works
-
పని లేదు.. తిండి లేదు.. ఊరెళ్ళిపోతోంది
-
చర్లపల్లి తరహాలో మరిన్ని స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: ఆధునిక రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే స్టేషన్లకు ఆధునిక రూపు కల్పిం చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఉన్న భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగర శివారులోని చర్లపల్లి స్టేషన్‌కు ఆధునిక భవనాన్ని నిర్మించిన తరహాలో.. రాష్ట్రంలోని ముఖ్య స్టేషన్లను సమూలంగా మార్చనుంది. రాష్ట్రంలో 40 స్టేషన్లకు కొత్త ఆధునిక భవనాలను నిర్మించేందుకు రూ.2,737 కోట్లను మంజూరు చేసింది. అమృత్ భారత్ స్టేషన్లుగా వీటిని గుర్తించిన రైల్వే శాఖ ఈమేరకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం దేశంలోనే పెద్ద స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ లాంటి స్టేషన్లలో కూడా సరైన వసతులు లేవు.వాటిని ఆధునీకరించకపోవటం, క్రమంగా రద్దీ విపరీతంగా పెరిగిపోవటంతో ప్రయాణికులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నాలుగైదు ముఖ్య రైళ్లు వచ్చిన సమయంలో, వాటిల్లోంచి ఎక్కి దిగే ప్రయాణికులతో పరిసరాలు కిక్కిరిసిపోయి సకాలంలో రైళ్ల వద్దకు చేరుకోలేక అవి వెళ్లిపోతున్న సందర్భాలు నిత్యకృత్యంగా మారాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కడివారక్కడ నిలిచిపోయేంత రద్దీ ఉంటోంది. చూస్తుండగానే రైళ్లు వెళ్లిపోయి ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. ఇక టికెట్ల జారీ, నిరీక్షణ సమయం, వీల్ చైర్లు, టాయిలెట్లు, ప్లాట్‌ఫామ్స్ మారే సమయం.. ఇలా అన్నీ ఇబ్బందులే.పెద్ద స్టేషన్లోనే పరిస్థితి ఇలా ఉంటే, చిన్నవాటిల్లో సమస్యలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించటంతోపాటు కొత్త వసతులు కల్పిం చటమే ఈ పథకం ఉద్దేశం. సాధారణ మరమ్మతులు కాకుండా, విమానాశ్రయ తరహాలో ఆకృతి ఇస్తూ ఆధునిక రూపు కల్పించాలన్నది ప్రధాని మోదీ ఆదేశం. విశాలమైన పార్కింగ్ ప్రాంతం, హైలెవల్ ప్లాట్‌ఫామ్స్, ఆధునిక వెయిటింగ్ హాల్స్, అవసరమైన చోట్ల ఎస్కలేటర్లు, వేగంగా టికెట్లు జారీ అయ్యేలా కౌంటర్లు, సరికొత్త అనౌన్స్మెంట్ వ్యవస్థ, సోలార్ విద్యుత్ ఏర్పాట్లు, విశాలమైన పార్కింగ్ లాట్స్, విశాలమైన అప్రోచ్ రోడ్లు, భద్రతా స్కానింగ్ సెంటర్లు, ఆకర్షణీయమైన భవనం.. ఇలా అన్ని వసతులతో ఇవి ఆకట్టుకుంటాయి.14 స్టేషన్లకు ఆధునిక హంగులుఅమృత్భారత్లో చోటు దక్కించుకున్న స్టేషన్లలో 14 హైదరాబాద్‌కు చెందినవే కావటం విశేషం. అమృత్‌భారత్‌లో భాగమైనప్పటికీ, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లను భారీ ప్రాజెక్టుల కోటాలో ఉంచారు. వీటికి భారీ నిధులు కేటాయించారు. రూ.430 కోట్లతో మినీ ఎయిర్‌పోర్టు తరహాలో రూపుదిద్దుకున్న చర్లపల్లి టెర్మినల్‌ను ఇటీవలే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తు తం వేగంగా పనులు జరుపుకొంటున్న సికింద్రాబాద్, ఇటీవలే పనులు మొదలైన నాంపల్లి, త్వరలో పనులు ప్రారంభించుకోనున్న కాచిగూడ స్టేషన్లకు భారీగా నిధులు కేటాయించారు.ఇప్పటికే రూ.700 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్‌కు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిన్నరలో ఇది పూర్తి కానుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి కొత్త భవనం అందుబాటులోకి రావాల్సి ఉన్నా, సకాలంలో పనులు పూర్తయ్యేలా లేవు. దీంతో వచ్చే ఏడాది జూలై నాటికి సిద్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని పనులు కొలిక్కి వస్తున్న తరుణంలో, నగరంలో మరో ముఖ్య స్టేషన్ అయిన నాంపల్లి (హైదరాబాద్) స్టేషన్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పాత క్వార్టర్ భవనాలు, చుట్టూ గోడలు కూల్చి వేశారు. ప్రధాన నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్టేషన్ భవనానికి రూ.327.27 కోట్లు కేటాయించారు.కొత్త రూపు సంతరించుకోనున్న స్టేషన్లు ఇవే.. చర్లపల్లితోపాటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, మలక్‌పేట, మల్కాజిగిరి, బేగంపేట, మేడ్చల్, యాకుత్‌పురా, ఉందానగర్, ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, తాండూరు, జహీరాబాద్, యాదాద్రి, బాసర, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దపల్లి, షాద్‌నగర్, వికారాబాద్, వరంగల్, జోగుళాంబ. -
బట్టీ వద్దే బడి..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామ స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీ వద్ద ఒడిశా బడి ఏ ర్పాటు చేశారు. ఇక్కడి ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 50 కుటుంబాలు పనులు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో సు మారు 35 మంది ఏడేళ్లలోపు పిల్లలు ఉండటంతో బట్టీ యజ మాని జహంగీర్.. వారి కోసం ప్రత్యేకంగా ఒడిశా పాఠశాలను ఏర్పాటు చేశారు.35 మంది పిల్లలకు ప్రాథమికస్థాయి విద్యను బోధించేందుకు ఒడిశాకు చెందిన సునీల్ అనే యువకుడిని నియమించారు. పాఠశాల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు సునీల్ ఒడిశా భాషలో అక్షరాలతో పాటు పాఠాలు నేర్పుతు న్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, బట్టీలో పనిచేస్తున్న వారి పిల్లలకు వారి భాషలోనే విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో ఈ బడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఉత్తమ్ బృందం
-
లోకేశ్ కపట ప్రేమ!
తాడేపల్లిరూరల్: ఇసుక కార్మికులపై టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ కపట ప్రేమ చూపుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వ హయాంలో ఇసుక కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, భారీ యంత్రాలతో ఇసుక దోచుకుంటున్నారని ఎన్నికల వేళ పసలేని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్న సంఘటనలు, అడ్డుకున్న అధికారులపై జరిగిన దాడులు మరిచి, మేము అధికారంలోకి వస్తే ఇసుక, భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామంటూ హామీ లు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యల నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు పరిణామాలను పరిశీలిస్తే... 2014కు ముందు... ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్ పైభాగంలో సైతం ఇసుక కార్మికులు నీటిలోకి దిగి పారలతో ఇసుక లోడింగ్ చేసేవారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని పాతూరు, గుండిమెడ, చిర్రావూరు, గొడవర్రు, రామచంద్రాపురం, పెదకొండూరు, వీర్లపాలెం దళిత కుటుంబాలు ఇసుక ట్రాక్టర్లకు, లారీలకు లోడింగ్ చేసి, పొట్ట నింపుకునేవారు. 2014 తర్వాత అక్రమంగా హైదరాబాద్‌కు ఇసుక టీడీపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు రేపల్లె నుంచి అచ్చంపేట వరకు మకాం వేశారు. దొరికిన కాడికి ఇసుక దోచుకుంటూ జేబులు నింపుకొన్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక కార్మికులను ఒక్కొక్కరిని తొలగించారు. అనుమతులు లేని భారీ పడవలను దించి, వాటికి ఇసుక తోడే యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు ఒక్కొక్క ఇసుక క్వారీ నుంచి 30 వేల టన్నుల ఇసుకను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలించేవారు. ఇది గమనించిన స్థానిక నాయకులు మా ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తలచారు. అంతే... భారీ యంత్రాలతో దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి గుంటూరు ఎమ్మెల్యే సోదరుడిది కీలక పాత్ర ఈ దోపిడీలో అప్పటి గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, నారా లోకేశ్ మిత్రుడు కీలక పాత్ర పోషించారు. చినబాబుకు సైతం భారీగా సొమ్ములు పంపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాతూరు, గుండిమెడ ఇసుక రీచ్‌లో కార్మికులను పోలీసులతో బెదిరించి మరీ బయటకు పంపివేశారు. చిర్రావూరులో కొంతకాలం అక్కడి కార్మికులకు పని కల్పించారు. తర్వాత భారీ వాహనాల్లో ఇసుకను బయటకు తరలించాలంటే కార్మికుల వల్ల కాదని తాత్కాలికంగా మూడు రోజులపాటు క్వారీని నిలుపుదల చేశారు. అనంతరం 200 యంత్రాలు తీసుకువచ్చి ఇసుక లోడింగ్ నిర్వహించారు. దీంతో కార్మికులకు ఉపాధి కరవైంది. అధికారులను బెదిరించి... ఇసుక రీచ్‌ల్లో అధికారులు యంత్రాలకు అనుమతులు ఇవ్వనప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేసి భారీగా తవ్వకాలు చేపట్టారు. అనుమతులకు మించి తవ్వకాలు వల్ల ఆ గుంతల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని మూసివేయాలని పాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులచేత బెదిరించి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారని నేటికీ కార్మికులు చెబుతున్నారు. -
ఉండి అభ్యర్థిని మారిస్తే ఉండేలుదెబ్బే
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో చంద్రబాబుకు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. ఉండి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నట్టు ఇచ్చిన సంకేతాలపై కార్యకర్తలు ఆయనపై తిరగబడ్డారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును తగలబెట్టిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు.. రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు టికెటిస్తే చిత్తుగా ఓడిస్తామంటూ చంద్రబాబు ఎదుటే తేల్చిచెప్పారు. ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరును చంద్రబాబు మొదటి జాబితాలోనే ప్రకటించారు. ఈ మేరకు రామరాజు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఉండి సీటు తనదేనని, రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటిస్తారని రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో చెబుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే రామరాజు వర్గానికి మింగుడు పడలేదు. ఈ తరుణంలో అభ్యర్థి మార్పుపై చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు పార్టీ క్యాడర్లో అగ్గిరాజేశాయి. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ హాలులో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశానికి ఉండి ఎమ్మెల్యే రామరాజుతోపాటు రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజుకు ప్రచారం స్పీడు తగ్గించాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో ఉండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పాలకొల్లులోని ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుని బయటే బైఠాయించి నిరసనకు దిగారు. రామరాజును మారిస్తే తమ సత్తా చూపిస్తామని, ఉండిలో పార్టీ విజయాలకు బ్రేక్ వేస్తామని హెచ్చరించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు వారికి సమాధానం చెప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది సాయంతో వెళ్లిపోయారు. ఉండి కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నోఏళ్లుగా పార్టీ విజయానికి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బ్రోకర్‌కు టికెట్టా! రాజకీయ బ్రోకర్‌గా, వివాదాస్పదుడిగా ముద్రపడిన రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడడమేమిటని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసలు ఈ ఉదంతంలో చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఆ పార్టీలో తన ఆటలు సాగకపోవడంతో కొద్దినెలలకే రాజకీయ బ్రోకర్‌గా మారి టీడీపీకి, చంద్రబాబుకు ఆప్తుడిగా మారిపోయారు. ఆయనకు అనుకూలంగా పనిచేశారు. చంద్రబాబు చేసిన కుట్రలన్నీ రఘురామకు తెలుసని, అందుకే ఇప్పుడు ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. రఘురామ కూటమి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏడాది క్రితమే ప్రకటించారు. బీజేపీలో చేరి నర్సాపురం ఎంపీ సీటు తెచ్చుకోవాలని కలలు కన్నారు. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో తన సంగతి తేల్చాలని చంద్రబాబుపై రఘురామ ఒత్తిడి తెచ్చారు. ఇంతకాలం అన్ని పనులకూ ఆయనను ఉపయోగించుకున్న కారణంగా రఘురామ బాధ్యత చంద్రబాబుపైనే పడింది. -
పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా పరిణమిస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ సహకారం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్ స్కిల్డ్ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచించాలన్నారు. బీహెచ్ఈఎల్ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ అని యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సెప్టెంబర్ నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అధికారులు వివరించారు. 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని అధికారులు మంత్రులకు చెప్పుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సంట్ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అలాగే స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. రుణాలపై ఆరా.. ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని చెప్పా రు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్నచిన్న పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్‌లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్ శాఖ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ట్రాన్స్‌కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సీఈ సమ్మయ్య పాల్గొన్నారు. -
పట్నాలో మెట్రో పరుగులు.. ఎప్పుడంటే..
బీహార్ రాజధాని పట్నాలో ‘మెట్రో’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి ఈ పనులు పూర్తవుతాయనే అంచనాలున్నాయి. మొదటి దశలో మొత్తం 26 మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 13 భూగర్భ, 13 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు. ఫేజ్-1 కింద రెండు కారిడార్లను నిర్మిస్తున్నారు. మొదటి కారిడార్ దానాపూర్ నుండి ఖేమిన్‌చాక్ వరకు వెళుతుంది. దీని పొడవు 18 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ కారిడార్ పట్నా జంక్షన్ నుండి పాటలీపుత్ర బస్ టెర్మినల్ వరకు ఉంటుంది. రెండో కారిడార్ పొడవు 14 కిలోమీటర్లు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కారిడార్-1లో మొత్తం 14 మెట్రో స్టేషన్లు ఉంటాయి. వాటిలో 8 ఎలివేటెడ్, ఆరు భూగర్భ మెట్రో స్టేషన్లు. రెండో కారిడార్‌లో మొత్తం 12 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఐదు ఎలివేటెడ్, ఆరు భూగర్భంలో ఉంటాయి. డీఆర్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కారిడార్-2 జనవరి 2027 నాటికి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.2 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. కాగా ఢిల్లీ-నోయిడా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు నోయిడాలో కొత్త మెట్రో మార్గాలను నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించారు. గత ఏడాది నూతన మెట్రో మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
ఆపరేషన్స్ కి సిద్ధమైన రామాయపట్నం ఓడరేవు
-
ఇంటికి చేరువలోనే విద్యుత్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలోకి విద్యుత్ సేవలను తీసుకువచ్చింది. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లోనే విద్యుత్ సంబంధిత సేవలు దాదాపు అన్నింటిని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ విద్యుత్ బిల్లుల చెల్లింపు మినహా మీ–సేవా కేంద్రాల్లో పొందిన సేవలు ఇకపై వినియోగదారుల ఇంటికి చేరువలోనే లభించే ఏర్పాటు చేసింది. ఇక గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి సచివాలయాలకు వెళితే సరిపోతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఈ సేవలతో రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యతలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించడంలో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,883 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖ ద్వారా నియమించారు. వీరికి అవసరమైన శిక్షణను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అందించాయి. భవిష్యత్‌లో వీరికి లైన్మెన్, సీనియర్ లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, లైన్ సూపర్వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్‌ను గరిష్టంగా 1,500 విద్యుత్ కనెక్షన్లకు బాధ్యుడిని చేశారు. కనీసం 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లను ఇతను నిరంతరం పర్యవేక్షిస్తాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడినా, జంపర్లు తెగిపోయినా బాగు చేయడం, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా, మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వంటి విధులతో పాటు మరే ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తినా బాగు చేస్తారు. వారి స్థాయి కానప్పుడు పైఅధికారులకు వెంటనే సమాచారం అందించడం ద్వారా సాంకేతిక నిపుణులు త్వరగా వచ్చేలా చూస్తారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి వలంటీర్ల ద్వారాగానీ ప్రజలు నేరుగాగానీ గ్రామ సచివాలయానికి ఫిర్యాదు చేసేŠత్ క్షణాల్లో సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై వీరు విద్యుత్ రంగానికి సంబంధించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారా ప్రజలకు అందేలా చూస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన సేవలు 1. గృహ, వాణిజ్య సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 2. వ్యవసాయ సర్విసు కనెక్షన్ల కోసం దరఖాస్తు 3. అదనపు లోడ్ దరఖాస్తు 4. కేటగిరి మార్పు 5. సర్వీసు కనెక్షన్ పేరు మార్పు 6. మీటరు టెస్టింగ్‌కు సంబంధించి 7. మీటరు కాలిపోవటంపై ఫిర్యాదు 8. బిల్లులకు సంబంధించిన సమస్యలు 9.ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఫిర్యాదులు 10. వోల్టేజ్ హెచ్చుతగ్గులపై ఫిర్యాదులు 11. లైన్ షిఫ్టింగ్ 12. పోల్ షిఫ్టింగ్ 13. మీటరు ఆగిపోవడం, నెమ్మదిగా తిరగడంపై ఫిర్యాదులు 14. విద్యుత్ బిల్లులు చెల్లింపు ప్రజలకు మరింత సౌకర్యంగా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విద్యుత్ సేవలు పొందేందుకు ప్రజలకు అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సూచనలతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిస్కంలను కొన్ని నెలల క్రితం జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి తాజాగా అన్ని సేవలను సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చాం. డిజిటలైజేషన్ నేపథ్యంలో ఆన్లైన్ పేమెంట్ యాప్స్(యూపీఐ)ల ద్వారా, డిస్కంల సొంత యాప్స్ ద్వారా చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. కొందరు అందుబాటులో ఉన్న నగరాలు, పట్టణాల్లో ఎనీటైమ్ పేమెంట్ (ఏటీపీ)మెషిన్స్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో బిల్లులు కడుతున్నారు. గ్రామాల్లో నెలకోసారి దండోరా వేయించి సంస్థ ప్రతినిధి వెళ్లి బిల్లులు కట్టించుకుంటున్నారు. ఇకపై సచివాలయాల్లో కూడా కరెంటు బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పించాం. –ఐ.పృధ్వితేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్. -
బిల్లులు చెల్లిస్తారాలేక.. వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్
కామారెడ్డి: సీఎం కేసీఆర్ సార్ గ్రామంలో అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యాను.. బిల్లులు చెల్లి స్తారా లేదా ఆత్మహత్య చేసుకొని చావమంటారా అంటూ బీఆర్ఎస్కు చెందిన ఉపసర్పంచ్ చేసిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మండలంలోని బీబీపేటకు చెందిన సాయినాథ్ గత ఎన్నికల్లో 13వ వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఉమ్మడి మండలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టాడు. సుమారు రూ. 1.50 లక్షల వరకు నిధులు ప్రభు త్వం నుంచి రావాల్సి ఉందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిన సాయినాథ్ వాట్సప్‌లో తన వాయిస్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధు లు రావడం లేదని, ఎన్నికల కోడ్ వస్తే నిధులు వి డుదల కావని పేర్కొన్నారు. తన చావుతో అయినా జీపీ వ్యవస్థను ఆదుకోవాలంటు ఆదుకోవాలంటు వాట్సప్ గ్రూపుల్లో వాయిస్‌మెసేజ్ చేశాడు. దీంతో పోలీసులు సాయినాథ్ నంబర్ ట్రేస్చేసి హైదరాబా ద్లో పట్టుకొన్నారు. అతని మిత్రులకు గ్రామానికి తీసుకురావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
రూ.1,712.21 కోట్ల ప్రాధాన్యత పనులు మంజూరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించిన ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.537.77 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని 15,004 సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించి ప్రాధాన్య పనులుగా చేపడుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాలను సందర్శిస్తున్న సందర్భంగా ఒక్కో సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనుల కోసం రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పూర్తయిన పనులకు బిల్లులూ చెల్లిస్తోంది. ఇప్పటి వరకు 9,381 సచివాలయాల పరిధిలో గుర్తించిన రూ.1,876.20 కోట్ల విలువైన 50,117 పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. ఇందులో ఇప్పటికే 8,562 సచివాలయాల పరిధిలో రూ.1,712.21 కోట్ల విలువైన 43,685 ప్రాధాన్యత పనులు మంజూరు చేయగా.. 7,702 సచివాలయాల పరిధిలో 39,089 పనులను ప్రారంభించారు. పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేయడం, వాటిని వెంటనే మంజూరు చేయడం, అనంతరం వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ విషయంలో వెనుకబడిన జిల్లాల్లో కలెక్టర్లు సమీక్షించి త్వరగా పనులు మంజూరు చేయించి, ప్రారంభింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
12 ముక్కల్లో మన ఇంజినీర్ల అమెరికా జీవితం ఇదే..
మనదేశానికి చెందిన చాలామంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అమెరికా వెళ్లి, అక్కడ ఉద్యోగం చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అమెరికా చేరుకున్న తరువాత వారు ప్రధానంగా అనుసరించే 12 దశలు ఇవే.. మొదటి దశ విద్యార్థిగా ఉన్నప్పుడే మూడు లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అవి.. (ఎ) విద్యార్థి రుణాన్ని చెల్లించడం. (బీ) యూఎస్ఏలో ఎక్కడైనా ఉద్యోగం పొందటం. (సీ) హెచ్1-బీ ఆమోదానికి యత్నం. (ఇది చాలా ముఖ్యమైన లక్ష్యం) దీనితోపాటు 5 సంవత్సరాలలోపు భారతదేశానికి తిరిగి రావడానికి విస్తృతమైన ప్రణాళికలకు రూపకల్పన. రెండవ దశ హెచ్1-బీ ఆమోదం. గ్రీన్ కరెన్సీతో ఎంజాయ్ చేయడం. టయోటా క్యామ్రీ లేదా హోండా సివిక్ లేదా నిస్సాన్ ఆల్టిమాను కొనుగోలు చేయడం. భారతదేశంలో ఎక్కడైనా ఆస్తిని కొనుగోలు చేయడం. మూడవ దశ విజిటర్ వీసాలపై భారతదేశం నుండి తల్లిదండ్రులను తీసుకురావడం. ఈ కిందివాటిని విజిట్ చేయడం. చార్ ధామ్ యాత్ర. నయాగరా జలపాతం సందర్శన. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడటం. వాల్ స్ట్రీట్‌లో బుల్ ఛార్జింగ్. వైట్ హౌస్ సందర్శన. నాల్గవ దశ భారతదేశానికి వెళ్లడం. పెళ్లి సంబంధం కోసం ఒక అమ్మాయిని ఖరారు చేయడం. మూడు వారాల్లోపు వివాహం చేసుకోవడం. వాస్తవానికి ఇది టైట్ షెడ్యూల్ మధ్య చేసుకున్న వివాహం. జీవిత భాగస్వామితో పాటు యూఎస్ఏకి తిరిగి రావడం. ఐదవ దశ ఇతర భారతీయ స్నేహితులతో వారాంతాల్లో, భోజన సమయంలో ఈ 3 అంశాలపై తరచూ చర్చిస్తారు. అవి.. (ఏ) మీరు మీ గ్రీన్ కార్డ్‌ని ఎప్పుడు పొందబోతున్నారు? ప్రస్తుతం మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? (బి) మోదీ భారతదేశాన్ని ఎలా మారుస్తున్నారు? (సీ) క్రికెట్‌పై చర్చించడంతో పాటు భారతదేశంలో మరొక ఆస్తిని కొనుగోలు చేయడం. ఆరవ దశ అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయడం. ఇద్దరు పిల్లలను కలిగి ఉండటం. తదుపరి 15 సంవత్సరాలు వారిని చదవులో నిమగ్నమయ్యేలా చేయడం. వారి పుట్టినరోజు పార్టీలకు హాజరు కావడం. వివిధ హోమ్ ప్రాజెక్ట్‌ల కోసం హోమ్ డిపోను సందర్శించడం ఏడవ దశ గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షణ ముగియడం ఎనిమిదవ దశ ఈ సమయానికి 40 ఏళ్లకు చేరుకుంటారు. అప్పుడు తగినంత నిధులను పొదుపు చేసి ఉంటారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి ప్రణాళిక అప్పుడు వర్కౌట్ కాదు. దీంతో ఆ డబ్బు ఖర్చు చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం. టెస్లా లేదా బిఎమ్‌డబ్ల్యూ లేదా మెర్సిడెస్ని కొనుగోలు చేయడం. ఇండియాలో ప్రాపర్టీలు లాభదాయకంగా ఉండవని భావించడం. ఎందుకంటే అమెరికా డాలర్లతో పోలిస్తే భారతదేశ రూపాయి మరింత క్షీణించింది. దీంతో భారతదేశంలోని ఆస్తులను విక్రయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయడం. భారతదేశంలో భారీ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించడం. ఇక్కడి నిధులను తిరిగి యునైటెడ్ స్టేట్స్కు పంపడం. తొమ్మిదవ దశ ఇప్పుడు మిడ్ లైఫ్ సంక్షోభం ఎదురవుతుంది. కొత్త కారు, పెద్ద ఇల్లు, గ్రీన్ కార్డ్, అధిక ఆదాయంతో కూడిన ఉద్యోగం ఇకపై జీవితంలో కానరావు. అప్పుడు ఉనికిని నిలబెట్టుకునేందుకు ఏదో ఒకటి చేయడం. ఒక మారథాన్ రేస్‌లో పాల్గొనడం. అడపాదడపా ఉపవాసం చేయడం లాంటివి. లేదా కొత్త స్టార్టప్‌ని తెరవడం. పదవ దశ 50- 60 ఏళ్ల వయసుకు చేరుకున్నాక.. పిల్లలు స్టాన్ఫోర్డ్ లేదా ఎంఐటీ లేదా ప్రిన్స్టన్ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, మీరు యూఎస్ఏకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లి ఉంటే, జీవితం ఎంత భిన్నంగా ఉంటుందో చర్చిస్తుంటారు. 11వ దశ పిల్లలు దూరంగా వెళ్లడం, చేతిలో తగినంత సమయం ఉండటంతో, ప్రతి సంవత్సరం యూరప్ పర్యటనలు చేయడం, ఈజిప్ట్‌లోని పిరమిడ్లను సందర్శించడం, టర్కిష్ డిలైట్స్ని ఆస్వాదించడం, ఇటలీని సందర్శించడం మొదలైనవి చేస్తారు. భారతదేశం గురించి తిరిగి ఆలోచించడం. ఇటీవలి దశాబ్దాలలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందనేది యూఎస్ఏలోని స్నేహితులతో పంచుకోవడం. 12వ దశ ఫంక్షనల్ మొబిలిటీ తగ్గినప్పుడు జీవితానికి సంబంధించిన పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. భారతదేశానికి తిరిగి వెళ్లడం లేదా యూఎస్ఏలో వృద్ధాశ్రమంలో ఉండటం. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
క్షణాల్లో చెల్లింపులు చేసే క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందంటే..
క్యూఆర్ కోడ్ ఫుల్ పార్మ్ క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది మెషీన్ రీడబుల్ లేబుల్ వంటిది. దీనిని కంప్యూటర్.. టెక్స్ట్ కన్నా సులభంగా అర్థం చేసుకుంటుంది. డిజిటల్ యుగం వైపు పయనిస్తున్న భారతదేశం అభివృద్ధి పథంలోనూ దూసుకుపోతోంది. నేడు ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా, వారిలో భారతీయుల సహకారం అధికంగా ఉండటం విశేషం. అయితే దీని వెనుక పలువురు ఇంజినీర్ల సహకారం దాగుంది. వారు పలు యాప్‌లను రూపొందించి, డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సాయంతో ఎవరికైనా నగదును సులభంగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం ద్వారా ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారా? క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి? ఈ రోజుల్లో ప్రతిచోటా క్యూఆర్ కోడ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం, దానిని గుర్తించడంలో దీని వినియోగం అధికంగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్మెంట్, బిల్బోర్డ్, బిజినెస్ విండోలో అధికంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్ చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే క్యూఆర్ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్కోడింగ్ మోడ్‌లను ఉపయోగిస్తుంది. క్యూఆర్ కోడ్ ఎలా పని చేస్తుంది? బార్కోడ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా క్యూఆర్ కోడ్ కోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మనకు క్యూఆర్ కోడ్‌లో అనేక చుక్కలు కనిపిస్తాయి. బార్కోడ్లో గీతలు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్ కోడ్. రెండవది డైనమిక్ క్యూఆర్ కోడ్. స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థిరంగా ఉంటుంది. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే.. -
శరవేగంగా తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పనులు
-
పోలవరానికి పట్టిన చంద్రగ్రహణాలు తొలుగుతున్నాయి
-
అదిగదిగో రామాయపట్నం పోర్ట్ 851 ఎకరాల్లో కళ్ళు చెదిరేలా నిర్మాణం
-
బందరు కల సాకారం
-
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో మరో ముందడుగు
-
శరవేగంగా శ్రీనివాస సేతు నిర్మాణం పనులు
-
పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తి
-
విజయవాడ: అంబేద్కర్ స్మృతివనం పనులను పరిశీలించిన మంత్రుల బృందం
-
పోలవరంలో మరో కీలక ఘట్టం
-
ఘట్ కేసర్ వద్ద పూర్తయిన రైల్వే ట్రాక్ పనులు
-
Polavaram: డ్రాఫ్ట్ ట్యూబ్ అమరిక పనులు ప్రారంభం
పోలవరం రూరల్(ఏలూరు జిల్లా): పోలవరం జల విద్యుత్ కేంద్రం డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ జెన్కో, మేఘా ఇంజినీ రింగ్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగింపు పనులు చేపట్టారు. ఈ విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లున్నాయి. 960 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. పోలవరానికి వచ్చే నీరు విద్యుత్ కేంద్రంలోని ట ర్బయిన్లపై పడుతుంది. టర్బయిన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. దీనికి వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు డ్రాఫ్ట్ ట్యూబ్‌ను ఉపయోగిస్తారు. చదవండి: మనబడి నాడు-నేడు పనులు.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు -
ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ ATM .. ఎలా పని చేస్తుందో చూస్తే షాక్ అవుతారు..
-
వెలుగుల మాటున నలిగిన బతుకులు
సాక్షి, నిజామాబాద్/జగిత్యాల: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్‌వాసి కల్లెడ రమేశ్(50) ఖతర్‌లోని బూమ్ ఇంటర్నేషనల్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 2016లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. ఫుట్‌బాల్ కప్(ఫిఫా) టోర్నీకి సంబంధించిన విధుల్లో పనిగంటలను విపరీతంగా పెంచడంతో తీవ్ర ఒత్తిడికి గురికావడమే కారణం. రమేశ్ కుటుంబానికి ఖతర్ ప్రభుత్వం, కంపెనీ పరిహారం చెల్లించలేదు. ఇతని మృతితో కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్‌కు చెందిన సురకంటి జగన్(32) 2021 నవంబర్ 11లో ఖతర్‌లో ఫుట్‌బాల్ స్టేడియంలో పైప్‌లైన్ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు కూలి సమాధి అయ్యాడు. అతని భార్య, కూతురు, కొడుకులు పెద్ద దిక్కును కోల్పోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకూ ఆధారం లేకుండా పోయింది. జగిత్యాల్ జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన నరుకుల్ల శ్రీనివాస్(30) 2020 జనవరి 4న ఖతర్ ఫుట్‌బాల్ స్టేడియంలో టవర్ క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా మరణించాడు. అతని మరణంతో భార్య అనిత, ఇతర కుటుంబసభ్యులు కుంగిపోతున్నారు. ఫిఫా పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులో పని కోసం వెళ్లి ప్రమాదాలు, పని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యానికి గురికావడం, అనుమానాస్పద స్థితిలో మరణించిన మన దేశ వలస కార్మికుల సంఖ్య 2,800 వరకు ఉంటుందని అంచనా. నరుకుల్ల శ్రీనివాస్ అంతిమయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న గల్ఫ్ జేఏసీ నాయకులు ఆసియా దేశాలకు సంబంధించిన వలస కార్మికులు ఖతర్‌లో గడచిన పదేళ్లలో 6,500 మంది మరణించారని వలస కార్మికుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఫుట్‌బాల్ కప్(ఫిఫా) పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. స్టేడియంలు, క్రీడాకారులు, క్రీడాభిమానుల సౌకర్యాల కోసం ఎన్నో నిర్మాణాలను చేపట్టింది. పోటీల కోసం ఖతర్ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసినా వలస కార్మికుల కుటుంబాలకు మాత్రం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిని సహజ మరణాలుగానే ధ్రువీకరించడం గమనార్హం. ఫిఫా పనుల కోసం ఖతర్ ప్రభుత్వం వివిధ కంపెనీలకు పదేళ్ల కిందనే కాంట్రాక్టులు ఇచ్చింది. ఖతర్ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి ఖతర్‌లో ఫిఫా పనుల కోసం ఉపాధి పొందుతూ ఏ కారణంతో మరణించినా అలాంటి వలస కార్మికుల కుటుంబాలను అక్కడి ప్రభుత్వం ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఖతర్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ చైర్మన్ -
వరదలు తగ్గడంతో పోలవరం పనుల్ని వేగవంతం చేశాం : మంత్రి అంబటి
-
శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పనులు
-
పెన్నా బ్యారేజీ పనులు పరిశీలించిన మంత్రులు
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజీ పనులను మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్థన్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పెన్నా, సంగం బ్యారేజీలను త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని అంబటి రాంబాబు తెలిపారు. వరద కష్టాల నివారణకు కుడా ఈ బ్యారేజీలు దోహద పడతాయన్నారు. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, పెన్నా ,సంగం బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని తెలిపారు. దివంగత నేత మహానేత వైఎస్సార్ బ్యారేజీలకు శంకుస్థాపన చేశారన్నారు. టీడీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయని.. చంద్రబాబు అసలు పట్టించుకోలేదని కాకాణి మండిపడ్డారు. సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా రైతుల కలను సీఎం జగన్ సాకారం చేయబోతున్నారని మంత్రి కాకాణి అన్నారు. -
పెన్నా బ్యారేజ్‌ను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, నెల్లూరు: పెన్నా బ్యారేజ్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. కాంక్రీట్ వాల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. పెన్నా, సంగం బ్యారేజ్ పనులు తుది దశకు వచ్చాయని.. ఏప్రిల్ నెలాఖరుకు పనులు పూర్తవుతాయన్నారు. మే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. బ్యారేజ్‌కు గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. రెండు బ్యారేజ్ పనులు పూర్తయితే సాగు, తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని మంత్రి అనిల్ అన్నారు. చదవండి: కేశినేని వర్సెస్ దేవినేని.. టీడీపీలో హాట్ టాపిక్.. -
Chilakaluripet: నెక్లెస్ ఆకారంలో రోడ్డు నిర్మాణం
యడ్లపాడు(చిలకలూరిపేట): పుష్కరకాలంగా నిలిచిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. టీడీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక చొరవ చూపారు. పెద్దమనసుతో కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు నష్టపరిహారం కోసం నిధులు మంజూరు చేశారు. ఫలితంగా పనులు వేగవంతమయ్యాయి. ఆది నుంచీ వివాదాలు 16వ నంబర్ జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణ పనులను 2009లో హైవే అథారిటీ సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా చిలకలూరిపేట వద్ద నెక్లెస్ ఆకారంలో బైపాస్ వేయాలని కొందరు ప్రతిపాదించారు. అయితే దీనివల్ల తాము నష్టపోతామని రైతులు వ్యతిరేకించారు. దీంతో ఈ వివాదం 2010లో కోర్టుకు చేరింది. ఫలితంగా విజయవాడ టోల్‌ప్లాజా నుంచి చిలకలూరిపేట మండలం తాతాపూడి వరకు 84.5 కిలోమీటర్ల మేర జరగాల్సిన రహదారిలో చిలకలూరిపేట పరిధిలోని 16 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం 2016లో బైపాస్ నిర్మాణానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల నష్టపోయే రైతులకు పరిహారం అందించేందుకు 2018లోనే అవార్డు పాస్‌చేసినా రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన పరిహారం వాటా నిధులు మంజూరు కాలేదు. అప్పటి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండి కూడా రైతులకు న్యాయం చేయలేకపోయారు. ఎమ్మెల్యే రజినీ కృషితో కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే విడదల రజిని హైవే అథారిటీ సంస్థతో సంప్రదింపులు జరిపారు. సమస్యను తెలుసుకుని సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ క్లిష్ట సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.57 కోట్లను తక్షణం మంజూరు చేశారు. 2019లోనే రైతులకు నష్టపరిహారం అందించారు. స్వరూపం ఇలా.. ► చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట పట్టణం, మండలాలను కలుపుతూ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ బైపాస్‌ను నిర్మిస్తోంది. ► యడ్లపాడు మండలం తిమ్మాపురం చేపల చెరువు హైవే నుంచి చీలి చిలకలూరిపేట మండలంలోని రామచంద్రాపురం అడ్డరోడ్డు వరకు 16.384 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో రోడ్డు నిర్మాణం కానుంది. ► ఈ మార్గంలో మూడుచోట్ల ఫ్లైఓవర్లు, ఐదుచోట్ల వంతెనలు, ఆరుచోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ► ఈ ఏడాది సెప్టెంబర్ చివరన ప్రారంభమైన ఈ పనులు 2023 మార్చికి పూర్తికానున్నాయి. సీఎం పెద్దమనసు చూపారు గత ప్రభుత్వ అలసత్వం వల్ల రైతులకు నష్టపరిహారం నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా బైపాస్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో నేను హైవే అథారిటీ ప్రతినిధులతో పలుమార్లు మాట్లాడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రూ.57కోట్లు కేటాయించారు. వెంటనే రైతులకు పరిహారం అందింది. బైపాస్ పనులు మొదలయ్యాయి. – విడదల రజిని, ఎమ్మెల్యే పిల్లర్ల పనులు చేస్తున్నాం బీఎస్ఈపీఎల్ కంపెనీ బైపాస్ నిర్మాణ పనులు చేపట్టింది. సర్వే పనులు పూర్తయ్యాయి. హద్దురాళ్ల ఏర్పాటు, జంగిల్ క్లియరెన్సు పనులూ గతంలోనే ముగిశాయి. ప్రస్తుతం రామచంద్రాపురం వద్ద ఫ్లైఓవర్, బొప్పూడి వద్ద అండర్‌పాస్, ఓగేరు, కుప్పగంజి వాగుల వద్ద వంతెనల నిర్మాణానికి పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. వరుస వర్షాల వల్ల కొంత ఆటంకం కలుగుతోంది. అయినా గడువులోపు పనులు పూర్తిచేస్తాం. – అబ్దుల్ ఖాదర్, పీడీ బైపాస్ నిర్మాణ సంస్థ -
Anantapur: ఇదేం పని మేడం..!
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం మన్నీల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషియల్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివమ్మపై విమర్శలు వినిపిస్తున్నాయి. అనంతపురంలోని ఆదర్శనగర్‌లో నిర్మిస్తున్న టీచర్ ఇంటి వద్ద ఆదివారం పలువురు విద్యార్థులు ఇటుకలు, సిమెంట్, ఇసుక మోస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో తన ఇంటి వద్ద పని చేసేందుకు పిల్లల్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఉన్నత పాఠశాల హెచ్ఎం సాయి ప్రసాద్‌ను వివరణ కోరగా ఘటనపై విచారణ చేయిస్తున్నామన్నారు. ఆదివారం ఓ శుభకార్యం జరిగితే విద్యార్థులు వచ్చి భోజనం చేసి వెళ్లారని.. పనులు చేయించుకోలేదని టీచర్ చెప్పారన్నారు. -
దీనస్థితిలో క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్... రోజుకూలీగా పనులకు
గుజరాత్: దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మూమూలుది కాదు. అందులోనూ పాకిస్తాన్‌పై విజయం అంటే మరింత మోజు. కానీ బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన ఓ క్రికెటర్ మాత్రం తాజాగా కడు దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. టీమిండియా బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు గుజరాత్‌కు చెందిన నరేష్ తుమ్డా. కట్ చేస్తే.. ఇపుడు జీవనోపాధి కోసం నానా పాట్లు పడుతున్నాడు. రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు. అంతేకాదు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా ఉద్యోగమివ్వాలని వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే 2018లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ను సాధించిన విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు నరేష్ తుమ్డా. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించింది. అయితే అంధుడైన నరేష్ ఇపుడు నవ్సారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం రాలేదని నరేష్ వాపోయాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.(షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్) కాగా వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ 1996 నుండి బ్లైండ్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికి అయిదుసార్లు ఈ పోటీలు జరగ్గా 2018, జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ని ఓడించింది. 308 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరీ ఈ విజయాన్ని దక్కించుకుంది. అలాగే 2012లో తొలిసారిగా బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 బెంగళూరులో జరిగింది. (Tokyo Olympics: టోక్యోలో కత్తిపోట్ల కలకలం.. మహిళలపై అగంతకుడి దాడి) -
పులిచింతల: శరవేగంగా స్టాప్ లాక్ గేటు పనులు
సాక్షి, గుంటూరు: పులిచింతల స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. సాయంత్రానికి స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. స్టాప్ లాక్ గేటు పూర్తికాగానే రిజర్వాయర్ నింపుతామన్నారు. పులిచింతల ఘటనపై అధ్యయనానికి నిపుణుల కమిటీ నియమించామని, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ పేర్కొన్నారు. -
ప్రయాణికులకు అలర్ట్: నేటి నుంచి పలు రైళ్ల రద్దు
గుడివాడ టౌన్: ఉప్పులూరు–విజయవాడ రైల్వే డబ్లింగ్ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్‌ఐ, మెయిన్ ఎన్ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్ మే నేజర్ పొట్లూరి మోహన్‌గాంధీ శుక్రవారం తెలిపారు. ఈనెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, నర్సాపూర్–ధర్మవరం, ధర్మవరం–నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి. అదే తేదీల్లో సర్కార్ ఎక్స్‌ప్రెస్ తెనాలి వర కు, నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం–విజయవాడ, నర్సాపూర్–గుంటూరు పాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు. -
ప్రసవం ముందు వరకు డ్యూటీ.. మేయర్‌పై ప్రశంసలు
జైపూర్ నగర్ నిగమ్ (గ్రేటర్) మేయర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్య గుర్జర్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ మహిళా మేయర్‌పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి బిడ్డకు జన్మనిస్తే పొగడ్తలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటటే. తను ప్రసవించే కొన్ని గంటల ముందు వరకు కూడా సౌమ్య మేయర్‌గా తన బాధ్యతలు నిర్వర్తించారు. విధుల్లో పాల్గొని ప్రజా పాలనకు అసలైన అర్థం చెప్పారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ప్రస్తుతం సౌమ్య స్టోరీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిండు గర్భిని అయిన మేయర్ బుధవారం రాత్రి వరకు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరగా గురువారం ఉదయం అయిదు గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ.. పని దేవునితో సమానమని పేర్కొన్నారు. ‘పనే నాకు దైవం. బుధవారం రాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్‌లో పాల్గొన్నాను. ప్రసవ నొప్పులతో 12.30 గంటలకు హాస్పిటల్లో చేరాను. దేవుడి ఆశీస్సులతో గురువారం ఉదయం క్షేమంగా ప్రసవమైంది’ అని ట్వీట్లో వివరించారు.. తొలుత రాజస్తాన్ పదవిలో ఉన్నపపుడు సౌమ్య ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఏకంగా మేయర్ పదవిని దక్కించుకున్నారు. రెండోసారి గర్భం దాల్చారు. అయినా క్రమం తప్పకుండా మేయర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత నెలలోనే మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌ను కూడా సమర్పించారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటనలోనూ ఆమె పాల్గొన్నారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో కూడాపనిచేయడం ఉత్తేజంగా, ఒక సవాలుగా ఉందన్నారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకున్నారు. మహిళా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సౌమ్యకు దేశ ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి' Work is Worship! देर रात तक निगम ऑफिस में मीटिंग ली, प्रसव पीड़ा शुरू होने पर रात्रि 12:30 बजे कुकुन हॉस्पिटल में भर्ती हुई और सुबह 5.14 पर परमपिता परमेश्वर की कृपा से पुत्र को जन्म दिया। मैं और बच्चा दोनों स्वस्थ हैं। pic.twitter.com/nMULHwNGWn — Dr Somya Gurjar (@drsomyagurjar) February 11, 2021 -
రిజిస్ట్రేషన్లకు.. రెడీ!
సాక్షి, హైదరాబాద్: దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్‌లోకి మార్చే ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్లోడ్ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా విజయదశమి నాటికి అందుబాటులోకి వచ్చే ధరణి పోర్టల్ ఆధారంగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కావడానికి బాలారిష్టాలు అధిగమించినా... వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం మరికొన్నాళ్లు వాయిదా పడే చాన్స్ ఉంది. ఈ ఆస్తుల నమోదులో కొంత జాప్యం జరుగుతున్నందున కొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలంటున్నాయి. నమోదు తర్వాత 2 నోటిఫికేషన్లు భూముల విలువల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించేందుకు ఒక నోటిఫికేషన్... సబ్ రిజిస్ట్రార్ల నుంచి వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తప్పించేందుకు మరో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉం టుందని అంటున్నారు. ఈ నోటిఫికేషన్ల తో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానంలో ముందు కు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఆ రెండు ప్రక్రియలు రద్దు? రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో మరో కీలక నిర్ణయం తీసుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) విధానాలను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అక్రమాలకు, దౌర్జన్యాలకు, సెటిల్మెంట్లకు ఊతమిచ్చినట్లు అవుతోందనే ఆలోచనతో ఈ విధానాన్ని సర్దుబాటు చేయాలని... ఇకపై భూములు లేదా ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు యజమాని హాజరును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెవెన్యూ చట్టంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను సేల్‌డీడ్ ద్వారా చేస్తామని పేర్కొన్నారు కానీ, ఏజీపీఏ (అగ్రిమెంట్ ఫర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) ద్వారా చేస్తామని పేర్కొనలేదని రిజిస్ట్రేషన్ల అధికారులు చెబుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం జీపీఏ, ఎస్‌పీఏల రద్దు సాధ్యమవుతుందా లేదా అన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం తీసుకొస్తున్న మెరూన్ పాస్‌పుస్తకాలను కూడా రిజిస్ట్రేషన్ల శాఖే ఇవ్వనుంది. భూమి లేదా ఆస్తిని క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్ చేయడం, ఆన్లైన్లోనే ‘ధరణి’ద్వారా మ్యుటేషన్ చేయడం, తద్వారా వెంటనే సేల్‌డీడ్‌తోపాటు మెరూన్ పాస్‌పుస్తకం ఇవ్వడం ఒక్క రోజులోనే జరుగుతుందంటున్నారు. వెయ్యి కోట్ల ఆదాయానికి గండి... కరోనా లాక్డౌన్ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కోలుకుంటున్న దశలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను అనూహ్యంగా నిలిపేయడంతో గత నెల రోజులుగా రూ. 1,000 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. అంటే ఈ నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 17 వేల కోట్లకుపైగా భూములు, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీలు నిలిచిపోయినట్లేనని రిజిస్ట్రేషన్ల అధికారులు చెబుతున్నారు. త్వరలో తహసీల్దార్లకు శిక్షణ వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ రంగు పాస్‌పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రింటర్లు చేరుకున్నాయి. మరోవైపు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు ఈ నెల మూడో వారం నుంచి శిక్షణ కూడా ప్రారంభించనుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దసరా తర్వాత ఓ కొలిక్కి వచ్చినట్టే. ఇక, భూముల మార్కెట్ విలువల సవరణలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రాష్ట్ర, జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల స్థాయిలో మార్కెట్ సవరణ విలువలను ప్రతిపాదించనున్నాయి. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలనే ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తున్న నేపథ్యంలో దసరా నాటికే మార్కెట్ విలువల సవరణ జరుగుతుందా? దసరా నుంచి కొత్త మార్కెట్ విలువల ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయా? లేదా ముందుగా రిజిస్ట్రేషన్లను ప్రారంభించి ఆ తర్వాత ధరలు సవరిస్తారా అన్నది ఇంకా తెలియరాలేదు. -
కేఆర్ స్టేడియం పనులపై ఆరా
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకే తలమానికమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టర్ జె.నివాస్‌తో కలిసి మంగళవారం ఆయన స్టేడియం పనుల ను స్వయంగా పరిశీలించారు. పనుల తీరు తెన్నులను చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్‌కుమార్, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మైదానం బ్లూప్రింట్, స్టేడియం డిజైన్‌ను పరిశీలించారు. స్టేడియంలో నిర్మితమవుతున్న రెండు ఫోర్లలో పలు ఇండోర్ క్రీడాంశాల్లో ఆటలు ఆడేందుకు వీలుగా డిజైన్ చేసినట్టు చీఫ్ కోచ్ వివరించారు. ఈ స్థలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణానికి ఎంతో ప్రత్యేకత ఉందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ఇక్కడే ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అద్భుతమై న ఫలితాలు సాధించారని గుర్తుచేశారు. తాను కూడా ఓ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడిని కావడంతో క్రీడల లోటుపాట్లు, క్రీడాకారుల సమస్యలు, క్రీడాసంఘాల ఇబ్బందులు తనకు తెలుసునని పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అ సోసియేషన్ అధ్యక్షుని హోదాలో ఎప్పటికప్పుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నానని అన్నారు. నిధుల రాకలో జాప్యం.. కోడి రామ్మూర్తి స్టేడియం పనుల జాప్యంపై కృష్ణదాస్ ప్రతిస్పందించారు. రూ.15 కోట్ల నిధులతో స్టేడియం పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే స్టేడియం రీ డిజైనింగ్, ఉడా నుంచి రావాల్సిన నిధుల జాప్యం వల్ల ప నులు ఆలస్యంగా జరుగుతున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఉడా కాస్త సుడాగా మారడంతో నిధులు జాప్యానికి కారణం అయిందన్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. త్వరలో అన్ని సమస్యలను అధిగమించి, అంతర్జాతీయ హంగులతో పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా కేఆర్ స్టేడియాన్ని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు కృష్ణదాస్ చెప్పారు. త్వరలో క్రీడా సంఘాలతో చర్చించేందుకు భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తద్వారా క్రీడల అభివృద్ధికి అన్ని క్రీడా సంఘాలను కలుపుకునిపోయేందుకు సరికొత్త కార్యాచరణకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒలింపిక్ భవన్ కోసం రూ.లక్ష అందజేత ఒలింపిక్ భవన్ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు వ్యక్తిగతంగా అందజేస్తానని గతంలో కృష్ణదాస్ హామీ ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఒలింపిక్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు మాస్టారుకి లక్ష రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో సెట్‌శ్రీ సీఈఓ జి.శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ శ్రీనివాస్‌కుమార్, పీఈ టీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, హ్యాండ్‌బాల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, జూడో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్, వైఎస్సార్ సీపీ నా యకులు ఎన్ని ధనుంజయరావు, క్రీడాసంఘాల ప్రతినిధు లు, శాప్ డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా వారి న్యాయపరమైన డిమాండ్లను వివరిస్తూ కోచ్‌లు డిప్యూటీ సీఎంకు కృష్ణదాస్‌కు వినతిపత్రాలు అందజేశారు. -
కువైట్‌లో విలవిల.. మూడు నెలలుగా పనుల్లేక
సంతబొమ్మాళి: బతుకు తెరువు కోసం విదేశాల కు వెళ్లిన వారు కరోనా ప్రభావంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతున్నారు. తమ సమస్యలు ఎవరికి ఎప్పుకోవాలో తెలీక, బాధలు వినేవారు లేక ఆందోళన చెందుతున్నారు. సంతబొమ్మాళి మండలంలోని గెద్దలపాడు, పిట్టవానిపేట, గొలుగువానిపేట, ఎం.సున్నాపల్లి, వజ్రపుకొత్తురు మండలం దేవునల్తాడ, పోలా కి మండలం గప్పెడుపేటకు చెందిన సుమారు 200 మంది యువకులు 2018లో కువైట్ వెళ్లారు. వెల్డింగ్, రిగ్గర్ పనులు చేసుకుంటూ నాలుగు రా ళ్లు వెనకేసుకుంటున్న సమయంలో కరోనా వీరి ఉపాధిని ధ్వంసం చేసింది. కోవిడ్ ప్రభావంతో కువైట్‌లో ప్రైవేటు కంపెనీలు పనులు ఆపేశాయి. దీంతో మూడు నెలలుగా పనుల్లేక, జీతాలు రాక వీరు అల్లాడిపోతున్నారు. పనులు నిలుపుదల చేసిన మొదటిలో కంపెనీ భోజనాలు పెట్టి నా ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో దాచుకున్న డబ్బులను వీరంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. కుటుంబాలను పోషించడానికి ఇంత దూరం వస్తే.. మళ్లీ ఆ కుటుంబాలపైనే ఆధార పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వదేశానికి పంపేయండి అని కంపెనీ యాజమాన్యానికి చెప్పినా వారు తమ వల్ల కాదంటూ తెగే సి చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు ఏజెంట్లను సంప్రదించారు. వారిది కూడా అదే మాట. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమను స్వదేశానికి రప్పించాలని బాధితులు ఎరుపల్లి లక్షుమయ్య, చింతలబాలకృష్ణ, చెక్క వేణునాథం, రట్టి చిన్నారావు, చెక్క రాజయ్య తదితరులు కోరుతున్నారు. కరోనా భయం ఓ వైపు తీవ్రంగా ఉందని, అదే సమయంలో ఉపాధి లేక మరోవైపు నలిగిపోతున్నామని, అధికారులు, ప్రభుత్వమే తమపై దయ చూపాలని కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం బతుకు తెరువు కోసం కువైట్ వచ్చాను. కరోనా ప్రభావంతో కంపెనీ పనులను ఆపేసింది. దీంతో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం కూడా ఏమీ చేయలేక చేతులెత్తే సింది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఎరుపల్లి అప్పయ్య, గెద్దలపాడు, సంతబొమ్మాళి మండలం స్వదేశానికి రప్పించండి నాలుగు డబ్బులు సంపాదించడానికి దేశం కాని దేశం వచ్చాను. డ్యూటీ బాగానే ఉన్నా కరోనా ప్రభావంతో అతలాకుతలం అయ్యాము. పనులు సాగక షెడ్డులోనే ఉన్నాము. మూడు నెలలుగా జీతాలు లేవు. స్వదేశానికి పంపించాలని బతిమలాడినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడు కుంటున్నాను. – రట్టి చిన్నారావు, పిట్టవానిపేట, సంతబొమ్మాళి మండలం ఇంటి నుంచి డబ్బులు పంపుతున్నాం కువైట్‌లో పనిచేయడానికి మా అబ్బాయి లక్ష్మయ్య వెళ్లాడు. మూడు నెలలుగా అక్కడ పనులు లేకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదని, ఇ బ్బంది పడతున్నామని ఫోన్లో చెప్పాడు. దీంతో ఇంటి నుంచి డబ్బులు పంపాను, ఫ్లయిట్ టిక్కెట్ కోసం ఏజెంట్‌కు డబ్బులు ఇస్తే, రెండు వారాల తర్వాత మావల్ల కాదని డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ప్రభుత్వమే అదుకోవాలి. – వై.కుంతెమ్మ, బాదితుడు తల్లి, గెద్దలపాడు -
కష్టాలు తొల‘గంగ’
తెలుగుగంగ..గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వర్షాలు సమృద్ధిగా కురిసి..సాగునీరు పుష్కలంగా ఉన్నా రైతులు రెండు పంటలు వేసుకోలేని దుస్థితి. ఎన్నో ఏళ్లుగా కాల్వ లైనింగ్ చేయకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఏర్పడేవి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి..పనులు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. కర్నూలు సిటీ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నీరు పారకుండానే నిధులు పారించింది. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచి.. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు లబ్ధి చేకూర్చింది. అయితే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం..సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజా ధనాన్ని దురి్వనియోగపర్చకుండా రివర్స్ టెండర్ల ద్వారా పనులు చేయిస్తోంది. తెలుగుగంగ కాలువకు లైనింగ్ పనులు ఈ కోవకు చెందినవే. సుమారు రూ.320 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా పిలిచి.. జ్యూడీíÙయల్ కమిటీ నిర్ధారించిన తరువాత పనులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవలే పనులు మొదలు పెట్టారు. లైనింగ్‌తో ఆయకట్టుకు సమృద్ధిగా నీరు.. తెలుగుగంగ ప్రాజెక్టు కింద జిల్లాలో 1.14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు 18.20 కి.మీ వరకు లైనింగ్ లేదు. దీంతో సాగు నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కాల్వ సామర్థ్యం 5 వేల క్యూసెక్కులు ఉండగా.. లైనింగ్ లేకపోవడంతో నీరు దిగువకు వెళ్లని పరిస్థితులు నెలకొన్నాయి. దీని వల్ల చివరి ఆయకట్టుతో పాటు వైఎస్సార్ జిల్లాకు సాగు నీరు అందేది కాదు. ప్రతి ఏటా సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చేది. ఈ పనులను టీడీపీ ప్రభుత్వం 3.5 ఎక్సెస్ రేటుకు టెండర్లను టీడీపీకి చెందిన నేతకు కట్టబెట్టింది. అయితే పనులు మొదలు పెట్టకపోవడంతో రద్దు చేసి.. రివర్స్ టెండర్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో గతంలో ఎక్సెస్ కంటే తక్కువకు టెండర్లు వేసి పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. ఈ రివర్స్ టెండర్లతో ప్రభుత్వానికి రూ.12 కోట్లకుపైగా ఆదా అయినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. కాల్వ లైనింగ్‌తో పాటు పూడిక తీత పనులు రూ.320 కోట్లతో చేపట్టనున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌కు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులకు ఇసుక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన జల వనరుల శాఖ సమీక్షలో ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయితే రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలయ్యాయి.. తెలుగుగంగ లైనింగ్ పనులు ఇటీవలే మొదలు అయ్యాయి. అటవీ ప్రాంతంలో ఇబ్బందులు ఉండేవి. ఆ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాం. రివర్స్ టెండర్ల ద్వారా 4 శాతం నిధులు ఆదా అయ్యాయి. – ఆర్.మురళీనాథ్‌రెడ్డి, జల వనరుల శాఖ సీఈ -
ఒకే కాంట్రాక్టర్‌కు 4,769 పనులు!
►మెదక్ జిల్లా తూప్రాన్‌లోని 2 ట్రాన్స్ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ►మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 71,750 చెల్లించారు. ►సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్‌లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్‌కు రూ. 82,360 చెల్లించారు. ►పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 84,840 చెల్లించారు. ►నామినేషన్ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్బుక్ లైవ్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏడీఈ) కోటేశ్వర్రావు బహిర్గతం చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ ఏడీఈగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్ నిర్వహించి టీఎస్ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్ చేయడంతో ఇది ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. యాజమాన్యం అండదండలతోనే... వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్ ఎలక్ట్రికల్స్ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్రావు బయటపెట్టారు. ఎస్ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు. రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్ ఒకే డివిజన్ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రబ్యూషన్ బడ్జెట్ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 700 శాతం వరకు రేట్ల పెంపు... కోటేశ్వర్రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో కేసు... టీఎస్ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
అక్టోబర్ నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి
సాక్షి, నెల్లూరు: అక్టోబర్ నాటికి సంగం బ్యారేజీ పనులను పూర్తి చేసి..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం బ్యారేజీ పనులను మంత్రులను పరిశీలించారు. మంత్రులతో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘ఉపాధి’ జాతర..!
జిల్లాలో ఖరీఫ్ వరి పనులు పూర్తికావస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఉపాధి హామీ పనుల జాతర ఆరంభం కానుంది. వేతనదారులకు చేతినిండా పనిదొరకనుంది. ఈ మేరకు పనుల గుర్తింపు ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. వాటి ఆమోదానికి గ్రామ సభలు చురుగ్గా నిర్వహిస్తోంది. ఆమోదం తెలిపిన పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తోంది. విజయనగరం: ఉన్న ఊరిలో ఉపాధి కల్పించి వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగాస్వామ్యంతో అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. ఏడాదికి ఏడాదికి పెరుగుతోన్న లక్ష్యాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ‘ఉపాధి’ జాతర ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతనదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. లక్షలాది మంది వేతనజీవులకు అధిక పనిదినాలు దొరకనున్నాయి. దీనికోసం ఇప్పటికే పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఇక పనుల ఆమోదానికి గ్రామసభలు కొనసాగుతున్నాయి. అవి ఆమోదం పొందడమే తరువాయి. పనుల కల్పన ఇలా... 2020–21 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధిహామీ పనులు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా రూ.1800 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. సుమారు 3.50 లక్షల మంది వేతనదారులకు 3 కోట్ల పనిదినాలు కలి్పంచేందుకు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవసరమైన పనులను జియోట్యాగింగ్ సాయంతో గుర్తించారు. ఇలా గుర్తించిన పనుల ప్రజామోదానికి మరోసారి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల్లో గ్రామసభలు ముగియనున్నాయి. పనుల నిర్ణయం ఇలా... గతంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులు గుర్తించి అవసరమైన మేరకు పనులు చేసేవా రు. ఈ సారి మాత్రం గ్రామసభల్లో గుర్తించిన పనులకు గ్రామసభ ఆమోదం పొందుతారు. దీనికి సంబంధించి గ్రామసభ తీర్మానం అవసరం. గతంలో పంచాయతీ సర్పంచి తీర్మానించేవారు. కొత్త విధానం ప్రకారం ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అన్ని పనులు కంప్యూటర్లో క్రోడీకరించాలి. అలా క్రోడీకరించిన అనంతరం తీర్మానాన్ని ఉపాధిహామీ పథకం వెబ్సైట్ నుంచి డౌన్Œలోడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తీర్మానాలను మండల పరిషత్ కార్యాలయానికి పంపించాలి. మండల పరిషత్ అధికారులు ఒక తీర్మానం చేసి జిల్లా నీటి యాజమాన్య సంస్థకు పంపాలి. అక్కడ పనులను పరిశీలించి జిల్లాస్థాయిలో తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ పరిపాలన ఆమోదం లభించిన అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతారు. 30 కేటగిరీల్లో 196 రకాల పనులు గుర్తింపు.. ఉపాధిహామీ పథకంలో 30 కేటగిరీల్లో 196 రకాల పనులను రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ పనుల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన 1.17 లక్షల పనులు గుర్తించారు. ఈ ఏడాది కొత్తగా గ్రామీణ పార్కులు, నర్సరీలు పెంచడం తదితర పనులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వ సంస్థల అభివృద్ధి, పిల్లకాలువలను మెరుగుపరచడం, భూ అభివృద్ధి పనులు, రహదారుల అభివృద్ధి తదితర పనుల గుర్తింపు ప్రక్రియ ముగిసింది. పనులను గ్రామ సభల్లో తీర్మానించే ప్రక్రియ చేపడుతున్నారు. అధిక పనుల గుర్తింపు 2020–21 ఆర్థిక సంత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో రూ.1800 కోట్ల విలువ చేసే పనులను గుర్తించాం. ఆయా గ్రామ సభ ల్లో చర్చించి ఆమోదం పొందిన తరువాత పనుల మంజూరు ఆదేశాలు జారీ చేస్తాం. మొత్తం 1.17 లక్షల పనులు గుర్తించగా... 3 కోట్ల పనిదినాలు వేతనదారులకు కలి్పంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రస్తుత ఏడాది 2.65 కోట్ల పని దినాలు లక్ష్యం చేసుకోగా.. ఇప్పటి వరకు 1.86 కోట్ల పని దినాలు కలి్పంచాం. – ఎ.నాగేశ్వరరావు, పీడీ, డ్వామా, విజయనగరం -
త్వరలోనే బందరు పోర్టు పనులు ప్రారంభం
సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం): బందరు పోర్టు పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని, నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోర్టు నిర్మాణం నిలిచిపోతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. నాలుగైదు బెర్త్‌లు నిర్మించేందుకు ఎక్కువ నిధులు కూడా అవసరం లేదని ఆయన తెలిపారు. కంటైనర్ కార్పొరేషన్ సంస్థ పోర్టు నిర్మాణంలో కలిపి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన వివరించారు. త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించి ఆర్థిక అభ్యంతరాలను తొలగించనున్నామని తెలిపారు. అలాగే స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. డ్యామ్‌లు నిండుతున్నాయి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే దేవుని చలువతో డ్యామ్‌లు అన్ని నీటితో కళకళలాడుతున్నాయని ఎంపీ బాలశౌరి అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిని తర్వాత పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రెండో పంటకు కూడా నీటి సమస్య రాకుండా రైతులు సంతోషంగా ఉండేలా చేస్తామని చెప్పారు. పంటలకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఆరు లైన్ల రహదారులకు నూతన ప్రతిపాదనలు.. కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం ఆరు లైన్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ప్రతిపాదనలు అందించినట్లు ఎంపీ తెలిపారు. గుండుగొలను నుంచి కలపర్రు వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 505.40 కోట్లు, కలపర్రు నుంచి చినఅవుటుపల్లి వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 512.43 కోట్లు, చినఅవుటుపల్లి – గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లకు రూ. 752.15 కోట్లు, గొల్లపూడి నుంచి చినకాకాని వరకు మధ్యలో కృష్ణా నది ఐకానిక్ బ్రిడ్జితో సహా 17.8 కిలోమీటర్లకు రూ. 1,215.19 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు బూరగడ్డ రమేష్‌నాయుడు, ఉప్పాల రాంప్రసాద్, రాజులపాటి అచ్యుతరావు, తిరుమాని శ్రీనివాసరావు, బండారు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
హెచ్‌ఎల్‌ఛీ పనులు
హెచ్చెల్సీ కాలువ ఆధునికీకరణ పనులు ప్రహాసనంగా మారాయి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఈ పనులను ప్రారంభించినా నేటికీ పనులు కొనసా....గుతున్నాయి. సంవత్సరాలు గడచిపోతున్నా నేటికీ 43వ ప్యాకేజీలో 45 శాతం పనులు, 44వ ప్యాకేజీలో 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పనుల వల్ల నీళ్లు సరిగా పారక ఆయకట్టు రైతులు ప్రతి యేడూ నష్టపోతున్నారు. సెప్టెంబర్ నెలలోపే పనులు చేసేస్తామని అధికారులు చెబుతున్నా గడువు ముంచుకొస్తుండటంతో అది సాధ్యంకాదనే వాదనలు బలంగా ఉన్నాయి. – గార్లదిన్నె 45 వేల ఎకరాల ఆయకట్టు గార్లదిన్నె మండల పరిధిలో మిడ్‌పెన్నార్ డ్యాంలోని దక్షిణ, ఉత్తర కాలువలు ఉన్నాయి. ఇందులో దక్షిణ కాలువ ద్వారా గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లో ,తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. అలాగే ఉత్తర కాలువ ద్వారా గుత్తి, పెద్దడుగూరు మండలాల్లో 12,225 ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. హెచ్చెల్సీ కాలువ ఆధునీకరణ పనులు ... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 సంవత్సరంలోనే దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 84 కిలో మీటర్ల కాలువ పనులు ఆధునీకరణ చేయడానికి 43వ ప్యాకేజీకి రూ.236.65 కోట్లు, 44వ ప్యాకేజీ కి రూ.184.2 కోట్లకు టెండర్లు వేయడంతో నాగార్జున కన్‌స్ట్రక్సన్స్ కంపెనీ (ఎన్సీసీ) పనులు దక్కించుకుంది. ఎన్సీసీ అంచనా మొత్తం కంటే 4.95 శాతం అధిక మొత్తానికి ఈ టెండర్ చేజిక్కించుకుంది. ప్రధాన ఆటంకాలు ఇవే... 43వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయడానికి పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టారు. అలాగే బెడ్ పనులు చేయకూడదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు ఆలస్యంగా చేయడం, పనులు జరుగున్న ప్రదేశంలో నత్తనడక పనులు జరుగుతున్నాయి. 44వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయాలంటే మొదట కాలువ వెడల్పు పనులు చేయాలి. కానీ అనంతపురం నగరంలో కాలువకు దగ్గరలోనే కొంత మంది ఇళ్లు నిర్మించుకొని ఉండటం, మరికొందరు కాలువ స్థలాన్ని ఆక్రమించారు. ప్యాకేజీ వివరాలు... మిడ్ పెన్నార్ డ్యాంలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు 84 కిలోమీటర్లు జరగాలి. అందులో 0–40 కిలో మీటర్లు 43వ ప్యాకేజీ, 40–84 కిలో మీటర్లు 44 ప్యాకేజీగా విభజించారు. 43వ ప్యాకేజీ పనులు మిడ్‌పెన్నార్ డ్యాం నుంచి అనంతపురములో హెచ్చెల్సీ కాలనీ రైల్వే గేట్ వరకు వర్తిస్తుంది. అలాగే రైల్వే గేట్ నుంచి నార్పల వరకు 44వ ప్యాకేజీలోకి వస్తాయి. 43 ప్యాకేజీలో .. 0 – 40 కిలో మీటర్ల వరకు ఇద్దరు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. కాలువ వెడల్పు పనులు, ఎర్త్ పనులు, కాలువ ఇరువైపులా లైనింగ్ పనుల్లో ఇప్పటి వరకు 45 శాతం పనులు మాత్రమే చేశారు. ఇంకా 5 కిలో మీటర్లు ఇరువైపులా లైనింగ్ పనులు చేయలేదు.అలాగే బ్రిడ్జిలు, పనులు చేయాల్సి ఉంది. గతవారం రోజుల నుంచి 5 బ్రిడ్జీలు పగలగొట్టి , కొత్త బ్రిడ్జీల పనులు చేస్తున్నారు. 44వ ప్యాకేజీలో.. 40 – 84 కిలోమీటర్లు వరకు ఒక కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీలో 44 కిలో మీటర్లు పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం బుక్కరాయసము ద్రం మండలం దయ్యాలకుంటపల్లి దగ్గర కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే కాలువకు ఇరువైపులా కాలువ లైనింగ్ పనులు చేశారు. అయితే గత రెండురోజుల నుంచి నార్పల మండలంలో లైనింగ్ పనులు మొదలయ్యాయి. 6 నెలలుగా నో వర్క్.. హెచ్చెల్సీ కాలువకు నీరు విడుదల చేయడానికి సమయం ముంచుకొస్తోంది. కొత్త ప్రభుత్వం ఈ ఏడాది ఆయకట్టుకు సకాలంలో ఆయకట్టుకు నీరు అందించాలని చర్యలు చేపట్టింది. సాధారణంగా జూలై చివరి, ఆగస్టులో తుంగభద్ర డ్యాం జలాలు మిడ్ పెన్నార్ డ్యాంకు చేరతాయి. కాలువకు నీరు బంద్ చేసి 6 నెలలు అవుతున్నా కాంట్రాక్టర్లు పనులు చేయలేదు. తీరిగ్గా ఇప్పుడు పనులు మొదలు పెట్టడంతో రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఆధునికీకరణ పనులు చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు రెండు ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగినట్లు తెలుస్తోంది. లైనింగ్ పనులు పూర్తయితే... హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరం. గతంలో ఆయకట్టు కాలువ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు శిథిలావస్థలో ఉండేవి. దీంతో చివరి ఆయకట్టు భూములకు నీరు అందేది కాదు. ఈ తరుణంలో కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు నీళ్లంది పంటలు బాగా పండుతాయి. బెడ్ లైనింగ్ పనులు జరిగేనా? హెచ్చెల్సీ ఆధునీకరణ పనుల్లో కాలువ వెడల్పు చేయడం, ఇరువైపులా, కింద లైనింగ్ వేయడం, పాత బ్రిడ్జిలు తొలగించి కొత్త బ్రిడ్జిలు నిర్మించడం వంటి పనులు చేయాలి. కానీ లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. దీనిపై అప్పట్లోనే కాలువ ఇరువైపులా లైనింగ్ మాత్రమే వేసి కింద బెడ్ లైనింగ్ పనులు ఆపేశారు. నిజానికి ఎన్సీసీ ఒప్పందంలో మాత్రం బెడ్ లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇప్పుడు మళ్లీ పనులు మొదలు కావడంతో కింద బెడ్ పనులు చేస్తారా? చేయరా? అనేది తేలడం లేదు. బ్రిడ్జిలు పూర్తి చేసేదేన్నడో? నీళ్లొదిలే సమయం దగ్గర పడుతున్నా కాలువ పనులు ఇంకా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టి నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ నత్తనడక సాగుతున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలి. – గోవర్ధన్, తిమ్మంపేట, రైతు రైతులకు ఇబ్బంది కలిగించం హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను భాగంగా 43, 44 ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగాయి. 43వ ప్యాకేజీలో కేవలం 4 కి.మీ మాత్రమే లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాత బ్రిడ్జీలన్నీ పగలగొట్టి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.అయితే బెడ్ లైనింగ్ పనులకు సంబంధించి పనులు చేయాలా? వద్ద అనే విషయం ఉన్నతాధికారుల పరిధిలో ఉంది. – ప్రసాద్, హెచ్చెల్సీ డీఈఈ పనులు సకాలంలో పూర్తి చేయాలి హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయాలి. పనులు పూర్తికాకపోవడంతో ఈ యేడాది కూడా ఆయకట్టుకు నీరు అందించడానికి ఇబ్బందిగా మారింది. మూడేళ్లుగా ఆయకట్టు నీటి కోసం ఇబ్బంది పడ్డాం. ఇప్పటికైనా పనులు పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి. – నాగలింగారెడ్డి, పెనకచెర్ల, రైతు -
డబుల్ వేగం పెంచాలి
పాపన్నపేట(మెదక్): మండలంలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం, రాంతీర్థం, బాచారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్బెడ్రూం నిర్మాణం ప్రారంభించి నెలలు కావస్తున్న ఇంకా బేస్మెంట్ స్థాయికి కూడా చేరుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాచారంలో నిర్మాణం ఆలస్యం కావడానికి కారణాలను అడుగగా అక్కడ నీటి సమస్య ఉండటం వల్ల నిర్మాణ పనులు కొనసాగడం లేదని ఎంపీపీ పవిత్రదుర్గయ్య తెలిపారు. పండగలను దృష్టిలో ఉంచుకొని భవన నిర్మాణ కార్మికులు పనిలోకి రాకుండా, నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమస్యలను అధిగమించి పట్టుదలతో డబుల్బెడ్రూంల నిర్మాణం పూర్తి చేయాలని అదేశించారు. అధికారులు నిరంతరం పనులు పర్యవేక్షిస్తూ.. వెంట వెంటనే తనకు రిపోర్ట్ పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గాజులగూడెంలో గొల్లకుర్మలు కలెక్టర్‌ను గొంగడితో సన్మానించి, గొర్రెపిల్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో బాలాగౌడ్, శ్రీనివాస్, దుర్గయ్య, బాబాగౌడ్, ఆంటోని, సాయిరెడ్డి, పీఆర్‌ఈఈ వెరాంతీర్థంలో నిర్మాణ పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ ధర్మారెడ్డి -
‘కాళేశ్వరం’ రికార్డు: 24 గంటల్లో ఏకంగా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీడు భూములను తడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంలా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు (ర్యాఫ్ట్, పియర్స్) జరిగాయి. 400 మంది ఇంజనీర్లు సహా 4,824 మంది కార్మికులు శని వారం ఉదయం 8 గం. నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు శ్రమించి ఈ రికార్డు సృష్టించారు. దీనికోసం ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణరాజు పర్యవేక్షణలో 4,824 మంది కార్మికులు, ఇంజనీర్లు 24 గంటలపాటు 3 షిఫ్టుల్లో పనిచేశారు. ఈ పనులు చేసేందుకు 120 ట్రాన్సిక్ మిల్లర్లు, 21 బ్లూమ్ ప్లేసర్స్తోపాటు గంటకు 870 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంగల 8 బ్యాచింగ్ ప్లాంట్లను వినియోగించారు. 6,238 మెట్రిక్ టన్నుల సిమెంట్ (1,24,751 లక్షల సిమెంట్ బస్తాలు), 1,070 మెట్రిక్ టన్నుల స్టీలు, 15,384 క్యూబిక్ మీటర్ల మెటల్ వినియోగించారు. ఇక ముందూ పరుగులే.. మేడిగడ్డ బ్యారేజీ పనులు తొలి నుంచీ నెమ్మదిగానే సాగుతున్నాయి. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి సహకారం అవసరమవడం, గోదావరికి ఏటా జూన్ నుంచి జనవరి వరకు నీటి ప్రవాహాలు కొనసాగుతుండటం, చిన్నపాటి వర్షాలకు నేల చిత్తడి కావడంతో రవాణా వాహనాలకు ఇబ్బందులు తలెత్తడంతో ఈ పనులు అనుకున్న స్థాయిలో జరగట్లేదు. గతేడాది డిసెంబర్లోనే మేడిగడ్డ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కాంక్రీట్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దీంతో అప్పటి వరకు బ్యారేజీ పరిధిలో 1,500 క్యూబిక్ మీటర్ల నుంచి 2 వేల క్యూబిక్ మీటర్ల వరకు పనులు జరగ్గా ఆ తర్వాత పకడ్బందీ ప్రణాళిక, అధికారుల మధ్య సమన్వయం, కార్మికులు, ఇంజనీర్లు, యంత్ర పరికరాల సంఖ్య పెంచడంతో పనుల్లో వేగం పెరుగుతూ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 15న మేడిగడ్డలో ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. అనంతరం మళ్లీ జూన్ నుంచి గోదావరి వరద కారణంగా పనులు నమ్మెదించాయి. గరిష్టంగా ప్రతిరోజూ 3 వేల నుంచి 4 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులను అధికారులు చేస్తూ వచ్చారు. సీఎం ఆదేశాలతో పనుల పరుగులు... కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను సత్వరమే చేయాలని ఆదేశించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అక్కడ యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచి 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేశారు. ఇకపై ప్రతిరోజూ కనిష్టంగా 8 వేల క్యూబిక్ మీటర్లు, గరిష్టంగా 10 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరిగేలా అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. మొత్తంగా మేడిగడ్డ పరిధిలో 17,89,382 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 12,58,032 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ పనులతోపాటే మేడిగడ్డ పంప్‌హౌస్, అన్నారం, సుందిళ్ల పరిధిలోని పనుల్లో వేగం పెంచారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకు ఇప్పటివరకు 4 మోటార్లు అమర్చారు. అన్నారం బ్యారేజీలో 66 గేట్లు, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తవగా అన్నారం పంప్‌హౌస్‌లో 8 మోటార్లకుగాను 2, సుందిళ్ల పంప్‌హౌస్‌లో 9 మోటార్లకుగాను 2 మోటార్లు అమర్చారు. ఈ పనులన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి జూన్¯Œలో ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీటిని తరలించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం అందుకు తగ్గట్లే పనులు జరుగనున్నాయి. 22వ తేదీ ఉదయం 8 నుంచి 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు జరిగిన రికార్డు కాంక్రీట్ పని ఇలా..(క్యూబిక్ మీటర్లలో) సమయం(గంటల్లో) చేసిన పని ఇలా.. 8–11 2,132 11–2 2,097 2–5 2,085 5–8 2,041 8–11 2,046 11–2 2,107 2–5 2,074 5–8 2,140 మొత్తం 16,722 కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో జరిగిన పని ఇలా.. (క్యూబిక్ మీటర్లలో) మేడిగడ్డ బ్యారేజీ పని మొత్తం క్వాంటిటీ చేసిన పని మట్టి పని 54,43,515 52,48,354 కాంక్రీటు పని 17,89,382 12,58,032 అన్నారం బ్యారేజీ మట్టి పని 29,08,296 29,08,296 కాంక్రీటు పని 11,95,000 11,83,642 సుందిళ్ల బ్యారేజీ మట్టి పని 8,65,320 8,52,174 కాంక్రీటు పని 10,54,799 10,39,678 -
అభివృద్ధి పనులకు శ్రీకారం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రూ.6,688 కోట్ల విలువైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6400 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయని, వీటిని 8 వేలకు పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని, దీనికి కేంద్రం సహకారం అందించాలన్నారు. ఎంపీలు కె.హరిబాబు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం, రైల్వే జోన్ తదితర అంశాలను ప్రస్తావించారు. విశాఖ నగర ప్రజలకు కాలుష్యరహితమైన గాలిని అందించడానికి ఖర్చుకు వెనకడుగు వెయ్యవద్దని కేంద్ర మంత్రి తమకు స్వేచ్ఛ ఇచ్చారని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. కేంద్ర హైవేల శాఖ సభ్యుడు ఆర్.కె పాండే మాట్లాడారు. వీసీటీఎల్లో నూతన క్రేన్లు ప్రారంభం పాతపోస్టాఫీసు: విశాఖ కంటెయినర్ టెర్నినల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రేన్లను కేంద్ర ఉపరితల, నౌకాయన మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీటీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ రూ.151 కోట్ల వ్యయంతో రెండు పోస్ట్ పనామెక్స్ క్వే క్రేన్లు, రబ్బర్ టైర్స్ గేంట్రీ క్రేన్లు నాలుగు కొనుగోలు చేశామని తెలిపారు. క్వే క్రేన్లు 41 టన్నుల బరువున్న కంటెయినర్లను ఒక గంటలో 27 నుంచి 30 వరకు లోడ్ చేయగలవని తెలిపారు. లోడ్ చేసే సమయంలో కంటెయినర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆధునిక రక్షణ వ్యవస్థ ఉందన్నారు. ఇప్పటికే ఉన్న నాలుగు క్వే క్రేన్లకు మరో రెండు నూతన క్రేన్లు తోడవ్వడంతో లోడింగ్‌ను ఆపకుండా రౌండ్ ది క్లాక్ చేయవచ్చని తెలిపారు. శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు ఇవే.. ఆరు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పూర్తయిన ఒక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి 444.5 కోట్లు నరసన్నపేట నుంచి రణస్థలం వరకు 54.2 కిలోమీటర్ల పరిధిలో, రణస్థలం నుంచి ఆనంద ³#రం వరకు 47 కిలోమీటర్ల రహదారి నిర్మాణం ఆనందపురం నుంచి పెందుర్తి వరకు 50.75 కిలో మీటర్లు, ఎన్‌హెచ్ 16 నుంచి విశాఖ పోర్టుకు కనెక్టివిటీకి 12.7 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి కాన్వెంట్ జంక్షన్ వద్ద బైపాస్ ఏర్పాటు చేస్తూ పోర్ట్ రద్దీని నియంత్రించే రోడ్డుకు 60 కోట్లతో నిర్మాణాలు విశాఖ పోర్ట్ నుంచి ఎన్‌హెచ్ 16కు 4.15 కిలోమీటర్ల పరిధిలో 100 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల రహ దారిని జాతికి అంకితం చేశారు. -
వేల కోట్లతో అభివృద్ధి పనులు
జైనథ్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సహకారంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్‌కు వచ్చిన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని మంత్రి జోగురామన్న కోరగా, స్పందించిన ముఖ్యమంత్రి నిధుల మంజూరుకు జీఓ జారీ చేశారన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులైన సీసీ రోడ్లు, మురికి కాల్వలు, లింక్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, ఇతరత్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి జోగు రామన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో 51వేల ఎకరాలకు సాగునీరు అందించే కోరటా–చనాఖా బ్యారేజీ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నా యని తెలిపారు. ఎన్నికల్లోగా సాగునీరు అందిం చడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా వందల కోట్లతో గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించిన ఘనత మంత్రి జోగు రామన్నకే దక్కుతుందన్నారు. ప్రజలంతా అభివృద్ధికి పట్టం కట్టి రానున్న అన్నిఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, జైనథ్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్టీ భూమారెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల గౌరవ అధ్యక్షుడు మద్దెల ఊశన్న, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, నాయకులు అల్లకొండ అశోక్, తమ్మడి భగవాండ్లు, కోల భోజన్న, భట్టు ఊశన్న, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బోనం.. బొనాంజా
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండగ...కాదు కాదు ‘కార్పొరేటర్ల పండగ’ మళ్లీ వచ్చింది. ఏటా మాదిరిగానే బోనాలకు ముందుగా నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇంకేముంది కార్పొరేటర్లకు పండగే మరి. ఎందుకంటే బోనాల పనులకు సంబంధించి పెత్తనమంతా వారిదే. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ప్రభుత్వం రూ.5 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసింది. బోనాల ఉత్సవాన్ని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా ఉత్సాహంగా నిర్వహించేందుకు ఈ నిధులు ఇచ్చారు. అయితే ఏటా పండుగ పేరిట ఇలా విడుదలవుతున్న నిధుల్లో చాలా వరకు కార్పొరేటర్ల ఖాతాల్లోకే మళ్లుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పండుగ సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆలయాలకు దారితీసే మార్గాలను, రహదారులను తీర్చిదిద్దడం.. ఆలయాలకు సున్నాలు, రంగులు వేయడం, అవసరమైన ప్రాంతాల్లో షాబాద్ ఫ్లోరింగ్‌లు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు చేయాలి. కానీ.. వీటిల్లో చాలా వరకు చేయకుండానే చేసినట్లు చూపుతూ నిధులు దారి మళ్లిస్తుండటం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఆలయాల పరిసరాల్లో మాత్రమే ఈ పండగ పనులు చేయాల్సి ఉండగా, ఎక్కడ పడితే అక్కడ ఈ పనులను చేసినట్లు చూపుతున్నారు. అంతే కాదు.. పండుగలు మొదలయ్యేనాటికే పనులు పూర్తికావాల్సి ఉండగా, పండగలు ముగిశాక సంవత్సరమైనా పనులు పూర్తి కావడం లేదు. మరుసటి సంవత్సరం మళ్లీ పండుగ పేరిట నిధులు మంజూరవుతాయి కాబట్టి..పాత పనుల్ని ఎవరూ పట్టించుకోరు. ఆ బిల్లుల చెల్లింపులు మాత్రం జరిగిపోతాయి. అవి కార్పొరేటర్ల జేబుల్లోకి చేరతాయి. కార్పొరేటర్లు, స్థానిక అధికారులు పరస్పర సహకారంతో ఎవరి శక్తిమేరకు వారు ప్రయోజనం పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. గత సంవత్సరం బోనాల కోసం రూ.10 కోట్లు మంజూరు కాగా, ఆ నిధుల్లో ఇప్పటి వరకు ఇంకా రూ.2 కోట్లు ఖర్చు కాలేదు. అవలా ఉండగానే తాజాగా మళ్లీ రూ.15 కోట్లు మంజూరయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తూతూమంత్రంగా.. పండుగ పేరిట చేసే పనులు తూతూమంత్రంగానే చేస్తారు. మూణ్నాళ్ల ముచ్చట కోసం చేసే పనులే కావడంతో నాణ్యత గురించి పట్టించుకునేవారుండరు. రోడ్ల పేరిట ఖర్చు చూపినప్పటికీ.. ఎప్పటి కప్పుడు రోడ్ల మరమ్మతుల పేరిట నిర్వహణ ఖర్చుల నుంచి వెచ్చిస్తూనే ఉంటారు. బోనాల పేరిట ప్రత్యేకంగా నిధులు చూపడం తప్ప చాలా పనులు సాధారణ నిర్వహణ కిందే జరిగిపోతుంటాయి. వాటిని కూడా వీటిల్లో కలిపేస్తారు. పండుగల ఏర్పాట్ల పనులు జోన్లు, సర్కిళ్ల వారీగా జరుగుతాయి కాబట్టి పూర్తయిన పనుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి చేరవు. ఓవైపు ప్రతిపాదనలు.. మరోవైపు పనులు వచ్చే ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని డివిజన్లలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా, కొన్ని డివిజన్లలో ఇంకా ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. పండుగ పనుల ప్రతిపాదనల అధికారం కార్పొరేటర్లకే అప్పగించారు. స్థానిక కాలనీ సంఘాలు, ఎన్జీఓలు తదితరులతో కలిసి ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా మేయర్ సూచించారు. కానీ.. వారితో సమావేశాలు మొక్కుబడి తంతే. కొన్ని డివిజన్లలో అవీ జరగవు. కార్పొరేటర్ ఏది చెబితే అదే పని. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేసే వారు కొందరు కాగా, అది కూడా పట్టించుకోని వారు మరికొందరు. మొత్తానికి బోనాల పండుగ నిధుల్లో కార్పొరేటర్లదే పెత్తనం కావడంతో ప్రజలకంటే వారికే పెద్ద పండగ. రూ. 2 కోట్ల పనులు రద్దు చేశాం వివిధ పండుగల పేరిట మంజూరైన నిధులు ఏడాదంతా ఖర్చు చేసే పద్ధతికి స్వస్తి పలికాం. ఏ పండుగకు మంజూరైన నిధులు ఆ పండుగకే వెచ్చించేందుకు తగిన చర్యలు తీసుకున్నాం. గత సంవత్సరం బోనాల పండుగ ఏర్పాట్లకు మంజూరైన నిధుల్లో దాదాపు రూ. 2 కోట్ల పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. దాంతో ఆ పనుల్నే రద్దు చేశాం. గతంలో మాదిరిగా వాటిని ఎప్పుడైనా ఖర్చు చేసే అవకాశం లేకుండా తగుచర్యలు తీసుకున్నాం. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. – జియాఉద్దీన్, చీఫ్ ఇంజినీర్ (జీహెచ్ఎంసీ) ఈసారి బోనాల పండుగకు సంబంధించి ఇప్పటికి కొన్ని ప్రతిపాదనలే రాగా, చాలా ప్రాంతాల్లో ప్రతిపాదనలే సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన పనుల్ని కూడా బోనాల పండుగ పద్దులో చేర్చే అవకాశాలున్నాయి 2018–నిధుల మంజూరు.. పనుల పురోగతి..(రూ.లక్షల్లో) జోన్ల వారీగా.. జోన్ మంజూరు టెండరుదశలో పనుల పురోగతి ఎల్బీనగర్ 119.00 84.95 00.00 చార్మినార్ 841.77 207.06 56.42 ఖైరతాబాద్ 293.45 107.30 16.00 శేరిలింగంపల్లి 55.83 4.30 00.00 కూకట్పల్లి 39.00 11.17 00.00 సికింద్రాబాద్ 187.41 121.43 9.98 మొత్తం 1536.46 536.21 82.40 గత సంవత్సరం (2017) నిధుల మంజూరు.. పూర్తయిన పనులకు వెచ్చించిన నిధులు రూ. లక్షల్లో ఇలా.. జోన్ మంజూరు పూర్తయిన పనులు ఎల్బీనగర్ 164.89 38.78 చార్మినార్ 535.65 418.50 ఖైరతాబాద్ 139.22 90.28 శేరిలింగంపల్లి 38.76 34.81 కూకట్పల్లి 29.62 29.62 సికింద్రాబాద్ 257.27 231.98 మొత్తం 1165.41 843.97 గత సంవత్సరానికి సంబంధించిన పనుల్లో దాదాపు రూ. 17 లక్షల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో రూ.1.05 కోట్ల పనులు ఇంతవరకు అసలు ప్రారంభమే కాలేదు. -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఖానాపూర్: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పెంబి మండలం మందపల్లి పంచాయతీ పరిధి నాగాపూర్ గ్రామంలో నాల్గో విడత మిషన్ కాకతీయ పథకం కింద రూ.2.50 కోట్లతో మంజూరైన రాగిచెరువు పనులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మందపల్లి గ్రామంలోని పల్కేరు వాగు ఎత్తు పెంచడానికి అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. సరస్వతి కాలువ, ఉప కాలువలతో పాటు సదర్మాట్ బ్యారేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాగి చెరువు నిధుల మంజూరుకి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నల్ల శ్రీనివాస్, పెంబి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎంపీటీసీ పోతురాజుల లచ్చవ్వ, ఎఫ్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, నాయకులు గోవింద్, శేఖర్‌గౌడ్, లక్ష్మీనారాయణ, రాజవ్వ, ఈఈ రమేశ్, డీఈ శరత్‌బాబు, ఏఈఈ శ్రీనివాస్ తదితరులున్నారు. -
గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
కాసిపేట: గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. మండలంలోని కొండపూర్‌యాపలో గురువారం ఎండీఎఫ్(మినరల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు రూ.10లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాకి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండీఎఫ్ నిధులతో గ్రామాల్లో రోడ్డు సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాలువలు, ఇతర సమస్యలు అన్నింటిని దశలవారీగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ హయంలో గ్రామాలు అన్నిరకాలుగా అభివద్ధి చెందుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంశీధర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణరెడ్డి, ఎంపీటీసీలు దాసరి శ్రీకాంత్, మంజుల, సర్పంచ్ ప్రేంకుమార్, నాయకులు తిరుపతిరెడ్డి, విక్రంరావు తదితరులున్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు
వంగూరు : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేయిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ అన్నారు. మంగళవారం వంగూరు మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ కాకతీయ పనులు వంగూరు మండలంలో వేగవంతంగా జరగకపోవడం, ఫేస్–1, ఫేస్–2లో ఐదు చెరువులు పూర్తికాకపోవడం, మూడు, నాలుగు దశల్లో మంజూరైన చెరువుల పనులను పూర్తి చేయకపోవడం కొన్నింటిని ప్రారంభించకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం.. గొలుసుకట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయిస్తుంటే అధికారులు, కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం కక్కుర్తిపడి పనులు ఆలస్యం చేస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల అన్నారు. అవసరమూతే సంబంధిత అధికారులు చెరువుల వద్దే ఉండి పనులు చేయించాలని ఇరిగేషన్ ఏఈ తిరుపతయ్యను ఆదేశించారు. చర్యలు తీసుకోవాలి అలాగే సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన హార్టికల్చర్, ఆర్టీసీ, ఎక్సైజ్, సోషల్ వెల్ఫేర్, ఆర్అండ్బీ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీడీఓను ఆదేశించారు. మూడు నెలలకోసారి జరిగే సర్వసభ్య సమావేశానికి కూడా హాజరు కావడానికి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. సమస్యలు పరిష్కరించాలి సభలో చౌదర్పల్లి సర్పంచ్ అంజన్‌రెడ్డి, పోతారెడ్డిపల్లి సర్పంచ్ శంకర్, గాజర సర్పంచ్ చంద్రయ్య తదితరులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను అధికారులు అధ్యయనం చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్‌లకు సన్మానం ఉమ్మడి వంగూరు మండలంలోని 24 గ్రామపంచాయతీల సర్పంచ్‌లకు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పదవీ కాలాన్ని పూర్తిచేసుకోవడం, ప్రస్తుత సర్పంచ్‌లకు చివరి సర్వసభ్యసమావేశం ఇదే కావడంతో వారికి శాలువాలు, దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మాట్లాడుతూ ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి కోసం వారు కష్టపడిన తీరు, గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే, అధికారులు సహకరించిన విధానం తదితర అంశాలను నెమరు వేసుకున్నారు. తమ పదవీకాలం పూర్తయినప్పటికీ గ్రామాల్లో తాము చేపట్టిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ భీముడు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ సుశీల్‌కుమార్, ఎంపీడీఓ హిమబిందు, కోఆప్షన్ సభ్యుడు హమీద్, ఎంఈఓ శంకర్‌నాయక్, వ్యవసాయాధికారిణి తనూజారాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘మహాగణపతి’కి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులకు శుక్రవారం కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంగణంలో మహాగణపతిని ప్రతి ఏటా మాదిరిగానే 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ‘సప్తముఖ వినాయకుడిగా’ భక్తులకు దర్శనమిస్తారని శిల్పిరాజేంద్రన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఎన్నడూ తయారుచేయని విధంగా విఠల శర్మ సిద్ధాంతి సూచనల మేరకు సప్తముఖ వినాయకుడిగా ఖైరతాబాద్ మహాగణపతిని రూపుదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. మహాగణపతిని ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా వివిధ రంగులలో వినాయకుడి తలలు, ఆపై ఏడు తలల సర్పం, 14 చేతుల్లో వివిధ రకాల ఆయుధాలతో మహాగణపతి డిజైన్‌ను తయారుచేస్తున్నామన్నారు. మరో వారం పది రోజుల్లో ఈ డిజైన్ ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ సంవత్సరం సర్వేశాం ఏకాదశి సందర్భంగా నిర్వహించే కర్రపూజా కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రధానకార్యదర్శి భగవంతరావు, శిల్పి రాజేంద్రన్‌తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఖైరతాబాద్ మంటపంలో వినాయక విగ్రహానికి పూజలు చేసి అనంతరం కర్రను పాతారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గజ్జల నాగేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్, రాజ్‌కుమార్ నాయకులు మహేష్‌యాదవ్, మహేందర్‌బాబు, మధుకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం తరపున మహాగణపతికి భారీ కండువా.... మహాగణపతికి ప్రతీ సంవత్సరం లాగానే పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం తరపున 75 అడుగుల భారీ గాయత్రి జంధ్యం, 75 అడుగుల భారీ చేనేత కండువా వినాయక చవితి రోజు సమర్పించనున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షులు కొండయ్య, వ్యవస్థాపక అధ్యక్షులు కడారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఏలే స్వామి శుక్రవారం తెలిపారు. -
వేతనాలు, బిల్లులు... నో..!
నెలరోజుల పాటు పనిచేస్తే చేతికి జీతం అందుతుంది. అవసరాలు తీరుతాయి. కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని చిరుద్యోగులు భావిస్తారు. జీతం కోసం ఆశగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లదీ ఇదే పరిస్థితి. రూ.లక్షల పెట్టుబడితో చేసిన పనులకు బిల్లులు చెలించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక ఆంక్షలు విధించిన ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. సాలూరు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఏప్రిల్ నెల పూర్తికావస్తున్నా, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించ లేదు. మున్సిపాలిటీలలో కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు సైతం బిల్లులు అందకపోవడంతో అల్లాడుతున్నారు. మున్సిపాలిటీల్లోఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం లేకపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి సాఫ్ట్వేర్ మార్చడమేనని అధికారులు చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచిఆర్థిక ఆంక్షలు కొనసాగించడమేనని కార్మికులు, కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే వేతనాల చెల్లింపు బిల్లులను మున్సిపాలిటీలలో అకౌంట్ అధికారులు సిద్ధం చేసినా, జాప్యం జరిగిందంటూ ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసింది. మార్చి నెలాఖరునాటికి రాష్ట్ర ప్రభుత్వం మిగులు నిధులు చూపించేందుకే ఈ తరహా ఎత్తుగడ వేసిందని పలువురు అభిప్రాయపడుతుండగా... ఎప్పుడు బిల్లులకు క్లియరెన్స్ వస్తుందా..? అని ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో రూ.11కోట్ల 10 లక్షల వేతన బకాయిలు చెల్లించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా బడుగు జీవులకు కష్టాలు తప్పవని కార్మికులు వాపోతున్నారు. ఎన్నాళ్లు ఎదురు చూడాలి..?: అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. జనవరి నెలలోనే పలు అభివృద్ధి పనులు పూర్తిచేశాం. మార్చి నెలలో బిల్లులు చెల్లిస్తారని భావించాం. వడ్డీకి అప్పులు చేసి పనులు జరిపించారు. నేడు ఆ అప్పులను వడ్డీలు కట్టలేక అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు వీడి, తక్షణమే బిల్లులు చెల్లించాలి. – యశోద కృష్ణ, మున్సిపల్ కాంట్రాక్టర్, సాలూరు సాఫ్ట్వేర్ మార్చడంతో సమస్య... పాత విధానంలో కాకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అమలు చేయడంతో సమస్య తలెత్తింది. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మోనటరింగ్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)పై అవగాహన లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రత్యేక శిక్షణ ఇస్తే త్వరితగతిన బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. – ఎం.ఎం.నాయుడు, మున్సిపల్ కమిషనర్, సాలూరు -
ఆ ప్యాకేజీలు వానాకాలం నాటికి పూర్తి కావాలి
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లోని 6,7, 8 ప్యాకేజీల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని.. వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన ఈ మూడు ప్యాకేజీల పనులపై సమీక్షించారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కాళేశ్వ రం ప్రాజెక్టు చేపట్టామని.. పనులను శరవేగం గా కొనసాగించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏడో ప్యాకేజీ పనుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్, అన్నారం బ్యారేజీల పనులు ఊపందుకున్నాయన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ శ్రీధర్, వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్‌లో ఏం జరుగుతోంది..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పది కాదు.. ఇరవై కాదు 720 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ ఎలా ఉండాలి.? ఎలా పడితే అలా భూగర్భ కేబుళ్ల పనులు చేస్తుంటే నియంత్రించకుండా ఏం చేస్తున్నారు.? పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంటే కనీసం పట్టించుకోరా.? అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పినా నిర్లక్ష్యం వహిస్తే ఎలా.? అసలు ఈపీడీసీఎల్‌లో ఏం జరుగుతోందంటూ సీఎండీ దొరపై చీఫ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ అమరావతిలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు, ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ ప్రాజెక్టు(ఏపీడీఆర్పీ) కింద చేపడుతున్న భూగర్భ కేబుల్ ఏర్పాటు పనుల ప్రస్తావన సమయంలో పై వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్టు విశాఖలో తొలిసారిగా ప్రారంభించాం. ప్రపంచ బ్యాంకు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనుల్ని ఎలా చెయ్యాలి, కానీ.. మీరెలా చేస్తున్నారంటూ’ సీఎండీ దొరపై సీఎస్ దినేష్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.720 కోట్ల విలువైన భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులపై ఈపీడీసీఎల్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని తప్పుబట్టారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో చాలా చోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఇష్టమొచ్చినట్లు అడ్డగోలుగా పనులు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎండీగా ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులో నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా ప్రతి పనినీ పర్యవేక్షించాలని అధికారులను చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ సూచించారు. -
శరవేగంగా లాజిస్టిక్ పార్కు
ఇబ్రహీంపట్నంరూరల్: సుదూర ప్రాంతాల నుంచి సరుకులతో నగరానికి వచ్చే లారీలు, ట్రక్కులతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. నగర శివారులో రెండు లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టింది. సరుకులను అక్కడ దింపి చిన్న వాహనాల ద్వారా నగరంలోని రవాణా చేస్తారు. గత సంవత్సరం అక్టోబర్ 6న ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మంగళ్‌పల్లి, బాటసింగారం గ్రామాల్లో లాజిస్టిక్ పార్కులఏర్పాటుకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు పునాది రాయి వేశారు. హైదరాబాద్ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉండటంతో సరుకుల రవాణాకు ఇబ్బందులు కలగకుండా ఈ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారీ వాహనాలు లాజిస్టిక్ పార్కుల వద్దకు వచ్చి అక్కడ సరుకులు దింపుతాయి. అక్కడి నుంచి నగరంలోకి చిన్న వాహనాల ద్వారా సరుకులు రవాణా అవుతాయి. అంతేకాకుండా సుదీర్ఘ ప్రయాణం చేసిన వాహనాల డ్రైవర్లు సేదతీరడానికి లాజిస్టిక్ పార్కుల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. రూ.20 కోట్లతో 22 ఎకరాల్లో నిర్మాణం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి సర్వే నెంబరు 127లో 22 ఎకరాల భూమిలో రూ.20 కోట్లతో లాజిస్టిక్ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం పాలనా పరమైన భవనం, పెద్ద గోదాం నిర్మాణం చేపడుతున్నారు. బొంగ్లూర్ ఔటర్‌రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రోడ్డును వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి లాజిస్టిక్ పార్కుగా మంగళ్పల్లిలో ఏర్పాటు కాబోతున్న లాజిస్టక్ పార్కు పేరుపొందనుంది. అన్‌కాన్ సంస్థ పనులు శరవేగంగా చేస్తోంది. ఇక్కడ 250 ట్రాక్కులు ఒకే సారి వచ్చి నిలపడానికి వీలుంటుంది. డ్రైవర్లు సేదతీరడానికి గెస్ట్‌హౌజ్‌లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది లోపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అన్‌కాన్ సంస్థ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. -
నెలాఖరులోగా పనులు పూర్తి
గుమ్మలక్ష్మీపురం : మండలంలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె.రాజ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిధులు 90 శాతం, శాఖపరమైన నిధులు పది శాతంతో గ్రామాల్లో చేపడుతున్న సీసీరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు, గృహనిర్మాణాలు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులంతా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఆయా అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించినందునా సంబంధిత శాఖ అధికారులు ఈ నెలాఖరుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు, ఎంపీడీఓ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. -
మా ఊరిలో పనుల్లేవు
ఒంగోలు వన్‌టౌన్ : అద్దంకి మండలం జార్లపాలెంకు చెందిన పొగాకు బ్యారన్లో పని చేస్తున్న మహిళా కూలీలు పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే పని ఉంటుందని మిగతా రోజుల్లో ఉపాధి అవకాశాల్లేక వలసలు వెళ్తున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డిగా నామకరణం పీసీపల్లి: కొరిశపాడు మండలం పిచికలగుడిపాడు గ్రామానికి చెందిన గాదె సునీత కుమారునికి రాజశేఖరరెడ్డిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నామకరణం చేశారు. సోమవారం ప్రజా సంకల్పయాత్ర అలవలపాడు హైవే వద్దకు చేరుకోవడంతో ఆమె జగన్‌ను కలిసింది. వైఎస్సార్ మీద ఉన్న అభిమానం తో పేరు పెట్టించినట్లు తెలిపింది. -
ఎంఎంటీఎస్ టూ...లేట్
ఘట్కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్కేసర్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మరింత ఆలస్యం.. సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్‌ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరాశలో ప్రయాణికులు... ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి. –పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు -
‘ఉపాధి’లో కదలిక..
జిల్లాలో జాబ్‌కార్డులు 1,51,280 కూలీలు 3,21,283 మంది 2017–18 ఆర్థికసంవత్సర పనుల లక్ష్యం రూ.100కోట్లు ఇప్పటి వరకు పూర్తి చేసిన పనుల విలువ రూ.60 కోట్లు మిగతా పనులు పూర్తి చేసేందుకు ఉన్న గడువు 40 రోజులు ఆదిలాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.వంద కోట్ల లక్ష్యంతో అధికారులు పనులు ప్రారంభించగా.. కొంతకాలంగా జిల్లాలో ఇవి నిలిచిపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 40రోజులు మాత్రమే సమయం ఉండడంతో సోమవారం నుంచి ఉపాధి పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి సంస్థలోని సిబ్బందికి ఉపాధి పథకంపై శిక్షణ కూడా కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 243 గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలకు ఏడాది పొడవున పనులు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్ధేశం. జిల్లాలో 1,51,280 జాబ్‌కార్డులు ఉండగా, 3,21,283 మంది కూలీలు పని చేస్తున్నారు. మార్చి 31 తర్వాత 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ ప్రణాళిక కార్యాచరణ రూపొందించేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ లోగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న పనులను ప్రారంభించి కూలీలకు మరిన్ని పనిదినాలను కల్పించనున్నారు. అయితే ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే ఉపాధి పనులు జోరు గా సాగుతాయి. ఈ సమయంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు అంతగా ఉండవు. దీంతో కూలీలంతా ఉపాధి పనులవైపే మొగ్గుచూపుతారు. నీటి సంరక్షణకు పెద్దపీట.. ఉపాధి హామీ పథకంలో వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసి ప్రతి బొట్టును భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90శాతం సాగు వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడనున్నారు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్మాణం, ఫీడర్ చానళ్ల ఏర్పాటు, తదితర పనులకూ ప్రాధాన్యత ఇస్తామని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రూ.66 కోట్లు ఖర్చు.. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద రూ. 66కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.50 కోట్లు కూలీలకు, రూ.16 కోట్లు మెటీరియల్‌కు వెచ్చించారు. మార్చి 31లోగా మరో రూ.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో లక్ష పదివేల పనిదినాలు కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 30.98 లక్షల పనిదినాలు కల్పించారు. కొంత కాలంగా గ్రామాల్లో ఉపాధి పనులు పెండింగ్‌లో పడ్డాయి. పనులన్నీ చాలా మట్టుకు వ్యవసాయ పొలాల్లోనే చేస్తున్నారు. దీంతో పొలంలో సాగు చేసిన పంట ఉండడంతో ఇన్ని రోజులు పనులు జరగలేదు. ఇప్పుడు వచ్చేది ఎండకాలం కావడం, పొలాల్లో వేసిన పంటలను తొలగిస్తుండడంతో మళ్లీ ఉపాధి పనులు ఊపందుకోనున్నాయి. ఇందులో వర్షాకాలంలో నీటిని సంరక్షించే పనులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించనున్నారు. నేటి నుంచి జిల్లాలో పనులు.. నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులను ప్రారంభించాలనే ఇప్పటికే ఉన్నతాధికారుల నుం చి ఆదేశాలు అందాయి. రూ.వంద కోట్ల ప్రణాళికతో ఈ ఆర్థిక సంవత్సరం ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేస్తున్నాం. ఇందులో నీటి సంరక్షణకు సంబంధించిన పనులు అధికంగా చేపట్టనున్నాం. వాటర్‌షెడ్ విధానం ప్రకారమే పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించాం. – రాథోడ్ రాజేశ్వర్, డీఆర్డీఓ ఆదిలాబాద్ -
పైప్‌లైన్ మరమ్మతుల్లో ఒకరు మృతి
సాక్షి, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద విషాదం చోటుచేసుకుంది. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పైప్‌లైన్ మరమ్మతు పనుల్లో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గూడెం గ్రామానికి చెందిన సాయి(18) పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. పక్కనే ఉన్న మట్టిపెళ్ల అతనిపై పడడంతొ అతను మృతిచెందాడు. ఇతను పాలిటెక్నిక్ చదువుతున్నాడు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేట చౌరస్తా వద్ద మృతదేహంతో అతని కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో చేస్తున్నారు. -
యాదాద్రి గర్భాలయ పనులు వేగిరం
సాక్షి, యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి గర్భాలయం పనులు వేగం పుంజుకున్నాయి. సీఎం కేసీఆర్ నవంబర్ 24న యాదాద్రికి వచ్చి పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పనులను వేగవంతం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. మార్చి 31లోగా గర్భాలయంపై స్లాబు వేయడానికి ముందుగా వైటీడీఏ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అయితే పనుల విభజన చేసుకుని ముందుగా ప్రధానాలయం, గర్భాలయం పనులను పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గర్భాలయం పైకప్పు వేయడానికి అవసరమైన కాంక్రీటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గర్భాలయానికి ఈనెలాఖరులోగా పైకప్పు వేసే విధంగా పనులు జరుగుతున్నాయి. గర్భాలయం పైకప్పు తర్వాత ప్రధానాలయం పైకప్పు వేయనున్నారు. ఆదిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. పడమర వైపు ఏడంతస్తుల ప్రధాన రాజగోపు రం, తూర్పు, ఉత్తరం వైపు ఐదంతస్తుల రాజగోపురాల పనులు చేపట్టారు. సివిల్ పనులతోపాటు శిల్పి పనులను ప్రధానాలయంలో చేస్తున్నారు. ఆళ్వార్ పిల్లర్లు, కాకతీయ శిల్పాల పనులు జరుగుతున్నాయి. నాలుగు మాడ వీధుల్లో దక్షిణభాగంలో రిటైనింగ్ వాల్ పనుల్లో జాప్యం యథావిథిగా కొనసాగుతుంది. ఇందుకోసం ఆయా విభాగాలకు చెందిన అధికారులు, స్తపతులు నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. విష్ణు పుష్కరిణి, లడ్డూ ప్రసాదం, మండప కాంప్లెక్స్‌లు, శివాలయం, ఇతర పనులను వేగవంతం చేస్తున్నారు. -
భ ‘రూసా’ అందేదెన్నడో ?
రూసా పథకం కింద రూ.10 కోట్లు మంజూరు ఏడాదిగా ఎస్పీడీ దగ్గరే మూలుగుతున్న నిధులు పలు అభివృద్ధి పనులకు బ్రేక్ ఎస్కేయూ: రాష్ట్రీయ ఉచ్ఛరతా శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి నీతి అయోగ్ రూ. 20 కోట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో తొలి విడత రూ. 10 కోట్లు అందిస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రకటించారు. అనుకన్నదే తడువుగానే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రూసా స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్‌కు పంపారు. ఇక్కడ నుండి ఆయా వర్సిటీలకు అందాల్సిన నిధులు అందివ్వాలి. నిధుల ఖర్చుకు సంబంధించి జవాబుదారీతనం.. పర్యవేక్షణ, నియంత్రణ, విధివిధానాలు, నియమ నిబంధనలు స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఎస్. పీ.డీ) రూపొందించాలి. ఎస్.పీ.డీ పూర్తీగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తారు. నిధుల జారీలో జాప్యం ఉన్నత విద్యలో నమోదు శాతం పెంపుదల, వర్సిటీలు, కళాశాలల్లో భవనాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు అందించడానికి రూసా పథకాన్ని అమలు చేస్తోంది. నిర్ధిష్ట గడువులోగా నిధులు అందించడంతో పాటు.. నిర్ధారించిన పనులను సత్వరంగా చేపట్టి సకాలంలో పూర్తిచేయాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యం. అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ, పీజీలకు వెళ్లే వారి శాతం కేవలం 23 శాతం మాత్రమే ఉన్నట్లు రూసా గుర్తించింది. ఈ నమోదు శాతం ( డిగ్రీ, పీజీలు చదివే విద్యార్థుల సంఖ్య పెంచడం) పెంపుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నీతిఅయోగ్ గణనీయమైన మొత్తంలో రూ. 20 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 10 కోట్లు జారీ చేసినప్పటికీ .. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీడీ తమ వద్దే ఆ మొత్తాన్ని పెట్టుకోవడంతో రూసా పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే బ్లాక్ గ్రాంట్లు అరకొరగా ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిధులు సకాలంలో అందివ్వడంలో అలసత్వం వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా మౌలిక సదుపాయాల కల్పనలో వర్సిటీ ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. పనుల జాబితాను పంపాము నిధులను ఏయే వాటికి ఖర్చు పెడుతున్నారనే అంశంపై ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం రూసా విభాగానికి ఇప్పటికే పంపాం. రెండు నూతన హాస్టళ్ల నిర్మాణం, ఒక ఇండోర్ స్టేడియం, డిజిటల్ తరగతులు, లైబ్రరీ డిజిటలైజేషన్, క్యాంటీన్ ఆధునీకరణ తదితర మౌలిక సదుపాయల కల్పనకు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించాము. ఎస్.పీ.డీ అడిగిన అన్ని డ్యాక్యుమెంట్లు పంపాం. – ప్రొఫెసర్ ఎండీ బావయ్య, రూసా పథకం కోఆర్డినేటర్, ఎస్కేయూ -
రైతు నోట మన్ను కొట్టారు
ఇందిరా సాగర్‌పై నోరెత్తని ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజన నుంచి నిలిచిపోయిన పనులు తుప్పుపడుతున్న విలువైన యంత్రాలు ప్రాజెక్టు ఊసెత్తని ఏపీ ప్రభుత్వం జిల్లాలో 46 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్ధకం ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులు నిరుపయోగం లక్ష్యం: 2.50 లక్షల ఎకరాలు మన జిల్లాలో: 46 వేల ఎకరాలు నిధుల మంజూరు వైఎస్ హయాంలో : రూ. 1824 కోట్లు ఖర్చు పెట్టింది: రూ. 900 కోట్లు 2014 నుంచి నిధులు: 0 చేసిన ఖర్చు: 0 చింతలపూడి: ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం అంతర్ రాష్ట్ర జలవివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోను, ప్రధాన కాల్వలు తెలంగాణలోను చేరడంతో పథకాన్ని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరా సాగర్‌ను రీ డిజైనింగ్ చేసి తెలంగాణ అవసరాలకు వినియోగించుకునేలా మార్పులు చేయాలని ఆదేశించడంతో అక్కడి ఇరిగేషన్ అధికారులు ఆపనిలో మునిగి పోయారు. దీంతో మన రాష్ట్రానికి చెందిన పశ్చిమ, కృష్ణా జిల్లాల రైతుల పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది. 2005లో చింతలపూడి విచ్చేసిన అప్పటి ముఖ్యమంతి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి ఆనాటి ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ సాగునీటి సమస్యను తీసుకువెళ్లగా ఆయన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి తద్వారా చింతలపూడి నియోజకవర్గానికి సాగు నీరు అందించడానికి అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రు 1,824 కోట్ల నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది డిసెంబర్ నెలలో ఎత్తిపోతలకు శంఖు స్థాపన చేశారు. అనంతరం వేలేరుపాడు మండలం రుద్రమకోటలో గోదావరి, శబరి నదులు కలిసే ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టారు. ప్రాజెక్టు పనులకు విభజనకు ముందు వరకు సుమారు రూ.900 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర్ర విభజన తరువాత అసలు సమస్య ప్రారంభమయ్యింది. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ప్రాంతం ఆంధ్రాలో విలీనం చేయడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఏ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. ప్రాజెక్టు రూపకల్పన: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా రైతులకు సాగు నీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేశారు. ఖమ్మం జిల్లాలోని 9 మండలాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాలకు, కృష్ణా జిల్లాలోని 2 మండలాలలో 24.500 ఎకరాలకు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో 46 వేల ఎకరాలకు సాగునీరు అందు అందుతుంది. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో మెగా కిర్లోస్కర్, ఏఎంఆర్ ఇంటర్నేషనల్ సంస్ధలకు అప్పగించారు. 2012 లోనే పూర్తి కావాల్సిన ఎత్తిపోతల పనులు 50 శాతం కూడా పూర్తి కాకుండానే నిలిచిపోయాయి. మొత్తం 47 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, పనులు నిలిచిపోయే నాటికి 38 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఎత్తిపోతలకు సంబంధించి మూడు చోట్ల పంప్ హౌస్‌లు నిర్మించడానికి భారీ కందకాలు తవ్వారు. వేలేరుపాడు మండలం అల్లూరినగర్, అశ్వారావుపేట మండలం ఆసుపాక, బండారుగూడెం ప్రాంతాల్లో పంప్‌హౌస్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇంత వరకు పంప్‌హౌస్ పనులు 20 శాతం కూడా పూర్తవ్వలేదు. ఈ పంప్ హౌస్‌ల కోసం జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న భారీ మోటార్లు గత 10 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో 6.8 వేల హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన 18 మోటార్లు అవ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం వద్ద నిరుపయోగంగా వదిలి వేశారు. నోరు మెదపని ఆంధ్రా ప్రజా ప్రతినిధులు విభజన సమయంలో ఆంధ్రాలోని నీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల గురించి అప్పటి ప్రజా ప్రతినిధులు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక పోవడంతో ప్రాజెకుల్ట పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల మధ్య సాగు నీటి వివాదాలు తలెత్తి ఘర్షణలు చోటుచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రా కాలువ ద్వాదా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజా ప్రతినిధులు అడ్డుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం ఈ వివాదంపై ముగ్గురు రాష్ట్ర స్థాయి రిటైర్డ్ ఇంజినీర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో శాశ్వతంగా గోదావరి జలాలను రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ పరిస్ధితుల్లో ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఇరిగేషన్ అధికారులు చర్చించుకుని ప్రాజెక్టు పనులు పూర్తి చేసినట్లుయితే తెలుగు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుంది. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నీరు : రాష్ట్ర విభజన వల్ల ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకం ముందుకు సాగే అవకాశం లేదు, చింతలపూడి ఎత్తిపోతల పథకంలోనే తమ్మిలేరుకు గోదావరి జలాలను అందించే ప్రతిపాదన ఉంది. రైతులు అధైర్య పడాల్సిన పని లేదు. ఎం. అప్పారావు తమ్మిలేరు ఇరిగేషన్ డిఈ -
పోలవరం ఆర్అండ్ఆర్ పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ : పోలవరం ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో దినేష్‌కుమార్, స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, సంబంధిత ఆర్డీవోలతో సమీక్షించారు. నిర్వాశితులకు పునరావాసంలో భాగంగా 21 కాలనీలు చేపట్టాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఏడు కాలనీలు నిర్మించడం జరిగిందని, మరో 9 కాలనీలకు లే అవుట్లు సిద్ధం చేశారని కలెక్టర్ తెలిపారు. ఎటపాక డివిజన్లోని గ్రామాలలో అదనపు భూసేకరణ పనులను కూడా కలెక్టర్ సమీక్షిస్తూ, ఈ భూసేకరణ పనులు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, ఆర్అండ్ఆర్పై ప్రతీ సోమవారం సమీక్షించడం జరుగుతుందన్నారు. భూమికి బదులు భూమి పథకం కింద అవార్డ్పాస్ చేసిన 443 ఎకరాల భూమిని ఐటీడీఏకు అక్టోబర్ 31లోగా అందజేయాలని, ఈ భూమి ఐటీడీఏ రైతులకు, టైటిల్ డీడ్, పట్టాదారు పాస్‌పుస్తకంతో కలిపి నవంబర్ 30వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఈ భూములకు అవసరమైన రోడ్లను ఉపాధి హామీ సమన్వయం ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. పట్టుదల, కృషితో పనిచేసి ఉత్తమ ఫలితాలు దివ్యాంగులకు ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగిందని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్న దివ్యాంగులు పట్టుదల, కృషితో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం కలెక్టరేట్ కోర్టుహాలులో వికలాంగుల సంక్షేమశాఖ నిర్వహించిన బ్యాక్లాగ్ పోస్టులభర్తీలో ఎంపికైన వారితో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. ఎంపికైన అభ్యర్థులను అభినందిస్తూ మనోధైర్యంతో పనిచేస్తే అంగవైకల్యంను అధిగమించవచ్చని హితవుపలికారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ, ఎంపికైన అభ్యర్థులు పాల్గొన్నారు. -
సాగునీరు లేకుండా చేస్తున్నారు
ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న రైతులు వెయ్యి ఎకరాల్లో వరినాట్లు వేయని వైనం తరలివెళ్లిన పోలీసులు సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు లేక వరినాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధానం కారణం పైప్‌లైన్ పనులేనని ఆరోపించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులకు ఆవలి పక్కనే తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ కాలువ ఉంది. ఆ కాలువ నుంచి వచ్చే నీరు పైప్‌లైన్ పనులకు ఇవతల వైపున ఉన్న 1,000 ఎకరాలకు అందాలి. పైప్‌లైన్ పనుల వల్ల నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో రైతులు ఇంత వరకూ వరినాట్లు వేయలేకపోయారు.అదీ వారి ఆగ్రహానికి కారణం. దీంతో తహసీల్దార్ కనకం చంద్రశేఖరరావు, కోరుకొండ సీఐ మధుసూదనరావు, ఎస్సై ఎ. వెంకటేశ్వరావు, 20 మంది పోలీస్ సిబ్బంది తరలివెళ్లారు. అధికారులు ఈ సందర్భంగా రైతులతో చర్చించారు. గ్రీన్ ట్రైబ్యునల్ ఆగస్టు 2కు వాయిదా వేసిందని, 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తే వాటి ఆధారాలు చూపాలని ప్రభుత్వ అడ్వకేట్‌ను కోరారని, అంతవరకూ పనులు చేయడానికి వీల్లేదని రైతులు కలగర బాలకృష్ణ, కరుటూరి శ్రీనివాస్, ప్రసాద్, చల్లమళ్ళ విజయ్‌కుమార్ చౌదరి తేల్చి చెప్పారు. దీంతో కోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన అధికారులు ఇందులో పనులు ఆపమని చెప్పలేలే అని వివరించారు. రైతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ పనులు చేయమని ఆర్డర్ చూపాలని మెగా ఇంజనీరింగ్ ఆధికారులను నిలదీశారు. దానికి అధికారులు సరైన సమాధానం చెప్పక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అడ్డుకునే అధికారం మీకు లేదని, కోర్టు అర్డరులో పనులు ఆపమని లేనందున పనులు యథావిదిగా చేస్తారని అధికారులు బదులిచ్చారు. అంతేగాకుండా అధికారులు పోలీసుల రక్షణలో పనులు కొనసాగించారు. వరినాట్లు వేయడానికి తొర్రిగెడ్డ పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు వెళ్లడానికి పైప్‌లైన్ వద్ద కాలువను కలుపుతామని చెప్పి తక్షణమే పనులు చేపట్టారు. దీనితో రైతులు మద్యాహ్న 1.30 గంటలకు అక్కడ నుండి తరలి వెళ్లారు. ఎత్తిపోతల పథకం పనులు యధావిదిగా కొనసాగించారు. -
ఓట్ల కోసమే రోడ్డు విస్తరణ..
-
ఎయిర్‌పోర్టు పనులను అడ్డుకున్న రైతులు
తమకు న్యాయం చేయాలని డిమాండ్ వైఎస్సార్ సీపీ నేత విజయలక్ష్మి సారథ్యం తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు మధురపూడి (రాజానగరం) : రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మధురపూడి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. తమ భూములకు పరిహారం, సాగునీరు, ఉపాధి, రోడ్లు అందించాలని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) నిధులు కేటాయించాలని కోరుతూ రైతులు ఈ చర్యకు ఉపక్రమించారు. వైఎస్సార్సీపీ సీజీసీ జభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వారికి సారథ్యం వహించారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టు అధికారులు, కాంట్రాక్టర్లతో రైతులు ఒక దశలో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా మధురపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోరుకొండ తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామానికి రోడ్లు నిర్మించకుండా ఎయిర్‌పోర్టు విస్తరణ, రక్షణ గోడ పనులు చేయడాన్ని రైతులు తప్పుబట్టారు. రైతులు పలు డిమాండ్లతో కూడిన పత్రాన్ని తహసీల్దార్ హుస్సేన్‌కు అందించారు. దీంతో తహసీల్దార్ హుస్సేన్ రైతులను కోరుకొండలోని తన కార్యాలయానికి ఆహ్వానించి చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లను సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కోరుకొండ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గరగ మధు, రైతు విభాగం కన్వీనర్ తోరాట శ్రీను, మధురపూడి రైతు నాయకులు గణేశుల పోసియ్య, ఆకుల రామకృష్ణ, నందెపు ప్రసాద్, పిల్లా పోలీసు, గణేశుల మాణిక్యాలు పాల్గొన్నారు. ఐక్యంగా ఉద్యమిద్దాం ఎయిర్ పోర్టు పనులను అడ్డుకున్న రైతులను ఉద్దేశించి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రైతుల సమస్యల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో కాలయాపన చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. -
చెత్త కారణాలు చెప్పొద్దు
పనుల్లో పురోగతి లోపిస్తే సస్పెండ్ చేస్తా – నెలాఖరు నాటికి అవెన్యూ ప్లాంటేషన్‌పై రిపోర్టులు పంపండి – ఫారంపాండ్స్‌లో వేగం పెరగాలి – మెసేజ్‌లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు – డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): మీరు చిన్న పిల్లలు కాదు.. పదే పదే చెప్పించుకోవద్దు.. బెదిరించి పనులు చేయించే స్థితికి తీసుకురావొద్దు.. చేపట్టిన పనుల పురోగతిపై చెత్త కారణాలు చెప్పకుండా, మర్యాదను పెంచుకోవాలంటు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ భవనంలో ఏపీడీ, ప్లాంటేషన్ మేనేజర్లు, డీఆర్పీఎస్లతో పీడీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలు ఏ దశలో ఉన్నాయనే నివేదికలు పంపడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? రాష్ట్రంలో మన జిల్లా 21.20 శాతం సాధించి చివరి స్థానంలో ఎందుకు ఉంది?’’ అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతానికి చేరుకోవాలన్నారు. అలాగే హార్టికల్చర్ ప్లాంటేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనీసం రెండు సంవత్సరాల వయస్సు, 1.1/2 మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫారంపాండ్స్‌లో వేగం పెరగాలి తొలకరి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టిన ఫారంపాండ్స్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ ఏడాది లక్ష్యంలో ఇప్పటి వరకు 4వేలు మాత్రమే పూర్తయ్యాయని, పురోగతిలో ఉన్న 11వేల ఫారంపాండ్స్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్ల టార్గెట్ 6వేలు కాగా, ఇప్పటి వరకు 464 మాత్రమే పూర్తయ్యాయని, 4276 పురోగతిలో ఉన్నాయని, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో వీటిని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 8,685 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1026 పూర్తి అయ్యాయని, మిగిలినవన్నీ పురోగతిలో ఉన్నాయని, వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెసేజ్‌లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు డ్వామా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యాక్రమాలకు సంబంధించి పురోగతిని పెంచేందుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపుతున్నా కొందరు పట్టించుకోవడం లేదని పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం నుంచే కాకుండా స్వయంగా తన సెల్‌ఫోన్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నా స్పందించడం లేదన్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పీడీ హెచ్చరించారు. సమావేశంలో వాటర్‌షెడ్స్ ఏపీడీ రసూల్, ఎంఅండ్‌ఈ సులోచన, ఉపాధి హామీ పథకం సభ్యుడు సత్రం రామకృష్ణ పాల్గొన్నారు. -
సస్యశ్యామలంపై ... స్వార్ధపు చీడ
- పెద్దల నిర్మాణ బాగోతం - సాగు నీటికి బ్రేకులు - సాగును ప్రశ్నార్థకంలో పడేసిన నేతల స్వార్థం - రైతులకు నీటి కష్టాలు - గుక్కెడు నీటి కోసం జనం కటకట సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజలు ఎలాపోతే మాకేంటి ... మా జేబులు నిండితే చాలన్నట్టుంది అధికార పార్టీ నేతల తీరు. వారి స్వార్థం వేల ఎకరాల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా పంట కాలువ వెంబడి పనుల కాంట్రాక్ట్‌లో పడి తమ స్వప్రయోజనాల కోసం అటు కోనసీమలోను, ఇటు సామర్లకోటల్లో పంట కాలువలకు సాగునీరు సరఫరా కాకుండా నిలిపివేశారు. కేవలం రెండున్నర కోట్ల వ్యయంతో సామర్లకోట పంట కాలువపై నిర్మిస్తున్న వంతెన కోసం వేలాది మంది రైతుల కంట కన్నీరు పెట్టేలా చేస్తున్నారు. అమలాపురంలో రూ.9.10 కోట్ల వ్యయంతో నల్లవంతెన–ఎర్రవంతెన మ«ధ్య పంట కాలువ పక్కన లాంగ్ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అమలాపురం–చల్లపల్లి పంటకాలువ, మురమళ్ల–ఎదుర్లంక మధ్య, గాడిలంక–కర్రివానిరేవు మధ్య పంట కాలువల్లో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పంట కాలువలకు అడ్డగోలుగా సాగు నీరు నిలిపివేశారు. దాదాపు ఈ పనులన్నీ ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన బంధువులు, బినామీలే చేస్తున్నారు. ఈ కారణంగా వారి స్వార్థం కోసం పంట కాలువలకు సాగునీరు సరఫరా చేయకుండా నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. సామర్లకోట కాలువపై వంతెన నిర్మాణంలో ఒక మంత్రి తనయుడు బినామీగా పనులు చేపడుతుండంతోనే వేలాది మందికి సాగు, తాగునీరు ఇబ్బంది కలుగుతున్నా ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్టు పోతున్నారు. వారి నిర్వాకం ఫలితంగా జిల్లా కేంద్రం కాకినాడ నగరం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. ప్రతి ఏటా కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంట కాలువలకు ముందుగానే నీరు విడుదల చేశారని సంబరపడ్డ రైతులకు అమాత్యుని నిర్వాకంతో శాపమైంది. ఇదంతా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. ధవళేశ్వరం గోదావరి నుంచి సామర్లకోట గోదావరి కాలువకు విడుదలచేసిన నీటిని కడియం కొత్త లాకులను మూసేసి సరఫరా కాకుండా బంధించేశారు. నీటి విడుదల ఆనందం ఆవిరి... ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం వద్ద ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలకు ప్రభుత్వం అధికారికంగా సాగునీరు విడుదల చేసింది. ధవళేశ్వరంలో నీరు విడుదల చేసిన 48 గంటల్లోపు జిల్లాలో ఏ పంట కాలువలోనైనా చివరి వరకు నీరు పారాల్సిందే. అధికారికంగా సాగునీరు విడుదల చేసి మంగళవారం నాటికి ఆరు రోజులయింది. ఇంతవరకు సామర్లకోట గోదావరి కెనాల్‌కు చుక్కనీరు సరఫరా కాలేదు. ఇందుకు కారణమేమిటని ఆరా తీస్తే నేతల స్వార్థం కోసం సాగునీటి సరఫరా నిలిపివేసిన బాగోతం బయటపడింది. కారణమిదీ... సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే గోదావరి కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి గతేడాది జూన్ 3న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శంకుస్థాపన చేశారు. రూ.1.99 కోట్లు అంచనా వ్యయం నిర్మాణం ఆలస్యం కావడంతో అంచనా రూ.2.70 కోట్లకు పెరిగిపోయింది. ఏడాది తరువాత 18 రోజులు క్రితమే వంతెన పనులు మొదలుపెట్టడం గమనార్హం. వంతెన పనులు తెరవెనుక చక్కబెడుతున్న మంత్రి కుటుంబ సభ్యులు సామర్లకోట కెనాల్ నీటి సరఫరా నిలిపివేయించారని రైతులు మండిపడుతున్నారు. ఈ నీరే సాగుకు ఆధారం... ఈ కెనాల్ నుంచి సరఫరా అయ్యే నీరు సాగు, తాగుకు చాలా కీలకం. ఈ సాగు నీరుతో సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లోని చాలా గ్రామాల ఆయకట్టుకు జీవం పోస్తుంది. ఈ కాలువకు నీరు వస్తే ఖరీఫ్ దమ్ములు చేసుకుందామని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. సామర్లకోట మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలు, కాకినాడ రూరల్ రామేశ్వరం, గంగనాపల్లి, అచ్యుతాపురం గ్రామాలకు మరో 15వేల ఎకరాలకు సాగు నీరు సరఫరాకు బ్రేక్ పడింది. పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధిలోని ఆయకట్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. పిఠాపురం నుంచి గొల్లప్రోలు, తుని వరకు సుమారు 47 వేలు ఎకరాలకు సాగునీరు పిఠాపురం బ్రాంచి కెనాలే ఆధారం. లక్ష మందికి గొంతు తడిపే కాలువ ఇదే... సాగునీరే కాకుండా వేలాది మంది దాహార్తిని కూడా ఈ కాలువ తీరుస్తుంటుంది. చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల పరిధిలోని లక్షన్నర మంది గొంతు తడిపే కాలువ కూడా ఇదే. సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో 70 వేలు, పెద్దాపురం మున్సిపాలిటీలో 55 వేల జనాభాకు తాగునీరు మున్సిపాలిటీలు సరఫరా చేయాలి. ఇందు కోసం సామర్లకోటలో రెండు రిజర్వాయర్లున్నాయి. సామర్లకోట–కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయరు, ఉండూరు రైల్వే గేటు వద్ద నాగార్జున చెరువును ఏర్పాటు చేశారు. గోదావరి కాలువ నీటితోనే ఈ రెండు మున్సిపాలిటీలకు నీరు రిజర్వు చేశారు. సాంబమూర్తి రిజర్వాయరు పెద్దాపురం మున్సిపాలిటీ, నాగార్జున చెరువు సామర్లకోట మున్సిపాలిటీతో పాటు కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారానికి, కాకినాడ సీపోర్టుకు కూడా ఈ కాలువ నీరే ఆధారం. వేసవి తాపంతో రెండు చెరువులలో నీరు అడుగంటింది. దాంతో ఫిల్టరు ప్లాంటులకు నీరు అందని పరిస్థితి ఉంది. ఉన్న నీరు కూడా పసరు రంగుకు మారిపోయి నీరు చెడువాసన వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓ మంత్రి ఆదేశాలతోనే... గోదావరి కాలువలో వంతెన పనుల్లో భాగంగా రెండుగట్ల వైపు కాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి పై ఎత్తుకు వచ్చే వరకు ఈ కాలువ నీటిని విడుదల చేయవద్దని ఒక ఆమాత్యుని హుకుం. ఆయన చెప్పిందే తడవు ఇరిగేషన్ అధికారులు ‘జీ హుజూర్’ అంటూ నీటిని కడియం లాకుల్లో నిలిపివేశారు. ప్రస్తుతం ఒక దిమ్మ నీటి మట్టం ఎత్తుకు రాగా, మరో దిమ్మ పునాదికే పరిమితమైంది. మరో వారం రోజుల వరకు ఈ పనులు పూర్తి అయ్యే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇదే కాలువ నీరు సామర్లకోట నుంచి వీకే రాయపురం, మాధవపట్నం మీదుగా కాకినాడ వరకు వెళుతుంది. ఈ కాలువలో వంతెన నిర్మాణ కాంట్రాక్ట్ కోసం నీరువిడుదల అపేస్తే వీకె రాయపురం, మాధవపట్నం వద్ద గోదావరి కాలువలకు అడ్డు కట్టలు వేసి మరీ కాలువ అవతలివైపు కొందరు నేతలు, రియల్టర్లు పంట పొలాలను లేఆవుట్ చేసుకోడానికి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కడిపడితే అక్కడ ముడుపులు మెక్కేసి గోదావరి కాలువలో అడ్డుకట్టలు వేసిన నీటిపారుదల శాఖాధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికీ కటకటే... కాకినాడ నగరంలో కూడా గోదావరి నీరు సరఫరా లేకపోవడంతో ఉన్న నీరు దుర్వాసన వస్తోందని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అరట్లకట్ట వేసవి జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడంలేదు. ప్రజలకు రెండుపూటలా నీరు అందించలేని పరిస్థితిని నగరపాలక సంస్థ ఎదుర్కొంటోంది. వేసవి జలాశయంలో 45 రోజులుకు సరిపడేంతగా నీటిని నిల్వ చేసుకున్నా ముందస్తు ప్రణాళిక లేక గడచిన వారం రోజులుగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కుళాయిలు ద్వారా మురికినీరు సరఫరా అవుతుండటంతో నగరంలో సుమారు నాలుగు లక్షల మంది తాగునీటికి కటకటలాడుతున్నారు. గాంధీనగర్, రామారావుపేట, పాతబస్టాండ్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. గోదావరి కాలువలు తెరచినప్పటికీ ఈ పరిస్థితి అధిగమించడానికి మరో నాలుగైదు రోజులుపైనే పడుతుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ‘గుక్కెడు నీరు రంగు మారి పొయింది’ గడచిన రెండు రోజులుగా తాగునీరు రంగు మారిపోయింది. నీరు చెడు వాసన వస్తుంది. గోదావరి కాలువకు నీరు వచ్చినా సామర్లకోటకు చేరకపోవడంతో తాగునీటి చెరువులు నింపుకునే అవకాశం లేకుండాపోయింది. అధికారుల నిర్వాకంతో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. తుంపాల శ్రీనివాసు, సీఐటీయు మండల అధ్యక్షుడు, సామర్లకోట. బోరు నీరే శరణ్యం.... పెద్దాపురం మున్సిపాలిటీ ప్రజలకు బోరు నీరే శరణ్యంగా మారింది. గోదావరి జలాలు విడుదల చేసినా బోరు నీరు తప్పడం లేదు. సాంబమూర్తి రిజర్వాయరులో నీరు చాలా రుచిగా ఉంటాయి. బోరునీరు చాలా చప్పగా ఉంటున్నాయి.పట్టణ ప్రజలందరికి గోదావరి జలాలు అందించాలి. 20 రోజులుగా తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. షేక్ బేబీ, రామారావుపేట, పెద్దాపురం. ‘వర్షాలు లేవు...సాగునీరు లేదు’ గోదావరి కాలువలో నీరు వస్తే పంట భూముల్లో దమ్ములు చేసుకొవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత వేసవి కాలంలోని ఎండలకు భూములు బీటలు వారాయి. సామర్లకోట–వీకే రాయపురం మధ్యలో గోదావరి కాలువకు అడ్డుగా తాత్కలికం మార్గం ఏర్పాటు చేసుకొని లేవుట్లు వేస్తున్నారు. దాంతో గోదావరి కాలువ నీరు పంట కాలువలకు రావడానికి మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. వెలమర్తి శ్రీనివాసు, రైతు సంఘ నాయకుడు, వికె రాయపురం. ‘ఐదు రోజుల్లో విడుదల చేస్తాం’ సామర్లకోట గోదావరి కాలువపై జరుగుతున్న వంతెన పనులతో గోదావరి జలాలు విడుదలకు అంతరాయం కలిగింది. కడియంలో నీటిని నిలుపుదల చేశాం. ఐదు రోజుల్లో వంతెన స్తంభాలు పూర్తవుతాయి. వెంటనే గోదావరి కాలువలో మట్టిని తొలగించి గోదావరి కాలువకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తాం. విజయకుమార్, ఇరిగేషన్ డీఈ, కాకినాడ -
సమయం లేదు మిత్రమా !
పంట కాలువలకు నీటి సరఫరాను ఆపేసి సుమారు నెలరోజులు కావస్తోంది. జూన్ 1న మళ్లీ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కాలువల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వహణ పనులూ ముందుకు సాగడం లేదు. ఫలితంగా రానున్న రోజుల్లోనూ అన్నదాతలకు, ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. కాళ్ల: కాళ్ల మండలంలోని అన్నయ్యకోడు కాలువలో సుమారు 280 మీటర్ల మేర రూ.75 లక్షలతో రెండు చోట్ల రిటెయినింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టారు. సమయం ముంచుకొస్తున్నా.. ఈ పనులు కొలిక్కి రాలేదు. నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులను నాణ్యత లేకుండా నీటిలోనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలకు నీరు వదిలితే ఈ పనులు సగంలో నిలిచిపోయే దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే పలు కాలువల్లో మట్టి మేట వేసింది. జువ్వలపాలెం నుంచి శివారు కలవపూడి వరకూ అన్నయ్యకోడులో కర్రనాచు మేట వేసి ఉంది. కర్రనాచువల్ల ప్రతి ఏటా శివారు గ్రామాలకు నీరు అందడం లేదు. గురువారమే ఈ పనులు చేపట్టారు. ఇవి కూడా గడువులోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే కాళ్ల కె.లంక చానల్ శివారు నుంచి ఎర్త్‌వర్క్ పనులు ఇటీవలే చేశారు. నిబంధనల మేరకు ఈ పనులు జరగ లేదని, నీళ్లల్లోనే తవ్వకం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల కాకముందే పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నయ్యకోడు అభివృద్ధి పనులు మొదలెట్టాం అన్నయ్యకోడు పంటకాలువ అభివృద్ధి పనులు గురువారం ప్రారంభించాం. కాలువలో పేరుకుపోయిన కర్రనాచు, మట్టి దిబ్బలను తొలగిస్తాం. దీని వల్ల శివారు గ్రామాలకు నీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నాం. – నంబూరి త్రినాథమూరి్తరాజు, కలవపూడి నీటి సంఘం అధ్యక్షుడు కంటి‘తూడు’పు చర్యలే నిడదవోలు : జిల్లాలో కాలువలు కట్టిన తరువాత యుద్ధ ప్రాదిపదికన చేపట్టాలి్సన ఓ అండ్ ఎం (ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ )తూడు పనులకు ఆలస్యంగా ఆమోదం లభించింది. జిల్లాలో 2017–18 సంవత్సరానికి పశ్చిమ డెల్టాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో 202 పనులకు రూ.5.06 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరు రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ పనులు చేపడతారా, లేదా అనే సందిగ్ధం నెలకొంది. కాలువలకు నీరు విడుదల చేయక ముందే వాటిల్లో పేరుకుపోయిన కర్రనాచు, గుర్రపుడెక్క తొలగించేందుకు రసాయనాలు పిచికారీ చేయాలి. అయితే ఆలస్యంగా నిధులు మంజూరు కావడంతో పనులను తూతూ మంత్రంగా చేపడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం కంటితుడుపు చర్యలేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్ధలకు చేరుకున్న స్లూయిస్ల మరమ్మతులSనైనా పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఇదే తంతు ఏటా తూడు పనుల మంజూరులో ఆలస్యం జరుగుతూనే ఉంది. కాలువలు మూసివేసిన తరువాత ఏటా పశ్చిమడెల్టా ప్రధాన కాలువతోపాటు తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పేరుకుపోయిన తూడు, డెక్క తొలగింపు, స్లూయిస్ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్, స్లూయిస్ల అడుగు భాగంలో పేరుకుపోయిన నాచు తొలగింపు పనుల చేపట్టా ల్సి ఉంది. ఏటా వీటి కి నిధుల మంజూరులో ఆలస్యం జరగడంతో పనులు పూర్తికావడం లేదు. తూడు పనులు.. నీటి సంఘాలకే... ఈ పనులన్నింటినీ కొన్నేళ్లుగా నామినేషన్ పద్ధతిపై నీటి సంఘాలకే కట్టబెడుతున్నారు. అంతక్రితం అన్ని పనులనూ టెండర్లు వేసి చేపట్టేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత టెండర్ల ప్రక్రియకు స్వస్తి పలికారు. పనులను టీడీపీ వర్గీయులైన నీటి సంఘాల ప్రతినిధులకు అప్పగిస్తున్నారు. ఫలితంగా ఇవి నాణ్యంగా ఉంటాయో లేదోనన్న అనుమానం నెలకొంది. యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి భీమవరం టౌన్ : డెల్టా ఆధునికీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. స్థానిక ఏఎస్సార్ సాంస్కృతిక కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలకృష్ణంరాజు మాట్లాడారు. నీటిని విడుదల చేసేలోపే పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని కోరారు. నందమూరు అక్విడెక్టు పాతనిర్మాణాన్ని తొలగించొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్విడెక్టు నిర్మాణం వల్ల నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దాని పరీవాహక ప్రాంతంలో గట్లు మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గట్లు పటిష్టం చేసిన తరువాతే పాత అక్విడెక్టు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మేళం దుర్గా ప్రసాద్, పాతపాటి మురళీరామరాజు, మెంటే సోమేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, సీతారామరాజు, లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు. -
రూ 1.50 కోట్లు కడలి పాలు
- అమీనాబాద్ తీరంలో డ్రెడ్జింగ్ పనుల తీరు - నెల తిరక్కుండానే మూసుకుపోయిన ఉప్పుటేరు - బోట్లు ధ్వంసమవుతున్నాయని మత్స్యకారుల ఆందోళన పిఠాపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా తయారయింది ఉప్పుటేరులో డ్రెడ్జింగ్ పనులు. ఇసుక మేటలు వేసి బోట్లు వెళ్లడానికి వీలు లేదని దాన్ని లోతు చేయడానికి చేసిన పనులు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయని మత్స్యకారులు వాపోతున్నారు. సముద్రంలో చేపల వేటకోసం వెళ్లే బోట్లు ఒడ్డుకు రావడానికి ఉప్పుటేరు అనువుగా లేకపోవడంతో లోతు చేసే పనులు చేపట్టారు. రూ.1.50 కోట్లు వెచ్చించిన ఈ పనుల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు సాగరతీరంలో మినీ హార్భర్ కోసం కేటాయించిన ప్రాంతంలో కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన వందలాది మత్స్యకార బోట్లు నిలుపుతుంటారు. ఇక్కడ నిత్యం చేపల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కాకినాడ హార్భర్‌లో ఇతర బోట్లను నిలపడానికి నిరాకరించిన నాటి నుంచి సుమారు పదేళ్లుగా రెండు మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు ఇక్కడే నిలుపుతున్నారు. ఇక్కడ ఉన్న ఉప్పుటేరు సాగరతీరానికి మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో బోట్లు ఒడ్డుకు చేరడానికి అనువుగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో మినీ హార్బర్ నిర్మాణానికి గత పదేళ్ల కిందటే 50 ఎకరాల భూమిని సేకరించి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ప్రభుత్వాలు మారడంతో ఇది నిర్మాణానికి నోచుకోకపోవడంతో ప్రస్తుతం నిర్మాణం వ్యయం రూ. 200 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో తమ బోట్లు ఒడ్డుకు తీసుకువచ్చే సమయంలో ఉప్పుటేరు మూసుకుపోవడం వల్ల బోట్లు పాడైపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఇలా ప్రారంభం... దీంతో ఉప్పుటేరులో మట్టిని తొలగించి లోతు చేయడానికి కార్పొరేషన్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద నిధులు రూ. 1.50 కోట్లు వ్యయంతో డ్రెడ్జింగ్ పనులు గత మార్చి 17వ తేదీన ప్రారంభించారు. ఓషన్ స్పార్కల్ లిమిటెడ్ కంపెనీ ఈ పనులను నిర్వహించగా ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రారంభించారు. డ్రెడ్జింగ్ యంత్రంతో ఉప్పుటేరులో ఉన్న ఇసుక మట్టిని తీసి పక్కనే వేశారు. అయితే కేవలం ఇసుకను తీయడం తప్ప గట్లు పటిష్టం చేయకపోవడంతో ఇటీవల సముద్ర ఉథృతికి డ్రెడ్జింగ్ చేసిన ప్రాంతమంతా తిరిగి ఇసుకతో మూసుకు పోవడంతోపాటు గట్లు అండలు జారి ఉప్పుటేరులో కలిసిపోవడంతో బోట్లు బయటకు తీయడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయిన పది రోజులు కూడా వినియోగించకుండానే నిరుపయోగంగా మారడంతో పనులు తూతూమంత్రంగా సాగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మట్టితో ఉప్పుటేరు మూసుకు పోవడంతో తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి బోట్లు సముద్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వెంటనే మూసుకు పోయింది బోట్లు వెళ్లడానికి వీలు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తే ఇసుక తొలగించామన్నారు. కానీ వెంటనే మూసుకు పోయింది ఇప్పుడు బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకు చేశారో తెలియడం లేదు. ఏకంగా రూ.1.50 కోట్లు వృథాగా పోయినట్లే వంకా నాగేశ్వరరావు , మత్స్యకారుడు, అమీనాబాద్. బోట్లు దెబ్బతింటున్నాయి.. డ్రెడ్జింగ్ చేశామని చెబుతున్న ప్రాంతంలో బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. వేట నిషేధం అమలులో ఉండగా బోట్లు మరమ్మతుల కోసం బయటకు తీద్దామంటే కదిలే పరిస్థితి లేదు. గతంలోనే బాగుండేది ఇప్పుడు ఉప్పుటేరు పూర్తిగా మూసుఉపోయి బోట్ల ఫ్యాన్లు విరిగిపోతున్నాయి. బోట్లు దెబ్బతింటున్నాయి. కంబాల జగన్నాధం,, మత్స్యకారుడు, అమీనాబాద్ -
నత్తనడకన పోలవరం పనులు
-
ఆగుతూ సా..గుతూ
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అడుగు ముందుకు.. రెండడుగులు వెనుకకు అన్నచందంగా తయారైంది. పనులను వేగవంతం చేయాల్సిన తరుణంలోనూ ఆగుతూ.. సా..గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల పరంగా కలిసివచ్చే ప్రస్తుత సీజన్ లోనూ అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగటం లేదు. బిల్లు చెల్లింపుల్లో జాప్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పోలవరం : పోలవరం ప్రాజెక్ట్‌కు సంబం ధించి స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు (ఎర్త్ వర్క్స్) పడకేశాయి. గతంతో పోలిస్తే రోజువారీ పనులు సగానికి పడిపోయాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా సబ్ కాంట్రాక్టర్లు పనులను నామమాత్రంగా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రధాన కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ ట్రాయ్ సంస్థ సబ్–కాంట్రాక్టర్ అయిన త్రివేణి సంస్థకు పెద్దమొత్తంలో బిల్లుల్ని బకాయిపడింది. మిగిలిన సబ్–కాంట్రాక్టర్లకు సైతం బిల్లు చెల్లింపులు చేయడం లేదు. త్రివేణి ఆధ్వర్యంలో పనులు చేస్తున్న చిన్నపాటి కాంట్రాక్టర్లకు ఆ సంస్థ సైతం బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల వల్ల నెల రోజులుగా స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు పడకేశాయి. అలా అలా.. కానిస్తున్నారు స్పిల్ వే నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులకు ఇబ్బందులు కలగకుండా మాత్రమే మట్టి తొలగింపు పనులను చేపట్టగా.. అవికూడా లక్ష్యం మేరకు సాగటం లేదు. నెల క్రితం వరకు రోజుకు 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి 1.90 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తొలగింపు చేసిన త్రివేణి సంస్థ ప్రస్తుతం రోజుకు కేవలం 90 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే పనులు చేస్తోంది. స్పిల్ చానల్ పనులు కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. బ్లాస్టింగ్లు చేసే కొన్ని సంస్థలు సైతం బకాయిలు చెల్లించకపోవటంతో పనులు వదిలి వెళ్లిపోయాయి. లక్ష్యాల్ని చేరటం కష్టమే ఈ ఏడాది ప్రస్తుత సీజ న్ (జనవరి నుంచి జూ న్ వరకు)లో ప్రాజెక్ట్ పనులు నిర్దేశించిన లక్ష్యాలను చేరటం కష్టంగా కనబడుతోంది. స్పిల్ వే నిర్మాణానికి సంబంధించి 52 బ్లాక్‌లలో కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 4 బ్లాక్‌లకు సంబంధించిన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 4 బ్లాక్‌ల పనులు జరుగుతున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబం ధించి 139 కొలను (పాండ్స్) పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 39 పనులు పూర్తయ్యాయి. 669 మీటర్ల పొడవున పనులు చేయాల్సి ఉండగా, 206 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇవి కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇక 10.80 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉండగా.. 3.60 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు పడకేశాయి. వర్షాలు లేని సమయంలో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మహా అయితే, జూ న్ నెలాఖరు వరకు ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈలోగా లక్ష్యం మేరకు మట్టి తొలగించే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల డీజిల్ లేదనే సాకుతో నాలుగు రోజులపాటు మట్టి తొలగింపు పనులను పూర్తిగా నిలిపివేసిన విషయం విదితమే. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజ న్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యే అవకాశం లేదని పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కదిలిస్తే కన్నీళ్లే!
కాటేస్తున్న కరువు రక్కసి - నీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి - ఉపాధి పనుల్లేక కూలీల వలసబాట - పశుగ్రాసం కొరతతో సంతకాలకు పశువులు - కనికరించని ప్రభుత్వం - 2015-16 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా పరిహారం అతీగతీ లేకుండా పోయింది. - 2014 కరువుకు సంబంధించి ఐదు మండలాలకు రూ.73కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉంది. - 2015 కరువుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి రూ.46 కోట్లు తక్కువ పడ్డాయి. ఫలితంగా 50వేల మంది రైతులు పరిహారానికి దూరమయ్యారు. - 2016-17లోనూ కరువు ప్రభావం తీవ్రంగా ఉంది. పంటల్లేవు.. అప్పుల భారం నాకు 5.50 ఎకరాల భూమి ఉంది. మూడు ఎకరాల్లో బోరు వేయించా. కేవలం అర ఇంచు మాత్రమే నీళ్లు పడ్డాయి. దీని కింద టమాట వేసిన. నీళ్లు సరిపోక ఎండిపోయింది. దాదాపు రూ.75 వేలు పెట్టిబడి పెట్టి వేరుశనగ సాగు చేసిన. 16 బస్తాలు వచ్చింది. పెట్టుబడిలో రూ.32వేలు మాత్రమే వచ్చింది. పశుగ్రాసం కొరత, నీటి సమస్యకు తట్టుకోలేక ఉన్న పశువులను అమ్మేసుకున్న. ప్రభుత్వం కరువు రైతును ఆదుకోకపోవడం దారుణం. - బంగారు రంగన్న, తుగ్గలి కర్నూలు(అగ్రికల్చర్): కరువు రక్కసి రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉపాధి లేకపోవడం.. తాగునీటి సమస్య.. పశుగ్రాసం కొరత.. ప్రభుత్వ చేయూత లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 7.50 లక్షల మందికి జాబ్‌కార్డులు పంపిణీ చేయగా.. 5లక్షల మంది ఉపాధి వేటలో ఉన్నారు. ఇందులో 1.50 లక్షల మందికి ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు కల్పిస్తుండగా.. మిగిలిన వారిలో అధిక శాతం వలసబాట పట్టారు. దాదాపు లక్ష మంది ఉపాధి పనుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కరువులోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. తాము సూచించిన గ్రూపులకే పనులు కల్పించాలని ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. డోన్, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో ఈ తరహా రాజకీయం సాగుతోంది. సాధారణ వర్షపాతం 609.7 మి.మీ.. కురిసింది 540.4 మి.మీ., 2016 జనవరి నెల నుండి 2017 మార్చి నెల వరకు జిల్లా సాధారణ వర్షాతం 605.7 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ ప్రకారం వర్షాలు కురిస్తే కరువు జాడ ఉండదు. అయితే 540.4 మి.మీ., వర్షపాతం నమోదయింది. గత ఏడాది జూన్, జులై, సెప్టెంబర్ నెలల్లో మినహా మిగిలిన అన్ని నెలల్లో వర్షపాతం తక్కువగానే ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల జిల్లాలో చెరువులు, కుంటలు, వాగుల్లో చుక్కనీరు లేదు. దీంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్యాపిలి, బేతంచెర్ల, కృష్ణగిరి, దేవరకొండ, సి.బెళగల్, గూడూరు మండలాల్లో 65 మీటర్లకు పైగా అడుగుకు భూగర్భ జలాలు చేరాయి. కంటతడి పెట్టిస్తున్న నీటి సమస్య జిల్లా ప్రజలు నీటి సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేయింబవళ్లు తిరిగినా నీళ్లు దొరకని పరిస్థితి. జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇందులో సగం గ్రామాల్లో 10 రోజులకు ఒక్కరోజు మాత్రమే పంచాయతీల ద్వారా నీరు ఇస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అనేక గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. పశుపోషణ రైతులకు భారంగా మారింది. జిల్లాలో 9 పశువుల సంతలు ఉండగా, జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 66 వేల పశువులు, 2.50 లక్షల గొర్రెలను విక్రయించడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. నీటి తొట్లలో నీరు కరువు అన్ని గ్రామ పంచాయతీల్లో పశువుల సంఖ్యను బట్టి ఒకటి.. అంత కంటే ఎక్కువ నీటి తొట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నీటి తొట్లకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిధులు ఇస్తారు. మూడు నెలలుగా హడావుడి చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన నీటి తొట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇదివరకే 700 గ్రామాల్లో నీటి తొట్లు ఉండగా, వీటిలో నీటిని నింపే వారు కరువయ్యారు. ప్రధానంగా కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. జూన్ నెల వరకు జిల్లాలో 35వేల టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కొరతను అధిగమించేందుకు సైలేజి గడ్డి పంపిణీ, మొలకగడ్డి పెంపకం, అజోల్ల యూనిట్ల ఏర్పాటు, బావులు, బోర్లు ఉన్న రైతులకు గడ్డి పెంపకానికి 75శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పడిపోయిన దిగుబడులు గత ఏడాది ఖరీఫ్‌లో సాధారణ సాగు 6,20,763 హెక్టార్లు ఉండగా.. 6,56,214 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీలో సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు ఉండగా.. 3,13,219 హెక్టార్లు సాగు అయింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఉత్పాదకత 22,35,214 టన్నులు సాధించాలనేది లక్ష్యం కాగా 19,52,724 టన్నులు సాధించారు. పెట్టుబడులు దక్కక నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు. -
ఆరంభంలోనే అవినీతి పర్వం
- నిబంధనలు హుష్‌కాకీ ... ఇష్టారాజ్యంగా పనులు - రూ.80 లక్షలు కాలువలపాలు - నివ్వెరపోతున్న ఆయకట్టుదారులు అమలాపురం : డెల్టా ఆధునికికీరణ పనుల ఆరంభంలోనే అవినీతి పర్వానికి తెరలేచింది. నిబంధనలకు విరుద్ధంగా కాలువ తవ్వకాలు చేపట్టి నాలుగు రాళ్లు జేబులో వేసుకునేందుకు కాంట్రాక్టర్లు యత్నిస్తుంటే అందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు ఖరారు కాక.. మరమ్మతులు జరగక అధ్వానంగా మారిన అమలాపురం– చల్లపల్లి ప్రధాన పంట కాలువ ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.80 లక్షలతో కాలువలో పూడికతీత, రిటైనింగ్‌వాల్, మూడు స్లూయిజ్‌ల నిర్మాణాలు ఈ నిధులతో చేపట్టాల్సి ఉంది. కాలువలు మూసివేసిన సుమారు పదిహేను రోజుల తరువాత గత నెల 30 నుంచి పనులు ఆరంభించారు. పనులు ఆరంభించిన తొలిరోజు నుంచే ఇక్కడ అవినీతి అంకానికి తెరలేచింది. కాలువల్లో పూడిక తొలగించేముందు నిబంధనల ప్రకారం నీరు ఉండకూడదు. తీసిన మట్టిని కెనాల్ బ్యాంక్ (కాలువగట్టు )మీద వేసి గట్టును 1:1.5 స్లోపుతో పటిష్టం చేయాల్సి ఉంది. కానీ కాలువలో అడుగున అడుగున్నర లోతున నీరు ఉండగానే ప్రొక్లెయినర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. వచ్చిన బురద, నీరుతో కలిసిన మట్టిని గట్ల మీద వేసి చేతులు దులుపుకుంటున్నారు. నీరు ఉండడం వల్ల నిబంధనల మేరకు లోతున కాలువ తవ్వుతున్నారా? లేదా? అనేది తేలియకుండా పోతోంది. పైగా బురద మట్టి వేయడం వల్ల కాలువ గట్టు పటిష్ఠంగా ఉండడం అటుంచి వచ్చే వర్షాకాలం మట్టి కాలువలోకి కొట్టుకుపోయి పూడుకుపోనుంది. ఇలా చేయకూడదని తెలిసి కూడా కాంట్రాక్టరు మూడు నాలుగు ప్రొక్లెయినర్లు పెట్టి యధేచ్ఛగా పనులు చేసుకుంటూపోతున్న తీరును చూసి రైతులు నివ్వెరపోతున్నారు. రోడ్డు విస్తర్ణ ఉందని తెలిసి కూడా... అమలాపురం ఎర్రవంతెన– నల్లవంతెనల మధ్య ఓఎన్జీసీ చేపట్టిన బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతలోనే ఆదరాబాదరగా కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. పూడిక తీసిన మట్టిన ఎన్టీఆర్ మార్గ్ వైపు వేసేందుకు వీలులేకుండా ఉండడంతో ఓఎన్జీసీ విస్తరించనున్న రోడ్డు వైపు గుట్టు మీద వేసి పట్టిష్టం చేస్తున్నట్టుగా హడావిడి చేస్తున్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరిగితే ఈ గట్టును తెంచివేయనున్నారు. కాలువల్లో ప్రొక్లెయిన్లు తిరిగే అవకాశమున్నందున పూడిక తొలగింపు చేపట్టడం వల్ల ప్రయోజనంలేకుండా పోతోంది. పనులు చేశామని బిల్లులు నొక్కేందుకు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకే పనులు చేస్తున్నామని ఇరిగేషన్ ఏఈ ఎస్.శివరామకృష్ణ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. కాలువల్లో నీరు మళ్లించేందుకు బాటలు ఏర్పాటు చేసే పనులు చేస్తున్నామని, తరువాత పక్కాగా పనులు చేస్తామని ఆయన చెప్పారు.