క్రేన్లను ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రూ.6,688 కోట్ల విలువైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, వీటిని 8 వేలకు పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి కేంద్రం సహకారం అందించాలన్నారు. ఎంపీలు కె.హరిబాబు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం, రైల్వే జోన్ తదితర అంశాలను ప్రస్తావించారు. విశాఖ నగర ప్రజలకు కాలుష్యరహితమైన గాలిని అందించడానికి ఖర్చుకు వెనకడుగు వెయ్యవద్దని కేంద్ర మంత్రి తమకు స్వేచ్ఛ ఇచ్చారని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. కేంద్ర హైవేల శాఖ సభ్యుడు ఆర్.కె పాండే మాట్లాడారు.
వీసీటీఎల్‌లో నూతన క్రేన్లు ప్రారంభం
పాతపోస్టాఫీసు: విశాఖ కంటెయినర్ టెర్నినల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రేన్లను కేంద్ర ఉపరితల, నౌకాయన మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీటీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ రూ.151 కోట్ల వ్యయంతో రెండు పోస్ట్ పనామెక్స్ క్వే క్రేన్లు, రబ్బర్ టైర్స్ గేంట్రీ క్రేన్లు నాలుగు కొనుగోలు చేశామని తెలిపారు. క్వే క్రేన్లు 41 టన్నుల బరువున్న కంటెయినర్‌లను ఒక గంటలో 27 నుంచి 30 వరకు లోడ్ చేయగలవని తెలిపారు. లోడ్ చేసే సమయంలో కంటెయినర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆధునిక రక్షణ వ్యవస్థ ఉందన్నారు. ఇప్పటికే ఉన్న నాలుగు క్వే క్రేన్లకు మరో రెండు నూతన క్రేన్‌లు తోడవ్వడంతో లోడింగ్‌ను ఆపకుండా రౌండ్ ది క్లాక్ చేయవచ్చని తెలిపారు.
శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు ఇవే..
ఆరు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన ఒక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 444.5 కోట్లు
నరసన్నపేట నుంచి రణస్థలం వరకు 54.2 కిలోమీటర్ల పరిధిలో, రణస్థలం నుంచి ఆనంద ³#రం వరకు 47 కిలోమీటర్ల రహదారి నిర్మాణం
ఆనందపురం నుంచి పెందుర్తి వరకు 50.75 కిలో మీటర్లు, ఎన్‌హెచ్ 16 నుంచి విశాఖ పోర్టుకు కనెక్టివిటీకి 12.7 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి
కాన్వెంట్ జంక్షన్ వద్ద బైపాస్ ఏర్పాటు చేస్తూ పోర్ట్ రద్దీని నియంత్రించే రోడ్డుకు 60 కోట్లతో నిర్మాణాలు
విశాఖ పోర్ట్ నుంచి ఎన్‌హెచ్ 16కు 4.15 కిలోమీటర్ల పరిధిలో 100 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల రహ దారిని జాతికి అంకితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment