత్యవసర సేవలందించే విభాగాల్లోని అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులుండకూడదు కానీ పారిశుధ్యం వంటి అత్యవసర సేవల విభాగాల్లోని సిబ్బందికి సైతం ఎన్నికల విధులు పడ్డాయి. జీహెచ్ఎంసీలోని దిగువస్థాయి సిబ్బంది నుంచి మొదలు పెడితే అడిషనల్, జోనల్ కమిషనర్లతోపాటు కమిషనర్ వరకు ఎన్నికల విధులు నిర్వహించారు. దీంతో, ఉన్నతాధికారులతో పాటు దిగువస్థాయి సిబ్బంది ఎన్నికల విధుల్లోనే తలమునకలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ల నుంచి మొదలు పెడితే ఫలితాలు వెలువడేంతవరకు వివిధ రకాల శిక్షణలు, ఎన్నికల నిర్వహణ తదితర పనులతో సరిపోయింది. దీంతో ప్రజలకు అవసరమైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుంచి భవన నిర్మాణ అనుమతులు, మ్యుటేషన్లు, రహదారుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ తదితర పనులెన్నో ఆగిపోయాయి. ముందుకు సాగని అభివృద్ధి పనులు... వీటితోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మందగించింది. నగరంలో నిర్మించే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడో మంజూరైనప్పటికీ, ఎన్నికల కారణంగా నిర్మాణ కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లడం.. ప్రభుత్వం నుంచి తగిన నిధులందకపోవడం తదితర పరిణామాలతో వీటి నిర్మాణం కుంటుపడింది. పూర్తవుతున్న ఇళ్లకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరగకపోవడం వల్ల కూడా పనులు ముందుకు సాగడం లేవు. పూర్తయిన ఇళ్లకు మౌలిక సదుపాయాల పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. ఆయా మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం లక్ష ఇళ్లకు వెరసి దాదాపు రూ.616 కోట్లు ఖర్చవుతుందని ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాయి. కానీ..ప్రభుత్వం అందుకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. టెండర్లలో రూ.3500 కోట్ల పనులు.. ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం)లో భాగంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులు వేల కోట్ల విలువైనవి టెండర్ల దశలో ఆగిపోయాయి. దాదాపు రూ. 25వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించిన ఎస్సార్డీపీ పనుల్లో దాదాపు వెయ్యికోట్ల మేర పనులు జరిగాయి. టెండర్లు పూర్తికావాల్సిన పనులు, టెండర్లు పిలవాల్సినవి దాదాపు రూ. 3500 కోట్ల పనులున్నాయి. ఇవి కాక పరిపాలనపర అనుమతుల కోసం ఎదురు చూస్తున్నవి మరో రూ.1500 కోట్ల మేర ఉన్నాయి. వెరసి దాదాపు రూ.5000 కోట్ల పనులు ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. కోడ్ ముగిసింది సరే..నిధులేవీ..? ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ అంటూ ఆయా పనులను నిలిపివేశారు. ఇప్పుడైనా చకచకా ముందుకెళ్తాయా అంటే..అవుననే పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నుంచే నిధులు రావాల్సి ఉంది. విడతల వారీగా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఎప్పటికీ దాదాపు రూ. 400 కోట్లు పెండింగ్‌లోనే ఉంటుండటంతో పనులు చురుగ్గా సాగడం లేవు. ఇక ఎస్పార్‌డీపీ పనుల కోసం బాండ్ల ద్వారా సేకరించడమో, బ్యాంకు రుణాలు తీసుకోవడమో చేయాల్సి ఉంది. గత ఏప్రిల్ నుంచే బాండ్ల ద్వారా నిధులు సేకరించాలనుకుంటున్నప్పటికీ, బాండ్ల మార్కెట్ పరిస్థితి బాగులేకపోవడంతో తక్కువ వడ్డీకి ముందుకు వచ్చే వారుండరనే అంచనాతో వెనుకడుగు వేస్తున్నారు. పరిస్థితి మెరుగయ్యాక బాండ్లకు వెళ్లాలనుకున్నారు. కేంద్ర ఎన్నికల ఫలితాలు కూడా వెలువడటంతో ఇప్పుడిక బాండ్ల çమార్కెట్ ³పరిస్థితిని పరిశీలించి వచ్చే వారం నుంచి దీనికి సంబంధించిన కసరత్తు చేపట్టాలని భావిస్తున్నారు. ఎంత లేదన్నా మునిసిపల్ బాండ్ల ద్వారా నిధుల సేకరణకు మరో నెల రోజులు పడుతుంది. బాండ్లు కాకపోయినా, బ్యాంకు రుణాల ద్వారా సేకరించాలనుకున్నా వీలైనంత తక్కువ వడ్డీకి రుణం పొందేందుకు అవసరమైన ప్రక్రియలు పూర్తిచేసి, రుణం పొందేందుకు సైతం నెలరోజులు పడుతుంది. జీహెచ్ఎంసీ ఖజానాలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసేన్ని నిధులు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ అంటూ నెట్టుకొచ్చినప్పటికీ, ఇప్పుడైనా వెంటనే పనులు స్పీడందుకునే పరిస్థితి కనిపించడం లేదు. నిలిచిపోయిన పనులు.. ♦ శిల్పా లేఔట్– గచ్చిబౌలి ఫ్లై ఓవర్ : రూ. 330 కోట్లు ♦ రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్: రూ. 175 కోట్లు ♦ ఆరాంఘర్–జూపార్క్ ఫ్లై ఓవర్:రూ. 326 కోట్లు ♦ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ :రూ. 30 కోట్లు ♦ ఇందిరా>పార్కు– వీఎస్టీ స్టీల్‌బ్రిడ్జి : రూ. 426 కోట్లు ♦ నల్లగొండ క్రాస్‌రోడ్ –ఒవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్: రూ. 526 కోట్లు ♦ కైత్లాపూర్ వద్ద ఆర్ఓబీ : రూ. 83 కోట్లు ♦ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు కొనసాగింపు, గ్రేడ్‌సెపరేటర్లు: రూ. 300 కోట్లు ♦ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ పొడిగింపు పనులు -
పల్లెలకు వెలుగు
సాక్షి, వరంగల్ రూరల్ : గ్రామీణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, పాలక వర్గాలకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గ్రామ పంచాయతీ పాలన పారదర్శకంగా సాగేందుకు గ్రామ స్థాయిలో ఏడు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీల్లో పాలకవర్గం భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా పంచాయతీరాజ్ చట్టం–2018లో రూపుదిద్దుకుంది. జిల్లాలో మొత్తం 401 పంచాయతీలకు నూతన పాలకవర్గంతో గ్రామ జ్యోతి కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తెలంగా ణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ –49 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు స్టాండింగ్ కమిటీలను ఏర్పా టు చేయాలి. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ కమిటీలకు సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ లేదంటే వార్డు సభ్యులు చైర్మన్లుగా ఉంటా రు. ఆయా కమిటీల్లో ఆ గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సంబంధిత రంగాల్లో అనుభవం ఉండి పదవీ విరమణ చేసినవారు సభ్యులుగా నియమితులవుతారు. వేర్వేరుగా ఏర్పాటయ్యే ఏడు కమిటీలకు ప్రత్యేక బాధ్యతలుంటాయి. వారికి సంబంధించిన అంశాల్లో గ్రామంలో పర్యటించి పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమచారం ప్రకారం ఆయా రంగాల్లో అందుతున్న సేవలపై సమావేశంలో సమీక్షించి విశ్లేషించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రజల అవసరాలు తీర్చేలా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేయాలి. దీంతో గ్రామాల సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలకు గ్రామ స్థాయిలో సంబంధిత అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడమే.. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే కీలకమైన సహజ వనరులు, వ్యవసాయం, పౌష్టికాహారం, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో పంచాయతీరాజ్ వ్యవస్థను సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మన ఊరు, మన సమస్యలు, మన ఆలోచనలు, మన వనరులు, మన పరిష్కారాలు ఉండేలా పంచాయతీరాజ్ సంస్థలు కృషి చేయాలని లక్ష్యం. ఇవీ కమిటీలు పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్వహణ వీధి దీపాల నిర్వహణ మొక్కలు నాటడం, సంరక్షణ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం–తాగునీరు ఆరోగ్యం–పోషకాహారం ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో స్టాడింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రూపొందించారు. కమిటీల ఏర్పాటు నిర్ణయం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ది కోసం ఈ కమిటీలు ఎంతగానో దోహదపడనున్నాయి.–రాజారావు, జిల్లా పంచాయతీ అధికారి -
అటకెక్కిన చెరువుల సుందరీకరణ
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని చెరువుల సుందరీకరణ అటకెక్కింది. ప్రస్తుతం ఉన్న దాదాపు 170 చెరువుల్లో 20 తటాకాలను ప్రక్షాళన చేసి, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఏడాదైనా ఇంతవరకు కార్యరూపం దాల్చనేలేదు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మిషన్ కాకతీయ నిధులతో నగరంలోని 20 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి ఆ మేరకు గతేడాది మార్చిలో ప్రభుత్వం అనుమతించింది. ఏడాది కాలం గడిచి.. మళ్లీ మార్చి నెల వచ్చినా ఇంతవరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. ఒక్క చెరువూ ప్రక్షాళన కాలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా.. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాకపోవడమేనని తేలింది. దాదాపు ఐదారు పర్యాయాలు ఈ పనుల కోసం టెండర్లు పిలిచినా నాలుగైదు పనులకు తప్ప మిగతా వాటిని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వ్యయ ప్రయాసలకోర్చి పనులు చేసినా సకాలంలో బిల్లులు అందుతాయో లేదో అనే సంశయంతోనే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాలేదని సమాచారం. దీంతోపాటు గతేడాది ఎన్నికల కారణంగానూ కొన్ని నెలలపాటు అధికారులు కూడా వీటిపై శ్రద్ధ చూపలేదు. దీంతోపాటు ఎన్నికల కోడ్‌తోనూ టెండరు అగ్రిమెంట్లకు అవకాశం లేకపోవడం తదితరమైనవి మరికొన్ని కారణాలుగా ఉన్నాయి. అయితే, అన్నీ చక్కబడ్డాక.. ఇప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. కేవలం చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లిచరనే కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అమలుకు నోచని హామీ.. గత సంవత్సరం నగరంలోని సరూర్ చెరువు దుస్థితిని వివరిస్తూ నగర పౌరుడొకరు అప్పటి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దాంతో సహా నగరంలోని 20 చెరువుల్ని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించడమేగాక.. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే అధికారులు పనుల కుపక్రమించి.. ఈ పనులకు రూ.287.93 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇవన్నీ పరిశీలించిన ప్రభుత్వం మిషన్ కాకతీయ నాలుగో దశ కింద రూ.282.63 కోట్లు విడుదల చేస్తూ పరిపాలన పర అనుమతులు జారీ చేసి టెండర్లు ఆహ్వానించారు. కానీ.. పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది. ♦ వీటిలో మూడు చెరువుల అభివృద్ధికి సీఎస్సార్ కింద నిధులిచ్చేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు దచ్చాయి. దీంతో వాటి స్థానే ఇతర చెరువులను అభివృద్ధి చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా అంచనాలు రూ.279.78 కోట్లకు తగ్గాయి. ♦ కార్యరూపం దాల్చని ‘ప్రైవేట్’ ప్రతిపాదన నగరంలోని మిగతా చెరువులను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ నిధులతో అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. చెరువుల ప్రక్షాళన పూర్తయ్యాక, తిరిగి మురుగునీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు దిగువన సదుపాయాలు కల్పించడం ఇందులోని ప్రధాన లక్ష్యం. 1. చెరువు/సరస్సు స్థలం మేర ప్రహరీ/ఫెన్సింగ్ ఏర్పాటు 2. ప్రహరీ లోపల చెరువు ఒడ్డున అందమైన పచ్చిక, ఫౌంటెన్లు వంటి సుందరీకరణ పనులు 3. నడక మార్గాల ఏర్పాటు 4. వివిధ రకాల మొక్కలతో పచ్చదనం 5. కూర్చునేందుకు బెంచీలు, కుర్చీల వంటి ఏర్పాట్లు 6. వాహన పార్కింగ్ సదుపాయం 7. రాత్రివేళల్లో అందమైన లైటింగ్ 8. స్నాక్స్, టీ/కాఫీల కేఫటేరియా 9. వాననీరు వెళ్లేందుకు బైపాస్ డ్రెయిన్లు 10. టాయిలెట్లు తదితర సదుపాయాలు ♦ చెరువుల వద్ద జలక్రీడలు, బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలతో వచ్చే ఆదాయన్ని చెరువు పనులు చేసిన ప్రైవేట్ సంస్థకు కొన్నేళ్ల పాటు ఇవ్వాలనేది లక్ష్యం. తర్వాత సదరు చెరువులు జీహెచ్ఎంసీ అజమాయిషీలోకే వస్తాయని పేర్కొన్నారు. కానీ ఆ దిశగానూ ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు. -
భారత్‌లో వివో ఆర్ అండ్ డీ సెంటర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీ సంస్థ వివో భారత్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ఇండియా ఇన్నోవేషన్ టీమ్ పనిచేస్తోంది. భారత మార్కెట్‌కు ఎటువంటి ఫీచర్లు, టెక్నాలజీ అవసరమో అన్న అం శంపై ఈ బృం దం పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తోందని వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపుణ్ మార్యా తెలిపారు. వై95 మోడల్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారమిక్కడ తెలంగాణ సీవోవో జరు సున్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చైనాలో అయిదు, యూఎస్‌లో ఒక ఆర్అండ్డీ కేంద్రం ఉంది. ఈ సెంటర్లలో 2,000 పైచిలుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఇక నోయిడా ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 2.5 కోట్ల యూనిట్లు. ప్లాంటు వినియోగం పూర్తి స్థాయికి చేరుకుంది. నూతన ఫ్యాక్టరీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. విలువ పరంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో 17.6 శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది’ అని ఆయన ఈ సందర్భంగా వివరించారు. -
అభివృద్ధిలో రాజీపడలే..
గుండాల (ఖమ్మం): కనీసం రోడ్డు సౌకర్యం లేని గుండాల ప్రాంతం అభివృద్ధికి 30 ఏళ్ల క్రితమే బాటలు వేశానని, నేటి వరకు మంత్రిగా అనేక పనులు చేయించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ఆయన గుండాలలో టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. రోడ్లు, చెరువులు, నిర్మించామని, సబ్ స్టేషన్ పూర్తి చేశామని, ఉమ్మడి రాష్ట్రంలోనే తన ఇన్నేళ్ల పాలనలో తుమ్మలను గుర్తుపెట్టుకున్న మండలం గుండాల అని ఆనందం వ్యక్తం చేశారు. గుండాల– ఇల్లెందు, చె ట్టుపల్లి, సాయనపల్లికి రోడ్లు వేయించానన్నారు. ఇటీవల టీఆర్ఎస్ పాలనలో రూ.300 కోట్లు మం జూరు చేయించామని వెల్లడించారు. గ్రామాల మధ్య లింకు రోడ్లు, 14 చోట్ల వాగులపై బ్రిడ్జిల నిర్మాణాలు సాగుతున్నాయని అయినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి శూన్యమని చెప్పడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీ య, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణ లక్ష్మి, ఆస రా పింఛన్లు 24 గంటల కరెంటు సరపరా పథకాలతో ప్రజలందరికీ లబ్ధి చేకూరుతోందని వివరించారు. పాయంను ఆదరించండి : ఎంపీ సీతారాంనాయక్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆళ్లపల్లి, గుండాల మండలాలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని, మళ్లీ ఆయ నను ఆదరించి, గెలిపించుకోవాలని ఎంపీ సీతా రాం నాయక్ అన్నారు. గత 60ఏళ్లు పాలనలో ఉ న్న కాంగ్రెస్ పాలకులు చేయలేని పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేక దుర్మార్గపు మాటలు జారు తున్నారని ఆరోపించారు. రానున్నది టీఆర్ఎస్ పాలననేని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా పాయం వెన్నంటే ఉంటూ అహర్నిషలు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చాట్ల పద్మ, జిల్లా నాయకులు భవానీశంకర్, పేరయ్య, సత్య నారాయణ, పైడి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష, కార్యదర్శులు తెల్లం బాస్కర్, ఎస్కె.ఖదీర్, టీ.రాము, ముకుందాచారి, బచ్చల రామయ్య, రషీద్, కుంజ బుచ్చయ్య, బాటయ్య, బుచ్చయ్య, గణేష్, లలిత, నిర్మల, లక్ష్మీనారాయణ, ముఖేష్, దారా అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
భారత వృద్ధికి చోదకశక్తి
పాక్యాంగ్ (సిక్కిం): భారత్ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలను చోదకశక్తిగా మారుస్తామనీ, ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం లో అభివృద్ధి మందగించిందన్నారు. సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని సోమవారం ఇక్కడి పాక్యాంగ్ పట్టణంలో ఆవిష్కరించిన మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానయానం చేయాలనే దిశగా మేం కృషి చేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ దేశంలో 65 విమానాశ్రయాలు ఉండేవి. కానీ గత నాలుగేళ్లలో కొత్తగా 35 విమానాశ్రయాలను మేం ప్రారంభించాం. గతంలో సగటున ఏడాదికి ఓ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే, ఇప్పుడు ఆ సంఖ్య 9 కి చేరుకుంది’ అని మోదీ చెప్పారు. పాక్యాంగ్ పట్టణంలో సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో కొండలపై 201 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. దీన్ని మోదీ ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించారు. కొత్తగా ఓ ప్రాంతంలో పూర్తిస్థాయిలో నిర్మించే ఎయిర్‌పోర్టును గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా పిలుస్తారు. విమానాశ్రయం ఆవిష్కరణ సందర్భంగా మోదీ నేపాలీ భాషలో ప్రసంగాన్ని ప్రారంభించారు. సిక్కిం ప్రజలు ఇక్కడి ప్రకృతి అంత అందమైనవారన్నారు. ఉదయాన్నే చల్లటిగాలి వీస్తుండగా కొండలపై నుంచి సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం అద్భుతంగా ఉందనీ, ఈ సందర్భంగా ఫొటోలు తీసుకోకుండా తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నారు. -
వారణాసి రూపురేఖలు మార్చేస్తాం : మోదీ
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గం వారణాసిలో మంగళవారం జరిగిన ర్యాలీలో రూ 550 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఓల్డ్ కాశీలో సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం, బెనారస్ హిందూ యూనివర్సిటీలో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం వంటి పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. బెనారస్ వర్సిటీలో ప్రాంతీయ ఆప్తాల్మజీ సెంటర్ వంటి పలు కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు. వారణాసి నగర చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ పనులతో కాశీ సహా పరిసర ప్రాంతాల రూపురేఖలు మారతాయని ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు వారణాసిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పరమేశ్వరుడికి వదిలివేశాయని ఆక్షేపించారు. తాను వారణాసి ఎంపీ కాకముందు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా విద్యుత్ స్తంభాల నుంచి తీగలు వేలాడుతుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు. -
ముందస్తు హడావుడి
సాక్షి, వరంగల్ రూరల్: అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో బుధవారం ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నెల 6న అసెంబ్లీని రద్దు చేస్తే బుధవారం చివరి రోజు కావడంతో అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. బుధవారం రాత్రి వరకు పాల్గొని అధికార కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు జోరుగా శంకుస్థాపనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్మించిన పలు భవనాలను సైతం ప్రారంభించారు. రూ.111 కోట్ల పనులకు శంకుస్థాపనలు.. జిల్లాలో పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఒకే రోజు రూ.111.04 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ కార్యకర్తలను సమయాత్తం చేశారు. పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి బుధవారం ఒక్కరోజే రూ.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరకాలలో శంకుస్థాపనలు.. దామెర మండలంలో రూ.12 కోట్లతో దామెర క్రాస్ రోడ్డు నుంచి పరకాల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు రూ.1.25 కోట్లతో నూతన తహసీల్దార్ భవన నిర్మాణం ఆత్మకూరు మండలంలో రూ.20 లక్షలతో కమ్యూనిటీ భవనాలు గీసుకొండ మండలం మచ్చాపుర్ నుంచి లక్ష్మీపురం వయా ఎలుకుర్తి రోడ్డు విస్తరణ పనులు. పరకాల మండలంలో రూ.1.25 కోట్లతో నూతన ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం. రూ.1.25 కోట్లతో పరకాల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం నడికూడ మండలంలో రూ.1.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం. వర్ధన్నపేటలో.. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం ఒక్కరోజే రూ.75.04 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.11.5 కోట్లతో పర్వతగిరి, నందనం, ఇల్లందలో చెక్‌డ్యాం పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.2.60 కోట్లతో కోనారెడ్డి చెరువు పునరుద్ధరణ పనులు. పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్‌పర్తిలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో రూ.44 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు.. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో రూ.1.30 కోట్లతో మజీదుల అభివృద్ధి పనులు. వర్ధన్నపేట మండలంలో రూ.15 కోట్లతో కట్య్రాల నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన. ప్రారంభోత్సవాలు.. రూ.1 కోటితో నిర్మించిన వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్ నూతన భవనంను ప్రారంభించారు. నర్సంపేటలో.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఖానాపురం మండలంలో రూ.15 లక్షలతో నిర్మించిన మూడు కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. ప్రతిపాదనలు ఆయా నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో మిగిలిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను చీఫ్ ప్లానింగ్ కార్యాలయంలో అందించారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పీఏలు ప్రతిపాదనలను సీపీఓకు అందించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కలెక్టర్ హరితకు అందించారు. -
నత్తే నయం!
పల్లె రోడ్లకు గ్రహణం వీడడం లేదు. నిధులొచ్చినా మహర్దశ పట్టడం లేదు. సర్కారు అశ్రద్ధ, అధికారుల అలసత్వం మూలంగా అలాగే ఉండిపోతున్నాయి. ఎప్పటికి బాగుపడతాయో తెలియక గ్రామీణులు నిట్టూరుస్తున్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ రోడ్ల నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాల్సిన పనులు తీవ్ర ఆలస్యం కావడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రగతి ఏకంగా 11వ స్థానానికి పడిపోయింది. కర్నూలు(అర్బన్): గ్రామీణ రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నిధులు రావడంతో రోడ్లు బాగుపడతాయని ఆశించిన పల్లెవాసులకు నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని పంచాయతీరాజ్ సబ్ డివిజన్లలో రూ.51.22 కోట్ల వ్యయంతో 225 కిలోమీటర్ల (కి.మీ) మేర సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు రూ.31.14 కోట్ల వ్యయంతో 103.80 కి.మీ. మేర మాత్రమే నిర్మించారు. గతంలో ఇచ్చిన 225 కి.మీ. లక్ష్యానికి అదనంగా ఈ నెల 24వ తేదీన మరో 139 కి.మీ. మేర సీసీ రోడ్లను నిర్మించాలని పంచాయతీ రాజ్ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో సీసీ రోడ్ల నిర్మాణాల్లో జిల్లా ప్రగతి చివరి స్థానానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీటీ రోడ్ల నిర్మాణాల్లోనూ ఎనలేని జాప్యం చోటు చేసుకుంటోంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.132 కోట్ల వ్యయంతో 221 కి.మీ. మేర బీటీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.66.39 కోట్ల వ్యయంతో 110.65 కి.మీ. మేర మాత్రమే పూర్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పార్లమెంట్ సభ్యుల నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్స్ తదితర మ్యాచింగ్ గ్రాంట్లతో ఈ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటి ప్రగతిలో జిల్లా స్థానం 11కు పడిపోవడంతో కలెక్టర్ సత్యనారాయణ పీఆర్ ఎస్ఈపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనుల్లో వేగం పెంచాలంటూ ఇటీవల జరిగిన సమీక్షలో పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడుకు నోట్ కూడా పంపినట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 13 పీఆర్ సబ్ డివిజన్లు ఉన్నాయి. నాలుగింటిలో సీసీ రోడ్ల నిర్మాణాలు తీవ్ర జాప్యం అవుతున్నాయి. కోడుమూరు సబ్ డివిజన్లో 17.50 కి.మీ మేర సీసీ రోడ్లు వేయాల్సి ఉండగా.. కేవలం 6.16, పత్తికొండ సబ్ డివిజన్లో 18.31 కి.మీకి గాను 6.25, నందికొట్కూరులో 17.50 కి.మీకి గాను 6.94, ఆదోని సబ్ డివిజన్లో 8.20 కి.మీకి గాను కేవలం 1.67 కి.మీ మేర మాత్రమే రోడ్లు వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేగం పెంచేందుకు చర్యలు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పలు ప్రాంతాల్లో మెటల్ లభించడం కొంత కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత ఇంజినీర్లు మా దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కింది స్థాయి ఇంజినీర్లను ఆదేశించాం. దీంతో రెండు రోజుల్లోనే ఏడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. నిర్ణీత సమయంలోగా అన్ని పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. – కేవీ సుబ్బరాయుడు, పీఆర్ ఎస్ఈ -
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం
చేజర్ల (నెల్లూరు): ప్రజాక్షేత్రంలో ఉంటూ నిత్యం ప్రజాసేవకే అంకితమై సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తనను టీడీపీ అధికార దర్పంతో, బెదిరింపులతో, పోలీస్ అరెస్ట్‌లతో ఆపలేదని, ప్రజాదీవెనే తనకు కొండంత అండ అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం చేజర్ల మండలంలోని మాముడూరు, నడిగడ్డ అగ్రహారం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ బాలిరెడ్డి రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డిని ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులురెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బృందాలు మోహరించి ఎమ్మెల్యే కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినని, గ్రామంలో పర్యటించి తీరుతానని, తనను అడ్డగిస్తే చూస్తూ ఊరుకోబోనని ఎమ్మెల్యే ముందుకుసాగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ హిట్లర్ పాలన కొనసాగిస్తూ నియంతగా వ్యవహరిస్తోందన్నారు. సాక్షాత్తు అధికారులే గ్రామంలో ప్రోటోకాల్ ప్రకారం శిలాపలకాలు వేయించి ప్రారంభం తేదీ నిర్ణయించిన తరువాత అధికారపార్టీ నాయకులకు తలొగ్గి తిరిగి వారే పోలీసులకు ఫిర్యాదు చేయడం, పర్యటనను అడ్డుకోవాలని చెప్పడం దారుణమన్నారు. అధికారులు టీడీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం 14వ ఆర్థిక సంఘం నిధులతో మామూడూరు నడిగడ్డ అగ్రహారం గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు కూడా సర్పంచ్‌లతో ప్రారంభించకుండా అధికారులు అడ్డుపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని అన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం టీడీపీ హయాంలో సర్పంచ్‌లను ఉత్సవమూర్తులుగా చేసి జన్మభూమి కమిటీ సభ్యులతో గ్రామాల్లో అధికారపార్టీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని, సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయకుండా వారి అనుచరులకే ఇస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, తాను ప్రజాసేవ చేసేందుకు తనకిష్టమొచ్చిన ప్రాంతంలో పర్యటిస్తానని, అడిగే హక్కు ఎవరికీ లేదని అన్నారు. శిలాపలకాలపై పేర్లు వేయించుకోవడం కాదని, నాయకులు ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించుకోవాలని అన్నారు. అధికారులు ప్రోటోకాల్ సాకుతో ఈ విధంగా చేయడం, భారీగా పోలీసులు మోహరించడం సరికాదని, ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమేనని అన్నారు. ప్రత్యేక హోదా కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగంపై తమకు పూర్తి నమ్మకముందని, రాజ్యాంగాన్ని, వ్యవస్థను ధిక్కరించి తామెప్పుడూ ఏ కార్యక్రమాలకు హాజరుకాలేదని అన్నారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. గ్రామాభివృద్ధిని ఓర్వలేకనే అధికారులపై ఒత్తిడి సర్పంచ్ బాలిరెడ్డి రమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గ్రామాభివృద్ధిని ఓర్వలేకనే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి గ్రామంలో ఇలా అలజడి సృష్టించారన్నారు. తనపైన, తమ భర్త బాలిరెడ్డి సుధాకర్రెడ్డిపైన గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని, గ్రామాభివృద్ధికి తమ కుటుంబం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని బెదింపులకు పాల్పడినా బెదిరేది లేదని, మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. సాక్షాత్తు అధికారులే ప్రోటోకాల్ ప్రకారం శిలాపలకాలు తయారుచేయించి ప్రారంభం తేదీ నిర్ణయించి తిరిగి అధికారులే ఇలా అడ్డుకోవడం సరికాదని, ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారన్నారు. ఇకనైనా అధికారపార్టీ నాయకులు తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో గ్రామ ప్రజల ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మండల కన్వీనర్ తూమాటి విజయభాస్కర్‌రెడ్డి, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనందరెడ్డి, సంగం మండల కన్వీనర్ కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఏఎస్‌పేట మండల మహిళా కన్వీనర్ బోయళ్ల పద్మజారెడ్డి, ఆత్మకూరు యువత అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ బాలిరెడ్డి రమాదేవి, ఎంపీటీసీలు గిరిధర్‌రెడ్డి, గణేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు పూనూరు బాలకృష్ణారెడ్డి, బోయళ్ల చెంచురెడ్డి, సుందరరామిరెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, భాçస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, రఫీ, రమణయ్య, కోటయ్య, వెంకటేశ్వర్లురెడ్డి, కృష్ణారెడ్డి, వేణు, జయంతిరెడ్డి, యానాదిరెడ్డి, ప్రసాద్, పాపిరెడ్డి, కాలేషా తదితరులు పాల్గొన్నారు. -
వారిని కలిసేందుకు భయపడను..
లక్నో : పారిశ్రామికవేత్తలతో తాను సన్నిహితంగా ఉంటానన్న విపక్షాల ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా బదులిచ్చారు. ఇతరుల మాదిరి తాను పారిశ్రామికవేత్తలతో కలిసి కనిపించేందుకు భయపడబోనని పరోక్షంగా రాహుల్, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషిప్తారని పేర్కొన్నారు. గతంలో మహాత్మ గాంధీ స్వాతంత్రపోరాట సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్తకు చెందిన బిర్లా హౌస్‌లో బస చేసేవారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. పరిశ్రమ అధినేతలు హాజరైన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆదివారం లక్నోలో 81 ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. కొందరు బాహాటంగా పారిశ్రామికవేత్తలను కలువని నేతలు తెరచాటుగా వారితో సన్నిహితంగా మెలుగుతారని..పారిశ్రామికవేత్తల విమానాల్లో వీరు విహరిస్తుంటారని మోదీ ఆరోపించారు.దేశ అభివృద్ధికి సహకరించే పారిశ్రామికవేత్తలను దొంగలని ఎందుకు పిలవాలని ప్రశ్నించారు. కాగా రైతులు, అణగారిన వర్గాల వారిని విస్మరిస్తూ ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. -
ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అల్గునూర్: ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉ న్నానని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ పంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌లో మండల ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రా మకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని ఊరచెరువు అభివృద్ధిచేయాలని ముదిరాజ్‌లు కోరుతన్నారని తెలిపారు. ఈ విషయమై చెరువు అభివృద్ధికి మిషన్‌కాకతీయ పథంలో అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావుకు ప్రతిపాదనలు కూడా పంపించామని తెలిపా రు. త్వరలోనే చెరువలో పూడితతీత చేపడతామని ముదిరాజ్‌లు చేపలు పెంచుకుని ఉపాధిపొందేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ము దిరాజ్‌కు ఎల్ఎండీపైనే ఆధారపడ్డారని చెరువు అభివృద్ధితో గ్రామంలోని సంఘంసభ్యులు చేప లు పెంచుకుని ఉపాధిపొందాలని సూచించారు. ముదిరాజ్‌ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా చేపపిల్లలు కూడా పంపిణీ చేస్తోందన్నారు. రామకృష్ణకాలనీలోని పెద్దమ ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సొంత నిధులు మం జూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ క మ్యూనిటీ భవన నిర్మాణానికి కూడా త్వరలో ని ధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ముదిరాజ్ సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఇందిరానగర్ స ర్పంచ్ మెంగని రమేశ్, నుస్తులాపూర్ సింగిల్విం డో చైర్మన్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ప్ర ణీత్రెడ్డి, వార్డుసభ్యుడు దావు సంపత్‌రెడ్డి, ముదిరాజ్ నాయకులు సిద్ద దాసు, భూమయ్య, పండు గ రాజు, కొమురయ్య, చంద్రయ్య, నాయకులు సుగుర్తి జగదీశ్వరాచారి, నాగేందర్, పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గన్నేరువరం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయ మని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని గోపాల్‌పూర్‌లో హన్మాజిపల్లె గ్రా మానికి చెందిన రజితకు రూ.10 వేలు, మైలారం గ్రామానికి చెందిన సంతోష్‌కు రూ. 6వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం వారికి అందించారు. అనంతరం గ్రామానికి చెందిన, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ ఆకుల సంతోశ్ తండ్రి ఆకుల నర్సయ్య ఇటీవల మృతిచెందగా వారి కు టుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామం లోని సమస్యలపై గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. సీసీ రోడ్లు వేయాలని గ్రామస్తులు కోరా రు. రైతు బంధు పథకంలో చెక్కులను మరికొంత మంది రైతులకు రాలేదని వాటిని ఇప్పించాలని రై తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. రైతుల సంక్షేమానికై రైతు బంధు, రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అర్హులైన వారందరికి ఈ పథకాన్ని వర్తింపజేయడం తమ లక్ష్యమన్నా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రా వు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, మండల కోఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ న్యాత సుధాకర్, ఆర్ఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి, సర్పంచు గువ్వ వీరయ్య, యూత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు బొడ్డు సునిల్, అటికం రవి, ఉపాధ్యక్షుడు చింతలపల్లి నర్సింహరెడ్డి, కొర్వి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్ళపల్లి అనిల్‌గౌడ్, తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, నూనే చంద్రారెడ్డి, పుల్లెల నరేందర్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు శ్రీకారం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రూ.6,688 కోట్ల విలువైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, వీటిని 8 వేలకు పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి కేంద్రం సహకారం అందించాలన్నారు. ఎంపీలు కె.హరిబాబు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం, రైల్వే జోన్ తదితర అంశాలను ప్రస్తావించారు. విశాఖ నగర ప్రజలకు కాలుష్యరహితమైన గాలిని అందించడానికి ఖర్చుకు వెనకడుగు వెయ్యవద్దని కేంద్ర మంత్రి తమకు స్వేచ్ఛ ఇచ్చారని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. కేంద్ర హైవేల శాఖ సభ్యుడు ఆర్.కె పాండే మాట్లాడారు. వీసీటీఎల్లో నూతన క్రేన్లు ప్రారంభం పాతపోస్టాఫీసు: విశాఖ కంటెయినర్ టెర్నినల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రేన్లను కేంద్ర ఉపరితల, నౌకాయన మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీటీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ రూ.151 కోట్ల వ్యయంతో రెండు పోస్ట్ పనామెక్స్ క్వే క్రేన్లు, రబ్బర్ టైర్స్ గేంట్రీ క్రేన్లు నాలుగు కొనుగోలు చేశామని తెలిపారు. క్వే క్రేన్లు 41 టన్నుల బరువున్న కంటెయినర్లను ఒక గంటలో 27 నుంచి 30 వరకు లోడ్ చేయగలవని తెలిపారు. లోడ్ చేసే సమయంలో కంటెయినర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆధునిక రక్షణ వ్యవస్థ ఉందన్నారు. ఇప్పటికే ఉన్న నాలుగు క్వే క్రేన్లకు మరో రెండు నూతన క్రేన్లు తోడవ్వడంతో లోడింగ్‌ను ఆపకుండా రౌండ్ ది క్లాక్ చేయవచ్చని తెలిపారు. శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు ఇవే.. ఆరు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన ఒక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 444.5 కోట్లు నరసన్నపేట నుంచి రణస్థలం వరకు 54.2 కిలోమీటర్ల పరిధిలో, రణస్థలం నుంచి ఆనంద ³#రం వరకు 47 కిలోమీటర్ల రహదారి నిర్మాణం ఆనందపురం నుంచి పెందుర్తి వరకు 50.75 కిలో మీటర్లు, ఎన్‌హెచ్ 16 నుంచి విశాఖ పోర్టుకు కనెక్టివిటీకి 12.7 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి కాన్వెంట్ జంక్షన్ వద్ద బైపాస్ ఏర్పాటు చేస్తూ పోర్ట్ రద్దీని నియంత్రించే రోడ్డుకు 60 కోట్లతో నిర్మాణాలు విశాఖ పోర్ట్ నుంచి ఎన్‌హెచ్ 16కు 4.15 కిలోమీటర్ల పరిధిలో 100 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల రహ దారిని జాతికి అంకితం చేశారు. -
గండికోట ప్ర‘గతి’ ఇంతేనా..!
జమ్మలమడుగు : గండికోట అభివృద్ధికి నోచుకోవడం లేదు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గండికోట.. అందాలతోపాటు అపురూపమైన శిల్పసంపదకు నిలయంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గండికోట అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోట, బెలూంగుహలను కలిపి ప్రత్యేక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని కడపకు వచ్చిన ప్రతి సారి హామీలు ఇచ్చారే కానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గండికోటలో ఇటీవల తమిళ, కన్నడ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన వారు సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు. అయినా మన ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయడం లేదు. 2015 నవంబర్ 10న ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని, విదేశాల నుంచి పర్యాటకులు భారతదేశానికి వస్తే వారు కచ్చితంగా జమ్మలమడుగులోని గండికోట ప్రాంతాన్ని చూసే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే అమెరికాలోని గ్రాండ్ కెనాల్‌పై నిర్మించిన స్కైవాక్‌ను.. ఇక్కడి లోయ వద్ద ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. రెండున్నరేళ్లు దాటినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రెండు సార్లు గండికోట ఉత్సవాలను నిర్వహించినా అభివృద్ధి జరగలేదు. బోర్డులకే పరిమితమైన బోటింగ్ మైలవరం జలాశయం నుంచి బోటింగ్ ఏర్పాటు చేస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ బోటింగ్ లేకపోవడంతో అసంతృప్తితో తిరిగి వెళుతున్నారు. ఇక్కడ బోటింగ్ బోర్డులకే పరిమితమైంది. దీంతో పలువురు గండికోటలో ఉన్న పురాతన ఆలయాలతోపాటు జుమ్మామసీదు, పెన్నానది అందమైన లోయను చూసి వెళ్తున్నారు. రహదారులు కూడా లేవు గండికోటకు వచ్చే పర్యాటకులకు వివిధ ప్రాంతాలలో ఉన్న వాటిని చూడటం కోసం సరైన రహదారులు కూడా లేవు. జుమ్మా మసీదు నుంచి పెన్నానది లోయ వద్దకు వెళ్లేందుకు పెద్ద రాళ్లు ఎక్కి దిగి వెళ్లాల్సి వస్తోంది. సరైన రహదారిని కూడా అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో చాలా మంది వృద్ధులు నడవలేక అవస్థలు పడుతున్నారు. సౌకర్యాలు లేవు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ బోటింగ్ ఉందని బోర్డుల పైన ఉంది. తీరా ఇక్కడ చూస్తే ఎటువంటి బోటింగ్ లేదు. హైదరాబాద్ నుంచి వచ్చాను. లోయ అందాలు చాలా బాగున్నాయి. భద్రత ఎక్కడా లేదు.– ప్రవీణ్‌కుమార్, హైదరాబాద్. -
మహిళలు సీరియల్స్ చూసి ఆనందించాలి: లోకేష్
చీరాల: మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్థన మేరకు రూ.25 కోట్ల నిధులతో సీసీ రోడ్లు నిర్మానానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఆమంచి మాట్లాడుతూ నియోజకవర్గంలో 225 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాలు జరగలేదని అందులో చీరాల మండలానికి రూ.10 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తన పర్యటన ముగింపునకు కొద్దిరోజుల క్రితమే చీరాల నియోజకవర్గానికి బీటీ రోడ్లు నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించానని, కొద్ది రోజుల్లో రూ.15 కోట్లు కేటాయించి 225 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. రామాపురంలో జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ మత్య్సకారుల సంక్షేమానికే టీడీపీ ప్రభుత్వం పాటు పడుతోందని, మత్య్సకారులందరికీ డీజిల్ సబ్సిడీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 150 మందికి ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్లు, ముఖద్వారం ఏర్పాటు చేస్తానన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అందుకే సీరియల్స్ చూసి ఆనందంగా ఉండాలంటూ మహిళలకు సూచించారు. 2020 నాటికి రాష్ట్ర అబభివృద్ధిలో అగ్రభాగాన నిలిపి అంగన్ వాడీ భవనాలు, ఎల్ఈడీ భవనాలు, సీసీ రోడ్లు నిర్మించి ఇస్తామన్నారు. దిక్కులేని రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద దిక్కు అని సభలో లోకేష్ వాఖ్యానించారు. రైతు రుణమాఫీకి నియోజకవర్గానికి రూ.1.30 కోట్లు విడుదల చేశామన్నారు. హార్బర్ రాదు.. ‘కేంద్రం, రాష్ట్రాన్ని మోసం చేసింది..రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేధించింది. మత్య్సకారుల చిరకాల వాంఛ అయిన హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు. నీతి ఆయోగ్ పథకం ఒట్టిదే’ అని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. వేటపాలెం మండలం రామాపురంలో జరిగిన మత్య్సకారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి సీఎం 11 గంటలు కష్టపడుతున్నారని, మత్య్సకారుల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మత్య్సకారులకు ముఖ్యమైన హార్బర్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఆమంచి అడుగగా మంత్రి ఆదినారాయణ మాత్రం కేంద్రం హార్బర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదు....సాగర్ మాల అంతా బూటకం అని వాఖ్యానించారు. డబ్బులు, పెట్రోల్ ఫ్రీ మొదటిసారి నియోజకవర్గ పర్యటనకు చీరాలకు వచ్చిన మంత్రి లోకేష్ పర్యటనలో తన ఓటు బ్యాంకును చూపించుకోవడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధి గ్రామాల నుంచి జన సమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి 4 నుంచి 6 ప్రైవేటు స్కూళ్ల బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు బైక్ ర్యాలీతో స్వాగతం పలికించారు. టూవీలర్‌కు 2 లీటర్ల పెట్రోల్, డబ్బులు, పార్ట స్టికర్లు పంపిణీ చేశారు. ఆమంచి వర్సెస్ కలెక్టర్ చీరాల: మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొత్తపేట జెడ్పీ హైస్కూల్ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆమంచి మధ్య వాగ్వాదం జరిగింది. హైస్కూల్ నిర్మించిన స్థల వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రారంభించకుండానే వెనుదిరిగి వెళ్లారు. అసలు కొత్తపేట హైస్కూల్ ప్రారంభానికే వచ్చినప్పటికీ కలెక్టర్ సూచనల మేరకు మంత్రి లోకేష్ వెనుతిరిగారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొత్తపేటలో హైస్కూల్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో రూ.2.20 కోట్ల అంచనాలతో కేవలం 50 రోజుల్లోనే నూతన భవంతులు నిర్మించారు. ఈ స్కూల్లో బస్సు సౌకర్యం, విద్యార్థులకు సైకిళ్లు, మధ్యాహ్న భోజనం, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా స్కూల్ నిర్మాణం చేశారు. అయితే కొత్తపేట హైస్కూల్ నిర్మించిన స్థలం ది ఐఎల్టీడీ కోపరేటివ్ సొసైటీకి చెందింది. అందులో కార్మికులు కొందరికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కాగా ఇదే స్థలంలో హైస్కూల్ నిర్మాణం చేపట్టడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కోర్టులో కేసు నడుస్తుండగా స్టే కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో చీరాల పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి అల్పాహారానికి వెళ్లారు. లోకేష్‌తో పాటుగా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులున్నారు. ఇక్కడ సమస్యను కలెక్టర్ వినయ్‌చంద్ లోకేష్‌కు వివరించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఆమంచి.. కలెక్టర్‌తో విభేందించారు. ఉదయం 8 గంటలకే మంత్రి లోకేష్‌తో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖాముఖి అన్నారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. చివరకు పాఠశాల ప్రారంభం కానీ, ముఖాముఖి లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. -
రుయాకు మహర్దశ !
తిరుపతి (అలిపిరి) : శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ రుయా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి మహర్దశ పట్టనుంది. ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 19.58 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్లు, విద్యుత్ వసతులు, భవన నిర్మాణాల పనులు చేపట్టనున్నారు. ఫైర్ సేప్టీ వ్యస్థతో పాటు ఆపరేషన్ థియేటర్లలో అత్యాధునిక బ్యాక్టీరియా ఫ్రీ సిస్టం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొదటి దఫా రుయాకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. అదే విధంగా కాన్పుల ఆస్పత్రి అభివృద్ధికి రూ.3.2 కోట్లు మంజూరయ్యాయి. ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ సాధన కోసం.. రుయా, మెటర్నటీ ఆస్పత్రులను ఆరు నెలల క్రితం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్) కమిటీ పరిశీలించింది. పలు లోపాలను గుర్తించి వాటిని భర్తీ చేయాలని సూచించింది. ముఖ్యంగా ఆస్పత్రిలో ఫైర్ సేప్టీ వ్యవస్థ, భవన నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లో వసతులను సమకూర్చుకోవాలని సూచించింది. దీంతో రుయా, మెటర్న టీ ఆస్పత్రులు ఎలాగైనా ఎన్ఏబీహెచ్ గుర్తింపు కోసం మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. పనులకు త్వరలో శ్రీకారం రుయాలో వచ్చే నెల మొదటి వారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి రానుంది. రుయాలో అభివృద్ధి పనుల అనంతరం మరోమారు ఎన్ఏబీహెచ్ సభ్యులు సందర్శించనున్నారు. అభివృద్ధి పనులపై సంతృప్తి చెందితే ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ వచ్చే అవకాశం ఉంది. అక్రిడిటేషన్ సాధిస్తే రుయాకు ఇన్‌పేషెంట్ల సంఖ్య బట్టి నిధులు మంజూరవుతాయి. ఆస్పత్రిలో పరిశీలన రుయా ఆస్పత్రిలో ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్‌కు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన స్థల పరిశీలన, మౌలిక సదుపాయల కల్పన తదితర అంశాలపై ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) ఈఈలు గురువారం రుయా ఆస్పత్రిని పరిశీలించారు. నూతన ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఎలక్ట్రికల్, ఫైర్‌సేప్టీ వ్యవస్థ ఏర్పాటుకు మ్యాప్‌లను పరిశీలించారు. రుయా ఆస్పత్రిని పరిశీలించిన వారిలో ఏపీఎంఎస్ఐడీసీ డిజైన్ ఈఈ నెహ్రూ, ఈఈ నగేష్‌తో పాటు రుయా ఆర్ఏంఓ డాక్టర్ శ్రీహరి, రుయా అభివృద్ధి కమిటీ సభ్యులు చిన్నబాబు, అడ్మినిస్టేటర్ ఉమాశంకర్ ఉన్నారు. -
ఆ స్టేషన్లో ఎయిర్పోర్ట్ తరహా సౌకర్యాలు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన స్టేషన్ పునఃఅభివృద్ధి కార్యక్రమం కింద సూరత్ రైల్వే స్టేషన్‌ను అత్యంత అధునాతన సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే సర్వాంగ సుందరంగా ముస్తాబు కానున్న మూడవ స్టేషన్‌గా సూరత్ నిలవనుంది. గుజరాత్లో గాంధీనగర్ తర్వాత సూరత్ రైల్వే మంత్రిత్వ శాఖ రూ లక్ష కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది. కార్యక్రమానికి కేటాయించే నిధులతో రైల్వే మంత్రిత్వ శాఖ సూరత్ రైల్వేస్టేషన్‌ను ఎయిర్పోర్ట్ తరహా సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. స్టేషన్లో మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టేషన్ హబ్ ఏర్పాటుకు ఐఆర్ఎస్డీసీ, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్, జీఎస్ఆర్టీసీల సంయుక్త సంస్థ సిట్కో టెండర్లను ఆహ్వానించింది. రూ 5000 కోట్లతో నిర్మించే ఈ హబ్ 2020 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్ధానిక సంస్థ సంయుక్తంగా చేపడతాయని, నిర్మాణ పనులు ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతాయని ఐఆర్ఎస్డీసీ ఎండీ ఎస్కే లోహియా చెప్పారు. స్టేషన్లో విశాల ప్రాంగణంలో బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని 900 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రోజూ 3 లక్షల మంది ప్రయాణీకులను హ్యాండిల్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. స్టేషన్ సమీపంలో అయిదు రోడ్డు అండర్‌బ్రిడ్జిలు నిర్మిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో దేశంలోని తొలి ప్రపంచశ్రేణి రైల్వే స్టేషన్లు హబీబ్‌గంజ్, గాంధీనగర్‌లు సేవలందించేందుకు సిద్ధమవుతాయన్నారు. -
‘అభివృద్ధి నినాదంతో ముందుకెళతాం’
సాక్షి, కాన్పూర్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి, సుపరిపాలనే ప్రచారాంశాలుగా బీజేపీ బరిలో దిగుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధే తమ ప్రధాన నినాదంగా ఉంటుందన్నారు. వచ్చే నెలలో జరిగే కైరానా లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ హుకుం సింగ్ మరణంత ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 28న కైరానా పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ప్రధాని చైనా పర్యటనను ప్రస్తావిస్తూ చైనాతోనే కాక ఇరుగుపొరుగు దేశాలన్నింటితో మెరుగైన సంబంధాలను భారత్ కోరుకుంటుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. -
ఆంధ్రాలో వెలవెల.. తమిళనాడులో జలకళ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు, సూళ్లూరుపేట: ఆంధ్రా, తమిళనాడుల్లో విస్తరించిన పులికాట్ సరస్సు సహజసిద్ధంగా ఏర్పడింది. వేసవికి ముందే ఏటా ఈ సరస్సు ఎండిపోతోంది. పాలకులు పులికాట్ అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. మార్చికే ఉత్తరంవైపు సరస్సు ఎడారిలా మారింది. ముఖద్వారాలు పూడికతో మూసుకుపోవడంతో సరస్సు ఎడారిగా మారి జాలర్లకు జీవనోపాధి తగ్గిపోయింది. కాగా, తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జలకళతో ఉట్టిపడుతోంది. తమిళనాడు ఏటా రూ.30 లక్షలు కేటాయించి పల్వేరికాడ్ ముఖద్వారంలో వేసవిలో ఇసుకమేటలు తొలగించి పూడిక తీయిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇక్కడ ప్రభుత్వానికి లేకుండా పోయింది. పూడిపోయిన ముఖద్వారాలు మన రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల పరిధిలో పులికాట్ సరస్సు సుమారు 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వ్యాపించింది. మిగిలిన 120 చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలూకా పరిధిలో విస్తరించింది. బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకు తమిళనాడు పరిధిలోని పల్వేరికాడ్ వద్ద ఒక ముఖద్వారం, నెల్లూరు జిల్లా వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద ఒక్కో ముఖద్వారం ఉన్నాయి. సముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉ«ధృతి పెరిగినప్పుడు ఉప్పునీరు పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. వర్షాకాలంలో మంచినీరు, ఉప్పునీరు కలగలసి సరస్సు నిండుకుండలా ఉంటుంది. వేసవి కాలంలో సముద్రం నుంచి ఉన్న ముఖద్వారాల గుండా ఉప్పునీరు మాత్రమే సరస్సుకు చేరుతుంది. దక్షిణం వైపు పల్వేరికాడ్ ముఖద్వారంలో తమిళనాడు ఏటా వేసవిలో పూడిక తీయిస్తుండటంతో ఆ వైపు నీళ్లు ఉంటున్నాయి. ఉత్తరం వైపు రాయదొరువు ముఖద్వారం పూడికతో ఇసుక మేటలు పడి మూసుకుపోయింది. పూడిక తీయిస్తే ఈ వైపు కూడా ఎప్పుడూ నీళ్లు ఉండి, మత్స్యసంపద చేరి జాలర్లకు జీవనోపాధి కలుగుతుంది. ముఖద్వారాల పూడికతీత పనులు జరిగేనా! తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలను పూడిక తీయించాలని గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) రెండు ముఖద్వారాల పూడికతీతకు సుమారు రూ.12 కోట్లుతో అంచనాలు రూపొందించి ఆ ప్రతిపాదనలను 2010లోనే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే దీనికి సుమారు రూ.10 కోట్లు దాకా వచ్చే అవకాశం ఉందని, మొదట విడతగా కంపా అనే సంస్థ నుంచి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నామని 2013 మేలో స్థానిక పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులకు ఉత్తర్వులు అందాయి. తర్వాత దుగరాజపట్నం ఓడరేవు తెరమీదకు రావడంతో ముఖద్వారాల పూడిక విషయం మసకబారింది. అప్పటి ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించి ఉంటే ఈ పాటికి సరస్సు కళకళలాడుతూ కనిపించేదేమో! ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కారణం.. దుగరాజపట్నం ఓడరేవుకు ముడిపెట్టి ముఖద్వారాల పనులను గాలికి వదిలేశారు. చివరకు అటు ఓడరేవు లేదు.. ఇటు ముఖద్వారాల పూడికతీతకు మంజూరుచేసిన నిధులూ మురిగిపోయాయి. ఇదిలా ఉండగా పూడికతీత పనులకు రూ.48 కోట్లు కేటాయిస్తున్నానని ఈ ఏడాది జనవరిలో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నిధులు మంజూరుకాలేదు. -
కోటకు ‘స్మార్ట్'లుక్
వరంగల్ అర్బన్: స్మార్ట్‌సిటీ నిధులతో చారిత్రక ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ కమిషనర్ వీపీ.గౌతమ్ ఆదేశించారు. రెండో రోజు గురువారం మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్మార్ట్ రోడ్లు తదితర అభివృద్ధి పనులపై వారు బస్సు యాత్ర నిర్వహించారు. కాజీపేట ఫాతిమానగర్‌లో ప్రారంభమైన ఏసీ బస్సు యాత్ర అర్బన్ కలెక్టరేట్ వరకు సాగింది. గ్రేటర్ ఇన్చార్జి ఎస్ఈ లింగమూర్తి, ఈఈలు భిక్షపతి, విద్యాసాగర్, ఇన్చార్జి సీపీ శ్యాంకుమార్, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల శాఖ అధికారులు, లీ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌సిటీ –3 ఫేజ్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్, కమిషనర్ సూచనలు.. ♦ ఫాతిమానగర్ కేయూ క్రాస్‌రోడ్డు నుంచి ములుగు రోడ్డు వరకు డివైడర్, సుందరీకరణ, ఎలిమెంట్స్ పనులు చేయాలని ఆదేశించారు. ♦ ఖిలా వరంగల్ కోటను పూర్తిస్థాయిలో టూరిజం స్పాట్‌గా మార్చుతున్నారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాలు, కోట చుట్టూ రోడ్డు నుంచి ఖుష్‌మహల్ వరకు స్మార్ట్ లుక్ కోసం అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని లీ అసోసియేట్స్ ప్రతినిధులకు సూచించారు. ♦ ఖమ్మం రోడ్డులోని శివనగర్ వాటర్ ట్యాంకు నుంచి వరంగల్ రైల్వే స్టేషన్‌లోని 3 ప్లాట్ఫారం వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. ♦ ఖమ్మం రోడ్డులోని మామూనూరు మీదుగా ఐనవోలు క్రాస్‌రోడ్డు వరకు రెండు వైపులా వెడల్పు, స్ట్రామ్ వాటర్ డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు ప్రతిపాదనలు. ♦ రంగశాయిపేట చౌరస్తా నుంచి ఖమ్మం బైపాస్ రోడ్డు వరకు బై సైకిల్, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్‌కు మార్కింగ్, ఖమ్మం బైపాస్ రోడ్డు (ఇసుక అడ్డా)ను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. -
సిటీ రైల్వే స్టేషన్‌కు మహర్దశ
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు రానున్నాయి. స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా రూ.25కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడితే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. పనులను సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. 2018–19 బడ్జెట్ నుంచి ఇస్తున్న నిధులను ఏయే అవసరాలకు వినియోగించాలనే అంశాలతో కూడిన అంచనా విలువలను ఈనెల 10వ తేదీలోపు ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంది. దీంతో సివిల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాక్, టెక్నికల్ వంటి విభాగాలు కసరత్తు మొదలుపెట్టాయి. నెరవేరనున్న దశాబ్దాల కల కర్నూలు రైల్వే స్టేషన్‌ను బ్రిటిష్ హయాంలో నగరంలోని నర్సింహారెడ్డి నగర్, ఇందిరాగాంధీ నగర్ మధ్య నిర్మించారు. అప్పట్లో నగర జనాభా, స్థాయిని బట్టి ‘కర్నూలు టౌన్’గా పేరు ఖరారు చేశారు. రైల్వే బోర్డు నిర్ణయం ప్రకారం హాల్ట్, క్రాస్, టౌన్, సిటీ, క్లాస్–ఏ సిటీ పేర్లు పెడితే వాటికి తగ్గట్లుగా స్టేషన్లు అభివృద్ధి చేస్తారు. టౌన్ స్టేషన్ ఉన్న కారణంగా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండేది. 1995లో కర్నూలు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచారు. అప్పటి నుంచి స్టేషన్ స్థాయిని టౌన్ నుంచి సిటీగా మార్చాలని డిమాండ్ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించడంలో 2014లో కర్నూలు సిటీగా ఏర్పడింది. అయితే ఇప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. సమస్యలు ఇవీ.. కర్నూలు స్టేషన్ సిటీ స్థాయికి అప్‌గ్రేడ్ అయినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ‘సిటీ’గా మారితే నిధులు వరదలా వస్తాయని భావించినా ఆశించిన ఫలితం లేకుండా పోయింది. ప్లాట్‌ఫాముల్లో కంపు, వెయిటింగ్ హాలు లేక మహిళా ప్రయాణికుల ఇబ్బందులు, తగిన కుర్చీలు లేక కిందే కూర్చుంటున్నారు. ఇరుకైన రోడ్డు, ఒకే అడ్వాన్స్ బుకింగ్ కౌంటరు, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. రోజుకు 10వేల మంది ప్రయాణాలు కర్నూలు స్టేషన్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి, కొంగూ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ప్రతిరోజు 17 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 7 ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 10వేల మంది సాధారణ ప్యాసింజర్లు, 800 మందికి పైగా రిజర్వేషన్లతో రాకపోకలు సాగిస్తుండడంతో ఆశాఖకు రూ.10లక్షల వరకు రోజువారి ఆదాయం వస్తోంది. అయినా హాలులో ఫ్యాన్లు, లైట్లు కూడా లేకపోవడం గమనార్హం. 2, 3వ నంబరు ప్లాట్‌ఫాంలలో తాగునీటి సమస్య, ఫ్యాను సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. జరిగే అభివృద్ధి పనులు ♦ కర్నూలు సిటీ స్టేషన్‌కు కేటాయించిన రూ.25కోట్లతో పలు రకాల పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వసతులు, సౌకర్యాలు మెరుగుపర్చి సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించారు. ♦ స్టేషన్ ముఖద్వారం రూపురేఖలు మార్చనున్నారు. రెండు ముఖద్వారాలు పెట్టే ఆలోచనలో అధికారులున్నారు. ♦ స్టేషన్ ఆధునికీకరణ, మల్టీ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, షాపింగ్, కమర్షియల్ షాపుల నిర్మాణాలు జరిగే అవకాశాలు. ♦ ఆహ్లాదకరమైన భవనాలు, పార్కు, అన్ని సౌకర్యాలతో విశాలమైన ప్లాట్‌ఫాంలు, అధికార యంత్రాంగానికి తగిన గదులు, సీసీ కెమెరాల నిఘా, పార్కింగ్, వైఫై, ఫౌంటైన్, వీఐపీ లాంజ్, రెస్టు రూమ్‌లు తదితర వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ♦ పట్టాలను క్లీనింగ్ చేసేందుకు వాటర్ ఆప్రాన్ మిషన్ ఏర్పాటు చేయనున్నారు. ♦ ప్యాసింజరు ఆపరేటింగ్ ఎంక్వైరీ టర్మినల్ (పీఓఈటీ) మిషన్లు అదనంగా ఏర్పాటు చేయనున్నారు.. ఈ మిషన్ ద్వారా మనకు కావాల్సిన భాషలో రైలు వివరాలు, కోచ్ పరిస్థితి, పీఎన్ఆర్ స్టేటస్‌తోపాటు రైలు ఏ స్టేషన్లో వస్తుందో, వచ్చేందుకు ఎంత సమయం పడుతుందో కలర్ డిస్ప్లేలో చూసుకోవచ్చు. ♦ ప్రస్తుతం తిరిగే రైళ్లుతోపాటు అదనంగా నడపడం, నాన్ స్టాప్లకు స్టాపింగ్ కల్పిండం వంటివి సమకూరే అవకాశాలున్నాయి. -
అభివృద్ధికి పన్ను పోటు
నెల్లూరు సిటీ: జిల్లాలోని మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ పన్నుల వసూళ్లలో వెనకబడి ఉన్నాయి. ఈ నెల 31తో పన్నుల వసూళ్ల గడువు ముగియనుంది. అయినా ఇప్పటి వరకు 40 శాతం మేర మాత్రమే పన్నులను వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 కార్పొరేషన్లు ఉండగా, పన్నుల వసూళ్లలో నెల్లూరు కార్పొరేషన్ 11వ స్థానంలో ఉంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సొంత జిల్లాలోనే ము న్సిపాలిటీలు పన్నుల వసూళ్లలో వెనుకబడి ఉండడం విశేషం. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 1,17,456 లక్షల అసెస్మెం ట్లు ఉన్నాయి. ఇందులో రెసిడెన్షియల్ 75 వేలు, కమర్షియల్ 25 వేలు, కాలువగట్లు, రైల్వే స్థలాల్లోని అసెస్మెంట్లు 11వేలు ఉన్నాయి. డబుల్ ఎంట్రీలు, నాట్ ట్రేసింగ్ కింద మరో 5వేలు అసెస్మెంట్లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కా ర్పొరేషన్ పరిధిలో మొత్తం రూ.74కోట్ల పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నా యి. అందులో ఈ ఏడాది రూ.33కోట్లు వసూలు చేశా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.33కోట్ల పన్నులు వసూలు చే యాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.22 కోట్ల మేర పన్నులు వసూలు కావాల్సి ఉంది. అలాగే గూ డూరు మున్సిపాలిటీలో 11,659, కావలిలో 21,947, సూళ్లూరుపేటలో 9,2 58, నాయుడుపేటలో 10,170, ఆత్మకూరులో 7,334, వెంకటగిరిలో12,000 అసెస్మెంట్లు ఉన్నా యి. సుమారు రూ.36 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.13 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. లక్ష్యాలను సాధించేందుకు మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. అయినా ఇప్పటి వరకు కేవలం 40.47 శాతం మేర మాత్రమే పన్నులు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడాబాబుల జోలికి వెళ్లని రెవెన్యూ అధికారులు నగర పాలక సంస్థ పరిధిలోని పేద, మధ్య తరగతి వర్గాలు పన్నులు చెల్లించకపోతే రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తారు. కుళాయి కనెక్షన్లు తొలగించడం, చిన్నదుకాణాలను సీజ్ చేసి భయబ్రాంతులకు గురిచేసే అధికారులు బడాబాబుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. నగరంలోని మద్రాసు బస్టాండ్ సమీపంలోని ఓ ప్రముఖ హోటల్ రూ.13లక్షలకుపైగా పన్ను బకాయి ఉన్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అలాగే దర్గామిట్టలోని ఓ మాల్ రూ.6లక్షలకుపైగా బకాయిు ఉంది. ప్రముఖులకు చెందినది కావడంతో రెవెన్యూ అధికారులు పన్నులు వసూలు చేయలేని పరిస్థితి. ఆర్టీసీ వద్ద ఓ లాడ్జి రూ.32లక్షల పన్ను బకాయి ఉంది. మద్రాసు బస్టాండ్ వద్ద కమర్షియల్ భవనం రూ.18లక్షలు బకాయి ఉన్నా అధికారులు పట్టించు కోవడం లేదు. రాజకీయ నాయకుల పలుకుబడి ఉండడంతో అధికారులు వారి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సుమారు రూ.15కోట్లకు పైగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి. రెవెన్యూ అధికారులు బడాబాబులపై దృష్టి సారిస్తే ఫలితం ఉంటుంది. మరో 20 రోజులే గడువు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్ల గడువు మార్చి 31తో ముగియనుంది. ఉన్నతాధికారులు రెవెన్యూ వసూళ్లపై సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు సరిగా లేకపోవడంతో పన్నుల వసూళ్లలో వెనుకబడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతవర్గాల నుంచి పన్నులు వసూలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఈ ఏడాది పన్నుల వసూళ్ల లక్ష్యం 60శాతం కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మున్సిపాలిటీల అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకోనున్నాయి -
నత్తనడకన నగరాభివృద్ధి
సాక్షి, విజయవాడ : ‘ఏ రాష్ట్రంలోనైనా రాజధాని అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. విజయవాడ రాజధానిగా మారి నాలుగేళ్లయినా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు స్వయంగా నగరంలో పర్యటించినా ఫలితంలేదని దుయ్యబట్టారు. నగర అభివృద్ధిపై గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకపోవడంపై మండిపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, నాయకులు పైలా సోమినాయుడు, బొప్పన భవకుమార్, ఆసిఫ్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బీఎన్ పుణ్యశీల మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు పరిశీలించి పెదవి విరిచారు. సాగని కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు ఏడాది కిందటే పూర్తి కావాల్సి ఉన్నా 50 శాతం లోపే జరిగాయి. పనులపై అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా, మరో ఏడాది న్నరకు పూర్తయ్యేలా లేదని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. పనులను వేగవంతం చేయడంతోపాటు, ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు అనుమతించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లో అవినీతి నగరపాలక సంస్థ అవినీతిమయంగా మారిందని, మేయర్, అధికార పార్టీ కార్పొరేటర్లు ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారని, రూ.300 కోట్లు అప్పు మినహా ఈ ఐదేళ్లులో చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. కనీసం సిబ్బందికి సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, గుంతలమయంగా మారిన రోడ్లు, వెలగని వీధి దీపాలు, చెత్త కుప్పలు కనిపిస్తున్నాయని చెప్పారు. అధికారపార్టీ నేతల అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాశంగా మారింది. విచారణ చేస్తే పుష్కరాల్లో జరిగిన అవినీతి బయటకొస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధికి దూరంగా దుర్గగుడి దుర్గగుడి అభివృద్ధి మాస్టర్ప్లాన్కే పరిమితిమైందని, కొండపై ఉన్న భవనాలను కూల్చి చేపట్టిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. రూ.125 కోట్ల అమ్మవారి మూలధనం రూ.50 కోట్లకు తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తాంత్రిక పూజలు, అభివృద్ధిలో వెనుకబాటు ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. జపాన్, చైనాలనుప్రతిబింబించే రాజధాని ఎక్కడ? అమరావతి ప్రాంతంలో రైతుల వద్ద బలవంతంగా తీసుకున్న 33 వేల ఎకరాల్లో జపాన్, చైనా, కోరియాలను ప్రతిబింబించేలా సీఎం చంద్రబాబు నిర్మిస్తామన్న రాజధాని ఎక్కడని ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మించడం మినహా ఏమి నిర్మించారని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తిని ప్రజలు ఓట్లు వేసి గెలిసిప్తే రాష్ట్రాన్ని 30,40 ఏళ్లకు వెనక్కు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోనే పరిస్థితులు ఇలా ఉంటే మిగిలిన జిల్లాలు ఏవిధంగా ఉంటాయో ప్రజల ఆలోచనకే వదిలేస్తున్నామని అన్నారు. -
కొల్లేరు.. కన్నీరు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొల్లేరు మంచినీటి సరస్సు అంపశయ్యపై ఉంది. సరస్సు మనుగడ పూర్తిగా కోల్పోయింది. కొల్లేరును అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపే చూడటంలేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఎప్పటికప్పుడుపబ్బం గడుపుకుంటున్నాయి. ఆకివీడు : ఎన్నికల ముందు కొల్లేరు ప్రాంతాన్ని రక్షిస్తామని, సరస్సు మనుగడను కాపాడతామని ప్రగల్భాలు పలికిన నాయకులు అనంతరం దాని ఊసే ఎత్తకపోవడం దారుణం. మూడవ కాంటూర్ వరకూ అయినా సరస్సును కాపాడతారని భావించిన పర్యాటకులకు నిరాశే మిగిలింది. 2004కి ముందు కొల్లేరు సరస్సు ఏ విధంగా ఆక్రమణలకు గురై చేపల చెరువులు తవ్వారో అదే పరిస్థితి నేడు దాపురించింది. బడా కంపెనీలు, పెత్తందార్లు, అధికార పార్టీ నాయకులు కొల్లేరును దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరస్సులోకి చొచ్చుకువచ్చే కాలువలు : కొల్లేరు సరస్సులోకి రెండు జిల్లాల నుండి సుమారు 120 పంట, మురుగు కాల్వల నుంచి నీరు చొచ్చుకువస్తుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరులతో పాటు వివిధ కాలువల నుంచి నీరు వస్తుంది. కృష్ణా, పశ్చిమ డెల్టాలకు చెందిన ఆయకట్టు నీరు కూడా కొల్లేరులోకే చొచ్చుకువస్తుంది. కొల్లేరు నుండి సుమారు 22 వేల క్యూసెక్కుల నీరు ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. అడ్రస్సులేని ఐదో కాంటూర్ ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణా కేంద్రంగా కొల్లేరు సరస్సులోని ఐదవ కాంటూర్ వరకూ భూమిని సేకరించి హద్దులు వేసింది. జీపీఎస్ సర్వే చేసి ఆన్లైన్లో పొందుపరిచారు. ఐదో కాంటూర్ వరకూ కొల్లేరు రక్షణకు 2005లో రూ.120 కోట్లు వెచ్చించారు. అప్పటి నుండి కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ప్రభుత్వం ఏటా మూడు నుండి పది కోట్లు వెచ్చిస్తూ వస్తోంది. అభయారణ్యం పరి«ధిలో ఇంత వరకూ 550కి పైగా కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కాంటూర్‌లోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానరాని చిత్తడి నేలలు చట్టం దేశంలోని 25 ప్రముఖ సరస్సుల నియంత్రణ బాధ్యతలను కేంద్రం తీసుకుంటూ చిత్తడి నేలల పరిరక్షణ నిర్వహణా నిబంధనలు–2009 పేరుతో కొత్త చట్టం తీసుకువచ్చింది. చట్ట పరిధిలోకి కొల్లేరు సరస్సును కూడా తీసుకువచ్చి చిత్తడి నేలల్ని మెట్ట భూములుగా మార్చడాన్ని పూర్తిగా నిషేధించింది. కేంద్ర పర్యావరణం, అటవీశాఖ 1989లో విడుదల చేసిన మూడు ఉత్తర్వుల్లో పొందుపరచిన విధంగా ప్రమాదకర వ్యర్థాలను కొల్లేరులో తయారుచేయడం, నిల్వ ఉంచడం, పారవేయడం నిషేధించారు. డ్రెయిన్ల నీరు, పరిశ్రమల వ్యర్థాలు, కలుషితనీరు, ఇతర వ్యర్థాలను సరస్సులోకి వదలకూడదు. అయితే అందుకు విరుద్ధంగా కొల్లేరు సరస్సును డంపింగ్ కేంద్రంగా మార్చివేశారు. పరిశ్రమల రసాయనిక వ్యర్థాలు, పట్టణాలు, నగరాల నుండి కొల్లేరులోకి చొచ్చుకు వస్తున్నాయి. శాశ్వత నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి. పరిశ్రమల స్థాపన కొనసాగుతోంది. ఐదవ కాంటూర్ భూముల్ని పూడ్చివేస్తున్నా అభయారణ్యం పరిరక్షించాల్సిన అధికారులు అడ్రస్సులేరని పలువురు ఆరోపిస్తున్నారు. రెగ్యులేటర్ల నిర్మాణం హుళ్లక్కే? కొల్లేరు సరస్సు పరిరక్షణకు ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్లు నిర్మించాలని 1964లోనే మిత్రా కమిటీ సూచించింది. ఆ ప్రకారంగా ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద ఒకటి, సముద్రం ముఖద్వారం వద్ద, ఉప్పుటేరు క్రాస్‌బండ వద్ద మరొకటి నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై ప్రభుత్వం అనేకమార్లు నిపుణుల కమిటీలను నియమించి నివేదికలు సేకరించినా రెగ్యులేటర్ల ఊసేలేదు. సరస్సు భౌగోళిక స్వరూరం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దులో çసహజసిద్ధంగా వెలసిన కొల్లేరు సరస్సు 340 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరస్సు లోతు రెండు మీటర్లు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 7 మండలాలు, కృష్ణా జిల్లాకు చెందిన 2 మండలాలు కలిపి మొత్తంగా 122 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 3.20 లక్షల మంది జనాభా (80 వేల కుటుంబాలు) ఉంది. ప్రస్తుతం యాభై శాతం మంది జనాభా వలస వెళ్లిపోయారు. కొల్లేరు ప్రక్షాళన అనంతరం సరస్సును 77,138 ఎకరాలకు కుదించారు. దీనిలో 19,000 ఎకరాలు జిరాయితీ ఉంది. మూడవ కాంటూర్‌కు కుదించాలి కొల్లేరు సరస్సును మూడవ కాంటూర్ వరకూ కుదించి సరస్సును అభివద్ధి చేయాలి. ఐదవ కాంటూర్ వరకూ సరస్సు ఉన్నప్పటికీ అభివద్ధి చేయకపోవడంతో నిరుపయోగంగా ఆక్రమణలకు గురవుతోంది. సరస్సును పరిరక్షించి, కొల్లేటి ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలి. – కొల్లి రాంబాబు, గ్రామ పెద్ద, కొల్లేటికోట గ్రామం రెగ్యులేటర్ నిర్మించాలి కొల్లేరు సరస్సు కిక్కిసతో నిండిపోయింది. సరస్సు అభివృద్ధికి నిధులు ఇవ్వడంలేదు. సరస్సు ప్రక్షాళన తరువాత 50 శాతం ప్రజలు వలస వెళ్లిపోయారు. కొల్లేరు ప్రజలకు రాయితీలు లేవు, వ్యవసాయం లేదు. వేట లేదు. అభివద్ధి చేయాలి, లేకుంటే ప్రజలకు ఇవ్వాలి. – జుల్లూరి రాజు, గ్రామపెద్ద, పందిరిపల్లిగూడెం -
‘కొఠియా’పై కుటిల నీతి !
మనం మౌనం వహిస్తున్నాం... వారు దూకుడు పెంచుతున్నారు. మనం ప్రతిపాదనలే తయారు చేశాం. వారు అమలు చేసి చూపిస్తున్నారు. మనం చూద్దాంలే అనే ధోరణిలో ఉన్నాం.. వారు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇదీ కొఠియాపై మనరాష్ట్ర పాలకులు... పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్ర పాలకులకు ఉన్న తేడా. ఈ పరిస్థితి అసలు గ్రామాలనే కాదు... అక్కడి ఖనిజ సంపదనూ కోల్పోయేందుకు దారితీస్తోంది. పాపం అధికారులు ఎంతవరకు సాగగలరు? మన పెద్దల మౌనం చూస్తుంటే... కావాలనే దానిని వారికి వదిలిపెట్టే యత్నం సాగుతోందేమోనన్న అనుమానాలకు తావిస్తోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని ఇరవై ఒక్క కొఠియా పల్లెల్లో ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి పనులు శరవేగంగా చేసుకుపోతోంది. ఆ ప్రాంతం తమదేనని గట్టిగా వాదిస్తోంది. ఒక్కసారి ఆంధ్రా కలెక్టర్ పర్యటించినందుకే ఒడిశా కలెక్టర్‌పై వేటు వేసింది. వివాదం పరిష్కారానికి నిపుణుల కమిటీ వేస్తూనే రూ.కోట్ల విలువైన పనులు మంజూరు చేసింది. ఆంధ్రా సరిహద్దులో చెక్‌పోస్ట్ పెట్టి కొఠియాకు బస్సులు వేసింది. ఇంత జరుగుతున్నా మన రాష్ట్ర పాలకుల్లో ఏ మాత్రం చలనం లేదు. అధికారులు వెళ్లి రూ.2 కోట్లతో పనులు చేస్తామని గిరిజనులకి చెప్పొచ్చారు. కాని ఒడిశా ఆ పనులు ముందే మొదలు పెట్టేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మనవైపు నుంచి మాత్రం జిల్లాలో ఉన్న కేంద్ర, రాష్ట్ర మంత్రుల్లో ఒక్కరూ నోరుమెదపడం లేదు. రాష్ట్ర స్థాయి సమస్య అయినప్పటికీ సీఎం ఇంత వరకూ ఒక్క ప్రకటనైనా చేయలేదు. పట్టు బిగిస్తున్న ఒడిశా... సాలూరు మండలంలో పట్టుచెన్నేరు, పగలుచెన్నేరు, తోణాం, గంజాయిభద్ర, సారిక తదితర పంచాయతీల్లో సుమారు 21 వివాదాస్పద గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటినే కొఠియా పల్లెలుగా పిలుస్తున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవన స్థితిగతులను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. మన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఇతర ముఖ్య అధికారులు ఈ గ్రామాల్లో పర్యటించి ప్రాధమికంగా పలు సంక్షేమ ఫలాలు అందించి వచ్చారు. త్వరలోనే అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పరిణామంతో ఒడిశా ప్రభుత్వంలో పెను తుఫాను రేగింది. అక్కడి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలనే డిమాండ్ లేచింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి తెలుగు తెలిసిన వ్యక్తిని కలెక్టర్‌గా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే కొఠియా గ్రామాల్లో పర్యటించారు. అభివృద్ధి మంత్రంతో గిరి నులకు చేరువయ్యేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, సోలార్‌లైట్ల ఏర్పాట్లు, గృహాలు, రహదారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు, రేషన్ పంపిణీ, పింఛన్లు మంజూరు, బస్సు సౌకర్యం ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ పనులు చేపడుతున్నారు. గిరిజనుల అభీష్టమే అంతిమ నిర్ణయం కొఠియా పల్లెలు అభివృద్ధికి దూరమైనా... అపార ఖనిజ సంపదకు నిలయాలు. అక్కడి కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లల్లో ఉంటుంది. వీటిని దక్కించుకుంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదుగుతుందనే వాదనలు ఉన్నాయి. వీటిని పొందాలంటే ముందు ఈ గ్రామాల ప్రజలను మచ్చిక చేసుకోవాలి. కొఠియా పల్లెలకు సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికివ్వాలనేదానిపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒడిశా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గిరిజనులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇక్కడ సంక్షే మ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యాయి. అప్పు డు గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమను ఎవ్వరూ పట్టిం చుకోవడం లేదని, ఒడిశా బాగా చూసుకుంటోందని గిరిశిఖర గ్రామాల ప్రజలు అంటున్నారు. వాటాల కోసమేనా...ః మన రాష్ట్రంలో గనుల తవ్వకాలపై ఉన్నన్ని ఆంక్షలు ఒడిశాలో లేవు. అంతే కాదు.. మన రాష్ట్ర టీడీపీ నేతల్లో చాలామందికి ఒడిశాతో వ్యాపార సంబంధాలున్నాయి. ఇదే ఇక్కడి పాలకులు కొఠియా గ్రామాలపై పెదవి విప్పకపోవడానికి ప్రధాన కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ గ్రామాలను ఒడిశాకు వదిలేస్తే ఆ ప్రభుత్వం చేపట్టే మైనింగ్ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకుని వాటాలు వెనకేసుకోవాలనే కుటిల నీతితోనే టీడీపీ వర్గీయులెవరూ ఆ పల్లెలు ఆంధ్రాకే కావాలని అడగడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాని కి కొఠియా వివాదాన్ని పార్లమెంట్లో తెల్చుకోమని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ దిశగా జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అక్కడి గనులపై ఒడిశా కన్ను పడిం దని తెలిసినా జిల్లాలోనే ఉంటున్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారా వు లో చలనం లేదు. ఒడిశా సీఎం స్వయంగా రంగంలోకి దిగి అక్కడి అధికారులను పరుగులు పెట్టిస్తున్నా మన ముఖ్యమంత్రి కొఠియా మాదంటూ కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే కావాలనే మంత్రుల దగ్గర్నుంచి, సీఎం వరకూ నిర్లక్ష్యం వహిస్తున్నారనిపిస్తోంది. ఈ వైఖరి ఇలానే కొనసాగితే ‘మాకు ఒడిశా కావాలి.. ఆంధ్రా వద్దు’ అని ఆ గిరిజనులు చెప్పడం ఖాయం. వివక్షను విడనాడాలి గిరిజనులపై వివక్షను టీడీపీ నేతలు విడనాడాలి. వివాదా స్పద కొఠియా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు మంజూరు చేయకపోవడం వల్లనే వారు ఒడిశా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే విభజనాంధ్రప్రదేశ్ ఆర్ధికంగా చితికిపోయింది. ఇప్పుడు విలువైన ఖనిజ సంపద ఉన్న కొఠియాను కూడా కోల్పోతే మరిన్ని ఇబ్బందులు తప్పవు. –సంగంరెడ్డి జయసింహ, ఉపాధ్యక్షుడు, అఖిలభారత ఆదివాసీ వికాస పరిషత్, విజయనగరం జిల్లా గిరిజనులంటే చిన్నచూపు టీడీపీ నేతలకు గిరిజనులంటే చిన్నచూపు. వారి కష్టాలను, బాగోగులకు ఎప్పుడూ పట్టించుకోదు. కొఠియా గ్రామాల్లో ఉన్నది గిరిజనులు కావడం వల్లనే వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అక్కడి కొండల్లో ఉన్న ఖనిజ సంపదను ఒడిశా ప్రభుత్వమైతేనే ఎలాంటి అడ్డంకులు లేకుండా తవ్వుకోనిస్తుంది. టీడీపీ నేతల్లో కొందరికి అక్కడ వ్యాపారులన్నాయి. వారే మన రాష్ట్రంలో కంటే సులభంగా గనుల తవ్వకాల కాంట్రాక్టులు ఒడిశాలో పొందే అవకాశం ఉంది. దాని ద్వారా ఇక్కడి పాలకులకు వాటా లు అందుతాయి. ఈ కారణాలతోనే కొఠియా పల్లెలను ఒడిశాకు వదిలేసే కుట్ర జరుగుతోంది. అందుకే ఎవరూ దీనిపై మాట్లాడట్లేదనిపిస్తోంది. – రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు. -
నిర్లక్ష్య రోగం
ఆదోని టౌన్: జిల్లా పశ్చిమ ప్రాంతంలోని దాదాపు 15 లక్షల మందికి ఆదోని ప్రభుత్వ ఏరియా రెఫరల్ ఆసుపత్రి పెద్ద దిక్కు. పేరుకు మాత్రమే వంద పడకల వైద్యశాల.. సౌకర్యాలు మాత్రం పీహెచ్సీ స్థాయిలోనే. అధికారుల నిర్లక్ష్యంతో నిధులున్నా వినియోగించని దుస్థితి. అనారోగ్యంతో ఈ ఆసుపత్రికి వస్తే నరకం చూడాల్సిందే. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న అధికారుల మాటలకు చేతలకు పొంతన లేదు. ఏడాది క్రితం సమావేశమైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆ తర్వాత జాడ లేదు. గత సమావేశంలో ఆమోదించిన అంశాలను గాలికొదిలేశారు. తీర్మానించిన అంశాలు గత ఏడాది నవంబర్ 17వ తేదీన ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశమైంది. ఇందులో ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ లింగన్న హాజరై పలు అంశాలపై తీర్మానం చేశారు. ఆధార్ బేసిక్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలు, కంప్యూటర్ కొనుగోలు, మైనర్ రిపేర్లు, ప్రత్యేక రూములకు డ్రైనేజ్ మెరుగు, సీసీ రోడ్లు నిర్మాణం, మురికి కాల్వల మరమ్మతులు చేయాలని తీర్మానించారు. కాగా రెండు ఏసీలు, కంప్యూటర్ కొనుగోలు, రెండు వార్డులలో జాలరీ మాత్రమే ఏర్పాటు చేసి చేతులెత్తేశారు. మురుగుతున్న రూ.42 లక్షలు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులు రూ.30 లక్షలు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ పథకం కింద రూ.12 లక్షలు మొత్తం 42 లక్షలు నిధులు బ్యాంకుల ఖాతాల్లో మురుగుతున్నాయి. భవిష్యత్‌లో ఆడిట్ ఇబ్బందులు ఎదురవుతా యని భావించి ఆసుపత్రి అధికారులు పనులు చేయిం చ లేకపోతున్నారు. ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలు కావడంతో ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆసుపత్రిని వేధిస్తున్న సమస్యలు ♦ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట కంకర తేలిన రోడ్డుపై నడవ లేని పరిస్థితి ఏర్పడింది. ♦ 108 సిబ్బందికి గది లేక పోవడంతో ఆసుపత్రి ఆవరణలో సేద తీరుతున్నారు. ♦ మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. ♦ మహిళల, పిల్లల, పురుషుల మెడికల్ వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తప్పని పరిస్థి తుల్లో రోగులు వినియోగించుకుంటున్నారు. ♦ నీట సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ♦ సింటెక్స్ ట్యాంక్‌లు నిత్యం నిండుతూ గోడలన్నీ తడిసి బీటలువారాయి. ♦ ఆసుపత్రిలోని పది స్పెషల్ గదుల్లో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన ఆరు గదులకు డ్రైనేజ్, నీటి సరఫరా లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ♦ కిటికీలకు అద్దాలు, జాలరీ లేకపోవడంతో దోమలతో రోగులు జాగారం. ♦ ఆసుపత్రి ఆవరణలో ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదు. ♦ దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థతో వేలాడుతున్న తీగలు భయపెడుతున్నాయి. ♦ మంచాలపై పరుపులకు రెగ్జిన్ లేవు. ♦ ఐవీ స్టాండ్లు, విండో కర్టన్స్ లేక వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. -
రూ.60 కోట్లతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లను రూ.60 కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ చెప్పారు. సోమవారం ఆయన నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. నెల్లూరు మెయిన్తోపా టు, సౌత్‌స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వేస్టేషన్ల పరిస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి, నెల్లూరునగర ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌తో కలిసి విలేకరుల నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ అభివృద్ధి పనులు కూడా ఆరు నెలల్లో పూర్తిచేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అందుకు సం బంధిత ఇంజినీర్లు కూడా పరిశీలించారన్నారు. నెల్లూరు స్టేషన్లో తాగునీటి కొరత లేకుండా, ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ వంటి పనులను వేగవంతం చేస్తామన్నారు. సౌత్‌స్టేషన్‌లో టాయిలెట్స్, షెడ్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు ఇతరత్రా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. వీటితోపాటు వైఫై సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. నగరంలో పలు చోట్ల రైల్వే బాక్స్‌టైప్ అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిగణలోకి తీసుకుని స్థానిక కార్పొరేషన్ అనుమతితో చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ రాజమోహన్‌రెడ్డి రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై పలుసార్లు తమకు వినతిపత్రాలు ఇచ్చారని, వాటిలో చాలా వరకు ప్రయాణికులకు ఉపయోగపడుతాయన్నారు. మేకపాటి చొరవ అభినందనీయమన్నారు. రైల్వే స్థలాల్లో వ్యాపార సముదాయాల నిర్మాణం ఎన్బీసీసీ సంస్థతోపాటు రైల్వే ల్యాండ్ సంస్థ సంయుక్తంగా రైల్వేకు సంబంధించిన స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మిస్తామని జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. 65 వేల చదరపు అడుగుల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి ప్రైవేట్, ప్రభుత్వ రంగాల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులకు ఎంతో మేలుతో పాటు రైల్వేకు కూడా ఆదాయం వస్తుందన్నారు. సౌత్‌స్టేషన్ పరిశీలన నెల్లూరు సౌత్స్టేషన్ను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డీఆర్ఎం కలిసి పరిశీలించారు. అక్కడ అవసరమైన ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రాంతం రాకపోకలకు ఎంతో అనువుగా ఉండటంతో నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. వారికి అవరసనమై వాటిని కల్పించాల్సి న అవసరం ఉందన్నారు. సౌత్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై దుర్గంధం వెదజల్లుతుందన్నారు. నెల్లూరు, కావలి స్టేషన్లో ప్రధాన రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కావలి రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకరించండి కావలి ప్రాంతం వ్యాపార కేంద్రమని, నాలుగు వరకు ఇంజినీరింగ్ కళాశాలల ఉన్నాయి అన్ని వర్గాల వారు కావలి రైల్వేస్టేషన్ నుంచి వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి జీఎం వినోద్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ స్టేషన్లో ప్రధాన రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. – రామిరెడ్డి ప్రతాప్మకుమార్రెడ్డి, కావలి ఎమ్మెల్యే రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మించాలి వెంకటేశ్వరపురం వద్ద గాంధీగిరిజన కాలనీ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎంతో బాగుంటుందని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తే విద్యార్థులకు, చిరు వ్యాపారులకు ఉపయోగంతో పాటు ప్రమాదాలను కూడా నివారించవచ్చన్నారు. ప్రధానంగా రైల్వే స్థలాల్లో కొన్నేళ్ల నుంచి ఉన్న వారికి ప్రత్యామ్నాయాలు చూపించకుండా వారిని ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. సానుకూలంగా స్పందించిన జీఎం మాట్లాడుతూ అండర్ బ్రిడ్జి నిర్మాణం స్థాని కార్పొరేషన్ నిధులతో చేయించుకోవాలని , అందుకు అనుమతులు తమ వద్ద నుంచి ఇస్తామని, రైల్వే స్థలాల్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ఫ్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్ ఇతర కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. – అనిల్‌కుమార్ నగర ఎమ్మెల్యే -
సీఎం సతాయింపులు అభివృద్ధి కోసమే
కడప: రాత్రి 11 గంటల సమయంలో కూడా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలం టూ కార్యాలయాల్లో ఉంటున్న మాట నిజమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతాయింపులన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసమేనని మార్కెటింగ్‌శాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి అన్నారు. అధికారులు కూడా జిల్లా అభివృద్ధి కోసం పోటీపడి పని చేయాల ని కోరారు. జన్మభూమిలో మంచి సేవలు అందించి న ఉద్యోగులకు బహుమతులు, ప్రశంసాపత్రాల పం పిణీ కార్యక్రమం శుక్రవారం కలెక్టరేట్ సభా భవనంలో జరిగింది. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గండికోట ఉత్సవాల విజయవంతానికి అధి కారులు కృషి చేయాలన్నారు. గండికోటలో రోప్‌వే ఏర్పాటు చేసేందుకు రూ. 7.50 కోట్లు ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జొన్న, శనగకు ఫసల్‌బీమా కింద డబ్బు మంజూరైందని, అయితే రైతుల అకౌంట్లలో పడలేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీన్ని అధికారులు సరిదిద్దాలన్నారు. కత్తులు లేకుండా కోడిపందేల నిర్వహణకు అనుమతించాల ని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ ఈనెలాఖరు నాటికి జిల్లా ను ఓడీఎఫ్ కింద ప్రకటించాల్సి ఉందన్నారు. జేసీ శ్వేత తెవతీయ, రెండవ జేసీ శివారెడ్డి పాల్గొన్నారు. -
పిల్లలమర్రి.. డోంట్ వర్రీ!
స్టేషన్ మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాకు చిహ్నంగా ఉన్న పిల్లలమర్రికి పూర్వవైభవం రానుంది. కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయిస్తున్నారు. వరంగల్ ఫారెస్ట్‌శాఖ రీసెర్చ్ సైంటిస్టు కిరణ్ పర్యవేక్షణలో చెట్టుకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. నేలకు తాకిన మర్రిచెట్టు కొమ్మల చుట్టూ గుంతను తవ్వి మట్టిని తీసి కొన్ని రకాల కెమికల్స్‌ను కలిపారు. అలాగే సున్నంలోనూ కెమికల్స్ కలిపి మొదళ్ల వద్ద వేశారు. నాలుగు రోజుల నుంచి ఈ ట్రీట్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. కలెక్టర్ స్వయంగా పనులను పరిశీలిస్తున్నారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నిర్వహణ లేకపోవడమే సమస్య.. పిల్లలమర్రి చెట్టు నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో గత ఏడాది నుంచి చెట్టు ఎండిపోతోంది. ప్రధానంగా నీటి సమస్య వల్ల వేసవిలో కొమ్మలు ఎండిపోయాయి. కొన్ని కొమ్మలు విరిగిపోతున్నాయి. దీంతో 60శాతం చెట్టు పూర్తిగా పాడైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఫెన్సింగ్ ఏర్పాటు.. ట్రీట్మెంట్ అనంతరం పిల్లలమర్రిలోని చెట్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకులు చెట్టును తాకకుండా, కొమ్మలపై ఎక్కకుండా ఉండేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పర్యాటకులు చెట్టు కింద సేదతీరడానికి పచ్చని గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై ఒకే టికెట్... ఇక్కడ ఇప్పటివరకు పిల్లలమర్రి, సైన్స్ మ్యూజియం, మినీ జూపార్క్, ఆక్వేరియం, ఆర్కియాలజీ మ్యూజియంలకు వేర్వేరుగా టికెట్ తీసుకోవాల్సి ఉండేది. పర్యాటకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇకపై అన్నింటికీ ఒకే టికెట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో దీన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదీ చరిత్ర.. పిల్లలమర్రికి 750ఏళ్ల చరిత్ర ఉంది. ఏడుతరాలకు సజీవసాక్ష్యంగా నిలుస్తోంది. మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మహావృక్షంగా మారి నాలుగు ఎకరాలకు విస్తరించింది. రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. దీని నీడన ఏళ్లుగా ఎంతోమంది పర్యాటకులు సేదతీరుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి, పిక్నిక్ స్పాట్‌గా మారింది. దీంతో ఈ ప్రాంతానికి సాధారణ రోజుల్లో కన్నా సెలవుదినాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. పురావస్తు మ్యూజియం కూడా ఉండడంతో రోజంతా ఇక్కడ ఉల్లాసంగా గడుపుతారు. ఒకేసారి వెయ్యిమంది వరకు సేదతీరే అవకాశం ఉంది. చెట్టు వద్ద జరుగుతున్న ట్రీట్మెంట్ పనులు -
పరుగులు పెట్టిన ప్రగతి నేడేదీ..?
సాక్షి, కడప : వైఎస్సార్ హయాంలో పులివెందులలో అభివృద్ధి పరుగులు తీసింది. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కొరత రాకుండా చూసుకున్నారు. అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. అటువంటిది ఏమీ అడగకపోయినా జన్మించిన గడ్డ పులివెందులకు అన్నీ చేసి వైఎస్సార్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ♦ ఈ ప్రాంత రైతాంగానికి ప్రధాన జీవనాధారమైన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సినన్ని నిధులు కేటాయించారు. గండికోట ద్వారా కృష్ణా జలాలను తీసుకురావడానికి సంకల్పించారు. పైడిపాలెం ప్రాజెక్టుకు సంబంధించి 85 శాతం పనులను పూర్తి చేయించారు. ♦ జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టులన్నింటికీ నిధుల వరద పారించారు. ఆయన హయాంలోనే అన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే కేవలం పదిహేను శాతం పనులను కూడా చేయకుండా....చివరి అంకంలో ఇటీవల కాలంలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత తమదేనని టీడీపీ నేతలు చెప్పుకుంటుండడంపై పలువురు విస్తుపోతున్నారు. పులివెందుల ప్రాంతానికి నీరిచ్చి చీనీ చెట్లను బతికించామని చెప్పుకోవడం చూస్తే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలో పూర్తయిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఆరు టీఎంసీల సామర్థ్యంగల పైడిపాలెం ప్రాజెక్టుకు గత ఏడాది కేవలం 0.3 టీఎంసీ మాత్రమే నీరు తీసుకొచ్చారు. అంటే ఒక టీఎంసీ నీటిని కూడా ఇవ్వలేకపోయినా పైకి మాత్రం చెట్లను రక్షించినట్లు చెప్పుకోవడం చూస్తే ఎవరికైనా చిత్రంగానే కనిపిస్తుంది. ♦ గత మూడేళ్లుగా ఉద్యానశాఖ రికార్డులను పరిశీలించినా పులివెందుల నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ఎండిన చీనీ చెట్ల విషయం బయటపడుతుంది. చివరకు పులివెందుల నియోజకవర్గంలో చిన్నపని చేసినా చంద్రబాబు సర్కార్ ప్రత్యేక మైలేజీ కోసం ఆరాటపడుతుంది తప్ప ప్రజల కోసం కాదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ పులివెందుల అభివృద్ధికి తార్కాణం... ♦ వైఎస్సార్ సీఎం అయ్యేనాటికి మేజర్ పంచాయతీగా ఉన్న పులివెందుల 2004 చివరిలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి రూపురేఖలు మారిపోయాయి. ♦ పులివెందులలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఇడుపుల పాయలో త్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. ♦ రూ. 385 కోట్ల వ్యయంతో 650 ఎకరాల్లో అంతర్జాతీయ పశుపరిశోధనా కేంద్రాన్ని అధునాతన వసతులతో నిర్మించారు. ♦ పులివెందుల – కడప మధ్య నాలుగులేన్ల రోడ్డు ఏర్పాటు చేశారు. ♦ శిల్పారామాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచారు. ♦ గండిక్షేత్రంలో విస్తృత అభివృద్ధి. ♦ రూ. 2,800 కోట్లతో పులివెందుల నియోజక వర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించారు. ♦ ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ, ఇంటర్మీడియేట్ కాలేజీలు ప్రారంభించారు. ♦ పులివెందుల చుట్టూ రూ. 18 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మించారు. ♦ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఏర్పాటు. ♦ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఆధ్వర్యంలో సుమారు రూ. 130 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ♦ పులివెందుల మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు నిధులు అందించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి రూ. 42 కోట్లు కేటాయించారు. ♦ శ్రీ రంగనాథస్వామి, పాతబస్టాండులోని శ్రీ వెంకటేశ్వరస్వామి, మిట్టమల్లేశ్వరస్వామి ఆలయాలతోపాటు నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ♦ లింగాల మండలం నక్కలపల్లె వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని పులివెందులకు తీసుకొచ్చేలా రూ. 40 కోట్లతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ♦ పులివెందులలో ఫుడ్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు. ♦ సింహాద్రిపురం మండలంలో రూ. 550 కోట్లతో పైడిపాలెం ప్రాజెక్టు నిర్మించారు. ♦ పులివెందుల బ్రాంచ్ కెనాల్ లోని కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు రూ. 500 కోట్లు వెచ్చించారు. ♦ ఇడుపుల పాయలో రూ. 50 కోట్లతో ఎకో పార్కు ఏర్పాటు. ♦ పులివెందుల నియోజక వర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా గోవిందరాజ స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు. రాయలాపురం సమీపంలో సంయుగ్లాసెస్ పరిశ్రమ, ఎన్ఎస్ఎల్ టెక్స్ టైల్స్ ఏర్పాటు చేశారు. ♦ అధునాత హంగులతో పులివెం దులలో ఆర్ అండ్‌బీ గెస్ట్‌హౌస్, మున్సిపల్ ఆఫీసు భవనాలను నిర్మించారు. ♦ పులివెందుల – కదిరి మధ్య రూ. 28 కోట్లతో కొత్త రోడ్డు నిర్మించారు. ♦ పులివెందుల – ముదిగుబ్బ మధ్య, పులివెందుల– జమ్మల మడుగు మధ్య డబుల్ లైన్ రోడ్డు నిర్మించారు. ♦ రూ. 1100 కోట్ల వ్యయంతో వేముల మండలం మబ్బు చింతలపల్లి వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయించారు. వైఎస్సార్ మరణంతో... ఆగిన అభివృద్ధి.. ♦ వైఎస్సార్ మరణంతో పులివెందులలో అభివృద్ధి ఆగిపోయింది. తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోగా, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో పులివెందులలో అభివృద్ధి పడకేసింది. ♦ పులివెందులలో శిల్పారామానికి అనుబంధంగా బడ్జెట్ హోటల్ నిర్మాణానికి ఆమోద ముద్ర లభించింది. సుమారు 100 గదులతో అద్దెకు ఇచ్చేలా ప్లాన్ వేసి అక్కడనే హోటల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వైఎస్సార్ మరణించాక దాన్ని వదిలేశారు. ♦ పులివెందుల ప్రాంతంలో సుమారు 10 వేల మెగా వాట్ల అణువిద్యుత్ ప్లాంట్ పెడుతున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అందుకు సంబంధించి స్థల సేకరణ జరుగుతుండగానే ఆయన మరణానంతరం దాన్ని పట్టించుకోలేదు. ♦ ఐజీ కార్ల్‌లో అద్భుతమైన వసతులు ఉన్నా నేటికీ తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూడున్నరేళ్లయినా ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదు. ♦ వేంపల్లె పాపాఘ్ని నదిలో అలిరెడ్డిపల్లె–వేంపల్లె మధ్య రూ. 12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో మంజూరైంది. అప్పట్లో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు అవసరమైన మొత్తంపై ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరు కాలేదు. దీంతో అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ♦ పులివెందులలో మినీ సెక్రటేరియేట్ (అన్ని కార్యాలయాలు ఒకేచోట), సబ్‌జైలు, ఆర్టీసీ బస్టాండు నిర్మించాలని సిద్ధం చేసినా మహానేత మరణం తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ♦ పైడిపాలెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా వైఎస్సార్ హయాంలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 20 శాతం పనులను టీడీపీ సర్కార్ 2017 వరకు పూర్తి చేయలేదు. -
‘గుడా’ తో గ్రామీణాభివృద్ధి సాధ్యం
చైర్మన్ గన్ని కృష్ణ 13 మండలాల కార్యదర్శులకు అవగాహన సదస్సు నేడు కాకినాడలో మరో 13 మండలాలకు.. రాజమహేంద్రవరం సిటీ : గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరిగి, అభివృద్ధి సాధ్యమౌతుందని చైర్మన్ గన్నికృష్ణ పేర్కొన్నారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో గల 13 మండలాలకు చెందిన పంచాయితీ కార్యదర్శులు, లైసెన్స్డ్ సర్వేయర్ల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ‘గుడా’ వల్ల గ్రామాల్లో ప్రజలపై భారం పడుతుందనే అపోహలు పూర్తిగా విడిచిపెట్టాలన్నారు. ‘వుడా’ ఏర్పాటుతో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ‘గుడా’ పరిధిలోని అన్ని మండలాల్లో పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు గుడాపై పూర్తి అవగాహన కలిగి ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. గుడా వైస్ చైర్మన్, కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ గుడా పరిధిలోని 26 మండలాల్లో 253 పంచాయతీలుండగా వాటిలో మొదటి దఫాగా 13 మండలాలకు రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని మిగిలిన, 13 మండలాలకు గురువారం కాకినాడలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై గ్రామాల్లో ప్రజలు నిర్మాణం చేయాలంటే అన్ని ఆన్లైన్ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. 300 స్క్వేర్ మీటర్ల కన్నా తక్కువ స్థలం ఉన్న వారికి స్థానిక పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇస్తారని, అది దాటితే గుడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లు అవకతవకలకు పాల్పడితే రెండేళ్లు బ్లాక్ లిస్ట్‌లో పెడతానని హెచ్చరించారు. గుడా సభ్యులు గట్టి సత్యనారాయణ, నాని, రవి, టౌన్ ప్లానింగ్ ఆర్జేడీ సాయిబాబా పాల్గొన్నారు. -
ఐటీడీఏలు ఎత్తివేసేందుకు కుట్ర
ప్రొఫెసర్లు నారాయణ, నాగేశ్వర్రావు ములుగు చేరిన ‘ఆదివాసీ జిల్లా యాత్ర ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా, వారి అభివృద్ధికి ఏర్పాటుచేసిన ఐటీడీఏలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఏజెన్సీ ప్రాంతాల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, ఓయూ ప్రొఫెసర్ అప్క నాగేశ్వర్రావు విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాలతో జిల్లాలో ఏర్పాటుచేయాలనే డిమాండ్‌తో ఆదిలాబాద్ జిల్లా జోడేఘాడ్ నుంచి సమితి ఆధ్వర్యాన చేపట్టిన చైతన్య బస్సుయాత్ర సోమవారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణలోని కొమురం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నారాయణ, నాగేశ్వర్రావు మాట్లాడుతూ తెలంగాణలోని ఆదివాసీలు, రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం హైదరాబాద్‌లో పెడితే ఒక్క రాజకీయ పార్టీ హాజరు కాలేదన్నారు. అయితే, భూభాగాన్ని రక్షించుకోవాడానికి ప్రాణ త్యాగాలకైన వెనుకాడేది లేదన్నారు. ఐటీడీఏ కింద ఉన్న ఏజెన్సీ మండలాలను మరో జిల్లాలో కలిపి ఐటీడీఏ నిర్వీర్యం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.ప్రజల అభిష్టానం మేరకు జిల్లాలను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఆదివాసీల ప్రజల అభీష్టం మేరకు ఐటీడీఏ ఉన్న ప్రాంతాలను ఆదివాసీ జిల్లాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రత్యేక ఆదివాసీ జిల్లాల ఏర్పాటు కోసం ఈనెల 7న హైదరాబాద్‌లో చేపట్టిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులు తరలిరావాలని రిటైర్డ్ డిప్యూటీ ఇంజనీర్ మెట్ల పాపయ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం ఉభయరాష్ట్రాల అధ్యక్షుడు మైపతి అరుణ్‌తో పాటు మైపతి సంతోష్, కొప్పుల రవి, సమ్మారావు, చెంచయ్య, తల్లడి నాగేశ్వర్రావు, కొర్నిబెల్లి రాఘవరావు, నల్లబోయిన సమ్మయ్య, పొలెబోయిన గోపాల్ పాల్గొన్నారు. 03 ఎంయూఎల్ 102 - కార్యక్రమంలో మాట్లాడుతున్న ఈసం నారాయణ, నాగేశ్వర్రావు -
కన్నీరే మిగిలింది
కేసముద్రం: నకిలీ మిర్చి విత్తనాలు రైతులను నిండా ముంచాయి. వందల ఎకరాల్లో వేసిన పంటలు వారి ఆశలను మట్టిపాలు చేశాయి. మొక్కలకు, కాత, పూత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 950 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. నెల దాటినా మొక్కలో పెరుగుదల, కాత, పూత లేకపోవడంతో వేల రూపాయలు వెచ్చించి మందులు వేశారు. అయినా ఫలితం లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేసిన షాపుల్లో అడిగితే వ్యాపారులు తమకు సంబంధం లేదంటున్నారు. కంపెనీ వారు పంపించినవే తాము విక్రయించామని దాటవేస్తున్నారు. మరికొందరు వ్యాపారులు షాపులకు తాళాలు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. పంట పూర్తిగా దెబ్బతినడంతో వాటిని తొలగించి ప్రత్యామ్నాయ సాగు కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారు. విలువైన సమయంతో పాటు ఎకరాకు రూ.40 వేల చొప్పున నష్టపోయామని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -మొదటిసారి వేసి నష్టపోయిన -ఆగె యాకన్న, కేసముద్రంస్టేషన్ మిర్చిపంట వేస్తే మంచి లాభం ఉంటుందని ఆశపడిన, ఇక్కడ ఉన్న ఎరువుల దుకాణంలో 14 ప్యాకెట్లను రూ.6వేలకు తెచ్చి ఎకరంలో వేసిన. నెలదాటినా మొక్క ఫీటు కూడా పెరగలే. రూ.25వేలు పెట్టి మందులు కొటినా లాభం లేదు, విత్తనాలు అమ్మిన సేటును అడిగితే వచ్చి చూసిపోయిండు కానీ ఏమీ చెప్పలే. రూ.40 వేలు నష్టపోయిన నల్లగొండ శ్రీనివాస్, కేసముద్రంస్టేషన్ ఎకరంన్నర భూమిలో 20 ప్యాకెట్ల మిర్చి విత్తనాలు వేసిన. నెలదాటిన మొక్కలు పెరగలే. దాదాపు రూ.40 వేలు పెట్టి మందులు కొట్టినా.. పంట ఎదగలే. ఎవరికి చెప్పినా పట్టించుకోట్లేదు. షాపు వాళ్లని అడిగితే కంపెనీ వాళ్లు మోసం చేసిండని చెప్తాండ్రు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
కాజీపేట రూరల్ : క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో సోమవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ నాయకులు, మండలాల పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేటి పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సమావేశంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు ఆంజనేయులు, ఖాసీం, జంప య్య, సిరికొండ చారి, రమేష్, సంపత్, రాజు, హరికృష్ణ, అప్పం కిషన్, పసునూరి ప్రభాకర్, కమలాకర్‌రెడ్డి, అశోక్, రవి పాల్గొన్నారు. వరంగల్ జిల్లాను విడదీయెుద్దు నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ఎంతో చారిత్రకమైన వరంగల్ జిల్లాను విడదీసే యోచనను మానుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నుంచి హన్మకొండను మార్చుతూ జిల్లాగా ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీ, హృదయ్ పథకాలకు ఎంపికైన వరంగల్‌ను విడదీస్తే అభివృద్ధి నిలిచిపోతుందన్నారు. సమావేశంలో నాయకులు కమలాకర్‌రెడ్డి, రజనీకాంత్, హరికృష్ణ పాల్గొన్నారు. -
ఒంటిమిట్టను అభివృద్ధి చేస్తాం
ఒంటిమిట్ట: టీటీడీకి అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, సకల వసతులు కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తలమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఒంటిమిట్లలో ఆలయం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయానికి బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్టలో రూ.4.60కోట్లతో వసతి సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ ఏడాదిలోగా మూడు అంతస్తుల కాటేజ్‌ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 22 గదులతో పాటు 700మంది భక్తులకు సరిపడా భోజనశాల ఉంటాయన్నారు. మరో నాలుగు డార్మెటరీల నిర్మాణానికి, అనుబంధ ఆలయాల్లో తెప్పోత్సవాలు నిర్వహించేందుకు, అన్నప్రసాద వితరణను ప్రవేశపెట్టేందుకు త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఒంటిమిట్టలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతియేటా శ్రీసీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు ఒంటిమిట్ట రామాలయాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు పుట్టా సుధాకర్‌యాదవ్, రమణ పాల్గొన్నారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులపై ఆగ్రహం ఒంటిమిట్టలో నూతనంగా నిర్మించనున్న వసతిగృహానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను టీటీడీ అధికారులు పూర్తిగా విస్మరించారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ పేర్లను టీటీడీ అధికారులు విస్మరించారు. దీనిపె కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులు చైర్మన్‌ను కోరారు. కోదండరాముడిని దర్శించుకున్న చదలవాడ కాటేజీ భూమిపూజకు ముందు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డిలు ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయంలో పూర్ణకుంభం, మేళతాళాలలో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చైర్మన్‌ను స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
అభివృద్ధి దిశగా పాలకొండ్రాయుడి దేవస్థానం
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప నగర శివార్లలోని పాలకొండలలో ఉన్న పాలకొండ్రాయస్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిన ఈ ఆలయంలో గతంలో సంవత్సరానికి శ్రావణమాసంలో నాలుగు వారాలు మాత్రమే పూజలు నిర్వహించేవారు. మిగతా రోజుల్లో దూప, దీప నైవేద్యాలు స్వామికి కరువే. అయితే వైఎస్ఆర్ హయాంలో పాలకొండల సమీపంలో రిమ్స్‌తోపాటు పలు విద్యా సంస్థలు ఏర్పాటు కావడంతో ఆలయ దశ మారింది. దీంతో పుట్లంపల్లె గ్రామ ప్రజలు, నగరంలోని మరికొందరు కమిటీగా ఏర్పడి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. –పాలకొండ్రాయస్వామి ఆలయానికి మొత్తంగా మరమ్మతులు నిర్వహించి చుట్టూ గ్రానైట్ ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మించి వాటిపై విష్ణుమూర్తి అవతారాలున్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. లక్ష్మిదేవి అమ్మవారి ఆలయాన్ని, సమీపంలోని అచ్చమ్మ ఆలయాలకు మరమ్మతులు చేపట్టారు. గతంలో అచ్చమ్మ దేవస్థానం కూలిపోయి చెట్టు కింద మాత్రమే విగ్రహం ఉండేది. అక్కడ దాతలు సహకరించడంతో ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారిని కొలువుదీర్చారు. వసతి గృహాలకు మరమ్మతులు.. పాలకొండకు వచ్చే భక్తులకు ఆలయ సమీపంలో శిథిలావస్థకు చేరిన వసతి గృహాలకు మరమ్మతులు నిర్వహించి రూపుదిద్దారు. వంట చేసుకోవడానికి వంటశాలను, తలనీలాలు, కల్యాణకట్టను, మరుగుదొడ్లను, కల్యాణ వేదికను, భక్తులు కూర్చోవడానికి అవసరమైన అరుగులను ఏర్పాటు చేశారు. నిత్య పూజలకు ఆలయ కమిటీ కృషి.. ప్రతిరోజు స్వామి వారికి పాలాభిషేకం, దూప దీప నైవేద్యం వంటి పూజలు నిత్యం జరగడానికి విశేషమైన కృషి చేస్తున్నారు. అక్కడే ఇద్దరు పూజారులను నియమించి పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం ఆలయానికి వచ్చే భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతిని, భక్తుల రాత్రి సమయంలో బస చేయడానికి గదులను నిర్మించారు. దేవాదాయశాఖ నుంచి వచ్చే నిధులు, ఆలయ పాలక మండలి సేకరించిన దాతల చందాలతో ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. పాలకొండల దిగువభాగం నుంచి ట్రాక్టర్ ఇసుక తరలించడానికి (గాడిదల సహాయంతో) రూ. 15 వేలు ఖర్చవుతోంది. అలాగే సిమెంటు దిమ్మెలు, సిమెంటు బస్తాలు, గ్రానైట్ వంటి వాటిని తీసుకు వెళ్లడానికి అధిక ఖర్చు వస్తోందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి.. పాలకొండ్రాయస్వామి దేవస్థాన అభివృద్ధికి చైర్మన్‌గా నా వంతు కృషి చేస్తున్నాను. కొండ దిగువభాగాన శంఖుచక్ర నామాలున్న గాలి గోపురాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దాతలు బాగా సహకరిస్తున్నారు. – బాల ఓబుల్‌రెడ్డి,చైర్మన్, పాలకొండ్రాయస్వామి దేవస్థానం -
దళితుల సంక్షేమానికి కృషి
ఐదారు రోజుల్లో రుణాల సంబంధిత నిధులు విడుదల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆదిలాబాద్ రూరల్ : దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల సంక్షేమం కోసం దళిత బస్తీ, గతంలో ఉన్న 60 శాతం సబ్సిడీ రుణ శాతాన్ని 80 శాతానికి పెంచడం, కల్యాణలక్ష్మి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన దళిత బస్తీ కార్యక్రమం కింద భూ పంపిణీలో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,150 మంది దళితులకు రూ.80 కోట్ల 25 లక్షల విలువ చేసే భూమలును కొనుగోలు చేసి పంపిణీ చేయగా జిల్లాలో 746 మందికి భూ పంపిణీ చేసినట్లు వివరించారు. కార్పొరేషన్ ద్వారా అందించే గతంలో ఉన్న 60 శాతం సబ్సిడీని 80 శాతానికి పెంచినట్లు చెప్పారు. రుణాలకు 4,821 మంది అర్హులు జిల్లాలో 4,821 మందిని వివిధ రుణాలకు అర్హులుగా గుర్తించినట్లు పిడమర్తి రవి తెలిపారు. అలాగే మరో 1,042 మందికి రుణాలు మంజూరు కోసం అనుమతులు తీసుకోనున్నట్లు చెప్పారు. కార్పొరేషన్ ద్వారా వివిధ రుణాలు మంజూరైన లబ్ధిదారులకు సంబంధించిన నిధులు ఐదారు రోజుల్లో విడుదల కానునన్నట్లు వెల్లడించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో అధికారులు, దళిత సంఘాల నాయకులతో కలిసి మొక్కలను నాటారు. వీరి వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జేమ్స్ కల్వాల, బీసీ కార్పొరేషన్ ఈడీ మేఘనాథ్, ఆయా శాఖల ఉద్యోగులు శంకర్, మనోహర్, రాజలింగు, దళిత సంఘాల నాయకులు, తదితరులున్నారు. -
అభివృద్ధి కోసమే పార్టీ మారాం
సంగెం : తమను నమ్ముకున్న క్యాడర్, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని పాలకుర్తి, పరకాల ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎల్గూర్‌స్టేçÙన్ మాజీ సర్పంచ్ జీజుల సమ్మయ్య తల్లి లక్ష్మి, కొత్తగూడెం సర్పంచ్ వాసం సాంబయ్య తండ్రి వాసం వీరస్వామి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. బుధవారం ఇద ్దరు ఎమ్మెల్యేలు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యం లో నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యేల వెంట సర్పంచ్‌లు రంగరాజు నర్సింహస్వామి, మాదినేని రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కిషన్‌నాయక్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సుదర్శన్‌రెడ్డి, నరహరి, ఉండీల రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.24కోట్లు
నేలకొండపల్లి : జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల కోసం రూ.24 కోట్లు మంజూరు చేసినట్టు జిల్లా వ్యవసాయ సంచాలకురాలు మణిమాల తెలిపారు. నేలకొండపల్లిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయం తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల కోసం రైతులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టులో పంపిణీ చేస్తామని అన్నారు. పసల్ బీమాను పత్తికి 5000 మంది రైతులు, మిర్చికి 6000 మంది రైతులు చేయించుకున్నారని అన్నారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, 30వేల టన్నులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 22న వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ డే ఘనంగా నిర్వహిస్తామన్నారు. అదే రోజు 19లక్షల మొక్కలను నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్త్రత్తలు తీసుకోవాలని, బిల్లులు ఇవ్వకపోతే వెంటనే వ్యవసాయ శాఖ కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. -
అభివృద్ధి అంతా.. ఔటర్ చెంత!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన నగరం.. దాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు.. ఆపై విస్తరించిన నివాస, వాణిజ్య, పారిశ్రామిక జోన్లు.. మరోసారి వాటి చుట్టూ బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు).. ఇదీ హైదరాబాద్ మహానగర ముఖచిత్రం! అంకెల్లో ఓఆర్ఆర్ గురించి చెప్పాలంటే.. నగరం చుట్టూ 158 కి.మీ. దూరం.. 150 మీటర్ల వెడల్పు, 8 లైన్ల ప్రధాన మార్గం.. 20 ఇంటర్ చేంజ్‌లు!! నగరంపై ఒత్తిడిని తగ్గించాలంటే ప్రజలను సిటీ నుంచి బయటికి పంపించాల్సిందే. అంటే దానర్థం శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని! ప్రధాన నగరంలో ఖాళీ స్థలాలు పెద్దగా లేకపోవడంతో శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, కాప్రా వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు వెలుస్తున్నాయి. నగరంలో ఏటా సుమారు 6,500-7,000 నిర్మాణాలకు మహా నగర పాలక సంస్థ అధికారికంగా అనుమతి ఇస్తుంది. వీటిలో 30-40 శాతం అనుమతులు శివారు ప్రాంతాల నుంచి వస్తున్నవే. గతంలో శివారు ప్రాంతాల్లో అధిక శాతం లే-అవుట్లు వెలిసేవి. కానీ ఇప్పుడక్కడ అపార్ట్మెంట్లు, విల్లాల, షాపింగ్ మాళ్ల నిర్మాణాలూ జోరుగా సాగుతున్నాయి. మురుగు నీరు, మంచి నీటి వ్యవస్థ, విద్యుత్, రవాణా వంటి మౌలిక వసతులతో పాటు ప్రధాన నగరం ట్రాఫిక్ చట్రానికి తోడు కాలుష్య కోరల్లో చిక్కుకోవటంతో ప్రజలు శివార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు శివారు ప్రాంతాలకూ మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓఆర్ఆర్తో నగరంలో ఎక్కడి నుంచైనా సులభంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే వీలుంది. అంటే అభివృద్ధికి ఓఆర్ఆర్ కేంద్ర బిందువుగా మారిందన్నమాట. ఐటీఐఆర్, టీ-పాస్ రెండూ.. శివారు ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో భారీ సంఖ్యలో పెట్టుబడులతో ముందుకొస్తున్న కంపెనీలు.. ఇవన్నీ శివారు ప్రాంతాల కేంద్రంగా జరుగుతున్నవే. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆస్కారముంటుంది. ఆతిథ్య, రవాణా రంగాలకు కూడా అవకాశం ఉంటుంది. ఐటీ కేంద్రంగా హైదరాబాద్ పశ్చిమం వైపు స్థిరాస్తి సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇవి ఓఆర్ఆర్ వరకూ విస్తరించాయి కూడా. గచ్చిబౌలి నుంచి 13 కి.మీ. దూరంలో ఉండే అప్పా జంక్షన్, నార్సింగి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ తరహా నిర్మాణాలకు ఆదరణ పెరిగింది. శంషాబాద్ విమానాశ్రయం, శ్రీశైలం రహదారి, ఆదిభట్ల ప్రాంతాల్లో ఓఆర్ఆర్ కేంద్రంగా విల్లాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ♦ ఉప్పల్, నాగోల్ మార్గంలో మెట్రో రైలు కనెక్టివిటీ ఆధారంగా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే 10 కి.మీ. దాటి వెళ్లింది. యాదాద్రి అభివృద్ధికి సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇప్పుడు వరంగల్ హైవే స్థిరాస్తికి హాట్‌కేక్‌లా మారింది. ఇప్పటికే ఈ మార్గంలో ఐటీ సంస్థలుండటంతో అభివృద్ధికి సానుకూలంగా కనిపిస్తోంది. ♦ శామీర్‌పేట మార్గంలో బడా సంస్థలు పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. రిటైర్మెంట్ హోమ్స్‌కు ఈ ప్రాంతం అనుకూలం. ఎందుకంటే కాలుష్యానికి దూరంగా పచ్చదనం నడుమ ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నారు. ♦ జాతీయ రహదారి వెంట రవాణా ఆధారిత అభివృద్ధి జరుగుతోంది. హయత్‌నగర్ నుంచి పటాన్ చెరు వరకు రహదారికి ఇరువైపులా కి.మీ. పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు స్థల యజమానులతో 40:60 ఒప్పందాలతో గృహ, వాణిజ్య సముదాయాలను కడుతున్నారు. ♦ నార్సింగి, నానక్‌రామ్ గూడ, పటాన్చెరు ముత్తంగి జంక్షన్ నుంచి పోచారం ఇన్ఫోసిస్ వెళ్లే దారిలోనూ బడా ప్రాజెక్ట్‌లు కనిపిస్తున్నాయి. బెంగళూరు రహదారిపై ఎంటర్టైన్మెంట్ జోన్లు, ఆధునిక టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయడానికి పలు కార్పొరేట్ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. మరో ఆరునెలల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశముంది. రానున్న రోజుల్లో ఇక్కడి స్థిరాస్తి కార్యకలాపాలన్నీ ఓఆర్ఆర్ చుట్టూనే జరుగుతాయి. ♦ రూఫ్ గార్డెన్తో భవనంపై బరువు పెరుగుతుంది. అందువల్ల ఫిల్లర్స్‌ను రూఫ్ గార్డెన్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మించాలి. ఫిల్లర్లు మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువు పెరిగితే భవనానికి ముప్పే. ♦ అలాగే అంతస్తు పైకప్పుని చాలా పటిష్టంగా నిర్మించాలి. ఇది పటిష్టంగా లేకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ♦ మొక్కల పెంపకానికి అవసరమైన మీడియం (మృత్తిక)ను రాళ్లులేని మట్టితో ఏర్పాటు చేస్తే మంచిది. కొంత ఒండ్రు మన్ను కలిపితే ఇంకా బాగుంటుంది. ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధి.. నగరం నాలుగు వైపులను కలుపుతున్న ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం చివరి దశలో ఉంది. 23 కి.మీ. ఘట్కేసర్-శామీర్‌పేట్ రోడ్డు నిర్మాణం ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసి మొత్తం 158 కి.మీ. పొడవున నాలుగు లైన్ల ఓఆర్ఆర్ను అందుబాటులోకి తీసుకొస్తామని గ్రేటర్ మెనిఫెస్టోలో తెరాస ప్రకటించింది. దీని చుట్టూ హరిత టౌన్‌షిప్‌లు, అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గేమింగ్ జోన్లూ నిర్మించాలని ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు నిర్ణయించాయి. నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఓర్ఆర్కు చేరుకోవడానికి 33 రేడియల్ రోడ్లనూ రూపొందించారు. దీని చుట్టూ ఆర్టీసీ 22 టెర్మినల్ కమ్ డిపోలనూ ఏర్పాటు చేస్తోంది. ఓఆర్ఆర్ చుట్టూ ఇంటర్ చేంజ్లకు సమీపంలో 13 రవాణా ఆధారిత ప్రాంతాలను (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్స్) అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పెద్ద అంబర్‌పేట, నానక్‌రాంగూడ, బొంగులూరు, ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట, మేడ్చల్, పటాన్ చెరు, దుండిగల్, కోకాపేట ప్రాంతాల్లో రానున్నాయి.