ఒడిశా బడి వద్ద విద్యార్థులతో జహంగీర్
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామ స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీ వద్ద ఒడిశా బడి ఏ ర్పాటు చేశారు. ఇక్కడి ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 50 కుటుంబాలు పనులు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో సు మారు 35 మంది ఏడేళ్లలోపు పిల్లలు ఉండటంతో బట్టీ యజ మాని జహంగీర్.. వారి కోసం ప్రత్యేకంగా ఒడిశా పాఠశాలను ఏర్పాటు చేశారు.
35 మంది పిల్లలకు ప్రాథమికస్థాయి విద్యను బోధించేందుకు ఒడిశాకు చెందిన సునీల్ అనే యువకుడిని నియమించారు. పాఠశాల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు సునీల్ ఒడిశా భాషలో అక్షరాలతో పాటు పాఠాలు నేర్పుతు న్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, బట్టీలో పనిచేస్తున్న వారి పిల్లలకు వారి భాషలోనే విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో ఈ బడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment