వలస కార్మికుల పిల్లలు పనికే.. | No education for Migrated workers of children | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల పిల్లలు పనికే..

Published Tue, Feb 4 2014 3:43 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

No education for Migrated workers of children

‘పెద్దలు పనికి.. పిల్లలు బడికి..’ అని ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మాటను మరిచింది. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారింది. విద్యాధికారుల నిర్లక్ష్యంతో పనివద్ద పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో చిన్నారులు ఆటాపాటకు పరిమితమయ్యూరు.  
 
 హుస్నాబాద్, న్యూస్‌లైన్ : ఇటుక, గ్రానైట్, జిన్నింగ్, రహదారులపనులతోపాటు పలురకాల పరిశ్రమల్లో పనిచేసేందుకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు జిల్లాకు వస్తున్నారు. కార్మికులు పనిచేసేచోట ప్రత్యేకంగా పాఠశాలలు లేకపోవడంతో సుమారు మూడువేల మంది పిల్లలు తల్లిదండ్రులతోపాటు ఆయా పరిశ్రమల్లోనే పనులు చేస్తున్నారు. ఏటా డిసెంబర్‌లో జిల్లాకు వచ్చి జూన్‌లో తిరిగి వెళ్లే వలస కుటుంబాలు వేలాదిగా ఉండడంతో వారిపిల్లలకు విద్యనందించేందుకు పనివద్ద పాఠశాలలను నిర్వహించేవారు. ఈ ఏడాది సైతం వాటిని ఏర్పాటుచేయాల్సి ఉండగా.. నేటికీ ఆ విషయంపై అధికారులు శ్రద ్ధ కనబరచకపోవడంతో పిల్లలు పనిలోనే మగ్గిపోతున్నారు.
 
 పనివద్దపాఠశాలలు ఏవీ..
 విద్యాహక్కు చట్టం వచ్చిన త ర్వాత జిల్లాలో ఏటా ఆయా ప్రాంతాల్లోని విద్యార్థుల సంఖ్యననుసరించి పాఠశాలల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు  అప్పగించేవారు. హుస్నాబాద్, వేములవాడ, కమాన్‌పూర్, జగిత్యాల, మల్యాలతోపాటు పలు ప్రాంతాల్లోని ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల పిల్లలకోసం గతేడాది 40 వరకు పనివద్ద పాఠశాలలు ఏర్పాటుచేసి విద్యాబోధన చేశారు. ఈ ఏడాదిసైతం కార్మికులు జిల్లాకు వలసలు ప్రారంభమైనా వారిపిల్లలకు విద్యనందించే పాఠశాలలు మాత్రం ప్రారంభించలేదు. డిసెంబర్‌లో ప్రారంభించి మే వరకు ఈ పాఠశాలలను నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఆ విషయూన్నే మరిచారు. పనిచేసేప్రాంతాలకు పాఠశాలలు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పిల్లలు ఆ పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నారులు చదువుకు, మధ్యాహ్నభోజనానికి సైతం దూరమవుతున్నారు.
 
 ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తాం : శ్యాంప్రసాద్‌లాల్ , రాజీవ్‌విద్యామిషన్ పీడీ
 జిల్లాలో పనివద్ద పాఠశాలలను ఇంకా ఏర్పాటుచేయలేదు. కార్మికుల పిల్లలు ఇంకా జిల్లాకు చేరలేదు. ఎవరైనా కార్మికుల పిల్లలు ఉన్నారని సంబంధిత ఎంఈవోల ద్వారా ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement