యుద్ధ ప్రాతిపదికన పనులు
యుద్ధ ప్రాతిపదికన పనులు
Published Sun, Sep 25 2016 5:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా
సత్తెనపల్లి: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రెండు వేల మీటర్ల రైల్వే ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా రైల్వే అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను శనివారం ఆయన స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఇక్కడ ట్రాక్ దెబ్బతినడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాటికి పనులు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా యథావిధిగా రైల్వేట్రాక్ పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌ను ఆయన సందర్శించి పరిసరాలు పరిశీలించారు. రైల్వే అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయనతోపాటు డీఆర్‌ఎం విజయశర్మ, డీఐజీ జీఎం ఈశ్వరరావు, ఆర్థిక సలహాదారు పూర్ణచర్ల, చీఫ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement