Labourers
-
బట్టీ వద్దే బడి..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల గ్రామ స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీ వద్ద ఒడిశా బడి ఏ ర్పాటు చేశారు. ఇక్కడి ఇటుక బట్టీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 50 కుటుంబాలు పనులు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో సు మారు 35 మంది ఏడేళ్లలోపు పిల్లలు ఉండటంతో బట్టీ యజ మాని జహంగీర్.. వారి కోసం ప్రత్యేకంగా ఒడిశా పాఠశాలను ఏర్పాటు చేశారు.35 మంది పిల్లలకు ప్రాథమికస్థాయి విద్యను బోధించేందుకు ఒడిశాకు చెందిన సునీల్ అనే యువకుడిని నియమించారు. పాఠశాల కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు సునీల్ ఒడిశా భాషలో అక్షరాలతో పాటు పాఠాలు నేర్పుతు న్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ, బట్టీలో పనిచేస్తున్న వారి పిల్లలకు వారి భాషలోనే విద్యను నేర్పించాలనే ఉద్దేశంతో ఈ బడి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
పత్తి తీతకు కూలీల కొరత
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. స్థానికంగా కూలీల కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో కూలీలు ఏటా పత్తితీత కోసం ఇక్కడకు వస్తారు. కిన్వట్ తాలుకా యేందా అనే గ్రామం నుంచే సుమారు 500 మంది కూలీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు. ఇలా మహారాష్ట్రలోని అనేక గ్రామాల నుంచి ఈ సమయంలో కూలి పనుల కోసం ఇక్కడకు వస్తారు. 40 రోజుల పాటు ఇక్కడే ఉండి పత్తి ఏరుతున్నారు. ఈ సమయంలో దంపతులిద్దరూ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తున్నట్టు కూలి పనులకు వచ్చిన గణేశ్ చెప్పాడు. పెరిగిన కూలి పత్తితీతకు కూలి పెరిగింది. గతేడాది కిలో ఏరితే రూ.7 చెల్లించేవారు. ఈ ఏడాది రూ.8కు పెంచారు. కొన్ని పరిస్థితుల్లో కూలీలు దొరకకపోతే రూ.9 కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం పత్తి పంటకు సంబంధించి మొదటి తీత మొదలైంది. పంట విస్తీర్ణం బట్టి రైతులు కూలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కో కూలీ రోజు సుమారు 60 నుంచి 70 కిలోల వరకు పత్తి ఏరుతారని జామిడికి చెందిన రైతు నాగిరెడ్డి చెప్పాడు. స్థానిక కూలీలకు రోజువారి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, మహారాష్ట్ర కూలీలకైతే వారంవారం లేనిపక్షంలో మొత్తం పని అయిపోయిన తర్వాత వారు ఊరికి వెళ్లే సమయంలో తీసుకుంటారన్నాడు. తాంసి మండలం పొన్నారి గ్రామం వద్ద ఓ రైతు రోడ్డు పక్కన నిల్చుండి ఆదిలాబాద్ నుంచి ఆటోలో రావాల్సిన కూలీల కోసం ఎదురుచూస్తున్నాడు. పత్తితీత కోసం ముందుగానే కూలీలను మాట్లాడుకున్నాడు. ఉదయం వారి కోసం ఎదురుచూస్తుండగా ఓ ఆటో ఆ గ్రామం దాటుకొని వెళుతోంది. దాంట్లో తాను మాట్లాడిన కూలీలే ఉండటంతో ఆటోను నిలిపాడు. కూలీలను ఆటో దిగి తన చేనులోకి రావాలని పిలిచాడు. అయితే ఆ కూలీలు మరో ఊరిలో కూలి డబ్బు ఎక్కువ ఇస్తున్నారని, అక్కడకు వెళుతున్నామని చెప్పారు. అంతే కూలి తానే ఇస్తానని చెప్పి వారిని ఆటో దింపి తన చేనులోకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం పత్తితీత కొనసాగుతుండగా, ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో కూలీల కోసం రైతులు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. ఆటోలను నిలిపి మరీ కూలీలను చేనులోకి తీసుకెళ్లేందుకు ఇలా పలువురు పడరాని పాట్లు పడుతున్నారు. ‘సాక్షి’బుధవారం పత్తి చేల పరిశీలనకు వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. నల్లరేగడి భూముల్లో 8 నుంచి 10 క్వింటాళ్లు, చెలక భూముల్లో 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగా స్వల్పంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల్లో మద్దతు ధరపై బెంగ నెలకొంది. నాణ్యమైన పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.7,521 ఉంది. ప్రైవేట్‌లో మాత్రం రూ.7వేల లోపే పలుకుతోంది. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించింది. ఆదిలాబాద్‌లో శుక్రవారం నుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించనుంది. అయితే పత్తిలో తేమ కారణంగా మద్దతు ధరలో కోత పెడతారన్న బెంగ ప్రస్తుతం పత్తి రైతుల్లో కనిపిస్తోంది. దీంతో గిట్టుబాటు ధర వస్తుందో.. లేదోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. -
కష్ట జీవుల కడుపు కొట్టారు!
పలమనేరు: కడుపుకాలే కష్ట జీవులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. ఉపాధిహామీ కూలీ పనుల్లోనూ పక్షపాతం చూపిస్తోంది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేశారన్న కారణంతో పనులివ్వకుండా ఉపాధి అధికారులే వేధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జాబ్‌కార్డున్న కూలీలను కూడా పక్కన బెట్టారు. అయ్యా మాకు ఉపాధి పనులు కల్పించండి అంటూ వేలాది మంది కూలీలు మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు బతిమలాడినా పనులు ఇవ్వడం లేదు. మరోవైపు చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లో సగానికిపైగా ఉపాధి ఫీల్ట్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలిగించారు. తాము తప్పు చేయకున్నా విధుల్లో నుంచి ఎందుకు తొలగించారని, మా జీవనోపాధిని దెబ్బతీయవద్దని ఫీల్డ్ అసిస్టెంట్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమకు న్యాయం కావాలంటూ పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు, జాబ్‌కార్డులున్న కూలీలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. విన్నవించినా ఫలితం లేదు ఉపాధి పనులు చేసుకునే తమకు రాజకీయాలతో సంబంధం లేదని, జాబ్‌కార్డులున్న తమకు పని కల్పించాలంటూ కూలీలు ఇప్పటికే మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ దాకా వినతిపత్రాలిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేసినా వారికి ఉపాధి పనులు కల్పించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా ప్రాంతాల నేతల హెచ్చరికలతో ఈజీఎస్ ఏపీవోలు, ఏపీడీలు నడుచుకుంటున్నారు. దీంతో జాబ్‌కార్డున్న కూలీలకు పనులు లేకుండా పోయాయి. ఈ విషయమై కుప్పం ఏపీడీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. బైరెడ్డిపల్లి ఏపీవో హరినాథ్ మాట్లాడుతూ.. తాము స్వతంత్రంగా ఏమీ చేసేందుకు వీలు కాదన్నారు. 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఔట్పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో 132 మంది ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేవారు. వీరిలో 60 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం రాగానే విధుల నుంచి తొలగించింది. కూటమి నేతల ఆదేశాలతో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే వారిని తొలగించేశారు. వారి స్థానంలో అధికారపా ర్టీకి అనుకూలమైన వారిని పెట్టుకున్నారు. వీరు ఉపాధి పనుల్లో జేసీబీలు పెట్టి పనులు చేసి, బినామీ కూలీల పేరిట బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీరికి సంబంధిత ఏపీవోల సాయం ఉందని సమాచారం.30 వేల మంది కూలీలకు పనులు ఇవ్వని వైనంపలమనేరు రెవెన్యూ డివిజన్లో పుంగనూరు, కుప్పం క్లస్టర్ లైవ్లీహుడ్ రిసోర్స్ సెంటర్ (సీఎల్ఆర్సీ)లు ఉన్నాయి. పుంగనూరు క్లస్టర్లో పుంగనూరు, పెద్దపంజాణి, పలమనేరు, గంగవరం, చౌడేపల్లి, బంగారుపాళెం మండలాలున్నాయి. కుప్పం క్లస్టర్లో కుప్పం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం, వి కోట, బైరెడ్డిపల్లి మండలాలున్నాయి. ఈ రెండు క్లస్టర్లలో మొత్తం 132 పంచాయతీలకు కలిపి ఉపాధి జాబ్‌కార్డులు మొత్తం 216,603 మందికి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 70,630 మంది పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈజీఎస్‌లో ఫాంపడ్స్, ఫిష్ పాండ్స్, ఫీడర్ ఛానెల్స్, హార్టీకల్చర్ ప్లాంటేషన్స్, క్యాటిల్ పాండ్స్, రోడ్డు పనులు, ట్రెంచిలు, చెక్‌డ్యాం పనులు జరుగుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో పనులు చేసిన 30 వేల మంది దాకా ఉపాధి కూలీలకు ఇప్పటి ప్రభుత్వంలో పనులు ఇవ్వలేదు. దీంతో పనుల్లేక ఉపాధి కరువై కుటుంబ జీవనానికి ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా వైఎస్సార్సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారనే అక్కసుతో ఆయా మండలాల కూటమి నేతల సిఫారసులతో సంబంధిత ఏపీవోలు వీరికి ఉపాధి పనులు ఇవ్వకుండా వారి కడుపు కొడుతున్నారు.ఉపాధి పనులు ఇవ్వరంట.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు ఉపాధి పనులు ఇవ్వలేదు. ఏమిసార్ అని అడిగితే మీరంతా వైఎస్సార్సీపీకి ఓటేశారంటగా అంటున్నారు. మాకు రాజకీయాలు ఏంటికి సార్. కూలి పనులు చేసుకొని బతికేటోళ్లం. రెండునెలలుగా పనులు లేక ఖాళీగా ఉన్నాం. ఎక్కడ ఏ పనిచి్చనా కష్టపడి చేసుకుంటాం. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఓ.నాగప్ప, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లాపనులివ్వకపోవడం న్యాయమేనా? ఉపాధి పనులకు చేసుకుంటూ మా కుటుంబానికి అండగా ఉంటున్నా. ఈ మధ్య మాకు పనులివ్వడం లేదు. మాలాంటి కూలీలకు రాజకీయాలకు ఏంటి సంబంధం. మేము కష్టపడి కూలి పనిచేస్తేనే కదా డబ్బులు వచ్చేది. అలాంటిది మాకు పనులివ్వకుంటే ఎలా.. ఇది న్యాయమేనా? నాయకులు మాట కాదుగానీ అధికారులైనా ఆలోచించాల. – రాజేష్, ఉపాధి కూలి, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా నిష్కారణంగా విధుల్లోంచి తొలగించేశారు నేను ఫీల్డ్ అసిస్టెంట్‌గా మా పంచాయతీలో పనిచేస్తున్నా. కూటమి ప్రభుత్వం రాగానే నిష్కారణంగా నన్ను విధులనుంచి తీసేశారు. ఇదేంటి సార్ అంటే కూటమి నేతలు నిన్ను తీసేయమన్నారు ఏమన్నా ఉంటే వారితో మాట్లాడుకోమని చెబుతున్నారు. ఇదేమి న్యాయం. – సుబ్రమణ్యం, ఫీల్డ్ అసిస్టెంట్, జీసీపల్లి, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు జిల్లా -
బెంగాలీ కూలీలకు అస్వస్థత
కరప: బతుకుదెరువు కోసం కాకినాడ జిల్లాకు వచ్చిన 12మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా కరప ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం యండమూరు శివారు వడ్డిపాలెంలో జంపన కిరణ్‌రాజు, మరో ఇద్దరు యజమానులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 12మంది కూలీలు షేక్ సలీం, అజీద్, నియోరుద్దీన్, అమనుల్లా, ఫారూక్, కలిపటి ముండ్, ఫ్రాడాస్, సాంతూల్, ఫైజప్, అన్వర్, సలుద్దీన్, మీనుదీన్ వచ్చారు. వారంతా రెండు వారాలుగా చెరువుల వద్దే ఉంటూ పని చేస్తున్నారు. పెద్ద డ్రమ్ముల్లో మంచి నీరు నిల్వ చేసుకుని, వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కూలీలు శనివారం ఉదయం డ్రమ్ములో ఉంచిన నీటిని తాగడంతో వాంతులయ్యాయి. దీనిపై చెరువుల వద్ద పని చేస్తున్న గుమస్తా వెంటనే యజమాని కిరణ్రాజుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఆరా తీయగా, గడ్డి మందు కలిపిన డ్రమ్ములోని నీటిని తాగినట్టు కూలీలు తెలిపారు. గడ్డి మందు కలిపిన డ్రమ్ము నీరు లేకుండా ఖాళీగా ఉంది. దీనిపై ప్రశ్నించగా, ఆ నీటిని పారబోసి కడిగేశామని కూలీలు తెలిపారు. వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైన కూలీలందరినీ వెంటనే చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరికి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కిరణ్‌రాజు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ వడ్డిపాలెంలోని చెరువుల వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బెంగాలీ కూలీలు నెల రోజులు పని చేయడానికి వచ్చారని, మధ్యలో పని మానేసి వెళ్లిపోవడానికి ఇటువంటి ఎత్తుగడలు వేస్తుంటారని, గతంలో కాండ్రేగుల చెరువుల వద్ద కూడా ఇలాగే జరిగిందని కిరణ్‌రాజు వివరించారు. నిజంగా గడ్డిమందు కలిపిన నీరు తాగారా, విష ప్రభావం ఏమైనా ఉందా.. అని తేల్చేందుకు కూలీలకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. -
తాపీ మేస్త్రిగా మారిన రాహుల్ గాంధీ
-
పిడుగుపాటుకు ఐదుగురు బలి
సాక్షి, నెట్వర్క్: పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 20 మూగజీవాలు సైతం బలయ్యాయి. నారాయణపేట జిల్లా విఠలపురం గ్రామానికి చెందిన ఆశన్న (58) పత్తి విత్తనాలు విత్తేందుకు కుటుంబసభ్యులను, కూలీలతో పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో అందరూ సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఆశన్నతో పాటు వ్యవసాయ కూలీ కౌసల్య (54) అక్కడికక్కడే మృతిచెందారు. ఆశన్న భార్య సైదులమ్మ, మనవరాలు శ్రావణికి స్వల్పగాయాలయ్యాయి. ఇంటికొస్తూ.. చెట్టుకిందకు వెళ్లి.. మెదక్ జిల్లా చిటు్కల్ గ్రామానికి చెందిన బోయిని నర్సమ్మ (52), భర్త ఎల్లయ్యతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తోంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూ డిన వర్షంతోపాటు, ఒక్కసారిగా పిడుగుపడి నర్స మ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో ఎల్లయ్య భోరున విలపించాడు. ఇదే జిల్లా రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సిద్ధిరాములు (55), రాధమ్మ దంపతులు గురువారం రాత్రి పొలంలో వరి విత్తనాలు తూకం పోస్తున్న క్రమంలో వర్షం పడింది. దంపతులు చెట్టు కిందకి వెళ్లగా, అదే సమయంలో పిడుగుపడింది. సిద్ధిరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. అస్వస్థతకు గురైన రాధమ్మను ఆస్పత్రికి తరలించారు. గొర్రెలను మేపేందుకు వెళ్లి.. కామారెడ్డి జిల్లా గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి (22) శుక్రవారం గొర్రెలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో పిడుగుపడి మృతిచెందాడు. గొర్రెలు ఇంటికి వచ్చినా కృష్ణమూర్తి రాకపోయేసరికి బంధువులు అడవిలోకి వెళ్లి గాలించగా అతడి మృతదేహం కనిపించింది. మూగజీవాల మృత్యుఘోష ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పిడుగుపాటుకు గురై పెద్దసంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్ జిల్లా కుస్మసముద్రం, లింగాన్‌పల్లి గ్రామాల్లో 7 పాడిగేదెలు, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 4 మేకలు, 4 గొర్రెలు, సంకటోనిపల్లిలో 2, సంగెం, ఆగిర్యాల్, గౌరారంలో ఒక్కోటి చొప్పున పాడిఆవులు మృతిచెందాయి. జీవనోపాధిని కోల్పోయామని బాధిత రైతులు వాపోయారు. మేత మేస్తూ.. మృత్యువాత విద్యుదాఘాతానికి 11 మూగజీవాలు బలి చిన్నగూడూరు: విద్యుదాఘాతంతో పదకొండు పశువులు మృతిచెందాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో గురువారం రాత్రి కురిసిన గాలివానకు పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి పడిపోయాయి. శుక్రవారం పశువులు పొలాల్లో మేత మేస్తూ తెగిన తీగలను తాకడంతో మండలంలోని మంగోరిగూడెంలో 7 ఎడ్లు, ఒక ఆవు, మేఘ్యాతండాలో 3 ఎడ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో యజమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు కోరారు. -
సీఎం జగన్ చిత్రపటానికి రాజధాని ప్రాంత రైతు కూలీల క్షీరాభిషేకం
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్‌ను సీఎం జగన్ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి, నిడమర్రులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ రూ.5 వేల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయారైన పరిస్థితులను చూశామన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పాటు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలేకపోయాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు. -
ఎవరికీ పట్టని ప్రాణాలు
జానెడు పొట్ట కోసం ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి దూరతీరాలకు పోయి కాయకష్టం చేసే వారు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు. మహానగరాల్లో రాళ్లెత్తే కూలీలుగా, క్వారీల్లో గనుల్లో చెమటోడ్చే కార్మికులుగా, భారీ భవంతులకు కాపలాదార్లుగా, స్థానికులు చేయసాహసించని అనేక ప్రమాదకరమైన పనులను తప్పనిసరిగా తలకెత్తుకుని ప్రాణాలు పణంగా పెట్టే బడుగుజీవులుగా వీరు అందరికీ సుపరిచితులే. కానీ భద్రత, ఆరోగ్యం వంటివి వీరికెప్పుడూ ఆమడదూరమే. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా అర్ధాకలితో కాలం గడిపే అలాంటి అభాగ్యులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) విడుదల చేసిన నివేదిక దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడించింది. పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని, వ్యాధుల బారినపడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 30 లక్షలమంది కన్నుమూస్తున్నారని ఆ నివేదిక అంచనా. కార్మికుల ఉసురుతీస్తున్న పది రకాల కారణాలను ఆ నివేదిక గుర్తించింది. సుదీర్ఘమైన పనిగంటలు (వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ) కార్మికుల మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని, ఆ కేటగిరీలో ఏటా మరణిస్తున్నవారు 7,44,924 మంది అని తేల్చింది. ఆ తర్వాత స్థానం సూక్ష్మ ధూళి కణాలు, పొగలు, వాయువులది. వాటి బారినపడి మర ణించేవారు ఏటా 4,50,381 మంది అని లెక్కేసింది. ఇవిగాక నికెల్, ఆర్సెనిక్, డీజిల్ కాలుష్యం, సిలికా, ఆస్బెస్టాస్ తదితరాల వల్ల మరో 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో 63 శాతం ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల్లోనే వుంటున్నాయని వివరించింది. వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణరంగం వగైరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభ మైన నాలుగురోజుల సదస్సు సందర్భంగా ఐఎల్ఓ ఈ నివేదిక వెలువరించింది. మనవరకూ తీసుకుంటే జనాభాలో మూడోవంతు మంది వలసబాట పడుతున్నారు. వీరంతా పల్లెటూళ్లను వదిలి పట్టణాలకూ, నగరాలకూ వలసపోయేవారే. ఇలాంటివారు ఎలాంటి గుర్తింపూ లేకుండా బతుకులీడుస్తున్నారు. వారికి ఓటు హక్కుండదు. రేషన్ కార్డు వుండదు గనుక చవగ్గా సరుకులు లభించవు. స్థానికతకు అవకాశం లేదు గనుక వారి హక్కుల కోసం, పని పరిస్థితుల మెరుగు కోసం పోరాడే సంస్థలుండవు. అసంఘటిత రంగ కార్మికులుగా కనీసం చట్టప్రకారం దక్కాల్సినవి వారికి ఎప్పుడూ దూరమే. జ్వరమో, మరే వ్యాధో ముంచుకొచ్చినా చూసే దిక్కుండదు. ఇలాంటి అభాగ్యులకు కుటుంబాలుంటే ఈ కష్టాలన్నీ మరిన్ని రెట్లు ఎక్కువ. ఈ కార్మికుల కాంట్రాక్టర్లు సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీ ఛత్రఛాయలో వుంటారు గనుక అధికారులు వారి జోలికి పోవటానికి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికి సాహసించరు. మెరుగైన సాంకేతికత లున్న యంత్ర సామగ్రి లభ్యమవుతున్నా వాటిపై పెట్టుబడులు పెట్టడం దండగన్న భావనతో ఈ కార్మికులతోనే అన్నీ చేయిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవటం లేదా అంగవికలురు కావటం రివాజు. ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై ఏటా 3,63,283 మంది కార్మికులు మరణిస్తున్నారని ఐఎల్ఓ నివేదిక చెబుతోంది. మన దేశంలో 2017–2020 మధ్య సగటున రోజూ ముగ్గురు కార్మికులు ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. ఇవన్నీ రిజిస్టరయిన ఫ్యాక్టరీలకు సంబంధించినవి. అసంఘటిత రంగంలో సంభవించే మరణాలకు అరకొర డేటాయే వుంటుంది. సాధారణంగా ఆ రంగంలో సంభ వించే చాలా మరణాలు సహజ మరణాల ఖాతాలోకి పోతుంటాయి. వైద్యులు కూడా వారికి సహకరిస్తుంటారు. అసంఘటిత రంగ కార్మికులు చేసే వెట్టిచాకిరీ అపారమైన సంపద సృష్టిస్తోంది. కానీ ఆ సంపద సృష్టికర్తలు అనామకులుగా మిగిలిపోతున్నారు. ముగిసిపోతున్నారు. అంతర్జాతీయంగా నిబంధనలు లేవని కాదు. పని పరిస్థితుల్లో భద్రత, ఆరోగ్యం వంటి అంశా లపై ఐఎల్ఓ రూపొందించిన అంతర్జాతీయ ఒడంబడికను 187 సభ్య దేశాల్లో కేవలం 79 దేశాలు ఆమోదించాయి. కనీసం అందుకు సంబంధించిన నియమ నిబంధనలకైనా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపలేదు. అందుకు కేవలం 62 దేశాలు మాత్రమే సమ్మతించాయి. ఈ రెండు ఒడంబడి కలకూ మన దేశం ఆమడ దూరంలో వుంది. వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటో, అందులో పొంచివుండే ప్రమాదాలేమిటో బయటివారికన్నా కార్మికులకే ఎక్కువ తెలుస్తుంది. కనీసం అవి బయటివారు తెలుసుకోవటానికైనా కార్మికులకు సంఘాలుండాలి. వారి తరఫున గట్టిగా ప్రశ్నించే నేతలుండాలి. కానీ మన దేశం వరకూ చూస్తే కార్మిక సంస్కరణల పేరిట తీసుకొచ్చిన కొత్త చట్టాలు అలాంటి అవకాశాలను మరింత నీరుగార్చాయి. ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, వివక్ష, అధిక పనిగంటలు వంటివన్నీ అసంఘటిత రంగ కార్మికులకు శాపాలవుతున్నాయి. రిజిస్టరైన ఫ్యాక్టరీల్లోనే తప్పుడు లెక్కలు చూపించి కార్మికుల భద్రతకు సంబంధించిన కమిటీల ఏర్పాటు,లైంగిక వివక్ష నిర్మూలన తదితరాలను ఎగ్గొడుతున్నారు. ఇక ఎవరికీ పట్టని అసంఘటితరంగ కార్మికుల గురించి చెప్పేదేముంది? సిడ్నీలో సాగుతున్న సదస్సులో 127 దేశాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. 30 గోష్ఠులు, ఆరు సాంకేతిక సదస్సులు కూడా వుంటాయంటున్నారు. కనీసం ఈ సదస్సు తర్వాతనైనా కార్మికుల భద్రతకు ముప్పుగా పరిణమించిన సమస్యలను నివారించటానికి పకడ్బందీ విధానాలు రూపొందించటం తమ బాధ్యతగా ప్రభు త్వాలు గుర్తించాలి. -
ప్యాకేజీ కవర్ల పరిశ్రమలో భారీ పేలుడు
షాద్‌నగర్: ఆహారాన్ని ప్యాక్ చేసే సిల్వర్ కవర్లను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా.. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారేనని తెలిసింది. పరిమితికి మించిన వేడితో.. షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కాశిరెడ్డిగూడ శివారులో బ్లెండ్ కలర్ పరిశ్రమ ఉంది. ఇందులో ఫుడ్ ప్యాకేజీకి సంబంధించిన సిల్వర్ కవర్లను తయారు చేస్తారు. ఇందుకోసం మెటాలిక్ పొడిని వినియోగిస్తారు. కార్మికులు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జాజిపతుర, పూర్ణాసింగ్, మందిరి,రాజుసాన్, మంజుదాస్, ప్రదీప్మాన్, సత్య, గిరిధర్‌సింగ్, రాహుల్ఘడ్, సునీల్ ఎంకీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకున్నారు. పేలుడు షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీలో కలర్ తయారు చేసే క్రమంలో వాడే మెటాలిక్ పొడి పరిమితికి మించి వేడి (ఓవర్ హీట్) కావడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. -
ఉదయం అర్చకత్వం ఆ తర్వాత కాయకష్టం..
సాక్షి, హైదరాబాద్: అంతగా ఆదాయం లేని చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రారంభించిన ధూపదీపనైవేద్య పథకం గందరగోళంగా మారింది. దేవాల యంలో పూజాదికాలకు కావాల్సిన వస్తువులు(పడితరం) కొనేందుకు రూ.2 వేలు, ఆలయ అర్చకుడి కుటుంబ పోషణకు రూ.4 వేలు.. వెరసి రూ.6 వేలు ప్రతినెలా చెల్లించాల్సి ఉండగా, నిధుల లేమి సాకుతో ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేయటం లేదు. పెద్ద దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందుతున్నాయి. ఆ దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసేసుకుంటోంది. కానీ చిన్న దేవాలయాలకు అంతగా ఆదాయం లేకపోవటంతో ధూప దీప నైవేద్య పథకం నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతేడాది కొన్ని నెలల పాటు వేతనం ఇవ్వక, ఆ దేవాలయాలు, వాటి అర్చకుల కుటుంబాలను ఆగమాగం చేసి న అధికారులు ఆ తర్వాత ఎట్టకేలకు కొద్ది నెలలు సక్రమంగానే విడుదల చేశారు. మళ్లీ డిసెంబరు నుంచి నిధులు విడుదల చేయటం లేదు. నాలుగు నెలలు వరసగా ఆగిపోగా, గత నెల ఒక నెల మొత్తం విడుదల చేశారు. మిగతావి అలాగే పెండింగులో ఉన్నాయి. ఆటో తోలుతున్న ఈ వ్యక్తి పేరు పురాణం దివాకర శర్మ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన స్థానిక శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయ అర్చకులు. ధూప దీప నైవేద్య పథకం కింద ఆయన ఈ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. కానీ ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నాలుగు నెలలుగా స్తంభించిన ఆ మొత్తంలో అతి కష్టమ్మీద ఒక నెల వేతనం మాత్రమే తాజాగా విడుదలైంది. గతేడాది కూడా ఇలాగే కొన్ని నెలలు నిలిచిపోయింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉదయం దేవాలయం మూసేసిన తర్వాత ఇదిగో ఇలా అద్దె ఆటో తీసుకుని నడుపుకొంటున్నారు. ఒక్కో సారి రాత్రి దేవాలయం మూసేసిన తర్వాత గ్రామీణులకు కోలాటంలో శిక్షణ ఇస్తూ వారిచ్చిన ఫీజు తీసుకుని రోజులు గడుపుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ హయాంలో పథకం ప్రారంభం మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆదాయం లేని దేవాలయాల్లో నిత్య పూజలకు ఆటంకం కలగొద్దన్న సదాశయంతో 2007లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్చకులకు గౌరవ వేతనం రూ 1500, పూజా సామగ్రికి రూ.1000 చొప్పున విడుదల చేసేవారు. 1750 దేవాలయాల్లో ఈ పథకం అమలవుతుండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2018లో 3645 ఆలయాలకు విస్తరింపజేస్తూ చెల్లించే మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. దేవాలయాల సంఖ్య, వేతన మొత్తం పెరిగినా.. నిధుల విడుదల మాత్రం సక్రమంగా లేకపోవడంతో సమస్యలు ఎదురువుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు సంబంధించి ప్రతినెలా రూ. 2,18,70000 మొత్తం విడుదల కావాల్సి ఉండగా, నిధుల సమస్య పేరుతో ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని దేవాదాయ శాఖకు అందించటం లేదు. ఎన్ని ఇబ్బందులో.. ఓ దేవాలయ నిర్వహణకు నెలకు రూ.2 వేల నిధులు ఏమాత్రం సరిపోవటం లేదు. ఇక పూజారి కుటుంబ పోషణకు రూ.4 వేలు కూడా చాలటం లేదు. అయినా సరిపుచ్చుకుందామంటే ఆ నిధులు క్రమం తప్పకుండా అందటం లేదు. ధూపదీపనైవేద్యం అర్చకుల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. వీరు పూర్తిగా ఆలయంపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో ఆలయానికి దాతలు అడపాదడపా ఇచ్చే సాయం కూడా ప్రస్తుతం తగ్గిపోయిందనేది అర్చకుల మాట. దీంతో గత్యంతరం లేక చాలా మంది అర్చకులు ఇతర పనులు చేసుకుంటున్నారు. కొందరు ఆటో నడుపుతుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులు, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. కూలీ పనులకు వెళ్తున్నాం ‘‘నేను కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గావ్ ఆలయంలో ధూపదీపనైవేద్య పథకం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఆ రూపంలో రావాల్సిన గౌరవ వేతనం సరిగా రావటం లేదు. ఆ వచ్చే మొత్తం కూడా కుటుంబ పోషణకు సరిపోక నా భార్యతో కలిసి మిగతా సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు, ఇతరుల పొలాల్లో పనులకు కూలీలుగా వెళ్తున్నాం.’’ – సంగాయప్ప అర్చకుడు నిధులు పెంచాలి, క్రమం తప్పకుండా ఇవ్వాలి ‘‘గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నిత్య పూజలు చేస్తూ పూజాదికాల్లో ఉంటున్న ధూపదీపనైవేద్య పథకం అర్చకుల పరిస్థితి దారు ణంగా మారింది. ఆ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధరల పట్టికను అనుసరించి పెంచాల్సి ఉంది. ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి’’ – వాసుదేవ శర్మ,ధూపదీపనైవేద్య పథకం అర్చకుల రాష్ట్ర అధ్యక్షులు -
నల్గొండలో కూలీల మధ్య ఘర్షణ
-
శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా కోటి రూపాయాలు విలువ చేసే నిధి బయటపడింది. ఐతే ఆ నిధిని సదరు ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలే పంచుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ధార్ సమపంలోని నల్చా దర్వాజా చిట్నీస్ చౌక్‌లోని ఇంట్లో ఎనిమిది మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు ఆ ఇంటిలో పని నిమిత్తం తవ్వకాలు జరుపుతుండగా ఒక గోడ నుంచి కోటీరూపాయల పైనే విలువ చేసే నిధి బయటపడింది. ఆ నిధిలో సుమారు 103 పురాతన నాణేలు, పాత బంగారు ఆభరణాలను సదరు కార్మికులు పంచుకున్నారు. ఐతే అందులో ఒక కార్మికుడు తన వాటా నిధిలోని బంగారు నాణాలను ఉపయోగించి తన అప్పులను తీర్చకోవడమే కాకుండా బైక్‌ని కొనుగోలు చేయండం వంటివి చేశాడు. దీంతో పోలీసులు అనుమానించి ఆ కార్మికుడుని విచారించగా అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ఆ ఇల్లు శివనారాయణ రాథోడ్‌కి చెందినది. అతని ఇల్లు రెండు భాగాలు నిర్మించబడి ఉంది. అందులో ఒక భాగంలో సదరు యజమాని కుటుంబం ఉంటుంది. మరోక భాగంలో ఇంటి పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ఇంటిలోనే ఈ నిధి బయటపడింది. కానీ వారు ఈ విషయాన్ని యజమానికి చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో పోలీసులు సదరు కూలీల నుంచి ఆ నిధిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి) -
సంతాయిపేట వద్ద వాగు అవతల చిక్కుకున్న రైతులు సురక్షితం
-
తప్పిన పెనుప్రమాదం
కరీంనగర్ (మానకొండూర్): మహిళా కూలీలు వరదలో కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని అర్కండ్ల లోలెవల్ వంతెనపై సాయంత్రం జరిగింది. వివరాలు.. మండలంలోని అర్కండ్ల రైతుల వ్యవసాయ భూములు గ్రామానికి అవతలి వైపు ఉన్నాయి. మంగళవారం ఉదయం లోలెవల్ వంతెనపై నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో వరినాట్లు వేసేందుకు మహిళలు వంతెనమీదుగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వెళ్లారు. సాయంత్రం నీటి ప్రవాహం పెరిగింది. గమనించని మహిళలు తిరిగి వస్తున్న క్రమంలో కొంత మంది బ్రిడ్జి దాటగా.. నేదురు సారమ్మ, నేదురు ఐలమ్మ, ఇజ్జిగిరి వనమ్మ, ఇజ్జిగిరి భాగ్యమ్మ, ఇజ్జిగిరి మొగిళి వాగులో నీటి ప్రమావాహంలో కొట్టుకుపోయారు. మిగతా కూలీలు కేకలు వేయడంతో పొలం పనులు ముగించి ఇంటికి వస్తున్న రైతులు, గ్రామస్తులు వెంటనే వరదలో కొట్టుకుపోతున్న ఐదుగురిని కాపాడి గట్టుకు చేర్చారు. అందరూ ప్రాణాలతో బయట పడడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. గట్టుకు చేరిన తర్వాత బాధితులు చచ్చి బతికామంటూ రోదించారు. -
కాలి నడకన ఇళ్లకు.. 18 మంది మిస్సింగ్! ఒకరు మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో భారత్-చైనా సరిహద్దు సమీపంలో 19 మంది కార్మికులు అదృశ్యమయ్యారు. వీరిలో ఓ కార్మికుడు విగతజీవుడై కనిపించాడు. వీరంతా ఈనెల 5వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి కనిపించకుండాపోయారు. అదృశ్యమైన కార్మికులు అసోం రాష్ట్రానికి చెందినవారు. కార్మికులు కనిపించకుండా పోయి 14 రోజులైంది. ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద ఒక మృతదేహం కనిపించింది. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారీ నిర్మాణాలను చేపడుతుంది. ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన డామిన్ సర్కిల్లో రహదారి పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలు పనికి వచ్చారు. అయితే ఈద్ జరుపుకోవడానికి తమకు సెలవు ఇవ్వాలని కార్మికులు కాంట్రాక్టర్ బెంగియా బడోను వేడుకున్నారు. కానీ కాంట్రాక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో కార్మికులు కాలినడకన ఇళ్లకు వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కురుంగ్ కుమే జిల్లాలోని దట్టమైన అడవిలో కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆ 18 మంది ఎక్కడ ఉన్నారనే విషయమై ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. కూలీలంతా డామిన్ నదిలో మునిగిపోయారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వీరి ఆచూకీని కనిపెట్టేందుకు ఓ రెస్క్యూ టీం పనిచేస్తుందని పోలీసులు వెల్లడించారు. చదవండి: డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్! -
మట్టి పనికిపోతే.. బస్సు మృత్యువై వచ్చింది
సాక్షి, యాదాద్రి: వారంతా కూలీలు.. జాతీయ రహదారి మధ్యలోని మీడియన్పై మట్టిపని చేస్తు న్నారు.. వాహనాలకు సూచికగా రోడ్డుపై బారికేడ్లు పెట్టారు.. ఓ మహిళాకూలీ హెచ్చరికగా ఎర్రజెండా పట్టుకుని కూడా నిలబడింది.. అంతా మరో గంట లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరే వారే. అంతలోనే వారిని ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీపనికని వచ్చి.. ఆలేరు వద్ద జాతీయ రహదారిపై మీడియన్‌లో మొక్కలు నాటేందుకు వీలుగా మట్టిని తొలగించే పని ఇటీవల ప్రారంభమైంది. ఆదివారం ఉదయం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన ఎనిమిది మంది కూలీలు అదే ప్రాంతానికి చెందిన ఊరెళ్లి శ్యామ్ ఆటోలో పనికి వచ్చారు. శ్యామ్ భార్య లావణ్య కూడా కూలిపనికి వచ్చింది. సాయంత్రం వీరందరినీ తిరిగి రాయగిరికి తీసుకెళ్లేందుకు శ్యామ్ అక్కడికి వచ్చాడు. సుమారు 4 గంటల సమయంలో వరంగల్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు (ఏపీ 36 జెడ్ 0275) కూలీలపైకి దూసుకొచ్చింది. ఎర్ర జెండా హెచ్చరికను దాటి.. రోడ్డు పక్కన పని జరిగే ప్రాంతంలో ఎర్రజెండా ఊపుతూ నిలబడిన అంకర్ల లక్ష్మిని తొలుత బస్సు ఢీకొట్టింది. తర్వాత కవిత, లావణ్య, శ్యామ్‌లపైకి దూసుకెళ్లింది. లక్ష్మి (37) అక్కడికక్కడే చనిపోగా.. కవిత, లావణ్య తీవ్రగాయాలతో ఎగిరిపడ్డారు. శ్యామ్(32) బస్సు కింద ఇరుక్కోగా 200 మీటర్ల దూరం లాక్కెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. లావణ్య(27), కవిత(32) ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఘటనాస్థలంలో రోదిస్తున్న మృతుల బంధువులు ట్రాక్టర్‌ను, జేసీబీని ఢీకొని.. మితిమీరిన వేగంతో కూలీలపై నుంచి దూసుకుపోయిన బస్సు.. రోడ్డుపక్క మట్టి నింపుకొంటున్న ట్రాక్టర్‌ను, దాని తర్వాత ఉన్న జేసీబీని ఢీకొట్టి ఆగిపోయింది. ఆ ధాటికి ట్రాక్టర్ తిరగబడింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నా రు. వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, చనిపోయిన కూలీలకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువులు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసులు సైమన్‌పై కేసు నమోదు చేశారు. దంపతులు.. తోడి కోడళ్లు.. రోడ్డుప్రమాదంలో మృతిచెందిన నలుగురిలో ఆటోడ్రైవర్ ఊరెళ్లి శ్యామ్, లావణ్య దంపతులు. మరో ఇద్దరు అంకర్ల లక్ష్మి, అంకర్ల కవిత ఇద్దరూ తోడి కోడళ్లు. 3 కుటుంబాల్లోనూ చిన్న పిల్లలున్నారు. దంపతులైన లావణ్య, ఊరెళ్ల శ్యాం మృతిచెందడం తో వీరిద్దరి పిల్లలు అనాథలుగా మిగిలారు. వీరికి సొంత ఇళ్లు లేదు. పిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు. మంత్రి దిగ్భ్రాంతి.. ఎమ్మెల్యేల పరామర్శ ప్రమాద ఘటనపై రవాణామంత్రి పువ్వాడ అజయ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదే శించారు. బాధితులను ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే లు సునీతామహేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పరామర్శించారు. బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది వరంగల్ వైపు నుంచి బస్సు వేగంగా వచ్చి నలుగురిని ఢీకొట్టింది. నేను ట్రాక్టర్ నడుపుతున్నా. బ స్సు ముందు ఎర్రజెండా చూపుతున్న మహిళను.. ఆపై మరో ఇద్దరిని ఢీకొట్టింది. అదే వేగంతో శ్యాంను ఢీకొట్టింది. 15 రోజులుగా ఎర్రజెండా పాతి పని చేస్తున్నాం. కానీ, ఈ రోజిలా జరిగింది. –స్వామి, ట్రాక్టర్ డ్రైవర్ ప్రత్యక్ష సాక్షి -
RBI Report: శ్రమజీవికి సంతోషం.. ఏపీలో కూలీల వేతనాలు పెరుగుదల..
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర, నిర్మాణ రంగ కూలీల వేతనాలు పెరిగాయి. ఉద్యాన కూలీల వేతనాల్లోనూ ఈ పెంపు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, దేశంలో గ్రామీణ వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీల వేతనాలు కేరళలో అత్యధికంగా ఉంటే అత్యల్పంగా గుజరాత్లో ఉండటం గమనార్హం. చదవండి: ఎగసిన ఎగుమతులు.. ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు ఇక రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.300లోపే ఉంటే 2019–20 నుంచి ఇది రూ.300 దాటింది. అలాగే, వ్యవసాయేతర కూలీల రోజు వారీ వేతనం కూడా చంద్రబాబు హయాంలో రూ.300లోపే ఉంటే 2020–21లో ఆ మొత్తం దాటింది. జాతీయ స్థాయి కూలీల సగటు వేతనం కన్నా రాష్ట్రంలోని కూలీల వేతనం ఎక్కువగా ఉంది. అలాగే, జాతీయ స్థాయి విషయానికొస్తే 2019–20లో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.287.1లు ఉంటే రాష్ట్రంలో అది రూ.302.6గా ఉంది. అలాగే, 2020–21లో జాతీయ స్థాయిలో కూలీల రోజువారీ సగటు వేతనం రూ.309.9 ఉంటే.. రాష్ట్రంలో రూ.318.6లు గా ఉంది. -
ఒడిశా కూలీలు మృతి.. సీఎం జగన్ మానవతా దృక్పథం
సాక్షి, గుంటూరు: రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీల మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మావనతా దృక్పథంతో స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. బతుకు తెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలని సీఎం తెలిపారు. రొయ్యల చెరువు యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పగలంతా కాయకష్టం చేసి ఆదమరిచి నిద్రిస్తున్న ఆరుగురు యువకులు నిశిరాత్రి వేళ అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం నుంచి మరో నలుగురు తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా మకాం ఉంటున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు. రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ షెడ్లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. -
విషాదం: బావిలో దిగి ఊపిరాడక నలుగురు మృతి
తిరువనంతపురం: తాము చేయబోయే పనే వాళ్లను మృత్యుఒడిలోకి తీసుకెళ్తుందని గ్రహించలేక నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లాలోని కోవిల్‌ముక్కు సమీపాన గురువారం ఉదయం బావిలోకి సిల్ట్‌ను తొలగించే పనిలో భాగంగా నలుగురు కార్మికులు అందులోకి దిగారు. బావి లోతుకు వెళ్లడం కారణంగా అందులో సరిగా ఊపిరాడకపోవడంతో పాటు విషవాయువు వెలువడింది. ఈ క్రమంలో ఆ నలుగురికి ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బందులు రావడం, కాసేపటికే వారు గాలి అందక కొట్టుమిట్టాడుతూ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ టీం ఆ బావిలో ఉన్న నలుగురిని బయటకు వెలికి తీశారు. రెస్క్యూ టీం వారిని వాళ్లను బావిలోంచి బయటకు తీసే సమయంలో అందులోని ఓ సభ్యుడు సైతం సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. మృతులు సోమరాజన్ (54), రాజన్ (35), మనోజ్ (32), శివప్రసాద్ (24)గా గుర్తించారు. మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి కొల్లం జిల్లా ఆసుప్రతికి తరలించారు. కాగా ఈ సంఘటన తర్వాత ఆ బావిని మూసివేయాలని అధికారులు తెలిపారు. -
మనోళ్లకు 'మహా' గోస!
ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌కి చెందిన సురేశ్ కుటుంబం. పొట్టకూటి కోసం ఐదేళ్ల క్రితం ఈ కుటుంబం ముంబైకి వలస వెళ్లింది. లాక్డౌన్ నేపథ్యంలో సురేశ్ తాను దాచుకున్న డబ్బులతో ఇన్నాళ్లూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. రెండ్రోజుల నుంచి చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. బుధవారం తన తల్లి హన్మతికి ఫోన్ చేసిన సురేశ్.. తన దీనస్థితిని వివరించాడు. ‘మాకు ఇక్కడ పనులు లేవు. తినడానికి తిండి లేదు. ముడుమూల్కు వద్దామనుకున్నా రవాణా స దుపాయం లేదు. మే 3 వరకు ఎట్లనో..’అని వాపోయాడు. ఇది ఒక్క సురేశ్ సమస్య కాదు.. ముడుమాల్‌కి చెందిన మరో 50 కుటుంబాలదీ ఇదే పరిస్థితి. ఇతను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగరం దాడితండాకు చెందిన దేవదాస్. ఉపాధి కోసం భార్యాపిల్లలతో కలసి మహారాష్ట్రకు వలస వెళ్లాడు. పుణే సమీపంలో రైల్వే స్టేషన్ వద్ద నివాసం ఉంటున్నాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా ప్రభావం వల్ల రవాణా సదుపాయం లేక సొంతూరుకు రాలేని పరిస్థితి. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నాడు. ప్రతి రోజు నాగరం దాడితండాలో ఉంటున్న తన తల్లిదండ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. దేవదాస్ లాగే మరో 30 కుటుంబాలు ఇదే సమస్యతో సతమతమవుతున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆంజనేయులు అతని భార్యాపిల్లలు. వీరిది జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు. ఆరేళ్ల నుంచి పుణే సమీపంలో నివాసం ఉంటున్నారు. అక్కడే కూలీ పని చేసుకుంటూ జీనవం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాడు. కూడబెట్టుకున్న డబ్బు అంతా అయిపోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడి ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని మద్దూరులో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాపోయాడు. ఇతనితో పాటు ఇలా మరో 20 వరకు కుటుంబాలున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలో మనోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలస వెళ్లిన సుమారు 4 వేల మంది కూలీలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా పుణ్యమా అని ఉపాధి కోల్పోయి.. తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. ఇన్నాళ్లూ సంపాదించిన దాంట్లో అత్యవసరాల కోసమని దాచుకున్న డబ్బంతా ఖర్చయి పోవడంతో ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా నిత్యావసర సరుకులిస్తారా? అని వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. కనీసం తమ స్వస్థలాలకు వద్దామన్నా రాలేని దుస్థితిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మాగనూరు, కృష్ణా, దేవరకద్ర, వనపర్తి, గట్టు, మానవపాడు, మల్దకల్, మదనాపురం, ఘనపురం, ఆత్మకూరు, అమరచింత తదితర మండలాల పరిధిలో సుమారు నాలుగు వేల కుటుంబాలు ముంబై, పుణే తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఏడాదిలో రెండుసార్లు తమ స్వస్థలాలకు వచ్చి రెండు నెలలు గడిపి మళ్లీ తిరుగు పయనమవుతారు. ఆందోళనలో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తుండటం.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అక్కడున్న తమ వారిపై కుటుంబ సభ్యులు బెంగ పెట్టుకున్నారు. రోజుకు నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తూ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఎంత ఖర్చయినా సరే అక్కడ్నుంచి బయల్దేరి రావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ధైర్యం చేసి కాలినడకన తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇంకొందరు అక్కడక్కడ నిత్యావసర సరుకులు తెచ్చే వాహనాల్లో ఎక్కి వస్తున్నారు. మహారాష్ట్రలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులను పూర్తిగా మూసేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఎవరూ తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. అయినా కొందరు కాలినడకన, దొడ్డిదారుల గుండా రాష్ట్రంలో ప్రవేశిస్తున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వం.. వారిని అడ్డుకోవాలని ఆదేశించింది. ఇక్కడికి వస్తే కేసులు నమోదు మహారాష్ట్ర నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఎవరూ రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో 34 కేసులు నమోదు కావడం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతుండటంతో బయటి వ్యక్తులు జిల్లాలో ప్రవేశించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో ఉంటున్న కూలీలకు.. స్థానికంగా ఉన్న వారి బంధువులతో ఫోన్లు చేయించే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో, జిల్లాలో కఠినంగా అమలవుతున్న లాక్డౌన్ గురించి వివరించడంతో పాటు గడువు ముగిసేంత వరకు ఇక్కడికి రాకుండా వారిని ఆపాలని ఆదేశిస్తున్నారు. ఒకవేళ వస్తే.. కేసులు నమోదు చేస్తామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఇప్పటికే హెచ్చరించారు. దొడ్డిదారిన వస్తే క్వారంటైన్‌కు.. ► ఈ నెల 14న మహారాష్ట్ర నుంచి నారాయణపేట మండలం కొల్లంపల్లి తండాకు వస్తున్న 22 మంది కూలీలను అదే మండల పరిధిలోని ఎర్రగుట్ట చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదే జిల్లా సింగారంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ► ముంబైకి వెళ్లిన జోగుళాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలం మద్దెలబండకు చెందిన సుమారు 20 మంది కూలీలు ఈ నెల 13న అర్ధరాత్రి జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గట్టు శివారులో అడ్డుకున్నారు. మరుసటి రోజు సాయంత్రం చేతిపై ముద్ర వేసి వారి వారి ఇళ్లకు పంపి హోం క్వారంటైన్లో ఉంచారు. ► వనపర్తి జిల్లా వ్యాప్తంగా సుమారు 800 నిరుపేద కుటుంబాలు మహారాష్ట్రలో కూలీలుగా పని చేస్తుంటాయి. వారిలో 300 మంది వరకు వనపర్తి, ఖిల్లాఘనపురం మండలాల పరిధిలోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుండటంతో రోజుకు నాలుగైదు కుటుంబాల చొప్పున దొడ్డిదారిన జిల్లాలో ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇంటింటి సర్వే చేస్తున్న అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు వీరిని గుర్తిస్తూ హోం క్వారంటైన్ చేస్తున్నారు. ఇప్పుడే రావొద్దు కరోనా విముక్తి జిల్లాలో భాగంగా నేనూ నా బాధ్యత నిర్వర్తిస్తున్న. మా గ్రామానికి చెందిన 20 కుటుంబాలకు చెందిన 50 మంది మహారాష్ట్రలోని ముంబైలో కూలీ, ఇతర పనులు చేస్తున్నారు. అక్కడా పరిస్థితులు బాగో లేవు.. ఇక్కడా బాగో లేవు. అందుకే నేనే నేరుగా అక్కడున్న వారితో మాట్లాడుతున్న. పరిస్థితులు కుదుట పడే వరకు ఇక్కడికి రావొద్దని చెబుతున్నా. నిత్యావసర సరుకుల కోసం డబ్బులు లేకపోతే అక్కడున్న గ్రామస్తులు, మండలానికి చెందిన వారి నుంచి తీసుకోవాలని చెబుతున్న. మా మండలంలో గుడిగండ్ల, మంతన్‌గోడ్ , అరుగోండ, పంచదేవ్పాడు, చిట్యాల, గ్రామాల నుంచి మూడొందలకు పైగా కుటుంబాలు వలస వెళ్లాయి. అందరూ లాక్డౌన్ వరకు అక్కడుంటేనే మేలు. – లక్ష్మమ్మ, సర్పంచ్, మాద్వార్, మక్తల్ మండలం -
పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ .5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు. భారతదేశంలో కోవిడ్ -19, లాక్డౌన్ ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు నగదు సహాయం అందించడానికి రూ.5 కోట్ల నిధులను అందించనుంది. ఈ సందర్భంగా గివ్ ఇండియా ట్విటర్ ద్వారా సుందర్ పిచాయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ పోరులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వ సంస్థలకు గూగుల్ 800 మిలియన్ డాలర్ల సాయాన్నిప్రకటించింది. అలాగే చిన్న వ్యాపారాలకు మూలధనాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులకు 200 మిలియన్ల డాలర్లను పెట్టుబడులను ప్రకటించింది. అంతేకాకుండా వాస్తవాల నిర్ధారణ, తప్పుడు సమాచారంపై లాభాపేక్ష లేకుండా పోరాటం చేసేందుకు 6.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.49 కోట్లు) తక్షణ సాయాన్ని అందిస్తున్నట్టు కూడా గూగుల్ ప్రకటించింది. భారత్‌తో పాటు ప్రపంచ మొత్తం ఈ సేవలు అందించనుంది. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు) మహమ్మారి కరాళ నృత్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్లోకి వెళ్లి పోయాయి. రవాణా సహా, ఇతర వాణిజ్య సేవలన్నీ నిలిచిపోయాయి. వినిమయ డిమాండ్ పూర్తిగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు మరింత మాంద్యంలోకి కూరుకు పోతున్నాయి. ఉపాధి మార్గాలు లేక ముఖ్యంగా రోజువారీ కార్మికులు, పేద వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. దీంతో వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం భారీఎత్తున విరాళాల సేకరణ కూడా చేపట్టాయి. అలాంటి వాటిల్లో ఒకటి గివ్ ఇండియా అనే సంస్థ. తినడానికి తిండిలేక నానా అగచాట్లు పడుతున్న కోవిడ్-19 బాధిత కుటుంబాలను గుర్తించి, వారిని ఆదుకుంటోందీ సంస్థ. మాస్క్ లు, సబ్బులు, శానిటరీ కిట్స్తోపాటు ప్రధానంగా నగదు నేరుగా బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ గివ్ ఇండియాకు తన తాజా విరాళాన్ని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, గివ్ ఇండియా సమాజంలో ఇప్పటివరకు రూ .12 కోట్లు సమీకరించింది. కాగా మహమ్మారి కారణంగా భారతదేశంలో మరణించిన వారి సంఖ్య 308 కు పెరిగింది. సోమవారం 35 కొత్త మరణాలు సంభవించగా, కేసుల సంఖ్య 9,152 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి : కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం కరోనా : ఎగతాళి చేసిన టిక్‌టాక్ స్టార్ కు పాజిటివ్ Thank you @sundarpichai for matching @Googleorg 's ₹5 crore grant to provide desperately needed cash assistance for vulnerable daily wage worker families. Please join our #COVID19 campaign: https://t.co/T9bDf1MXiv @atulsatija — GiveIndia (@GiveIndia) April 13, 2020 -
బళ్లారి టు భద్రాద్రి.. 637 కి.మీ నడకయాతన
లాక్‌డౌన్‌తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది కూలీలు కర్ణాట క రాష్ట్రం బల్లారిలో రోడ్డు నిర్మాణానికి ఉప యోగించే కంకరను కొట్టే పనులకు వెళ్లారు. లాక్డౌన్ ప్రకటించడంతో పను లు లేక, రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన పాల్వంచకు బయలుదేరారు. ఆరు రోజుల పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లను దాటుకుని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. రామవరం చెక్‌పోస్టు వద్ద వీరిని ఏఎస్సై రామకృష్ణ అడ్డుకుని వివరాలు సేకరించారు. ఏపీలో కరోనా టెస్టులు చేసిన రిపోర్టులను పోలీసులకు చూపించి తమ గోడు విన్నవించుకున్నారు. ఏఎస్సై.. వెంటనే ఆహార పదా ర్థాలు అందించి పాల్వంచకు పంపించే ఏర్పాట్లు చేశారు. లాక్డౌన్ కూలీల బతుకులను ఛిద్రం చేస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. – దశరథ్ రజువా, సాక్షి ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
టాటాఏస్‌ను ఢీకొట్టిన లారీ.. 10 మందికి గాయాలు
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. -
రూ.100 కోసం పోలీసులు ఇద్దరి ప్రాణాలు తీశారు...!
మణిపురిః పదిహేను రూపాయలకోసం దళిత దంపతులను నరికి చంపిన ఘటన మరువక ముందే.. ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. 100 రూపాయలు లంచం ఇవ్వనందుకు ఇద్దరు కూలీలపై దాడి చేసి చంపిన పోలీసుల దాష్టీకం శుక్రవారం మణిపురి ప్రాంతంలో కలకలం రేపింది. ఇటుకలతో వెడుతున్న ట్రాక్టర్ ను ఆపిన పోలీసులు డ్రైవర్ వద్ద లంచం డిమాండ్ చేశారు. అతడు ఇచ్చేందుకు నిరాకరించడంతో కూలీలకు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఘటనాస్థలినుంచీ ఇద్దరు తప్పించుకొని పారిపోగా మరో ఇద్దరు కూలీలు పోలీసు దెబ్బలకు ప్రాణాలు కోల్పోగా వారిని దగ్గరలోనే ఉన్న చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. చెరువులో తేలుతూ కనిపించిన ఇద్దరు కూలీల మృతదేహాలు.. ఉత్తరప్రదేశ్ మణిపురి జిల్లా ఘిరార్ ప్రాంతంలో తీవ్ర ఆందోళనను రేపింది. మృతదేహాలను బయటకు తెచ్చిన కుటుంబ సభ్యులతోపాటు, గ్రామస్థులు మృతుల శవాలతో రహదారులు దిగ్బంధించి ఆందోళనకు దిగారు. 100 రూపాయల లంచంకోసం పోలీసులు చేసిన దౌర్జన్యానికి అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం మణిపురి ఎస్పీ దేవరంజన్ వర్మ గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన ఇద్దరు హోం గార్డులతో సహా ఆరుగురు పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశామని, దర్యాప్తు అనంతరం నిందితులపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఇటుకలు లోడ్ చేసిన ట్రక్ తో పాటు ప్రయాణిస్తున్న నలుగురు కూలీలను పోలీసులు ఘిరార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చెక్ పోస్టువద్ద శుక్రవారం ఉదయం అడ్డుకుని, వారివద్దనుంచీ 100 రూపాయలు లంచం డిమాండ్ చేశారని, డ్రైవర్ లంచం ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవ మొదలైనట్లు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఘటనాస్థలం నుంచీ ఇద్దరు తప్పించుకోగా.. మరోఇద్దర్నిపోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే వారు చనిపోయారని అనంతరం వారి మృతదేహాలను పోలీసులు పక్కనే ఉన్న చెరువులో పడేసినట్లు కంప్లైంట్ లో వివరించారు. మృతదేహాలు చెరువులో కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. -
‘ఉపాధి’ నిధులు పక్కదారి
- అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి - పేదవాడికి అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నారు - మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారు - ప్రొక్లెయినర్లతో సిమెంట్ రోడ్ల పనులు చేయిస్తున్నారు - నిధులన్నీ కూలీలకే ఇవ్వాలి - సీఎం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పేదల ఆకలి తీర్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా పేదలకు ఉపయోగపడేలా చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఈ పథకం ద్వారా కూలీలకు వంద శాతం మేలు జరగాల్సి ఉండగా మెటీరియల్ కాంపోనెంట్ పేరిట 40% నిధులను దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లా డుతూ.. ‘‘ఉపాధి హామీ అంటే.. పేదవాడి కడుపు నింపే పథకం. ఈ కూలీల్లో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. కానీ, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించింది. నీరు-మీరుతోపాటు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చిస్తోంది. సిమెంట్ రోడ్ల పనులను ప్రొక్లెయినర్లతో చేయిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం నిధులు 100 శాతం కూలీలకే చెందేవి. ఇప్పుడు 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ అని, 60 శాతం కూలీలకు అని చెబుతున్నారు. చట్టం ప్రకారం 60 శాతానికి పైగా నిధులను కూలీలకు చెల్లించవచ్చు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నిస్తే 100 శాతం కూలీలకే దక్కేవి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ప్రొక్లెయినర్లు పెట్టి పనులు చేస్తే కూలీలకు ఉపాధి ఎలా దొరుకుతుంది? గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలీలకు 100 శాతం నిధులను నేరుగా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో జమచేసే వారు. కేంద్రం ఈ పథకంలో మార్పులు చేస్తున్నా ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు. ఎన్టీయేలో భాగస్వామి అయిన టీడీపీ కేంద్రంతో మాట్లాడి 100 శాతం నిధులు ఉపాధి హామీ కూలీలకు దక్కేలా చేయొచ్చు కదా! రాష్ట్రంలో 1.70 కోట్ల మంది ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటే 58 లక్షల మందికే పని కల్పిస్తున్నారు. కడుపునిండా అన్నం పెట్టే ఉపాధి హామీకి తూట్లు పొడుస్తున్నారు’’ అని జగన్ ధ్వజమెత్తారు. దళిత జాతికి తీవ్ర అన్యాయం ఏ వెనుకబడిన దళితుల కోసమైతే బీఆర్ అంబేడ్కర్ పోరాటం చేశారో ఆ వర్గాన్నే రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తోందని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంగళవారం అంబేడ్కర్ 125వ జయంతిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఏ వర్గం కోసం, ఏ జాతి ఔన్నత్యం కోసం పోరాటం చేశారో ఆ జాతికి ఇక్కడ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దళితులు క్రిస్టియన్లుగా మారితే వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దళితుల్లోనూ కులాలు, మతాలు ఉంటాయా? అని ప్రశ్నించారు. ఉపప్రణాళిక నిధులు రాజ్యాంగ హక్కు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను వారికోసమే ఖర్చు చేయాలని, అది దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కు అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఈ నిధుల్లోనూ ప్రభుత్వం కోత విధిస్తోందని విమర్శించారు. ‘‘దళితుల నిధుల్లో రూ.2,500 కోట్లు, ఎస్టీల నిధుల్లో రూ.1,300 కోట్లు కోత వేశారు. ఎస్టీ, ఎస్టీల అభివృద్ధి అంటే ఇదేనా?’’ అని జగన్ నిలదీశారు. రెండేళ్లుగా గిరిజన సలహా మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదనిప్రశ్నించారు. విశ్వసనీయత ఉంటేనే హుందాతనం ఓ నాయకుడికి వ్యక్తిత్వం, విశ్వసనీయత అనే రెండు గుణాలు ఉన్నపుడే రాజకీయాల్లో హుందాతనం వస్తుందని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత ఆయన లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ రాజీనామాపై స్పందించాలని కోరగా... ‘‘ఏముంది మేం బాధితులం. ఆయన(చంద్రబాబు) ప్రలోభానికి వారు లొంగిపోయారు’’ అని బదులిచ్చారు. ‘‘రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత రెండూ ఉండాలి, అవి లేనప్పుడు భార్య కూడా గౌరవించదు. ఈ రెండూ ఉన్నాయా లేవా అని చంద్రబాబు తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మా పార్టీని వీడిపోయిన వాళ్లు కూడా వాళ్ల మనస్సాక్షిని ఇదే విషయం ప్రశ్నించుకోవాలి. పార్టీని వీడిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళితే గెలుస్తామన్న ధైర్యం, విశ్వాసం చంద్రబాబుకు లేవు. ఎమ్మెల్యేలను అధికార పక్షం దాదాపు రూ.30 కోట్లతో ప్రలోభాలు పెడుతోంది’’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు కాలం చెల్లిన నేత గ్రామీణ ఉపాధి పథకం హామీ గురించి చట్టంలో ఏముందో జగన్ తెలియజేశారు. ఒక పనిలో కూలీలకు చెల్లించే వేతనాలు 60 శాతానికి మించి ఎంతైనా పెరగొచ్చని స్పష్టంగా ఉంటే చంద్రబాబుకు మాత్రం అర్థం కాదని అన్నారు. చంద్రబాబు ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ (కాలం చెల్లిన రాజకీయవేత్త) ఆయనకు అర్థం కాదు అని జగన్ అన్నారు.